Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




శ్రమలో ప్రోత్సాహము మరియు హెచ్చరిక -
ఇప్పుడు మరియు భవిష్యత్తులో

ENCOURAGEMENT AND WARNING IN TRIBULATION –
NOW AND IN THE FUTURE
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన ప్రసంగము,
మూలవస్తువు డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్ చే సమకూర్చబడినది
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడినది
ప్రభువుదినము సాయంకాలము, మే 19, 2019
A sermon written by Dr. R. L. Hymers, Jr.
with material by Dr. Christopher L. Cagan
preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, May 19, 2019

"నాయందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకోనుడి; నేను లోకమును జయించియున్నాననెను" (యోహాను 16:33).


యేసు చెప్పాడు, "లోకములో మీకు శ్రమ కలుగును అని." "శ్రమ" త్లిఫ్లిస్ అని అనువాదము చేయబడింది. ఇది "ఒత్తిడి" నుండి అనువదించబడింది. మనమందరము మన జీవితాలలో ఒత్తిడి కలిగియున్నాము. కాని ఒత్తిడిలో భయంకర పరిస్థితి త్వరలో రానుంది. నీటిలో లోకాన్ని పరిపాలించడానికి క్రీస్తు ఒలీవల కొండ పైకి దిగివచ్చే ముందు ఏడు సంవత్సరాల శ్రమ ఉంటుంది. ఆ శ్రమలో ఆఖరి మూడున్నర సంవత్సరాలు అతి భయంకరము. క్రీస్తు భూలోకమునకు రాకముందు, ఏడు సంవత్సరాలు అంత్య క్రీస్తు లోకాన్ని పరిపాలిస్తాడు. ఈ ఏడు సంవత్సరాలలో క్రైస్తవుడయ్యే ప్రతి ఒక్కడు హత సాక్షి అవుతాడు.

అపోస్తలుడైన యోహాను పరలోకములో ఈ శ్రమలో క్రైస్తవుల ఆత్మలను గూర్చిన దర్శనము చూసాడు. ఆయనన్నాడు,

"ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని" (ప్రకటన 6:9).

తరువాత ఆయన వ్రాసాడు,

"వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, వాటిని తెలుపు చేసుకొనిరి" (ప్రకటన 7:14).

ఈ ఏడు సంవత్సరాలు క్రైస్తవులకు చరిత్రలో ఎప్పుడు లేనంత భయంకరముగా ఉంటాయి. యేసు చెప్పాడు,

"లోకారంభము నుండి ఇప్పటి వరకును, అట్టి శ్రమ కలుగలేదు, ఇక, ఎప్పుడును కలుగబోదు" (మత్తయి 24:21).

అవును, ఎత్తబడుట ఉంటుంది. బైబిలు చెప్తుంది,

"ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, మేఘముల మీద కొనిపోబడుదుము: కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (I దెస్సలోనీకయులకు 4:16-17).

అయినను ఈ వాగ్ధానమును బట్టి నేను శ్రమల నుండి తప్పింప బడతామనుకోకూడదు, గొప్ప శ్రమల ముందు కూడ. మన పాఠ్యభాగములో, ఈ తరమంతటిలో క్రైస్తవులకు శ్రమ ఉంటుందని చెప్పబడింది.

"నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకోనుడి; నేను లోకమును జయించి యున్నననెను" (యోహాను 16:33).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఈ ప్రసంగము ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. వెళ్ళండి WWW.SERMONSFORTHEWORLD.COM.
ఆకుపచ్చ బటను నొక్కండి "యాప్" అనే పదము ఉన్న దానిపై. వచ్చే సూచనలను గైకొనండి.

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

యేసు ఇక్కడ చెప్పిన దానిని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. వచనములోని రెండవ భాగముపై మొదటి వ్యాఖ్యానిస్తాను, తరువాత మొదటి భాగముపై, తరువాత ఆఖరి భాగముపై వ్యాఖ్యానిస్తాను.

I. మొదటిది, "లోకములో మీకు శ్రమ కలుగును."

యేసు దీనిని తన శిష్యులతో చెప్పాడు, ఇది ఈ తరములో క్రైస్తవులందరికి వర్తిస్తుంది. క్రైస్తవులకు శారీరక శ్రమలుంటాయి. అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాసాడు,

"నాకు కలిగిన ప్రత్యక్షము బహు విశేషముగా ఉన్నందున, నేను అత్యదికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు ఉంచబడింది..." (II కొరింధీయులకు 12:7).

ఇది పౌలు కంటి చూపును గూర్చి చెప్పబడినది. క్రైస్తవులు శారీరక అస్వస్థ, అనారోగ్యము, నొప్పి శారీరక మరణముల ద్వారా వెళ్తారని ఇది సూచిస్తుంది. మనము క్రైస్తవులమైనప్పుడు శారీరక రోగము బాధ నుండి తప్పించుకోలేము.

మన పడిపోయిన పాప ప్రపంచములో క్రైస్తవులు, ఇతర శ్రమల గుండా కూడ వెళ్తారు. అపోస్తలుడైన పౌలు వీటిని అనుభవించుచున్న క్రైస్తవులను గూర్చి ఇలా చెప్పాడు

"...శ్రమయైనను, లేక బాధయైనను, లేక హింసయైనను, లేక కరవైనను, లేక వస్త్ర హీనత యైనను, లేక ఉపద్రవ మైనను కడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము; వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము" (రోమా 8:35-36).

కాని ఆయన సూచిస్తున్నాడు ఈ శ్రమలేమియు "క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు" (రోమా 8:35ఏ).

"లోకములో మీకు శ్రమ కలుగును" (యోహాను 16:33).

క్రీస్తు నందు విశ్వాసముంచి నందుకు అపోస్తలులందరూ చంపబడ్డారు – యోహాను తప్ప – అతడు మరుగుచుండు నూనెలో వేయబడి, శేష జీవితమూ భయముతో బ్రతికాడు. అనాది కాలముగా క్రైస్తవులు వారి విశ్వాసమును బట్టి శ్రమనొందారు. చరిత్ర అంతటిలో క్రైస్తవ హత సాక్షులు శ్రమలను గూర్చి ఫాక్సే హత సాక్షులు పుస్తకములో వ్రాయబడింది. డాక్టర్ పాల్ మార్షల్ ఇలా అన్నాడు,

మధ్య అమెరికా అడవులలో...చైనీయ శామికుల శిబిరాలలో, పాకిస్తాన్ చెరసాలలో, ఇండియా కల్లోలములలో, మరియు సుదానీసు గ్రామాలలో లెక్కలేనంత మంది విశ్వాసము ఇప్పటికే వారి విశ్వాసమునకు అంతిమ వెల చెల్లించారు (ఐబిఐడి., పేజీ 160).

సూడాన్ లో క్రైస్తవులు బానిసలయ్యారు. ఇరాన్ లో చంపబడ్డారు. క్యూబాలో చెరసాలలో వేయబడ్డారు. చైనాలో చనిపోయేలా కొట్టబడ్డారు. ప్రపంచమంతటా 60 దేశాలకు పైగా క్రైస్తవులు వారి విశ్వాసమును బట్టి బంధింపబడ్డారు, తిట్టబడ్డారు, చిత్రహింసలు పెట్టబడ్డారు లేక చంపబడ్డారు. లోకమంతటిలో 200,000,000 మంది క్రైస్తవులు రహస్య పోలీస్ నిఘాలు, అణిచివేత, వివక్షత చంపుట అనే వాటి భయముతో బ్రతుకుచున్నారు... వారు నమ్మేదానిని బట్టి వందలాది లక్షలాది మంది క్రైస్తవులు శ్రమ పడుతున్నారు (Paul Marshall, Ph.D., Their Blood Cries Out, Word, 1997, back jacket).

ఇక్కడ కూడా పడమటిలో, నిజ క్రైస్తవులు తరచూ వేరు చేయబడుచున్నారు మరియు చిన్న చూపు చూడబడుతున్నారు, లేక హింసింప బడుచున్నారు. కళాశాల తరగతి గదులలో క్రైస్తవ్యము బైబిలు వెక్కిరింపబడుతున్నాయి. చాలామంది క్రైస్తవులు పదోన్నతి పొందలేదు, ఇతరులు ప్రభువు దినమున సంఘాలలో ఆరాధించాలానే కోరిక ఉన్నందుకు వారు ఉద్యోగములను తొలగింపబడుతున్నారు. క్రైస్తవేతర కుటుంబ సభ్యులు, బలహీన కొత్త సువార్తికులు కూడ సమర్పణ గల క్రైస్తవులను కించపరుస్తున్నారు. యేసు ఇలా చెప్పాడు,

"లోకములో మీకు శ్రమ కలుగును" (యోహాను 16:33).

II. రెండవది, "నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను."

"క్రీస్తు నందు" ఉన్నవారికి ఇది ఒక వాగ్ధానము. "నాయందు." అంతరంగిక సమాధనమునకు ఆయనే మూలము. యేసు చెప్పాడు,

"శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా, నేను మీ కనుగ్రహించుట లేదు..." (యోహాను 14:27).

ఒక వ్యక్తి క్రీస్తును తెలుసుకున్నప్పుడు, అతనిలో స్థిరమైన అంతర్గత సమాధానము ఉంటుంది, లోకములోని ఇతరులకు అది ఉండదు.

క్రీస్తు "లో" ఉన్న వ్యక్తికి, ప్రార్ధనలో తన సమస్యలను దేవునికి అప్పగించినప్పుడు, అతనిలో విచిత్ర సమాధానము ఉంటుంది, దానినే బైబిలు "సమస్త జ్ఞానమునకు మించిన, దేవుని సమాధానము" అని పిలుస్తుంది (ఫిలిప్పీయులకు 4:7). లోకము అర్ధము చేసుకోలేదు ఎందుకు క్రైస్తవులు బంధింపబడతారో, హింసింప బడతారో, చెరసాలలో వేయబడతారో, మరియు లేక చంపించబడతారో – చాలా దేశాలలో ఇలా జరుగుతుంది.

సమాధానము అంటే క్రైస్తవునికి అంతర్గత సంఘర్షణలు, భావోద్రేక సమస్యలు, లేక శారీరక బాధలు ఉండవని కాదు. చాలామంది సువార్తికులు అమెరికాలో విజయము, అభివృద్ధి, సౌబ్రాత్రుత్వము, ఆనందము, మరియు స్వయం అభివృద్ధి పొందుకున్నారు. ఈ విషయాలన్నీ కొంతమందికి ఎగతాళిగా ఉంటాయి, ఎవరికంటే వాని విశ్వాసమును బట్టి తలక్రిందులుగా వేలాడదీయబడిన చైనీయ క్రైస్తవునికి, లేక ఒంటరితనముతో ఐదు సంవత్సరాలు బ్రతికిన క్యూబా క్రైస్తవునికి, లేక యేసును నమ్మినందుకు మరణమును ఎదుర్కొంటున్న ఇరాను క్రైస్తవునికి గాని.

మూడవ ప్రపంచ దేశాలలో హింసింపబడుచున్న ఈ క్రైస్తవులు యేసు చెప్పిన దానిని అర్ధము చేసుకున్నారు ఆయన అన్నమాట, "నాయందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను" (యోహాను 16:33). వారికి అర్ధమయింది ఈ సమాధానము అంటే అంతరంగిక నిమ్మళము, ఎందుకంటే వారికి తెలుసు వారి పాపములు క్షమింపబడ్డాయని, దేవుడు వారిని పట్టించుకుంటాడని.

II కొరింధీయులకు 11:24-28 చదువుతాను. అపోస్తలుడైన పౌలుకు ఏమి సంభవించిందో వినండి. అతనన్నాడు,

"యూదుల చేత అయిదు మారులు ఒకటి తక్కువ నలబది దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని; అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, జనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అడవులలో ఆపదలలోను, సముద్రములలో ఆపదలోను, అబద్ధ సహోదరులలో ఉంటిని; ప్రయాసముతోను మరియు కష్టములతోనూ, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముల తోనూ, చలితోను మరియు దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవియు గాక సంఘము లన్నింటిని గూర్చిన చింతము కలదు, ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నాది" (II కొరింధీయులకు 11:24-28).

ఆ పరిస్థితులలో పౌలు సమాధానమును గూర్చి ఎలా మాట్లాడగలడు? అయినను మాట్లాడాడు. పౌలు జవాబు ఫిలిప్పీయులకు 4:6, 7 లో ఇచ్చాడు.

"దేనిని గూర్చియు చింతపడకుడి; కాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియ చేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, దేవుని సమాధానము, యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును" (ఫిలిప్పీయులకు 4:6-7).

పౌలు గొప్ప హింస ద్వారా శ్రమ ద్వారా వెళ్ళాడు, కాని ఆయన ఇక్కడ "సమస్త జ్ఞానమునకు మించిన, దేవుని సమాధానమును" గూర్చి మాట్లాడుచున్నాడు.

III. మూడవది, "అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించుయున్నాను."

కష్టాలలోను శ్రమలలోను జీవితములో కొనసాగుట వీలవుతుందా అని మీరు ఆశ్చర్యపడవచ్చును. యవనస్తులు సామాజిక కళాశాలలో తరగతి తరువాత తరగతిలో కూర్చోవాలి, అక్కడ బైబిలు క్రైస్తవ్యము దాడి చేయబడుచున్నాయి, చిన్న చూపు చూడబడుచున్నాయి, కించ పర్చబడుచున్నాయి. "అవి ఎదుర్కొంటూ, క్రైస్తవునిగా ఉండగలనా?", కళాశాల విద్యార్ధి అనుకుంటుంటాడు. "నేను ప్రస్తుతము శ్రమ ద్వారా వెళ్ళగలనా? ప్రజలు నాకు వ్యతిరేకముగా తిరిగినప్పుడు నేను అలా చేయగలనా? నేను భయపడుచున్నప్పుడు నేను ఉండగలనా – నాకు ఎక్కువ విశ్వాసము లేదు కదా?" అని అనుకోవచ్చు

ఈనాడు తీవ్ర క్రైస్తవులు పిచ్చివాళ్ళుగా వెక్కిరింపబడుతున్నారు. నీవు యేసు కొరకు చాలా ఎక్కువ చేస్తున్నానని ప్రజలు అంటుంటారు. ఆదివారము ఉదయము ఒక గంట, లేక గుడి లేని వాడవు అని నిన్ను పిలుస్తుంటారు. నీవు క్రీస్తును వెంబడింపక పోతేనే సంతోషంగా ఉండగలవని నీతో అంటుంటారు. "సిలువను మోయవలసిన అవసరము లేదు. శ్రమ బాధ అవసరము లేదు," అనివాళ్లు అంటారు. "అంతా మర్చిపో. అది విడిచి పెట్టి ఎలా ఉండేవాడివో అలానే ఉండు" అని అంటారు. వారు నీపై ఒత్తిడి తెస్తారు. యేసు చెప్పాడు, "లోకములో మీ శ్రమ కలుగును."

కాని క్రీస్తు చెప్పాడు, "ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను." నేను రోమా 8:35-39 చదువుచుండగా వినండి.

"క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ యైనను, లేక బాధయైనను, లేక హింసయైనను, లేక కరవైనను, లేక వస్త్ర హీనత యైనను, లేక ఉపద్రవమైనను, లేక ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందులో గూర్చి వ్రాయబడిన దేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము; వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవ దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి యైనను, రాబోవునవి యైనను, అధికారులైనను, ఎత్తయినను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను, మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని, రూడిగా నమ్ముచున్నాను" (రోమా 8:35-39).

మీరు క్రీస్తు నొద్దకు వచ్చునప్పుడు, ఆయన మిమ్మును స్వీకరిస్తాడు. ఆయన మిమ్మును హత్తుకుంటాడు పోనివ్వడు. మీరు క్రీస్తు నొద్దకు వస్తే, మీరు ఆయనను పట్టుకోనవసరము లేదు. ఆయన మిమ్మును హత్తుకుంటాడు! మీరు మార్పిడి పొందిన క్షణం నుండి, మీరు నిత్యత్వములో క్రీస్తులో భద్ర పరచబడతారు. మూడవ ప్రపంచములో 200 మిలియనుల ప్రజలు వారి క్రైస్తవ విశ్వాసము నిమిత్తము శ్రమ నొందడానికి ఇష్ట పడుచున్నారు అనే సత్యము ఋజువు చేస్తుంది క్రీస్తు తన అనుచరులను హత్తుకొని ఉంటాడు, పరలోకమును గూర్చిన నిరీక్షణ లేకుండా వారిని నశించిపోనివ్వడు. క్రీస్తు నొద్దకు రండి, అందరిని రక్షించడమంతా ఆయనే చూసుకుంటాడు, అందరిని భద్ర పరచడం కూడ! ప్రసంగమునకు ముందు గ్నాన్ గారు ఇలా పాడారు,

ఆశ్రయమునకు యేసుపై ఆనుకొనిన ఆత్మ,
   నేను, అతని శత్రువులకు అప్పగింపను;
ఆ ఆత్మ, నరకమంతా కదిలించడానికి ప్రయత్నించినా,
   నేనెన్నడూ, ఎన్నడు కూడ, ఎన్నడు విడిచిపెట్టను.
("పునాది ఎంత బలంగా ఉంది," ‘కె’ రిప్పన్ ‘పాటల ఎంపిక’, 1787).
(“How Firm a Foundation,” ‘K’ in Rippon’s ‘Selection of Hymns,’ 1787).

ఈ ప్రసంగము శీర్షిక "శ్రమలో ప్రోత్సాహము మరియు హెచ్చరిక – ఇప్పుడు మరియు భవిష్యత్తులో." ఈ రాత్రి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చాను. కాని నేను మీకు హెచ్చరిక మాట కూడ ఇవ్వాలి. ఇప్పుడు మనము వెళ్తున్న శ్రమ ఇతర స్థలములలో వేరే వారి శ్రమలతో పోలిస్తే చాలా తక్కువ. మూడవ ప్రపంచములో క్రైస్తవులు కొట్టబడుచున్నారు, చెరసాలలో వేయబడుతున్నారు, హింసింపబడి యేసును నమ్మినందుకు చంప బడుచున్నారు. అక్కడ ఉన్నదానితో పోలిస్తే అమెరికాలో మన జీవితమూ విరామమే. భవిష్యత్తు సంవత్సరాలలో ఇక్కడ జీవితమూ కష్టంగా ఉంటుంది. ఒత్తిడులు భయంకరంగా ఉంటాయి. మీరు ఉద్యోగమూ కోల్పోవచ్చు, తీవ్ర క్రైస్తవుడవైనందుకు మీ ఇంటిని, డబ్బును కోల్పోవచ్చు. ఇప్పుడు వేరే దేశాలలో ఇది జరుగుతుంది. మీ స్నేహితులు బంధువులు మీకు వ్యతిరేకులవుతారు. శ్రమను గూర్చి మాట్లాడుచు, యేసు చెప్పాడు, "సహోదరుడు, సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు; కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపుదురు, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకే సహించిన వాడే రక్షణ పొందును" (మార్కు 13:12, 13). ప్రస్తుతము ఇతర దేశాలలో ఇది జరుగుతుంది. ఆ ఏడు సంవత్సరములకు ముందే ప్రజలు మిమ్మును తిరస్కరిస్తే ఆశ్చర్య పడకండి.

ప్రవక్త యిర్మియా అన్నాడు, "నీవు పాదచారులతో పరుగెత్తగా, వారు నిన్ను అలయ గొట్టిరి గదా, నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మది గల స్థలమున, నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్ధాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?" (యిర్మియా 12:5). అవును, ప్రస్తుతము శ్రమల ద్వారా మీరు వెళ్తున్నారు. ఈనాటి కొద్దిపాటి ఒత్తిడే తట్టుకోలేకపోతే, అది బాగా భయంకరమైతే ఏమి చేస్తారు? ఈనాటి విరామ సమయములో క్రైస్తవ జీవితమూ జీవించలేకపోతే, తుఫానులు వచ్చినప్పుడు ఏమి చేస్తారు? నీవు బలమైన క్రైస్తవునిగా ఉండాలని నేను బతిమాలుచున్నాను. ఇప్పుడది చేస్తే తరువాత బలమైన క్రైస్తవునిగా ఉండగలవు. కొత్త క్రైస్తవునిగా దానిని గూర్చి ఆలోచించాను పాస్టరు రిచర్డ్ వర్మ్ బ్రాండ్ పుస్తకము, క్రీస్తు కొరకు చిత్ర హింసలు చదివినప్పుడు. అది కేవలము చదవడానికే పుస్తకము కాదు. అది నా జీవితాన్ని మార్చేసింది. క్రైస్తవునిగా ఉండడం ఎప్పుడు విరామములో ఉండడము కాదు. అది కష్ట తరము. అది కష్టము. అవును, "ధైర్యము తెచ్చుకొనుడి" (యోహాను 16:33). వెల కూడ లెక్కకట్టండి (లూకా 14:28 చూడండి). అది ఎంతో విలువైనది, ఎందుకంటే మీరు నిరంతరము క్రీస్తుతో జీవిస్తారు.

ఇప్పుడు నేను ఈ రాత్రి ఇక్కడ ఉన్న నశించు వారితో మాట్లాడాలి. యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు. మీ పాప పరిహారార్ధము ఆయన సిలువపై మరణించాడు. మీ పాపమును కడిగివేయడానికి ఆయన తన రక్తము కార్చాడు. మీకు జీవము ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. మీరు ఆయనను విశ్వసిస్తే, మీరు నిరంతరము రక్షింపబడతారు. కాని యేసును నమ్మడం కొన్ని మాటలు కాదు. యేసును నమ్ముట అంటే యేసును నమ్ముటయే. అవును, కష్ట సమయాలు ఉంటాయి. అవును, మీరు శ్రమ పడవచ్చు. కాని అది మీకు ప్రయోజనమే. మీరు యేసును తెలుసుకుంటారు. ఆయనను నమ్మితే మీరు నిరంతరము క్రీస్తుతో జీవిస్తారు. యేసును నమ్ముట విషయములో మీరు నాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
"పునాది ఎంత స్థిరము" (‘కె’ రిప్పన్ ‘పాటల ఎంపిక’, 1787).
“How Firm a Foundation” (‘K’ in Rippon’s ‘Selection of Hymns,’ 1787).



ద అవుట్ లైన్ ఆఫ్

శ్రమలో ప్రోత్సాహము మరియు హెచ్చరిక -
ఇప్పుడు మరియు భవిష్యత్తులో

ENCOURAGEMENT AND WARNING IN TRIBULATION –
NOW AND IN THE FUTURE

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన ప్రసంగము,
మూలవస్తువు డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్ చే సమకూర్చబడినది
A sermon written by Dr. R. L. Hymers, Jr.
with material by Dr. Christopher L. Cagan

"నాయందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకోనుడి; నేను లోకమును జయించియున్నాననెను" (యోహాను 16:33).

(ప్రకటన 6:9; 7:14; మత్తయి 24:21; I దెస్సలోనీకయులకు 4:16-17)

I.    మొదటిది, "లోకములో మీకు శ్రమ కలుగును," II కొరింధీయులకు 12:7;
రోమా 8:35-36.

II.   రెండవది, "నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను," యోహాను 14:27; II కొరింధీయులకు 11:24-28;
ఫిలిప్ఫీయులకు 4:6-7.

III.  మూడవది, "అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించుయున్నాను," రోమా 8:35-39; మార్కు 13:12, 13; యిర్మియా 12:5;
లూకా 14:28.