Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




బైబిలు మరియు స్థానిక సంఘమునకు ద్రోహులు

THE BIBLE AND TRAITORS TO A LOCAL CHURCH
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన ప్రసంగము,
మరియు రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడినది
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము ఉదయము, నవంబర్ 4, 2018
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, November 4, 2018

"వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరూ మన సంబంధులు కారని, ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19).


ఆల్ బెర్ట్ కేమస్ మరియు జీన్ పాల్ సార్ ట్రే అను ఇద్దరు తత్వవేత్తలు అస్తిత్వవాదమును వ్యాప్తి చేసారు. వారి తత్వశాస్త్రము ఈనాడు చాలామంది ప్రజల ఆలోచనను అంతర్లీనము చేస్తుంది, వారు దానిని గ్రహించనప్పటికిని. డాక్టర్ ఆర్. సి. స్ప్రాల్ ఇలా అన్నాడు, "మనము అస్థిత్వవాదము యొక్క ప్రభావమును మన అనుదిన జీవితాలలో మన సంస్కృతిలో ఎదుర్కొంటూ ఉన్నాము...ప్రతిదినము దాని ప్రభావము క్రింద మనము జీవిస్తున్నాము" (Dr. R. C. Sproul, Lifeviews, Fleming H. Revell, 1986, p. 49).

కామస్ మరియు సార్టేస్ అస్థిత్వవాదము ముఖ్యాంశము "దేవుడు లేని లోకములో మానవుని ప్రాధమిక ఒంటరితనమును" నొక్కి వక్కాణిస్తుంది" (Dr. John Blanchard, Does God Believe in Atheists?, Evangelical Press, 2000, p. 138).

మనము "ప్రతిదినము" ఈ తత్వశాస్త్రము యొక్క "ప్రభావము క్రింద ఉన్నాము" అని ఆర్. సి. స్ప్రౌల్ చెప్పడం నిజమేనా? అవును, అని నేననుకుంటున్నాను. అందుకే ఒంటరితనము నేపధ్యమునకు యవనస్తులపై, అంత అన్వయింపు ఉంది. ఆ తత్వశాస్త్రము ఎక్కడ నుండి వచ్చింది, లేక ఎవరు చెప్పారు అనేది గ్రహించకుండా, దానిని భావిస్తూ ఉంటాము– "దేవుడు లేని లోకములో మానవుని ప్రాధమిక ఒంటరితనము." ఆపదములో సత్యము దాగి ఉంది. ప్రతి యవనస్థుడు దానిని అనుభవించాడు – "దేవుడు లేని లోకములో మానవుని ప్రాధమిక ఒంటరితనము."

మరియు మీరు గుంపుగా ఉన్న గదిలో ఒంటరిగా ఉండవచ్చు. మీరు ప్రేలాపనలో ఉండే, రద్దీ వ్యాపార సముదాయములో ఉండి, ఒంటరిగా ఉండవచ్చు. ఒక యుక్త వయస్కుడు మన సంఘ కాపరి, డాక్టర్ హైమర్స్ తో ఇలా చెప్పాడు, "నేను చాలా ఒంటరిగా ఉన్నాను ఏమి చెయ్యాలో నాకు తెలియడము లేదు." కొన్ని వారాల తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనాడు చాలా మంది యవనస్తులు ఒంటరితనము భావనలతో హింసింపబడుతున్నారు. ఇది అస్థిత్వ వాదము నుండి ఉద్భవించింది "ఇది మన సంస్కృతిలో భాగమయింది."

ఒంటరితనము ఒక సమస్య, దానికి విరుగుడు ఏమిటి? దానికి నివారణ ఏమిటి? దానికి నివారణ యేసు క్రీస్తును వ్యక్తిగతముగా తెలుసుకొనుట – స్థానిక సంఘములో దేవుని కుటుంబంలో భాగముగా ఉండుట. అస్థిత్వవాదపు భయానకానికి మనము ఇలా చెప్పడం ద్వారా జవాబు ఇస్తున్నాము, "ఎందుకు ఒంటరిగా ఉండడం? ఇంటికి రండి – సంఘమునకు! ఎందుకు నశించిపోవాలి? ఇంటికి రండి – దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు!" మనము అలా చెప్పడం ద్వారా, మనము కామస్, మరియు సార్ ట్రే, మరియు అస్తిత్వవాదనకు జవాబు చెప్తున్నాము! మనం అలా చెప్తున్నప్పుడు, ఆధునిక ప్రపంచపు నొప్పించే ఒంటరి, అర్ధరహిత ఒంటరి తనమునకు జవాబిస్తున్నాము! గట్టిగా చెప్పండి! గుసగుసగా చెప్పండి! దూరంగా విశాలంగా చెప్పండి! ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఇంటికి రండి – సంఘమునకు! ఎందుకు నశించాలి? ఇంటికి రండి – దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు!

కాని కొందరికి ఒకరు కావాలి ఇంకొకరు వద్దు. వారికి స్థానిక సంఘము స్నేహము కావాలి యేసు క్రీస్తుతో మార్పు లేకుండా. ఇది చివరకు పనిచేయదు. అవి కలిసి నడివాలి. క్రైస్తవ్యములో అది మార్గము – సంఘముతో స్నేహము క్రీస్తులో మార్పు కలిసి కొనసాగాలి. ఒకటి లేకుండా ఇంకొకటి కలిగి యుండలేరు!

మార్పు లేకుండా సహవాసము కావాలనుకుంటే ఇలా సంభవిస్తుంది. చివరకు సహవాసము ముక్కలైపోతుంది. ఇప్పుడో తరువాతో అది పనిచేయదు. దానిని గూర్చే మన పాఠ్యభాగము చెప్తుంది.

"వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంభంధులు కారు, వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరూ మన సంబంధులు కారని, ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19).

+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
మా ప్రసంగములు ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
వెళ్ళండి www.sermonsfortheworld.com.
గ్రీన్ బటన్ "యాప్" అనే పదముపై క్లిక్ చెయ్యండి.
వచ్చే సూచనలను గైకొనండి.
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +

డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ ఇలా అన్నాడు, "కొంతమంది సంఘాలను విడిచిపెట్టారు...వారి నిష్క్రమణ రక్షించే విశ్వాసమును ప్రదర్శిస్తుంది, అందుకే, నిజమైన సహవాసము కనుమరుగయింది" (The Criswell Study Bible, note on I John 2:19). I యోహాను 2:19 కు ఇది ఆధునిక అనువాదము,

"వారు మన నుండి వెళ్ళిపోయారు, వాస్తవానికి వారు మనకు సంబందించిన వారు కారు. వారు మనకు చెందిన వారైతే, మనతో పాటు ఉండేవారే; వారిలో ఏ ఒక్కరు మనకు చెందిన వారు కారని వారు వెళ్లిపోవడము చూపిస్తుంది" (I యోహాను 2:19 ఎన్ఐవి (NIV)).

ఈ పాఠ్యభాగమును గూర్చి లోతుగా ఆలోచిద్దాం.

I. మొదటిది, వారు ఏమి చేసారు.

డాక్టర్ క్రీస్ వెల్ ఇలా అన్నాడు, "కొంతమంది సంఘాల నుండి వెళ్ళిపోయారు." వారు సహవాసమును ఆనందించారు కాబట్టి నిస్సందేహముగా సంఘాలకు వచ్చారు. ఆదిమ సంఘాలు లోతైన స్నేహము కలిగి యుండేవి రోమా ప్రపంచపు చల్లదనములో హృదయము లేని స్థితిలో. సంఘములో ఉన్న వెచ్చదనాన్ని స్నేహాన్ని ప్రజలు ప్రేమించారు,

"దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి దయ కలిగియున్నారు" (అపోస్తలుల కార్యములు 2:47).

కాని క్రైస్తవ జీవితమూ ఎల్లప్పుడూ సులభము కాదని వారు కనుగొన్నారు. దానిని కనుగొన్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. అపోస్తలుడు ఇలా అన్నాడు,

"దేమా ఇహలోకమును స్నేహించి, నన్ను విడిచి, దేస్సలోనీకకు వెళ్ళెను; క్రేస్కే గలతీయకును, తీతుదల్మ తియకును వెళ్ళిరి. లూకా మాత్రమే నాయొద్ద ఉన్నాడు" (II తిమోతి 4:10-11).

శ్రమ వచ్చినప్పుడు, దేమా, క్రేస్కే మరియు తీతు వెళ్ళిపోయారు.

ఈనాడు అలా జరుగుతుందా? అవును జరుగుతుంది. ప్రజలు కొంతకాలము గుడికి వస్తారు. సంఘములో స్నేహాన్ని ప్రేమిస్తారు. అంతా వినోదంగా ఉంటుంది. కాని ఏదో వస్తుంది. ఒక వ్యక్తి ఆదివారము ఉదయము లాస్ వేగాస్ కు వెళ్లినట్టు విన్నాను. గుడికి రావడము అతనికి ఇష్టమే, కాని లాస్ వేగాల్ లో ఇంకా ఎక్కువ వినోదముంది! క్రిస్మస్ నూతన సంవత్సరము సమయాలలో వేడుకలు కొంతమంది ఇష్ట పడతారు. లోకపు వినోదాలు ఉత్సవాలతో వారు శోధింపబడ్డారు – కాబట్టి వారు గుడి వదిలేసారు. "వారు మన నుండి వెళ్ళిపోయారు, వారు మనకు చెందిన వారు కాదు" (I యోహాను 2:19).

