ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మనలను బలహీనపరిచే దయ్యములను
|
ఈ రాత్రి నేను దెయ్యములు మరియు సాతానును గూర్చి మాట్లాడబోవుచున్నాను, డాక్టర్ జే. ఐ. పేకర్ చెప్పిన "ప్రస్తుతపు సంఘ పతన స్థితిని గూర్చి," మరియు 1859 నుండి అమెరికాలో గొప్ప జాతీయ ఉజ్జీవము లేని దానికి కారణము చెప్పబోవుచున్నాను. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ శీర్షికపై నేను ఆధారపడుచున్నాను. ప్రాధమిక అంశము రూపు డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ వి. "ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెల్లగొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయన అడిగిరి? అందుకాయన, ప్రార్ధన వలననే గాని మరిదేని వలననైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28-29). ఆ రెండు వచనాలను గూర్చి మీరు ఆలోచించాలని నేను కోరుచున్నాను. ఆ వచనములను నేను అమెరికా మరియు పాశ్చాత్య ప్రపంచములో "పతనమయిన" సంఘాలకు అన్వయింప బోవుచున్నాను – కొన్ని అంశములు మన సంఘమునకు నిర్దేశింపబడినవి. ఈనాడు "ఉజ్జీవము" అనే పదము ప్రజలను నీరు కారుస్తుందని నాకు తెలుసు. వారు దానిని వినడానికి ఇష్టపడరు. ఇలా వారు అనుకోవడానికి కారణము సాతాను! ప్రజలు దానిని గూర్చి ఆలోచించకుండా దెయ్యము చేస్తుంది. కనుక నేను ఈ క్లిష్ట సంఘ సవసరత మన సంఘములో, మరియు ఇతర సంఘాలలో ఉన్న దానిని గూర్చి మాట్లాడుచుండగా మీరు జాగ్రత్తగా వినాలని ప్రార్ధిస్తున్నాను. ఈ అంశము మన అందరిలో తీవ్రముగా ఆసక్తి రేకెత్తించాలి. ఈనాటి సంఘముల స్థితిని గూర్చి మనకు బాధ్యత లేకపోతే మనము చాలా పేద క్రైస్తవులము. వాస్తవానికి, నిజ ఉజ్జీవములో మీకు ఆసక్తి లేకపోతే, మీరు క్రైస్తవులేనా అని మిమ్మును మీరు ప్రశ్నించుకోవాలి! మీకు మన సంఘమును గూర్చి ఇతరులను గూర్చి, మీకు పట్టింపు లేకపోతే, మీకు తప్పకుండా ఉజ్వల క్రైస్తవులు కాదు! నేను మళ్ళీ చెప్తాను, నిజ ఉజ్జీవము మన ప్రతి ఒక్కరికి అంత్యంత ఆసక్తి కలిగించాలి. కనుక మార్కు తొమ్మిదవ అధ్యాయములో ఉన్న సంఘటనను గూర్చి ఆలోచిద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటన, ఎందుకంటే మూడు సువార్తలు, మత్తయి, మార్కు, లుకాలలో ఈ విషయము చెప్పబడడానికి పరిశుద్ధాత్మ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. నేను మార్కులో ఇవ్వబడిన వచనాలు నేను చదువుచున్నాను. అధ్యాయము మొదటి భాగములో క్రీస్తు పేతురు, యాకోబు మరియు యోహానులను రూపాంతరము కొండపైకి తీసుకొని వెళ్ళుటకు మార్కు మనకు చెప్తున్నాడు, అక్కడ వారు అద్భుత సంఘటన చూసారు. కాని, వారు కొండ దిగి వచ్చినప్పుడు, చాలా గుంపుల ప్రజలు ఇతర శిష్యులను చుట్టుముట్టి వారితో వాదిస్తున్నట్టు కనుగొన్నారు! యేసుతో పాటు దిగి వచ్చిన ముగ్గురికి ఆ విషయము అర్ధము కాలేదు. అప్పుడు గుంపు నుండి ఒక వ్యక్తి వచ్చి తన కుమారునికి దెయ్యము పట్టినదని అది వానిని నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లునల్లు చేస్తుందని యేసుకు చెప్పాడు. అప్పుడు అతడన్నాడు, "[దానిని వెళ్ళగొట్టుడని] నీ శిష్యులను అడిగి విని కాని అది వారిచేత కాలేదని చెప్పెను" (మార్కు 9:18). వారు ప్రయత్నించారు, కాని వారు విఫలులయ్యారు. యేసు అతనిని కొన్ని ప్రశ్నలడిగాడు. అప్పుడు చాలా త్వరితముగా ఆయన ఆ బాలుని నుండి దయ్యమును వెళ్ళగొట్టాడు. తరువాత క్రీస్తు ఇంటిలోనికి వెళ్ళాడు, శిష్యులు ఆయనతో పాటు వెళ్ళాడు. వారు ఇంటిలో ఉన్నప్పుడు శిష్యులు ఆయనను అడిగారు, "మేమెందుకు వెళ్ళ గొట్టలేకపోతిమి?" (మార్కు 9:28). వారు చాలా కష్టపడ్డారు. మునుపు చాలాసార్లు జయము పొందుకున్నారు. కాని ఇప్పుడు పూర్తిగా విఫలులయ్యారు. అయినను క్రీస్తు అన్నాడు, "వానిలో నుండి బయటికి రమ్ము" బాలుడు స్వస్థత పొందాడు. వారడిగారు, "మేమెందుకు వెళ్ళ గొట్టలేకపోతిమి?" క్రీస్తు జవాబిచ్చాడు, "ప్రార్ధన వలననే గాని మరి దేని వలన నైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:29). ఇప్పుడు ఈనాటి మన సంఘాలలో ఉన్న సమస్య చూపించడానికి ఈ సంఘటనను ఉపయోగించుకుంటాను. ఈ బాలుడు ఆధునిక లోకములో ఉన్న యవనస్తులను చూపిస్తున్నాడు. శిష్యులు ఈనాటి మన సంఘాలను సూచిస్తున్నాయి. మన సంఘములు యవనస్తులకు సహాయము చేయలేకపోవడం బాగా కనిపిస్తుంది కదా? సంఘములో ఎదిగిన, 88% యవనస్తులను మనం కోల్పోతున్నామని జార్జి బర్నా చెప్పాడు. మనము తక్కువ మంది యవనస్తులను, చాలా తక్కువ మందిని, లోకము నుండి సంపాదిస్తున్నాము. మన సంఘాలు ఎండిపోయి త్వరగా పడిపోతున్నాయి. ప్రతి ఏటా దక్షిణ బాప్టిస్టులు 1,000 మందిని కోల్పోతున్నారు! అది వారి సంఖ్య! మన స్వతంత్ర సంఘాలు సరిగా పని చేయడం లేదు. ఈ లెక్కలు ఎవరు చూసినా వంద సంవత్సరాల క్రితము సంఘాలకున్న శక్తిలో ఇప్పుడు సగము కూడ లేదని ఎవరైనా గమనించగలరు. అందుకే డాక్టర్ జే. ఐ. పేకర్ "ప్రస్తుత సంఘ పతన స్థితిని గూర్చి మాట్లాడాడు." మన సంఘాలు, శిష్యుల వలే, చేయగలిగినదంతా చేస్తున్నారు, అయినను వారు విఫలులవుతున్నారు. శిష్యులు యవన స్థితికి సహాయ పడడంలో విఫలులయినట్లే వారు కూడ విఫలమవుతున్నారు. ఈ ప్రశ్న మనం అడుగుకోవాలి "అతనిని మనము ఎందుకు వెళ్ళ గొట్టలెం?" ఈ వైఫల్యానికి కారణము ఏమిటి? ఇక్కడ, మార్కు తొమ్మిదవ అధ్యాయములో, క్రీస్తు ఆ ప్రశ్నను గూర్చి మాట్లాడుచున్నట్టు నాకనిపిస్తుంది. క్రీస్తు ఇచ్చిన జవాబు అప్పటి లాగే ఇప్పుడు కూడ అంతే ప్రాముఖ్యము. "ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెల్లగొట్టలేక పోతిమి? ఏకాంతమున ఆయన అడిగిరి, అందుకాయన ప్రార్ధన వలననే గాని మరిదేని వలననైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28-29). ఈ పాఠ్య భాగము మూడు సామాన్య అంశాలుగా విభజింపబడవచ్చును. I. మొదటి విషయము "ఈవిధమైనది." వారు ఎందుకు వెళ్ళ గొట్ట లేకపోయిరి? క్రీస్తు చెప్పాడు, "ప్రార్ధన వలననే గాని మరిదేని వలన నైనను, ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను." ఒకదానికి ఇంకొక దానికి తేడాలు ఉంటాయని ఆయన వారితో చెప్పాడు. గతంలో బోధించడానికి దయ్యములను వెళ్ళ గొట్టడానికి క్రీస్తు వారిని పంపాడు – వారు వెళ్లి బోధించి చాలా దయ్యములను వెళ్ళగొట్టారు. వారు ఆనందంగా తిరిగి వచ్చారు. దయ్యములు వారికి లోబడ్డాయని చెప్పారు. కనుక ఈ వ్యక్తి తన కుమారుని వారి దగ్గరకు తెచ్చినప్పుడు మునుపు చేసినట్టే చేయవచ్చు అనుకున్నారు. కాని ఈ సారి వారు పూర్తిగా విఫలమయ్యారు. అన్ని ప్రయత్నాలు చేసినా, ఈ బాలునికి సహాయ పడలేకపోయారు ఎందుకో తెలియదు. అప్పుడు క్రీస్తు అన్నాడు, "ఈ విధమైనది." "ఈ విధమైనది" దీనికిని మునుపు వాటికి తేడా ఉంది. ఒక విధంగా, సమస్య ఎప్పుడు ఒకటే. సంఘము పని యవనస్తులను సాతాను వాని దయ్యముల శక్తి నుండి విడుదల చేయడం, "వారిని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిప్పుట" (అపోస్తలుల కార్యములు 26:18). అది ప్రతి తరములోను, ప్రతి సంస్కృతిలోను అంతే. సంఘాలు సాతాను దయ్యములను ఎదుర్కోవాలి. కాని దయ్యాలలో తేడా ఉంది. అన్ని ఒకటే కాదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12). ఆయన చెప్పాడు దయ్యాలలో వేరు వేరు రకాలున్నాయని, వాటికి నాయకుడు సాతాను అని, "వాయు మండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి" (ఎఫెస్సీయులకు 2:2). తన శక్తితో సాతాను జీవించి యున్నాడు. వాని క్రింద దయ్యపు శక్తులు ఉన్నాయి. బలహీన దయ్యాలను శిష్యులు సులభంగా వెళ్ళ గొట్టగలిగారు. కాని ఇక్కడ, ఆ బాలునిలో, గొప్ప శక్తి ఉన్న ఆత్మ ఉంది. "ఈ విధమైనది" వేరు, అందుకే పెద్ద సమస్య. మొదటి విషయము మనం కనుగొనవలసింది "ఈ విధమైనది" అంటే ఏమిటి అని దానిని ఎలా ఎదుర్కోవాలి. "ఈ విధమైనది" ఈ మాటలు చూస్తుంటే ఈనాటి చాలామంది సంఘ కాపరులు వారు ఆత్మీయ పోరాటములో ఉన్నారు అని గ్రహిస్తున్నారా అని నా ఆశ్చర్యము. చాలా మంది సంఘ కాపరులకు వారు సాతాను దురాత్మలతోను యుద్ధములో ఉన్నారని కచ్చితముగా తెలియదు. సెమినరీలు, బైబిలు కళాశాలలు, మానవ పద్ధతులనే నొక్కి వక్కానిస్తున్నాయి. వారు బోధకులకు నేర్పించరు వారి సమస్య ఆత్మీయ రంగములో ఉందని. కనుక వారు గతములో జయవంతమయిన కొన్ని పద్ధతులు గైకొంటూ ఉంటారు. ఈనాటి "ఈవిధమైనది" తో ఈ పద్ధతులు పనిచేయవని వారు గ్రహించరు. అవసరత ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ప్రశ్న ఏమిటంటే – సరిగ్గా ఆ అవసరత ఏమిటి? సరియైన అవసరత మీద మనకు అవగాహన లేకపోతే, మనము కూడ శిష్యుల వలే విఫలుల మయిపోతాము. ఈనాడు "ఈవిధమైనది" ఏమిటి? "ఈవిధమైనది" అస్థిత్వ వాదము అనే దయ్యము. అస్థిత్వ వాదము చెప్తుంది మీరు ఒకటి అనుభవిస్తేనే అది వాస్తవము – అనుభూతి చెందితేనే. ఈనాడు ప్రజలు మనసులు "అనుభూతి దయ్యము"చే గుడ్డివయిపోయాయి. అస్థిత్వ వాద దయ్యము అనుభూతి చెప్తుంది మీకు తప్పక వాస్తవ అనుభవము ఉండాలని – అనుభవ నిశ్చయత. దయ్యము చెప్తుంది ఆ అనుభూతి ఉంటే, అది మీరు రక్షింపబడ్డారని ఋజువు చేస్తుంది. ఈ గుడ్డి ప్రజలు దేవుని తీర్పును నమ్మరు. వారి అనుభూతినే నమ్ముతారు. రక్షింపబడడానికి అనుభూతి ఉండాలని వారు అనుకుంటారు. వారికి "నిశ్చయత" అనుభూతి కావాలి వారు రక్షింపబడ్డారని నిరూపించడానికి. ఈ "నిశ్చయత" ఒక విగ్రహము! వారు వారి అనుభూతులను నమ్ముతారు, యేసు క్రీస్తును నమ్మరు! ప్రజలను అడుగుతాం, "మీరు క్రీస్తును నమ్ముతున్నారా?" అని వారంటారు, "లేదు." వారు లేదు అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారికి సరియైన భావన లేదు! వారు వారి అనుభూతులను నమ్ముతారు, క్రీస్తును కాదు! దయ్యములు వారి మనస్సులను గ్రుడ్డివిగా చేసాయి. "ఈవిధమైనది" దెయ్యము కేవలము ఉపవాస మరియు ప్రార్ధనల వలననే ఓడింప బడుతుంది! "ఈవిధమైనది" నుండి విడిపించబడడానికి మనము ఉపవాసము చెయ్యాలి! II. రెండవ విషయము విఫలమైన పద్ధతులు. మన సంఘాలు గతములో సహాయకరముగా ఉన్న పనులు చేసాయి, కాని "ఈవిధమైనది" దానిపై ఇకపై ప్రభావము చూపించడం లేదు. మనము పాత పద్ధతులపై ఆధారపడుతున్నాము కాబట్టి, మన యవనస్తులను చాలా మందిని కోల్పోతున్నాము, లోకము నుండి ఎవరిని మచ్చ లేకపోతున్నాము. అపార్ధము లేకుండా, సబ్బాతు బడిని ఆ కోవలో పెడుతున్నాను. నూట ఇరువది ఐదు సంవత్సరముల క్రిందట అది చాలా చక్కగా పనిచేసింది. కాని ఇప్పుడు దానికి అంత విలువలేదని నేను అనుకుంటున్నాను. ఇదే పరిస్థితి రక్షణ కర పత్రముల విషయము కూడ. ఒకప్పుడు ప్రజలు వాటిని చదివి గుడికి వచ్చారు. కాని ఏ కాపరినైనా అడుగుతాను, "ఒక కరపత్రము చదివి గుడికి వచ్చి రక్షింపబడిన యవనస్తులు