ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మంగళవారము నాటి మన ఉపవాస దినముపై తెలుసుకొనుటNOTES ON OUR FAST-DAY ON TUESDAY డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే, లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము "ఉపవాసము చేయుచున్నట్టు, ఇతరులకు మనష్యులకు కనబడవలెనని కాక, రహస్య మందున్న నీ తండ్రికే కనబడవలెనని; నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీతల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము: అప్పుడు రహస్య మందు చూచుచున్న, నీ తండ్రి, నీకు ప్రతి ఫలమిచ్చును" (మత్తయి 6:17, 18). |
గమనించండి "మీరు ఉపవాసము చేస్తే" అని, యేసు చెప్పలేదు. లేదు, ఆయన అన్నాడు, "మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు." ఈనాడు మత సంబంధము లేని ప్రజలకు ఉపవాసము విచిత్రముగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అత్యుత్సాహముతో ఉన్న తల్లి అనుకోవచ్చు మీకు తినకుండా ఒకరోజు ఉంటే మీరు ఆకలితో చనిపోతారని. మీ తల్లితో అబద్ధము చెప్పకండి. భోజనము చెయ్యడం లేదని ఆమెతో చెప్పండి. ప్రతి ఒక్కరు ఉపవసించనక్కర లేదు. మీకు శారీరక సమస్య ఉంటే ఒక దినము ఉపవాసము ప్రారంభించే ముందు మీరు వైద్యుని సంప్రదించాలి. మన సంఘములో, మీరు డాక్టర్ జుడిత్ కాగన్ ను గాని, లేక డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్ ను గాని కలవవచ్చు. లేక ఫోను చెయ్యవచ్చును. డాక్టర్ జుడిత్ కాగన్ సెల్ నంబర్ (213)324-3231. డాక్టర్ చాన్ సెల్ నంబర్ (323)819-5153. మీకు మదుమేహము కాని అధిక రక్తపోటు గాని, ఇంకా ఏదైనా ఉంటే, మీరు తప్పక డాక్టర్ జుడిత్ కాగన్ ను గాని లేక డాక్టర్ చాన్ ను గాని, ఈ ఆరాధన తరువాత సంప్రదించాలి. ఉపవసించవద్దని వారు చెబితే, మేము మంగళవారము ఉపవసించేటప్పుడు మీరు ఎక్కువ సమయము ప్రార్ధనలో గడపవచ్చు. ఉపవాసము లేకుండా ఆరోజు మాతో ప్రార్ధనలో చేరవచ్చు. ఆగష్టు 14, మంగళవారము, మన సంఘములో ఒక దినము ఉపవాస ప్రార్ధన ఉంటుంది. మీరెవ్వరు ఉపవసించనక్కర లేదు. మీరు ఉపవసిస్తున్నారా అని ఎవ్వరు మిమ్మును తనిఖీ చెయ్యరు. మీరు మాతో ఉపవసించడము పూర్తిగా ఐశ్చికము. చేయాలనుకుంటే చెయ్యండి. వద్దనుకుంటే వద్దు. ఇప్పుడు మొదటిసారిగా చాల నెలలుగా ఉపవాస దినము ఆచరిస్తున్నాము. లిబర్టీ విశ్వవిధ్యాలయము సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్మెర్ ఎల్. టౌన్స్, ఉపవాసపు అవసరత నాకు జ్ఞాపకము చేసాడు. డాక్టర్ టౌన్ పుస్తకము, ఉపవాసమునకు ప్రారంభికుల మార్గ నిర్దేశము, బెతానీ హౌస్ పబ్లిషర్స్, 2001 నుండి తలంపులు వ్యాఖ్యానాలు తీసుకొని ఈ ప్రసంగములో చెప్తున్నాను. అది మంచి పుస్తకము. మీకు ఒక పుస్తకము కావాలంటే, అమెజాన్.