II. రెండవది, వారు ఎందుకు అలా చేసారు.

మన పాఠ్య భాగము చెప్తుంది, "వారు మనవారు కాదు; మనవారైతే, మనతో నిస్సందేహముగా కొనసాగేవారే" (I యోహాను 2:9). I యోహాను 2:19 పై, డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ ఇలా అన్నాడు,

నిజ దేవుని బిడ్డ ఎవరో ఎలా చెప్పగలమంటే అతడు నిజమైన దేవుని బిడ్డ కానిచో దేవుని సమూహాన్ని విడిచి వెళ్ళిపోయి నిజ రంగులు చూపిస్తాడు. అతడు విశ్వాసుల వ్యవస్థ నుండి క్రైస్తవుల నుండి విడిపోతాడు, విశ్వాసుల శరీరం, మరియు అతడు వెళ్ళిపోతాడు... లోకములోనికి ...చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటారు, కాని వారు నిజ క్రైస్తవులు కాదు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 777).

నేను వ్యాఖ్యానించకుండా ఆల్ బెర్ట్ చార్నేస్ పదాలు మీకు చెప్తాను, బైబిలుపై అతని శాస్త్రీయ వ్యాఖ్యానములో,

వారు మనతో ఉండి ఉంటే. వారు యదార్ధ నిజ క్రైస్తవులయితే. నిస్సందేహముగా మనతో కొనసాగేవారే... వారు నిజ క్రైస్తవులైతే గుడి నుండి వెళ్ళిపోయేవారు కాదు. అతడు ప్రకటన సామాన్యంగా చేసాడు దానిని విశ్వ సత్యముగా పరిగణించవచ్చును, వారు నిజంగా ‘మన’ వారైతే అనగా, వారు, నిజ క్రైస్తవులైతే, వారు గుడిలో కొనసాగేవారే, లేక పడిపోయే వారు కాదు. ఆ ప్రకటన మనకు నేర్పడానికి చేయబడింది ఎవరైనా సంఘము నుండి వెళ్ళిపోతే, వాస్తవము వారికి ఏ మతము లేదని, అది ఉండి ఉంటే వారు గుడిలో నిలకడగా ఉండి ఉండేవారు (Albert Barnes, Notes on the New Testament, Baker Book House, 1983 reprint of the 1884-85 edition, note on I John 2:19).

యేసు చెప్పాడు,

"రాతి నేలనుండి వారెవరు, అనగా, వినునప్పుడు, వాక్యమును సంతోషముగా అంగీకరించువారు; గాని వారికి వేరు లేనందున, కొంచెము కాలము నమ్మి, శోధన కాలమున తొలగి పోవుదురు" (లూకా 8:13).

III. మూడవది, దానిని పరిష్కరించుట ఎలా.

"వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంభంధులు కారు, వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరూ మన సంబంధులు కారని, ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19).

మేత్యూ హెన్రీ ఇలా అన్నాడు,

వారు అంతరంగములో మనలాంటి వారు కాదు; కాని వారు మన వారు కాదు; మంచి సిద్ధాంతము ద్వారా లోబడిన హృదయములు కలిగిన వారు కాదు; శిరస్సైన క్రీస్తు గుంపులో వారు లేరు (Matthew Henry’s Commentary on the Whole Bible, Hendrickson, 1996 reprint, volume 6, p. 863).

వారు క్రీస్తుతో కలపబడలేదు. వారు "మన" వారు కాదు. ఈ వచనమును గూర్చి డాక్టర్ మెక్ గీ ఇలా అన్నాడు,

యోహాను చాలా నిర్ధిష్టమైన తీవ్రమైన ప్రకటన ఇక్కడ చేస్తున్నాడు, ఈనాటి మనకు ఈ ప్రకటన చేస్తున్నాడు. అతడు తిరిగి జన్మించాలని, చాలా మతపరమైన నికోదేముతో, ప్రభువైన యేసు చెప్పాడు. ఆయన అతనితో అన్నాడు... "ఒకడు కొత్త్తగా జన్మించితేనే గాని, అతడు దేవుని రాజ్యము చూడనేరడు" (యోహాను 3:3). యోహాను ఇక్కడ చెప్తున్నాడు, "వారు మన నుండి వెళ్ళిపోయారు, వారు మనవారు కాదు." వారు నిజమైన దేవుని బిడ్డలుగా అనిపించారు కాని, వాస్తవానికి కాదు (జే. వెర్నోన్ మెక్ గీ., ఐబిఐడి.).

