ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మానవుని పతనముTHE FALL OF MAN డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము |
ఆదికాండము బైబిలునకు "నేల" లాంటిది. ఆదికాండము యొక్క ఆసక్తికర లక్షణము అది చాలా ఆధునిక అబద్ధాలకు జవాబు ఇస్తుంది. సి. ఎస్. లూయిస్, తన జీవిత అంతములో, డార్విన్ సిద్ధాంతము ఆధునిక సమయాలలో "ప్రాముఖ్య అబద్ధము" అని చెప్పాడు. డార్విన్ సిద్ధాంతము అబద్ధాన్ని ఆదికాండము రెండు విధాలుగా నిరూపించింది. మొదటిది, పదే పదే మనకు చెప్పబడింది జంతువులు చెట్లు కూడ దేవునిచే సృష్టించబడ్డాయని. రెండవది, ఆదికాండము మనకు చెప్తుంది చెట్లు జంతువులు "వాటి జాతి ప్రకారము" ఉత్పత్తి చేస్తాయి. జంతువులు చెట్లు వాటి అంతర్గత "మూలాన్ని" బట్టి ఉత్పత్తి చేస్తాయి. ఇది పరిణామ క్రమ సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది, అది చెప్తుంది పునరుత్పత్తి "మూలాల" ప్రక్రియ ద్వారా ఏర్పడుతుందని. పరిణామ క్రమ బలహీనత "ఒక మూలము" నుండి ఇంకొకటి జరుగవచ్చు, "ఒక మూలము" ఇంకొక దానికి దారి తీస్తుంది. ఇది నిరూపించబడలేదు. అలా, ఆదికాండము చూపిస్తుంది పరిణామపు సిద్ధాంతము పూర్తిగా అబద్ధమని! కుక్క గుర్రముగా మారలేదు. గ్రద్ద కోడి కాలేదు. "ఒక మూలము" నుండి ఇంకొక దానిలోనికి అవకాశము లేదు. ఆదికాండము చూపిస్తుంది పరిణామపు ఊహాగానాలు పచ్చి అబద్ధమని! రెండవది, సృష్టిలో నుండి మనష్యులోచ్చారు అనే అబద్ధాన్ని ఆదికాండము నిరూపించింది. మన ఆదిమ తల్లిదండ్రులు పరిపూర్ణ వాతావరణంలో జీవించారు. అయినను వారు పాపులయ్యారు. వారి మొదటి కుమారుడు హంతకుడు! మూడవది, దుష్టత్వమును అర్ధం చేసుకోవడం అసాధ్యము అనే అభిప్రాయాన్ని ఆదికాండము నిరూపించింది. ఏదేను తోట దెయ్యము సాతాను పనులకు ఒక స్థానము. సాతాను సర్ప రూపములో పాపానికి హవ్వను శోధించింది. ఆరవ అధ్యాయములోని "మానవ జాతి" దెయ్యము పట్టిన పనిషి సాధారణ స్త్రీతో పొత్తు కలిగియుండడం. అలా దుష్టత్వము అనే "సమస్య" ఒక అబద్ధము, ఆధునిక మనష్యులచే చెప్పబడింది కాని వారు సాతాను దెయ్యాల వాస్తవాన్ని పరిగణలోనికి తీసుకొనలేదు. నాల్గవది, ఆధునిక భూనిర్మాణము సిద్ధాంతము కూడ అబద్ధము అని ఆదికాండము చెప్తుంది. విశ్వ ప్రళయమును గూర్చి భూమి చాలా ఋజువులు చూపిస్తుంది. భూ నిర్మాణికులు చెప్తారు, "సమస్తమును సృష్టి ఆరంభము ననున్నట్టే నిలిచియున్నది" (II పేతురు 3:4). వారు నోవాహు కాలములోని గొప్ప జల ప్రలయమును గూర్చి "బుద్ధి పూర్వకంగా నిర్లక్ష్యంగా" ఉన్నారు. ఆధునిక భూనిర్మాణ సిద్ధాంతము వివరణ ఇవ్వలేకపోయింది గోప్పలోతైన లోయ ఎలా ఉనికిలోనికి వచ్చింది, సముద్ర జలచరాల శిలాజము ఎలా ఎత్తైన కొండలపై కనుపిస్తుంది అనే విషయాలు. అలా