ఉన్నారా?" గతములో ఉపయోగించిన పద్ధతులు ఈ రోజులలో "ఈ విధమైనది" దానికి పనిచేయడం లేదు అనుకుంటున్నాను. అదే కోవలో ఇంటింటి దర్శనాలను చేర్చుతున్నాను. గతములో అది శక్తివంతముగా ఉపయోగించబడింది, కాని యవనస్తులను గుడికి నడిపించడములో ఇప్పుడు అంతగా సహాయపడదు ఇంకా కొన్ని ఉన్నాయి ఈనాడు అవి నిరుపయోగము "ఈ విధమైనది." ఈరోజులలో కొన్నింటికి దానికి అన్వయిస్తే, "ఈవిధమైనది." ఇంకొక మాటలలో చెప్పాలంటే, క్రీస్తు చెప్తున్నాడు, "ఈ విషయములో మీరు విఫలులయ్యారు ఎందుకంటే, గతములో మీకున్న శక్తి, ఇప్పుడు దానికి విలువలేదు. "ఈవిధమైనది" క్రింద ఉన్న బాలునికి సహాయపడడానికి మిమ్ములను శక్తిహీనులనుగా చేస్తుంది. గతములో మనము చేసినవి ఈరోజు నిరుపయోగమని చాలా సంఘ కాపరులు గ్రహించారని నాకు తెలుసు. కాని వారు పద్ధతులను గూర్చి ఆలోచించడానికే తర్భీదు పొందారు కాని సాతాను "కుతంత్రములను" గూర్చి కాదు (II కొరింధీయులకు 2:11) – కనుక వారు కొత్త పద్దతులు ప్రవేశ పెడతారు కాని పాత వాటికంటే మంచివి కావు – అంటే, యవనస్తులు సంఘములో పటిష్ట సభ్యులుగా ఉండడానికి అవి ఉపయోగపడవు. ఉదాహరణకు కొంతమంది అంటారు దీనికి జవాబు ఆదికాండము సృష్టి క్రమము సరియైనదని అవతరణ సిద్ధాంతము తప్పు అని "నిరూపించగలగాలి." వారనుకుంటారు యవనస్తులు మారతారని, ఇతరులు లోకములో నుండి వస్తారని, మనము ఒకవేళ అవతరణము తప్పు అని చెప్పి ఆదికాండమునకు జవాబులు కనుగొనగలిగితే వారంకుంటారు. ఈ పద్ధతి ద్వారా ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనవచ్చు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "పద్దెనిమిదవ శతాబ్దపు ఆరంభములో ఇదే పరిస్థితి ఉండేది, ప్రజలు వారి విశ్వాసమును [అపోస్తలత్వము]పై ఉంచారు. వీటిని, వారు మనము బోధించారు, ఇవి క్రైస్తవ్యము నిజత్వమును చూపిస్తాయి, కాని అలా అవి చేయలేదు. ‘ఈవిధమైనది’ ఆవిధంగా చేస్తే పనిచేయదు." ఇంకొక పద్ధతి విఫలమైనది ఆధునిక అనువాదములను ఉపయోగించడము. మనకు చెప్పబడింది యవనస్తులు కింగ్ జేమ్స్ వెర్సన్ ను అర్ధము చేసుకోలేరని. ఆధునిక భాషలో బైబిలు కావాలి. అప్పుడు యవనస్తులు చదువుతారు. అప్పుడు వారంటారు, "ఇది క్రైస్తవ్యము" –అప్పుడు వారు మన సంఘాలలోనికి వస్తారు. కాని అలా జరగలేదు. వాస్తవానికి, విరుద్ధమైనది జరిగింది. నేను యవనస్తులతో గత అరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు తెలుసు ఈ ఆధునిక అనువాదములు యవనస్తులను ఆకర్షించవు. వాస్తవానికి, చాలామంది నాతో చెప్పడం విన్నాను, "ఇది సరిగ్గా అనిపించడము లేదు. ఇది బైబిలులా అనిపించడం లేదు." నేను ఎన్నడు ఆధునిక తర్జుమా నుండి బోధించలేదు, భోదించను కూడ. మనము చూస్తున్నాము యవనస్తులు మారడం అన్ని సమయాలలో, మన సంఘములో, లోకము నుండి కూడ. ఈ ఆధునిక అనువాదములు ఎంత విలువైనవయిన, సమస్యను పరిష్కరించలేవు. "ఈ విధమైనది" దీనితో అని పనిచేయవు. వారు ఇంకేమి ప్రయత్నిస్తున్నారు? ఓ, పెద్దది ఏంటంటే ఆధునిక సంగీతము! "మనము సంగీతము ఇస్తే వారు వచ్చి క్రైస్తవులవుతారు." ఇది చాలా విచారము. దానిపై నేను వ్యాఖ్యానించాలా? లాస్ ఎంజిలాస్ లో అద్దేపై ఒక దక్షిణ బాప్టిస్టు సంఘము కూడ ఉంటుంది. సంఘ కాపరి టి-షర్టు వేసుకొని బల్లపై కూర్చుంటాడు. ఆయన మాట్లాడే ముందు, గంటసేపు రాక్ సంగీతము ఉంటుంది. మాలో ఒకరు దానిని గమనించడానికి వెళ్ళారు. అతడు దిగ్బ్రాంతి నొందాడు. ఆ ఆరాధన అంధకారము విషాధకరమని, ఆత్మీయంగా లేనేలేదని చెప్పాడు. అతనన్నాడు వారు ఆత్మలు సంపాదించరు, మరియు మన యవనస్తుల వలే ఒక గంట వారు ప్రార్ధించలేరు. గంట కేవలము ప్రార్ధన? మర్చిపోండి! కనుక, ఆధునిక రాక్ సంగీతము కూడ "ఈవిధమైన" దానిని అధిగమించడంలో విఫలమయింది. III. మూడవ విషయము ఏమిటంటే మనకు ఒకటి కావలి అది ఆ దుష్ట శక్తి క్రిందకు వెళ్ళగలగాలి, దానిని పటాపంచలు చేయాలి, ఒకటే అలా చేయగలదు, అది దేవుని శక్తి! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మనము గుర్తెరగాలి ‘ఈవిధమైనది’ ఎంత గొప్పదైనప్పటికి, దేవుని శక్తి అనంతమైనది గొప్పది, మనకు కావలసినది జ్ఞానము కాదు, ఎక్కువ అవగాహన కాదు, ఎక్కువ నవీన పద్దతులు కాదు, [కొత్త తర్జుమాలు, రాక్ సంగీతము] – కాదు, మనకు ఒక శక్తి కావాలి అది మనష్యుల ఆత్మలలోనికి వెళ్లి వాటిని విరుగగొట్టి ముక్కలు చేసి వారిని విధేయులుగా చేసి వారిని నూతన పరుస్తుంది. అది సజీవుడైన దేవుని శక్తి." అది మనలను మన పాఠ్యభాగమునకు నడిపిస్తుంది, "ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్ట లేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన, ప్రార్ధన వలననే కాని మరి దేనివలన నైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28-29). ప్రార్ధన మరియు ఉపవాసము. "ఈవిధమైన" సాతాను దాడిని జయించడానికి ఏదీ మన సంఘాలకు సహాయము చేయలేదు. ఈనాడు మన సంఘాలు యవనస్తులను సమీపించుట లేదు. మనమేమీ చేయగలము? "ఈ విధమైనది కేవలము, ప్రార్ధన మరియు ఉపవాసము వలన మాత్రమే సాధ్యము." ఒక "వేత్త" అనవచ్చు, "శ్రేష్టమైన ప్రతులు ‘మరియు ఉపవాసము’ అని చెప్పలేదు అని." కాని "ఆ వేత్తకు" దయ్యాలను గూర్చి ఏమి తెలుసు? అతనికేమి తెలుసు వీధుల నుండి అన్యులను మరియు మన పట్టణపు కళాశాల నుండి యవనస్తులను రక్షించడము? ఉజ్జీవమును గూర్చి అతనికేమి తెలుసు – చైనాలో అనుభవిస్తున్న ఉజ్జీవమును గూర్చి? ఈ విషయాలను గూర్చి అతనికి ఏమి తెలియదు. నా జీవితములో మూడు సార్లు పాపాన్ని చెల్లాచెదురు చేసే ఉజ్జీవానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ మూడు ఉజ్జీవములలో నేను బోధించడం ఒక ఆధిక్యతగా భావిస్తున్నాను. అవి సువార్తిక కూటములు కాదు. ఆ సమయములలో దేవుని శక్తి మనష్యుల హృదయలలోనికి ప్రవేశించి, వారిని విరిచి, నలుగగొట్టి, వంచి, యేసు క్రీస్తు నందు నూతన సృష్టిగా చేసింది! కనుక, మనము పదము "ఉపవాసము" ను తొలగించిన రెండు పాత ప్రతులను మనము గైకోనము. యోగా శాస్త్రము వారు ఉపవసమును ఎక్కువగా నొక్కి చెప్పారు. కనుక ఆ ప్రతిని వెంబడించేవారు "మరియు ఉపవాసము" అను పదములను తొలగించారు. "యోగా శాస్త్రము వారు ఆకలితో బాగా అలమటించే వరకు ఉపవాసము చేసేవారు" (William R. Horne, Trinity Evangelical Seminary, “The Practice of Fasting in Church History,” p. 3). ఆధునిక "తత్వవేత్తలు" చెప్తారు చూచి వ్రాసేవారు ఈ పదాలను కలిపారని. కాని వారు వాటిని తొలగించారు (యోగ శాస్త్రపు రహస్య చరిత్ర చూడండి: వారి లేఖనాలు, నమ్మకాలు మరియు సాంప్రదాయాలు, అండ్రూ ఫిలిప్ స్మిత్ చే, అధ్యాయము 5, పుట 1). మనకు తెలుసు క్రీస్తు, "మరియు ఉపవాసము" అని చెప్పాడని. అది మనకెలా తెలుసు? రెండు కారణాలున్నాయి. మొదటిది, శిష్యులు మునుపు దేయ్యములను వెళ్ళగొట్టేటప్పుడు తప్పక ప్రార్ధించారు. కనుక ఇంకా ఏదో ఒకటి కలపబడాలి. ఏదో ఒకటి అవసరము – ఉపవాసము! కేవలము ప్రార్ధన సరిపోదు . అది అనుభవము ద్వారా మనకు తెలుసు. మనము ఉపవసించాము మనకళ్ళతో మనం చూసాం ఉపవాస ప్రార్ధన చేసేటప్పుడు దేవుడు ఏమి చేయగలడో. ఇప్పుడు నేను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. ఎలాంటి బోధకుడు! ఎంత గ్రహింపు! ఆయనను బట్టి నేను దేవునికి వందనస్తుడను. ఇంకొక స్థలములో అతనన్నాడు, ఉపవసమును గూర్చి మనము ఆలోచించ వలసిన అవసరత ఏ సమయమందైనా వచ్చిందా? వాస్తవము, ఏమిటంటే, ఈ విషయము మన జీవితాల నుండి తీసివేయబడడము కాదు, మన క్రైస్తవ తలంపునుండి తుడిచి పెట్టబడడం కాదు కదా? అది, అన్నింటిని మించి, అందుకే "ఈవిధమైన" దానిని మనము జయింపలేక పోవుచున్నాము. మన సంఘములో సాధారణ ఉపవాసము కొరకు పిలుపు ఇవ్వబోతున్నాను. దానిని గూర్చి ఎక్కువ విషయాలు తరువాత చెప్తాను. మనము ఎప్పుడు ఉపవాసము ఉంటామో తరువాత చెప్తాను. ఎలా ఉపవసించాలి, ఎలా ఉపవాసము ముగించాలి నేను మీకు చెప్తాను. ఆ సమయంలో మనము ఇక్కడకు గుడికి వస్తాము ప్రార్ధన కూటము ముందు భోజనము చేస్తాము. డాక్టర్ కాగన్ ఫోన్ చెయ్యమని చెప్తారు. మిగిలిన వారు ప్రార్ధన చేస్తాం, డాక్టర్ కాగన్ మరియు నేను ప్రశ్నలకు జవాబులు చెప్తాం. 1. మన కొత్త కార్యక్రమాలు విజయవంతమవడానికి మనము ఉపవాసము ఉండి ప్రార్ధన చేస్తాము. 2. కొత్త అబ్బాయిల "గుంపు" మరియు అమ్మాయిల "గుంపుల" నుండి మనము ఉపవాసముండి ప్రార్ధన చేస్తాము. "గుంపు" అనగా ఐదు లేక ఆరు మంది అందులో ఉంటారు వారు శనివారము, ఆదివారము ఉదయము, ఆదివారము సాయంకాలము వచ్చేవారు మరియు శిష్యులుగా అవడానికి ఆసక్తి గల వారు. 3. మన సంఘములో మార్పిడులు జరిగేటట్టు మనము ఉపవసించి ప్రార్ధన చేస్తాం. మనము ప్రాముఖ్యముగా "ఈవిధమైన" వాటిపై దృష్టి పెడతాం – అనుభూతి కొరకు సాతాను బానిసలుగా చేసే వారి కొరకు. ఇప్పుడు యేసును గూర్చి మాట్లాడకుండా ఈ కూటము ముగించకూడదు. మనకు కావలసింది ఆయనలో దొరుకుతుంది. హెబ్రీయులకు పత్రిక చెప్తుంది, "దేవుని కృప వలన, ఆయన ప్రతి మనష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలు కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున; మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము" (హెబ్రీయులకు 2:9). యేసు, దైవ కుమారుడు, పాపుల స్థానములో, పాపులకు ప్రతిగా మరణించాడు. యేసు శారీరకంగా, శరీరము ఎముకలతో తిరిగి లేచాడు, మీకు జీవము ఇవ్వడానికి. మీరు యేసుకు సమర్పించుకున్న క్షణమే మీ పాపములు సిలువపై ఆయన మరణముచే రద్దు చేయబడతాయి. మీరు రక్షకుని అప్పగించుకున్న క్షణమే, క్రీస్తు ప్రశస్త రక్తములో నిత్యత్వములో దేవుని గ్రంధము నుండి మీ పాపములు కడిగి వేయబడతాయి. మీరు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచి ఆయనచే మీ పాపమూ నుండి రక్షింపబడాలని మా ప్రార్ధన. ఆమెన్ మరియు ఆమెన్. మీ పాటల కాగితములో ఉన్న 4 వ పాట దయచేసి నిలబడి పాడండి. గొప్ప కేడెము మన దేవుడు, ఎన్నడు విఫలుడు కాని శూరుడు, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ మనలను బలహీనపరిచే దయ్యములను OVERCOMING THE DEMONS THAT WEAKEN US – డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెల్లగొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయన అడిగిరి? అందుకాయన, ప్రార్ధన వలననే గాని మరిదేని వలననైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28-29). (మార్కు 9:18) I. మొదటి విషయము "ఈవిధమైనది," అపోస్తలుల కార్యములు 26:18; ఎఫెస్సీయులకు 6:12; 2:2. II. రెండవ విషయము విఫలమైన పద్ధతులు, II కొరింధీయులకు 2:11.
III. మూడవ విషయము ఏమిటంటే మనకు ఒకటి కావలి అది ఆ దుష్ట శక్తి క్రిందకు వెళ్ళగలగాలి, దానిని పటాపంచలు చేయాలి, ఒకటే అలా చేయగలదు,
|