ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తులో మాత్రమే!IN CHRIST ALONE! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము: ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థ పరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును: మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిర పరచును" (యోషేయా 6:1, 2). |
ఈ వచనముల అర్ధము తేటగా ఉంది. ఇది ఇశ్రాయేలుకు దేవుని ఆఖరి పిలుపు. త్వరలో వారు అస్సీరియాచే తీసుకొనబడి బబులోనుకు కొనిపోబడతారు. వారు ఉమ్మివేయబడి చీల్చి వేయబడిన తరువాత వారంటారు, "రండి, మనము యెహోవా వద్దకు మరలుదము." అవును, ప్రవచనము వేరవేరింది, వారు బబులోనీయులచే చెర పట్టబడ్డారు. ప్రవచనము భవిష్యత్తును గూర్చి మాట్లాడుతుంది. భవిష్యత్తులో దేవుడు వారిని స్వస్థ పరుస్తాడు. "ఆయన మనలను బ్రతికించును, ఆయన సముఖమందు మనము బ్రతుకుదుము." ఆ భవిష్యత్తు దినమున దేవుడు ఇశ్రాయేలును తిరిగి స్వదేశమునకు రప్పించి వారిని రక్షిస్తానని దేవుడు వాగ్ధానము చేసాడు. మన కాలములో దేవుడు ఆ వాగ్ధానము నెరవేర్చ ఆరంభించాడు. 1948 లో ఇశ్రాయేలు దేశముగా ప్రకటింపబడింది. అప్పటి నుండి యూదా ప్రజలు వారి స్వస్థలమైన ఇశ్రాయేలుకు తిరిగి వస్తున్నారు. త్వరలో వారు ఆయన సముఖములో జీవిస్తారు, "ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు" (రోమా 11:26). ఇది ఈ వచనాల అనువాదము. కాని ఇంకా ఉంది. ఒకరన్నారు, "ఒక తర్జుమా కాని చాలా అన్వయింపులు ఉన్నాయి." ఇవి ఈ వచనముల రెండు అన్వయింపులు. I. మొదటిది, పాఠ్యభాగము క్రైస్తవులకు అన్వయింపబడుతుంది. ఈ పాఠ్యభాగము క్రైస్తవులకు అన్వయింపును గూర్చి మాట్లాడుతుంది. కొద్ది మంది క్రైస్తవులు అంతరాయము లేకుండా ప్రభువును వెంబడిస్తారు. వారు వారి క్రైస్తవ జీవితాలలో నిలకడగా ఉంటారు. కాని మనలో చాలామంది క్రైస్తవులు తరచూ చల్లబడి పోతాము. కనుక దేవుడు శ్రమను కష్టమును పంపిస్తాడు. సమస్యలు శ్రమలు మనలను చించేలా ఉమ్మివేయబడేలా ఆయన అనుమతిస్తాడు. దేవుడు మీ మనశ్శాంతిని తీసివేస్తాడు. నిరాశ చెంది భార హృదయములు అగునట్లుగా దేవుడు మీకు చేస్తాడు. గుడిలో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడ. దేవుడు మీకు ఇలా జరగడానికి ఎందుకు అనుమతించాడు? ఆయన మీకు ఏదో కొత్తది చేయబోతున్నాడు. దేవుడు నేను వచ్చే సంవత్సరము వెళ్లి ఒక కొత్త గుడిని ఆరంభించేలా మిమ్ములు సిద్ధ పరుస్తూ ఉండవచ్చు. లేక గుడిలో మీరు కొత్త విధులు తీసుకునేలా మిమ్ములను సిద్ధ పరుస్తూ ఉండవచ్చు. మానవులముగా, మారడం మనకు ఇష్టము ఉండదు. కాబట్టి వేర్వేరు భాద్యతలు తీసుకునేలా దేవుడు మనలను చీల్చివేస్తాడు కొడతాడు. ఆయన రాజ్యములో ఎక్కువగా ఉపయోగపడడానికి మనలో ఉన్న విగ్రహాలను ఆయన విరుగగొడతాడు. డాక్టర్ టోజర్ అన్నాడు, "దేవుడు ఒక వ్యక్తిని లోతుగా గాయపరచకుండా అతనిని గొప్పగా దీవించలేదు." మీరు మారితే, దేవుడు మిమ్ములను నాశనము చేయడు. కాని ఆయన మిమ్ములను వణికింప చేస్తాడు. బహుశా ఆయన మిమ్ములను ఉజ్జీవములో వాడుకోబోతున్నాడు! "రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును: మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున, ఆయన మనలను స్థిర పరచును." మీలో కొందరు బలమైన క్రైస్తవులుగా అవడానికి కొత్త గుడి ప్రారంభించడం సహాయపడతుందని నేను నమ్ముచున్నాను. పిల్లలు పెద్ద వాల్లవుతున్నప్పుడు చేతులలో కాళ్ళలో వారికి నొప్పి అనిపిస్తుంది. దానిని వారు "ఎదుగుచున్నప్పుడు నొప్పులు" అని పిలుస్తారు. భయపడకండి. రెండు రోజుల తరువాత ఆయన మిమ్ములను ఉజ్జీవింపచేసి మీకు ఎక్కువ విశ్వాసమును ఎక్కువ జీవాన్ని ఇస్తాడు! దీనినైతే చీల్చాడో, ఆయన ప్రియ కుమారునిలో ఎక్కువగా ఆయన పూడుస్తాడు! జాన్ న్యూటన్ వ్రాసాడు "అద్భుత కృప." ఈ పాట కూడ ఆయనే వ్రాసాడు. నేను ఎదగాలని ప్రభువును అడిగాను తరువాత దేవుడు ఏమి చెప్పాడో ఆయన చెప్పాడు, ఈ అంతరంగిక శ్రమలు నేను ఉంచాను, II. రెండవది, పాఠ్యభాగము మారని వారికి అన్వయింపబడుతుంది. నా ప్రాముఖ్య ఉద్దేశము ఈ సాయంకాలము మీకు రెండవ అన్వయింపు ఇవ్వడం, మీరు మారకపోతే ఇంకా ఇది ఎలా మీతో మాట్లాడుతుందో చూపించడం! దేవుడు మీతో చెప్తున్నాడు, "రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము: ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థ పరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును: మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిర పరచును" (యోషేయా 6:1, 2). మార్చు నొప్పితో కూడినది. మార్పు నోందడం మీకు ఇష్టము లేదు కాబట్టి అది బాధకారము. మారలనుకుంటున్నాను అని మీరు అనవచ్చు –కాని అది నిజము కాదు. మీరు అనుకోవచ్చు కూడ మారాలని – అది కూడ నిజము కాదు! బైబిలు చెప్తుంది, "దేవుని వెదకువాడును లేడు" (రోమా 3:11). అప్పుడు కొందరు ఎందుకు క్రీస్తును వెదకడం ప్రారంభిస్తారు? జవాబు యోహాను 16:8 లో ఉంది, ఇలా చెప్తుంది పరిశుద్ధాత్మ "లోక పాపమును గూర్చి ఒప్పుకోనచేయును." "ఒప్పుకోనజేయును" అనే పదము "ఎలెన్ కొ" అను గ్రీకు పదము నుండి వచ్చినది – "ఒప్పుకోనజేయు," "లోపమును ఎత్తి చూపుట," "గద్దించుట," "నచ్చచెప్పుట." నశించు పాపి అని ఎవరితోనైనా చెప్పితే వారు దానిని బట్టి ఆనందించరు. కాని సువార్త బాధలో అలా చెప్పడం అవసరము. మీరు ఇంకా మారకపోవడానికి కారణం మీ పాపమును మీరు గమనించడం లేదు. అందుకే ఎక్కువ ప్రార్ధన చెయ్యాలి, దేవుడు తన ఆత్మను పంపునట్టు, నశించు వారు చీల్చబడునట్టు, కొట్టబడునట్టు, ఒప్పింపబడి, గద్దింపబడునట్లు, వారి స్వార్ధమును గూర్చి, శక్తి గల దేవునికి వ్యతిరేకంగా వారి తిరుగుబాటును గూర్చి ఒప్పింపబడునట్లు. అంత తిరుగుబాటు హృదయములో పాపము ఉంచుకొని ఆఖరి తీర్పులో ఎలా దేవుని యెదుట నిలువబడగలరు? ఇలాంటి ప్రసంగము వినకుండా ఎలా మీరు పై అంతస్తుకు వెళ్లి భోజన సహవాసములో మీ స్నేహితులతో నవ్వుతూ పాల్గొనగలరు? వారమంతా రోజుకొక ప్రసంగము చదవకుండా విడియో చూడకుండ ఎలా ఉండగలరు? మీరు దేవునికి భయపడాలి, నిజ దేవుడు, ఆయన మీ నిమ్మలమైన తలంపులను బట్టి మీ కఠిన హృదయములను బట్టి అభ్యంతర పడి కోపపడే దేవుడు!!! ఇది తీవ్ర విషయము! ప్రపంచములో దీనిని మించిన తీవ్రమైనది ఇంకొకటి లేదు. నరకాన్ని మంటలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, కాని మీరు ఈ ప్రసంగము అయిన వెంటనే మీ స్నేహితులతో నవ్వుతారు! అలా అయితే మీకు నిరీక్షణ ఉండదు! జాన్ కాగన్ చెప్పినది వినండి, "నా మార్పు ముందు చనిపోవాలనిపించింది. నిద్రపోలేదు. నవ్వలేకపోయాను. శాంతి లేదు...చిత్రహింసలు ఆ భావన ఆగలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. అంతరించిపోయాను. నన్ను నేను అసహ్యించుకున్నాను, నా పాపమును బట్టి...నా పాపము చాలా దారుణంగా తయారయింది. ఏ మాత్రము భరించ లేకపోయాను. దేవుడు నన్ను నరకపాత్రుని చేస్తాడని నాకు తెలుసు. శ్రమతో బాగా అలసిపోయాను. అంతటిలో అలసిపోయాను...ఇంకా యేసును పొందుకోలేదు... రక్షింపబడాలని ‘ప్రయత్నిస్తున్నాను’. క్రీస్తును విశ్వసింప ‘ప్రయత్నిస్తున్నాను’ కాని చేయలేకపోతున్నాను. క్రైస్తవుడనవడానికి నిర్ణయించుకోలేకపోతున్నాను, నన్ను చాలా నిరీక్షణ లేనివానిగా చేసింది. దీనికి బదులు, ఆయన నాకు కనుపరిచాడు నా పాపము నన్ను నరకములోనికి నెట్టేస్తున్నట్టుగా అనిపించింది, అయినను కన్నీళ్లు రాకుండా నా మొండితనము ఆపేస్తుంది... అంతా చనిపోయేటట్టుగా విడిచిపెట్టాను!" అది జాన్ కు ఎలా సంభవించింది? సరియైన పదాలు ఉపయోగించడం వలన కాదు! ఓ దేవా, కాదు! పదాలు అతనికి సహాయము చెయ్యలేదు! "భావన" కాదు. ఓ, దేవా కాదు! భావన సహాయము చెయ్యలేదు. ప్రభువు "అతనిని చీల్చాడు. కొట్టాడు!" ఆయన జాన్ హృదయాన్ని నలుగ గొట్టాడు! ఆయన జాన్ ను కొట్టాడు! నిజమైన మార్పు నొప్పితో కూడినది! మీరు సర్వ శక్తిమంతుడైన దేవునితో పోరాడుచున్నారు! అది మీరు కాదనలేరు. దాని నుండి మీ మాటలు తీసుకోలేరు! దాని నుండి మీరు నేర్చుకోకుండా ఉండలేరు!!! ఈ అంతరంగిక శ్రమలు నేను ఉంచాను, "కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి, నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు" (కీర్తనలు 2:12). ఏమి జబలగ చెప్పినది వినండి, "సానుభూతితో నా పాపమును బట్టి నన్ను నేను చుట్టుకున్నాను...నా హృదయపు మచ్చలను కాఠిన్యతను నేను వర్ణించలేను. దేవుడు నాకు చూపించిన దానిని బట్టి నేను విసిగిపోయి అవమానము పొందాను. అన్ని చూసే దేవుని ముందు నేను ఒక పురుగును. స్వార్ధ పాపముతో వేరు పారాను. పవిత్ర క్రైస్తవుల మధ్య ఒక పాప భూఇష్ట చిరుతలా నాకు అనిపించింది. అయినను క్రీస్తును విశ్వసించలేదు. యేసు ఒక మాట...చాలా దూరంగా ఉన్న వ్యక్తి...ఒక మంచి భావన కొరకు చూస్తున్నాను...రక్షింపబడ్డాను అని చెప్పడానికి ఒక అనుభవము కొరకు...డాక్టర్ హైమర్స్ అద్వితీయ దేవునితో ఆటలాడుతున్న నశించుచున్న వారిని గద్దించారు. నా కుర్చీలో కూర్చున్నాను, భయముతో వణికిపోతున్నాను. నేనే అని నాకు తెలుసు. డాక్టర్ హైమర్స్ ఈ పాఠ్య భాగముతో నాతో మాట్లాడారు, ‘రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము: ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థ పరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును...మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిర పరచును’ (యోషేయా 6:1, 2)." ఏమి చెప్పింది, "అగాధ సముద్రము వలే నా పాపము విస్తరించింది. దానిని తీసుకోలేకపోయాను. నాకు యేసు కావాలి అంతే! ఆయన రక్తము నాకు కావాలి అంతే!" "ప్రభువు చీల్చివేసాడు. కొట్టాడు!" ఆయన ఎమీ హృదయాన్ని విరుగగొట్టడం! ఆయన ఏమీను కొట్టాడు! నిజమైన మార్పు చాలా బాధతో కూడినది! మీరు సర్వ శక్తిగల దేవునితో పోరాడుతున్నారు! మీరు మిమ్మును మోసగించుకోలేరు! దాని నుండి తోలగలేరు! దాని నుండి తప్పించుకొని నవ్వలేరు!!! దానిని బట్టి మీరు అలసిపోలేదా? మీకు భయము లేదా? మతముతో మీ పీకలను చుట్టుకుంటున్నారా? ఓ దేవా, మంటల నుండి వారిని రక్షింపుము! "కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి, నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. వారు ఆయనపై నమ్మకం పెట్టి దీవించబడ్డారు" (కీర్తనలు 2:12). మీరు ప్రభువుచే చీల్చబడ్డారా? ఆయన హస్తముచే గాయ పరచాబడ్డారా? మీ విచారానికి బాధకు గుర్తు దేవుడు మిమ్ములను ప్రేమించడం లేదు అని మీకు అనిపిస్తుందా? మీ బాధను మీరు ఎవ్వరితోను చెప్పుకోలేకపొతున్నారు అని మీకు అనిపిస్తుందా? నీవు ఒంటరిగా ఉన్నావని నీకు అనిపిస్తుందా దేవుడు క్రీస్తును గెత్సమనే వనములో ఒంటరిగా వదిలిపెట్టినట్టు? మీలో మీరు ఇలా అనుకున్నారా – "దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు?" సాతాను గుసగుసలాడుతూ ఇలా అంటుంది, "ఎందుకు వెళ్ళడం? ఎవ్వరు నిన్ను పట్టించుకోవడం లేదు. ఎవ్వరు నిన్ను ప్రేమించడం లేదు." నేను మిమ్ములను బ్రతిమాలుచున్నాను, "దెయ్యము మాటలు వినకండ!" నా మాటలు వినండి. ఇలాంటి చిత్రహింసలు నా జీవితంలో కనీసం ఆరుసార్లు చూసాను. నేను మార్పు నొందక ముందు, ఐదుసార్లు. "రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము; ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థ పరచును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును: మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిర పరచును" (యోషేయా 6:1, 2). ప్రతిసారి ఈ చిత్ర హింస ద్వారా వెళ్తున్నప్పుడు, నేను దేవునికి ఎక్కువ పని చేయడానికి నన్ను సిద్ధ పరుస్తుంది. ప్రతిసారి ఆ బాధ చాలా ఎక్కువ అది ఇక ఎప్పుడు పోదేమో అనిపించేది. యేసు నాతో చెప్తున్నాడు, ఈ అంతరంగిక శ్రమలు నేను ఉంచాను, మొదటిది నేను మార్పు నొందినప్పుడు. ఇటీవల నేను కేన్సరుకు గురి అయినప్పుడు. వారన్నారు, "మీకు కేన్సర్ ఉంది." పూర్తి వైధ్యము ఇచ్చారు. మోషే అరణ్యములో ఏకాంతముగా ఉన్నట్టు నాకు అనిపించింది. అర్ధరాత్రి మళ్ళీ మళ్ళీ, కన్నీళ్లు కార్చాను! నా పని అయిపోయిందనుకున్నాను. నేను చింపి వేయబడ్డాను. మీకెలా అనిపిస్తుందో నాకు తెలుసు. చీకటి రాత్రి ద్వారా నా ఆత్మ వెళ్ళుతున్నప్పుడు, కొత్త దానికి దేవుడు నన్ను సిద్ధ పరుస్తున్నాడు. ఈ సారి కొత్త గుడిని ప్రారంభించడానికి నన్ను సిద్ధ పరుస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు నన్ను విడిచి పెట్టలేదు. అవును, ఆయన నిన్ను చీల్చి వేసాడు – కాని ఆయన నిన్ను స్వస్థ పరుస్తాడు! అవును, ఆయన నిన్ను గాయ పరిచాడు – కాని ఆయన నిన్ను బాగు చేస్తాడు! ఆయన నిన్ను చీల్చింది కొట్టింది ఒక ఉద్దేశము కొరకు – క్రీస్తు మాత్రమే నీకు నిరీక్షణ ఇస్తాడని నీవు తెలుసుకోవడానికి! క్రీస్తులో మాత్రమే శాంతి దొరుకుతుందని నీవు తెలుసుకోవడానికి! క్రీస్తులో మాత్రమే సంతోషం దొరుకుతుందని నీవు తెలుసుకోవడానికి! నీ పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడని నీవు తెలుసుకోవడానికి! నీకు కొత్త జీవితమూ ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడని నీవు తెలుసుకోవడానికి! క్రీస్తులోనే నా నిరీక్షణ కనుగొనబడుతుంది; ఆయన నా వెలుగు, నా శక్తి, నా గానము; ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తులో మాత్రమే!IN CHRIST ALONE! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "రండి, మనము యెహోవా యొద్దకు మరలుదము: ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థ పరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును: మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు, మూడవ దినమున ఆయన మనలను స్థిర పరచును" (యోషేయా 6:1, 2). (రోమా 11:26) I. మొదటిది, పాఠ్యభాగము క్రైస్తవులకు అన్వయింపబడుతుంది. II. రెండవది, పాఠ్యభాగము మారని వారికి అన్వయింపబడుతుంది, రోమా 3:11; యోహాను 16:8; కీర్తనలు 2:12. |