ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
బైబిలు మరియు నేటి స్వధర్మత!THE BIBLE AND TODAY’S APOSTASY! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది |
దయచేసి బైబిలులో II తిమోతి, మూడవ అధ్యాయము చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1280 పుటలో ఉంది. పైకి చూడండి. దయచేసి బైబిలులో ఆ అధ్యాయము తెరచి ఉంచండి. ఈనాడు బైబిలులో II తిమోతి, మూడు నాలుగు అధ్యాయాలు, చాలా ప్రాముఖ్యమైన భాగాలుగా భావిస్తాను. బైబిలులో అపోస్తలుడు వ్రాసిన చివరి పుస్తకము II తిమోతి. ఇది సుమారు ఏ.డి. 67 లో వ్రాయబడింది. క్రైస్తవ బోధకుడైనందుకు పౌలును నీరో చక్రవర్తి నిర్భరించాడు. కొలిసియంకు దగ్గరలో ఉన్న, మోమేర్టిన్ చెరసాలలో బంధింపబడ్డాడు. నా భార్య నేను ఆ చీకటి చెరసాలలోనికి వెళ్ళాము. అక్కడ పౌలు ఈ పత్రిక వ్రాసాడు. II తిమోతి వ్రాసిన కొన్ని నెలల తరువాత అతడు శిరచ్చేదనము చేయబడ్డాడు. స్వధర్మత దినాలలో క్రైస్తవులుగా ఎలా జీవించాలో మనకు చూపించడానికి II తిమోతి వ్రాయబడింది – ఇది అపనమ్మకం క్రైస్తవ్య తిరస్కారము ఉండేకాలము. మనము జీవిస్తున్న ఈ కాలము కొరకు ఇది ప్రత్యేకంగా వ్రాయబడింది! ప్రపంచ చరిత్రలో 20 మరియు 21 వ శతాబ్దాలు దైవము లేని కాలము. మూడవ అధ్యాయము, 1 వ వచనము చూడండి. "అంత్య దినాలలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము" (II తిమోతి 3:1). దయచేసి, చూడండి. కొంతమంది రచయితలూ అన్నారు క్రీస్తు ఆరోహణమైనప్పటి నుండి ఇది పూర్తికాలం అని. నేను అది నమ్మను. డాక్టర్ జె. వెర్నోన్ మేక్ గీ అన్నాడు, "మనము, అంత్యదినముల లోనికి, వెళ్లుచున్నామని నమ్ముచున్నాను...నేను నమ్ముచున్నాను మనము ఇప్పుడు ‘అంత్య’ దినములలో [జీవిస్తున్నాము]. ఇది ఎంతకాలము ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా పరిస్థితి ఇంకా విషమిస్తుంది" (McGee, Thru the Bible; note on II Timothy 3:1). తరువాత వచనాలు మనం జీవిస్తున్న కాలమును చూపిస్తున్నాయి. 2 నుండి 7 వ వచనము వరకు చూడండి. "ఏలయనగా మనుష్యుల స్వార్ధ ప్రియులు ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలే ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు; ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, పాప భరితులై నానావిధములైన దురాశలు వలన నడిపించబడినది: ఎల్లప్పుడును నేర్చుకొను చున్నాను. సత్యము విషయమైన అనుభవ జ్ఞానము, ఎప్పుడని పొందలేని, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు, వీరిలో చేరినవారు." (II తిమోతి 3:2-7). ఒలివాస్ గారు వెళ్ళిపోయాక మన సంఘ చీలిక జాబితాలో ఉన్నవారిలా ఇది అనిపిస్తుంది. మనము అంత్యదినములలో ఉన్నాము! ఇప్పుడు 12 మరియు 13 వ వచనము చూడండి. "అవును, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరు హింసపొందుదురు. అయితే దుర్జనులును వంచకులను ఇతరులను మోసపరచుచు, తమ్మును మోసపోవచు, అంతకంతకు చెడిపోవుదురు" ( II తిమోతి 3:12, 13). చూడండి. ఈ వచనము స్వధర్మత ప్రపంచాన్ని వివరిస్తున్నాయి, ఈలోకము దేవుని బైబిలును తిరస్కరించింది, దుష్ట పిశాచి లోకము చాలామంది నాగరికులుగా ఉంటారు, ఈ లోకములో "దైవికముగా జీవించేవారు" [క్రైస్తవ జీవితాలు] ఏదోలా హింసింప బడతారు, ఈలోకంలో మంచి క్రైస్తవులు తృణీకరింపబడతారు [వచనము 3]. ఇదంతా ఈనాడు మనము చూస్తున్నాము. "లైంగిక విప్లవంనకు" వ్యతిరేకంగా నిలబడే క్రైస్తవులను మతాతీతులు భయపెడుతున్నారు. అది చాలామంది సంఘ సభ్యులను భయపెడుతుంది. గత సంవత్సరము 200,000 మంది దక్షిణ బాప్టిస్టు సంఘాల నుండి వెళ్లిపోయారు. చాలామంది ఈ సంవత్సరము పరుగెత్తుచున్నారు – భయముతో, ఈ "అపాయకర," భయంకర, సాతానుపర దినాలలో. ముస్లీములు వస్తున్నారు. బాంబులు వేస్తున్నారు. మత్తు పదార్ధాలు వాడకాలు పెరిగిపోయాయి. సిలువలు విరుగగొట్టబడుచున్నాయి. పాఠశాలలో ప్రార్ధించకూడదని పిల్లలకు చెప్తున్నారు. మన దేశములోను ప్రపంచములోని భయంకర విషయాలు సంభవించబోతున్నాయని ప్రతి ఒక్కరికి అర్ధము అవుతుంది. మీరు నేను ఈ అపాయకర కాలములో జీవిస్తున్నాము. బ్రిటిష్ సువార్తికుడు లినార్డ్ రేవన్ హిల్ అన్నాడు, "ఇవి అంత్యదినములు!" ఈ వాక్యము వ్రాసిన కొన్ని సెకండ్ల తరువాత నేను విన్నాను ముస్లీము ఉగ్రవాదులు ప్యారిస్ లో చాలా స్థలాలలో దాడులు చేశారని. ముస్లీములు 120 మందిని చంపేశారు. 24 గంటల ముందు ఒబామా చెప్పాడు, "ఐయస్ఐయస్ (ISIS) అదుపుచేయబడింది." ఎంత పరిహాసము! జిమ్మీ కార్టర్ తరువాత బహు బలహీనమైన అమెరికా అధ్యక్షుడు ఒబామా! ఇది అంత్యకాలములు. ఇది స్వధర్మత కాలములు. మన సంఘాలు నశిచు వారితో నిండిపోయాయి. చాలామంది కాపరులు గుడి వదిలి వెళ్ళిపోతారేమోనని భయపడి సువార్తను కూడ బోధించడం లేదు – నశించు వ్యక్తి ఎవరికో కోపము వస్తుందని! మీ కళాశాలలో అధ్యాపకులు తాగుతూ బైబిలు నిండా అబద్ధాలు ఉన్నాయని చెప్తారు. వారు అలా చేస్తారని మేకు తెలుసు! నేను సరియే అని మీకు తెలుసు! జవాబు ఏమిటి? మనము ఏమి చెయ్యాలి? 14 వ వచనంలో అపోస్తలుడు జవాబు ఇస్తున్నాడు, "నీవు నేర్చుకొని రూడియని తెలిసికొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో, ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము" (II తిమోతి 3:14). "నేర్చుకొనిన వాటి యందు నిలకడగా ఉండుము." ఏమి సంభవించినా గుడికి వస్తూ ఉండండి! "మీరు నేర్చుకొనిన వాటి యందు నిలకడగా ఉండుము." డాక్టర్ లీ రాబర్ట్ సన్ (1909-2007) గొప్ప బాప్టిస్టు పితరుడు. అతని శీర్షిక "అభివృద్ధికి మూడు" – "అరవై సంవత్సరాలకు పైగా దీనిపైననే నేను బొదిస్తున్నాను!" – "ఆరాధనలో నమ్మకత్వము – ఆదివారము ఉదయము, ఆదివారము సాయంకాలము బుధవారము సాయంకాలము" (Lee Roberson, D.D., “Three to Thrive Statement,” The Man in Cell No. 1, Sword of the Lord Publishers, 1993, back cover). దానిలో పొరపాటు ఏమిటి? దానిలో పొరపాటు ఏమి లేదు! అవిశ్వాసులతో వేడుకకు వెళ్ళే బదులు గుడిలో ఉండండి! దుష్ట పట్టణము, శాన్ ప్రాన్సిస్కోకు, లాస్ వేగాస్ కు వెళ్ళే బదులు గుడిలో ఉండండి! ప్రతి ఆదివారము ఉదయము రాత్రి, బుధవారము రాత్రి, ఇక్కడ ఉండండి! ఏది ఏమైనా సరే! స్వధర్మత అంధకారమవుచుండగా, "మీరు నేర్చుకొనిన వాటియందు నిలకడగా ఉండుడి." దానికి ఆమెన్! ఇప్పుడు 15వ వచనము చూడండి. "క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము, నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు" (II తిమోతి 3:15). చూడండి. డాక్టర్ మెక్ గీ అన్నాడు, స్వధర్మతకు ఒకే ఒక విరుగుడు దేవుని వాక్యము [బైబిలు]. దేవుని బిడ్డకు ఒకే ఒక మూలము సహాయము దేవుని వాక్యమే. మీరు ప్రతి రోజు బైబిలు చదవకపోతే, మీరు ఈనాటి స్వధర్మతతో తికమకయై సంగ్దిద్ధులు అవుతారు. ఇప్పుడు 15 వ వచనము చూడండి, "క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము, నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు" (II తిమోతి 3:15). డాక్టర్ మెక్ గీ అన్నాడు, రక్షింపబడడానికి లేఖనాలు [మార్గము] చూపించడం మాత్రమే కాకుండా...ప్రస్తుత దుష్ట ప్రపంచము నుండి మనలను రక్షిస్తాయి...నా ఉద్దేశము దేవుని వాక్య పఠన కొనసాగింపు దీనికి [జవాబు]. అది "క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము మీకు కలిగించును." మరియు...అది [ఈ దుష్ట ప్రపంచములో] మనము ఎలా జీవించాలో మనకు జ్ఞానము ఇస్తుంది. మనం ఎందుకు బైబిలు చదవాలి, దానికి లోబడాలి? ఎందుకంటే బైబిలు ఇతర పుస్తకముల వంటిది కాదు. 16వ వచనము చూడండి, "దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించు టకును, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు, ప్రయోజన కరమై యున్నది" (II తిమోతి 3:16). డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ (1909-2002) బైబిలులో గొప్ప అనుభవశాలి. అతనన్నాడు, పౌలు అర్ధమును తేటగా తెలుసు కోవడానికి దానిని ఇలా అనువదించాలి: "లేఖనము లన్నియు, అవి దైవావేశము వలన ఇవ్వబడినవి, అవి ప్రయోజనకరము... లేఖనముల మూలము చెప్పబడింది: అది దేవునిచే ఊదబడినది (గ్రీకులో, తియోపనేస్టోస్), అనగా, లేఖనములు దేవుని నుండి పొందుకొనినవి. లేఖన సిద్ధాంతాలు బైబిలులో ఉన్నవి "దైవావేశము వలన" కలిగినవి...రెండవ పేతురు 1:21 చెప్తుంది ఇంకొక ఋజువు ఇస్తుంది లేఖన గ్రంధ కర్తలకు పరిశుద్ధాత్మ [పదములు] బయలు పరచింది వాటిని బహిర్గత పరచమని (W. A. Criswell, Ph.D., The Criswell Study Bible, note on II Timothy 3:16). II పేతురు 1:21 చెప్తుంది "ప్రవచనము మనష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి." "ప్రేరేపించబడడంనకు" గ్రీకు పదము ఫెరో. దాని అర్ధము "కొనసాగించుట." బైబిలు నిర్దిష్టమైనది ఎందుకంటే బైబిలులోని మాటలు పలికిన వారు పరిశుద్ధత్మచే "నడిపించబడి, కొనసాగారు." తప్పులు లేకుండా వ్రాయడానికి పరిశుద్ధాత్ముడు మానవ రచయితలకు పదాలు ఇచ్చాడు. అలా, హెబ్రీ గ్రీకు బైబిలులోని పదాలు మానవునికి దేవుడిచ్చిన మాటలు. డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "లేఖనములన్నియు,’ కలపబడిన ప్రతి ‘లేఖనము’ అవి ...కేవలము తలంపులు కావు, కాని వాస్తవిక వ్రాతలు మాటలు వ్రాయబడ్డాయి. అలా పదములు [దైవావేశము] వలన కలిగాయి...