Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పేతురు ఎలా శిష్యుడు అయ్యాడు!

HOW PETER BECAME A DISCIPLE
(Telugu)

పాఠ్యము డాక్టర్ క్రిష్టా;ఫర్ ఎల్. కాగన్ చే;
డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, సెప్టెంబర్ 1, 2019
Text by Dr. Christopher L. Cagan;
preached by Dr. R. L. Hymers, Jr.
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 1, 2019

"యోహాను మాట విని, ఆయనను వెంబడించిన ఇద్దరిలో, ఒకడు సీయోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. యితడు మొదట తన సహోదరుడైన సీయోనును, చూచి, పేతురు మెస్సీయాను కనుగొంటిమని, అతనితో చెప్పి, యేసు అని చెప్పెను. అతనిని యేసు నొద్దకు తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్ధము, యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీయోనువు; నీవు కేఫా అనబడుడువని చెప్పెను, కేఫా అను మాటకు రాయి, అని అర్ధము" (యోహాను 1:40-42; పేజీ 1116 స్కఫీల్డ్).


ఇది తొలిసారిగా పేతురు యేసును కలిసాడు. అతని అసలు పేరు సీయోను. యేసు అతనికి "పేతురు" అను పేరునిచ్చాడు, దాని అర్ధము "రాయి." అంద్రేయ అతని సహోదరుడు. పేతురు జాలరి. అంద్రేయ పేతురు గలిలయ సముద్రమునకు దగ్గర ఉన్న గ్రామములో జీవించేవారు, అక్కడ చేపలు పడుతుండేవారు. జీవితము కష్టతరము, ఎందుకంటే చేపలు పట్టడం, కష్టతరమైన పని. పేతురు వివాహితుడు యేసు అతని అత్తను బాగు చేసాడు. యేసును కలిసేటప్పుడు పేతురు వయసు 30 సంవత్సరాలు. శిష్యులలో అతడు పెద్దవాడు.

గలిలియ సముద్రముపై జాలరులు గట్టివారు. చేపలు పట్టడం శారీరక శ్రమతో కూడినది. వారు భయపడేవారు, ఎందుకంటే గలిలియ సముద్రములో భయంకర తుఫానులు తరుచుగా వచ్చేవి. ఈ తుఫానులూ వారి చిన్న దొనేలను తలక్రిందులు చేసి మనష్యులను ముంచేది.

పేతురు పరిశయ్యుడు కాదు. అతడు యూదుడు కనుక కొన్నిసార్లు సమాజ మందిరమునకు వెళ్ళాడు. పరిశయ్యుల వలే, అతడు సనాతనమైన వ్యక్తి కాదు. కాని ఇతరుల వలే కాకుండా, అతడు పాపియని పెతురుకు తన హృదయములో తెలుసు. తరువాత అతడు యేసుతో అన్నాడు, "ప్రభువా నన్ను విడిచి పొమ్ము; ఓ ప్రభువా, నేను పాపాత్ముడనని చెప్పెను" (లూకా 5:8; పేజీ 1078).

అలా, పేతురు ఒక మతపర వ్యక్తిగా గాని, మంచి క్రైస్తవునిగా గాని ప్రారంభించలేదు. అతడు మొండి ఘటం. జాలరిగా మొండిగా ఉండాల్సి వచ్చింది. పూర్తిగా తర్ఫీదు పొందిన "సంఘ వ్యక్తి" కాదు. అతడు చెడు భాష మాట్లాడాడు తొందరపాటు ఉండేది. అతడు పాపి చాలా పొరపాట్లు చేసాడు.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

క్రీస్తు కొరకు సంపాదించాలనుకున్న వ్యక్తిని గూర్చి ఆలోచించండి. పేతురు వలే, అతడు పూర్తిగా తర్భీదు పొందిన "సంఘపు వ్యక్తి" కాదు. సంఘ కూటాలకు ఎందుకు రావాలో అతనికి అర్ధం కాదు. అతడు అనుకుంటాడు గంటల తరబడి విడియో ఆటలు ఆడవచ్చు, లేక నశించిన స్నేహితులతో గడపవచ్చునని. అతనికి తెలిసిన వారందరూ అతనిలానే ఉంటారు. అతడు పాపాలతో ఉన్నాడు. తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అతని సమస్యలు అతనికి ఉన్నాయి. అతనితో వాదించడం ద్వారా క్రీస్తు కొరకు అతని సంపాదించలేరు. దానికి బదులు, యేసును గూర్చి అతనికి చెప్పండి. యేసు మీకేమి చేసాడో అతనికి చెప్పండి. అతనితో స్నేహంగా ఉండండి. అతని మీతో పాటు గుడికి తీసుకురావాలనే తలంపు వస్తుంది. పెతురుకు తర్భీదు లేదు, అతడు లోకములో నశించిన వ్యకి.

