ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ప్రసంగమునకు ముందు పాట: "నేను సిలువ సైనికుడినా?" (డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748). క్రీస్తుతో సిలువ వేయబడితినిCRUCIFIED WITH CHRIST! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను: ఇకను జీవించు వాడను; నేను కాను, క్రీస్తే నాయందు జీవించు చున్నాడు: నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమూ నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" (గలతీయులకు 2:20). |
"క్రీస్తుతో కూడ సిలువ వేయబడుట" అనగా అర్ధమేమి? దాని అర్ధము ఆత్మ చీకటి రాత్రి ద్వారా వెళ్ళుట అని నేను నమ్ముచున్నాను. మనము మన పాపాన్ని గూర్చి బాధపడాలి, ధర్మ శాస్త్రపు శిక్ష గ్రహించాలి, మేకులను గుర్తుంచుకోవాలి, క్రీస్తుతో చనిపోవాలి – ఆయన మరణములోను, ఆయన పునరుత్థానము లోను ఏకము కావాలి. సంఘ కాపరి రిచర్డ్ వార్మ్ బ్రాండ్ జైలులో ఉన్నప్పుడు, రెండు సంవత్సరములు ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడుట అనుభవించాడు. దేవుని సొరంగము అనే, తన పుస్తకములో, ఆయన క్రీస్తుతో ఎలా సిలువ వేయబడ్డాడో వివరించాడు. వార్మ్ బ్రాండ్ ఇలా చెప్పాడు, నేను చెరసాలలో రెండు సంవత్సరాలు పెట్టబడ్డాను. చదవడానికి రాయడానికి ఏమి లేదు; నా తలంపులే నాకు తోడుగా ఉన్నాయి, నేను ధ్యానించే వ్యక్తిని కాదు, కాని మౌనముగా ఉండని ఆత్మ నాకుంది. + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + "క్రీస్తుతో సిలువ వేయబడుట" అనగా అర్ధము ఏమిటి? ఆత్మ చీకటి రాత్రి ద్వారా వెళ్లడమని అర్ధము. మీ పాపము, ధర్మ శాస్త్రము కట్టడి, మేకులు, క్రీస్తుతో చనిపోవుట అనుభవించాలి – మరణములోను, పునరుత్థానము లోను క్రీస్తుతో ఏకము కావాలి. నాలాంటి మొండివాడు దీని ద్వారా చాలా సార్లు వెళ్ళాలి సమర్పించుకోడానికి "క్రీస్తుతో పాటు సిలువ వేయబడడానికి." నేను ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ, నేను ఇంకను సత్యము నేర్చుకునే ప్రక్రియలో ఉన్నాను. దశాబ్దాలుగా "బయటి వానిగా" ఉంటూ ఒక చైనీయ సంఘములో ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాను. నేను వదిలెయ్యాలనుకున్నాను, కాని దేవుడు వదలనియ్య లేదు. బైబిలులో హెబ్రీయులకు 10:25 ద్వారా విడిచి వెళ్ళవద్దని దేవుడు నాకు చెప్పాడు. అలా నేను "క్రీస్తుతో సిలువ వేయబడుట" ప్రారంభించాను. తరువాత మారిన్ కౌంటి దక్షిణ బాప్టిస్టు సెమినరీలో నేను పరీక్షింపబడ్డాను. నాకు ఆ ప్రదేశం నచ్చలేదు ఎందుకంటే అక్కడ అధ్యాపకులందరూ మార్పులేని స్వతంత్రులు ప్రతి తరగతిలో బైబిలును చించేశారు. నాకు అక్కడ ఉండడం నచ్చలేదు, కాని మళ్ళీ, దేవుడు అక్కడ ఉండమని చెప్పాడు, నేను ఎలా అనుకున్నప్పటికీ. సెమినరీలో, అర్ధరాత్రి, నా గదిలో దేవుడు నన్ను బయటికి పిలిచాడు. "ఇక, చిన్న మెల్లని స్వరముతో" దేవుడు నాతో ఇలా చెప్పాడు, "చాలా సంవత్సరాలు ఈ రాత్రిని గూర్చి నీవు ఆలోచిస్తావు నీవు గుర్తించుకుంటావు నీ అసలు పని నీ ముసలితనములో ప్రారంభమవుతుంది... భయపడకుండా ఉండడం నేర్చుకుంటావు. నేను నీతో పాటు ఉంటాను...