ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆదిమ సంఘాలలో సువార్త సేవEVANGELISM IN THE EARLY CHURCHES డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే, "ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు" (మార్కు 6:7). |
ఈ పన్నెండు మంది యేసుతో కొన్ని వారాల నుండి ఉన్నారు. కాని నేరుగా వారిని భోదించడానికి ఇద్దరిద్దరినిగా పంపాడు (మార్కు 6:12). యేసు వారిని పిలిచేటప్పుడు, "భోదించడానికి వారిని పంపడానికి" అలా చేసాడు (మార్కు 3:14). మీకు తెలుసు తప్పక వీరు అంతగా ఆత్మీయంగా లేరు. మీకు తెలుసు తప్పకుండా యూదా మారలేదు, తోమా సువార్తను ఇంకా నమ్మలేదు, యేసు సిలువకు వెళ్ళకుండా పేతురు ఆపుతాడు అని. అయినను క్రీస్తు ఒక్కసారిగా వారిని సువార్త పనికి పంపాడు! యేసు పేతురు ఆంద్రియులకు మొట్టమొదటిగా చెప్పిన మాట, "మీరు నన్ను వెంబడించుడి, నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులనుగా చేయుదును. వారు వెంటనే వారి వలను విడిచి పెట్టి, ఆయనను వెంబడించురి" (మత్తయి 4:19-20). మళ్ళీ, సంవత్సరము తరువాత, క్రీస్తు తన అనుచరుల్లో డబ్భై మందిని పిలిచి, "తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని, తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను" (లూకా 10:1). దయచేసి లూకా 10 లో ఉన్న ఆ భాగాన్ని చూడండి. వచనాలు 1 నుండి 3 వరకు నేను చదువుచుండగా నిలబడండి. "అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటకిని, తన కంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కాని పడువారు కొద్ది మందియే: కాబట్టి కోత యజమానుని తన కోతకు, పని వారిని పంపుడని వేడుకొనుడి. మీరు వెళ్ళుడి: ఇదిగో, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను" (లూకా 10:1-3). కూర్చోండి. సువార్త పనికి ఇద్దరిద్దరిని పంపడం క్రీస్తు పద్దతి. ఇప్పుడు సరిగా అదే మనము చెయ్యాలి. గమనించండి వీరు అనామకులు, పిల్ల క్రైస్తవులు, కాని ఆయన వారిని అలాగే పంపాడు. వారిని పంపేముందు సంవత్సరాలుగా బైబిలు వారికి బోధించలేదు. లేదు! ఆయన వారితో అన్నాడు, "మీరు వెళ్ళుడి: ఇదిగో, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను" (లూకా 10:3). గమనించండి ఈ అనుభవము లేని యవన అనుచరులకు ఎలా ప్రార్దించాలో క్రీస్తు వారికి చెప్పాడు. వారికి ఏమని ప్రార్దించాలో రెండవ వచనములో చెప్పాడు, "కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి" (లూకా 10:2). ఆయన ఈ అనుభవము లేని డబ్భై మంది యవ్వన అనుచరులకు కోతకొరకు చాలామందిని పంపమని దేవునికి ప్రార్ధించమని చెప్పాడు! డాక్టర్ జాన్ ఆర్. రైస్ తన కదిలించే పాటలో ఇది బాగా చెప్పాడు. అది పాటల కాగితములో 4 వ పాట. నిలబడి పాడండి! మనము కోతనిచ్చే ప్రభువుకు ప్రార్ధించాలి, రెండవ శతాభ్దములో గొప్ప వేదాంతి ఓరిజేన్ అన్నాడు, "క్రైస్తవులు వారి శక్తితో అన్ని చేస్తారు ప్రపంచమంతటా విశ్వాసాన్ని విస్తరింపచేయడానికి." ఆయన ఈలోక పరిచర్య ముగింపులో, క్రీస్తు అన్నాడు, "పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి, మీరు వెళ్లి సమస్త జనులను, శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చును: నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలేలని వారికి బోధించుడి: మరియు, ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. ఆమెన్" (మత్తయి 28:18-20). మార్కు చివరిలో క్రీస్తు చెప్పాడు, "మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి" (మార్కు 16:15). లూకా చివరిలో క్రీస్తు చెప్పాడు, "...యేరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు, వ్రాయబడి యున్నది" (లూకా 24:47). యోహాను సువార్త ఆఖరిలో క్రీస్తు చెప్పాడు, "తండ్రి నన్ను పంపిన ప్రకారము, నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను" (యోహాను 20:21). ఆయన పరలోకమునకు ఆరోహణము అయ్యేముందు క్రీస్తు చివరి మాటలు, "మీరు యేరూషలేమును, యూదా, మరియు సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుండురని వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 1:8). ఒకప్పుడు ఒక వ్యక్తి తన గుడిని చీలిక చేసి ఇలా అన్నాడు ఈ ఆజ్ఞలు అపోస్తలులకు మాత్రమే, ఈనాడు క్రైస్తవులు వాటిని గైకొన అవసరము లేదని చెప్పాడు. అతడు కాల్వినిజము వస్త్రాలు ధరించి ప్రజలు గుడిని విడిచి తనను వెంబడించాలని చెప్పాడు. కాని దాని నుండి ఏమి రాలేదు, ఎందుకంటే యేసు మాటలు ఇటు అటు చేసి అవిధేయులైన వారికి ఆశీర్వాదాలు ఉండవు. స్పర్జన్ ఐదు శాతము కాల్వినిస్టు, కాని అత్యుత్సహుడు కాదు. వారిద్దరి మధ్య, తేడా ఉంది. స్పర్జన్ అన్నాడు, ఓ! రక్షకుడు తన సంఘముతో ఈ మాటలు చెప్తున్నాడు; క్రీస్తు మాటలు సజీవపు మాటలు, నిన్ననే కాదు, నేడు కూడ శక్తి గలిగినవి. [ఆజ్ఞలు] రక్షకునివి నిరంతరము కొనసాగేవి: అవి అపోస్తలులకు మాత్రమే కాదు, కాని మనకు, ప్రతి క్రైస్తవునికి వర్తిస్తాయి, "కనుక, మీరు సర్వలోకమునకు వెళ్లి, సువార్తను ప్రకటించి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మము ఇయ్యుడి." గొర్రెపిల్ల అనుచరులమైన మనము మినహాయింపుకాదు; మన ఆజ్ఞలు అలాగే ఉన్నాయి, వారి వలే మన నుండి కూడ మన నావికుడు విధేయత కోరుచున్నాడు (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1986 reprint, volume VII, p. 281). డాక్టర్ జాన్ ఆర్. రైస్ తో పాటు మనమందరము చెప్పుదాం, నేనిక్కడ ఉన్నాను! నేనిక్కడ ఉన్నాను! నన్ను పంపుము, ఓ పంట నిచ్చు ప్రభువా, గొప్ప భోజనవిందు ఉపమానములో యేసు చెప్పాడు, "నా ఇల్లు నిండునట్లు, నీవు రాజ మార్గములోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు, అక్కడ వారిని బలవంతము చేయును" (లూకా 14:23). వివాహి విందు ఉపమానములో యేసు చెప్పాడు, "గనుక రాజ మార్గములకు పోయి, మీకు కనబడు వారినందరిని, పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను" (మత్తయి 22:9). యేసు యేరూషలేములో స్థాపించిన స్థానిక సంఘము ఆయన ఆజ్ఞ సువార్తను ప్రకటించడంలో పాటించింది. పెంతేకొస్తు తరువాత కొన్ని వారాలలోగా ప్రధానయాజకుడు ఇలా ఫిర్యాదు చేసాడు "మీరు యేరూషలేమును మీ బోధతో నింపితిరి" (అపోస్తలుల కార్యములు 5:28). అపోస్తలుల కార్యములు 5:42 లో మనకు చెప్పబడింది, "ప్రతి దినము దేవాలయములోను, ఇంటింటిని మానక బోధించుచు, యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి." అపోస్తలుల కార్యములు 6:1 లో మనము ఇలా చుదువుతాం, "శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను." తరువాత, అపోస్తలుల