Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఒక క్రైస్తవ శిష్యుడు అవడానికి వెల ఎంత అవుతుంది

WHAT IT COSTS TO BECOME A CHRISTIAN DISCIPLE
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
By Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, ఫిబ్రవరి 17, 2019
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 17, 2019

"మీలో ఎవడైనను, ఒక గోపురము కట్టింప గోరిన యెడల, దానిని కొనసాగించుటకు కావలసినది తన యెద్ద ఉన్నదో లేదో అని, కూర్చిండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా?" (లూకా 14:28).


ఇప్పుడు మత్తయి, 16 వ అధ్యాయము, 24 వచనము చూడండి.

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

నేను చాలామంది యవనస్తులకు వెంబడించడానికి కారణము లేదు వారి జీవితాలలో ఉద్దేశము లేదు. రోజు వెంబడి రోజు మీరు అలా బ్రతికేస్తున్నారు. వాస్తవానికి, నేడు యవనస్తులు నిమిష నిమిషము జీవిస్తున్నారు. మీరు జీవితాన్ని టెలివిజన్ లో చానెల్ మార్చేటట్టు భావిస్తున్నారు – తరచుగా ఒక చానెల్ నుండి ఇంకొక చానెల్ కు మారుస్తున్నారు ఒక కార్యక్రమము పూర్తిగా తిలకించరు.

దానిలో ఒక అపాయము ఉంది. మీకు పూర్తి కథ తెలియదు. చాలామంది యవనస్తులు ఈ సంఘాన్ని అలానే భావిస్తున్నారు. మీరు "చానల్ మార్చినట్టు" - లోపలికి వస్తారు వెళ్తారు. లాస్ వేగాస్ కు ఒక ఆదివారము వెళ్తారు ఇంకొక ఆదివారము గుడికి వస్తారు. అలా చేస్తే మీకు పూర్తి కథ అర్ధం కాదు. మీకు కొంచెము కొంచెము తెలుస్తుంది. ఉదాహరణకు, మీరు అవతరణను గూర్చే వింటారు, మరణాంతర జీవ చరిత్ర, మోక్ష మార్గము, పిశాచాది విషయక గ్రంథము, ఇలా ఇంకా చాలా విషయాలు అర్ధము కావు.

నిజ క్రైస్తవుడవడానికి మీరు పూర్తిగా యేసు క్రీస్తుపై ఆనుకోవాలి:

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
మా ప్రసంగములు ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
వెళ్ళండి www.sermonsfortheworld.com.
గ్రీన్ బటన్ "యాప్" అనే పదముపై క్లిక్ చెయ్యండి.
వచ్చే సూచనలను గైకొనండి.
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

ఇప్పుడు, రక్షణ కృప ద్వారా వస్తుంది. మార్పు చెందని వ్యక్తి యేసు చెప్పినది చెయ్యలేదు, "ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను." కాని సువార్త వినడానికి మిమ్మును ఈ గుడికి చేర్చాడు. థామస్ వాట్సన్ సరిగ్గా చెప్పాడు, "దేవుడు చేర్చుకోవడం ప్రారంభిస్తే మనము వెంబడిస్తాము." లేక, వెంబడించకూడదని, మీరు నిర్ణయించుకోవచ్చు, అంతరంగములో, వెంబడించాలని తెలిసినప్పటికినీ.

మార్పు చెందని వ్యక్తి పూర్తిగా వైరుధ్యాలతో ఉంటారు. మీరు గుడికి వస్తారు బోధకుని తోనూ బైబిలుపై అంతర్గత వాగ్వివాదాలు చేస్తారు. మీ హృదయములో మీరనుకుంటారు, "నేను బైబిలును నమ్మను." కాని తరువాత మీరనుకుంటారు, "నేను జీవితములో విఫలుడనయ్యాను. నాకు ఎలాంటి నిరీక్షణ లేదు." మీరు ఇటు అటు లాగబడుతున్నారు. మీలో సగభాగము దేవునిపై తిరగబడుతుంది సగభాగము దేవునిలో నిరీక్షణ కలదు అని నమ్ముతుంది. అంతర్గత పోరాటము ఉంది. ఈ సాయంకాలము ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి అలాంటి పోరాటము ద్వారా వెళ్ళిన వారే.

