Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మీరు విడిచి పెట్టబడతారా?

WILL YOU BE LEFT BEHIND?
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, సెప్టెంబర్ 16, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 16, 2018

"కావున: ఏదినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి" (మత్తయి 24:42).


నేను చదువు ప్రతి వార్తా పత్రికలో నేను బైబిలు ప్రవచనము, యుగ సమప్తిని గూర్చిన విషయాలు చదువుచున్నాను. ఈ సూచనలు దేవుడు మనకు ఇచ్చాడు యుగాంతమునకు ముందు మనకు ఎంత తక్కువ సమయము ఉందో చెప్పడానికి.

ఇక్కడ లాస్ ఎంజిలాస్ లో అనుదిన వార్తలలో ఇవ్వబడిన ముఖ్యంశాలు వినండి.

వంతెనలు పతనమగుచున్నాయి. మూడవ వంతు జాతీయ వంతెనలు చాలా బలహీనంగా ఉండి, ప్రస్తుతపు రద్దీ తట్టుకోలేక పోతున్నాయి ఫెడరల్ వేదికల నివేదికల ప్రకారము అవి అమెరికా రహదారి వ్యవస్థకు సరిపోవటం లేదు.

అమెరికా భూమిపై చాలా గొప్ప దేశము, కాని మనము మన రహదారులు వంతెనలు పనిచేసేటట్టు ఉంచుకోలేకపోతున్నాము!

మందుల కొరత ఆసుపత్రులను దెబ్బ కొడుతుంది. దేశమంతటా ఆసుపత్రులు ధనుర్వాత మందులపై నియంత్రణ ఉంచాయి...ఆ మందుల కొరతను బట్టి. సంవత్సరాలుగా ఈ భయంకర కొరతను ఆసుపత్రులు ఎదుర్కొంటున్నాయి – ఇంకా కొనసాగుతూనే ఉంది. మందుల కొరత ఆసుపత్రులకు చాలా తరుచుగా వస్తుంది [ఇప్పుడు], మరియు చాలా అధ్వాన్నంగా, ప్రత్యామ్నాయ మందులు వాడకములోనికి వస్తున్నాయి... [అది] వైద్యులను మందులమ్మే వారిని కష్టపెడుతుంది... ఆసుపత్రులు కొరతను మునుపెన్నడూ లేని విధంగా ఎదుర్కొంటున్నాయి ఎందుకంటే, వైద్య ఖర్చు పెరిగింది, చాలామంది తక్కువ సరుకును ఉంచుతున్నారు.

కిలిమంజారో ఐసు మైదానము కరుగుట. ఆఫ్రికా పర్వతము కిలిమంజారోపై ఐసు అదృశ్యమవు [తుంది], దాని ప్రభావము ప్రతి చోట కనిపిస్తుంది. ఐసు కప్పులు కరుగుతున్నాయి "వాతావరణం మార్పు" వలన అది ప్రపంచమంతటిని ఈరాత్రి భయపెడుతుంది!

గొప్ప భూ కంపములు ప్రజలను గొప్ప భయముతో నింపుతున్నాయి!

యేరూషలేములో కారు బాంబు పేలింది. యేరూషలేములో చాదస్తపు యూదా ప్రాంతములో కారు బాంబు పేలింది, అది భవనాలను వణికించింది లోహములు గాలిలోనికి ఎగిరాయి.

ఇవి స్వల్ప సంఘటనలు అనిపించవచ్చు. కాని బైబిలు ప్రవచనము తెలిసిన వారు గ్రహిస్తారు మనము అంత్య దినములలో జీవిస్తున్నాం అనడానికి అవి సూచనలని. యుగ సమాప్తి మనకు తెలుసు చాలా సమీపంగా ఉంది అది బైబిలు ప్రవచనాలు అర్ధము చేసుకునే వారు గ్రహిస్తారు.

యేసు చెప్పాడు:

"కావున: ఏదినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి" (మత్తయి 24:42).

తేదీలు నిర్ణయించడంనకు వ్యతిరేకంగా యేసు హెచ్చరించాడు (మత్తయి 24:36; అపోస్తలుల కార్యములు 1:7). కాని సమీపిస్తున్న అంతమును సూచనల ద్వారా గమనించాలని ఆయన చెప్పాడు. మనము అదేసమయంలో నివసిస్తున్నామని నేను నమ్ముతాను. అంతము సమీపముగా ఉందని బైబిలు బోధిస్తుంది.

క్రీస్తు మేఘములో వచ్చుచున్నాడని బైబిలు బోధిస్తుంది. సజీవులు మృతులు, నిజంగా మారిన క్రైస్తవులు, ఆకాశములో ఆయన కలుసుకోవడానికి లేపబడతారు (వచనము I దెస్సలోనీకయులకు 4:14-18). బైబిలును నమ్మనివారు బైబిలులోని ఈ వచనమును గేలి చేస్తారు. వారు నవ్వి అది ఎన్నడు జరగదు అంటారు. కాని వారిది తప్పు. ఒకరోజు త్వరలో ఎత్తబడుట సంభవిస్తుంది. మీరు విడిచి పెట్టబడతారు!

ఎత్తబడుటను గూర్చి మూడు విషయాలను మనము సంక్షిప్తంగా చూద్దాం.

I. మొదటిది, ఎత్తబడుటకు ముందు పరిస్థితులు.

ఎత్తబడుటకు ముందు ప్రపంచములో ఎలా ఉంటుందో బైబిలు సరిగ్గా చెప్పుతుంది. యేసు చెప్పాడు:

"(నోవహు) దినములు ఎలాగుండెనో, మనష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు పెండ్లి కిచ్చుచు, (నోవహు) జల ప్రళయము వచ్చు వరకు, అందరిని కొట్టుకొని పోవు వరకు, ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడయు ఉండును" (మత్తయి 24:37-39).

"నోవహు నీతిని ప్రకటించిన వాడు (II పేతురు 2:5). తీర్పు వస్తుందని అతడు తన తరము వారిని గద్దించాడు. కాని ప్రజలు అతనిని చూచి నవ్వి అతని ప్రసంగమును అపహసించారు. వారు వినలేదు. వారు వస్తు పర, పాపపు జీవితాలలోనికి వెళ్ళిపోయారు.

ఈరోజు కూడ అలాగే ఉంది. ఎవరో మిమ్మును గుడికి తెస్తారు. మీరు ప్రసంగము వింటారు. తరువాత మీపాత జీవిత శైలికి వెళ్ళిపోతారు. మీరు పశ్చాత్తాప పడరు. మీరు యేసు క్రీస్తును విశ్వసించారు. మేము మీకు ఫోను చేసినప్పుడు, మీరు తిరిగి ఈ గుడికి రారు.

మీకు వినోదము కావాలి. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ మాటల్లో చెప్పాలంటే, మీరనుకుంటారు ప్రపంచము "ఆట స్థలము కాని యుద్ధ భూమి కాదు." జీవితమూ డిస్నీ లేండ్ అనుకుంటారు. జీవితపు ఉద్దేశము "వినోదము" అనుకుంటారు. ప్రతి ఆదివారము దేవునికి సమయమివ్వడానికి తిరస్కరిస్తారు. ఏదైనా వస్తే, గుడి మానేస్తారు. మీరు మారలేదు. మీరు నిజ క్రైస్తవులు కారు. మరణము వచ్చేటప్పుడు, మీరు సిద్ధంగా ఉండరు. ఎత్తబడే సమయములో, మీరు విడిచిపెట్టబడతారు! గ్రిఫిత్ గారు పాడినట్టు, "కుమారుడు వచ్చాడు, మీరు విడిచిపెట్ట బడ్డారు."

యేసు చెప్పాడు:

"కావున: ఏదినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి" (మత్తయి 24:42).

II. తరువాత, రెండవది, ఎత్తబడుటకు సిద్ధముగా లేకపోవడంలోని ప్రమాదమును గూర్చి ఆలోచించండి.

దయచేసి మత్తయి, 25 అధ్యాయము చూడండి. ఇది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1035 పుటలో ఉంది. పాత ప్రసంగీకులంతా చెప్పారు ఈ పాఠ్యభాగములోని కన్యకలు క్రీస్తును కలవడానికి సిద్ధంగా లేని వారిని సూచిస్తున్నారని. వారు చెప్పింది సరియే నేను ఒప్పింపబడ్డాను.

ఈపాఠ్యభాగములో, యేసు ఒక ఉపమానము చెప్పాడు, గొప్ప ఆత్మీయ సత్యమును చూపించే కథ. ఆయన మాట్లాడుచున్న ఆ గొప్ప సత్యము ఏమిటి? మత్తయి 25:13 చూడండి. యేసు చెప్పాడు:

"ఆదినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి" (మత్తయి 25:13).

కనుక, ఈ పాఠ్యభాగము మీకు ఒక హెచ్చరిక!

వీరిలో ఐదుగురు కన్యకలు సిద్ధంగా ఉన్నారు. క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మిగిలిన ఐదుగురు సిద్ధంగా లేరు. ఈ ఉపమానాన్ని అర్ధం చేసుకోవడానికి ఇంకా లోతుగా వెళ్ళడం ప్రమాదకరము. ఈ పాఠ్యభాగములోని సందేశము ఇది: యేసు రాకడ వచ్చునప్పుడు చాలామంది ఉండరు.

ఇప్పుడు వచనము పది చూడండి:

"వారు కొనబోవుచుండగా, పెండ్లి కుమారుడు వచ్చెను: అప్పుడు సిద్ధ పడియున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి: అంతట తలుపు వేయబడెను" (మత్తయి 25:10).

నిజ క్రైస్తవులు ఎత్తబడిన తరువాత, తలుపు వేయబడుతుంది, నోవహు ఓడ తలుపు మూయబడినట్లు. ఇంకా ఎవ్వరు లోనికి రాలేదు. "అంతట తలుపు వేయబడెను."

11 వ వచనము చూడండి,

"ఆ తరువాత తక్కిన కన్యకలు, వచ్చి, అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడిగారు. కాని మిమ్ము నేరుగనని, నేను మీతో నిశ్చయముగా, చెప్పుచున్నాననెను" (మత్తయి 25:11-12).

తరువాత, వచనము 13లో, యేసు ఈ అన్వయింపు మీ కొరకు చేస్తున్నాడు:

"ఆదినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక కుమారుడి రాక కొరకు మెలకువగా ఉండుడి" (మత్తయి 25:13).

మనకు సూచాయిగా సమయము తెలుస్తుంది, కాని ఆ దినము గాని ఘడియ కాని తెలియదు.

ఆ దినము ఘడియ వచ్చినప్పుడు, మీకు చాలా ఆలస్యము అయిపోతుంది. ఈ ప్రసంగమునకు ముందు గ్రిఫిత్ గారు పాడినట్టు, "కుమారుడు వచ్చియున్నాడు, మీరు విడువబడియున్నారు."

III. తరువాత, మూడవదిగా, ఎత్తబడిన తరువాత విడువబడినవారు దేవునిచే విడిచి పెట్టబడతారు. వారు దుర్మార్గులు, రక్షింపబడలేదు.

ప్రకటన గ్రంథము, పదహారవ అధ్యాయము వినండి. ఈ పాఠ్యభాగములో దేవుని ఉగ్రతను గూర్చి మనము నేర్చుకుంటాము, అది రాకడ తరువాత క్రీస్తును తిరస్కరించిన ప్రపంచముపై క్రుమ్మరింపబడుతుంది. రెండవ వచనము చెప్తుంది వారు శ్రమలు పొందుతారు. వచనము నాలుగు చెప్తుంది ప్రపంచపు నీరు విషపూరితమవుతుంది. వచనము ఎనిమిది చెప్తుంది మానవాళి అగ్నిచే దహించబడతారు. వచనము పది చెప్తుంది గొప్ప అంధకారము ఉంటుంది నాలుకలు తడి ఆరిపోతాయి. వచనము పద్దెనిమిది చెప్తుంది గొప్ప భూకంపాలు వస్తాయని. వచనము ఇరవై ఒకటి చెప్తుంది "పెద్ద వడగండ్లు," ఆకాశము నుండి పడెను.

ఇదంతా జరిగినప్పుడు ప్రజలు క్రీస్తు వైపు తిరుగుతారా? లేదు! వచనము తొమ్మిది ఆఖరి భాగము వినండి:

"ఆయన మహిమ పరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కాదు" (ప్రకటన 16:9).

వచనము పదకొండు:

"తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి, కాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కాదు" (ప్రకటన 16:11).

వచనము ఇరవై ఒకటి చివరి భాగము:

"పెద్ద వడగండ్లు ఆకాశము నుండి [వారి] మనష్యుల మీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్ప దైనందున మనష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి" (ప్రకటన 16:21).

చూడండి, వారు దేవునిచే విడిచిపెట్టబడ్డారు. రక్షింపబడడానికి చాలా ఆలస్యము అయిపొయింది. క్షమింపరాని పాపము చేసారు.

"దేవుడు వారిని విడిచిపెట్టెను" (రోమా 1:24).

"దేవుడు వారిని విడిచి పెట్టెను" (రోమా 1:26).

"దేవుడు భ్రష్టమనస్సుకు వారిని అప్పగించెను" (రోమా 1:28).

గ్రిఫిత్ గారు పాడినట్లు, "కుమారుడు వచ్చియున్నాడు, మీరు విడిచి పెట్టబడియున్నారు."

మీరు ఎత్తబడాలనుకుంటే, మీరు రక్షింపబడాలనుకుంటే, మీరు ఇప్పుడే రక్షింపబడాలి, మీతో దేవుడు మాట్లాడుచుండగా. మీరు చాలా కాలము వేచియుంటే, చాలా ఆలస్యము అయిపోతుంది.

గత వారములో సుడిగాలి ఫ్లోరెన్స్ ఉత్తర దక్షిణ కేరలీనాలను తాకింది. ప్రజలు బయటకు వెళ్ళాలని హెచ్చరింపబడ్డారు. అధ్యక్షుడు వారిని హెచ్చరించాడు. గవర్నరు వారిని హెచ్చరించాడు. పోలీసు అగ్ని మాపక దళము వారు వీధులలో మైకులలో విడిచి పెట్టాలని వారిని హెచ్చరించారు. చాలాసార్లు వారు హెచ్చరింపబడ్డారు. కాని కొందరు బుద్ధిహీనులు ఉండిపోయారు – ప్రవాహములో కొట్టుకుపోయారు. క్రీస్తు వస్తున్నాడని మీరు హెచ్చరింపబడుతున్నారు. మీరు వినకపోతే, మీరు రాకడలో విడిచిపెట్టబడతారు. చాలాకాలము కనిపెడితే, చాలా ఆలస్యము అయిపోతుంది.

మీ పాపముల నిమిత్తము క్రీస్తు చనిపోయాడు. ఆయన మృతులలో నుండి లేచి పరలోకములో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనను నమ్మితే ఆయన రక్తము మీ పాపములను కడిగి వేస్తుంది, మీరు రాకడకు సిద్ధంగా ఉంటారు. మీరు కనిపెడితే, మీ గురించి చెప్పబడుతుంది, "కుమారుడు వచ్చియున్నాడు, మీరు విడిచి పెట్టబడియున్నారు." గ్రిఫిత్ గారు పాడినట్టు, "కుమారుడు వచ్చియున్నాడు, మీరు విడిచి పెట్టబడియున్నారు." మీ పాటల కాగితములో 3 వ పాట. నిలబడి పాడండి. త్వరగా కాదు. మాటలను గూర్చి ఆలోచించండి!

జీవితమూ తుపాకులతోను యుద్ధముతోను నింపబడింది,
     ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు,
మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ.
     పిల్లలు చనిపోయారు, దినాలు చల్లబడిపోయాయి,
ఒక రొట్టె ముక్క సంచుడు బంగారాన్ని కొనగలదు,
     మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ.
మీ మనస్సు మార్చుకోవడానికి సమయము లేదు,
     మీరు అంత గుడ్డిగా ఎలా ఉండగలరు?
రక్షకుడు పిలిచాడు, కాని మీరు తిరస్కరించారు,
     కుమారుడు వచ్చియున్నాడు కాని మీరు విడిచి పెట్టబడ్డారు,
మీరు విడిచి పెట్టబడ్డారు,
     మీరు విడిచి పెట్టబడ్డారు.

భార్యాభర్తలు ఒక మంచముపై పడుకుంటారు,
     ఆమె స్వరము వింటుంది తల తిప్పుకుంటుంది – అతడు వెళ్ళిపోయాడు.
మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ.
     ఇద్దరు కొండ ఎక్కుతుంటారు,
ఒకరు మాయమవుతారు ఒకరు ఉండిపోతారు,
     మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ.
మీ మనస్సు మార్చుకోడానికి సమయము లేదు,
     మీరు అంత గుడ్డిగా ఎలా ఉండగలరు?
రక్షకుడు పిలిచాడు, కాని మీరు తిరస్కరించారు,
     కుమారుడు వచ్చియున్నాడు కాని మీరు విడిచి పెట్టబడ్డారు,
మీరు విడిచి పెట్టబడ్డారు,
     మీరు విడిచి పెట్టబడ్డారు.
("మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ" లారీ నార్మోన్ చే, 1947-2008;
          పల్లవి కాపరిచే సవరింపబడింది).
(“I Wish We’d All Been Ready” by Larry Norman, 1947-2008;
          chorus altered by the Pastor).

మీరు విడువ బడకూడదు. యేసును విశ్వసించి ఇప్పుడే రక్షింపబడాలి, ఈ రాత్రే!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము: మత్తయి 24:37-42.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ" (లారీ నార్మోన్ చే, 1947-2008).
“I Wish We’d All Been Ready” (by Larry Norman, 1947-2008).



ద అవుట్ లైన్ ఆఫ్

మీరు విడిచి పెట్టబడతారా?

WILL YOU BE LEFT BEHIND?

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

"కావున: ఏదినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి" (మత్తయి 24:42).

I.    మొదటిది, ఎత్తబడుటకు ముందు పరిస్థితులు, మత్తయి 24:37-41.

II.   రెండవది, ఎత్తబడుటకు సిద్ధముగా లేకపోవడంలోని ప్రమాదమును గూర్చి ఆలోచించండి, మత్తయి 25:1-13.

III.  మూడవదిగా, ఎత్తబడిన తరువాత విడువబడినవారు దేవునిచే విడిచి పెట్టబడతారు, ప్రకటన 16:9, 11, 21.