ఆధునిక భూనిర్మాణ సిద్ధాంతము అబద్ధమని ఆదికాండము నిరూపిస్తుంది. ఐదవది, మానవుని దుష్టత్వము వివరింపబడనేరదు, అన్ని సిద్ధాంతాలు అబద్దాలని రుజువయింది, ఎందుకంటే మానవుడు మూల నీతినుండి ఆధునిక ప్రపంచములో మనము చూసే క్రూర హీన స్థితికి ఎలా పడిపోయాడో ఆదికాండము చూపిస్తుంది, "మరియు వారు, దేవుని నెరిగి, ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు; కాని వారు తమ వాదనలయందు ఊహాగానాలతో, తెలివి తక్కువతనంతో వారి హృదయాలు చీకటితో వ్యర్దులైరి" (రోమా 1:21). అలా, ఆదికాండము ఆధునిక మనస్తత్వ సిద్ధాంతాలన్నీ తప్పని నిరూపించింది. ఈ రాత్రి ఈ అబద్ధముపై వివరముగా దృష్టి సారిద్దాం. దయచేసి ఆదికాండము 3:1-10 వరకు చూడండి. "దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది, నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను? అందుకు స్త్రీ, ఈతోట చెట్ల ఫలములను మేము తినవచ్చును: అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి, దేవుడు మీరు చావకుండునట్లు, వాటిని తినకూడదని, వాటిని ముట్ట కూడదని, చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు: ఏలయనగా మీరు వాటిని తిను దినమున, మీ కన్నులు తెరువబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలే ఉందురు. దేవునికి తేలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహరమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదై యుండుట, చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను; అతడు కూడ తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని; తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి, తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్ల పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము వినిరి: ఆదాము మరియు అతని భార్య దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నారు. దేవుడైన యెహోవా, ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను? అందుకతను, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, దిగంబరిగా, ఉంటిని; గనుక భయపడి దాగు కొంటిననేను" (ఆదికాండము 3:1-10). ఆర్డర్ డబ్ల్యూ. పింక్ బ్రిటిష్ వేదాంత వేత్త మరియు బైబిలు వ్యాఖ్యాత. పింక్ సరిగా చెప్పాడు ఆదికాండము మూడవ అధ్యాయము దేవుని వాక్యమంతటిలో చాలా ప్రాముఖ్యమైన పాఠ్యభాగమని. పింక్ అన్నాడు, ఇది "బైబిలు విత్తనము విత్తుట." ఈ పునాదులపై చాలా విశ్వాసపు సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి. దైవిక సత్యాల నదులకు మూలము ఇక్కడ కనుగొంటాము. మానవ చరిత్ర వేదికపై గొప్ప నాటికలు వేయబడవచ్చు... [మానవ] జాతి పతనానికి దుర్భర స్థితికి దైవిక వివరణ ఇక్కడ కనుగొంటాము. మన శత్రువైన, సాతాను యుక్తులను మనము ఇక్కడ చూస్తాము...