ఈ రాత్రి నేను ఈ గుడిలో ప్రతి వరుసకు వెళ్లి ఇక్కడ ఉన్న యవనస్తులను గూర్చిన కథలు చెప్పగలను. ప్రతి ఒక్కరిలో అంతర్గత పోరాటము ఉంది. అది మీ పోరాటము లాంటిది కాకపోవచ్చు, కాని పోలికలు ఉంటాయి. మీలో సగభాగము మీరు తిరిగి గుడికి రావాలని దేవుడు రక్షణ నిమిత్తము నిరీక్షణ కలిగి యుండాలని కోరుకుంటుంది మరియు మిగిలిన సగభాగము దేవునికి, బైబిలుకు బోధకునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తుంది.

మొదటిది, మీలో ఉన్న ఈ పోరాటానికి మూలములు ఏమిటి? మొదటిది, ప్రపంచము (తల్లిదండ్రులు, స్నేహితులు, వినోదము). తరువాత మీ శరీరము (గుడి మానేయడం, లైంగిక వాంచ తీర్చుకోవడం, మీ స్వంత చిత్తము చేయడము). తరువాత సాతాను. ఇంకొక వైపు, పరిశుద్ధాత్మ ఉంది. మెల్ల స్వరముతో మీ మనస్సాక్షితో మాట్లాడుతాడు. మీరు యేసు క్రీస్తు నొద్దకు రావాలని స్థానిక సంఘానికి రావాలని మీతో చెప్తుంటాడు. కనుక, మీ ఆత్మకు పోరాటము ఉంటుంది. ఒకవైపు దేవుడు మిమ్ములను పిలుస్తున్నాడు – ఇంకొక వైపు పాపము లోక భోగాలు మిమ్ములను పిలుస్తున్నాయి.

బైబిలు చెప్తుంది, "మీరు ఎవరిని సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి; మీ పితరులు సేవించిన దేవతలనా... అమోరీయుల [అమెరికా వారు] దేవతలనా: నేను నా ఇంటి వారును, యెహోవాను సేవించెదము" (యెహోషువ 24:15). మీరు ఒక ఎన్నిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు, మీలో చాలామంది తప్పుడు ఎన్నిక చేసుకుంటారు. పరిచర్యలో నా 60 సంవత్సరాల అనుభవము చెప్తుంది మీరు బహుశా తప్పుడు ఎన్నిక చేసుకుంటారని. బైబిలు చెప్తుంది,

"జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు" (యిర్మియా 8:3).

మీ సంగతి ఏమిటి?

రెండవది, మీరు సరియైన ఎన్నిక ఎందుకు చేసుకోవాలి? ఎందుకు మీరు ప్రతి ఆదివారము ఈ స్థానిక సంఘానికి రావాలి? ఎందుకు మీరు క్రీస్తు నొద్దకు వచ్చి మార్పు చెందాలి?

1. ఎందుకంటే అది మీకు జీవించడానికి ఒక కారణము ఇస్తుంది.

2. ఎందుకంటే అది మీ అపజయాన్ని తిప్పివేస్తుంది. క్రీస్తును కనుగొన్న ఏ ఒక్కడు విఫలుడు కాదు.

3. ఎందుకంటే అది మీకు భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ ఇస్తుంది.

4. ఎందుకంటే అది మీ నేరారోపణను తొలగించి సమృద్దియైన, ప్రశాంత జీవితానికి నడిపిస్తుంది.

జీవితమంతా ఎన్నో శ్రమలు ఉన్నప్పటికినీ సబీనా వర్మ్ బ్రాండ్ తేజోవంతమైన, నవ్వుతూ ఉండే సంతోషముగా ఉండే స్త్రీ ఎందుకంటే ఆమె యేసు క్రీస్తును వ్యక్తిగతముగా ఎరుగును. మన సంఘాన్ని స్వతంత్ర బాప్టిస్టు సంఘముగా వ్యవస్తీకరించకముందే సబీనా చాలాసార్లు మన గుడికి వచ్చారు. నా భార్య నేను వారి ఇంటిలో కాపరి శ్రీమతి వర్మ్ బ్రాండ్ తో భోజనము చేసారు. క్రీస్తు నిమిత్తము ఆమె సమస్తము త్యాగము చేసారు. కాని ఆమె చాలా ఆనందముగా ఉండే స్త్రీ అలాంటి ఆమెను నేను ఎవ్వరిని చూడలేదు.

