ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
బైబిలు ప్రవచనము మిమ్ములను పురికొల్పనివ్వండి!LET BIBLE PROPHECY MOTIVATE YOU! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. ప్రసంగము లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి" |
అపోస్తలుడైన పౌలు ఈ వచనాలలో "ఎత్తబడుటను" గూర్చిన వివరణ ఇచ్చాడు. తరువాత మన పాఠ్యభాగము ప్రస్తావించాడు, "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి" (I దెస్సలోనీకయులకు 4:18). "ఆదరణ"కు గ్రీకు పదము "పరాకలియో." దాని అర్ధము "ఆదరణ" మరియు "ప్రోత్సహించుట" (ఎన్ఐవి) (NIV). పాఠ్యభాగమంతా 13 నుండి 17 వచనము వరకు ఉంది. ఈ యుగాంతమున క్రైస్తవులు "ఎత్తబడుట"ను ఈ పాఠ్యభాగము చెప్తుంది. రోమా అన్య మతస్తుల నుండి నమ్మని యూదుల నుండి దెస్సలోనీకయులు హింసలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది చనిపోయారు. హత సాక్ష్యులుగా మరణించారు! దీని వలన దెస్సలోనీకయులకు తొందర పెట్టబడ్డారు. కనుక పౌలు వారిని ప్రోత్సహించడానికి "ఎత్తబడుటను" గూర్చి చెప్పాడు. "ఎత్తబడుటను" గూర్చి డాక్టర్ థామస్ ఇలా వివరణ ఇచ్చాడు: "క్రీస్తు వచ్చునప్పుడు జీవించి ఉండువారు పరలోకమునకు కొనిపోబడుదురు. అప్పుడు జీవించువారు చనిపోయిన వారితో కలుస్తారు... కాబట్టి ఈ మాటలచేత మీరు ఒకనికొకడు ఆదరించుకొనుడి" (The Applied New Testament Commentary; note on I Thessalonians 4:17, 18). నేను ఈ పాఠ్యభాగముపై, "ఎత్తబడుటను" గూర్చి వివరముగా ఇంకొక సారి చెప్తాను. నా ఉద్దేశము ఈ రాత్రి మీకు చూపించడం బైబిలు ప్రవచనమునకు ఒక ముఖ్య కారణము మిమ్ములను ఆదరించుట మరియు ప్రోత్సహించుట. "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి" (I దెస్సలోనీకయులకు 4:18). I. మొదటిది, క్రీస్తు రాకడ సూచనలు ప్రోత్సాహమును ఇస్తాయి. నా యవ్వన ప్రాయములో ప్రపంచము అస్తవ్యస్తమయింది. 1960 ప్రాంతములో. మారణ హోమము భయము ఉండేది. ఎప్పుడైనా రష్యా మన పట్టణాలపై బాంబులు వేయవచ్చు. వియత్నాం యుద్ధము చెలరేగింది. నేను అరణ్యమునకు తీసుకెళ్ళబడి చనిపోతానేమోనని భయము పడేవాడిని. యుద్ధము అంతము లేనిది అర్ధ రహితము. కళాశాలలో నా పట్టా ముగించాలనుకున్నాను. అప్పుడే కలహాలు మొదలయ్యాయి. డెమొక్రేటిక్ కన్వెన్షన్ సమయంలో చికాగో చాలా వరకు కాల్చబడింది. జాన్ ఎఫ్. కెన్నెడీ చంపబడ్డాడు. అలాగే బాబీ కెన్నెడీ, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్, మేల్కొమ్ X చంపబడ్డారు, మరియు జార్జి వాల్లేస్ కుంటివాడయ్యాడు. తరువాత మత్తు పదార్ధాల సంస్కృతి పెరిగింది, ఉడ్ స్టాక్, మరియు బీటిల్స్, మరియు తూర్పు ప్రాంత మతములు ఎక్కువయ్యాయి, మరియు సాతాను దెయ్యముల దాడులు పెరిగాయి. హెప్పీస్ చెప్పినట్టు, "నా బుర్ర పనిచేసింది." ఆ కాలము అస్తవ్యస్తము భయము నెలకొన్నాయి. ఆ భయంకర సమయములో, మనస్సు నా హృదయము క్రీస్తు రాకడను గూర్చిన "సూచనల" వలన స్థిర పరచబడ్డాయి. రాత్రి అంధకారము, పాపము మాపై దాడి చేసింది, లేచి నిలబడి నాతో పాటు పల్లవి పాడింది! ఆయన తిరిగి వచ్చుచున్నాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు, కూర్చోండి. ఈ క్రింది "సూచనలు" నన్ను ప్రోత్సహించాయి! 1. ఇశ్రాయేలు రాష్ట్రము, 1948 లో స్థాపింపబడింది, ప్రపంచమంతటా ఉన్న యూదులందరూ దేవుడు వారికిచ్చిన స్వస్థలానికి తిరిగి వచ్చుచున్నారు. యేసు చెప్పాడు, "వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు: అన్యజనముల కాలముల సంపూర్ణమగువరకు, యేరూషలేము అన్య జనముల చేత త్రోక్కబడును" (లూకా 21:24). "చూడండి, నా ప్రజలారా, నేను...మిమ్మును ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొనివచ్చెదను" (యేహెజ్కేలు 37:12). "తరువాత సంవత్సరములలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని, ఆయా జనములలో నుండి మిమ్ములను సమకూర్చెదను" (యేహెజ్కేలు 38:8). కొన్ని రోజుల క్రితము అధ్యక్షుడు ట్రంప్ యేరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించాడు. యూదులు ఇశ్రాయేలుకు తిరిగి రావడం ఒక బలమైన సూచన మనము యుగాంతములో ఉన్నామని క్రీస్తు రాకడ అతి దగ్గరగా ఉందని తెలుసుకోవడానికి! హల్లెలూయా! క్రీస్తు మరల చాలా త్వరగా వచ్చుచున్నాడు! ఆయన తిరిగి వచ్చుచున్నాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు, 2. క్రైస్తవులు యూదుల పట్ల పెరుగుచున్న హింస ఒక "సూచన." "అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నా నామము నిమిత్తము సకల జనముల [చేత] ద్వేషింపబడుదురు" (మత్తయి 24:9). ముస్లీముల గురి ఇశ్రాయేలును నాశనము చేసి యూదులను చంపడం. అమెరికాలో, ఎసిఎల్ యూ వారు చేయగలిగిన దంతా చేస్తున్నారు సంఘాల నోరు నొక్కడానికి క్రైస్తవ్యాన్ని బలహీన పరచడానికి. "మార్పిడి" వేదాంతము ప్రసిద్ధి చెందుతుంది – అది చెప్తుంది బైబిలులోని వాగ్ధానము లన్ని క్రైస్తవులకు – కాని శాపాలు అన్ని యూదులకు అని! అలా చాలా సంస్కరణ సంఘాలు యూదా దేక్షణను కౌగిలించుకుంటున్నాయి. దేవుడు మనకు సహాయము చెయ్యాలి! ఈ ప్రవచనము మనలను ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే మన కళ్ళముందే ఇది నెరవేరుతుంది! దేవుడు సర్వ శక్తిమంతుడు! "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి" (I దెస్సలోనీకయులకు 4:18). పాడండి! ఆయన తిరిగి వచ్చుచున్నాడు, ఆయన తిరిగి వచ్చుచున్నాడు, కూర్చోండి. 3. పెరుగుచున్న అంత్యకాలపు స్వధర్మత. "మొదట ["భ్రష్టత్వము" – వాక్కు] సంభవించి, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినమురాదు" (II దెస్సలోనీకయులకు 2:3). "అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి, పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:11, 12). అంత్య దినాలలో దేవుడు లేని సంఘాలను ఇది సూచిస్తుంది. అంత్యకాలపు స్వధర్మత సాతాను మూలము, "అయితే కడవరి దినములలో, కొందరు అబద్ధికుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధయందు లక్ష్యముంచిరి; అబద్ధపు వేషధారణ చేత మాట్లాడేవారు; విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు" (I తిమోతి 4:1, 2). అంత్యకాలపు స్వధర్మత బైబిలును తిరస్కరించే మార్పులేని పరిచర్యల నుండి వస్తుంది. "కొత్త వేదాంతము" మరియు "కొత్త నీతి ధర్మమూ" స్వధర్మత నుండి వచ్చాయి, అవి సంఘాలను నాశనము చేసి, నశించు వారితో నింపుతున్నాయి. ఇది చార్లెస్ జి. ఫిన్నీ పరిచర్యతో ప్రారంభమయి చాలా పేరున్న సంఘాలను క్రమపరచి, క్రమబద్ద సంఘాలను కూడ ప్రభావితం చేస్తున్నాయి. "స్వధర్మత" ప్రకటన 17 లోని "గొప్ప నర్తకిని" తయారుచేస్తుంది, "చివరకు మత గురువు, ఆధిపత్యములోనికి వస్తుంది" (స్కఫీల్ద్). ప్రస్తుతపు మార్పులు చెప్తున్నాయి 4% యుక్త వయస్కులు పెద్ద వారయే సరికి సువార్తిక క్రైస్తవులుగా మారతారు – అంటే ఈనాటి 34% సువర్తికులు కొన్ని సంవత్సరాలలో 4% కు తగ్గిపోతారు. "మనము ఆత్మీయ అధోగతికి చేరువవుతున్నాము" (Dr. Jack W. Hayford, August 16, 2006). జాన్ ఎస్. డికేర్ సన్ చే వ్రాయబడిన "గొప్ప సువార్తిక వెనుకబాటు" చూడండి. "అమెరికా సంఘము కూల్చివేసే ఆరు విషయాలు." ఇది డికేర్ సన్ పుస్తకపు ఉప శీర్షిక. ఈనాడు 88 శాతము యుక్త వయస్కులు క్రైస్తవ గృహాలలో పెరిగి వారు ఉన్నత పాఠశాల నుండి పట్ట భద్రులయే సరికి క్రైస్తవులుగా కొనసాగరు. త్వరలో మన దేశము వారిచే నడిపించబడుతుంది – అప్పుడు అమెరికా పూర్తిగా అన్యదేశము అయిపోతుంది! II. రెండవది, అన్వయింపు. కొంతమంది సువర్తికులు మన ముందున్న భయంకర పరిస్థితిని గూర్చి మాట్లాడుతున్నారు. కాని ఏమి చెయ్యాలో వారికి తెలియదు. ఆచరనీయమైనది జరగదని నేను ఒప్పింపబడ్డాను. మన సంస్కృతి పడిపోతుంది. మన యవనస్తులు అనాగరికులు అయిపోతారు. ఊహించలేని భయాలు ముందున్నాయి. అల్ప సంఖ్యాకులుగా జీవించడానికి మనము సిద్ధపడాలి, అన్యులచే అన్ని వైపులా నుండి దాడులను ఎదుర్కుంటున్నాము ఆదిమ క్రైస్తవులను రోమా అన్యజనాంగము దాని చేసినట్టు. దయచేసి I దెస్సలోనీకయులకు, మొదటి అధ్యాయము, ఐదవ వచనము చూడండి. "మా సువార్త మాటతో మాత్రము గాక, శక్తితో మీ వద్దకు వచ్చియున్నది..." (I దెస్సలోనీకయులకు 1:5). సమయము సంకుచితముగా ఉన్నది. మీరు అవివేకముగా క్రైస్తవ్యముతో "ఆడకూడదు." యవనులారా, బైబిలు పఠనములో మాటలు తీసుకోవడం కాదు. నిజ మార్పు కొరకు చూడండి. నిజ క్రైస్తవ జీవితమూ కొరకు చూడండి! ఇప్పుడు 9 వ వచనము చూడండి, "మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మిమ్మును గూర్చి తెలియ చెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడగును దేవునికి దాసులగునట్లు" (I దెస్సలోనీకయులకు 1:9). మీ జీవితములోని విగ్రహముల నుండి దేవుని వైపు తిరగండి. మీ ప్రతి అణువుతో సజీవుడైన దేవుని సేవించండి. సమయము సంకుచితముగా ఉన్నది. అంత్య క్రీస్తు వస్తున్నాడు. క్రైస్తవుడుగా ఉండడానికి మీ జీవితమే అర్పించాల్సి రావచ్చును! మీ విగ్రహముల నుండి వైదొలగండి! సజీవుడైన దేవుని ఇప్పుడు సేవించండి! 10 వ వచనము చూడండి. "దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న, ఆయన కుమారుడైన యేసు, పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడవలెను" (I దెస్సలోనీకయులకు 1:10). దైవ కుమారుడు పరలోకము నుండి దిగి రావడానికి వేచి యుండండి – యేసు, దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించువాడు వచ్చుచున్నాడు. "క్రీస్తు కొరకు చిత్రహింసలు" చదవండి కాపరి వర్మ్ బ్రాండ్ చే వ్రాయబడినది. క్రీస్తు కొరకు శ్రమ పడే వ్యక్తిగా జీవించాలి. నశించు లోకము నుండి బయటికి రండి. అవును, నశించు స్నేహితులను గుడికి ఆహ్వానించండి. వారు రాకపోతే, వదిలేయండి. గుడిలో రక్షింపబడిన పిల్లలను మీ స్నేహితులుగా చేసుకోండి. ప్రార్ధనలో కలవండి. సువార్తీకరణకు వెళ్ళినప్పుడు పేర్లు తీసుకురండి. దేవుని కొరకు జీవించండి! క్రీస్తు కొరకు జీవించండి! ఈ గుడి కొరకు జీవించండి! సమయము సంకుచితముగా ఉన్నది. తీర్పు వచ్చుచున్నది! "మీ దేవుని కలవడానికి సిద్ధ పడండి." ఇప్పుడే చెయ్యండి, ఆలస్యము కాకముందే! చార్లెస్ స్టడ్ సరిగా చెప్పాడు – ఒకటే జీవితమూ, క్రీస్తుకు మిమ్మును అర్పించుకోండి – దేనిని పట్టుకొని వేలాడవచ్చు. యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడు! యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడు! యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడు! పాటల కాగితములో 5 వ పాట పాడండి. నిలబడి పాడండి! పాడండి! పాడండి! విశ్వాసి చెవిలో ఎంత మధురముగా వినబడుచున్నది యేసు నామము! ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ బైబిలు ప్రవచనము మిమ్ములను పురికొల్ప నివ్వండి! LET BIBLE PROPHECY MOTIVATE YOU! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. "కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి" I. మొదటిది, క్రీస్తు రాకడ సూచనలు ప్రోత్సాహమును ఇస్తాయి.
1. ఇశ్రాయేలు రాష్ట్రము, 1948 లో స్థాపించబడింది, ప్రపంచమంతటా ఉన్న యూదులందరూ దేవుడు వారికిచ్చిన స్వస్థలానికి తిరిగి వచ్చుచున్నారు,
2. క్రైస్తవులు యూదుల పట్ల పెరుగుచున్న హింస ఒక "సూచన", మత్తయి 24:9.
3. పెరుగుచున్న అంత్యకాలపు స్వధర్మత, II దెస్సలోనీకయులకు 2:3; II. రెండవది, అన్వయింపు, I దెస్సలోనీకయులకు 1:5, 9, 10. |