నిజ సిద్ధాంతము వస్తావా ప్రేరేపిత పరిశుద్ధ లేఖనాలు" (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, note on II Timothy 3:16). "ఫ్లీనరీ" అనగా "అన్ని." "వెర్బల్" అనగా "పదములు." "ప్రేరేపణ" అనగా "దైవావేశము." బైబిలులోని అన్ని మాటలు ప్రేరేపణ ద్వారా ఇవ్వబడ్డాయి. అది వాస్తవిక మాటల ప్రేరేపణ, చాదస్తపు క్రైస్తవ్య సరియైన సిద్ధాంతము (Dr. R. L. Hymers, Jr.). బైబిలులోని అన్ని గ్రీకు హెబ్రీ పదాలు "తిమోప్ నేస్టోస్" – "దైవావేశము వలన కలిగినవి" – దేవునిచే ప్రేరేపించబడి ఇవ్వబడినది. ప్రవక్తలు అపోస్తలులు హెబ్రీ గ్రీకు పదాలను వ్రాసారు వారి మనసులు పరిశుద్ధత్మచే "నడిపించబడడం ద్వారా." ప్రేరేపణ అన్ని తర్జుమాలకు వర్తించదు, కెజేవి (KJV) కూడ, కాని కేవలము హెబ్రీ గ్రీకు పదాలకు వర్తిస్తుంది అవి ప్రవక్తలు అపోస్తలులు వ్రాసారు. మృత సముద్రపు చుట్టలు హెబ్రీ బైబిలు భద్రతను చూపిస్తున్నాయి. మూల గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథము టెక్స్ టస్ రిసెప్షన్ గ్రీకు నుండి ఉత్పన్నమయింది. మీరు కింగ్ జేమ్స్ వెర్షన్ చదువుచున్నప్పుడు మీరు చాలా ఆధార పడదగిన తర్జుమా చదువుచున్నారు అవి దైవావేశము వలన కలిగిన హెబ్రీ గ్రీకు బైబిలు నుండి వచ్చిన పదములు. ఇదెందుకు అవసరము? డాక్టర్ బి. బి. మెకిన్నీ చాలా సంవత్సరాలు దక్షిణ బాప్టిస్టు పాఠశాలలో బెలర్ విశ్వ విద్యాలయము, సంగీత విభాగ అధినేతగా పనిచేసారు. అప్పటికే, 1920లో, స్వతంత్ర ఉపాధ్యాయులు బేలర్ లోను దక్షిణ బాప్టిస్టు పాఠశాలలోని బైబిలులో తప్పులు ఉన్నాయని బోధిస్తున్నారు. అందుకే డాక్టర్ మెకిన్నీ ఒక పాట వ్రాసాడు "బైబిలు సత్యమని నాకు తెలుసు." డాక్టర్ మెకిన్నీ డాక్టర్ జాన్ ఆర్. రైస్ కు స్నేహితుడు, లేఖనాలలో తప్పులు లేవని నమ్ముతాడు. అందుకే మెకిన్నీ పాట ఇలా చెప్తుంది, బైబిలు దేవుని నుండి పంపబడినదని నాకు తెలుసు, నేను సుదీర్ఘ కాలపు సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్, దగ్గర నేర్చుకున్నాను అతడు బైబిలు పండితుడు, ఆయన బాబ్ జోన్స్ విశ్వ విద్యాలయములో బోధించేవాడు. తరువాత అతడు తైవాన్ లో ఉన్న, చైనా సువార్తిక సెమినరీకి అధ్యక్షుడుగా ఉన్నారు, ఆయనకు ముందు డాక్టర్ జేమ్స్ హాడ్ సన్ టేలర్ III అధ్యక్షునిగా ఉండేవారు, ఆయనను నేను చాలాసార్లు కలిసాను. నా ఇంకొక బోధకుడు డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ, అతని ప్రసంగాలు రేడియోలో ప్రతిరోజూ పది సంవత్సరాలకుపైగా విన్నాను. బైబిలు నిజంగా వాస్తవమని ఈ గొప్ప పండితుల నుండి నేర్చుకున్నాను. కనుక, నేను కాల్ స్టేట్ లోని, లాస్ ఎంజిలాస్ లో, పట్టభద్ర చదువు చేస్తున్నప్పుడు, అక్కడ బైబిలును తిరస్కరించే స్వతంత్రులు బోధిస్తున్నప్పుడు నేను తికమక అవలేదు. నాకు తెలుసు వారిది తప్పు అని, బైబిలు సరి అని. తరువాత నేను శాన్ ప్రాన్సిస్కో దగ్గర ఉన్న గోల్డెన్ గేట్ బాప్టిస్టు వేదాంత విద్యా కళాశాలలో దైవత్వ పట్టా పుచ్చుకున్నాను. నిజానికి అక్కడ ప్రతి అధ్యాపకుడు బైబిలును తిరస్కరించే స్వతంత్రుడు. నాకు అక్కడ ఉండడం అసహ్యము అనిపించేది. అది చల్లనిది నిర్జీవము మరియు మృతము. "అపరాధములలోను పాపములలోను చచ్చినవారు" (ఎఫెస్సీయులకు 2:1) – అధ్యాపకులు నాకు బోధించారు వారు "అంధమైన మనస్సు గల వారై, తమ [హృదయ] కాఠిన్యము వలన, తమలో నున్న అజ్ఞానము [చేత] దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారు," ఎఫెస్సీయులకు 4:18. వారు చెప్పిన అబద్ధాలు నేను కంఠస్థం చేసాను పరీక్షలలో వారు వ్రాయమన్న జవాబులు గుర్తున్నాయి. వారి నేర్పించిన ఒక్క మాట కూడ నేను నమ్మలేదు. 119 కీర్తనలోని మూడు వచనములు స్వధర్మత సెమినరీలో నేను గడిపిన మూడు భయంకర సంవత్సరాల నుండి నెట్టుకు రావడానికి నాకు సహాయ పడ్డాయి, "నీ ధర్మ శాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది! దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి: నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు" (కీర్తనలు 119:97-99). ఆ సాతాను పర స్వతంత్రములో నా చదువు ముగించే సమయానికి, నేను ఒక చచ్చిన వాని వలే అయ్యాను. బైబిలు మాత్రమే నేను ముందుకు సాగడానికి దోహద పడింది. చాలా చల్లని ఒంటరి రాత్రులలో నేను బైబిలులో కీర్తనలు 119 తెరచి – నా గుండెపై పెట్టుకొని పడుకునే వాడిని. నేను డాక్టర్ మెక్ గీ తో పూర్తిగా ఏకీభవిస్తాను అతనన్నాడు, "స్వధర్మ ప్రపంచానికి దేవుని వాక్యమే ఏకైక విరుగుడు. దేవుని బిడ్డకు దేవుని వాక్యమే మూలము సహాయము... అది మన అవసరతలను తీరుస్తుంది... లేఖనాలన్ని దైవావేశము వలన కలిగినవి – అవి దేవునిచే ఊదబడినవి. అది దేవుడు చెప్పిందే చెప్తుంది, ఆయన చెప్పదలచుకున్నది అంతా చెప్తుంది. ఈ కారణాలన్నీ బట్టి అది మానవ హృదయ అవసరాలను తీరుస్తుంది" (McGee, ibid.; notes on II Timothy 3:14-17). ఈ ఆశీర్వాదపు దేవుని మాటలను కంఠస్థం చెయ్యండి. సామెతలు 3:5-7 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 673 వ పుటలో ఉంది. "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో; యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు: యెహోవా యందు, భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము" (సామెతలు 3:5-7). ఈ వచనాలు కంఠస్థము చెయ్యండి. మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. "నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును" (కీర్తనలు 119:130). తరువాత మీరు కంఠస్థము చేయవలసినది కీర్తనలు 119:97-99. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 660 వ పుటలో ఉంది. మనము నిలబడి గట్టిగా చదువుదాం. "నీధర్మ శాస్త్రము! నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యమునాకు తోడుగా ఉన్నవి: నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకు లందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు" (కీర్తనలు 119:97-99). కూర్చోండి. ఆ మాటలు, దేవునిచే ఇవ్వబడ్డాయి, అవి మీకు సామాజిక విద్యలో నమ్మని అధ్యాపకులు చెప్పే విషయాలు మిమ్మును దూరంగా తీసుకొని వెళ్ళిపోకుండా సహాయము చేస్తాయి. ఈ మాటలు దేవుని తిరస్కరించే పుస్తకాల నుండి మిమ్ములను కాపాడతాయి. ఈ పాపము స్వధర్మత నిండిన రోజులలో, ప్రతిరోజూ మీరు బైబిలు చదవాలని ప్రార్ధిస్తున్నాను. దానిని ప్రేమించడానిని నేర్చుకుంటారు. మీరు ఒంటరితనములో ఉన్నప్పుడు జీవితములో హృదయ వేదనలు ఎదుర్కొంటున్నప్పుడు వాక్యము మీ ప్రియ స్నేహితునిగా ఉంటుంది. నా గురువు అబ్రహాం లింకన్ అన్నాడు, "బైబిలు దేవుడు మానవునికిచ్చిన శ్రేష్టమైన బహుమానము. ఈ గ్రంథములో ఉన్నదంతా తీసుకుంటే మీరు విశ్వాసముచే సమతుల్యత పొంది, ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా మీరు జీవించి చనిపోతారు." కంఠస్థము చెయ్యడానికి ఇంకొక వచనము ఉంది. హెబ్రీయులకు 13:17 చూడండి. ఇది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1304 లో ఉంది. నిలబడి గట్టిగా చదవండి. "మీపైని నాయకులుగా ఉన్నవారు, లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే: మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు: వారి మాట విని వారికి లోబడి యుండుడి" (హెబ్రీయులకు 13:17). కూర్చోండి. "మీ పైన నాయకులుగా ఉన్నవారు" అనగా సంఘ కాపరులు. అపోస్తలుల కార్యములు 20:28 లో అపోస్తలుడైన పౌలు కాపరులకు నాయకులకు ఇలా చెప్పాడు, "దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుడి." గొర్రెల కాపరులు గొర్రెలను కాయునట్లు, సంఘ కాపరులు నాయకులు మిమ్ములను నడిపించాలి. సంఘ కాపరులు పరిపూర్ణులు కాదు. నేను కనుగొన్నాను, నా సంఘ కాపరి పరిపూర్ణుడు కానప్పటికిని, ఆయన దేవుని ప్రేమించి సేవించాడు. నేను ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఈరోజు నేను సంఘ కాపరిగా ఉండేవాడను కాను. ఇక్కడ కంఠస్థము చేయడానికి ఇంకొక భాగము ఉంది. హెబ్రీయులకు 10:24, 25. ఇది స్కోఫీల్డ్ బైబిలులో 1300 వ పుటలో ఉంది. నిలబడి చదవండి. "కొందరు మానుకోనుచున్నట్టుగా సమాజముగా కూడుట: మానక ఒకనినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినా; కొలదీ మరి ఎక్కువగా ఆలాగు చేయుచు: ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచించము" (హెబ్రీయులకు 10:24, 25). కూర్చోండి. ఆత్మీయంగా మంచి స్థానములో ఉండడానికి ఇది ప్రధాన మార్గము. అలా చెయ్యడానికి మంచి మార్గము నీవు నమ్మే ప్రజల చిన్న ప్రార్ధనా గుంపులో ఉండడం. మన సంఘములో కొంతమందితో నేను క్రమముగా సంభాషిస్తూ ఉంటాను. నా ప్రార్ధనా గుంపులో డాక్టర్ కాగన్ కొంతమంది యవనులు లేకపోతే, చాలాసార్లు నేను వదిలిపెట్టేసే వాడిని. "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును: మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును" (సామెతలు 13:20). ఇంకొక విషయము. బైబిలు చెప్పింది చెయ్యండి మీరు మార్చబడతారు. బైబిలు చెప్తుంది, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుము, నీవు రక్షించబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31). మీరు యేసును నమ్మినప్పుడు, మీ హృదయమంతటితో ఆయనను విశ్వసించినప్పుడు, మీరు రక్షింపబడతారు. ఆయన చనిపోయి, నీ స్థానములో, సిలువ వేయబడి, పాప పరిహారము చెల్లించాడు. ఆయన శరీరములో ఐదు గాయముల నుండి ఆయన రక్తము కార్చాడు. మీ పాపములన్నింటిని కడగడానికి ఆ రక్తము కార్చబడింది. రండి యేసును నమ్మండి, నిత్యత్వములో రక్షింపబడతారు. బైబిలు అలా చెప్తుంది – బైబిలు అబద్దము చెప్పలేదు, ఎందుకంటే అది సజీవుడైన దేవుని వాక్యము! నేనెన్నడూ ఎరుగని నిజ స్నేహితులు మీరు, ఆయన పరిశుద్ధ గ్రంథ పుటలలో ప్రశస్తమైన, మారని రక్షకుడైన యేసు బయలు పరచబడ్డాడు! ఆమెన్! ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట నోవాసాంగ్ గారిచే: |