Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




శ్రమపడుట ఏలుట

SUFFERING AND REIGNING
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, సెప్టెంబర్ 29, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, September 29, 2013

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును". (II తిమోతి 2:12).


మళ్ళీ చూద్దాం! ఈ ప్రసంగము వ్రాయడానికి కూర్చున్నప్పుడు నేను కనుక్కున్న విషయం పదం "శ్రమపడుట" ఇక్కడ "సహించుటగా" ఆధునిక తర్జుమాలలో అనువదింపబడింది. కాని 1599 జేనేవా బైబిలు 1611 కేజేవి "శ్రమపడుటగా" అనువదించాయి. నేను చదివిన కొద్ది కనుగొన్నాను గ్రీకు పదాన్ని "శ్రమపడుట" అనిగాని "సహించుట" అనిగాని అనువదింపబడింది. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

సందర్భాన్ని గమనించాలి. 11, 12 వచనాలలో అపోస్తలుడు క్రీస్తుతో క్రైస్తవుని కలయికను గూర్చి చెప్తున్నారు. 11 వచనములో అతడు అంటాడు, "ఆయనతో చచ్చిన వారమైతే, ఆయనతో కూడా జీవించుదుము." ఇది సూచిస్తుంది క్రైస్తవుడు లోకాన్ని త్యజించి పాపానికి స్వార్ధానికి చనిపోతాడని. కనుక, 11 వ వచనము ఆయన మరణములో క్రీస్తుతో క్రైస్తవుని కలయికను గూర్చి మాట్లాడుతుంది (రోమా 6:1-3). 12 వ వచనము ఆయన "శ్రమలో" క్రీస్తుతో క్రైస్తవుని కలయిక గూర్చి మాట్లాడుతుంది. కనుక "శ్రమపడుట" పదాన్ని ప్రాధాన్యంగా జెనివా బైబిలు కింగ్ జేమ్స్ బైబిలు గొప్ప అనువాదకులు వాడారు. వారు అవివేకులు కాదు. వారు ఇంగ్లాండ్ లో గొప్ప గ్రీకు తత్వవేత్తలు. రెండవ అధ్యాయములోని సందర్భము "శ్రమపడుట," కాని "సహించుట" కాదు అనివారికి తెలుసు. నిజ క్రైస్తవుని ఒక సైనికునిలా, సవాలుతో కూడిన మాటలలో ఈ అధ్యయము చూపిస్తుంది,

"విశ్వాస సహిత మాట: మనము ఆయనతో చచ్చిన వారమైతే, ఆయనతో కూడా జీవించుదుము: మనము శ్రమపడితే, ఆయనతో కూడా ఏలుదుము..."

ఆయన మరణములో యేసును వెంబడిస్తే, ఆయనతో కూడా జీవిస్తాం. ఆయన శ్రమలో యేసును వెంబడిస్తే, ఆయనతో ఏలుదుము! సామాన్యం! "శ్రమపడుట" "సహించుటకు," మార్చి విషయములను కష్టతరం చెయ్యడం ఎందుకు ఆధునిక అనువాదకులులా? అది తెలుసుకోవడానికి నీవు ఒక గ్రీకు తత్వవేత్తవు కానవసరం లేదు! కాని ఆధునిక సంఘస్తులు శ్రమపడుటకు ఇష్టపడరు! కనుక, ఆధునిక అనువాదకులు ఆ వచనాన్ని సాద్యమైనంత బలహీనపరిచారు మెత్తని-సువార్తిక చదువరులను సంతోషపరచడానికి. అది అంత సామాన్యము!

కనుక, పాత అనువాదకులు లేఖనాలను గూర్చి ఉన్నత అభిప్రాయము కలిగి ఉన్నారు ఈనాటి తత్వ వేత్తలతో పోలిస్తే. కనుక, ఈ పాఠ్య భాగాన్ని రోమా 8:17 బట్టి అనువదించారు, ఇలా,

"...ఆయనతో మనము శ్రమపడితే, మనము కలిసి మహిమ పర్చబడతాం" (కేజేవి).

ఇక్కడ ఎన్ ఐ వి ఇస్తాను,

"...ఆయన శ్రమలలో పాలు పంచుకుంటే మహిమ పాలు పంపులు పొందుతాం" (ఎన్ ఐవి).

రోమా 8:17 లో "శ్రమపడుట" కు తేటైన అర్ధం "నొప్పిని అనుభవించుట," "దానితో పాటు శ్రమపడుట." మన పాఠ్యములో పదము శ్రమపడుట సహించుట ఇమిడి ఉన్నాయి, మునపటి వారు రోమా 8:17 బట్టి అనువదించారు. దీనినే లూధర్ "లేఖన విశ్లేషణ" అన్నాడు.

ఆధునిక అనువాదకుల నిజ కారణము వేరు. వారికి తెలుసు ఆధునిక చదువరులకు శ్రమపడుట ఇష్టం లేదు అని! అందుకే వారు మృదువైన పదం వాడారు నేటి బలహీన సువార్తికులకు ఆనుకూలంగా! నేను తరుచూ అంటాను, "కింగ్ జేమ్స్ బైబిలు ఆధునిక అనువాదలకుల పై ఎక్కువ వెలుగు చూపించింది!"

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

రోమా 8:17 లోని సరాసరి వచనం నిజ క్రైస్తవులు "క్రీస్తుతో కూడా వారసులు; క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తు తోడి వారసులము అని తేట పరుస్తుంది" (రోమా 8:17).

I. మొదటిది, "మనము శ్రమపడితే, ఆయనతో కూడా ఏలుదుము."

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అధ్బుత వ్యాఖ్యానము దీనిపై చేసాడు. ఆయన అన్నాడు,

"మనం శ్రమపడితే, ఆయనతో కూడా ఏలుతాం"... నేను నమ్ముతాను ఈ వచనం సంకుచిత పరుస్తుంది ఆయనతో శ్రమపడిన వారి విషయము... పౌలు రోజుల్లో రోమా సామ్రాజ్యంలో చాలా మంది క్రైస్తవులు హత సాక్షులయ్యారు – అయిదు మిలియనుల మంది, పోక్స్ ప్రకారం – ఎందుకంటే క్రీస్తును కాదనడానికి నిరాకరించారు.
         "ఆయనను కాదంటే, ఆయన మనలను తిరస్కరిస్తాడు." ఇది కఠిన భాష. అది బోధ పరుస్తుంది, ఏలయనగా, పౌలు నమ్ముతాడు క్రియలు లేని విశ్యాసము మృతమని (యాకోబు 2:17). చూసారా, పౌలు యాకోబు ఏకీభవించరు. యాకోబు విశ్వాస క్రియలు గూర్చి మాట్లాడాడు, పౌలు చెప్పాడు నిజ విశ్వాసము క్రియలు చూపిస్తుందని (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 466; note on II Timothy 2:12).

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

ఆది సంఘములో క్రైస్తవులందరకు కష్టాలు శ్రమల ద్వారా వెళ్ళాలని నేర్పబడింది. ఇది తేటగా అపోస్తలుల కార్యములు 14:22 లో కనిపిస్తుంది, పౌలు బర్నబాసులు లిస్త్ర, ఇకోనియం అంతియోకయలో ఉన్నప్పుడు,

"శిష్యుల మనస్సులను దృఢపరిచి, విస్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెలననియు వారిని హెచ్చరించిరి" (అ.కార్యములు 14:22).

"మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి." "శ్రమలు" పదానికి అనువదింపబడిన గ్రీకు పదము "త్లిప్ సిస్." అంటే "ఒత్తిడిలు, నొప్పులు, కష్టాలు, శ్రమలు" (బలమైన).

ఆదిమ క్రైస్తవులు "భూమిని తలక్రిందులు చెయ్యాలి" అనే విషయంలో రాటు తేలిన వారు. (అ.కార్యములు 17:6) ఎందుకంటే వారికి నేర్పబడింది వారిని వారు ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని రోజు క్రీస్తును వెంబడించాలని, క్రీస్తు "అందరికి చెప్పినట్టు,"

"ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తానూ ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపవలెను" (లూకా 9:23).

"మనము అనేక శ్రమలు [ఒత్తిడిలు, నొప్పులు, కష్టాలు, శ్రమలు] పడాలి దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి" (అ.కార్యములు 14:22).

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

ఆయన ప్రసంగములో "యేసుతో శ్రమపడుట ఏలుట," గొప్ప స్పర్జన్, "బోధకులలో ప్రముఖుడు," ఇలా అన్నాడు,

         మార్కస్ ఎరెతసస్ (362 ఎ.డి.) ఎపోస్టేట్ జూలియస్ చే ఆజ్ఞాపించబడ్డాడు, [డబ్బు ఇవ్వమని] అన్యగుడిని తిరిగి కట్టడానికి ప్రజలు క్రైస్తవ్యంలోనికి మారడానికి బలవంత పెట్టినప్పుడు, ఆయన తిరస్కరించాడు; ఆయన పెద్ద వాడైనప్పటికీ, దిగంబరిగా చేయబడి, కత్తులతో [గుదియలతో] గుచ్చబడ్డాడు. ఆ ముసలి వాడు అయిన గట్టిగా ఉన్నాడు. ఆయన [కొంత డబ్బు] [అన్య] గుడి నిర్మాణానికి ఇచ్చిఉంటే, విడిచి పెట్టబడే వాడు...[కాని] అలా చెయ్యలేదు. ఆయన తేనెలో ఉంచబడ్డాడు, ఆయన గాయాలు [ఇంకా] రక్త ప్రవాహంలో ఉన్నాయి, తేనేటీగలు మరణించే వరకు కుట్టాయి. చనిపోయాడు, కాని ప్రభువును కాదనలేదు. అరెతెసస్ ప్రభువు ఆనందంలో ప్రవేశించాడు, ఆయన శ్రమపడ్డాడు కాబట్టి (C. H. Spurgeon, “Suffering and Reigning with Jesus,” The Metropolitan Tabernacle Pulpit, 1991 reprint, volume X, p. 11).

రిచర్డ్ వర్మ్ బ్రాండ్ (1909-2001) లాంటి వారిని మనం గౌరవిస్తాం, ఆయన రొమేనియన్ కమ్యూనిష్టు జైలులో 14 సంవత్సరాలు చిత్ర హింసలు పెట్టబడ్డాడు. సామ్యూల్ లెంబ్ (1924-2013) ను గౌరవిస్తాం, ఆయన ఒక కమ్యూనిష్టు చైనీ ఏకాగ్రత కెంపులో 20 సంవత్సరాలు గొడ్డు చాకిరి చేసాడు. మనం డియట్రిక్ బోన్ హయర్ (1906-1945) ను గౌరవిస్తాం, ఆయన హిట్లర్ కు వ్యతిరేకంగా బోధించినందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పియానో వైరుతో నాజీలచే వేలాడదీయబడ్డాడు. క్రీస్తులోని విశ్వాస కారణంగా ముస్లిము ప్రాంతాలలో శ్రమపడుచున్న వందల కొలది క్రైస్తవులను బట్టి ఈ ఉదయం మన గౌరవం తెలుపుతున్నాం. కాని నీ సంగతేంటి? ప్రతి ఆదివారం గుడిలో కొన్ని గంటలు గడపగలవా? ప్రార్ధనా కూటములలో గడపడానికి, ప్రతివారం సువార్త సేవకు వెళ్ళడానికి కొంత త్యాగం నీవు చేయగలవా?

నా పఠనలో ద బాప్టిస్టు హిమ్నాల్ ప్రతి ఉంది, 1956 లో సదరన్ బాప్టిస్టు కన్వెన్సన్ చే ప్రచురింపబడింది. అప్పటిలో కూడా క్రైస్తవులు శ్రమ పడడం బలహీన పర్చబడింది. రెజినాల్డ్ హీబర్ (1783-1826) గారి గొప్ప పాట చూసారు, "దైవ కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు." నా హృదయం మునిగింది సదరన్ బాప్టిస్టులు బలమైన చరణాన్ని ఆ పాట నుండి తొలగించినందుకు. ఆ తొలగింపబడిన చరణము ఇది,

మహిమా సైన్యము, ఎన్నుకొనబడ్డ కొందరు, వారిపై ఆత్మ దిగింది,
     పన్నెండుగు వీర పరిశుద్దులు, వారినిరీక్షణ వారికి తెలుసు, సిలువను అగ్ని జ్వాలను అపహసించాడు.
వారు నియంత కఠినతను చవి చూసారు, సింహపు స్థితి;
     వారు తలలు వంచారు మరణ అనుభూతికి: వారి రైలును ఎవరు వెంబడిస్తారు?
(“The Son of God Goes Forth to War” by Reginald Heber, 1783-1826).

ఆచరణము మిమ్ములను పట్టుకుంటుంది! ఆ చరణము యవ్వనస్తులను ఉత్తేజపరిచి సుఖమయ జీవితమూ వదిలి మిషన్ పనికి వెళ్లేటట్టు, లేక ఇంటిలో స్వార్ధ త్యజిత క్రైస్తవులుగా మార్చడంలో పని చేసింది! 1956లో ఆచరణాన్ని ఎందుకు తొలగించారు? నేను చెబుతా ఎందుకో! కొంత మంది పెద్దలైన స్త్రీలు అభ్యంతరపడ్డారు! వారు "సిలువ అగ్నిని" గూర్చి ఆలోచింప ఇష్టపడలేదు. వారు "నియంత దృక్పత దుస్థితిని" ఆ విషయాన్ని విబేదింప ఇష్టపడలేదు. "సింహపు వికృతి స్థితి" జ్ఞాపకాలు వారిని బాధ పరుస్తాయి, హత సాక్షులు "చావు అనుభూతికి తలలు వంచడం" కూడా వారికీ నచ్చలేదు. అది విపరీతమనిపించింది, అందుకే దానిని తొలగించారు. సిగ్గు చేటు వారి పిరికితనం! సదరన్ బాప్టిస్టు సంఘము సంగీత విభాగానికి సిగ్గు చేటు హత సాక్షులు విశ్వాస సాక్షమునకు మచ్చ తేవడం! అది పాడడానికి మనం ఎప్పుడూ సిగ్గు పడవద్దు. అలా జీవించడానికి, అలా చెయ్యగలం మనం సిగ్గు పడవద్దు! పాటల కాగితంలో ఆఖరి పాట. పాడండి!

మహిమా సైన్యము, ఎన్నుకొనబడ్డ కొందరు, వారిపై ఆత్మ దిగింది,
     పన్నెండుగు వీర పరిశుద్దులు, వారి నిరీక్షణ వారికి తెలుసు, సిలువను అగ్ని జ్వాలను అపహసించారు.
వారు నియంత కఠినతను చవిచూసారు, సింహపు స్థితి;
     వారు తలలు వంచారు మరణ అనుభూతికి: వారి రైలును ఎవరు వెంబడిస్తారు?

గౌరవ సైన్యము, పురుషులు బాలురు, పెద్దరూ సహాయకులు,
     రక్షకుని సింహాసనం చుట్టూ ఆనంద హేళ, వెలుగు మయా కట్లతో.
వారు లోతైన పరలోకం అధిరోహించారు, కష్టం, హింస బాధ ద్వారా;
     ఓ దేవా, మా పట్ల కృప కనుపర్చు, మీ రైలు వెంబడించడానికి.
("దైవ కుమారుడు యుద్దానికి వెళ్ళాడు" రెజినాల్డ్ హీబర్ గారిచే, 1783-1826).

కూర్చోండి.

"వారు ఎతైన పరలోకం అధిరోహించారు, కష్టం హింస బాధ ద్వారా." అవును! అదే అపోస్తలుని ఉద్దేశము,

"మనం శ్రమ పడితే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

II. రెండవది, "ఆయనను కాదంటే, ఆయన మనలను కాదనును."

"మనం శ్రమపడితే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

యేసు ఆ ఖచ్చిత హెచ్చరిక ఇచ్చాడు ఇలా అంటూ,

"మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో, వానిని పరలోక మందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగననును" (మత్తయి 10:33).

అపోస్తలుడైన పౌలు మన పాఠ్యములో ఇలా అన్నాడు, "ఆయనను మనం కాదంటే, ఆయన మనలను కాదనును." ఈ క్రీస్తుని నిరాకరించడం ఎప్పుడు సంభావిస్తుందంటే ఒక తప్పుడు క్రైస్తవుడు నిజ సిష్యత్వములోని శ్రమను భరించవలసి వచ్చినప్పుడు. అదే సంభవిస్తుంది "కొంత స్థలం" విత్తు వాని ఉపమానములో వివరింపబడినది.

"రాతి నేల నుండు, వారెవరనగా, వినునప్పుడు, వాక్యమును సంతోషముగా అంగీకరించువారు; గాని వారికి వేరు లేనందున, కొంచెము కాలము నమ్మి, శోధన కాలమున తొలిగి పోవుదురు" (లూకా 8:13).

డాక్టర్ రినేక్కర్ అన్నాడు "పడిపోవుట" అనగా "వెళ్లి పోవుట," "తీసుకొనుట" (Fritz Rienecker, Ph.D., A Linguistic Key to the Greek New Testament, Zondervan, 1980, p. 161; note on Luke 8:13).

"శోధన" వచ్చినప్పుడు స్థానిక సంఘము నుండి వెళ్ళిపోతారు. "వీరికి వేరులేదు" అనగా క్రీస్తులో వారు "అంటు కట్టబడలేదు". అది తెలియ చేస్తుంది వారు నిజంగా మారలేదని. మార్కు 4:17 వివరిస్తుంది "శోధన కాలము" అర్ధము ఉపమానములో,

"కష్టములు శ్రమలు వచ్చినప్పుడు...వెంటనే అభ్యంతర పడతారు" [వాస్తవికంగా, "పడిపోతారు," ఎన్ ఎఎస్ వి].

అలంటి వారు తీర్పు సమయంలో యేసుచే తిరస్కరింపబడతారు. ఆయన వారితో అంటాడు, "నేను మిమ్మును ఎన్నడును ఎరుగను: అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును" (మత్తయి 7:23).

క్రీస్తును నిరాకరించు ఇతరులు ఏదో ఒక గుడికి హాజరవుతూ ఉంటారు. బాగున్నం అనుకుంటారు., కాని పాపంలో జీవించడం ద్వారా క్రీస్తును తిరస్కరిస్తారు. వారే ఆంటి నోమీయనులు. వారిని గూర్చి నా ప్రసంగములో మాట్లాడాను "మాతవిరుద్ధత ఇటలీలో" (క్లిక్ చెయ్యండి) చదవడానికి. వారిని గూర్చి అపోస్తలుడైన పౌలు తీతుకు 1:16 అలా వివరించాడు,

"దేవుని ఎరుగుదురని వారు చెప్పుకొందురు గాని; అసహ్యాలును, అవిదేయులును, ప్రతి సత్కార్యము, విషయము భ్రష్టులు నైయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు" (తీతుకు 1:16).

ఈ మాట విరోధులు కొన్ని సరైన సిద్ధాంతాలు నేర్చుకున్నారు, కాని వారు జీవించే విధానము ద్వారా దేవుని ఎరుగనట్టున్నారు. ద రిఫర్మేషన్ స్టడీ బైబిలు చెపుతుంది, "క్రొత్త నిబంధన బోధిస్తుంది మారిన జీవితానికి అనుగుణంగా క్రియలు లేకపోతే క్రీస్తు నమ్మిక విషయంలో అనుమానించాలి... గట్టి సిద్దాంతం క్రియలు మారిన జీవితానికి అనుగుణంగా రెండూ క్రైస్తవులకు అవసరము" (గమనిక పేతురు 1:16). "క్రియల్లో వారు ఆయనను తిరస్కరించిరి."

మన అనువాదకుడు లాయోస్ లో నా ప్రసంగము "మత విరుద్ధత ఇటలీలో" చదివి, నాకు ఇలా వ్రాసాడు,

నిజంగా సత్యం చాలా మంది రక్షించ బడ్డామని అంటారు కాని వారి జీవితాలు మారవు. మా దేశము లావోస్ లో థాయ్ ల్యాండ్ లో కూడా క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు యేసు నామాన్ని నాశనం చేస్తున్నారు. వారు త్రాగడానికి, నాట్యమాడడానికి, దొంగిలించడాని పొరుగు వారికి చెడ్డ సాక్షం ఇస్తున్నారు.

ఆయన అన్నాడు దేని వలన రక్షింపబడిన వారు లాయోస్ లో క్రైస్తవు లవడానికి ఇష్ట పడడం లేదు, "ఇంకా హీనం వాళ్ళు అంటున్నారు [ఈ] క్రైస్తవులతో స్నేహితులుగా ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు."

కనుక మనం భయంకర ఫలాలు చూస్తున్నాం మత విరుద్ధత ఇటలీలో, లాయోస్, "థాయ్ ల్యాండ్ లో కూడా." సిగ్గుతో తలవంచు కుంటున్నాం ఎందుకంటే మనకు తెలుసు క్రైస్తవ్యం గూర్చి తప్పుడు అభిప్రాయాలు ఎక్కువగా అమెరికా నుండి వచ్చి, ప్రపంచ మంతటా క్రీస్తు సాక్షాన్ని విష పూరితం చేస్తుంది. యేసు ఈ ప్రవచనం ఇచ్చారు,

"అక్రమము [గ్రీకు: అనోమియా – చట్టం లేని స్థితి; మూల కారణము "మత విరుద్ధతకు"] విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12).

ఇది క్రీస్తు రెండవ రాకడకు ఒక సూచన! నిజ క్రైస్తవులు కూడా నిరుత్సాహ పడతారు, క్రైస్తవ ప్రేమ పోగొట్టుకుంటారు, ఎందుకంటే ఆఖరి దినాలలో చాలా మత విరుద్దులుంటారు! కాని పొరపాటు చెయ్యవద్దు – ఈ మత విరుద్ధులు తప్పిపోయిన వారు "ఆయనను నిరాకరించి" వారి పాప జీవితాల ద్వారా (తీతుకు 1:16).

నిజ క్రైస్తవుడు ఎన్నడూ క్రీస్తును కాదనదు. యేసు అభిప్రాయం అదే ఆయన అన్నప్పుడు, మత్తయి 24 తరువాత వచనములో,

"అంతము వరకు సహించిన వాడెవడో, వాడే రక్షింపబడును" (మత్తయి 24:13).

అసహ్యింపబడుచున్నప్పటికినీ; అబద్ద ప్రవక్తలున్నప్పటికినీ; "అతిక్రమము" ఉన్నప్పటికినీ, న్యాయ అంతరాన, మత విరుద్ధులు క్రైస్తవులమని చెప్పుకుంటారు కాని కాదు, నిజంగా మారిన వ్యక్తి "అంతము వరకు సహిస్తారు" (మత్తయి 24:9-13). ఒక పాత పాటలో ఇలా చెప్పబడింది,

చీకటి రాత్రి, పాపం మనకు వ్యతిరేకంగా ప్రబలింది,
     విషాద బరువును మోస్తున్నాం;
కాని ఇప్పుడు చూస్తున్నాం ఆయన రాకడ సూచనలు;
     మన హృదయాలు తేజరిల్లుతున్నాయి, ఆనంద గిన్నె నిండి పొర్లుతుంది!
ఆయన తిరిగి వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు,
     ఆ యేసే, మనుష్యులచే తిరస్కరించబడినవాడు,
ఆయన తిరిగి వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు,
     శక్తితో గొప్ప మహిమతో, ఆయన తిరిగి వస్తాడు!
("ఆయన తిరిగి వస్తాడు" మబెల్ జాన్ స్టన్ కెంప్ గారిచే, 1872-1937).
(“He is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

క్రీస్తు నీ పాపాల నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం సిలువపై మరణించాడు. నీ పాపాలన్నీ కడిగేయడానికి ఆయన రక్తం కార్చాడు. శారీరకంగా మృతులలో నుండి లేచాడు నీవు జీవితాన్ని ఇవ్వడానికి. నీ పాపల నుండి తిరగాలని నీకు ఒక సవాలు చేస్తూ ఉన్నాను! పశ్చాత్తాపపడు, యేసు నందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను రక్షిస్తాడు! ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఇప్పుడే రక్షిస్తాడు!

యేసు ద్వారా రక్షింపబడడం విషయం మాతో మాట్లాడాలనుకుంటే, మీ స్థలాన్ని వదిలి, ఆవరణము వెనుక భాగానికి ఇప్పుడే రండి. డాక్టర్ కాగన్ ప్రశాంత గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి సముదాయిస్తారు. ఇప్పుడే గది వెనుకకు వెళ్ళండి. డాక్టర్ చాన్, దయ చేసి ప్రార్ధించండి ఈ ఉదయాన కొందరు యేసును నమ్మునట్టు. ఆమెన్!

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: II తిమోతీ 2:3-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"దైవ కుమారుడు యుద్దానికి వెళ్ళాడు" (రెజినాల్డ్ హీబర్ గారిచే, 1783-1826).
“The Son of God Goes Forth to War” (by Reginald Heber, 1783-1826).


ద అవుట్ లైన్ ఆఫ్

నీ సిలువ నెత్తుకో

SUFFERING AND REIGNING

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము: ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును" (II తిమోతీ 2:12).

(II తిమోతీ 2:11; రోమా 8:17)

I.      మొదటిది, "మనము శ్రమ పడితే, ఆయనతో కూడా ఏలుదుము," యాకోబు 2:17; అపోస్తలుల కార్యములు 14:22; 17:6; లూకా 9:23.

II.    రెండవది, "ఆయనను కాదంటే, ఆయన మనలను కాదనును,"
మత్తయి 10:33; లూకా 8:13; మార్కు 4:17; మత్తయి 7:23; తీతుకు 1:16; మత్తయి 24:12, 13.