నీవు చెప్పకపోతే ఎవ్వరు చెప్పరు, అది తప్పక చెప్పబడాలి - ఇతరులు చెప్పడానికి భయపడతారు, నువ్వు చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పలేరు, వారు అంత బాగా చెప్పలేరు." అప్పుడు నా అధ్యాపకుడు డాక్టర్ గోర్డన్ గ్రీన్, నాతో ఇలా చెప్పాడు, "హైమర్స్, నీవు మంచి బోధకుడవు, శ్రేష్టమైన బోధకుడవు. కాని...నీవు కాపరిగా ఉండడానికి దక్షిణ బాప్టిస్టు సంఘము దొరకదు." అతని కళ్ళల్లోకి చూసి అన్నాడు, "అదే అయితే అది నాకు అవసరము లేదు." నేనేమి కోల్పోవడం లేదు (భయాలకు వ్యతిరేకంగా, పేజీ 86). తరువాత నేను లాస్ ఎంజిలాస్ కు వచ్చి ఈ సంఘము ప్రారంభించాను. తరువాత క్రైటన్ ఈ సంఘమును చీలిక చేసాడు "నాతో ఏకీభవించలేదు." దేనికి నాతో ఏకీభవించలేదు? చాలా విషయాలలో నా ధైర్యము, దానితో అతడు నాతో ఏకీభవించలేదు! అతడు "చిన్న" మనిషి, దేవుని సత్యానికి నిలబడడానికి భయపడతాడు! అతనికి భై, చిన్న మనిషి! ఇప్పుడు, నా 80 వ సంవత్సరములో, దేవుడు తన నిమిత్తము ఈ అంత్య దినములలో ప్రవచన స్వరముగా ఉండడానికి నన్ను దేవుడు సిద్ధ పరిచాడని నేను గ్రహించాను (II దెస్సలోనీకయులకు 2:3). మీరు ఎత్తబడతారు అని ఇతరులు చెప్తుంటే, మీరు గొప్ప శ్రమల ద్వారా వెళ్ళాలని నేను చెప్తున్నాను, మార్విన్ జే. రోసెంతల్ తన పుస్తకము ఉగ్రత ముందు సంఘము ఎత్తబడుటలో చెప్పినట్టు. ఇతరులు, క్రైటన్ లాంటివారు, మిమ్ములను నూతన సువర్తీకరణలోనికి లాగుతుంటే, నేను చెప్తున్నాను, "క్రీస్తు కొరకు స్థిరముగా నిలబడు – ఏది జరిగినప్పటికీ." నేను జాన్ సామ్యూల్ ను ద్వేశించను. ఈ అంత్య దినములలో ప్రవచానత్మక స్వరము కలిగినంత శక్తిమంతుడు కాదని గ్రహించాను. నాతో ఉంటే "నలిగి కాలిపోతాడని" భయపడ్డాడు. ఎందుకంటే జాన్ సామ్యూల్ ఇంకా "క్రీస్తుతో సిలువ వేయబడలేదు." నేను చాలాసార్లు "నలిగి కాలిపోయాను" అది ఇంకా నన్ను భయపెట్టలేదు! ఈ అంత్య దినాలలో బలముగా ఉండాలని నేను బోధించడం తనకు ఇష్టము అని డాక్టర్ కాగన్ నాతో చెప్తూ ఉంటాడు. ఇది మంచి ప్రోత్సాహము నాకు! మీరు "క్రీస్తుతో పాటు సిలువవేయబడితే" ఈ స్వధర్మ దినాలలో మీరు నాతోను డాక్టర్ కాగన్ తోనూ కలిసి ఉంటారు (II దెస్సలోనీకయులకు 2:3), మీరు మహిమాయుక్త హతసాక్ష్యులవుతారు – కనీసము మహిమా ఒప్పుకోలు కలిగి యుంటారు, పాస్టరు వార్మ్ బ్రాండ్ వలే! "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడి యున్నాను: ఇకను జీవించువాడను; నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు: నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమూ నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు చున్నాను" (గలతీయులకు 2:20). డాక్టర్ తిమోతి లిన్, దేవుని రాజ్యము అనే తన పుస్తకములో, ఇలా అన్నాడు, "ఈనాడు చాలామంది సంఘ సభ్యులు దేవుని స్వరము వినలేకపోవుచున్నాను ఎందుకంటే వారు అన్నింటికంటే ఎక్కువగా స్వార్ధమును ప్రేమిస్తున్నారు... వారి హృదయాలు కఠినమయ్యాయి, అందుకే విన్న దానిలో చాలా తక్కువ నేర్చుకుంటారు. చాలామంది అనుకుంటారు వారికి అంతా తెలుసు అని, కాని వాస్తవానికి చాలా కనీస సత్యాలు కూడ వారికి తెలియదు. వారిలో చాలామంది వారి జీవితములో ఉద్దేశము ఏమిటో కూడ చెప్పలేరు!" డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ ఈ ఉదాహారణ ఇచ్చాడు. ఒక విశ్వ విద్యాలయము విద్యార్ధిని అడగండి, "బాబు, నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు?" ఒక క్రైస్తవుడు చెప్పవచ్చు పరలోకానికి వెళ్ళడం జీవిత ఉద్దేశమని. కాని డాక్టర్ లిన్ పదేపదే చెప్పాడు ఒక లేఖన భాగము కూడ చెప్పలేదు పరలోకానికి వెళ్ళడం జీవిత ఉద్దేశమని! మీ జీవిత ఉద్దేశము ఏమిటి అని చూడాలనుకుంటే, II తిమోతి 2:12. 12 వచనములోని మొదటి సగభాగము చదవండి, "సహించిన వారమైతే, ఆయనతో కూడ ఏలుదుము..." "శ్రమపడుట" అనగా "సహించుట." ప్రకటన గ్రంథము 20:6 ఇలా చెప్తుంది, "వీరు దేవునికిని క్రీస్తుకును, యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు." "శ్రమ పడుట" అనగా "సహించుట." II తిమోతి 2:12 యొక్క సందర్భము II తిమోతి 2:1-11 లో ఇవ్వబడింది. స్కఫీల్డ్ గమనిక వచనము 1 ని గూర్చి సరిగా చెప్తుంది, "’మంచి సైనికుని’ మార్గము స్వధర్మ సమయములో." ఈ క్రీస్తుతో పరిపాలించుట పది తలంపులు ఉపమానములో చూపబడినది, లూకా 19:11-27. క్రీస్తుతో పాటు పరిపాలించడానికి సిద్ధ పడిన వారికి "పది పట్టణములపై అధికారము" ఇవ్వబడుతుంది (17 వ వచనము) లేక "ఐదు పట్టణములపై" (19 వచనము). డాక్టర్ లిన్ చెప్పాడు ఇది పూర్తిగా జరుగును. ఈ జీవితములో సహించువారు క్రీస్తుతో కూడ ఆయన రాబోయే రాజ్యములో ఏలుతారు! "శ్రమపడుట" అనగా "సహించుట." కనుక మనము ఏమి సహించాలి? లోకాన్ని ప్రేమించకుండా సహించాలి, "ఈలోకము నైనను, ఈ లోకములో ఉన్న వాటి నైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరము, నేత్రాశాయు, జీవపు డంబమును, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని, ఆశము గతించి పోవుచున్నవి: గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమును నిలుచును" (I యోహాను 2:5-17). సంఘ చీలిక సమయములో విడిచి వెళ్ళకుండా ఉండడం సహించుట, "వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచి యుందురు: అయితే వారందరూ, మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19). అబద్ద