Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




తృణీకరింపబడెను కాని సుందరుడు!

DESPISED BUT LOVELY!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది.
మరియు రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
ప్రసంగము లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు
ప్రభువుదినము ఉదయము, మే 13, 2018
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, May 13, 2018

"అతడు అతి సుందరుడు" (పరమగీతము 5:16).


పరమగీతము నుండి నేను ఎన్నడు ప్రసంగము చెయ్యలేదు. స్పర్జన్ ప్రసంగాల ఆకారాది పట్టిక చూసాక, నేను కనుగొన్నాను బోధకుల రాజు లండన్ లో తన పరిచర్యలో పరమగీతముపై 63 ప్రసంగాలు చేసాడు. కనుక ఈరోజు ఈ పాఠ్యభాగానికి నేను వస్తున్నాను.

"అతడు అతి సుందరుడు."
"అతడు అతి సుందరుడు."
"అతడు అతి సుందరుడు."

డాక్టర్ మెక్ గీ అన్నాడు, "యూదులు పరమ గీతము లేఖనములో అతి పరిశుద్ధ స్థలము అన్నారు. కాబట్టి, పరిశుద్ధ స్థలము లోపలికి ప్రతి ఒక్కరు అనుమతింపబడ్డారు. ఇక్కడ మీరు అత్యున్నతిని రహస్య స్థలములో నివసిస్తున్నారు...యేసు ప్రభువు అంటే మీకు చాలా గొప్ప విషయము ఆయనను మీరు ప్రేమిస్తారు, ఈ చిన్న పుస్తకము మీకు చాలా ఉపయోగము. పరమగీతము కవితా పరమైనది మరియు ఆచరణాత్మకము. ఇక్కడ దేవుడు తన ప్రజలతో కవిత్వపు పాటలతో తన కథను చెప్పుచున్నాడు. మనము ఈ గ్రంథాన్ని సమీపిస్తున్నప్పుడు మన పాదములకు ఆత్మీయ పాదరక్షలు ధరించుకోవాలి. మనము పరిశుద్ధ నేలపై ఉన్నాము. పరమగీతము పాడైపోయిన పుష్పము లాంటిది కనుక సున్నితంగా నిర్వహించాలి. ఈ గ్రంథములో నాలుగు వివిధ ప్రాముఖ్య అర్ధాలు ఉన్నాయి" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1982, volume III, p. 143).

మొదటిది, పరమగీతము భార్య భర్తల మధ్య ప్రేమను చూపిస్తుంది. రెండవది, ఇది ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమను చూపిస్తుంది. ఆదిమ బోధకులు ఈరెండు తర్జుమాలు ఇచ్చారు. కాని క్రైస్తవులకు మరి రెండు అన్వయింపులు ఉన్నాయి. మూడవది, క్రీస్తుకు ఆయన సంఘమునకు మధ్య ఉండు ప్రేమను చూపిస్తుంది. నాల్గవది, ఇది ఒక వ్యక్తిపై క్రీస్తుకు ఉన్న ప్రేమను చూపిస్తుంది, మరియు క్రీస్తుతో ఆత్మలీనము. చాలామంది దేవుని పరిశుద్ధులు దీనిని అనుభవించారు. తన పరిచర్యలో గొప్ప ఉజ్జీవ తరంగాలు చూచినా, స్కాటిష్ బోధకుడు రోబర్ట్ ముర్రేకు పరమగీతము నచ్చిన పుస్తకము. మెచ్ని గూర్చి చెప్పబడింది, "తన నొసటిపై నిత్యత్వపు ముద్ర కలిగిన వానిగా అతడు బోధించాడు," అతడు 29 సంవత్సరాలకే చనిపోయాడు. బైబిలులో అతనికి ప్రీతిపాత్రమైన పుస్తకము పరమగీతము. రోబర్ట్ మెచ్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు మోకాళ్ళపై కన్నీరు కార్చారు, కఠిన పాపులు క్రీస్తుకు తమ తలలు వంచారు. ఆ పుస్తకము గొప్ప స్కాటిష్ బోధకుడు సామ్యూల్ రూథర్ ఫర్డ్ (1600-1661), డి. ఎల్. మూడీ (1837-1899) మరియు హేరీ ఐరన్ సైడ్ (1876-1951) లకు కూడ నచ్చిన పుస్తకము, మరియు నేను చెప్పినట్టు, స్పర్జన్ పరమగీతముపై 63 ప్రసంగాలు బోధించాడు. డంకన్ కేంప్ బెల్ లూయిస్ ద్వీపములో పరమగీతముపై బోధిస్తున్నప్పుడు ఉజ్జీవము వచ్చింది.