కామ్ (Amazon.com) నుండి పొందవచ్చు. డాక్టర్ టౌన్ పుస్తకములో చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. మనం ఒక రోజు ఉపవాసము చేస్తాం, దానిని అతడు "యోమ్ కిప్పర్ ఉపవాసము" అని పిలుస్తాడు. ఇది ఒక దినము ఉపవాసము యూదా విశ్వాసులు అభ్యసించేవారు (లేవియా కాండము 16:29). ఈరోజు, క్రైస్తవులు ఉపవాసము చేయనవసరము లేదు – కాని మనము ఉపవసించడానికి అనుమతించబడ్డాము. యేసు చెప్పాడు, "మీరు ఉపవాసము చేయునప్పుడు" (మత్తయి 6:16) ఎందుకంటే మన గుణశీలతను విశ్వాసమును నిర్మించడానికి ఉపవాసము ఒక క్రమశిక్షణ. మీరు ఎన్నడు ఉపవసించనిచో ఒక దినము భోజనము చేయకుండా ఉండాలనే తలంపు మిమ్ములను భయపెడుతుంది. ఉపవాసము మిమ్ములను గాయపరచుచు బరువు కూడ తగ్గుతుంది. ఒక రోజు ఉపవాసము సామాన్య వ్యక్తిని గాయపరచుము – డాక్టర్ జుడిత్ కాగన్ లేక డాక్టర్ చాన్ లాంటి వైద్యులు "సరే" అంటే. మంగళవారము మీ మొదటి రోజు ఉపవాసమునకు ఒకరోజు "యోమ్ కిప్పూర్ ఉపవాసము" శ్రేష్టమైన మార్గము. మీరు ఉపవసించనక్కర లేదు. ఒక ఆత్మీయ క్రమశిక్షణగా మీరు ఐచ్చికంగా చెయ్యవచ్చు. ఇతరులు ఏమి అనుకుంటారా అని చింత పడవద్దు, ఎందుకంటే మీ ఉపవాసము దేవునికి మీకు మధ్య వ్యక్తిగత ఒప్పందము. దేవుని కొరకు ప్రార్ధనా యోధునిగా మారడంలో ఉపవాసము సహాయ పడుతుంది. మంగళవారము మీరు ఉపవసించేటప్పుడు, తిరస్కృతి ఊహించండి. సాతాను మిమ్ములను వ్యతిరేకిస్తుంది. మీరు ఇతరుల రక్షణ నిమిత్తము లేక మీ సంఘము కొరకు ప్రార్ధిస్తే, సాతాను వ్యతిరేకిస్తుంది. ఉపవాసము అంత సులువు కాదు. కనుక ఉపవాసమనే సాహసము చేస్తున్నప్పుడు అది కష్టమని ఎరిగి చెయ్యండి. కాని బహుమానాలు తగ్గట్టుగా ఉంటాయి! ఒకరోజు యోమ్ కిప్పురు ఉపవాసము అంటే బైబిలులో సూర్యాస్తమయము నుండి సూర్యాస్తమయము వరకు. మీరు ఒకరోజు మాతో ఉపవాసము చెయ్యాలనుకుంటే మీరు (సాయంకాలము 8:30) కు ముందు అల్పాహారము తీసుకోవాలి. ఒక అరటి పండు కాని ఒక పాత్రలో బియ్యము కాని తినాలి. మరునాడు ఉదయము అల్పాహారము కాని భోజనము కాని తినవద్దు. మంగళవారము సూర్యాస్తమయము తరువాత గుడిలో మేము మీకు భోజనము ఇస్తాము. మీరు ఒక అరటి పండు కాని, అల్పాహారము కాని తీసుకొని, మంగళవారము సాయంకాలము మీరు గుడికి 7:00 గంటలకు రావచ్చు. మీరు ఇక్కడకు వచ్చినప్పుడు మీకు రాగి జావగాని రొట్టె గాని ఇస్తాము. కొన్ని ప్రార్ధనలు చేస్తాము, ఉపవాస ప్రార్ధనను గూర్చి సాక్ష్యము చెప్పడానికి మీకు అవకాశము ఇస్తాము, తరువాత చిన్న ప్రసంగము భోదిస్తాను. మీరు మంగళవారము ఉపవాసము ఉండి ప్రార్ధించునప్పుడు, మీరు ఒక ఉద్దేశము కలిగి యుండాలి. ఈరోజు ఉపవాస ప్రార్ధన ఉద్దేశము దేవుని అడగడానికి శనివారము సాయంకాలము ఆటల ప్రణాళిక పురుషుల కొరకు ఇతరులను మన సంఘమునకు తీసుకొని రావడం. దేవుడు ఆటలను ఆశీర్వదించకపోతే ఎవరు మన గుడిలోనికి రారు, ఆటలను ఇంకొక కార్య కలాపముగా ఉండిపోతాయి, సంఘ "యంత్రాంగము"లో ఒక భాగము మాత్రమే ఉంటాయి, ఫలము ఉత్పత్తి చేయని కార్యకలాపముగా ఉండిపోతుంది. మనకు ఇంకొక ఉపవాసపు రోజు ఉంది మన స్త్రీల కొత్త కార్యక్రమాల నిమిత్తము. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, పురుషులను స్త్రీలను, ఉపవాసము ఉండి ప్రార్ధించమని మంగళవారము దేవునికి, శనివారము సాయంత్రపు ఆటలు కొత్తవారిని మన సంఘమునకు నడిపించేటట్టు. వేరే విషయాల కొరకు కూడ ప్రార్ధించవచ్చు – కాని ఈ ఉపవాసము ముఖ్య ఉద్దేశము దేవుడు శనివారము ఆటలను కొత్త పురుషులను సంఘమునకు రప్పించేటట్టు. దానిపై మీ ప్రార్ధనలు ఉద్దేశము ఉండేటట్టు చూడండి – దేవుడు మనష్యులకు సహాయము చేయునట్లు వారు ఆటలకు వచ్చి ఆదివారము ఆరాధనకు వచ్చేటట్టు. ఆ ఉద్దేశము కొరకు ఉపవాసము ఉండి ప్రార్ధించండి. ఆ ఉద్దేశము నిమిత్తమే స్త్రీలు కూడ ఉపవాసము ఉండాలి. గుర్తించుకోండి సోమవారము సాయంకాలము ఉపవాసము అల్పాహారముతో ప్రారంభించి, మంగళవారము ఉదయము అల్పాహారము మధ్యాహ్న భోజనము ఆపేయండి. సాయంకాలము ఏదైనా తిని, గుడికి మంగళవారము సాయంత్రము 7:00 గంటలకు రండి, మనమందరము కలిసి రాగి జావతోనో రొట్టెతోనో ఉపవాసము ముగిద్దాం. "మీరు ఉపవాసము చేయునప్పుడు"... దీని అర్ధము యేసు ఉపవాసాన్ని ఆమోదించాడు. క్రైస్తవులు పరిశుద్ధాత్మ నుండి నడిపింపు శక్తి పొందుకోవడానికి ఉపవాసము చెయ్యాలి. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "నాకు తెలుసు నిజ ఉపవాసము... దేవుడికి ఇవ్వవలసిన ఆశీర్వాదము మనకు ఇస్తుంది." స్పర్జన్ అన్నాడు, "మనము క్రైస్తవ సంఘములో ఉపవాసము మానివేయుట ద్వారా గొప్ప ఆశీర్వాదము కోల్పోయాము." డాక్టర్ ఆర్. ఏ. టోరీ అన్నాడు, "శక్తితో ప్రార్ధించేటప్పుడు, ఉపవాసముతో ప్రార్ధించగలగాలి." గొప్ప సువార్తికుడు జాన్ వెస్లీ అన్నాడు, "మీకు ఉపవాస ప్రార్ధన దినాలు ఉన్నాయా? కృపా సింహాసనాన్ని సంధించండి… కృప దిగి వస్తుంది." నా చైనీయ కాపరి, డాక్టర్ తిమోతి లిన్ అన్నాడు, "మన ఆత్మీయ చైతన్యము తరుచు మనము ఉపవాస ముండి ప్రార్ధించిన వెంటనే తెరుచుకుంటుంది...ఇది నా స్వంత అనుభవముతో చెప్తున్నాను." ఈ రాత్రి ఈ ప్రసంగ ప్రతిని మీతోపాటు ఇంటికి తీసుకెళ్ళండి. సాయంకాలము అల్పాహారముతో మీరు ఉపవాసము ప్రారంభించదానికి ఈ ప్రసంగము రేపు చదవండి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి మీరు సోమవారము రాత్రి నుండి మంగళవారము సాయంకాలము వరకు ఉపవాసము చేసేటప్పుడు: 1. మీరు రహస్యంగా ఉపవాసము చెయ్యండి (సాధ్యమైనంత వరకు). మీరు ఉపవాసము ఉన్నట్టు అందరికి చెప్పుకోకండి. 2. మంగళవారము ఉపవాసము సమయంలో యెషయా 58:6 కంఠస్తము చేయండి. "ఇది నేను ఎంచుకున్న ఉపవాసము కదా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతికాడిని విరుగగొట్టుటయు, నేర్పరచుకొనిన ఉపవాసము గదా?" (యెషయా 58:6). 3. మత్తయి 7:7-11 జాగ్రత్తగా చాలా సార్లు చదవండి మంగళవారము ఉపవాసము చేసేటప్పుడు. "అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును: అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరకును; తట్టువానికి తీయబడును. మీలో ఏమనష్యుడైన, తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల, వానికి రాతి నిచ్చునా? చేపను అడిగిన యెడల, పామునిచ్చునా? మీరు, చెడ్డ వారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగి యుండగా, పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును?" (మత్తయి 7:7-11). 4. శనివారము, ఆగష్టు 18 న జరిగే బాస్కెట్ బాల్ ఆటకు మన పురుషులు చాలామంది యవనస్తులను తెచ్చేటట్టు ప్రార్ధించండి. 5. ఎక్కువ నీళ్ళు తాగండి, రెండు గంటలకొక 1 గ్లాసు చొప్పున. మీరు నల్ల కాఫీ కాని టి గాని త్రాగవచ్చు (క్రీమ్ గాని పంచదార గాని లేకుండా) ప్రతిరోజూ త్రాగే అలవాటు ఉంటే. మీకు "బాగా తేలికగా" అనిపిస్తే చల్లని స్ప్రైట్ గాని సెవెన్ అప్ గాని త్రాగవచ్చు (ఒకటి లేదా రెండు గ్లాసులు). శక్తివంత పానీయాలు త్రాగకండి! 6. మీ ఆరోగ్య విషయములో ఎలాంటి ప్రశ్నలున్నా, అధిక రక్తపోటు లేక మధుమేహము, లాంటివి డాక్టర్ జుడిత్ కాగన్ లేక డాక్టర్ క్రైటన్ చాన్ తో మాట్లాడండి ఉపవాసమునకు ముందు. వారి సెల్ నంబర్స్ ఈ ప్రసంగములో ఇంతకూ ముందు ఇవ్వబడ్డాయి. 7. సోమవారము సాయంకాలము ఒకటి ఏదైనా చిన్నది తిని మీ ఉపవాసము ప్రారంభించండి. మంగళవారము సాయంకాలము ఏదైనా తీసుకొని ఉపవాసము ముగించండి – తరువాత గుడికి రండి మంగళవారము రాత్రి 7:00 గంటలకు భోజనానికి. 8. వచ్చే శనివారము జరిగే బాస్కెట్ బాల్ కు మన పురుషులు ఎక్కువమందిని తీసుకొని వచ్చేలా మంగళవారము మీ ప్రార్ధనలో దృష్టి పెట్టండి. మీరు నాకు, డాక్టర్ హైమర్స్ ఫోను చెయ్యవచ్చును, (818)352-0452 ఏ సమయములోనైనా ఏదైనా మీకు సమస్య ఉంటే లేక శ్రీమతి హైమర్స్ కు ఫోను చెయ్యవచ్చును (818)645-7356 ఆమెకు చెప్పవచ్చును. విజయవంతమైన ఉపవాసము ప్రార్ధన సమయము మీకుండేటట్టు నేను ప్రార్ధన చేస్తుంటాను! ఇంకొక విషయము: మీరు పని చేస్తుంటే లేక పాఠశాలలో ఉంటే, మౌనముగా ఈ మానవుల విషయమై ప్రార్ధించండి. ఈ ప్రసంగము మీతో ఉంచుకోండి మంగళవారము తద్వారా మీరు తిరిగి గుర్తించుకోవలసిన 8 విషయాలు చదవవచ్చు (పైవి). దేవుడు మీ అందరిని దీవించును గాక! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ దయచేసి నిలబడి 4వ సంఖ్య పాట పాడండి, "ప్రార్ధించుట నాకు నేర్పుము." ప్రార్ధించుట నాకు నేర్పుము, ప్రభూ, ప్రార్ధించుట నాకు నేర్పుము; ఇది నా హృదయ ఆక్రందన, దినదినము; ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |