Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సిలువను గూర్చిన బోధ

THE PREACHING OF THE CROSS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది.
రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు
ప్రభువుదినము ఉదయము, మే 27, 2018
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 27, 2018

"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము; గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (I కొరింధీయులకు 1:18).


మన కాపరి, డాక్టర్ హైమర్స్, అరవై సంవత్సరాలుగా బోధిస్తున్నారు. ఆయన వేలాది ప్రసంగాలు చేసారు. నేను బోధిస్తున్న ఈ ప్రసంగము ఆయన వ్రాసారు. వందల కొలది ఆయన ప్రతులు మన వెబ్ సైట్ లో ఉన్నాయి, పదము వారిగా. అవి 39 భాషలలోనికి అనువదింపబడుచున్నాయి. ప్రసంగపు విడియోలు ప్రతులు ప్రపంచములో 221 దేశాలకు వెళ్తున్నాయి. ప్రపంచములోని కాపరులు ఆయన ప్రసంగాలు బోధిస్తున్నారు. డాక్టర్ హైమర్స్ విశిష్టమైన బోధకుడు! అయినను, తన అనుభవము అంతటితో, ఏమి బోధించాలో నిర్ణయించుకోవడం ఆయనకు కష్టము అవుతుంది

"ఎందుకు అంత కష్టము?" అని మీరు అడగవచ్చును. ఎందుకో చెప్తాను. నిజ క్రైస్తవులు కాని వారు చాలా మంది ఆదివారము ఉదయము మన ఆరాధనలో ఉంటారు. కొంతమంది బుద్ధ గతము వారు. ఇతరులు కేథలిక్ లేక కొత్త సువార్తిక గతము వారు, నామకార్ధపు క్రైస్తవులు, పేరుకు మాత్రము క్రైస్తవులు. కొంతమందికి నిజమైన మతపర గతము లేనేలేదు. మిగిలిన వారు మన సంఘములో రక్షింపబడని వారు, వారికి బైబిలు బాగా తెలుసు, కాని ఎన్నడు నూతన జన్మ అనుభవించలేదు. వారి అందరిలో ఒకటి కనిపిస్తుంది. వారు నిజముగా యేసు క్రీస్తు నందు మార్పు నొందరు.

ఆదివారము ఉదయము ప్రసంగము గంటకంటే తక్కువగా ఉంటుంది. ఆ గంటలో, చెప్పే ప్రసంగము మీరు మతమును గూర్చి అనుకునేది మార్చగలగాలి, నిజ క్రైస్తవ్యాన్ని వాస్తవము చెయ్యాలి, ఒక సత్యము కాదు, కాని అసలు సత్యము – ఒకే సత్యము. మీరు దానితో ఏకిభవించేలా ప్రసంగము మీ ఆలోచనా విధానాన్ని మార్చాలి, మీ అబద్ధపు అభిప్రాయాలకు స్వస్తి చెప్పేలా చూడాలి, పాపపు ఒప్పుకోలు క్రిందకు రావాలి, మీ జీవితాన్ని యేసు వైపునకు త్రిప్పాలి. అది పెద్ద పని! ఒక గంట మాత్రమే సమయము! నేను బోధించబోయేది సామాన్య సువార్త ప్రసంగములా అనిపించవచ్చు, కాని దాని వెనుక గొప్ప ఆలోచన ప్రార్ధన ఉన్నాయి.

మన పాఠ్యభాగము లేఖనాలలో ఒక వచనము. దానిలో నుండి నేను చెప్పుచున్నవి మీకు సహాయ పడాలని నేను ప్రార్ధిస్తున్నాను; కనీసం అందులో కొంత అయినా, మీరు జ్ఞాపకము ఉంచుకోవాలని, నా ప్రార్ధన, కనీసము నేను చెప్పు తలంపులు మిమ్ములను ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి ఆలోచింపచేయాలి, నీ ఆత్మ రక్షణ నిమిత్తము. ఆయన, ఏమి చేసాడో తెలుసుకోవాలి, ఇక్కడ పాఠ్యభాగము, I కొరింధీయులకు 1:18. నేను చదువుచుండగా వినండి.

"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము; గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (I కొరింధీయులకు 1:18).

ఈ ప్రసంగములో మూడు ప్రాముఖ్య విషయాలు ఉంటాయి: (1) సిలువను గూర్చి బోధించడం; (2) నశించుచున్న వారికి సిలువను గూర్చిన బోధ వెర్రితనము; మరియు (3) బలమైన సంఘము కలిగి ఉండడానికి సిలువను గూర్చిన బోధ మాత్రమే సరిపోదు.

I. మొదటిది, సిలువను గూర్చి బోధించడం.

"సిలువను గూర్చి బోధించడం" ఈ మాటలపై, అపోస్తలుడైన పౌలు ఉద్దేశము ఏమిటి? పదము, "సిలువను గూర్చి బోధించడంలో," ఒక ముఖ్య నియమితమైన విషయము ఉంది. దాని అర్ధము ఈ మాటలలో ఒక సత్యము దాగి ఉంది. ఒక ఏకైక నిజ సువార్తను అవి సూచిస్తున్నాయి. సువార్త ఒక్కటే, దేవుడు ఒక్కడే అయినట్లు. ఒకే రక్షకుడు – యేసు క్రీస్తు. "సిలువను గూర్చి బోధించడం" నా విషయంలో నిజము మీ విషయములో కాదు అనలేము. అధునాతన వ్యక్తి చెప్పవచ్చు, "అది మీ సత్యము. అది మీకు నిజము. కాని అది నా సత్యము కాదు." నేనంటాను అవి ఆధునికుని ద్వంద్వ మాటలు. బైబిలు సిలువను గూర్చి మాట్లాడుచున్నప్పుడు, అది నిర్దిష్ట సత్యమును గూర్చి మాట్లాడుతుంది – ఆ సత్యము ప్రతి ఒక్కరికి అలాగే వర్తిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యముగానే ఉంటుంది. దేవుడు దానిని గూర్చి బైబిలులో మాట్లాడాడు కాబట్టి, అది మీరు సత్యము కాదా అనుకున్నప్పటికీ. అది సత్యమే, అది నిర్ధిష్టమైన సత్యము, అంటే మీ మనసు దాని ప్రాముఖ్యతను గ్రహించనప్పటికి అది సత్యమే.

తరువాత, "సిలువను గూర్చి బోధించడం" కనుగొనబడింది, బైబిలు చెప్పడం మాత్రమే కాదు, చారిత్రాత్మక సత్యాలు కూడ – వాస్తవము యేసు క్రీస్తు మీ పాపము నిమిత్తము లోతుగా శ్రమపడ్డాడు, గెత్సమనే వనములో గొప్ప వేదన బాధను అనుభవించాడు, మీ పాపములు ఆయన శరీరముపై మోపబడినప్పుడు. పిలాతు సభలో వారు ఆయనను చావ కొట్టినప్పుడు ఆయన భయంకర శ్రమ ద్వారా వెళ్ళాడు. అప్పుడు ఆయన కల్వరి కొండకు ఈడ్చాబడ్డాడు, అక్కడ ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారు, సిలువపై ఎక్కించారు, అక్కడ వేలాడ దీసారు, మీ పాప పరిహారార్ధం ఆయన రక్తము కార్చాడు చనిపోయాడు, తద్వారా మీరు రక్షింపబడడానికి, మీ పాపము క్షమించబడడమే కాదు, ఆయన మరణము ద్వారా నీతిమత్వము చేయబడడానికి, మీరు త్వరగా పాప రహితులుగా లెక్కింపబడతారు ఆయన యందు విశ్వాసము ఉంచడము ద్వారా.

"సిలువను గూర్చి బోధించడం" మీరు ఏ స్థితిలో ఉన్నారో చూపిస్తుంది

"మీ పాపముల యందు చచ్చిన వారు" (కొలస్సయులకు 2:13),

అది నీకు బదులుగా నీ స్థానములో క్రీస్తు మరణము, మీ పాపముల కొరకు చెల్లించడానికి, మీ పాపములను రద్దు చేయడానికి, మృతులలో నుండి క్రీస్తు పునరుత్థానము ద్వారా మీకు నూతన జీవము ఇవ్వడానికి.

"సిలువను గూర్చి బోధించడం" చూపిస్తుంది మంచి క్రియల ద్వారా మీరు రక్షణను సంపాదించుకోలేరని లేక అప్పుడప్పుడు గుడికి రావడం ద్వారా. లేదు! లేదు! సిలువను గూర్చి బోధించడం మీరు ఏ మంచి చేసినా మీ రక్షణతో దానికి సంబంధము లేదు. "సిలువను గూర్చి బోధించడం" మీరు చేసే "మంచి" పనులన్నింటిని తుడిచి పెట్టుతుంది – ఇంకా ఇలా చెప్తుంది సిలువ మీద యేసు చేసినది మాత్రమే మిమ్ములను రక్షిస్తుంది మీ పాపము నిమిత్తము పూర్తి నెరవేర్పు ఆయన చేసాడు – ఒక వ్యక్తి, క్రీస్తు (దైవ మానవుడు) మీ పాపాల కొరకు చనిపోయాడు, మీరు చేసిన మంచి పనులను లెక్కలోనికి తీసుకోకుండా, లేక మీరు తీసుకున్న "నిర్ణయాలు" బట్టి కాకుండా.

మీరు కొన్ని మంచి పనులు చేసారు నాకు సందేహము లేదు. నేను చెప్తున్నాను ఈ మంచి పనులు మిమ్ములను రక్షింపనేరవు! రక్షణ యేసు మరణము ద్వారా వస్తుంది, యేసు దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు, త్రిత్వములో రెండవ వ్యక్తి, ఆయన మీ పాపములను ఆయనపై వేసుకున్నాడు వాటి కొరకు సిలువపై మేకులతో కొట్టబడినప్పుడు చెల్లించాడు. అపోస్తలుడైన పౌలు చాలా తేటగా ఈ విషయము చెప్పాడు,

"అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి [చూపించడం] పరచుచున్నాడు, ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము" (రోమా 5:8-9).

మీరింకను పాపులై యుండగానే దేవుడు మిమ్ములను ప్రేమించాడు. మీరింకను పాపులుగా యుండగానే క్రీస్తు మీ పాపాలకు పరిహారము చెల్లించడానికి క్రీస్తు చనిపోయాడు. మీరు పాపులైనప్పటికి ఆయన రక్తము ద్వారా, నీతిమంతులుగా తీర్చబడతారు.

యేసు ప్రభూ, దీని నిమిత్తము నేను బహు వినయముగా బతిమాలుకొనుచున్నాను,
   నేను కనిపెట్టి, ఆశీర్వాధపు ప్రభూ, మీ సిలువ వేయబడిన పాదముల చెంత;
విశ్వాసము ద్వారా, నా శుద్ధి కొరకు, మీ రక్త ప్రవాహము చూస్తాను,
   ఇప్పుడు నన్ను కడుగు, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.
హిమము కంటే తెల్లగా, అవును, హిమము కంటే తెల్లగా;
   ఇప్పుడు నన్ను కడుగు, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.
("హిమము కంటే తెల్లగా" జేమ్స్ నికొల్సన్ చే, 1828-1896).
       (“Whiter Than Snow” by James Nicholson, 1828-1896).

నేను మీ ఆహ్వానపు స్వరము వింటున్నాను,
   అది పిలుస్తుంది, ప్రభూ, మీ చెంతకు
మీ ప్రశస్త రక్తములో కడుగబడడానికి
   అది కల్వర్లో ప్రవహిస్తుంది.
నేను వచ్చుచున్నాను, ప్రభూ! ఇప్పుడే మీ యొద్దకు వచ్చుచున్నాను!
   నన్ను కడగండి, రక్తములో శుద్ధి చేయండి
అది కల్వరిలో ప్రవహించింది.p
("నేను వచ్చుచున్నాను, ప్రభూ" లూయిస్ హార్ట్ సాంగ్ చే, 1828-1919).
(“I Am Coming, Lord” by Lewis Hartsough, 1828-1919).

అది సిలువను గూర్చి బోధించడం అంటే!

"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము; గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (I కొరింధీయులకు 1:18).

కాని మన పాఠ్యభాగములో మరొక తలంపు ఉంది.

II. రెండవది, నశించుచున్న వారికి సిలువను గూర్చిన బోధ వెర్రితనము.

దయచేసి ఆ మాటలు వినండి,

"నశించుచున్న వారికి సిలువను గూర్చిన బోధ వెర్రితనము."

మళ్ళీ పాఠ్యభాగము వినండి.

"నశించుచున్న వారికి సిలువను గూర్చిన బోధ వెర్రితనము..." (I కొరింధీయులకు 1:18).

"వెర్రితనము" అనగా "అవివేకపు మాట," "పిచ్చితనము" అని అర్ధము. క్రీస్తు మరణము ద్వారా మీరు రక్షింపబడాలి అనే బోధ వినడం "అవివేకపు మాట" మార్పు చెందని మనసుకు.

వారి పాప పరిహారార్ధం క్రీస్తు ప్రత్యామ్నాయ మరణమును గూర్చిన బాధలో నశించువారికి దానిలో విలువ కనబడదు. దాని విలువ తెలియదు కనుక అది వారికి వెర్రితనము. అక్కడ పరిశుద్ధాత్మ వస్తాడు. యేసు చెప్పాడు,

"ఆయన వచ్చి పాపమును గూర్చి, లోకమును ఒప్పుకొనజేయును..." (యోహాను 16:8).

పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఒప్పింప చేయాలి, పాపమును గూర్చి ఒప్పుకోలు ఇవ్వాలి, లేనిచో సిలువపై క్రీస్తు మరనములోని విలువ అతనికి తెలియదు. పాపమును గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి ఒప్పింపబడక మునుపు, అతడు సిలువను గూర్చిన బోధ వెర్రితనము అనుకుంటాడు. గ్రీకు పదము "వెర్రితనము" మూలపదము "మొరోన్" నుండి వచ్చింది, దాని నుండి మన ఆంగ్ల పదము "మొరోన్" వచ్చింది. సిలువను గూర్చిన బోధ పరిపక్వత లేని వ్యక్తి మాటగా, మూర్ఖుడు మాటగా ఉంటుంది, మీరు నశించిన పాపి అని, దేవుని ఆత్మ ద్వారా, మీ హృదయములో ఒప్పింపబడనంత వరకు.

అందుకే నిజ క్రైస్తవునిగా నీవు "నేర్చుకోలేవు." మానవ జ్ఞానము నేర్చుకోవడం ద్వారా రక్షణ రాదు. అపోస్తలుడైన పౌలు ఇరవై ఒకటవ వచనములో, దానిని తేటగా ఇలా చెప్పాడు,

"లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగదు" (I కొరింధీయులకు 1:21).

మానవ జ్ఞానము నేర్చుకొనుట ద్వారా రక్షణ రాదు. హృదయములో ఒక భావన ఉండాలి, మీరు నిరీక్షణ లేని పాపులను గ్రహించాలి. అది జరిగే వరకు, క్రీస్తు సిలువ మరణము మీ సమస్యకు పరిష్కారము అనే బోధ పరిపక్వత లేని వ్యక్తి మాటగానే ఉంటుంది. మీ సమస్య పాపము అని అంతరంగములో మీరు భావించకుండా, సిలువపై క్రీస్తు మరణము యొక్క ప్రాముఖ్యతను మీరు ఎన్నడు చూడలేదు. బైబిలు చెప్తుంది,

"క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను" (I కొరింధీయులకు 15:3).

ఆయన మన స్థానములో చనిపోయాడు, మన పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. బైబిలు చెప్తుంది,

"అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7).

కాని అది ఒక ఆసక్తి కరమైన కథలా కనిపిస్తుంది, ఒక అవివేకి మాటలా ఉంటుంది, పాప శాపము నుండి రక్షించడానికి వేరే మార్గము లేదని గ్రహించడానికి దేవుని ఆత్మ మీ కన్నులను తెరచే వరకు కథలాగే ఉంటుంది. మీ నిస్సహాయ పాప స్థితిని గూర్చి మీరు ఒప్పింపబడినప్పుడు మాత్రమే మీ హృదయములో నుండి ఈ పాట పాడగలరు,

నాలో ఏ మంచితనము లేదు
   నేను మీ కృపను పొందడానికి –
నేను నా వస్త్రములు తెల్లగా కడుగుకుంటాను
   కల్వరి గొర్రెపిల్ల రక్తములో.
యేసు అంతా చెల్లించేసాడు, నేను అంతా ఆయనకు ఇచ్చుకోవాలి;
   పాపము పాపపు మరకను ఉంచి వేసింది,
ఆయన దానిని హిమము వలే తెల్లగా కడిగాడు.
("యేసు అంతా చెల్లించేసాడు" ఎల్వినా ఎం. హాల్, 1820-1899).
       (“Jesus Paid It All” by Elvina M. Hall, 1820-1899).

కాని సిలువను గూర్చి బోధించడం మాత్రమే మనకు బలమైన సంఘమును అనుగ్రహించదు. అది నన్ను ఆఖరి విషయానికి తీసుకొని వస్తుంది.

III. మూడవది, బలమైన సంఘము కలిగి ఉండడానికి సిలువను గూర్చిన బోధ మాత్రమే సరిపోదు.

మీరు రక్షించబడాలంటే సిలువను గూర్చిన బోధ అవసరము. సిలువపై క్రీస్తు మరణించి తన రక్తమును కార్చాడు మిమ్ములను పాపము నుండి రక్షించడానికి. కాని సిలువను గూర్చి బోధించడం మాత్రమే మనకు శక్తిగల సంఘాన్ని ఇవ్వదు. అందుకే క్రీస్తు సంఘాలకు సంఘ కాపరులను ఇచ్చాడు. బైబిలు చెప్తుంది క్రీస్తు "కొంతమంది...కాపరులను" ఇచ్చాడని (ఎఫెస్సీయులకు 4:11). గ్రీకు పదము "కాపరి" పోయ్ మెన్ గా అనువదింపబడింది. దాని అర్ధం "కాపరి." యేసు కొంతమందికి, సంఘ కాపరిగా, కాపరిగా ఉండే, వరాన్ని ఇచ్చాడు. సంఘమునకు కాపరి బహుమానము. సంఘములోని వారు, గొర్రెల మంద. కాపరి సంఘమునకు సంఘ కాపరి. అతడు గొర్రెలను చూసుకుంటాడు. అతడు గొర్రెలను కాపాడతాడు. అతడు వాటిని నడిపించి ఇటు అటు తిరుగకుండా కాపాడుతాడు. ఇది కాపరి చేస్తాడు.

ఇంకొక గ్రీకు పదము "కాపరి" కి ఎపిస్ కోపోస్. దాని అర్ధము "చూచువాడు." కింగ్ జేమ్స్ బైబిలులో అది "బిషప్" గా అనువదింప బడింది. బైబిలు చెప్తుంది, "ఎవడైనను అధ్యక్ష పదవిని [ఎపిస్కోఫోస్, చూచువాడు, సంఘ కాపరి], అతడు మంచి పనిని అపేక్షించుచున్నాడు" (I తిమోతి 3:1). సంఘ కాపరి సంఘాన్ని చూసుకుంటారు. అతడు దానిని చూసుకుంటాడు. వాస్తవంగా దానిని కాపాడుకుంటాడు. సంఘాన్ని గమనిస్తూ ఉంటాడు. అతడు ప్రార్ధించి గుడికి గూర్చి ఆలోచిస్తాడు. గుడి ఎలా ఉందో చూస్తాడు. సమస్యలేంటో చూస్తాడు. ఇతరులు చూడనట్టుగా కాపరి సంఘాన్ని చూసుకుంటాడు. దేవుని నడిపింపుతో, ఏమి చెయ్యాలో చూస్తాడు. సంఘ కాపరి గుడిలోని ప్రజలను – చూసుకుంటాడు – గమనిస్తాడు. వారు ఎలా ఉన్నారో చూస్తాడు. వారి కష్టాలు సమస్యలు అతడు చూసుకుంటాడు. దేవుడ్ని నడిపింపుతో, వారి క్రైస్తవ జీవితాలలో విజయులగునట్లు వారికి సహాయము చేస్తాడు.

తలంత గలిగిన సంఘ కాపరి లేకుండా, సంఘము విజయవంత మవదు. అన్ని కార్యకలాపాలు ఉండవచ్చు. కూటములు ఉండవచ్చును. ఆదివారము సందర్శకులను తీసుకొని రావచ్చు. మేము మీకు పాటల కాగితాలు కార్యక్రమ వివరాలు ఇవ్వవచ్చు. మీకు భోజనము పెట్టవచ్చు. మంచి బోధ ఉండవచ్చు – సిలువను గూర్చిన బోధ – మేము చేస్తున్నాము. కాని సిలువను గూర్చిన బోధ మాత్రమే మనకు బలమైన సంఘమును ఇవ్వలేదు.

ఎందుకు దేవుడు సంఘానికి సంఘ కాపరులును ఇచ్చాడు? ఎందుకు కాపరి అనే తలంతు ఒక ఆత్మీయ తలంతుగా ఎన్నిక చేయబడింది? బోధించడమే ఒక బలమైన సంఘాన్ని తయారు చేస్తే, ఎందుకు మన ప్రభవు "కొంతమంది, సువార్తికులను" ఎందుకు ఇవ్వలేదు మరియు కాపరులు కాకుండా? క్రీస్తుకు తెలుసు సిలువను గూర్చి బోధ మాత్రమే బలమైన సంఘము కలిగి ఉండడానికి సరిపోదని ఆయనకు తెలుసు. సంఘానికి సంఘ కాపరి అవసరము, అందుకే ఆయన "కొంతమంది...కాపరులను ఇచ్చాడు."

సంఘ కాపరి లేకుండా, సంఘము విఫలమవుతుంది, బోధించడం బాగున్నప్పటికినీ. అది బలహీనమవుతుంది. అది కష్టాలలో పడుతుంది. చివరకు అది చనిపోతుంది. సంఘ కాపరి లేకుండా, సంఘములోని ప్రజలు వెనుదిరుగుతారు. వారు చల్లారిపోతారు. వారి జీవితాలలో పెద్ద తప్పిదాలు చేస్తారు. వారు కష్టాలలో పడతారు. ఎందుకు?

మొదటిది, ఎందుకంటే సాతాను ఉంది. బైబిలు చెప్తుంది వాడు "[గర్జించు సింహాము] వలే, ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు" (I పేతురు 5:8). ఎవరు తిరుగుచున్నాడు? గొర్రెలు! కాని సాతాను తనను గూర్చి ఆలోచింపనివ్వదు. మీ పైకి దూకి తినాలను చూస్తుంది – అని సాతాను అనే సంగతి కూడ మీరు గ్రహించరు! సాతాను వాని అనుచరులు ఉన్నారు – మీకు జ్ఞాపకమున్న లేకపోయినా.

రెండవది, ఎందుకంటే ప్రజలందరూ పాపలు కాబట్టి. ఆదాము దేవునికి అవిదేయుడయ్యాడు కనుక, మనమందరము పాపపు స్వభావముతో జన్మించాము. బైబిలు చెప్తుంది, "ఒక మనష్యుని [ఆదాము] అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు" (రోమా 5:19). ప్రతి ఒక్కడు – క్రైస్తవులు కూడ – పాపపు స్వభావము కలిగి యున్నారు. పాపము చేయుట మనకు సహజము. తప్పుచేయడం మనకు సహజము. మర్ఫీ న్యాయము చెప్తుంది, "ఏదైనా తప్పు జరుగుతుందా, జరుగుతుంది." విషయాలు వాటికవే సహజంగా బాగుపడవు. అవి తప్పు అవుతాయి, సులభంగా, వారు తప్పు చేస్తారు. ప్రజలు సహజంగా. తమకు తామే బలమైన క్రైస్తవులు కానేరరు. వారు వెనుదిరుగుతారు. వారు చల్లారిపోతారు. వారు తప్పులు చెయ్యవచ్చు. వారు చేస్తారు కూడ. అది జరగడానికి మీరు కష్టపడి పని చేయనక్కర లేదు. అనుకోకుండా జరిగిపోతుంది. సంఘాలు వాటికి అవే సహజంగా బలమైనవి కానేరవు. అవి బలహీనపడవచ్చు. శ్రమలలో పడవచ్చు. అది చాలా సులభము. అలా జరగడానికి మీరు పని చెయ్యనక్కరలేదు. దానంతట అదే జరుగుతుంది! అలా అయిపోతుంది. అందుకే గుడికి సంఘ కాపరి అవసరము. క్రీస్తు "కొంతమంది...కాపరులను" ఇచ్చాడు. అలా చేసాడు దేవునికి వందనాలు!

మన సంఘ కాపరి డాక్టర్ హైమర్స్. అరవై సంవత్సరాలుగా సేవలో ఉంటున్నారు. వందలాది మంది క్రీస్తు నొద్దకు వచ్చునట్లు దేవుడు ఆయనను వాడుకున్నాడు. చాలా సంవత్సరాలుగా ఆయన ప్రజలకు ఉపదేశము ఇస్తున్నారు. ఆయన ప్రజలను చూసుకుంటున్నారు. ఆయన వారికి సహాయము చేసాడు. డాక్టర్ హైమర్స్ రెండు సంఘాలు స్థాపించారు. ఆయన మన సంఘాన్ని కష్టాలు శ్రమల గుండా నడిపించాడు. భయంకర చీలిక ద్వారా మన సంఘాన్ని ఆయన నడిపించాడు. మన సంఘాన్ని నిర్మించుకోవడానికి, మనలను చూసుకోవడానికి, మనలను సంరక్షించడానికి, కాపాడుకోవడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. డాక్టర్ హైమర్స్ కేవలము సంఘ కాపరు కాదు. ఆయన విశిష్టమైన సంఘ కాపరి! మన సంఘ కాపరి డాక్టర్ హైమర్స్ ను బట్టి, నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను!

మీ సంగతి ఏమిటి? మీరు సంఘ కాపరి కాదు. కాని మీరు ఆయనకు సహాయ పడవచ్చు. తప్పు ఏదైనా మీరు చూస్తే ఆయనకు చెప్పవచ్చు. సంఘ పరిచారకులకు సంఘ నాయకులకు కూడ ఇది సత్యమే. మీరు సంఘ కాపరికి సహాయ పడడానికి ఇక్కడ ఉన్నారు. పనులు అలా అయిపోనివ్వకండి. సంఘ కాపరికి తెలుసని అనుకోకండి. మీరు ఏదైనా తప్పు అని చూసినా వినినా, సంఘ కాపరికి చెప్పండి.

మీలో కొందరు క్రైస్తవులు కానే కారు. మీరు యేసును విశ్వసించలేదు. ఆయన రక్తముతో మీ పాపము కడుగబడలేదు. మీ సంగతి ఏమిటి? మీరు క్రీస్తుచే రక్షించబడాలి. మీ పాప పరిహారార్ధం ఆయన సిలువపై మరణించాడు. మీ పాపాలను కడిగి వేయడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. మీకు జీవము ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడు. యేసును నమ్మడం విషయంలో మీరు మాతో మాట్లాడాలనుకుంటే, ఇతరులు భోజనానికి పై అంతస్తుకు వెళ్ళేటప్పుడు, మీరు వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"క్రీస్తు వచ్చుచున్నాడు" (హెచ్. ఎల్. టర్నర్ చే, 1878).
“Saved by the Blood of the Crucified One” (by S. J. Henderson, 1902).



ద అవుట్ లైన్ ఆఫ్

సిలువను గూర్చిన బోధ

THE PREACHING OF THE CROSS

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది.
రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan

"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము; గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (I కొరింధీయులకు 1:18).

I.   మొదటిది, సిలువను గూర్చి బోధించడం, I కొరింధీయులకు 1:18ఏ;
కొలస్సయులకు 2:13; రోమా 5:8-9.

II.  రెండవది, నశించుచున్న వారికి సిలువను గూర్చిన బోధ వెర్రితనము,
I కొరింధీయులకు 1:18బి; యోహాను 16:8; I కొరింధీయులకు 1:21; 15:3;
I యోహాను 1:7.

III. మూడవది, బలమైన సంఘము కలిగి ఉండడానికి సిలువను గూర్చిన బోధ మాత్రమే సరిపోదు, ఎఫెస్సీయులకు 4:11; I తిమోతి 3:1; I పేతురు 5:8; రోమా 5:19.