ఇప్పుడు, తరువాత, పాఠ్యభాగమునకు వద్దాం. పెండ్లి కుమార్తె తన భర్తను గూర్చి చెప్తుంది, "అతడు అతి సుందరుడు." అలా, కూడ, నిజ క్రైస్తవుడు కూడ యేసును గూర్చి చెప్పాలి, "అతడు అతి సుందరుడు అని." ఈ వచనముపై బోధించాలనుకున్నప్పుడు, స్పర్జన్ వలే నేననుకున్నాను, "ఇది చాలా కష్టము, నేను న్యాయము చేకూర్చలేను." ఇలాంటి లోతైన పాఠ్యభాగాలు కొన్నిసార్లు నన్ను అత్యుత్సాహ పరుస్తాయి. అర్ధము అంతటిని తేలేకపోయినప్పటికి, ఈ ఉదయాన్న కొంత అర్ధము తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. జీవిత కాలములో లోకపు మహిమ అంతటిని చూసే కంటే యేసు వైపు సంక్తిప్తంగా చూడడము మేలు, ఎందుకంటే ఆయన మాత్రమే "అతి సుందరుడు." యేసును గూర్చిన రెండు విభిన్న అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాను – లోకమునకు సంబంధించినవి మరియు నిజ క్రైస్తవునికి సంబంధించినవి.

I. మొదటిది, యేసు సుందరుడు అని నశించు లోకము ఆలోచింపనే ఆలోచింపదు.

ఈనాడు లోకము ఆయనను ఎలా నోరు మూయిస్తుందో మీరు గమనించారా? ఆయన పేరు కూడ వినాలనుకోవడం లేదు. నేను విన్నాను అమెరికా విమాన యానములో గురువులు యేసు నామములో ప్రార్ధించడానికి కూడ అనుమతి లేదు. సాంఘీక వేడుకలలో సంఘ కాపరులు ప్రార్ధించేటప్పుడు, యేసు నామములో ప్రార్ధనలు ముగించకూడదని వారు చెప్పబడ్డారు. యేసు నామము పట్ల అయిష్టత కొత్తకాదు, కాని ప్రతి యేడాది అది తీవ్రంగా పెరుగుతుంది. సినిమాలు తీసే ఆరంభపు దినాలలో, ప్రార్ధనలో క్రైస్తవులను చూపించేటప్పుడు, స్టూడియోలలో ఉన్న మొగులులు, "యేసు నామమున, ఆమెన్" అని అననిచ్చే వారు కాదు. మొగలులు అనుకున్నాను యేసు నామమును తొలగించేటప్పుడు మనము గమనించలేమని కాని "యేసు నామములో" మనము ప్రార్ధనలు ముగిస్తాము కాబట్టి, ఆ మనష్యులు ఎంతగా యేసును అసహ్యించుకున్నారో మనము గమనించవచ్చును.

రక్షకుని పట్ల వారి ద్వేషము ఇంకా ఎక్కువగా కనిపించింది వారు దేవదూషణ చేసే సినిమా, "క్రీస్తు ఆఖరిశోధన," తీసినప్పుడు అందులో వారు రక్షకుని లైంగిక పిచ్చిగల వానిగా చిత్రీకరించారు. మన కాపరి డాక్టర్ హైమర్స్ తన గదిలో కుర్చీలో కూర్చొని ఆ సినిమా వస్తుందని చదివి ఆలోచించడం మొదలుపెట్టారు. దేవుడు ఆయనతో చెప్పాడు, "వారు దానిని విడుదల చేయనిస్తావా?" డాక్టర్ హైమర్స్ అన్నాడు, "తండ్రి, నేనేమి చెయ్యలేను." దేవుడన్నాడు, "నీవు చేయలేకపోతే, ఎవరు చెయ్యలేరు." కనుక మేము వెళ్లి యేసును సమర్ధించాము. సాయంకాలము వార్తలలో ప్రతి ప్రసారములో మా ప్రదర్శనలు వారు చూపించారు. న్యూయార్క్ టైమ్స్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో మొదటి పేజీలో వేసారు. వారు ఈ రాత్రి ప్రదర్శనలో, నైట్ లైన్ లో, క్రాస్ ఫైర్ లో, మరియు ఫోటో మా ప్రదర్శనను గూర్చిన కథ టివి గైడ్ లో వేసారు! అది అంతర్జాతీయముగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఆస్ట్రేలియా, మరియు ఇశ్రాయేలు దేశాలలో తెలియ పరచబడింది, ఇశ్రాయేలు నుండి ఒక స్నేహితుడు డాక్టర్ హైమర్స్ కు ఫోన్ చేసి యేరూషలేము పోస్టు మొదటి పేజీలో వచ్చిందని చెప్పారు. ఒక పుస్తకము "హాలీవుడ్ అండర్ సీజ్" ఉండేది థామస్ ఆర్. లిండ్ లాఫ్ చే వ్రాయబడింది (2008, ద యూనివర్శిటి ప్రెస్ ఆఫ్ కేంటక్కి). మొదటి పేజీలో నా తండ్రి, డాక్టర్ కాగన్, రంగు ఫోటో ఉంది తనతోపాటు మన సంఘము నుండి 125 మంది ఆ చెడ్డ దేవదూషణ చేసే సినిమాకు వ్యతిరేకంగా, నినాదాలు చేస్తూ ఉన్నారు. ముఖ్య సూచిక, ముప్ఫై అడుగుల పొడవు, చెప్తుంది, "వాసర్ మాన్ – లే ఆఫ్ ఆఫ్ జీసెస్!" ల్యూ వాసర్ మాన్ ఆ సినిమా నిర్మాత. ఆ పుస్తకములో డాక్టర్ హైమర్స్ పేరు పదమూడు చోట్ల చెప్పబడింది. వారు యేసును మాత్రమే కాకుండా, వారు డాక్టర్ హైమర్స్ ను, మరియు నా తండ్రిని, మరియు మన సంఘమును, రక్షకుని సమర్ధించినందుకు ద్వేషించారు! ఆ పుస్తకము పేరు "హాలీవుడ్ అండర్ సీజ్." దానిని గూర్చి ఆలోచించండి, 125 మంది చిన్న బాప్టిస్టులు హాలీవుడ్ ను "స్తంభింపచేసారు"! గొప్ప సినిమా మొగలులది "అండర్ సీజ్" కొంతమంది చిన్న బాప్టిస్టుల నుండి వచ్చింది! కాని డాక్టర్ హైమర్స్ కు తెలుసు, హాలీవుడ్ ఎలైట్ ఆఫ్ బెవేర్లీ హిల్స్, న్యూయార్క్ మరియు వాషింగ్ టన్ ఎంతగా ప్రభువైన యేసు క్రీస్తును ద్వేశించాయో. బిల్ మహేర్ నుండి జార్జి క్లూని వరకు, అండర్ సన్ కూపర్ నుండి ఓల్ప బ్లిట్ జర్ వరకు –వారంతా దేవుని కుమారుని తృణీకరించి తిరస్కరించారు. సంఘాలపై బాహాటంగా హింస జరిగే వరకు ఇది అంతమవుతుందని నేను అనుకోను, మీ జీవిత కాలములో అది మీరు చూస్తారని నేను నమ్ముచున్నాను.

అన్నిటికంటే దారుణము, ఈనాడు చాలా సంఘాలలో యేసు వెనుక ఉంచబడుతున్నాడు. ఆయన స్నేహితుల గృహాలకు కూడ ఆయనకు ఆహ్వానము లేదు! తన శక్తి వంతమైన దూసుకుపోయే పుస్తకము, క్రీస్తులేని క్రైస్తవ్యము (బేకర్ బుక్స్, 2008) లో డాక్టర్ మైకెల్ హర్టన్ దానిని గూర్చి వ్రాసాడు. అది చెప్తుంది, "హర్టన్ వాదిస్తున్నాడు మనము ఇంకా క్రీస్తు లేని క్రైస్తవ్యానికి రాలేదు, కాని మార్గ మధ్యలో ఉన్నాము. మనము క్రీస్తు నామమును చెప్పుచున్నాను, చాలా తరచుగా క్రీస్తు మరియు క్రీస్తు కేంద్రమైన సువార్త ప్రక్కకు నెట్టి వేయబడుచున్నాయి." ఈనాడు యేసు చాలా దారుణంగా చూడబడుచున్నాడు అందులో ఆశ్చర్యము లేదు. బైబిలు చెప్తుంది,

"లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను; అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సరూపమైన సొనసైనను లేదు. మనమతని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సరూపము లేదు; అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను, మనష్యుల వలన విసర్జింపబడినవాడును: వ్యసనా క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడుగాను మనష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు, కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:2-3).

ఆ విధంగా సహజ మానవుడు, రక్షింపబడని స్థితిలో, యేసును చూస్తాడు. "మనమతని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సరూపము లేదు" మరియు కనుక వారు ఆయనను "తృణీకరించి తిరస్కరించారు." అలాగే డాక్టర్ హైమర్స్ విషయంలోనూ జరిగింది. అతడు చిన్నవాడుగా ఉన్నప్పుడు ప్రతిరోజూ కేథలిక్ గుడికి వెళ్ళేవాడు. 1940 లో వారు ద్వారాలు తెరిచి ఉంచారు. అక్కడ నెమ్మదిగా ప్రశాంతంగా ఉందని ఆయన అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ యేసు పూర్తి ఆకారపు విగ్రహము, గుడిలో ఉండేది, ఆయన సిలువ కలిగి, ఆయన ముఖము నుండి రక్తము కారుతూ ఉంది. డాక్టర్ హైమర్స్ యేసును, ఒక విషాద వ్యక్తిగా, కొట్టి సిలువ వేయబడిన హత సాక్షిగా చూసాడు ఆయన అకారణంగా శత్రువులు ద్వేష కారణంగా మరణించాడు. ఆ గుడిలో ఆయన సిలువ మరణమును గూర్చిన తలంపు డాక్టర్ హైమర్స్ ను బెంబేలేత్తించేది, ఆ తలంపు అతనితో కూడ వెళ్ళింది చివరకు అతడు సెప్టెంబర్ 28, 1961, ఇరవైవ ఏట మారు మనస్సు పొందేవరకు. అప్పటి వరకు డాక్టర్ హైమర్స్ యేసును అపార్ధము చేసుకొని, సిలువకు మేకులతో కొట్టబడి, అకారణంగా చనిపోయిన వ్యక్తిగా భావించాడు. కాని డాక్టర్ హైమర్స్ మారిన రోజు మొదటిసారిగా ఆయనను ఒక జీవించే, మృత్యుంజయుడు అయిన రక్షకునిగా, మరణముపై జయము పొందినవానిగా, పరలోకములో దేవుని కుడి పార్శ్వాన ఆశీనుడైన వానిగా తనను తన పాపముల నుండి రక్షించు వానిగా జీవితాన్ని మార్చువానిగా చూసాడు. ఆ ఉదయకాలము అతడు క్రీస్తును చూచినప్పుడు, యేసు మొదటిసారిగా అతి సుందరుడుగా కనిపించాడు!

II. రెండవది, నిజ క్రైస్తవుడు ఆయనను అతి సుందరుడుగా చూసాడు.

యేసు నాకు తెలిసిన మధురమైన నామము,
      ఆయన అలాగే ఉన్నాడు అతని సుందర నామము వలే,
ఆ కారణమును బట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఇంతగా;
      ఓ, యేసు నాకు తెలిసిన మధురమైన నామము.
("యేసు నాకు తెలిసిన మధురమైన నామము" లేలాలాంగ్ చే, 1924).
       (“Jesus is the Sweetest Name I Know” by Lela Long, 1924).

అది మీకు అకస్మాత్తుగా రావచ్చు, మన సంఘ కాపరికి జరిగినట్టు. లేక మీరు క్రమముగా చూడవచ్చు ఆయన ఎంత సుందరుడో, మీరు ఆయన ముందు మొక్కి ఆయనను మీ రక్షకునిగా దేవునిగా విశ్వసించే వరకు. డాక్టర్ హైమర్స్ యేసును విశ్వసించిన క్షణమే చార్లెస్ వెస్లీతో పాటు పాడగలిగాడు,

నా బంధకాలు ఊడిపోయాయి, నా హృదయము తేలిక అయింది;
      నేను లేచి, ముందుకు సాగి, మిమ్ములను వెంబడించాను.
అద్భుత ప్రేమ! ఎలా వీలవుతుంది
      మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట?
("వీలవుతుందా?" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
       (“And Can It Be?” by Charles Wesley, 1707-1788).

వాస్తవానికి, వారు యేసు డాక్టర్ హైమర్స్ రక్షించిన రోజు ఉదయ సమయమున పాడారు!

చాలాకాలము బంధింపబడిన ఆత్మలో ఉన్నాను,
పాప బంధకములో సహజ రాత్రిలో ఉన్నాను;
మీ కన్ను త్వరిత కిరణాన్ని చూపించింది,
      నేను లేచాను, గుహ వెలుగుతో నింపబడింది;
నా బంధకాలు ఊడిపోయాయి, నా హృదయం తేలిక అయింది;
      నేను లేచి, ముందుకు సాగి, మిమ్ములను వెంబడించాను.
అద్భుత ప్రేమ! ఎలా వీలవుతుంది
      మీరు, నా దేవుడు, నాకై మరణించుట?

ఆ క్షణంలో మన సంఘ కాపరి మెచ్ నీ లేక స్పర్జన్ తో పాటు గట్టిగా అరచి ఉండవచ్చు, "అతడు అతి సుందరుడు!" ఆయన అతి బిగ్గరగా పాత జర్మను పాటను పాడి ఉండవచ్చును,

సుందరుడైన యేసు ప్రభూ, సృష్టి అంతటిని పరిపాలించువాడా,
      ఓ మీరు దేవుడు మనష్యు కుమారుడు!
మిమ్మును నేను కొనియాడతాను, మిమ్మును నేను ఘన పరుస్తాను,
      మీరు, నా ఆత్మకు మహిమ, సంతోషము, మరియు కిరీటము!

సుందర రక్షకా! రాజ్యముల ప్రభూ!
      దైవ కుమారుడా మనష్యు కుమారుడా!
మహిమ మరియు ఘనత, స్తుతి, ప్రశంస,
      ఇప్పుడు ఎల్లప్పుడూ మీకే చెల్లును గాక!
("సుందరుడైన యేసు ప్రభూ," 17 వ శతాబ్దపు జర్మన్ పాట,
      జోసెఫ్ ఏ. సీస్ చే అనువదింపబడినది, 1823-1904).
       (“Fairest Lord Jesus,” 17th century German hymn,
      translated by Joseph A. Seiss, 1823-1904).

"అతడు అతి సుందరుడు."

ఈయన యేసు,

"ఆయన కనిపించని దేవుని స్వరూపము, ప్రతి సృష్టిలో తొలిచూలు: ఏలయనగా ఆకాశ మందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని మరియు అదృష్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వము లైనను, ప్రధానులైనను, అధికారములైనను: సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను: ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు, ఆయనే శిరస్సు: ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను; ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొన వలెననియు తండ్రి అబీష్టమాయెను; మరియు, ఆయన సిలువ రక్తము చేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును సమాధాన పరచబడెను; అవి, భూలోకమందున్నవైనను, పరలోక మందున్న వైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొన వలెననియు భావించెను. మరియు, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మును కూడ, తనసన్నిదిని పరిశుద్ధులు గాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను సిలువ బెట్టుటకు, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానమాయెను" (కొలస్సయులకు 1:15-22).

హల్లెలూయా! ఆయన యేసు! "అవును, అతడు అతి సుందరుడు!" మనము ఆయనను తిరస్కరించి తృణీకరించకుండా కృతజ్ఞతాస్తుతితో ఆయన పాదములపై పడాలి – ఎందుకంటే ఆయన మనలను రక్షించడానికి సిలువపై మరణించాడు, మనకు జీవము ఇవ్వడానికి మృతులలో నుండి తిరిగి లేచాడు! హల్లెలూయ! "అతడు అతి సుందరుడు!" "అవును, అతడు అతి సుందరుడు!"

యేసు నాకు తెలిసిన మధురమైన నామము,
   ఆయన అలాగే ఉన్నాడు అతని సుందర నామము వలే,
ఆకారణమును బట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఇంతగా;
   ఓ, యేసు నాకు తెలిసిన మధురమైన నామము.

ఆ దుష్టురాలైన స్త్రీ వలే రండి ఆమె "ఆయన పదములకు ముద్దు పెట్టింది" (లూకా 7:38). యేసు ఆమెతో చెప్పాడు, "నీ పాపములు క్షమించ బడియున్నవి" (లూకా 7:48). "కుమారుని ముద్దు పెట్టుకొనుము." బైబిలు అలా చెయ్యమని చెప్తుంది! "కుమారుని ముద్దు పెట్టుకొనుడి...ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు" (కీర్తనలు 2:12). ఈ ఉదయాన్న మీరు దైవ కుమారుని ముద్దు పెట్టుకుంటారా, ఆయన యందు విశ్వాస ముంచుతారా? "దైవ కుమారుని ముద్దు పెట్టుకొనుడి?" మీరు చెప్పండి. అవును! అవును! విశ్వాసముతో ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనను విశ్వసించండి, ఎందుకంటే అతడు అతి సుందరుడు! స్పర్జన్ చెప్పాడు,

     మీరు యేసు నొద్దకు రావడానికి భయపడనక్కర లేదు, ఎందుకంటే "ఆయన అతి సుందరుడు." ఆయన భయంకరుడు అని చెప్పబడలేదు – అది ఆయనపై మీ తప్పుడు అభిప్రాయము; ఆయన కొంతవరకు సుందరుడు అని చెప్పబడలేదు, ఒక రకమైన పాపినే స్వీకరించడానికి ఇష్ట పడతాడు అనిలేదు; కాని "ఆయన అతి సుందరుడు," కనుక ఆయన భయంకర [పాపులను] కూడ ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన నామమును గూర్చి ఆలోచించండి. ఆయన యేసు, రక్షకుడు. అది సుందర నామము కాదా? ఆయన పనిని గూర్చి ఆలోచించండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన వచ్చాడు. అది ఆయన వృత్తి. అది సుందరముగా లేదా? ఆయన చేసిన దానిని గూర్చి ఆలోచించండి. ఆయన రక్తముతో మన ఆత్మలను విమోచించాడు. అది సుందరంగా లేదా? ఆయన చేస్తున్న దానిని గూర్చి ఆలోచించండి. ఆయన [ప్రార్దిస్తున్నాడు] పాపుల కొరకు దేవుని సింహాసనము ముందు...ఇది సుందరముగా లేదా? [ఎలాగైనను మీరు ఆయన వైపు చూడండి] ఆయన అవసరమైన పాపులకు యేసు ఆకర్షణీయంగా కనిపిస్తాడు. రండి, తరువాత, రండి ఆహ్వానించండి, మిమ్ములను దూర పరచేది ఏమిలేదు, అంతా సిద్ధంగా ఉంది [మిమ్ములను పిలుస్తున్నాను] రమ్మని. క్రీస్తును బోధించిన ఈ సబ్బాతు దినము, ఆయనను పైకెత్తిన ఈ దినము, ఈ దినమున మీరు ఆయన చెంతకు రావాలి, ఎన్నటికి ఆయనను విడిచి పెట్టకూడదు, నిరంతరము ఆయన వారుగా నిలిచిపోవాలి. ఆమెన్. (C. H. Spurgeon, “Altogether Lovely,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1977 reprint, volume 17, pages 407-408).

"అవును, ఆయన అతి సుందరుడు." ఆయన తన యొద్దకు రావాలని మిమ్ములను పిలుస్తున్నాడు, ఆయన యందు విశ్వసించి ఎన్నటికి, నిత్యత్వానికి పాపము నుండి రక్షింపబడాలని పిలుస్తున్నాడు – ఎందుకంటే ఆయన అంతగా మిమ్మును ప్రేమిస్తున్నాడు! ఎందుకంటే ఆయన అంతగా మిమ్మును ప్రేమిస్తున్నాడు! ఆయన వద్దకు రండి – ఎందుకంటే ఆయన అంతగా మిమ్మును ప్రేమిస్తున్నాడు! ఆయన మిమ్ములను త్రోసివేయడు – ఎందుకంటే ఆయన అంతగా మిమ్మును ప్రేమిస్తున్నాడు!

నా బంధకము, విచారము, మరియు రాత్రి నుండి,
   యేసు, నేను వస్తున్నాను, యేసు, నేను వస్తున్నాను;
మీ స్వతంత్రములోనికి, ఆనందము, మరియు వెలుగులోనికి,
   యేసు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను;
నా అనారోగ్యము నుండి మీ ఆరోగ్యములోనికి,
   నా అవసరత నుండి మీ ఆస్తిలోనికి,
నా పాపము నుండి మీలోనికి,
   యేసు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను.

ఇప్పుడు ఆ పాట మరియొక చరణము వినండి,

భయము నుండి సమాధి ఆందోళన నుండి,
   యేసు, నేను వస్తున్నాను, యేసు, నేను వస్తున్నాను;
ఆనందములోనికి మీ ఇంటి వెలుగులోనికి,
   యేసు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను;
పతనము లోతులలో నుండి,
   మీ శాంతి ఆశ్రయములోనికి,
మీ మహిమాయుక్త ముఖ సముఖమునకు,
   యేసు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను.
("యేసు, నేను వస్తున్నాను" విలియమ్ టి. స్లీపర్ చే, 1819-1904).
    (“Jesus, I Come” by William T. Sleeper, 1819-1904).

యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాలము యేసు నొద్దకు రండి. ఆయనను విశ్వసించండి. మీరు ఆయనను "అతి సుందరుడుగా" చూస్తారు. ఆయన రక్తము మీ పాపమంతటిని కడిగి వేస్తుంది. యేసును విశ్వసించే విషయములో మీరు మాతో మాట్లాడాలనుకుంటే, మిగిలిన వారు భోజనానికి పై అంతస్తుకు వెళ్తున్నప్పుడు, మీరు వచ్చి మొదటి రెండు వరుసలలో కూర్చోండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
     "అతి సుందరుడైన యేసు ప్రభువు" (జర్మను నుండి అనువాదము జోసెఫ్ ఏ. సీస్ చే, 1823-1904).
     “Fairest Lord Jesus” (translated from German by Joseph A. Seiss, 1823-1904).



ద అవుట్ లైన్ ఆఫ్

తృణీకరింపబడెను కాని సుందరుడు!

DESPISED BUT LOVELY!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే వ్రాయబడినది.
రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడినది
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Rev. John Samuel Cagan

"అతడు అతి సుందరుడు" (పరమ గీతము 5:16).

I.    మొదటిది, యేసు సుందరుడు అని నశించు లోకము ఆలోచింపనే ఆలోచింపదు, యెషయా 53:2-3.

II.   రెండవది, నిజ క్రైస్తవుడు ఆయనను అతి సుందరుడుగా చూసాడు,
కొలస్సయులకు 1:15-22; లూకా 7:38, 48; కీర్తనలు 2:12.