"మాతో ఉండడానికి" మీరు తిరిగి జన్మించాలని, డాక్టర్ మెక్ గీ సూచించాడు. మీరు క్రీస్తుతో కలపబడాలి. మీరు నిజంగా తిరిగి జన్మిస్తే ఇది సంభవిస్తుంది. యేసు అన్నాడు,

"మీరు తిరిగి జన్మించవలెను" (యోహాను 3:7).

స్వధర్మతకు పరిష్కారము నూతన జన్మ! మీరు మీ పాపములను ఒప్పుకొని క్రీస్తు నొద్దకు వచ్చునప్పుడు ఇది జరుగుతుంది. మీరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మిమ్మును చేర్చుకొని ఆయన రక్తములో మీ పాపములు కడిగివేస్తాడు. మీరు దానిని లెక్కింపవచ్చు, ఎందుకంటే ఆయనన్నాడు.

"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37).

నీవు క్రీస్తు దగ్గరకు వచ్చి, ఆయనతో చేరినప్పుడు, నీవు కొత్త పుట్టుకను స్వీకరించావు. నీ పాపాలు రద్దు చేయబడ్డాయి, మరియు మీరు దేవుని కుమారుడవుతారు. మీరు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే మీరు నిజంగా స్థానిక సంఘము యొక్క సభ్యుడవుతారు. అస్తిత్వ వాదం నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు రద్దు చేయబడి మరియు మళ్ళీ పుట్టింది. "దైవభక్తిలేని లోకపు మనుషుల యొక్క ప్రాధమిక ఒంటరితనం" మీరు పునరుత్థాన క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు నివారించవచ్చు మరియు నయమవుతుంది, ఫలితంగా స్థానిక సంఘము యొక్క ఒక జీవన భాగం అవుతుంది. యేసు చెప్పాడు,

"నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37).

ఎందుకు నశించి పోవాలి? ఇంటికి రండి – దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు!

చార్లెస్ స్పర్జన్ "ప్రేమతో నిరూపించబడిన జీవితమూ" అను శీర్షికపై ఒక ప్రసంగము చెప్పాడు. అది యోహాను 3:14 పై ఆధార పడి ఉంది,

"మనము సహోదరులను ప్రేమించుచున్నాము, కనుక మరణము లోనుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము" (I యోహాను 3:14).

స్పర్జన్ ఇలా చెప్పాడు,

మీరు తిరిగి జన్మించకపోతే, దేవుని కృప యొక్క అర్ధమును అర్ధము చేసుకోలేరు. మీరు క్రీస్తు జీవితమూ పొందుకోవాలి, మరణము నుండి జీవములోనికి, లేనిచో ఈ విషయాలు మీకు తెలియదు... "మనము సహోదరులను ప్రేమించుచున్నాము, కనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాము." కనుక, సహోదరులారా, దేవుని ప్రజలను దేవుని ప్రజలుగా ప్రేమిస్తే, వారు దేవుని ప్రజలు కాబట్టి, మనము మరణము నుండి జీవితములోనికి, దాటియున్నామనుటకు అది సూచన (C. H. Spurgeon, “Life Proved by Love,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1976 reprint, volume XLIV, pp. 80-81).

మార్పు ద్వారా మనము మరణములో నుండి జీవములోనికి దాటినప్పుడు, స్థానిక సంఘములో మనము సహోదరులను ప్రేమిస్తాము!

మీరు సంఘములో చేసుకున్న స్నేహాలకు విలువనిస్తే, మార్పు పొందేటట్టు చూసుకొండి. మీరు మారడం అవసరము. స్థానిక సంఘ సహవాసమును గట్టిగా పట్టుకునేది క్రీస్తు "శక్తే"!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట జాక్ గ్నాన్ గారిచే:
"బంధమును కట్టేది ఆశీర్వదింపబడినది" (జాన్ ఫాసెట్ చే, 1740-1817).
“Blest Be the Tie that Binds” (by John Fawcett, 1740-1817).



ద అవుట్ లైన్ ఆఫ్

బైబిలు మరియు స్థానిక సంఘమునకు ద్రోహులు

THE BIBLE AND TRAITORS TO A LOCAL CHURCH

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన ప్రసంగము,
మరియు రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ గారిచే బోధింపబడినది
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan

"వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే, మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరూ మన సంబంధులు కారని, ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి" (I యోహాను 2:19).

I.    మొదటిది, వారు ఏమి చేసారు, అపోస్తలుల కార్యములు 2:47; II తిమోతి 4:10-11.

II.   రెండవది, వారు ఎందుకు అలా చేసారు, లూకా 8:13.

III.  మూడవది, దానిని పరిష్కరించుట ఎలా, యోహాను 3:3, 7; 6:37; I యోహాను 3:14.