కొన్ని సంవత్సరాలు మన దగ్గర నున్న ఎవరినైనా మీరు అడగండి! సబీనా వార్మ్ బ్రాండ్ ను అడగండి, ఇప్పుడు పరలోకములో ఉన్నారు! అది నిజమేనని వారు చెప్తారు! ఈ స్థానిక సంఘములో ఉండడానికి మార్పు చెందడానికి మీరు తప్పక నిర్ణయము తీసుకోవాలి ఎందుకంటే అది సరియైన ఎన్నిక. అందుకే మీ హృదయములో చిన్న స్వరము వినిపిస్తుంది, "అతడు సరియే అని మీకు తెలుసు."

తరువాత, మూడవదిగా, మీకు నేను చెప్పాలి తప్పకుండా మీరు కొన్ని విషయాలు విడిచిపెట్టాలి కొన్ని విషయాలు మీరు చేయడం ప్రారంభించాలి క్రైస్తవ జీవితమూ మీరు జీవించాలనుకుంటే.

యేసు చెప్పాడు:

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

మీరు బైబిలు వద్దకు వస్తే దేవుడు పూర్తి అంకిత భావము కోరుకుంటాడని కనుగొంటారు.

చూడండి దేవుడు అబ్రహాము నుండి ఏమి కోరుకున్నాడో. ఒక రోజు దేవుడు అన్నాడు, "అబ్రహాము, నీవు మోరియా పర్వతము పైకి వెళ్లి నీతోపాటు నీ చిన్న కుమారుని అక్కడకు తీసుకొని వెళ్లి, నీవు ఎన్నో సంవత్సరాలు కనిపెట్టిన నీ కుమారుని, నీవు లోకములో అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించిన నీ కుమారుని, నీవు బలిపీథము మీద అర్పణగా అర్పించాలి."

అబ్రహాము దేవునికి లోబడి తన కుమారుని బలిపీఠంపై ఉంచి తన పదునైన పెద్ద కత్తి తీసుకొని తన కుమారుని చంపాలనుకున్నాడు. దేవునికి విధేయుడై కాని దేవుడు అతని చేతిని గాలిలో ఆపేసాడు. దేవుడు చెప్పాడు, "అది చాలు, అబ్రహాము. నీవు నాతోపాటు ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు."

లేక మోషేను చూడండి. మోషే ఫరో కుమార్తె పెంపుడు కొడుకు. అతడు ఐగుప్టు సింహాసనానికి వారసుడు. ఆ దినాలలో గొప్ప సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండేవాడు. అతనికి ధనము ఉంది శక్తి మహిమలు ఉన్నాయి. కాని మోషే వాటన్నిటికి వెన్ను చూపించి దేవుని ప్రజలతో శ్రమపడ్డాడు. వాడబడడానికి మోషే సమస్తమును విడిచి పెట్టాలని దేవుడు కోరాడు. తరువాత దేవుడు అతని ఒక అరణ్యములో ఉంచాడు పటించడానికి, ప్రార్ధించడానికి, నేర్చుకోవడానికి.

లేక యోసేపును చూడండి. యోసేపు సహోదరులచే బానిసగా అమ్మబడ్డాడు. పోతీఫరు దగ్గర పని చేయడానికి ఐగుప్టుకు వెళ్ళవలసి వచ్చింది. అతడు కుటుంబమునకు స్నేహితులకు దూరమయ్యాడు. అతడు యుక్త వయస్కుడు. అతడు రాజీ పడవచ్చు. దేవునికి తప్ప, ఎవ్వరికి తెలియదు. ఫోతీఫరు భార్య చాలా అందగత్తె. తనతో శయనించమని కోరింది. ఫోతీఫరు భార్య సహకారముతో రాజ్యములో పై స్థితికి వెళ్ళవచ్చు అని అతనికి తెలుసు – కాని అతడు ఆమెను తిరస్కరించాడు. ఆమె అతనిని పట్టుకొనినప్పుడు తన వస్త్రమును విడిచిపెట్టాడు. అందుకు చెరసాల తరువాత ఉరి పడింది. దేవుడు ఈ యవనస్థుని పరీక్షిస్తూ ఉన్నాడు. తరువాత అతడు జైలు నుండి విడుదల పొంది ఐగుప్తు రాజ్యములో రెండవ అత్యధిక స్థానానికి ఎదిగాడు.

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

లేక దానియేలును తీసుకోండి. వారన్నారు, "దానియేలు, బబులోనులో ఇక మీదట ప్రార్ధన ఉండకూడదు. నీవు ప్రార్ధిస్తే, నీవు సింహాల బోనులో వేయబడతావు."

కాని దానియేలు కిటికీలు తెరచి రోజుకు మూడుసార్లు ప్రార్ధించాడు. అతడు దేశ ప్రధానిగా ఉన్నప్పటికినీ, వారు అతనిని సింహాల భోనులో వేసారు. దేవుడు సింహాల నోరు మూయిస్తాడని దానియేలుకు తెలియదు. దేవుడు అతని వెల చెల్లించమన్నాడు అది చేయడానికి అతడు ఇష్టపడ్డాడు.

యేసు ఈ సాయంకాలము మీతో ఇలా చెప్తున్నాడు,

"ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మత్తయి 16:24).

దాని అర్ధము మీరు ఇతరుల నుండి వేరుగా ఉంటారు. చాలామంది యవనస్తులు ఒకలాగే దుస్తులు ధరిస్తారు. ఒకలాగే కనిపిస్తారు. ఒకలాగే నటిస్తారు. వేరుగా ఉండడానికి భయపడతారు. తలలు క్షౌరము చేయించుకొని ముక్కుకి ఉంగరము పెట్టుకున్న స్నేహితులు మీకుంటే, మీరు కూడ మీ తలలు క్షౌరము చేయించుకొని మీ ముక్కులకు ఉంగరాలు పెట్టుకుంటారు – తద్వారా మీరు వేరుగా కనిపించరు – మీరు అందులో అమరిపోతారు. కాని బైబిలు మీరు వేరుగా ఉండాలని పిలుస్తుంది – చాలామందిలో నుండి మీరు వేరు పరచబడాలని మానసికంగా ఆత్మీయంగా మీరు రాజీ పడని వారుగా ఉండాలని బైబిలు మిమ్మును కోరుతుంది.

ఇతరులు దేవుడు లేడని చెప్తున్నప్పుడు లేక దేవుని విషయము అనవసరము అంటున్నప్పుడు, మీరు నిలబడి దేవుడు అవసరము దేవుడు సందర్భానుసారి దేవుడు నా జీవితములో కేంద్ర బిందువు అని చెప్పడానికి ఇష్టపడాలి! సబీనా వార్మ్ బ్రాండ్ అలా చేసింది, తన ఇద్దరు సహోదరులు తన సహోదరి, తన తల్లిదండ్రులు చంపబడినప్పటికినీ హిట్లర్ సముదాయము క్యాంపులో వారు II ప్రపంచ యుద్ధ సమయములో రొమేనియా నుండి యూదులను తరలించుచున్నందుకు.

ఇతరులు ఇలా చెప్పు చున్నప్పుడు, "ఆ బాప్టిస్టు గుడికి తిరిగి వెళ్ళకండి. నాతో రండి. ఇంకొక దగ్గరకు వెళ్దాము," మీరు ఇలా చెప్పడానికి ఇష్టపడాలి, "లేదు. నేను అక్కడికే వెళ్తాను. నాకు దేవుడు కావాలి. ఏది ఏమైనా నాకు యేసు క్రీస్తు కావాలి! ఆ విప్లవాత్మక బోధకుని బోధ వినాలనుకుంటున్నాను. బాప్టిస్టు టేబర్ నేకల్ లో ఉన్న ప్రజలకు ఏముందో అది నాకు కావాలి అని చెప్పగలగాలి!"

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
"యజమానుడు వచ్చాడు" (శారా డౌడ్ నీ చే, 1841-1926).
“The Master Hath Come” (by Sarah Doudney, 1841-1926).