ఇక్కడ మానము మానవ స్వభావాన్ని తన సిగ్గును ఎలా దాచుకున్నాడో తన చేసుకున్న తప్పుకు మనము గ్రహిస్తాము (Arthur W. Pink, Gleanings in Genesis, Moody Press, 1981 edition, p. 33). సాతాను ఎలా ఏదేను వనములో ప్రవేశించిందో, సర్ప రూపములో ఎలా తన నోటి ద్వారా మాట్లాడిందో మూడవ అధ్యాయము మనకు చెప్తుంది. అక్కడ సాతాను స్త్రీతో మాట్లాడుతున్నట్టు చూస్తాము, దేవుడు ఆదాముకు చెప్పిన విషయముపై అనుమానము కలిగిస్తుంది, దేవుని మాటను మార్చి చెప్తుంది, "మీరు నిశ్చయంగా చావరు" ఆ వృక్ష ఫలములు తిన్న యెడల, "మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును భుజిస్తే." సాతాను ఇప్పటికే మోసమునకు యజమాని అని గుర్తించుకోవాలి. ప్రకటన గ్రంథములో బైబిలు చెప్తుంది, "దానితోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి, వాటిని భూమి మీద పడవేసెను..." (ప్రకటన 12:4). కొన్ని వచనాల తరువాత ఆ వచన భావము చెప్పబడింది, ప్రకటన 12:9 లో, "కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు, సాతాననియు పేరు గల, ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము, పడద్రోయబడెను: అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి" (ప్రకటన 12:9). డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, ఇక్కడ ఘట సర్పము ఏదేను లోని సర్పముతో గుర్తింపబడుతుంది (ఆదికాండము 3:1)... మరియు ఆ సాతాను [అరణ్యంలో] యేసును శోధించింది (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995, p. 1448; note on Revelation 12:9).దేవునిపై తిరుగుబాటు చేసినందుకు, దేవుని సింహాసనంపై దృష్టి పెట్టినందుకు సాతాను పరలోకము నుండి పడద్రోయబడెను (యెషయా 14:12-15; యేహెజ్కేలు 28:13-18). పరలోకము నుండి భూలోకమునకు సాతాను పడద్రోయబడ్డాడు, అతనిలా మారాడు "...వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి" (ఎఫెస్సీయులకు 2:2). దేవునిపై తిరుగుబాటులో సాతాను వెంబడించిన దూతల సంగతి ఏమిటి? ప్రకటన 12:9 చెప్తుంది, "అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి" (ప్రకటన 12:9). సాతానుతోపాటు ఎంతమంది దూతలు తిరుగుబాటు చేసారు? వారిలో ఎంతమంది "వానితోపాటు" భూమి పైకి త్రోయబడ్డారు? ప్రకటన 12:4 చెప్తుంది, "దానితోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము ఈడ్చి, వాటిని భూమి మీద పడవేసెను" (ప్రకటన 12:4). డాక్టర్ మోరిస్ చెప్పాడు, ఈ ‘పరలోక నక్షత్రాలు’ సాతాను దూతలుగా ప్రకటన 12:9 లో గుర్తింప బడ్డాయి (మోరిస్, ఐబిఐడి., పేజీ, 1447). అలా, పరలోకులో ఒకటవ వంతు దూతలు వారి నాయకుడైన సాతానుతో పాటు తిరగబడి భూమిపై పడద్రోయ బడ్డారు, యేసు తన భూలోక పరిచర్యలో ఈ దెయ్యములను తరుచూ ఎదుర్కొన్నాడు. సాతాను ఈ దూతలకు అబద్ధాలు చెప్పింది. నిస్సందేహంగా ఏదేను వనములో ఆదాము హవ్వలకు చెప్పిన అబద్ధమే ఇక్కడ సాతాను ఉపయోగించింది, వారితో సాతాను చెప్పింది, "మీరు దేవతల వలే ఉందురు" (ఆదికాండము 3:5). అబద్ధము నిస్సందేహంగా దూతలను నాశనము చేసింది, "నాతోరండి, మీరు దేవతల వలే ఉందురు." వారు సాతాను అబద్ధము నమ్మారు, కాని వారు "దేవతల వలే మారలేదు." ఓ, లేదు! వారు అపవిత్ర ఆత్మలుగా, లోకములో కోపముతో, కామముతో ఆగ్రహముతో ఇటు అటు తిరిగే వారిగా మారారు! సాతాను దూతలతో అబద్ధము చెప్పినట్టు, దేవునికి వ్యతిరేకంగా పాపము చెయ్యమని శోధించింది, అలాగే మానవునితో అబద్ధము చెప్పినప్పుడు కూడ అలాగే చేసింది. అదే తలంపును దూతల దగ్గర వాడింది, వారిని నాశనము చేసింది, అదే తలంపుతో ఏదేను వనంలో ఆదాము హవ్వాలను శోధించింది. ఆదికాండము 3:4-5 వినండి, "అందుకు సర్పము ఆ స్త్రీతో చెప్పెను, మీరు చావనే చావరు: ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలే ఉందురని, దేవునికి తేలియునని, ఆ స్త్రీతో చెప్పెను" (ఆదికాండము 3:4-5). సాతాను ఒకటవ వంతు దూతలను, పరలోకము నుండి త్రోయడానికి అదే వాదనను, అలాంటి అబద్ధాన్ని వాడి ఉంటుంది. ఇప్పుడు ఆ అబద్ధాన్ని, దేవుని మాటను వక్రీకరించడం, మన ఆదిమ తల్లిదండ్రులకు కూడ చేసింది. మరియు, దూతల వలే, వనములో మన తల్లిదండ్రులు కూడ అతని అబద్దాన్ని నమ్మి పడద్రోయబడి దూతలు "అబద్ద జనుకులు" అయ్యారు, ఆ విషయాన్నే ప్రభువైన యేసు క్రీస్తు సాతానును పిలిచాడు ఆయన పరిశయ్యలతో మాట్లాడినప్పుడు, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి, సత్యమందు నిలిచినవాడు కాదు, వానియందు సత్యమేలేదు. వాడు అబద్దమాడునప్పుడు, తన స్వభావము అనుసరించి మాటలాడును: వాడు అబద్ధికుడు అబద్ధమునకు, జనకుడునై యున్నాడు" (యోహాను 8:44). ఈ వచనములో యేసు సాతానును గూర్చి రెండు ప్రాముఖ్య విషయాలు చెప్పాడు: (1) "ఆది నుండి వాడు నరహంతకుడు" మరియు (2) "వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు." తనను వెంబడించమని దూతలను శోధించినప్పుడు సాతాను అబద్ధము చెప్పాడు. వనములో నిషిద్ధమైన చెట్టు ఫలమును తినమని సాతాను ఆదాము హవ్వాలను శోధించి అబద్ధము చెప్పాడు. సాతాను "ఆది నుండి నరహంతకుడు." అబద్దాలతో తనను వెంబడించిన దూతలను "చంపాడు," "అతని దూతలు," అవి పరము నుండి భూమిపైకి త్రోయబడి, నరక పాత్రులయ్యారు, "అది సాతానుకు అతని దూతలకు సిద్ధ పరచబడింది" (మత్తయి 25:41). "ఆది నుండి వాడు నరహంతకుడు," వాడు పరలోకములో ఒకవంతు దూతలను "చంపుట" మాత్రమే కాకుండా, తన మోసముతో అబద్దాలతో మొత్తము మానవ జాతిని చంపాడు. యేసు అన్నాడు, "ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, సత్యము నందు నిలిచినవాడు కాదు, వానియందు సత్యమేలేదు..." (యోహాను 8:44). సాతాను ఒక వంతు దూతలను నాశనము చేసాడు. సాతాను మొత్తము మానవ జాతిని "చంపింది" ఈ గొప్ప పాపములోనికి లాగి, మానవుడు పతనానికి సాతాను కారకుడయ్యాడు, ఇది ఆదికాండము 3:1-10 లో వ్రాయబడింది. ఆదాము పాపము చేసినప్పుడు అతడు సామాన్య మానవుడు కాదు. అతడు సర్వ మానవాళికి అధిపతి, లోకరిత్యా కూడ. సాతాను తిరుగుబాటు నేరుగా ఒకవంతు దూతలను ప్రభావితం చేసింది కాబట్టి, ఆదాము తిరుగుబాటు కూడ ఆయన పాపము ఇతరులపై గొప్ప ప్రభావము చూపాయి. అధిపతిగా మానవాళికి ఆదాము ఉన్నాడు. పాత పురిటాను పుస్తకము పిల్లలకు సరిగా చెప్పింది, "ఆదాము పతనములో, మనమందరము పాపము చేసాము." సాతాను అబద్ధము నమ్మడం ద్వారా, నిషేదింపబడిన ఫలము తినడం ద్వారా, ఆదాము అందరికి మరణము సంక్రమింప చేసాడు – మానవాళి అంతటికి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, "ఒక మనష్యుని [ఆదాము] ద్వారా పాపము లోకములో ప్రవేశించెను, మరియు పాపము ద్వారా మరణము వచ్చెను; మరియు మరణము మనష్యులందరికి వ్యాపించెను..." (రోమా 5:12). మానవ జాతిపై ఆదాము చేసిన పాపపు ప్రభావం అపారమైనది. పతనం ముందు, దేవుడు మరియు మనిషి ఫెలోషిప్ లో ఉన్నారు. ఫెలోషిప్ ముగిసిన తరువాత. వారు దేవుని నుండి వేరుచేయబడ్డారు. పతనం తరువాత వారు దేవుని నుండి దాచడానికి ప్రయత్నించారు. పతనానికి ముందు మనిషి అమాయక మరియు పవిత్ర మైనవాడు. ఆదాము మరియు ఈవ్ ఏ పాపం స్వభావం కలిగిలేరు. పతనం తరువాత వారు పాపంతో సిగ్గుపడ్డారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "ఒక మనుష్యుడి వలన పాపము ప్రపంచం లోనికి ప్రవేశించింది" (రోమా 5:12). "పాపములు" లోకములో ప్రవేశించెను అని ఆ వచనము చెప్పడం లేదు. అది చెప్తుంది "పాపము," ఏకవచనము. ఒక చెడ్డ ఉదాహరణ ఉంచడానికి ఆదాము పాపమును లోకములోనికి తీసుకొని రాలేదు. పాప కార్యము తన స్వభావములో మార్పు తీసుకొని వచ్చింది. అతని హృదయము దుష్టమైనది. మానవుని పతనమునకు ముందు జీవవృక్ష ఫలమును తిని మానవుడు నిరంతరము జీవించి ఉండేవాడు (ఆదికాండము 2:9; 3:22). పతనము తరువాత శరీరము ఆదాము పాపములో ఒక భాగము అయిపొయింది. రోమా 5:12 చెప్తుంది, "ఒక మనష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించెను, మరియు పాపము ద్వారా మరణము..." (రోమా 5:12). ఇది ఆత్మీయ మరియు శారీరక మరణములను సూచిస్తుంది. ఆదాము పాపము చేసిన తరువాత, దేవుడు చెప్పాడు, "...నీవు మట్టి నుండి వచ్చావు, తిరిగి మన్నై పోతావు" (ఆదికాండము 3:19). అలా, ఆదాము పతనము కారణంగా పాపము మనవాలిలో విశ్వ రూపము దాల్చింది. ఆదాము పతనం ఫలితంగా, పాపము ప్రపంచం మొత్తం వ్యాప్తించింది. మానవులందరూ పాపపు స్వభావముతో జన్మించారు, ఆదామును ఇది సంక్రమించింది, మానవ జాతికి అతడు అధిపతి. బైబిలు చెప్తుంది, "ఇట్లుండగా, ఒక మనష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో; అలాగునే మనష్యులందరూ పాపము చేసినందున, మరణము అందరికి సంప్రాప్తమాయెను" (రోమా 5:12). బైబిలు అంతటిలో మానవుని పాపపు స్వభావమును గూర్చి చెప్పబడింది. "పాపము చేయని మానవుడు లేడు" (I రాజులు 8:46). "పాపము చేయక మేలు చేయుచుండు, నీతిమంతుడు, భూమి మీద ఒకడైనను లేడు" (ప్రసంగి 7:20). "ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు: గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడు లేడు. అందరు త్రోవ తప్పి, ఏకముగా పనికి మాలిన వారైరి; మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను, లేడు" (రోమా 3:10-12). "ప్రతినోరు మూయబడునట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు చెప్పుచున్నదని ఎరుగుదుము" (రోమా 3:19). "మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు" (I యోహాను 1:8). ఆదాము పాపము తన వారసత్వమునకు, మానవ జాతికంతటికీ సోకినది. మానవాళి శారీరక స్థితిని బట్టి, దేవుడు ఆదాము పాపమును తన వారసులకు సంక్రమింపజేశాడు. అలా, పతనము తరువాత ఆదాము స్వభావము ఎలా ఉందో అదే స్వభావము అందరు కలిగియున్నాడు. రోమా 5:12 ప్రకారము మరణము (శారీరక మరియు ఆత్మీయ) అందరికి ప్రాప్తించింది, ఎందుకంటే ఆదిమ ఆదాము, పాపము చేసాడు కాబట్టి. "పూర్తి దుష్టత్వము" అంటే ఇదే. దాని అర్ధము తన శారీరక దుష్టత్వమును బట్టి దేవుని పట్ల నిజమైన ప్రేమలేదు. దాని అర్ధము దేవుని కంటే మానవుడు తనను ముందు ఉంచుతున్నాడు, తన సృష్టి కర్త కంటే తనను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాడు. పూర్తి దుష్టత్వము అంటే ప్రతి మనష్యుడు స్వాభావికంగా దేవుని పట్ల అయిష్టత కలిగియుంటాడు, ఆయన పట్ల ద్వేషము కలిగి, ఆయనకు విరోధిగా ఉంటాడు. "ఏలయనగా శరీరాను సారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది" (రోమా 8:7). "శరీరానుసారమైన మనస్సు" "పునర్నిర్మాణము కాని మానవుని" సూచిస్తుంది, అంటే తిరిగి జన్మించక పోవడం (The Geneva Bible, 1599, note on Romans 8:7). అలా, ఆదాము పతనము, ఆదికాండము మూడవ అధ్యాయములోనిది, మీ మీద నేరుగా ప్రభావము కలిగిఉన్నది. మీరు గుడిలో ఎదిగినా లేకపోయినా, మీకు దేవుని క్రీస్తును అయిష్ట పడే స్వభావము ఉంది, మీ ఆదిమ తండ్రి ఆదాము నుండి సంక్రమించింది. మీరు ఆలోచించేవే, నేర్చుకునేది చేసేది మీ అంతర్గత కల్మషమును తిరిగరాయలేదు. కాబట్టి, రక్షణ "అన్య" మూలము నుండి రావాలి, మీ బాహ్య మూలము నుండి రావాలి. ఆ మూలము దేవుడే. మీ అంతర్గత దుష్టత్వము విషయంలో దేవుడు మిమ్ములను మేల్కొల్పాలి. దేవుడు రక్షణ విషయములో మీకున్న తప్పుడు అభిప్రాయాన్ని తొలగించి, మీ అంతరంగిక దుష్టత్వమును గూర్చి మిమ్మును ఒప్పించాలి. దేవుడు మిమ్మును క్రీస్తు నొద్దకు నడిపించాలి, కడగబడడానికి నూతన జన్మకు. ఆదాము పాపమును బట్టి, క్రీస్తు తప్ప ఎవరు, "ఆఖరి ఆదాము," మిమ్ములను రక్షింప లేరు. అంటే రక్షణ ద్వారా కృప ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే. అదే మనం నమ్ముతాం బోధిస్తాం. ఆదాము పడిపోవకముందు, అతడు దేవునితో పరిపూర్ణ సంబంధము కలిగియున్నాడు. స్నేహితునిగా దేవునితో నడిచాడు. కాని పాపము చేసిన తరువాత, ఆదాము అతని భార్య తోటలో చెట్ల వెనుక దేవుని నుండి దాచుకున్నారు. మీరు ఆదాము బిడ్డలు. అందుకే దేవుని గూర్చిన మీ తలంపులు అన్ని తప్పే! ఆయనను నమ్మే బదులు, ఆయనపై తిరుగబడి, ఆయన నుండి దాగుకొని, మీ ఆదిమ తండ్రి ఆదాము వలే చేస్తున్నారు. అందుకే క్రీస్తును నమ్మే ప్రయత్నములో ఒక తప్పు తరువాత ఇంకొక తప్పు చేస్తున్నారు. అందుకే మీ మనసు గుండ్రంగా తిరుగుతుంది – అదే పొరపాటు మళ్ళీ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ, ముగింపు లేకుండా చేస్తున్నారు. కళాశాల విద్యార్ధి సాక్ష్యము నాకు తప్పుడు మార్పు ఒకదాని తరువాత ఒకటి కలిగింది. మార్పులో ఒక భావన పొందాలనుకున్నాను. అబద్ధపు మార్పు సమయము నాకు భయంకరమైనది. నేను ఉపదేశమునకు వచ్చినప్పుడు, ఏదో చెప్పాలనుకున్నాను. ప్రసంగములో విన్నది జ్ఞాపకము చేసుకోవాలని ప్రయత్నించాను, కనుక తిరిగి అది చెప్పాను. కాని నా పదాలలో అర్ధము లేదు. ఇంకొకరి మార్పు సాక్ష్యమును అనుకరించాలనుకున్నాను. ఎంత పిచ్చితనము! నేను ఒంటరిగా ప్రార్ధించి నా పాపమును గూర్చి ఆలోచించాను. అప్పుడు సువార్త బోధ నాకు తేటగా అనిపించింది. ఎలాంటి నిరీక్షణ లేనివాడుగా భయంకర పాపిగా నేను యేసు నొద్దకు వచ్చాను – నా నిరీక్షణ క్రీస్తు యేసు నందు ఉంది. అతి ప్రాముఖ్యమైన విషయము నేను యేసు నొద్దకు రావడం నా పాపములు ఆయన రక్తము కడుగబడడం. నేను ఆయన రక్తమును నమ్మాను. కళాశాల వయస్సు స్త్రీ యొక్క సాక్ష్యము సాతాను నాతో చెప్తూ ఉంది, "వీరిది తప్పు. నీవు పరిపూర్ణురాలవు. నీకు యేసు అక్కరలేదు." నేను గుడికి వచ్చాను నాడి తప్పని నాకు తెలుసు. నేను అదుపులేకుండా ఏడుస్తున్నాను. డాక్టర్ కాగన్ అడిగాడు, "నీవు క్రీస్తు నొద్దకు వస్తావా?" నేను జవాబు ఇచ్చాను "అవును, నేను ఆయన దగ్గరకు వస్తాను. నేను ఆయన దగ్గరకు వస్తాను." ఈరోజే నేను యేసుకు అప్పగించుకున్నాను. నేను పూర్తిగా నన్ను నేను యేసుకు సమర్పించుకొన్నాను. యేసు క్రీస్తు నన్ను కౌగిలించుకొని ఆయన రక్తములో నా పాపాలు కడిగి వేసాడు. ఒక యవ్వనస్తుని సాక్ష్యము. నా హృదయము అసహ్యంగా, తిరుగుబాటుతో, దుష్టత్వముతో నిండి ఉందని, దేవునికి వ్యతిరేకంగా ఉందనే వాస్తవాన్ని నేను కాదనలేక పోయాను. నేను మంచి వ్యక్తిని అని అనుకుంటూ నన్ను నేను మోసం చేసుకోలేకపోయాను. నేను మంచివాడను కాదు నాలో మంచితనము లేదు. ఆ రాత్రి మరణిస్తే నేను నేరుగా నరకానికి వెళ్తానని తెలుసు. నేను నరక పాత్రుడను. నేను పాపిని. ప్రజల నుండి నా పాపాలు దాచుకోగలననుకున్నాను. కాని దేవుని నుండి దాచలేను. దేవుడు నా పాపమంతటిని చూసాడు. నిషేధించబడిన ఫలము తిన్న తరువాత ఆదాము దాగుకున్నట్టు నాకు కూడ అలాగే అనిపించింది. నిస్సహాయుడనయ్యాను. భయంకర పాపినైన నన్ను నా మంచి క్రియలు రక్షించలేవు. క్రీస్తు మాత్రమే నన్ను రక్షించాడు. ఆయన రక్తము నా పాపాలన్నింటిని కడిగి వేసింది. క్రీస్తు ఆయన రక్తముతో నన్ను కప్పాడు. ఆయన నీతి వస్త్రముతో నన్ను కప్పాడు. నా పాపపు హృదయాన్ని ఆయన రక్తము కడిగింది. నా విశ్వాసము నిశ్చయత క్రీస్తు నందు మాత్రమే. నేను పాపిని – కాని యేసు నన్ను రక్షించాడు. యవ్వన కళాశాల వయస్సు అమ్మాయి సాక్ష్యము నేను గుడిలో ప్రవేశించాను నా హృదయము భారముగా ఉంది. నేను పాపినని గ్రహించాను. నా హృదయము అసహ్యమై, దేవునికి విరోధముగా తిరుగుబాటు దుష్టత్వము కలిగియున్నదన్న, వాస్తవాన్ని నేను కాదనలేకపోయాను. తరువాత, ప్రసంగము ముగింపు సమయాన్న, నేను మొట్ట మొదటిసారిగా సువార్త విన్నాను. మునుపు అది నాకు అర్ధవంతము కాలేదు. క్రీస్తు సిలువపై నా స్థానములో మరణించాడు, నా పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము. నాకై ఆయన సిలువపై మరణించాడు! ఆయన నాకై రక్తము కార్చాడు! నాకు యేసు కావాలి. నా కళ్ళు తెరువబడ్డాయి. తొలిసారిగా నేను యేసు వైపు చూసాను, ఆ క్షణమే క్రీస్తు నన్ను రక్షించాడు! జాన్ న్యూటన్ పాట భావము నాకు అర్ధము అయింది, "అద్భుత కృప! మధుర స్వరము, నాలాంటి దుర్మార్గుడిని అది రక్షించింది! నేను ఒకప్పుడు నశించాను కాని ఇప్పుడు కనుగొనబడ్డాను, ఒకప్పుడు గ్రుడ్డి వాడను ఇప్పుడు చూస్తున్నాను!" నేను పాపిని, పాపము నుండి క్రీస్తు నన్ను రక్షించాడు. నేను యేసును చూడలేదు. భావన పొందలేదు దైవిక మతపర అనుభవము పొందుకోలేదు. నేను కేవలము ఆయనను విశ్వసించాను. నేను యేసును నమ్మిన క్షణమే, ఆయన రక్తముతో నా పాపమును కడిగివేసాడు. నా రక్షకుడు పిలుచుట నేను వినుచున్నాను, నా రక్షకుడు పిలుచుట నేను వినుచున్నాను, నేను వచ్చుచున్నాను, ప్రభూ, ఇప్పుడే మీ దగ్గరకు వచ్చుచున్నాను; ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |