ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు రక్తములో కడుగబడుటWASHED IN CHRIST’S BLOOD! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది. "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). |
వచనములో మొదటి సగభాగము అపోస్తలుడైన యోహాను వందనమును తెలియచేస్తుంది, దానిలో అతడు తన ఏడూ సంఘములలోని, ప్రేక్షకుల కొరకు, వారు యేసు క్రీస్తు నందు కృపయు సమాధానమును పొందునట్లు ప్రార్దిస్తున్నాడు, "అతడు నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి." క్రీస్తును గూర్చి ఈ ప్రకటన చేస్తూ, యోహాను చెప్పాడు, "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). పాఠ్యభాగము చెప్తుంది క్రీస్తు తన స్వరక్తముతో "మనలను ప్రేమించి, మనలను కడిగాడు." పాండిత్యము పేరుతో, ఆధునిక విమర్శకులు "కడుగబడుట"ను "వదిలివేయుట"గా మార్చారు. వారు దేనిని నాస్తికపర పాఠ్యభాగములోని ఒక గ్రీకు పదము మార్పును, ఆధారంగా చేసారు. కాని "వదిలివేయుట" పదము అలేగ్జేండ్రియన్ పాఠ్యములో నాసిరక పదము, నాస్తికత్వానికి చెందినది. నాస్తికులు ఒకరు రక్తములో "కడుగబడుటను" భరించలేక పోయారు! కనుక, నాస్తిక అలేగ్జేండ్రియనులు ఒక గ్రీకు పదమును తొలగించి – "కడుగబడుటకు" బదులు "వదిలివేయుట" గా మార్చారు. డాక్టర్ చార్లెస్ జాన్ ఎల్లికాట్ (1829-1903) ఒక ఆంగ్లికన్ తత్వవేత్త, కేంబ్రిడ్జిలో నూతన నిబంధన అధ్యాపకుడు, మరియు నూతన నిబంధన తిరుగు భాషాంతరమును అనువదించిన తత్వవేత్తల కూడలికి (RV) అధ్యక్షుడుగా ఉన్నాడు, డాక్టర్ ఎల్లికాట్ బైబిలుపై ఎల్లికాట్ వ్యాఖ్యానమునకు సంపాదకుడు (జోండిర్వాన్ పబ్లిషింగ్ హౌస్). ఎల్లికాట్స్ వ్యాఖ్యానము మన పాఠ్యభాగమును గూర్చి ఎలా చెప్తుంది, "మనలను కడిగెను" కు బదులు, కొన్ని [ప్రతులు] "వదిలి వేయబడ్డాయి" గా పేర్కొన్నాయి. గ్రీకులోని రెండు పదాలకు ఒక పదమే తేడా ఉంది. సాధారణ ఆలోచన "కడుగబడుట" నిజమైన వ్రాతగా పరిగణిస్తుంది. ఒక ప్రశస్త సందర్భములో, యోహాను తేటగా జ్ఞాపకముంచుకొన్నాడు, మన ప్రభువు చెప్పాడు, "నీవు నా వాడవు కానిచో, నీకు నాలో భాగము లేదు." "కడుగు రక్తము" అనే తలంపు, క్రీస్తు ప్రక్కలో పొడవబడిన భాగము నుండి ప్రవహించు నీళ్ళు రక్తమును ఉదృతము చేసింది [యోహాను 19:34], తరచూ తన మనసును చూపిస్తుంది, ప్రకటన 7:13, 14; I యోహాను 1:7; 5:5-8 (Charles John Ellicott, M.A., D.D., Ellicott’s Commentary on the Whole Bible, Zondervan Publishing House, n.d., volume VIII, p. 535; note on Revelation 1:5). తరువాత ఇంకా ప్రకటన 7:14 లో చెప్పబడింది, "వీరు మహా శ్రమల నుండి వచ్చినవారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, వాటిని తెలుపు చేసుకొనిన వారు" (ప్రకటన 7:14). ఆ వచనములో మనకు తేటగా చెప్పబడింది పరలోకములో ఉన్నవారి వస్త్రములు "ఉతక బడ్డాయి," మరియు "గొర్రెపిల్ల రక్తములో తెలుపు చేయబడ్డాయి." ప్రకటన 7:14 లోనిది తేట అయిన అర్ధము కాబట్టి, మన పాఠ్య భాగములోని "కడుగబడుట"ను అది తేట పరుస్తుంది: "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). డాక్టర్ జాన్ ఎఫ్. వాల్ ఊర్డు చెప్పాడు గ్రీకు పదము "లోవో" (కడుగబడుట) లో ఇంకొక పదము ఉంది "లూ" (వదిలివేయబడుట). డాక్టర్ వాల్ ఊర్డ్ చెప్పాడు ఎల్లికాట్ లాంటి పండితులు పొడవు పదము (కడుగబడుట) ను కోరుకున్నారు ఎందుకంటే "చూసి వ్రాసే వారికి ఒక పదాన్ని చేర్చడం కంటే ఒక పదాన్ని తొలగించడం సులభము" (John F. Walvoord, Th.D., The Revelation of Jesus Christ, Moody Press, 1966, footnote 1, p 38). కింగ్ జేమ్స్ అనువాదానికి ఇది బలమైన వాదన. లూథర్ యొక్క "లేఖన సారూప్యత" ఇంకా మంచిగా ఉంది – ఒక లేఖన భాగము విశద పరుస్తుంది, అదే అంశముపై మాట్లాడుతుంది – మరియు ముఖ్యంగా అదే పుస్తకములో! కనుక మనము ఆధునిక లేఖకులను చిన్న చూపు చూసి వెనుదిరుగుతాం, వారు పరిశుద్ధ ప్రేరేపిత గ్రీకు పద అనువాదము "కడుగబడుటను" మన నుండి తీసి వేయ ప్రయత్నించారు. దేవునికి వందనాలు, ప్రతి నిజ క్రైస్తవుడు యేసుకు "మహిమ" అని కేక వేయవచ్చు, "ఆయన మనలను ప్రేమించాడు, తన స్వరక్తములో మన పాపములను కడిగాడు"! దీనిని వివరించడానికి ఒక కారణము ఉంది. మీ పాపముల నుండి "కడుగబడుట" చాలా ప్రాముఖ్యము, వాటి నుండి "వదిలివేయబడుట" కాదు. మీరు దేవుని ముఖాముఖిగా చూస్తారు. తీర్పు దినాన పాప చరిత్రతో దేవుని కలుసుకుంటే, నిజంగా మీరు కష్టాలలో పడతారు! మీరు తప్పక ఆఖరి తీర్పు సమయాన పూర్తిగా పరిశుభ్ర చరిత్ర కలిగి యుండాలి లేనిచో దేవుడు నిత్య నరకాగ్నిలోనికి తోసి వేస్తాడు (ప్రకటన 20:11-15). దేవుడు మీ చరిత్రను చూచేటప్పుడు ఆయన మీలో పాపము కనుగొనకూడదు. తీర్పు దినాన మీ పాపాలు "వదిలివేయబడితే" సరిపోదు. ఓ, కాదు! నిత్య నరక హింస నుండి రక్షించబడాలంటే మీరు "కడుగబడి గొర్రె పిల్ల రక్తములో తెల్లగా [చేయబడాలి]" (ప్రకటన 7:14). ప్రకటన 7 లో మనకు చెప్పబడింది పరలోకములో ఉండువారు "గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, వాటిని తెలుసు చేసుకొనినవారు" (ప్రకటన 7:14). ఈ వచన ప్రకారము మనమందరము సురక్షితంగా ఉండాలంటే మీరు తప్పక క్రీస్తు రక్తములో శుభ్రంగా కడుగబడాలి లేనిచో నిత్యత్వములో నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ఈ విషయముపై ఇంతగా చెప్పాను. మీరు తప్పక క్రీస్తు రక్తములో శుభ్రంగా కడుగబడాలి లేనిచో నిత్యత్వములో నరకానికి వెళ్ళిపోతారు. ఈ ఉదార కొత్త సువర్తికులు "బైబిలు బోధకులు" అనుకోవచ్చు "కడుగబడుట" కు బదులు "వదిలివేయబడుట" పరవాలేదని. కాని నా పని మీలాంటి పాపులకు బోధించుట. మీ చరిత్రలో పాపాలు ఉన్నాయి! అవి శుభ్రముగా తప్పక కడుగబడాలి లేనిచో దేవుడు మిమ్ములను నరకానికి పంపిస్తాడు. ఏది మీ పాపమును కడుగుతుంది? యేసు రక్తము మాత్రమే! "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). నన్ను మీతో చెప్పనివ్వండి, ఇక్కడే ఇప్పుడే, క్రీస్తు రక్తము చాలా ప్రాముఖ్యము! మీరు నిత్యత్వము ఎక్కడ గడుపుతారనేది క్రీస్తు రక్తముపై ఆధారపడి ఉంది! మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితమూ జీవిస్తున్నారా అనేది క్రీస్తు రక్తముపై ఆధారపడి ఉంది. రక్తముపై ఇవి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. I. మొదటిది, రక్త త్యాగము ఆరంభపు కాలానికి తీసుకొని వెళ్తుంది. ప్రపంచంలో ప్రాచీన ప్రజలు అందరు రక్త అర్పణను నమ్మారు. రక్త అర్పణలు చేయబడని ప్రాచీన సంస్కృతిని చూడడం చాలా కష్టము. ఉదాహరణకు, ప్రాచీన మెక్సికో ఇండియనులు 20,000 మంది మనష్యులను వారి అన్య బలిపీటాలపై వధించారు, వారి అబద్ధపు దేవుళ్ళను విగ్రహాలను సంతోష పెట్టడానికి. మయానులు కూడ అలా చేసారు. పసిఫిక్ దీవి కొండజాతి వారు ప్రాచీన కాలములో రక్త త్యాగాలను చేసేవారు. ఆఫ్రికాలో ప్రతి తెగ అలా చేసింది. ప్రాచీన చైనీయులు, క్రీస్తు పూర్వము 2,000 సంవత్సరాల ముందు, షాంగ్ టై, అనే వారి దేవునికి రక్త అర్పణలు చేసారు. చైనీయులకు ఒక దేవుని గూర్చి తెలుసు, రక్త త్యాగము అవసరత తెలుసు, చరిత్రలో, అనాధి కాలము నుండి! అనాది చైనీయులు దేవుని గూర్చి వ్రాసారు, ఆయనకు అర్పించే రక్త త్యాగమును గూర్చి, ఎముకలపై గవ్వలపై, ఈ మధ్య అవి త్రవ్వబడ్డాయి. ఇవి నాలుగు వేల సంవత్సరాల క్రితమువి. ఈ తలంపు ఎక్కడ నుండి వచ్చింది? ఆదాము మొదటి అర్పణ నుండి ఒక తరము నుండి మరియొక తరానికి ఇది సంక్రమిస్తూ వచ్చింది. చరిత్ర ఆరంభములో ఆదికాండమును మోషే వ్రాసాడు. మన ఆదిమ తల్లిదండ్రులు పాపము చేసినప్పుడు జంతువులు చంపబడ్డాయని ఆయన ఆ వాస్తవాన్ని లిఖిత పరిచాడు. వారు కుమారుడు హేబెలు రక్త త్యాగాన్ని తెచ్చాడు అది దేవుని సంతోష పెట్టింది. అతని సహోదరుడు కయీను శాఖాహార అర్పణ తెచ్చాడు అది తిరస్కరింపబడింది. నోవాహు రక్త త్యాగాన్ని దేవుని కొరకు చేసాడు. అబ్రహాము కూడ అలాగే చేసాడు. ఇవన్నీ చాలాకాలము క్రితమే చేయబడ్డాయి యూదులు జంతువులను దేవునికి అర్పించాలి అని చెప్పబడకమునుపు. వారు ఐగుప్టులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారికి గొర్రె పిల్లలను వధించి వారి ద్వారా బంధములకు రక్తము పూయమన్నాడు. దేవుడు చెప్పాడు ఆయన ఆ రక్తమును చూచునప్పుడు ఆయన వారిని దాటిపోతానని, వారి పాపమునకు తీర్పు తీర్చను అని. దాని గూర్చి మనకొక పాట ఉంది, నేను రక్తమును చూచినప్పుడు, నేను రక్తమును చూచినప్పుడు, అది దేవుడు బానిసత్వములో ఉన్న యూదులకు చెప్పాడు, ఐగుప్తులో, మొదటి పస్కా పండుగలో. దేవుడు ఆ రాత్రి యూదులతో ఇలా చెప్పాడు, "నేను ఆ రక్తమును చూచి, మిమ్మును నశింపచేయక దాటిపోయెదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా, మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు" (నిర్గమ కాండము 12:13). యూదా ప్రజలు ఇప్పటి వరకు సూచనాప్రాయంగా పస్కా పండుగ రక్త త్యాగమును ఆచరిస్తారు. ఆయన సిలువ వేయబడుటకు ముందు రాత్రి, క్రీస్తు పస్కా పండుగ అర్ధమును మార్చాడు ఆయన ప్రభు రాత్రి భోజనముగా మార్చినప్పుడు. కొన్ని సంఘాలు దానిని పరిశుద్ధ సహవాసము అని పిలుస్తారు. కేథలిక్కులు తూర్పు చేదస్సులు దానిని ఆరాధన అని పిలుస్తారు. కాని ప్రతి త్రిత్వపర సంఘము దానిని ఆచరణలో పెడుతుంది. బైబిలు చెప్తుంది, "వారు భోజనము చేయుచుండగా, యేసు ఒక రొట్టె పట్టుకొని, దానిని ఆశీర్వదించి, విరిచి, తన శిష్యులకిచ్చి, మీరు, తీసుకొని, తినుడి అన్నాడు; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వారికిచ్చి, దీనిలోది, మీరందరూ త్రాగుడి అన్నాడు; ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము" (మత్తయి 26:26-28). చూడండి, అన్యుల రక్త త్యాగాలు అన్ని దేవునికి మానవుడు అర్పణ చెయ్యాలి అనే జ్ఞాపకము నుండి వచ్చింది. పాత నిబంధన పస్కా పండుగ చూపిస్తుంది, మెస్సియా అర్పణను, క్రీస్తు, సిలువపై చేసిన దానిని చూపిస్తుంది. ఈనాడు ప్రభూ రాత్రి భోజనము మనలను రక్షించడానికి క్రీస్తు సిలువపై చేసిన దానిని చూపిస్తుంది. సిలువపై క్రీస్తు అర్పణ, అక్కడ ఆయన రక్తము కార్చుట, ప్రపంచ చరిత్రలో ఒక కేంద్ర మత సంఘటన! "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). క్రీస్తు రక్త నెరవేర్పు సిలువపై ఎందుకు అంత ప్రాముఖ్యమో నేను చెప్పబోతున్నాను. కాని ముందు ఇంకొక విషయము వివరించాలి. II. రెండవది, క్రీస్తు రక్తమును సాతాను ధారుణంగా అసహ్యించుకొంది. ప్రకటన గ్రంథములో మనము చదువుతాము, "[సాతాను], రాత్రింబగళ్ళు మన దేవుని యెదుట, మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడియున్నాడు. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి వానిని జయించి యున్నారు..." (ప్రకటన 12:10-11). తనను జయించడానికి ఒకేఒక మార్గము గొర్రెపిల్ల రక్తము అని సాతానుకు తెలుసు – అది, క్రీస్తు రక్తము, దేవుని గొర్రెపిల్ల. సాతాను హంతకుడు అని బైబిలు చెప్తుంది. ప్రతి ఒక్కరిని వాడు నాశనము చేయాలనుకుంటున్నాడు. అందుకే వాడు క్రీస్తు రక్తమును దారుణంగా అసహ్యించుకుంటాడు. ఒక వ్యక్తి క్రీస్తు రక్తమును కలిగియుంటే, వాడు జయింపబడ్డాడని వానికి తెలుసు. పాపి క్రీస్తు రక్తము ద్వారా సాతానును జయిస్తాడు. అలా జరగడం సాతానుకు ఇష్టము లేదు. కాబట్టి క్రీస్తు రక్తమును తక్కువగా చూడడానికి వాడు చేయగలిగినదంతా చేస్తాడు. పంతొమ్మిదవ శతాబ్దము ఆఖరి భాగము 20 వ శతాబ్దము ఆరంభములో సాతాను చాలామంది పేరుగాంచిన వేదాంత స్వతంత్రులను కదిలించింది క్రీస్తు రక్తమును వ్యతిరేకించడానికి, డాక్టర్ హేరీ ఎమెర్ సన్ ఫోస్ డిక్ మరియు డాక్టర్ నెల్స్ ఫేర్రే. డాక్టర్ ఫేర్రే అన్నాడు, "క్రీస్తు రక్తము కోడి రక్తము కంటే ఎక్కువ శక్తి కలది కాదు." డాక్టర్ ఫోస్ డిక్ రక్త నేరవేర్పును, "వదించే మతము" అన్నాడు. అలాంటి వారు క్రీస్తు రక్తమునకు వ్యతిరేకంగా ఆగ్రహంగా మాట్లాడారు – వారు అలా చేయడానికి సాతానుచే ప్రేరేపితులయ్యారు. కాదు, ఇరవై శతాబ్దపు ఆఖరిలో, సాతాను క్రీస్తు రక్తమును ఇంకొక విధంగా ఎదుర్కొంది. అతడు నిబద్ధత సువార్తిక వ్యక్తులను క్రీస్తు రక్తమును గూర్చి కించపరిచేలా చేసాడు. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ, అమెరికా ప్రసిద్ధ రేడియో బైబిలు బోధకుడు, ఆ సాతాను దారిని గమనించాడు. తన గమనికలో మన పాఠ్యభాగము ప్రకటన 1:5 పై, డాక్టర్ మెక్ గీ ఇలా అన్నాడు, క్రీస్తు రక్తమును తక్కువగా చేసి మాట్లాడడానికి నేను ఇష్ట పడడం లేదు కొందరు వ్యక్తులు ఈనాడు చేస్తున్నట్టు. ఈ మాటలతో ఉన్న ఈ పాట ఇంకా నాకు ఇష్టము, రక్తముతో నింపబడిన ప్రవాహము ఉంది (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, pp. 890, 891; note on Revelation 1:5-6). క్రీస్తు రక్తమును తక్కువగా చేసి మాట్లాడే వారి గురించి డాక్టర్ మెక్ గీ చెప్తున్నాడు, ఆర్. బి. తిమో, జాన్ మెక్ ఆర్డర్, మరియు చార్లెస్ సి. రైరీ, అతడు కయీను అర్పణ గూర్చి చెప్పాడు, "రక్తము లేని అర్పణ పరిపూర్ణమైనది" (Charles C. Ryrie, Th.D., The Ryrie Study Bible, Moody Press, 1978; note on Genesis 4:3). ఆ డాక్టర్ రైరీ గమనిక చదివినప్పుడు నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. వారెన్ వియర్స్ బే మరియు రైరీ అలా చెప్పినందుకు "అభినందించాడు" అది నాకు వింత అనిపించింది! (Warren W. Wiersbe, 50 People Every Christian Should Know, Baker Books, 2009, p. 207). ఇదంతా నాకనిపిస్తుంది స్వతంత్రత పక్షపాతానికి సర్దుబాటుగా అనిపిస్తుంది. మనము స్వతంత్ర పండితుల అనుమతి కాలము వైపు చూడడం –ఆపేయాలి! ఈ వ్యక్తులు రక్షకుని రక్తము అద్భుత ప్రాముఖ్యతను గ్రహించడం లేదు! చాలామంది వారిని వెంబడించారు, వారి బాధలో రక్తమును గూర్చి చెప్పరు. నాకు ఇది అంత్యకాలపు తీవ్ర మోసముగా అనిపిస్తుంది. దానిలో మనము పడము సాతాను క్రీస్తు రక్తమును అసహ్యించుకుంటాడని మన మనసులో ఉంచుకుంటే, వాడు అబద్ధికుడు మోసగాడు! ఆమెన్. కాపరులందరూ తరచూ ప్రశస్త క్రీస్తు రక్తమును గూర్చి మాట్లాడాలి! అదే, బైబిలు చెప్తుంది కూడా, "...