కార్యములు 12:24 లో మనము ఇలా చదువుతాం, "దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను." డాక్టర్ జాన్ ఆర్. రైస్ చెప్పాడు, సమరయలో, పరిచారకుడు ఫిలిప్ బోధించడానికి వెళ్ళినప్పుడు మాకు చెప్పబడింది, అపోస్తలుల కార్యములు 8:6, "అతడు చెప్పిన మాటల యందు ప్రజలు ఏక మనస్సులో లక్ష్య ముంచిరి..." తరువాత 12 వ వచనములో, "అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు, సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి, పురుషులను, స్త్రీలను బాప్తిస్మము పొందిరి." నూతన నిబంధన సంఘాలలో ఇలాంటి అద్భుత శక్తి తరంగము ద్వారా ప్రజలు రక్షించబడ్డారు. డాక్టర్ రైస్ ఇంకా ఇలా అన్నాడు, "శ్రమలున్నను, అన్యుల మధ్య, గుడ్డి వారి మధ్య, వారు జన సమూహాన్ని సంపాదించారు... నూతన నిబంధన సంఘముల ఎదుగుదలను మనము గ్రహింపలేము. వర్ణాక్, తన పుస్తకము ప్రొటెస్టెంట్ మిషన్ చరిత్రలో అన్నాడు, మొదటి శతాబ్దము చివరకు [అరవై ఏడు] సంవత్సరాలకు పెంతేకొస్తు తరువాత, 200,000 క్రైస్తవులు ఉండేవారు. మూడవ శతాబ్దపు చివరికి [8,000,000] మంది క్రైస్తవులు ఉండేవారు భయంకర శ్రమలు ఉన్నాను వేలమంది [మరి] హత సాక్షులు అయినను. వారు రోమా సామ్రాజ్యంలో 15 వ వంతు! [అనగా, 15 మందిలో ఒకరు క్రైస్తవుడు]...రోమా సామ్రాజ్యమంతటా చిత్ర హింసలున్నప్పటికి. యేరూషలేములో స్తెపెను యాకోబు హత సాక్ష్యులయ్యారు, ఇతరులు హింసింపబడ్డారు, ‘మరణము వరకు, పురుషులు స్త్రీలు బంధింపబడి చెరసాలలో వేయబడ్డాము’ (అపోస్తలుల కార్యములు 22:4), పౌలు చెరసాలలో వేయబడి హత్య ప్రయత్నము చేయబడ్డాడు, యూదులలో వేలమంది చంపబడ్డారు. నీరో చక్రవర్తి పౌలును, ఇతరులను చంపించాడు; హడ్రియన్ క్రింద చిత్ర హింస జరిగింది పియ, మార్కస్ అరెలియస్ మరియు సెప్టిమాస్ సేవేరస్ క్రింద శ్రమలు కొనసాగాయి, అయినను సువార్త సేవ అగ్ని కొనసాగింది. వర్క్ మెన్ ఇలా చెప్పాడు, రెండు వందల సంవత్సరాలకు, క్రైస్తవుడు అవడం అనగా గొప్ప పునరుద్ధరణ, తృణీకరింపబడి హింసింప బడిన తెగ కలుపబడడం, కెరటానికి ఎదురగా ఈదడం సామ్రాజ్య అధికారము క్రిందకు రావడం, చెరసాల పాలవడం, భయంకర మరణము చూడడము. రెండు వందల సంవత్సరములు క్రీస్తును వెంబడించు వాడు వెల లెక్కగట్టాలి, చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి... స్వతంత్రము జీవితమూ విషయములో. రెండు వందల సంవత్సరాల పాటు క్రైస్తవ్యము మాట పలకడమే ఒక నేరము" (రైస్, ఐబిఐడి., పేజీలు 27-28). డాక్టర్ రైస్ చెప్పాడు, "ప్రతికూల పరిస్థితులలో, ద్వేషములలో, చిత్రహింస ‘మూయబడిన ద్వారముల,’ మధ్య నూతన నిబంధన క్రైస్తవులు వారి అద్భుత ఆత్మలను సంపాదించే పనిని కొనసాగించారు. మన సంఘాల ఆత్మల సంపాదనను నూతన నిబంధన బోధలకు సాధనకు ఎలా పోల్చి చూడవచ్చు?" (రైస్, ఐబిఐడి.). "నూతన నిబంధన సంఘాలకు నూతన నిబంధన క్రైస్తవులకు పోలిస్తే, మన ప్రస్తుత సంఘాలు క్రైస్తవ ప్రజలు భయంకరముగా అవమానకరముగా విఫలులవుతారు" (రైస్. ఐబిఐడి., పేజీ 29). మళ్ళీ, డాక్టర్ రైస్ అన్నాడు, "కేవలము భయంకర కృషి నూతన నిబంధన ఆత్మల సంపాదనకు చాలా అవసరము...మన శారీరక స్వభావాల ద్వారా విధేయత కోల్పోయే అవకాశము ఉంది, ఉత్సాహ స్థితి నుండి నులి వెచ్చని స్థితికి పడిపోవచ్చు, దేవుని పనిని హృదయ పూర్వకంగా చేయకపోవడం. గొప్ప పాత పాట ఇలా చెప్తుంది, తిరుగులాడుటకు సన్నద్ధుడును, ప్రభూ, నాకలా అనిపిస్తుంది, అలా సంఘాలలో ఉజ్జీవ తృష్ణకు, ఆత్మల సంపాదనా కనికర ఉజ్జీవము, దేవుని శక్తి మనపై ఉండే ఉజ్జీవముల అవసరత ఎంతైనా ఉంది. నూతన నిబంధన పద్దతిలోనే తప్ప వేరే విధాలుగా మన సంఘము ఆత్మలను సంపాదించలేదు" (రైస్, ఐబిఐడి., పేజీ 149-150). కొంతమంది అంటారు డాక్టర్ రైస్ ప్రతి ఒక్కరు సువార్త పని చెయ్యాలి అని నొక్కి చెప్పడం "పనిచేయదు" అని అంటుంటారు. కనుక కొందరు అత్యుత్సాహ కేల్వినిజం వైపు మరిలారు – ఐదు అంశాల కేల్వినిజం కాదు – కాని అత్యుత్సాహ కేల్వినిజం, అంటే నశించు వారి వెంట మీరు వెళ్లనక్కరలేదు; దేవుడు క్రైస్తవులు సువార్త పని చేయకుండానే ఆయనే తన అత్యంత కృపతో వారిని తీసుకొని వస్తాడు. జార్జి వైట్ ఫీల్డ్, విలియమ్ కెరీ, స్పర్జన్ మరియు ఇతర గొప్ప ఆత్మల సంపాదకులు ఐదు అంశాల కేల్వినిష్టులు, కాని వారు అత్యుత్సాహ కెల్వినిష్టులు కారు. వారు నమ్మారు మనమందరము "సువార్తికుని పని చెయ్యాలి" (II తిమోతి 4:5). నా ఆశ ప్రతి సంస్కరింపబడిన కాపరి చదవాలి, స్పర్జన్ మరియు అత్యుత్సాహ కేల్వినిజము, రెవరెండ్ అయాన్ హెచ్. ముర్రేచే (బేనర్ ఆఫ్ ట్రూత్ ట్రస్టు, 1995). కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. అది అద్భుత పుస్తకము మిమ్మును పురికొల్పుతుంది, మీ హృదయాన్ని ఆదరిస్తుంది, నశించు వారిని రక్షించడానికి మీలో ఉత్సాహాము నింపుతుంది! డాక్టర్ రైస్ క్రైస్తవ ప్రజలు సువార్త పనిలో వారి హృదయాలు మనసులు పెట్టాలి అని చెప్పడంలో తప్పు చెయ్యలేదు. బలహీనత ఎందుకు వచ్చిందంటే ఆయనను వెంబడించిన చాలా సంఘాలు లోపలికి వచ్చిన నశించిన వారితో ఎక్కువ సమయము గడపలేదు. "త్వరపడే ప్రార్ధన" ప్రజలతో చేయించారు వారు పశ్చాత్తాప పడ్డారో లేదో చూడకుండా, వారికి బాప్తిస్మము ఇచ్చేముందు, క్రీస్తు యేసులో వారు నిజ మార్పు అనుభవించారో లేదో చూడలేదు. డాక్టర్ కాగన్ నేను కలిసి "నిర్ణయత్వము" సమస్యపై ఒక పుస్తకము వ్రాసాము దానిని మీరు ఇక్కడ క్లిక్ చెయ్యడం ద్వారా ఉచిత్రముగా చదవవచ్చు, నేటి స్వధర్మత: ఎలా నిర్వయత్వము మన సంఘాలను ద్వంసము చేస్తుంది. నీళ్ళ తొట్టె నుండి శిశువును పారవేయకండి! డాక్టర్ జాన్ ఆర్. రైస్ నుండి నేను ఇచ్చిన ప్రశ్నలకు నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మనము ఆదిమ సంఘాల సువార్త పని ఆ శక్తిని పునఃపరిశీలించి, వారి మాదిరి అనుకరించాలి! నశించు వారిని సువార్తీకరించడంలో మనము కష్టపడాలి! మనము వారికి బాప్తిస్మము ఇచ్చేముందు వారు నిజంగా మారారా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి! అన్నింటికంటే, మనము క్రీస్తు ఆజ్ఞను గుర్తుంచుకోవాలి, "నా ఇళ్ళు నిండునట్లు, నీవు రాజ మార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు, అక్కడ వారిని బలవంతము చేయుము" (లూకా 14:23). రెండవ శతాబ్దములో ఓరిజాన్ అన్నాడు, "ప్రపంచమంతట విశ్వాసమును విస్తరింపచేయడానికి క్రైస్తవులు వారి శక్తినంతా ఉపయోగించారు." అదే మనం చేద్దాం! లేచి నిలబడి డాక్టర్ ఓస్వాల్డ్ జే. స్మిత్ గొప్ప పాట పాడుదాం – "సువార్తీకరించుట! సువార్తీకరించుట!" పాటల కాగితంలో మొదటిది. ఈ ఘడియకు ఒక వాక్కు నిమ్ము, ఆవేశ పరచు మాట, శక్తితో కూడిన మాట, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |