ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
స్పర్జన్ యొక్క "వేదాంతమంతటి యొక్క సారంశము"SPURGEON’S “SUBSTANCE OF ALL THEOLOGY” డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే బోధింపబడిన |
స్పర్జన్ కేవలము 27 సంవత్సరాలవాడు. అప్పటికే లండన్ లో అతడు ప్రసిద్ధ బోధకుడు. ప్రతి ఆదివారము ఉదయము 30,000 మందికి అతడు బోధిస్తున్నాడు. మంగళవారము, జూన్ 25, 1861 న, ప్రసిద్ధ యవ్వన బోధకుడు స్వనేసియా పట్టణాన్ని సందర్శించాడు. ఆరోజు వర్షము కురిసింది. ఆయన రెండు స్థలాలలో బోధిస్తాడని ప్రజలకు చెప్పారు. పగలు వర్షము ఆగిపోయింది. సాయంకాలము ఈ ప్రసిద్ధ బోధకుడు బయట గొప్ప జన సమూహానికి బోధించాడు. ఆ ప్రసంగాన్ని కొన్ని చేర్పులతో నేను బోధిస్తున్నాను. దయచేసి మన పాఠ్యభాగము, యోహాను 6:37 చూడండి. "తండ్రి నాకు అనుగ్రహించువారందరూను నా యొద్దకు వత్తురు; నా వద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37). ఈ పాఠ్యభాగముపై వెయ్యి ప్రసంగాలు చెప్పబడి యుండవచ్చును. ఈ రెండు అంశాలను జీవితకాల పాఠ్యభాగముగా తీసుకోవచ్చు – వాటిలో ఉన్న గొప్ప సత్యాలు ఎప్పటికి తరిగిపోవు. ఈనాడు చాలామంది కాల్విన్ బోధకులు మొదటి సగభాగముపై బాగా మాట్లాడతారు, "తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు..." ఇంకొక వైపు చాలామంది మంచి అర్మీనియాను బోధకులు రెండవ భాగముపై బాగా మాట్లాడుతారు, "నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయును." కాని వారు బలవంతముగా మొదటి సగభాగముపై మాట్లాడరు, "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు..." ఈ రెండు గుంపులు బోధకులు రెండు వైపులా చూడలేరు. పాఠ్యభాగాన్ని వారు ఒక కంటితోనే చూస్తారు. వారు రెండు కళ్ళు తెరిస్తే అంతా చూడగలరు. ఇప్పుడు ఈ రాత్రి నా సామర్ధ్యమును బట్టి ఈ పాఠ్యభాగములోని రెండు భాగాలపై నేను మాట్లాడుతాను – యేసు మనం ఏమి వినాలనుకుంటున్నాడో దానిని ప్రకటిస్తాను. I. మొదటిది, దేనిపై రక్షణ నిలుస్తుందో ఆ పునాది. "తండ్రి నా కనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." మనం చేసే దానిపై మన రక్షణ ఆధారపడి ఉండదు. తండ్రి దేవుడు చేసే దానిపై అది ఆధారపడి ఉంటుంది. తన కుమారుడైన, యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి కొంతమందిని అనుగ్రహిస్తాడు. కుమారుడు చెప్తున్నాడు, "తండ్రి నాకనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." దీని అర్ధము తండ్రి క్రీస్తునకిచ్చు వారు క్రీస్తు నొద్దకు వస్తారు. వారు రావడానికి కారణము తండ్రి వారి హృదయములలో దానిని ఉంచాడు. ఒకరు రక్షింపబడడానికి, ఇంకొకరు నశించి పోవడానికి కారణము, దేవునిలో వెదకడం – రక్షింపబడిన వాడు చేయడం, చేయకపోవడంలో లేదు. రక్షింపబడినవాడు, అనుభూతిలో లేదు. కాని అతని బయట ఉంది – దేవుని సర్వశక్తి కృపలో ఉంది. దేవుని శక్తి దినమున, రక్షింపబడిన వాడు యేసు నొద్దకు రావడానికి ఇష్టపడతాడు. బైబిలు ఈ విషయాన్ని వివరించాలి. బైబిలు చెప్తుంది, "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను: వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలన నైనను, శరీరేచ్చ వలన నైనను, మానుషేచ్చ వలన నైనను, పుట్టినవారు కారు" (యోహాను 1:12, 13). మళ్ళీ, బైబిలు చెప్తుంది, "కాగా పొందగోరు వాని వలననైనను, ప్రయాసపడు వాని వలన నైనను కాదు, గాని కరుణించు దేవుని వలననే అగును" (రోమా 9:16). ప్రతి వ్యక్తి పరలోకములో ఉన్నాడు, ఎందుకంటే దేవుడు అతనిని క్రీస్తు దరికి చేర్చాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే మార్గములో ఉన్నవారు దేవుని కారణము గానే వెళ్తున్నారు "ఇంకొకరి నుండి వేరుగా ఉండడానికి" (I కొరింధీయులకు 4:7). అందరు, స్వాభావికంగా, యేసు నొద్దకు రావాలి అనే ఆహ్వానాన్ని తిరస్కరిస్తారు. "అందరును పాపమునకు లోనై యున్నారు...గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవాడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనిమాలిన వారైరి" (రోమా 3:9, 11, 12). యేసు నొద్దకు రాకుండా ఉండడానికి ప్రజలు చాలా సాకులు చెప్తారు. "వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి" (లూకా 14:18). కొందరంటారు ఆయనను చూడ లేరు కనుక వారు యేసు నొద్దకు రారు. ఇతరులంటారు వారు ఆయనను భావించ లేరు కనుక వారు యేసు నొద్దకు రారు. ఇంకను కొంతమంది ఇతరులు చెప్పిన మాటలు అనుకరించి యేసు నొద్దకు రావడానికి ప్రయత్నిస్తారు. వారందరూ సాకులు చెప్పి యేసు నొద్దకు రావడానికి తిరస్కరిస్తారు. కాని దేవుడు, తన శక్తి గల కృపలో, కొందరిలో తేడా తెస్తున్నాడు. యేసు నొద్దకు రావడానికి ఇష్టము సమర్ధత ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు. "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా వద్దకు వత్తురు." వారు "యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్ట పూర్వకంగా వచ్చెదరు" (కీర్తనలు 110:3). దేవుడు, తన పరిశుద్ధాత్మ శక్తిచే, క్రీస్తు నొద్దకు కొందరిని నడిపిస్తాడు. "ఆయనే మొదట మనలను ప్రేమించెను, గనుక మనము ప్రేమించుచున్నాము" (I యోహాను 4:19). నా స్నేహితుడా, ఇది, ఎన్నిక. చాలాకాలము దీనిని నేను నమ్మలేదు. అయినను నేనెలా రక్షింప బడ్డానా అని ఆశ్చర్య పడేవాడిని. హంటింగ్ పార్క్ లో ఉన్న మొదటి బాప్టిస్టు సంఘము సబ్బాతు బడికి వెళ్లాను. అంతమందిలో నేనొక్కడినే ఇంకా గుడిలో ఉన్నాను. నాకు తెలిసి ఉన్నంత వరకు, నేనొక్కడినే మారాను. ఎలా సాధ్యము? నేను భయంకర గతము నుండి వచ్చాను. నేను గుడికి వచ్చినందుకు వెక్కిరింపబడ్డాను. నాకు ప్రోత్సాహము లేదు. నాకు యేసు తప్ప వేరే నిరీక్షణ లేదని నా హృదయములో నాకు తెలుసు. అది నాకు ఎలా తెలుసు? నా స్వీయ చరిత్ర చదవండి, అన్ని భయాలకు వ్యతిరేకంగా. నాకు నిరీక్షణా కిరణము లేదు. అయినను, నేను అరవై సంవత్సరాల తరువాత కూడ, రక్షణను గూర్చి బోధిస్తున్నాను! నా తరగతిలో వేరేవారు ఎవ్వరు క్రైస్తవుడు కాలేదు, ఎవరు కూడ అరవై సంవత్సరాలుగా సువార్త బోధిస్తూ ఉండలేదు. అది ఎలా వీలవుతుంది? డాక్టర్ కాగన్ ను చూడండి. అతడు నాస్తికునిగా పెంచబడ్డాడు. ఎవరు