Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అంత్యదినములకు సూచనలు

SIGNS OF THE LAST DAYS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము సాయంకాలము, సెప్టెంబర్ 9, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 9, 2018


లోకము ఎప్పుడు అంతమవునో శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు. వారు అన్నారు, "ఇవి ఇప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?" (మత్తయి 24:3). వారికి ఒక సూచన నిమ్మని వారు క్రీస్తును అడిగారు. ఆయన మత్తయి 24 లో వ్రాయబడినట్టు, చాలా సూచనలిచ్చాడు, సమాంతరంగా, లూకా 21 లో కూడ. మత్తయి 24 చాలా సూచనలను ఇచ్చింది. వాటిలో చాలా వాటిని లూకా 21 ఇచ్చింది. ఎక్కువగా ఈరాత్రి లూకా 21 ను గూర్చి వింటాము. "నా రాకడకు సూచనలేమి, యుగ సమాప్తికి?" లూకా 21 లో క్రీస్తు చాలా సూచనలు ఇచ్చాడు, కాని II పేతురు ముందు చూద్దాం.

II పేతురు, మూడవ అధ్యాయము, వచనము 3 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో అది 1319 వ పుటలో ఉంది. అది ఇలా చెప్తుంది,

"అపహాసకులు అపహసించుచు వచ్చి, అంత్య దినములలో, తమ స్వకీయ దురాశల చేత నడుచు కొందురు" (II పేతురు 3:3).

ఈ రాత్రి నేను అంశము: "అంత్యదినములకు సూచనలు" పై మాట్లాడతాను, ఎందుకంటే మనము ఇప్పుడు అంత్య దినములలో జీవిస్తున్నాము. సమయము తక్కువగా ఉన్నది.

ఆ విషయము II పేతురు 3:3 లో ఉంది, "అంత్యదినములలో." మాటలు "అంత్య దినములు" గమనించండి. ఆ విషయము అంశము మళ్ళీ మళ్ళీ బైబిలులో చూస్తాం.

అంత్య దినముల చరిత్ర ఉందని బైబిలు మనకు బోధిస్తుంది. చాలా మంది బైబిలు పండితులు మనము ఆ కాలములో ఉన్నామని చెప్పుచున్నారు. వారు సరియే అని నేననుకుంటున్నాను. తేదీలు ఖాయం చెయ్యడంపై బైబిలు హెచ్చరిస్తుంది. కాని "అంత్య దినములు" అనే కాలము ఉంది. ప్రస్తుతము మనము ఆ కాలములో ఉన్నామని ప్రతి సూచన సూచిస్తుంది. లినార్డ్ రావెన్ హెల్ అన్నాడు, "ఇవి అంత్య దినములు."

II పేతురు 3:3 లో తరువాత పదము "అపహాసము." వీరు క్రీస్తు రెండువ రాకడను గూర్చి యుగ సమాప్తిని గూర్చి అపహాస్యము చేస్తారు. వారు గేలిచేసి నవ్వుతారు. వారు అవిశ్వాసులు. వారంటారు, "మేము ఆ దేవుని ఎక్కడా కనుగోనలేము. దేవుడు లోకాన్ని అంతము చేస్తాడని మేము అనుకోము. దేవుడు ఉన్నాడనే విషయము మేము నమ్మము." భవిష్యత్తు తీర్పును గూర్చి మేము క్రీస్తు రెండవ రాకడను గూర్చి, అవరోహణను గూర్చి వారు, అపహిస్తారు. దేవుని భయంకర ఉగ్రతతో యుగ సమాప్తిని గూర్చి వారు నవ్వుతారు.

"అంత్య దినములలో, అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చేత నడుచుకొందురు" (II పేతురు 3:3).