ప్రశస్త క్రీస్తు రక్తము" (I పేతురు 1:19). III. మూడవది, క్రీస్తు రక్తము మనలను విమోచిస్తుంది. I పేతురు పాఠ్యభాగమంతా ఇలా చెప్తుంది, "పితృ పారంపర్యమైన మీ వ్యర్ధ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, మీరు విమోచింపబడలేదు; కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా" (I పేతురు 1:18-19). మీరు బంగారముచే విమోచింపబడలేదు. వెండితో దేవుడు మిమ్ములను రక్షించడు. మీరు గుడిలో ఎంత డబ్బు ఇస్తున్నారో దానిని బట్టి దేవుడు మిమ్మును రక్షింపడు. మనము "క్రీస్తు యొక్క ప్రశస్త రక్తము" చేత విమోచింపబడియున్నాము. విమోచన అనగా ఒకరిని బానిసత్వము నుండి కొనుట. యేసు చెప్పాడు "అనేక మందికి విమోచన క్రయధనముగా తన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు" (మత్తయి 20:28). ఆయన దానిని వివరించనక్కర లేదు ఎందుకంటే ప్రపంచములో మూడులో రెండు వంతుల మంది బానిసలు ఉన్నారు. ప్రతి జాతినుండి, ప్రాచీన బ్రిటన్, స్పెయిన్ నుండి, ఆఫ్రికా నుండి – అన్ని చోట్ల నుండి బానిసలు ఉన్నారు. ప్రతి గుంపు ప్రపంచములో ఏదో ఒక సమయములో బానిసత్వములో ఉంది. యూదులు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, నేను ముందు చెప్పినట్టు. అపోస్తలుడైన పేతురు అన్నాడు క్రీస్తు తన స్వరక్తముతో బానిసత్వము నుండి నిన్ను కొంటాడు. ఎందుకు ఆయన తిరిగి కొంటాడు? పాపపు బానిసత్వము నుండి. లాస్ ఎంజిలాస్ లో లక్ష లాదిమంది పాపానికి బానిసలు. వారు సిగరెట్లకు అలవాటు పడ్డారు – విడిచి పెట్టరు. వారు అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డారు, చూడడం మానరు. మీరు ఆ పాపమునకు దాసులు! కాని బైబిలు చెప్తుంది క్రీస్తు మిమ్ములను విడిపించగలడు. తిరుగుబాటు చేసే నమ్మని హృదయము అనే నీ పాపము నుండి ఆయన నిన్ను విమోచించగలడు. నేననుకుంటాను ఇది చాలా కష్టమైనది. క్రీస్తు మీ అవిశ్వాసపు దుష్ట హృదయము నుండి మిమ్ములను విమోచిస్తాడు! ఇంకా చాలా ఉంది కాని కాలము పరిగెడుతుంది! మీ పూర్తి రక్షణ క్రీస్తు రక్తముపై ఆధారపడి ఉంది! క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను విమోచించును! విలియమ్ కూపర్ ఇలా అన్నాడు, మొదటి నుండి విశ్వాసము ద్వారా, నేను ప్రవాహాన్ని చూసాను మరియు ఫేన్నీ క్రాస్ బీ అన్నాడు, విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, IV. నాల్గవది, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను కడుగును. యేసు ఎవరో మర్చిపోవద్దు! ఆయన ఎవరో కాదు! మీకు తెలిసిన వేరే వారి ఎవరి రక్తము మీ పాపము నుండి శుద్ధి చేయలేదు. కాని యేసు వీధిలో ఏదో వ్యక్తి కాదు. ఓ, కాదు! యేసు దేవుని నిత్యత్వ కుమారుడు, పరిశుద్ధ త్రిత్వములో రెండవ వ్యక్తి, "దేవుడే కేవలము దేవుడే." "సమస్తమును ఆయన మూలముగా కలిగెను; కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు" (యోహాను 1:3). ప్రభువైన యేసు క్రీస్తు ఆయన దివి నుండి రాకమునుపు సర్వసృష్టిని సృష్టించాడు. ఆయన రక్తము మీ పాపములను కడిగివేస్తుంది – పరలోకానికి వెళ్ళడానికి తగినట్టుగా శుద్ధి చేస్తుంది! అపోస్తలుడైన యోహాను అన్నాడు, "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). మన పాఠ్యభాగము అదే విషయాన్ని చెప్తుంది, "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). మీకు అలా జరగాలనుకుంటున్నారా? సాతాను బంధకాల నుండి రక్షింప బడాలనుకుంటున్నారా? క్రీస్తు రక్తము అలా చేయగలదు! పాపము నుండి విమోచింపబడాలనుకుంటున్నారా? క్రీస్తు రక్తము అలా చేయగలదు! మీ పాపమంతటి నుండి కడుగబడాలనుకుంటున్నారా, తద్వారా పరలోకానికి వెళ్లి మాతో కూడ ఆనందించాలనుకుంటున్నారా? క్రీస్తు రక్తము అలా చేయగలదు! కాని ఒకటి మీరు తప్పక చెయ్యాలి. క్రీస్తు రక్తము అవి మీకు చేసే ముందు, మీ పాపము నుండి మీరు వైదొలగాలి. అది మొదటిది. మీ పాపముల నుండి తిరగాలి. తరువాత, రెండవదిగా, మీరు యేసును విశ్వసించాలి. విశ్వాసము ద్వారా ఆయన యొద్దకు వచ్చి ఆయన విశ్వసించాలి. ఒకరన్నారు, "అంతేనా?" అవును! అంతే! ఆయన రక్తము మీ ప్రతి పాపమును కడిగి, తండ్రి దేవుని సహవాసములోని సంతోషములోనికి మిమ్ములను తీసుకొని వస్తుంది! మీరు మీ పాపముల నుండి వైదొలగి యేసును విశ్వసిస్తారా? గ్రిఫిత్ గారు మళ్ళీ పాడతారు వినండి. చాలా వేగంగా పాడకండి, గ్రిఫిత్ గారు. వెండిగాని బంగారము గాని నాకు విమోచనం ఇవ్వలేదు, యేసును విశ్వసించడం గూర్చి మీరు మాతో మాట్లాడాలనుకుంటే, మిగిలిన వారు పై అంతస్తుకు భోజనానికి వెళ్తుండగా, మీరు వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తు రక్తములో కడుగబడుట WASHED IN CHRIST’S BLOOD! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది. "మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి కడిగెను" (ప్రకటన 1:5). (ప్రకటన 7:14)
I. మొదటిది, రక్త త్యాగము ఆరంభపు కాలానికి తీసుకొని వెళ్తుంది,
II. రెండవది, క్రీస్తు రక్తమును సాతాను ధారుణంగా అసహ్యించుకొంది,
III. మూడవది, క్రీస్తు రక్తము మనలను విమోచిస్తుంది, I పేతురు 1:18, 19;
IV. నాల్గవది, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను కడుగును, |