అతనికి సహాయము చెయ్యలేదు. ఎవరు అతనిని చూసుకోలేదు. అయినను నాకు తెలిసిన వారిలో అతడు చాలామంచి క్రైస్తవుడు. అది ఎలా వీలవుతుంది? శ్రీమతి సాలాజార్ ను చూడండి. గుడికి వస్తున్నందుకు తన భర్త ఆమెను కొట్టేవారు. ఆమె పిల్లలు గుడిని వదిలేసి దేవునికి నిరుపయోగులు అయ్యారు. అయినను శ్రీమతి సాలాజార్ ఒంటరిగా సాగారు. అయినను ఆమె సంతోషి. సంఘములో యవనస్తులకు ఆమె సహాయ పడుతున్నారు. అది ఎలా వీలు అవుతుంది? యారన్ యాన్సీని చూడండి! అతని కుటుంబములో ఎవరు మంచి క్రైస్తవులు కారు. అయినను నాకు తెలిసిన వారిలో యారన్ మంచి క్రైస్తవుడు. అది ఎలా వీలవుతుంది? శ్రీమతి విన్నీ చాన్ కు చూడండి. ఆమె ఎప్పుడు తెర వెనుక మౌనముగా యేసు కొరకు పని చేస్తూ ఉంటారు. ఆమె గుడిలో మిగిలిన అమ్మాయిలందరి కంటే ఎక్కువ పేర్లు సువార్త నిమిత్తము చెప్పారు. ఏది ఆమెను నడిపిస్తుంది? అది ఎలా వీలవుతుంది? జాన్ సామ్యూల్ కాగన్ ను చూడండి. సంఘ చీలిక ద్వారా వెళ్ళాడు. అతని స్నేహితులంతా పడిపోయారు. అయినను జాన్ కాగన్ ప్రతి ఆదివారము ఉదయము ఇక్కడ బోధిస్తున్నాడు. అయినను బోధకునిగా ఉండాలని జాన్ కాగన్ వేదాంత కళాశాలలో చదువుచున్నాడు. ఇది ఎలా వీలు అవుతుంది? శ్రీమతి హైమర్స్ ను చూడండి. ఆమె నేను సువార్తను బోధించే మొదటిసారే అద్భుత రీతిగా రక్షింపబడింది. తన స్నేహితులందరూ స్వార్ధము పాపము కొరకు గుడి వదిలి వెళ్ళిపోయారు. కాని శ్రీమతి హైమర్స్ దేవుని అద్భుత స్త్రీగా వాటన్నిటి నుండి పయనించింది! అది ఎలా వీలవుతుంది? ఈ ప్రజల మార్పు, వారి గొప్ప నమ్మకత్వము క్రీస్తుకు సంఘము పట్ల వేరేగా వివరించలేను. ఎన్నిక ఒకటే సమాధానము! పితరుడైన యోబుతో వారిలా అంటారు, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను" (యోబు 13:15). నాకు తెలిసిన గొప్ప క్రైస్తవుడు పాస్టరు రిచర్డ్ వర్మ్ బ్రాండ్. ఆయన కథ చదవండి, క్రీస్తు కొరకు హింసింపబడుట. అది మీరు చదివితే, మీరు నాతో ఏకీభవిస్తారు, ఆయన దేవుని దృష్టిలో బిల్లి గ్రేహం, పోప్ జాన్ పాల్ II, లేక ఏ ఇతర 20 వ శతాబ్దపు బోధకుని కంటే గొప్పవాడని. అతడు కమ్యునిస్టు చెరసాలలో 14 సంవత్సరాలు మరణము అంచుల వరకు హింసింప బడ్డాడు, చనిపోయేంతగా కొట్టబడ్డాడు, నిస్సహాయుడమే వరకు మార్చబడ్డాడు. అతడు పితురుడైన యోబుతో అనగలిగాడు, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను" (యోబు 13:15). అతడు శక్తి గల దేవుని కృప ద్వారా ఎన్నుకొనబడి యేసు క్రీస్తు నొద్దకు చేర్చబడకపోతే ఇది ఎలా వీలవుతుంది? క్రీస్తు మాటలు నిజం కాకపొతే అది ఎలా వీలవుతుంది? యేసే చెప్పాడు, "మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొంటిని" (యోహాను 15:16). "తండ్రి నాకనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." II. రెండవది, యేసుకు ఇవ్వబడిన వారికందరికీ నిత్య రక్షణ. "తండ్రి నాకనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." ఇది నిత్యత్వములో స్థిర పరచబడింది, దీనిని మానవుడు కాని సాతాను కాని మార్చలేదు. గొప్ప అంత్య క్రీస్తు కూడ యేసు నొద్దకు రాకుండా ఎవరిని ఆపలేదు, ఎవరి పేర్లయితే "జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంధ మందు వ్రాయబడ్డాయో వారిని" (ప్రకటన 13:8). ప్రతి చివరి వాడు పరిశుద్ధాత్మ ద్వారా తగిన సమయంలో చేర్చబడినవాడు, యేసు నొద్దకు వస్తాడు, క్రీస్తు రక్తము ద్వారా దేవునిచే భద్రపరచబడతాడు, మరియు అతని గొర్రెపిల్లతో పాటుగా, ఉన్నత శిఖరాల మహిమలోనికి కొనిపోబడతాడు! వినండి! "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయోద్దకు వత్తురు." తండ్రి యేసుకిచ్చు ఒక్కరును నశింపరు. ఒక్కరు నశించిన, పాఠ్యభాగము చెప్పేది "సుమారు అందరు" లేక "ఒక్కరు తప్ప అందరు." కాని అది చెప్తుంది, "అందరు" మినహాయింపు లేకుండా. క్రీస్తు కిరీటము నుండి ఒక్క రత్నము నశించినా, అప్పుడు క్రీస్తు కిరీటము అంత మహిమా యుక్తముగా ఉండదు. క్రీస్తు శరీరములో ఒక సభ్యుడు నశిస్తే, క్రీస్తు శరీరము సంపూర్ణము కాదు. "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." "వారు ఒకవేళ రాకపోతే." నేను అలాంటిది ఊహించలేను. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు వారు "తప్పక వస్తారు." దేవుని శక్తి దినాన దేవుడు వారినిచ్చేలా చేస్తాడు. మానవుడు స్వచిత్తుడు అయినా, దేవుడు అతనిని, ఇష్ట పూర్వకంగా, యేసు నొద్దకు వచ్చేటట్టు చేస్తాడు. మానవుని ఎవరు చేసారు? దేవుడు! దేవుని ఎవరు చేసారు? మనము సర్వ శక్తిగల దేవుని సింహాసనానికి మానవుని ఎత్తగలమా? ఎవరు యజమానిగా ఉండి, తన దారి కలిగి యుండగలడు? దేవుడా లేక మానవుడా? దేవుని చిత్తము చెప్తుంది, వారు "తప్పక వస్తారు," ఆయనకు తెలుసు వారిని ఎలా రప్పించాలో. వందలకొలది యేసు నొద్దకు వస్తున్న కఠిన ముస్లీములను గూర్చి మనము చదువుతాము. మునపటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది ముస్లీములు యేసు నొద్దకు వస్తున్నారు. "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." చాలా మార్గాలు దేవుడు ఉపయోగిస్తున్నాడు, ఇరాన్ లో, చైనాలో, సముద్ర దీవులలో, సాతాను కాడి క్రింద ఉన్న చెరసాలలో. ఫిన్నీ అబద్ధపు సిద్ధాంతాలు సర్వ శక్తి దేవుని సర్వ కృపను అధిగమించలేవు! ఇది లేఖనపు సిద్ధాంతము! ఇది దేవుని సిద్ధాంతము! ఈ సిద్ధాంతాన్ని దేవుడు ఉజ్జీవములో మళ్ళీ మళ్ళీ ఉపయోగించాడు. హిప్పీల మాదక ద్రవ్యాల విచ్చలవిడి లైంగిక జీవితమూ వేలాదిమంది సాతాను పిల్లలను దేవుని రాజ్యములోనికి తెచ్చే యేసు ఉద్యమాన్ని ఆపలేకపోయాయి! ఆయన మళ్ళీ చేయగలడు! "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు." కాని ఒకవేళ దేవునిచే ఎన్నిక చేయబడ్డ వ్యక్తి కఠినుడైతే అతనికి నిరీక్షణ లేకపోతే? అప్పుడు ఏంటి? అతడు ఎన్నిక చేయబడితే అతడు దేవుని కృపచే బంధింపబడతాడు. అతని బుగ్గలపై కన్నీళ్లు కారి, అతడు యేసు నొద్దకు రావడానికి ఇష్టపడి రక్షింపబడతాడు. నాకు 8 సంవత్సరాలు క్రియలతో రక్షణకై నశించిపోయాను. దేవుడు నన్ను వంచి, యేసు నొద్దకు తెచ్చాడు, ఆయన ఎవరినైనా తేగలడు! దేవునిచే యేసు నొద్దకు చేర్చబడని ఎన్నిక చేయబడిన ఆత్మలేదు, నరక ద్వారాల నుండి కూడ ఆయన తప్పించగలడు, ఎన్నిక చేయబడిన వ్యక్తిని! దేవుడు తన హస్తమును చాచి, ఎన్నిక చేయబడిన వారిని, "అగ్నిలో నుండి" లాగి రక్షింపగలడు" (జేకర్యా 3:2). III. మూడవది, పాఠ్యభాగములోని రెండవ భాగమును వినండి. "తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37). ఇక్కడ పొరపాటులేదు. తప్పుడు వ్యక్తి రాలేదు. ఎవరైనా నశించు పాపి యేసు నొద్దకు వస్తే, అతడు తప్పక సరియైనవాడు. ఒకరన్నారు, "నేను తప్పుడు మార్గములోనికి వచ్చానేమో." మీరు తప్పుడు మార్గములో యేసు నొద్దకు రాలేరు. యేసు చెప్పాడు, "తండ్రి చేత వానికి కృప అనుగ్రహింప బడితేనే తప్ప, ఎవడును నా యొద్దకు రాలేడు" (యోహాను 6:44, 65). మీరు యేసు నొద్దకు వచ్చారంటే, తండ్రి చేత మీకు ఆ శక్తి ఇవ్వబడింది. మీరు యేసు నొద్దకు వస్తే, ఆయన మిమ్మును బయటికి త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చిన ఏ పాపిని కూడ యేసు త్రోసివేయడానికి కారణము లేదు. యేసు చెప్తున్నాడు, "ప్రయాసపడి, భారము మోసికోనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును" (మత్తయి 11:28). అది ఆయన ఆహ్వానము ఆయన వాగ్ధానము, కూడ. స్పర్జన్ 27 ఏళ్లవాడే. ఆ యవ్వన బోధకుడు తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించాడు: యేసు క్రీస్తు మీ ప్రతి ఒక్కరితో చెప్పుచున్న మాట ఇది – ఇది సువార్త ఆహ్వానము: "రండి, రండి, యేసు నొద్దకు రండి, ఉన్నపాటున." మీరంటారు, "నాకు ఇంకా ఎక్కువ అనుభూతి కావాలి." "లేదు, మీరు ఉన్నపాటున రండి." "కాని ఇంటికి వెళ్లి ప్రార్ధన చేస్తాను." "లేదు, లేదు, ఉన్నపాటున యేసు నొద్దకు రండి." మీరు యేసును విశ్వసిస్తే, ఆయన మిమ్మును రక్షిస్తాడు. ఓ, మీరు ఆయనను ధైర్యముగా విశ్వసించాలని నా ప్రార్ధన. ఎవరైనా అభ్యంతరం చెప్తే, "నీవు భయంకర పాపివి అని," మీరు జవాబు ఇవ్వండి, "అవును, అది నిజమే, నేను పాపినే; కాని యేసే స్వయముగా రమ్మని చెప్పాడు." రండి, ఓ పాపులారా, పేద మరియు దరిద్ర స్థితిలో ఉన్నవారలారా, పాపి, యేసును విశ్వసించు, నీవు యేసును విశ్వసించి నశించిపోతే, నేను నీతోపాటు నశిస్తాను. కాని అలా ఎన్నటికి జరగదు; యేసును విశ్వసించు వారు ఎన్నటికి నశించరు. యేసు నొద్దకు రమ్ము, ఆయన నిన్ను బయటికి ఎంత మాత్రమును త్రోసివేయడు. ఊహించుకోవడానికి ప్రయత్నించవద్దు. ఆయనను నమ్ము, నీవు ఎన్నటికి నశించవు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు లేఖ పఠనము: యోహాను 6:35-39. |
ద అవుట్ లైన్ ఆఫ్ స్పర్జన్ యొక్క "వేదాంతమంతటి యొక్క సారంశము"SPURGEON’S “SUBSTANCE OF ALL THEOLOGY” డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే బోధింపబడినది "తండ్రి నాకు అనుగ్రహించువారందరూను నా యొద్దకు వత్తురు; నా వద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను" (యోహాను 6:37).
I. మొదటిది, దేనిపై రక్షణ నిలుస్తుందో ఆ పునాది, యోహాను 6:37ఎ;
II. రెండవది, యేసుకు ఇవ్వబడిన వారికందరికీ నిత్య రక్షణ, యోహాను 6:37ఎ;
III. మూడవది, పాఠ్యభాగములోని రెండవ భాగమును వినండి, యోహాను 6:37బి; |