ఎందుకు వారు నవ్వి అపహసితారు? తరువాత మాటలు మనకు చెప్తాయి, "స్వకీయ దురాశల చేత నడుచుకుంటారు" లేక "స్వకీయ దురాశల వెంట వెళ్తారు." వారు పాపములో జీవిస్తున్నారు. అందుకే క్రీస్తు వచ్చి వారి పాప జీవితములో జోక్యము చేసుకోవడం ఇష్టము ఉండదు. వారు దురాశను ప్రేమిస్తారు, వారి పాపాన్ని ప్రేమిస్తారు వారు క్రీస్తును రానివ్వరు, అందుకే వారు దేవుని తీర్పును గూర్చిన బైబిలు బోధను తిరస్కరిస్తారు! ఆయన ప్రేమ దేవుడు, కాని ఆయన ఉగ్రత తీర్పు కలిగిన దేవుడు. పాపమునకు దుష్టత్వమునకు దేవుడు వ్యతిరేకి. ఈ పరిహసించు వేషధారులు రుజువును పరిశీలించరు. వారు బైబిలు చదవరు. సత్యాన్ని తెలుసుకొన ఇష్టపడరు – వారు వేషధారులు కాబట్టి. వారు అపహాసకులు, స్వకీయ దురాశలచే నడుచువారు!

తరువాత, వచనము చెప్తుంది, "వారు బుద్ధి పూర్వకంగా అవివేకులుగా ఉంటారు, దేవుని మాటలచే ఆకాశములు ఉన్నవి అను విషయంలో..." (7 వ వచనము చూడండి). "ఇప్పుడున్న ఆకారము భూమి, భక్తిహీనుల తీర్పును, నాశనము జరుగు దినము వరకు, అగ్ని కొరకు నిలువ చేయబడినది" (II పేతురు 3:3-7).

ఇప్పుడు వచనము పది చూడండి:

"అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును; ఆ దినమున ఆకాశములు మహాద్వనితో గతించిపోవును, పంచ భూతములు మిక్కటమైన వేండ్రముతోలయమై పోవును, భూమియు దానిమీద నున్న కృత్యములను కాలిపోవును."

ఈ లేఖన భాగము చెప్తుంది తీర్పు దినము వస్తుందని. సర్వ పాప ప్రపంచము దేవుని తీర్పు ముందు నిలబడాలి. మీరు మారకపోతే ఆ రోజున మీరు దేవుని ముందు నిలవ బడతారు. మీరు రక్షింపబడకపోతే మీరు తీర్పు నొందుతారు.

ఆ దినమును గూర్చి శిష్యులు అడుగుచున్నారు. వారన్నారు, "ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?" (మత్తయి 24:3).

ఇప్పుడు క్రీస్తు వారికి చాలా సూచనలు ఇచ్చాడు, వాటిలో కొని మీ ముందు ఉంచుతాను.

I. మొదటిది, అంతము సమీపము అన్ని చెప్పడానికి జీవావరణ సూచనలు ఉన్నాయి:

యేసు ఇలా చెప్పాడు

"అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును...తెగుళ్ళును, కరువులును తటస్థించును; ఆకాశము నుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును...మరియు సూర్య చంద్ర నక్షత్రములలో, సూచనలను కదలింపబడును; భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదలింపబడును; కనుక లోకము మీదికి రాబోవు చున్న వాటి విషయమై భయము కలిగి, మనష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు" (లూకా 21:11, 25-26).

దీనిని గూర్చి ఆలోచించండి! ప్రజల హృదయాలు సోమ్మసిల్లుతాయి "భూమిపై" సంభవించుచున్న దానిని చూచి యేసు చెప్పాడు. ఆయనన్నాడు నిరుత్సాహము అసంతృప్తి ఆవేదన మరియు గొప్ప భయము కలుగుతుంది, "లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై."

ఇటీవలమైనే రాష్ట్రమంతా రంద్రమును ఆకాశ ఉపరితలముపై శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. టైమ్ పత్రిక కొత్త కథ చెప్పింది – కవరు మీద – "పెద్ద కరిగిన స్థితి. ఉష్ణోగ్రత పెరుగుచున్నప్పుడు, ఉపగ్రహముపై చల్లదనాన్ని పంపిస్తుంది." (Time magazine, September 4, 2000, pp. 52-56). టైమ్ చెప్పింది, "కొంత కరుగుదల వాతావరణాన్ని అతలాకుతలం చేయగలదు." చాలామంది శాస్త్రవేత్తలు భయపడుచున్నారు మనము కొత్త ఐసు తరములో ప్రవేశిస్తున్నామని. టైమ్ సంచికలో, డాక్టర్ రిచర్డ్ ఎల్లీ, పెన్ రాష్ట్ర విశ్వ విద్యాలయ భూగర్భ శాస్త్రవేత్త అన్నాడు, "పడిపోతున్న ఉష్ణోగ్రతలు మానవాళిని చరిత్రలో (గొప్ప) ఎక్కువగా, ప్రభావితం చేస్తున్నాయి." ఇది మానవాళికి అంతమా? డాక్టర్ ఎల్లీ చెప్తాడు, "కాదు, ఇది మానవాళికి అసౌకర్య సమయము. చాలా అసౌకర్యము."

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.
   ("మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను" లారీ నోర్మాన్ చే, 1947-2008).
       (“I Wish We’d All Been Ready” by Larry Norman, 1947-2008).

మీరు సిద్ధంగా ఉన్నారా?

డాక్టర్ ఎల్లీ లాంటి శాస్త్రజ్ఞులు భయకంపితులవుతున్నారు

"లోకము మీదికి రాబోవు చున్న వాటి విషయమై మనష్యులు ఎదురు చూచుచున్నారు" (లూకా 21:26).

ఉత్తర ద్రువములో మంచు కరుగుట ఇంకొక, 25 సంవత్సరాలలో సంభవించబోతుందంటే, అది భయ కంపితము. ఆఫ్రికాను ఎయిడ్స్ వ్యాధి ఎలాంటి అంతము లేకుండా, నాశనము చేస్తుందంటే – అది భయమును కలిగిస్తుంది. మందులకు నయము కాని భయంకర వ్యాధులు "మందులు" వాటిపై పని చేయవు – అంటే అది భయ కంపితము.

చాలా మంది యవనస్తులకు భవిష్యత్తును గూర్చిన భయము ఉంది. ఈమధ్య జరిగిన విశ్లేషణము ప్రకారము 80 శాతము ఈనాటి యువకుడు మంచి భవిష్యత్తు లేదు అని భయము చెందుచున్నారు. ఈ యుక్త వయస్కులు ఉత్తర దృవపు మంచు కరగడంను గూర్చి, చింత పడుచున్నారు.

మన ప్రపంచము బాగా పాడై పోతుందని యవనస్తులకు తెలుసు. అది వారిని భయపెడుతుంది. దక్షిణ కాలిఫోర్నియాలో సంవత్సరమంతా గడ్డ కట్టించే చలి ఉందంటే మనము ఏమి చేస్తాము?

"రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనష్యులు ఎదురు చూచుచున్నారు" (లూకా 21:26).

మానవాళి మన ఉపగ్రహాన్ని నాశనము చేస్తుందని యవనస్తులు లోతుగా భయము నొందుచున్నారు. వారితో నేను – పూర్తిగా ఏకీభవిస్తాను!

నా భార్య నేను మా ఇంట బయట నిలబడ్డాము. నేను ఆమెను అడిగాను, "నీవు ఆఖరి సారిగా ఎప్పుడు ఆధిపత్య సీతాకోక చిలుక చూసావు? నీవు చివరిసారిగా ఎప్పుడు కప్పను చూసావు? అవి పోయాయి – చాలా వరకు." ఆమె నాతో చెప్పింది, "అవును, మనము పర్యావరణముతో అతలాకుతలమై పోయాము." ఒకరు నాతో అన్నాడు, "మన గూడును పాడు చేసుకొని ప్రపంచాన్ని నాశనము చేస్తున్నాము." విచారంగా, నేను అంగీకరింపవలసి వచ్చింది. అతడు చనిపోయాడు.

ఖగోళ శాస్త్రములో భయపెట్టే సమస్యలు, వార్తా పత్రికలలో వ్రాయబడేవి, యుగ సమాప్తి క్రీస్తు రెండవ రాకడ సమీపమని చెప్పడానికి సూచనలు. బైబిలు చెప్తుంది, "మీ దేవుని కలుగుకోవడానికి సిద్ధముగా ఉండుము." సిద్ధ పడడానికి చాలిన సమయము లేదు! లారీ నోర్మాన్ అన్నాడు,

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.

మీరు సిద్ధంగా ఉన్నారా?

అందుకే మీరు గుడికి వచ్చి క్రీస్తును ఇప్పుడు కనుగొనాలి! మన ప్రపంచానికి సమయము గడిచిపోతుంది. మీరు క్రీస్తును కనుగొనడానికి త్వరపడలి, మార్పు నొందాలి, తీర్పు రాకముందు గుడిలో లోతుగా ఉండాలి. మీరు క్రీస్తులో ఉన్నప్పుడు, మీరు అపాయము నుండి భద్రముగా ఉంటారని దేవుని వాగ్దానాలు చెప్తున్నాయి.

నన్ను దాచుము, ఓనా రక్షకా, దాచుము,
   జీవిత తుఫానులన్ని గతించిపోయే వరకు;
పరలోక నడిపింపు భద్రతలో,
   ఓ చివరిలో నా ఆత్మను స్వీకరించుము!
("యేసు, నా ప్రాణ ప్రియుడా" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
       (“Jesus, Lover of My Soul” by Charles Wesley, 1707-1788).

II. కాని రెండవదిగా, అంతము సమీపము అని చెప్పడానికి జాతిపర సూచనలు ఉన్నాయి.

లూకా 21:20 దానిని గూర్చి చెప్తుంది,

"మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, జనము (గ్రీకు పదము ఎత్నోస్ లేక ఎత్నిక్ గుంపు), మరియు రాజ్యము (బాసీలియస్ = జాతీయ గుంపు) రాజ్యముకు వ్యతిరేకంగా" (లూకా 21:10).

అదే ఈనాడు మనము చూస్తున్నాము. మన పరిజ్ఞానముతో మనము జాతి వివక్షలు దేశములు మధ్య యుద్ధము ఆపలేక పోతున్నాము. ప్రతి అధ్యక్షుడు, అరబ్భులకు యూదులకు మధ్య శాంతి నెలకొల్ప ప్రయత్నిస్తాడు. మన అద్యక్షులందరూ విఫలులయ్యారు! క్రీస్తు వచ్చిన తరువాత మాత్రమే అన్ని తెగల మధ్య గుంపుల మధ్య శాంతి ఉంటుంది! క్రీస్తు రాకడ తరువాత ఆయన అన్ని రాజ్యములు జాతుల మధ్యన శాంతి తీసుకొని వస్తాడు. ఎవరు చెయ్యలేరు – రాబోవు అంత్య క్రీస్తు కూడ పూర్తిగా జయవంతుడు కాలేడు. యేసు క్రీస్తు మాత్రమే వివిధ జాతుల మధ్య గుంపుల మధ్య రాజ్యముల మధ్య శాంతి తేగలడు –ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు (అప్పుడు మాత్రమే) భూమి మీద నిజ సమాధానము ఉంటుంది!

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.

ఈ రాత్రి మీరు సిద్ధమేనా?

III. తరువాత, మూడవదిగా, అంతము సమీపము అని చెప్పడానికి, మన చుట్టూ వ్యతిరేక సూచనలు ఉన్నాయి.

చాలా మంది మూర్ఖులు, భూమిపై దేవుడు ఎన్నుకున్న యూదులను అసహ్యించుకుంటారు. 21 వాక్యభాగము ఇలా చెప్తుంది:

"యేరూషలేము దండల చేత చుట్టబడుట (ముట్టబడినప్పుడు) మీరు చూచునప్పుడు, దాని నాశనము సమీపమై యున్నదని తెలుసుకొనుడి (సమీపము)" (లూకా 21:20).

వ్యతిరేకత, యూదులను ద్వేషించుట, అంత్య దినములలో బలంగా తయారవుతుంది, అన్య సైన్యములు యేరూషలేములోని యూదులపై తిరుగబడి వారిని నశింపచేసి, II ప్రపంచ యుద్ధములో హిట్లర్ చేసినట్టు చేయాలనుకుంటారు. కాని భూమిపై యూదులు దేవునిచే ఎన్నిక చేయబడిన వారు, బైబిలు ప్రకారము. బైబిలు చెప్తుంది,

"ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులైయున్నారు" (రోమా 11:28).

అబ్రహాము బట్టి కాకపొతే, మోషే ప్రవక్తల విషయము కాకపొతే ఈరాత్రి మీరు ఇక్కడ ఉంటే వారు కాదు. అందుకే బైబిలు నమ్మే బాప్టిస్టులు ఇశ్రాయేలుకు మద్దతు ఇచ్చే వారిలో ఉంటారు.

కాని బైబిలు చెప్తుంది పాపపు ప్రపంచము అంత్య దినములలో యూదులకు వ్యతిరేకంగా తిరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు:

"నేను ఆ దినమందు యేరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును" (జేకర్యా 12:3).

అది ఇప్పుడు జరుగుతుంది. మనము అంత్య దినములలో జీవిస్తున్నామనడానికి ఇది ఒక సూచన.

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.

మీరు సిద్ధమేనా?

IV. మరియు తరువాత, నాల్గవదిగా, మతపర సూచనలు ఉన్నాయి – అబద్ధపు మతముతో మోసగించే సూచనలు, అంతము సమీపమని ఇది చూపిస్తుంది.

"ఆయన అన్నాడు, మీరు మోసపోకుండా చూచుకొనుడి: అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించెనని చెప్పుదురు... మీరు వారి వెంబడి పోకుడి" (లూకా 21:8).

మళ్ళీ క్రీస్తు చెప్పాడు:

"అప్పుడు అబద్ధపు క్రీస్తులను... అబద్ధపు ప్రవక్తలను వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడినది; వారిని సహితము, మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహాత్కార్యములను కనబరచెదరు" (మత్తయి 24:24).

మీరు టిబిఎన్ (TBN) లో చూస్తారు – ఈ ప్రాంతములో 17 చానెల్ లో మీరు చూసారు – ఇది మోసము. బెన్నిహీన్ ఒక మోసగాడు. జోయర్ ఓస్టీన్ ఒక మోసగాడు. సువార్తిక రేడియో మరియు టెలివిజన్ ఒక మోసము. అందుకే నేను డాక్టర్ మెక్ గీని తప్ప, ఎవరిని సిఫారసు చేయను! నేను మెత్తని కొత్త సువార్తికులను నమ్మను!

"ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై; తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, తమ కొరకు పోగు చేసుకొందురు" (II తిమోతి 4:3).

ఇప్పుడు ఈ సూచన జరుగుతుంది! అంతము దగ్గరగా ఉంది!

V. ఐదవదిగా, అంతము సమీపము అనడానికి, మత సంబందిత చిత్రహింస సూచనలు ఉన్నాయి.

చాలా ఎక్కువగా ప్రపంచమంతటా క్రైస్తవులపై హింసలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, కమ్యూనిష్టు చైనాలో చాలామంది క్రైస్తవులు రహస్యముగా కలుస్తారు. లాస్ ఎంజిలాస్ టైమ్ ఒక నివేదిక ఇచ్చింది సువార్త పంచుకున్నందుకు ముగ్గురు ఆత్మల సంపాదకులు చైనా నుండి పంపి వేయబడ్డారు:

చైనా ముగ్గురు అమెరికా సువార్తికులను (ఆత్మల సంపాదికులను) మధ్య చైనాలో పంపించివేయబడ్డారు, నివేదిక చెప్పింది. రిపోర్ట్... పదుల కొలది చైనీయ ఆరాధికులు కూడ వారితో పాటు జైలుకు పంపబడ్డారు. ఇంకొక యాభై మంది అనుచరులు... ప్రొటెస్టెంట్ సహవసములో మూడు రాష్ట్రాలలో బంధింపబడ్డారు, హాంగ్ కాంగ్ సమాచారము ప్రకారము మానవ హక్కుల ప్రజాస్వామిక ఉద్యమము చైనాలో.

ప్రస్తుతము ప్రపంచమంతటా క్రైస్తవులకు చిత్రహింసలు యేసు ముందుగానే ఊహించాడు. ఆయనన్నాడు,

"వారు మిమ్మును బలాత్కారముగా పట్టుకొని, సమాజమందిరములకు, చెరసాలకు అప్పగించి ... హింసింతురు" (లూకా 21:12).

ఆయనన్నాడు తల్లిదండ్రులు బంధువులు కూడ మీరు నిజ క్రైస్తవులైతే మిమ్మును హింసిస్తారు. ఇక్కడ లాస్ ఎంజిలాస్ తో అది మళ్ళీ మళ్ళీ జరగడం చూసాము. క్రీస్తు చెప్పాడు:

"తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, మరియు స్నేహితుల చేతను మీరు అప్పగించబడుదురు... నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడుదురు" (లూకా 21:16-17).

చాలామంది తల్లిదండ్రులు స్నేహితులు వాస్తవంగా మిమ్ములను ద్వేషిస్తారని నిజ క్రైస్తవుడు అయినందుకు అని క్రీస్తు చెప్పాడు. నవ్వకండి. ప్రపంచమంతటా ఇది నిజము. ముస్లీములు మనలను ద్వేషిస్తారు, మనలను చంపుతారు, జైలులో పెడతారు.

మొదటిది, ఈ సంఘానికి వచ్చి రక్షింపబడకుండా వారు సకల విధాలుగా ప్రయత్నిస్తారు. కాని మీరు గుడికి వస్తూ రక్షింపబడితే, వారు మీపై తిరుగబడి ద్వేషిస్తారు. మిమ్ములను ఆపలేరని తెలిసినప్పుడు, చాలా నెలల తరువాత అలా చేస్తారు.

కాని వెల లెక్కించుడి! మీరు నిజ క్రైస్తవులైతే కొందరు ఇష్టపడరు! వారు మీకు వ్యతిరేకంగా వస్తారు! ఈ చీకటి కాలములో నిజ క్రైస్తవుడవడంకు చాలా వెల చెల్లించాలి. మనము అంత్య దినములలో ఉన్నమనడానికి ఇది ఒక సూచన.

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.

మీరు సిద్ధమేనా?

VI. చివరగా, మనము అంతమునకు సమీపము అని చెప్పడానికి క్రీస్తు మనకు ఆరవ సూచన ఇచ్చాడు. నేను దానిని "మానసిక సూచన" అని పిలుస్తాను.

క్రీస్తు చెప్పాడు:

"మీ హృదయములు (చెల్లించుట) వలన, ఒకవేళ తిండి వలనను మత్తు వలనను (బరువు తగ్గిన, లేక తగ్గిపోయిన)... (వారిని) (ఐహిక విచారముల వలనను) జీవితము, ఆ దినము ఆకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును" (లూకా 21:34-35).

కొన్నిసార్లు గుడికి వచ్చిన ఒక యవనస్తుడు అన్నాడు, "నేను వచ్చే ఆదివారము రాలేను. నేను నా పిన్నికి సహాయము చేయాలి." ఆయనకు ఆరు రోజులున్నాయి, కాని ఆదివారము ఉదయమే "ఆపని" వచ్చింది. జీవిత సమస్యలతో సతమతమవుచున్నాడు. ఈనాడు ప్రజలు అవివేకపు కారణాలతో గుడికి రావడం మానేస్తున్నారు. జీవిత సమస్యలతో సతమతమవుచున్నారు. దేవుని తీర్పు దినము అకస్మాత్తుగా వారిపైకి వచ్చును – అనుకొనని సమయములో, అంతము వచ్చును!

జీవితమూ తుపాకులు యుద్ధముతో నిండుకుంది,
   ప్రతి ఒక్కరు నేలపై పడిపోయారు.
మనమందరము సిద్ధమని నేను ఆశిస్తున్నాను.

మీరు సిద్దమేనా?

మీరు మత్తు పదార్ధాలు లైంగిక క్రియలు మానవచ్చు, కాని కుటుంబ సమస్యలతో మందముగా ఉండవచ్చును. చాలా సంవత్సరాలుగా యవ్వన జంటల మధ్య అది జరగడం నేను చూసాను.

మరియు అప్పుడు యేసు చెప్పాడు:

"కాబట్టి మీరు జరగబోవు, వీటినెల్లను తప్పించుకొని, మనష్యుకుమారుని యెదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడును, ప్రార్ధన చేయుచు మెలకువగా ఉండునని చెప్పెను" (లూకా 21:36).

యుగాంతమునకు రాబోవు తీర్పుకు సిద్ధంగా ఉండడానికి ఇది మీరు చేయాలి. మూడు విషయాలు మీరు చెయ్యాలి:

(1) గుడికి రండి. అది చెయ్యకపోతే ఏదీ మీకు సహాయ పడదు.

(2) క్రీస్తు నొద్దకు రండి. మీ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. ఆయన శారీరకంగా వాస్తవంగా మృతులలో నుండి లేచాడు. ప్రస్తుతము దేవుని కుడి పార్శ్వమున ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన మీ కొరకు ఉన్నాడు. ఆయన వద్దకు రండి. యేసును నమ్మి రక్షించబడండి!

(3) ఈ గుడికి రావడం మాత్రమే కాకుండా, క్రీస్తు నొద్దకు వచ్చుట మాత్రమే కాకుండా, మీరు ప్రార్ధన కూడ చెయ్యాలి. ప్రార్ధన జయవంత క్రైస్తవ జీవితానికి ఈ అంత్య దినాలలో మూలమని యేసు చెప్పాడు.


రాబోవు తీర్పును మీరు ఎలా తప్పించుకుంటారు? బైబిలు చెప్తుంది, "[క్రీస్తు] మ్రానుపై ఆయన శరీరములో మన పాపములు భరించాడు" –సిలువపై. క్రీస్తు మీకు ప్రత్యామ్నాయము. మీ స్థానములో ఆయన శిక్షించబడ్డాడు, సిలువపై పాప ప్రాయశ్చిత్తము చెల్లించడం ద్వారా! క్రీస్తు తన ప్రశస్త రక్తాన్ని సిలువపై కార్చాడు. ఆయన రక్తము మీ పాపమునంతటిని కడిగివేయును – అంతము వచ్చునప్పుడు మీరు సిద్ధముగా ఉండవచ్చు! మీరు ఈ రాత్రి యేసు క్రీస్తును విశ్వసించాలని అడుగుచున్నాను! చార్లెస్ వెస్లీ అన్నాడు,

నన్ను దాచుము, ఓ నా రక్షకా, దాచుము,
   జీవిత తుఫానులు పోయే వరకు;
ఆశ్రిత నడిపింపులో భద్రముగా,
   ఓ చివరిలో నా ఆత్మను స్వీకరించుము!

సువార్త పాట చెప్తుంది,

ఈనాడు ప్రపంచానికి యేసు సమాధానము,
ఆయన పైన ఎవరు లేరు, యేసే మార్గము!

ఈరాత్రి యేసును విశ్వసించుడి ఆయన మిమ్మును రక్షిస్తాడు! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మనమందరము సిద్ధంగా ఉండాలని నా ఆశ" (లార్రీ నొర్మాన్ చే, 1947-2008).
“I Wish We’d All Been Ready” (by Larry Norman, 1947-2008).



ద అవుట్ లైన్ ఆఫ్

అంత్యదినములకు సూచనలు

SIGNS OF THE LAST DAYS

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే,
by Dr. R. L. Hymers, Jr.

"అపహాసకులు అపహసించుచు వచ్చి, అంత్య దినములలో, తమ స్వకీయ దురాశల చేత నడుచు కొందురు" (II పేతురు 3:3).

I.    మొదటిది, అంతము సమీపము అన్ని చెప్పడానికి జీవావరణ సూచనలు ఉన్నాయి, లూకా 21:11, 25-26.

II.   కాని రెండవదిగా, అంతము సమీపము అని చెప్పడానికి జాతిపర సూచనలు ఉన్నాయి, లూకా 21:10.

III.  మూడవదిగా, అంతము సమీపము అని చెప్పడానికి, మన చుట్టూ వ్యతిరేక సూచనలు ఉన్నాయి, లూకా 21:20; రోమా 11:28; జేకర్యా 12:3.

IV.  నాల్గవదిగా, మతపర సూచనలు ఉన్నాయి – అబద్ధపు మతముతో మోసగించే సూచనలు, అంతము సమీపమని ఇది చూపిస్తుంది, లూకా 21:8;
మత్తయి 24:24; II తిమోతి 4:2-3.

V.   ఐదవదిగా, అంతము సమీపము అనడానికి, మత సంబందిత చిత్రహింస సూచనలు ఉన్నాయి, లూకా 21:12, 16-17.

VI.  ఆరవది, నేను దానిని "మానసిక సూచన" అని పిలుస్తాను, మనము అంతమునకు సమీపముగా ఉన్నది, లూకా 21:34-36.