అతని సహోదరుడు అంద్రేయ యేసును గూర్చి పేతురుతో చెప్పాడు. "యితడు మొదట తన సహోదరుడైన సీయోనును [పేతురు] చూచి, ఇలా చెప్పాడు, మేము [మెస్సియా], కనుగొంటిమని అతనితో చెప్పెను, మెస్సియా అను మాటకు, క్రీస్తు అని అర్ధము" (యోహాను 1:41; పేజీ 1116). యేసును గూర్చి వినిన తొలిసారే పేతురు శిష్యుడు అయిపోలేదు.

ఇది చాలా ప్రాముఖ్యము. "నిర్ణయత్వత" పై, ఒక వ్యాసములో డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ తేటగా చెప్పాడు "పాపి ప్రార్ధన" చెయ్యమని బలవంత పెట్టడము నిజ క్రైస్తవులను, నిజ శిష్యులను తయారు చెయ్యలేదు. యేసును గూర్చి విన్న తొలిసారే పేతురు ఒక "నిర్ణయము" తీసుకోలేదు. అవును, పేతురుకు ఆశక్తి ఉంది. ఎక్కువ వినాలని ఆశపడ్డాడు. కాని బాప్తిస్మమిచ్చు యోహాను, బందింపబడినంత వరకు, పేతురు యేసును ఒక శిష్యునిగా వెంబడించలేదు.

"యోహాను చెరపట్టబడిన తరువాత, యేసు కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది, మారు మనస్సు పొంది, సువార్త నమ్ముడని, చెప్పెను: దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా, సీయోనును సీయోను సహోదరుడగు అంద్రేయ సముద్రములో వలవేయుట చూచెను: వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని, వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి, ఆయనను వెంబడించిరి" (మార్కు 1:14-18; పేజీ 1046).

మీరు క్రీస్తు నొద్దకు నడిపించే ప్రయత్నించే ప్రతి వ్యక్తి – ఒక సమయములో యేసు శిష్యుడు అవాలా లేదా అని నిర్ణయించుకుంటాడు. ఇది సంఘర్షణ. ఇది పోరాటము. మీతో అతడు కొన్ని వారాలు లేక నెలలు గుడికి వచ్చినంత మాత్రాన అయిపోదు. కొన్ని నెలలకు లేక సంవత్సరాలకు కొనసాగే పోరాటమిది.

ఇది తెలియక క్రైటన్ చాన్ సువర్తీకరణలో చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడు, చాలా నిర్ణయత్వుల వలే అనుకున్నాడు, వారు "లోపల" ఉన్నారని వారు సువార్తను గూర్చిన "వాస్తవాలు" అర్ధం చేసుకున్నప్పుడు. చాన్ మరియు వాల్ డ్రిప్ లాంటి నిర్ణయత్వులు కొత్తవారిని త్వరగా "పోనిచ్చే" వారు. వారు గ్రహించలేదు ఆత్మల సంపాదన ఒక కొనసాగే పోరాటమని. అందుకే నిజమైన ఆత్మల సంపాదనకు జ్ఞానము అవసరము: "జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు" (సామెతలు 11:30; పేజీ 680). ఆ వచనమును ఇలా కూడ అనువదింపవచ్చును, "జ్ఞానము గలవాడు ఆత్మలను సంపాదించును." డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ జ్ఞాన యుక్తముగా ఇలా అన్నాడు,

"రక్షణ అంతటినీ ఒక అనుభవములోనికి తీసుకొని, సత్వర క్రైస్తవత్వాన్ని బలపరచేవారు అభివృద్ధి శాస్త్రము సహజంగా పని చేస్తుందన్నారు. వారు శ్రమ పడుటలోని శుద్ధీకరణ పరిణామాలు, సిలువను మోయుట సాధనతో పాటు విదేయతలను వారు నిర్లక్ష్య పెడుతున్నారు. ఆత్మీయ తర్భీదు అవసరత, సరియైన మత అలవాట్లు రూపణ, ప్రపంచానికి వ్యతిరేక పోరాటములను వారు అమలు చేస్తున్నారు" (The Inadequacy of ‘Instant Christianity’).

గొప్ప "సంఘ చీలిక" సమయములో పేతురు పరీక్షింపబడ్డాడు. ఇతరులు విడిచి పెడుతున్నారు. వెళ్ళకూడదని పేతురు నిర్ణయించుకున్నాడు. ఇతరులతో పాటు వెళ్లకూడదని అతడు నిశ్చయించుకున్నాడు.

"అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎప్పుడును ఆయనను వెంబడింప లేదు. కాబట్టి యేసు, పన్నెండు మందిని మీరు కూడ వెళ్లి పోవలెనని యున్నారా? అని అడుగగా సీయోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెల్లుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్దుడని మేము విశ్వసించి యెరిగియున్నామని, ఆయనతో చెప్పెను" (యోహాను 6:66-69, పేజీ 1124).

యేసు పన్నెండు మందిని అడిగాడు, "మీరు కూడ వెళ్ళిపోతారా?" "సీయోను పేతురు ఇలా జవాబిచ్చాడు, ప్రభువా, ఎవని వద్దకు మేము వెల్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు" (యోహాను 6:67, 68). ఈ పాఠ్య భాగములో రెండు విషయాలు ప్రాముఖ్యము.

1. విడిచి వెళ్ళిన వారిని గూర్చి మళ్ళీ వినబడలేదు! నా 61 సంవత్సరాల సేవలో, నేను కనుగొన్నాను, సంఘ చీలిక సమయములో విడిచి వెళ్ళినవారు బలమైన శిష్యులుగా అవలేరు. అలా అయిన వారిని నేను ఎన్నడు చూడలేదు!

2. "చీలిక" లో పేతురు వెళ్ళిపోయి ఉంటే అతడు బహుశా మారి ఉండేవాడు కాదు.

"వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంబంధులు కాదు; వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచి యుందురు: అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచ బడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19; పేజీ 1322).

"అంత్య కాలమందు తమ భక్తీ హీనమైన, దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై, యుండి బేదములు, కలుగ చేయుచున్నారు" (యూదా 18, 19; పేజీ 1329).

విడిచివెళ్ళిన వారు క్రైస్తవ శిష్యరికములో నున్న వాస్తవికతను చూడలేదు. ఒక శిష్యునిగా, నిజముగా మారిన వ్యక్తిగా, బైబిలు వచనాలు కంఠస్తము చేయడము కాదు, కొన్ని సిద్ధాంతాలు నమ్మడము కాదు. శిష్యరికము ఉండడానికి నిర్ణయము; వెళ్ళడంలో అర్ధము లేదు, ఎందుకంటే "అక్కడ" ప్రయోజనము లేదు. పేతురు ఇది చూసాడు – కాని ఇంకా మార్పు పొందలేదు!

ఆత్మను సంపాదించుట గోప్పపనిగా మీరు చూస్తున్నారను కుంటున్నాను! ఒక పేరు ఇవ్వడం కాదు లేక ప్రార్ధనకు ఒకరిని తెచ్చుట కాదు. అది సజీవ వ్యక్తి ఆత్మ విషయమైన సజీవ సంఘర్షణ!

మార్పిడి మరియు శిష్యరికము అవి ఊహకు మించినవి యేసు ఎవరు అనే విషయంలో!

"అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను? అందుకు సీయోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన, క్రీస్తు వని చెప్పెను. అందుకు యేసు, సీయోను బర్జోనా, అని చెప్పెను: నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిచేనే గాని, నరులు నీకు బయలు పరచలేదు" (మత్తయి 16:15-17; పేజీ 1021).

తండ్రి దేవుడు యేసు (ప్రకాశిస్తూ) ఎవరో పెతురుకు చూపించాడు. యేసు నిజంగా ఎవరో దేవుడు పేతురుకు చూపించాడు. కాని పేతురు ఇంకా మార్పు చెందలేదు!!! అప్పుడు మారాడని చాలామంది అనుకుంటారు. కాని వారిది తప్పు!

యేసు నిజముగా ఎవరో దేవుడు పేతురుకు చూపించిన తరువాత – అప్పుడు పేతురు సువార్తను తిరస్కరించడం ప్రారంభించాడు!!!

"అప్పటి నుండి తాను యేరూషలేమునకు వెళ్లి, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియ జేయు మొదలు పెట్టాడు. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడును కలుగదని, ఆయనను గద్దింపసాగెను: ఇది నీకు ఉండదు. అయితే ఆయన, పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము: నీవు నాకు అభ్యంతర కారణమై యున్నావు: నీవు మనష్యుల సంగతులనే తలంచుచున్నావు, కాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను" (మత్తయి 16:21-23; పేజీ 1022).

పేతురు సువార్తను కాదన్నాడు. అతడు యేసును గద్దించాడు కూడ ఆయన సిలువకు వెళ్లి మృతులలో నుండి లేస్తానని చెప్పినప్పుడు. అతడు సువార్తను తిరస్కరించాడు! కనుక, ఒక వ్యక్తి యేసును వెంబడిస్తూ సంవత్సరాలుగా అయినను రాస్తూ పోట్లాడుతూ ఉండవచ్చు. తప్పకుండా!

పేతురు అతడు ఎంత బలమైన క్రైస్తవుడో చెప్పుకున్నాడు. క్రీస్తు అప్పగించబడిన రాత్రి, పేతురు ఆయనతో చెప్పాడు, "నేను నీతో కూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను" (మత్తయి 26:35; పేజీ 1038). కాని కొన్ని గంటల తరువాత పేతురు యేసును మూడుసార్లు తిరస్కరించాడు!

పేతురు ఇంకా జయించలేదు! గెత్సమనేలో యేసు బంధింపబడినప్పుడు పేతురు పారిపోయాడు. గట్టిగా అతడు మూడుసార్లు క్రీస్తును ఎరుగనన్నాడు. పేతురు ఇతరులతో పాటు శిష్యుడుగా ఉన్నాడు – కాని ఆయన సంఘర్షణ అయిపోలేదు. అతడు ఇంకా జయించలేదు. అతడు ఇంకా "లోనికి" రాలేదు!

యేసు మృతులలో నుండి లేచిన తరువాత పేతురు చివరకు మారాడు. అది యోహాను 20:22 లో వ్రాయబడింది,

"మరియు [యేసు] ఈ మాట చెప్పి, వారి మీద ఊది [పేతురు మరియు ఇతరుల], మరియు వారితో చెప్పెను, పరిశుద్ధాత్మను పొందుడి" (యోహాను 20:19-22; పేజీ 1144).

వ్యాఖ్యాత జాన్ ఎల్లికాట్ చెప్పాడు అపోస్తలుడైన యోహాను "వారి భవిష్యత్తు జీవితాలపై ఆ క్షణము ఎంత ప్రభావము కలిగి యుందో, నూతన ఆత్మీయ సృష్టి, దాని ద్వారా వారు మరణము నుండి జీవములోనికి పిలువబడియున్నారు" (ఎల్లికాట్ వ్యాఖ్యానము బైబిలుపై). మరియు బహుశా, డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు ఇప్పుడు పేతురు పునరుద్దరింపబడ్డాడు, తిరిగి జన్మించాడు, యేసు మృతులలో నుండి లేచిన రాత్రి! (బైబిలు ద్వారా చూడండి యోహాను 20:22 పై).

అప్పుడు మాత్రమే పేతురు యేసును పూర్తిగా విశ్వసించాడు. అతడు ధైర్యవంతుడైన అపోస్తలుడై పెంతేకొస్తు దినాన భోదించగా మూడు వేలమంది రక్షింపబడ్డారు. తరువాత తన్ను తాను ఉపేక్షించుకొనే బదులు క్రీస్తు కొరకు మరణించాడు. కాని దానికి ముందు, పేతురు అబద్ధపు ప్రారంభాలు వైఫల్యాలు సంఘర్షణలు అంతర్గత విషయాల ద్వారా వెళ్ళాడు.

ఒక ఆత్మను సంపాదించడం చాలా తీవ్రమైన, గొప్ప పోరాటమని మీరు చూస్తున్నారా? అది ఒక ఫోను ద్వారా లేక ప్రార్ధన ద్వారా జరగదు. అది ఒక మగవాడు లేక స్త్రీ యొక్క జీవిత ఆత్మ నిమిత్తము జరిగే జీవిత కాల పోరాటము. దానికి మీ ప్రార్ధనలు కావాలి. జ్ఞానము కావాలి. ప్రయత్నము కావాలి. సమయము పడుతుంది. మీ జీవిత కాలమంతటిలో ఒక ఆత్మను సంపాదిస్తే, మీరు ఆశీర్వదింపబడిన వారు. మీరు చాలా చేసారు. బాగా చేసారు. మీకు సామర్ధ్యము కావాలని నేను ప్రార్ధిస్తున్నాను.

దీనిని వెంబడించడానికి చాలాకాలము పడుతుందా? చాలాకష్టము సుదీర్ఘంగా అనిపిస్తుందా? యేసు చెప్పాడు, "జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే" (మత్తయి 7:14; పేజీ 1004).

ఈ ప్రసంగముపై పేతురునే ఆఖరి మాట చెప్ప నిద్ధాము. ఈ మాటలు చివరిసారిగా పేతురు వ్రాసాడు అతడు సిలువ వేయబడక మునుపు,

"మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును, అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినమున వరకు మహిమ కలుగును గాక" (II పేతురు 3:18; పేజీ 1320).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.