ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రాబోవు విషయాలు – నూతన సంవత్సరపు ప్రసంగముTHINGS TO COME – A NEW YEAR’S SERMON డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "రాబోవునవి యైనను; సమస్తమును మీవే; మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవుని వాడు" (I కొరింధీయులకు 3:22-23). |
"రాబోవునవి." క్రీస్తు తెలియని వారికి ఈ మాటలు భయాన్ని పుట్టిస్తాయి! "రాబోవునవి." మన చుట్టూ ఉన్న ప్రజలు భవిష్యత్తును భయముతో వణుకుతో ఎదుర్కొంటారు! వారికి లోతైన నిరుత్సాహము నిస్సహాయత ఉంటాయి. టెలివిజన్, అంతర్జాలము పెరిగిపోవడం వలన, ప్రతి రోజు మన గృహాలలో ప్రపంచమంతటా జరిగే విషాదాలు, యుద్ధాలు, ఉగ్రవాదము, మరణము నాశనాలు చూస్తూ ఉన్నాము. మనము చంపుకోడాలు చూస్తున్నాం. బాంబులు వేసుకోవడం చూస్తున్నాం. ఉగ్రవాదపు కార్యకలాపాలు చూస్తున్నాం. బలవంతాలు, మూచడాలు, దోపిడీ, కరువు మరియు చిత్రహింసలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. మునుపటి ఏ తరాల వారు ఈ భయంకర స్థితిగతులు చూచి యుండలేదు. వారు చదివేది మనం చూస్తున్నాం. ప్రతిరోజూ ప్రపంచమంతటా జరిగే నాశనాలు వార్తలలో చూచి వాయు ప్రయాణికులను, భయానికి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆధునిక సమాచార పరిజ్ఞానము క్రీస్తుకు ముందుగానే తెలుసు. ఆయన లోకపు "నిస్పృహ" మరియు "ఆందోళనలను" గూర్చి (లూకా 21:25) లో చెప్పాడు, "లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు..." (లూకా 21:26). విమానాలు దారి మళ్ళింపబడుతున్నాయి. భవనాలు పేల్చివేయ బడుతున్నాయి. అణుబాంబులను దుష్టశక్తులు వాడుతున్నాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, రాజకీయ ప్రముఖులు, పర్యావరణ వేడిమి ప్రమాదాలను గూర్చి హెచ్చరిస్తున్నారు. నవ్వకండి! అవును, పదాలు "రాబోవునవి" లక్షలాది మందిని భయపెడుతున్నాయి. క్రీస్తు ముందుగా చెప్పినట్టు, "లోకము మీదికి రాబోవు [చున్న] వాటి విషయమై భయము కలిగి, మనష్యులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు." + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + ఈ భయంకర టెలివిజన్ విషయాలను మించి, వాషింగ్ టన్ లో భయంకర విషయాలను మనం ఎదుర్కొంటున్నాము! చాలామంది రాజకీయ నాయకులు బుర్రలు కోల్పోయారు! ముఖ్యంగా ప్రజాసామ్యులు! దీనికి తోడు మన కుటుంబాలు చితికిపోయాయి, విడాకులు ప్రబలుతున్నాయి, మన పిల్లలు చెదిరిపోయారు, సామాజిక వ్యవస్థ తికమకకు నడిపిస్తుంది. మూడవ మందు యవనస్తులు గర్భములోనే వధించబడుచున్నారు – 60 మిలియనుల మంది! ఏడుగురు ఆఫ్రికను అమెరికనులలో నలుగురు "న్యాయపర" గర్భస్రావము ద్వారా జీవితాలు కోల్పోతున్నారు. అలా, లక్షలాది మంది స్త్రీల గర్భములలో ఉగ్రవాదము దూసుకుపోతుంది. భద్రత లేదు! దాగు చోటు లేదు! "రెండవ రాకడ" పద్యములో, కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ఇలా చెప్పాడు. వస్తువులు పడిపోతాయి; కేంద్రం పట్టుకోలేదు; వాషింగ్ టన్ లో బంగారు పతకము పుచ్చుకొన్నాక, బిల్లీ గ్రేహం ఇలా చెప్పాడు, "మన సమాజము స్వనాశనముతో విష పూరితమైనది" (Los Angeles Times, May 3, 1996, p. A-10). భద్రత స్థలము లేదని ప్రజలు భావిస్తున్నారు! టెలివిజన్ అంతర్జాలములో మనము ప్రతిరోజూ చూసే భయపెట్టే ఉపద్రవముల వలన దాగుచోటు లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఆశ్చర్యము లేదు పదాలు "రాబోవునవి" వారి హృదయాలను భయముతో వణుకుతో నింపుతున్నాయి! కాని మన పాఠ్యభాగము నశించువారికి ఇవ్వబడలేదు. ఇప్పటికే మారిన వారికి ఇది వ్రాయబడింది. 21 వ వచనములో, అపోస్తలుడు చెప్పాడు, "సమస్తమును మావి." 22 వ వచనములో నిజ క్రైస్తవులకు చెందిన విషయాలను పట్టికలో చూపించాడు. ఆ పట్టీ చివర, అతనన్నాడు, "రాబోవునవి; అన్నియు మావి" (I కొరింధీయులకు 3:22). నీవు నిజ క్రైస్తడవైతే, భవిష్యత్తు నీవి! "రాబోవునవి; అన్నియు మీవి" (I కొరింధీయులకు 3:22). I. మొదటిది, క్రైస్తవ్యము వైభవము మీది! యేసు చెప్పాడు, "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును; పాతాళలోక ద్వారము దాని యెదుట నిలువ నేరదని నేను నీతో చెప్పుచున్నాను" (మత్తయి 16:18). ప్రసంగీకులు అధినేత సి.హెచ్. స్పర్జన్ అన్నాడు, మనము చూస్తున్నట్టు...రాజకీయ పరిస్థితి, అది అధికారము భయకంపితమని మనము అనుకుంటాము. మేఘాలు ఇక్కడ అక్కడ కమ్ముకుంటున్నాయి; దేవుని సంఘము కొరకు మనము భయపడతాము, దాని భద్రత కరువైనప్పుడు, సింహాసనాలు పతనమైనప్పుడు. కాని మార్పులు సంఘ నాశనాన్ని కదపలేవు. ప్రతి చరిత్ర క్లిష్ట పరిస్థితిలో, ప్రతి రాష్ట్ర కంపనలో, ప్రపంచ ప్రతి నాశనములో, సంఘము తప్పక విజయము పొందాలి...రాజ్యాలు దివాలాల నుండి, క్రీస్తు [సంఘము] ఆస్తి కూర్చుకుంటుంది (C. H. Spurgeon, “Things to Come! A Heritage of the Saints,” Spurgeon’s Sermons Beyond Volume 63, Day One Publications, 2009, pp. 341-342). బ్రిటిష్ సామ్రాజ్యము కుంటువడి పడిపోయింది, కాని క్రైస్తవ్యము అభివృద్ధి చెందినది. దేవునిచే పంపబడిన ఉజ్జీవము లక్షలాది మందిని సంఘాలలోనికి నడిపిస్తుంది! అమెరికా "సామ్రాజ్యము" పతనమయ్యే స్థితిలో ఉండగా, మూడవ ప్రపంచములో వేలాది మంది దేవుని అద్వితీయ శక్తి చేత క్రీస్తు బాహువులలోనికి వస్తున్నారు! మరియు, నేను ఈ రాత్రి మాట్లాడుచుండగా, యేసు ప్రవచనము నెరవేర్పు వైపు కదులుతూ ఉంది, "మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమందంతట ప్రకటింపబడును..." (మత్తయి 24:14). "కిరీటాలు సింహాసనాలు నశించిపోవచ్చు." పాడండి! కిరీటాలు సింహాసనాలు నశించిపోవచ్చు, రాజ్యాలు లేస్తాయి మరియు పడిపోతాయి, ప్రస్తుత, యుద్ధ సంఘము, తవరలో విజయోత్సాహా సంఘము అవుతుంది! త్వరలో దూత స్వరము ఎలుగెత్తి చెప్తుంది, "ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగ యుగముల వరకు ఏలుననేను" (ప్రకటన 11:15). "రాబోవునవి; అన్నియు మీవి" (I కొరింధీయులకు 3:22). II. రెండవది, వచ్చుచున్న క్రీస్తు రాజ్యము మీది! యేసు చెప్పాడు, "సాత్వికులు ధన్యులు: వారు భూలోకమును స్వతంత్రించుకొందురు" (మత్తయి 5:5). మళ్ళీ, యేసు చెప్పాడు, "చిన్నమందా, భయపడకుడి; మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై యున్నది" (లూకా 12:32). క్రైస్తవులు అమెరికాలో ప్రపంచమంతటా వెక్కిరింపబడుతున్నారు. మూడవ ప్రపంచములో క్రైస్తవులు హింసింపబడి, చెరసాలలో వేయబడి, తరచూ చంపబడుచున్నారు. ఈనాటి మానవులు మనం విఫలులవుతామని అనుకుంటున్నారు. కాని వారు తప్పు! బైబిలు చెప్తుంది, "సహించిన వారమైతే, ఆయనతో కూడ ఏలుదుము" (II తిమోతి 2:12). ఆయన రాజ్యము ఏలుచున్నప్పుడు! మనము క్రీస్తు కొరకు పాడతాము, "...నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోనూ, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, మరియు దేశములోను; దేవుని కొరకు మనష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గానం చేసితివి: మరియు మనము భూలోకమందు ఏలుదురు" (ప్రకటన 5:9-10). 2 వ పాట పాడండి, పాటల కాగితంలో, "రాత్రి చీకటిమయము." పాడండి! రాత్రి చీకటిమయము, పాపము మనపై యుద్ధము చేయుచున్నది; మరల పాడండి! రాత్రి చీకటిమయము, పాపము మనపై యుద్ధము చేయుచున్నది; నీవు మారినవాడవైతే, వచ్చుచున్న క్రీస్తు రాజ్యము నీది! "రాబోవునవి; అన్నియు మీవి" (I కొరింధీయులకు 3:22). III. మూడవది, కొత్త ఆకాశము కొత్త భూమియు మీవి! ఈ పాత ప్రపంచము గతించిపోవును! క్రీస్తు భూమిపై వెయ్యి ఏండ్ల పరిపాలన చేసినప్పుడు, సాతాను చెరనుండి విడిపించబడి మారని తిరుగుబాటుదారులను నడిపిస్తాడు (ప్రకటన 20:7-9). అప్పుడు దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చును. (ప్రకటన 20:9), "…ఆ దినమున ఆకాశము మహాద్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమై పోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును... ఇవన్నియు ఇల్లు లయమైపోవునవి కనుక, ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టియు పంచభూతములు మహా వెంద్రముతో కరిగిపోవును" (II పేతురు 3:10, 12). కాని నిరుత్సాహ పడవద్దు, అపోస్తలుడైన యోహాను తన దర్శనములో ఇలా చెప్పాడు, "అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని: మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను; సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యేరూషలేము, అను పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుటకు చూచితిని" (ప్రకటన 21:1-2). దేవుని కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టించినప్పుడు, మీరు నూతన యేరూషలేములో ఉంటారు – మీరు నిజమైన క్రైస్తవులైతే! అవును, మీరు నిరంతరము ఆ నూతన దేవుని పరదైసులో ఉంటారు, కొత్త భూమిపై, నూతన యేరూషలేములో! "రాబోవునవి; అన్నియు మీవి" (I కొరింధీయులకు 3:22). "రాబోవునవి; అన్నియు మీవి" (I కొరింధీయులకు 3:22). కాని నేను ముగించే ముందు తిరిగి మనము ఆరంభములో చదివిన, పూర్తి పాఠ్యభాగమునకు వద్దాం, "... రాబోవునవి; యైనను సమస్తమును మీదే; మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవుని వాడు" (I కొరింధీయులకు 3:22-23). క్రీస్తుకు చెందిన వారి విషయములో అద్భుతమైన "రాబోవునవి" చూసాము. కాని వారిలో నీవు ఒకడివా? నీవు ఖచ్చితంగా "క్రీస్తు వాడవు" అని చెప్పగలవా? చెప్పలేకపోతే, సంతోషభరితమైన ఒక్క వాగ్ధానము కూడ నీకు చెందదు! స్పర్జన్ చెప్పాడు, "మీకు విశ్వాసము లేకపోతే, భవిష్యత్తు భయము మాత్రమే మిగులుస్తుంది...నీవు క్రీస్తులో లేనిచో, సంతోషమిచ్చేది ఏమి చెప్పలేము" (ఐబిఐడి., పేజీ 347). గొప్ప ధనము సంపాదించి, జీవితములో వినోదము సుఖము పొందుకొని, చివరకు, అంతా పోగొట్టుకొని క్రీస్తు లేకుండా మరణిస్తే ప్రయోజనమేమి? "రాబోవునవి" గొప్ప భయము కలిగిస్తాయి మీరు క్రీస్తుకు వాస్తవంగా లేకపోతే. నీ ఆత్మరక్షణ విషయములో గొప్ప ఆలోచన కలిగియుండాలని నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. మీ పాపములను గూర్చి మీ పాపపు హృదయాన్ని గూర్చి ఆలోచించండి. మీ పాపము మీ నిరీక్షణ తీసివేసి అగ్ని గుండములో పడవేస్తుందని, మీరు ఆలోచించాలని మిమ్మును బ్రతిమాలుచున్నాను. అంధకారము నుండి పాపలోకము నుండి మీరు మరలాలని నా ప్రార్ధన. యేసు క్రీస్తు నొద్దకు నేరుగా వెనువెంటనే రావాలని నా ప్రార్ధన. మీరు ఆయనకు విశ్వాసముతో చూచి ఆయన నిత్య రక్తము ద్వారా కడుగబడాలని నా ప్రార్ధన! ఆయన యొద్దకు రండి. ఒకప్పుడు సిలువవేయబడిన, ఇప్పుడు మహిమ పరచబడుచున్న, దేవుని కుమారునిపై ఆనుకోండి. ఆయన నిన్ను రక్షిస్తాడు! ఆయన నిన్ను రక్షిస్తాడు! అప్పుడు సంతోషకర నిరీక్షణతో కూడిన "రాబోవునవి," నేను చెప్పినవి, మీవి అవుతాయి మావి అవుతాయి! మీ మా కాపరితో మాట్లాడాలనుకుంటే, నిజ క్రైస్తవుడవాలనే విషయముపై దయచేసి మీ స్థలము వదిలి వెనుక గదికి వెళ్తే, ఆయన మీతో మీ పాపమును గూర్చి క్రీస్తు యేసు నందలి రక్షణను గూర్చి మాట్లాడతాడు. మీతో ఇంకొక మాట. ఇలాంటి నిరీక్షణ కలవారు ఈ శుభవార్తను అన్ని చోట్ల ప్రకటించే హక్కు లేదా? క్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞకు లోబడి మన జీవితాలను తిరిగి అంకితము చేసుకొని ఈ నూతన సంవత్సరము ఆరంభించడం మనకు సబబు కాదా (మత్తయి 28:19-20)? మనమందరము, మన ప్రాణ ఆత్మలతో, వ్యక్తిగత సువార్త సేవ విషయములో యేసుకు విధేయులవుదాం; మన సంఘపు సువార్తీకరణ కూటాలకు హాజరవుతాం; యేసులో రక్షణ సువార్తను వినడానికి కుటుంబాలను స్నేహితులను ఆహ్వానించుదాం. 2020 లో ప్రతి అవకాశము ఉపయోగించుకొని సువార్తీకరణకు క్రీస్తుకు లోబడునట్లు దేవుడు సహాయము చేయును గాక! దయచేసి నిలబడి పాటల కాగితములో ఆఖరి పాట పాడుదాం. ఈ ఘడియకు మాకు ఎదురు చూసే మాట ఇవ్వండి, ఉత్తేజపరిచే మాట, శక్తిగల మాట, యుద్ధ కేక, మండే ఊపిరి అది జయించడానికి లేక మరణానికి. ఆమెన్! ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ |
ద అవుట్ లైన్ ఆఫ్ రాబోవు విషయాలు – నూతన సంవత్సరపు ప్రసంగము THINGS TO COME– A NEW YEAR’S SERMON డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "రాబోవునవి యైనను; సమస్తమును మీవే; మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవుని వాడు" (I కొరింధీయులకు 3:22-23). (లూకా 21:25, 26; I కొరింధీయులకు 3:21, 22).
I. మొదటిది, క్రైస్తవ్యము వైభవము మీది!
II. రెండవది, వచ్చుచున్న క్రీస్తు రాజ్యము మీది!
III. మూడవది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు మీవి! |