బోధకులను వెంబడించకుండా తిరస్కరించడం సహించుట, "ప్రియలారా, అనేకులైన అబద్ద ప్రవక్తలు, లోకము లోనికి బయలు వెళ్ళి యున్నారు: కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధ మైనవో కావో పరీక్షించుడి" (I యోహాను 4:1). దేవునికి ఇష్టమైనవి చేయడం ద్వారా మనము సహించవచ్చును, "మరియు మనమాయన, ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును" (I యోహాను 3:22). దేవుని ఆజ్ఞలను గైకొనడము ద్వారా మనము సహించవచ్చును, "మరియు మనమాయన, ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా, ఒకనికొకడు ప్రేమించవలెనను" (I యోహాను 3:22, 23). మన బోధకులకు లోబడుట ద్వారా మనము సహించవచ్చును, "మీకు దేవుని వాక్యము బోధించి, మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనిరి: వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి... మీపైన నాయకులుగా (మీ నాయకులు) ఉన్నవారు, లెక్క ఒప్ప చెప్పవలసిన వారివలే మీ ఆత్మలను కాయుచున్నారు: వారు దుఃఖముతో ఆపని చేసిన యెడల, మీకు నిస్ఫ్రయోజనము, గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు ఉండిరి: వారి మాట విని వారికి లోబడియుండుడి" (హెబ్రీయులకు 13:7, 17). "ఎల్లప్పుడూ ప్రభువు పనిలో ఆ శక్తులై యుండి" మనము సహించవచ్చును – స్థిరంగా! "కాగా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు, వ్యర్ధము కాదని ఎరిగి, స్థిరులును కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆ శక్తులునై యుండుడి" (I కొరింధీయులకు 15:58). ఈ విషయాలను సహించడం ద్వారా, దేవుడు ఆయన శిష్యులుగా సిద్ధ పరుస్తాడు, వారు క్రీస్తు రాబోవు రాజ్యములో ఆయనతో పాటు ఏలుదురు. "నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనము నందు కూర్చిండి... ఆయన ప్రకారము జయించు వానిని నాతో కూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక" (ప్రకటన గ్రంథము 3:21, 22). సంఘ కాపరి వాంగ్ మింగ్ డావ్ (1900-1991) 22 సంవత్సరాలు కమ్యూనిస్టు చైనాలో తన విశ్వాసము నిమిత్తము జైలులో గడిపాడు. అతనన్నాడు, "కొంతమంది నన్ను అడిగారు ఈనాడు సంఘము ఏ మార్గము ఎంచుకోవాలి అని. నిస్సందేహంగా జవాబు ఇచ్చాను, అపోస్తలుల మార్గము అని...మరణ పర్వంతము నమ్మకముగా ఉండడం." డాక్టర్ జాన్ సంగ్ అంత్యక్రియల సమావేశములో ఆయన బోధించాడు. అతడు జైలులో ఉన్నప్పుడు తన పట్ల, వినికిడి కనుచూపు పోగొట్టుకున్నాడు. చెరసాల నుండి విడుదల పొందిన తరువాత, అతడు అతని భార్య కలిసి 1991 లో తన మరణ పర్వంతము గుంపుల కొలది క్రైస్తవులకు వారి భవన సముదాయములో బోధించాడు. దయచేసి నిలబడి మన పాట పాడుదాం, నేను సిలువ సైనికుడిగా, గొర్రె పిల్లను వెంబడించువాడనా; ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ |