Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




తన్ను ఎందరంగీకరించిరో!

AS MANY AS RECEIVED HIM!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 15, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 15, 2018

"ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను: వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలననైనను, శరీరేచ్చ వలననైనను, మానేషేచ్చ వలననైనను, పుట్టిన వారు కారు" (యోహాను 1:11-13).


యేసు యేరూషలేములో ఉన్నాడు. అది పస్కా పండుగ సమయము. యేసు అద్భుతాలు చేయడం చాలామంది చూసారు. ఆ అద్భుతాలను చూచినప్పుడు వారు విశ్వసించారు. కాని వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. వారు అద్భుతాలు నమ్మారు కాని ఆయనను నమ్మలేదు. కనుక వారి విశ్వాసము నిరుపయోగము. ఈనాటి చాలామంది ప్రసిద్ధులను వారు నాకు గుర్తు చేస్తున్నారు. వారి విశ్వాసము అద్భుతములపై కేంద్రీకృతమై ఉంది. అంటే దాని అర్ధము "సూచనలు." వారు ఎప్పుడు సూచనలు అద్భుతాల కొరకు చూసేవారు. అలాంటి వారిని ఇది రక్షించదు.

"అయితే యేసు అందరిని ఎరిగిన వాడు, కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు: కనుక ఎవడును మనష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కర లేదు" (యోహాను 2:24, 25).

యేసు వారి హ్రుదయాలలోనికి చూడగలడు. వారు ఆయనను నమ్మలేదని ఆయనకు తెలుసు. వారు అద్భుతాలే నమ్మారు. సూచనలు అద్భుతాల యందు వారి విశ్వాసము వారిని రక్షింపలేదని ఆయనకు తెలుసు. "వారిలో ఉన్నది ఆయనకు తెలుసు." "అందరి మనసులు" హృదయాలు ఆయనకు తెలుసు. మీ హృదయము ఆయనకు తెలుసు. వారు నూతన జన్మ అనుభవించారో లేదో ఆయనకు తెలుసు. నూతన జన్మ అనుభవింపక ముందు మీ హృదయము పాపముచే కల్మశమై ఉంటుంది. బైబిలు చెప్తుంది,

"హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది..." (యిర్మియా 17:9).

ఆ రాత్రి యేసు ఎక్కడ బస చేసాడో బైబిలు చెప్పలేదు. కాని ఒక ప్రసిద్ధ తత్వవేత్త నికోదేము "రాత్రి యేసు నొద్దకు వచ్చాడు" (యోహాను 3:1, 2). ఇప్పుడు యోహాను 1:11-13 చూడండి,

"ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను: వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలననైనను, శరీరేచ్చ వలననైనను, మానేషేచ్చ వలననైనను, పుట్టిన వారు కారు" (యోహాను 1:11-13).

పాపి క్రీస్తును చేర్చుకున్నప్పుడు రక్షణ వస్తుంది. ఈ మూడు వచనాలు ఆయనను స్వీకరించడంను గూర్చిన వివరణ ఇస్తున్నాయి. 11 వ వచనములో, చాలామంది క్రీస్తును చేర్చుకోమని మనకు చెప్పబడింది. చాలామంది నరకానికి పోతారు. ఇది చెప్తుంది,

"ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింప లేదు" (యోహాను 1:11).

"ఆయన స్వకీయులు" అంటే ప్రపంచపు మానవాళి మొదటి పదాలలో. రెండవ "ఆయన స్వకీయులు" యూదా ప్రజలను గూర్చి మాట్లాడుతుంది. ఆయనను గూర్చిన చాలా పాతనిబంధన ప్రవచనాలు ఉన్నప్పటికినీ, వారిలో చాలామంది ఆయనను చూచి వారి మెస్సియగా ప్రభువుగా స్వీకరించలేదు. ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు యూదులు మానవాళి క్రీస్తును స్వీకరించలేదు – ఈ రోజు కూడ వారు ఆయనను స్వీకరించరు.

"ఆయన తృనీకరింపబడిన వాడును మనష్యులు వలన విసర్జింపబడిన వాడును... మనష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3).

నశించు పాపులను క్రీస్తు నొద్దకు తెచ్చుట దేవుని సర్వ శక్తి జరిగిస్తుంది. కాని అది మనలను మన ముఖ్య పాఠ్యభాగానికి నడిపిస్తుంది యోహాను 1:12,

"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామము నందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు అధికారము అను గ్రహించెను" (యోహాను 1:12).

ఈ పాఠ్యభాగము నుండి మనము మూడు విషయాలు చూడవచ్చు.

I. మొదటిది, క్రీస్తును అంగీకరించుట అంటే ఏంటో నేను వివరిస్తాను.

"అంగీకరించుటకు" గ్రీకు పదము "లాంబానో." దాని అర్ధం "తీసుకొనుట," "అంగీకరించుట," "పొందుకొనుట." మీరు క్రీస్తును అంగీకరించాలని మేము అడుగుతున్నాము. క్రీస్తును చేర్చుకోవాలని మేము అడుగుతున్నాము. ఆయన పొందుకోవాలని, విశ్వసించాలని, మీరు మీ రక్షకునిగా ప్రభువుగా చేసుకోవాలని మేము చెప్తున్నాము.

క్రీస్తును అంగీకరించడానికి అంటే ఆయన బైబిలులో వ్రాయబడినట్టుగా చేర్చుకోవాలి. క్రీస్తు ఇమ్మానుయేలు – మనతో దేవుడు ఉన్నాడు. దేవును శరీరధారి అయ్యాడు. తండ్రి దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు. త్రిత్వములో రెండవ వాడు, మానవుని వలే అయ్యాడు. దైవ మానవుడు, ఇప్పుడు పరలోకములో తండ్రి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మానవునిగా కన్య మరియకు జన్మించాడు. ఆయన నిత్యుడగు ప్రభువు – ఆది అంతము లేనివాడు, దేవుని నిత్య కుమారుడు. ఇది అంగీకరించకపొతే స్వీకరించడానికి ఇంకేముంది? ఆయన రక్షకుడు, ఆయన ఒక్కడే మీ పాపమును తీసివేసి మీ పాపముల నుండి నిత్యత్వములో రక్షిస్తాడు!

ఆయనను మీ రాజుగా స్వీకరించకుండా మీరు ఆయనను చేర్చుకోలేరు. ఆయన మీ జీవితాన్ని ఏలాలి. మిమ్ములను మీరు ఆయనకు అర్పించుకోవాలి. ఆయనకు సమర్పించుకోవాలి. మీ శరీరము ఆత్మ క్రీస్తుచే పాలించబడేటట్టుగా మీరు ఆయనకు అర్పించుకోవాలి. మీరు స్వతహాగా ఆయనకు అర్పించుకోవాలి. మీరు ఆయనకు సమర్పించుకొని, మీ చిత్తము, మీ తలంపులు, మీ నిరీక్షణలు, మీ జీవిత మంతా ఆయన స్వాధీనంలో ఉంచండి. ఇంకా ఇలా చెప్పకూడదు, "ఈ మనష్యుడు మీ మీద ఏలుబడి చేయకూడదు." జాన్ కాగన్ విన్నాడు "క్రీస్తుకు సమర్పించుకో! క్రీస్తుకు సమర్పించుకో!" కాని అది అతనికి నచ్చలేదు. "యేసుకు ఇచ్చుకోవాలి" అనుకోలేదు. అతనికి యేసు స్వాధీనంలో ఉండడం ఇష్టంలేదు. కాని జాన్ అధ్వాన స్థితిలో ఉన్నాడు. "యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు...కాని నేను ఆయనకు సమర్పించుకోవడం లేదు. ఈ తలంపు నన్ను కదిలించింది..." ఆ క్షణంలో జాన్ యేసుకు సమర్పించుకున్నాడు. అతనన్నాడు, "నేను చనిపోవాలి, క్రీస్తు నాకు జీవితమూ ఇచ్చాడు." జార్జి మేధేసన్ (1842-1906) బాగా చెప్పాడు. ఆయన పాట పేరు "నన్ను బంధీని చేయి, ప్రభూ."

నన్ను బంధించు, ప్రభూ, అప్పుడు నేను విడుదల అవుతాను;
నేను ఖడ్గము ఉపయోగించ బలవంతపెట్టు, అప్పుడు నేను జయించు వాడనవుతాను;
నేను భూలోక భయాలలో మునిగి పోతాను, నాకు నేనే నిలబడితే;
మీ చేతులలో నన్ను బంధించు, అప్పుడు నా చెయ్యి బలముగా ఉంటుంది.

క్రీస్తును అంగీకరించడానికి, మీరు ఆయనను మీ రక్షకునిగా రాజుగా కలిగి యుండాలి. మీరు ఆయనకు అప్పగించుకోవాలి. ఇది మీకు జరగాలి. ఆయన ప్రశస్త రక్తము మీ పాపాన్ని తొలగించిందా? ఆయన రక్తాన్ని మీరు నమ్మరా? మీ పాపము నుండి అది మిమ్మును కడిగిందా? మీ రాజుగా ఆయనకు మీరు అర్పించు కున్నారా? మీ స్వంత వానిగా ఆయన కోరికపోతే మీరు క్రీస్తును అంగీకరించనట్టే. "అంగీకరించడం" అంటే ఆయనను "విశ్వసించడం" – అంటే ఆయనను మీ రక్షకునిగా, రాజుగా విశ్వసించడం. కీర్తనకారుడు చెప్పినట్టు, "కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు... ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు" (కీర్తనలు 2:12). దైవ కుమారుని ముద్దు పెట్టుకోండి! దైవ కుమారునికి సమర్పించుకోండి! దైవ కుమారుని నమ్మండి! దైవ కుమారుని "అంగీకరించడం" అంటే అది దాని అర్ధం!

II. రెండవది, ఆయన కుమారుని అంగీకరించడానికి దేవుడిచ్చు శక్తిని గూర్చి మనము నేర్చుకుంటాము.

"ఆయనను ఎందరంగీకరించిరో, వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను..."

"శక్తి" అంటే అర్ధం "ఎక్సాసియా." జమీసన్, పౌసేట్ మరియు బ్రౌన్ అన్నారు, "పదము తెలియచేస్తుంది...అదికారము మరియు సమర్ధత. ఇక్కడ రెండు కలపబడ్డాయి" (పేజీ 348). "దేవుని కుమారులు" "దేవుని పిల్లలుగా" అనువదింపబడింది (యన్ కెజేవి) (NKJV). క్రీస్తును అంగీకరించడం అంటే ఆయన యందు నమ్మిక ఉంచడం ఆయనకు సమర్పించుకోవడం. మీరు దేవుని బిడ్డగా ఎలా అవుతారు? యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా.

రెండేళ్లప్పుడు నా తండ్రి నన్ను విడిచి పెట్టారు, నేను తిరిగి అతనితో జీవించలేదు. నేను పెద్దవాడనవుతున్నప్పుడు వేరే అబ్బాయిలు నన్ను ఏడిపించేవారు. నన్ను అపహాస్యము చేసి నాతో ఇలా అన్నారు, "రోబర్ట్ కు తండ్రి లేడు." అప్పటి నుండి నేను, "రోబర్ట్ ఎల్. హైమర్స్, జూనియర్" అని సంతకము చేయడం ప్రారంభించాను. నా తండ్రి పేరుతో పేరు పెట్టబడింది. నేను "జూనియర్" అని నా పేరు తరువాత పెట్టుకున్నాను నాకు నిజంగా తండ్రి ఉన్నాడు అని చెప్పడానికి. ఈరోజు వరకు అలానే చేస్తున్నాను. నాకు తండ్రి ఉన్నాడని అందరికి తెలియాలి అని నా కోరిక! కాని దీనికంటే దేవుని తండ్రిగా కలిగియుండడం చాలా ప్రాముఖ్యము! ప్రతి పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ యేసును అంగీకరిస్తే దేవుడు వారికి తండ్రిగా ఉంటాడు! ఈ రాత్రి ఇక్కడ నిలబడి అమెరికా అధ్యక్షుని కుమారుడని చెప్పుకుంటే, మీరు నా మీద అసూయపడతారు. కాని నేను ఇంకా గర్వముగా నేను దేవుని కుమారుడని చెప్తున్నాను. యేసును నేను చేర్చుకున్నాను, యేసు నాకు అధికారము శక్తి ఇచ్చాడు దైవ కుమారుగా ఉండడానికి, ఆయన విశ్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు!

నేను రాజు యొక్క బిడ్డను,
   రాజు యొక్క బిడ్డను:
నా రక్షకుడైన యేసుతో,
   నేను రాజు యొక్క బిడ్డను.
("రాజు యొక్క బిడ్డ" హేరియట్ యి. బ్యుల్, 1834-1910).
(“A Child of the King” by Harriet E. Buell, 1834-1910).

మీరు దేవుని బిడ్డలైతే, మీరు దేవునిచే ప్రాయముగా ప్రేమించబడతారు. మీరు దేవుని బిడ్డలైతే, మీరు ఆయనకు సంబంధించిన వారు, "దైవిక స్వభావములో పాతి భాగస్తులు." మీరు దేవుని బిడ్డలైతే, మీరు ఏరాత్రి అయినా ఆయన దగ్గరకు రావచ్చు, ఆయన మీకు సహాయము చేస్తారు నడిపిస్తాడు. జాన్ కాగన్ కు అద్భుత తండ్రి ఉన్నాడు. అతడు తన తండ్రిని పరిచయం చేసేటప్పుడు, "నా తండ్రికి రెండు పిహెచ్.డి.లు ఉన్నాయి." కాని నేను నా తండ్రిని గూర్చి ఇంకా ఎక్కువగా చెప్పగలను! నా భూలోకపు తండ్రి ఉన్నత పాఠశాల నుండి పట్ట భద్రుడు కాలేదు. కాని నా పరలోకపు తండ్రి విశ్వమంతటికి రాజు!

నా తండ్రి ఇళ్ళలోనూ భూములలోను గొప్పవాడు,
   ఆయన తన చేతులలో ప్రపంచపు ఆస్తిని కలిగియున్నాడు!
వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు,
   ఆయన భూపాణములు నిండుగా ఉన్నాయి, ఆయనకు వివరించలేనంత నిధులు ఉన్నాయి.
నేను రాజు బిడ్డను, రాజు బిడ్డను:
   నా రక్షకుడైన యేసుతో, నేను రాజు బిడ్డను.

నాకు కళాశాల లేక సెమినరీకు డబ్బు చెల్లించడానికి కొత్త కారు కొనడానికి ఇహలోకపు తండ్రిలేదు. కాని నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు "దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో [నా] ప్రతి అవసరము తీర్చును" (ఫిలిప్ఫీయులకు 4:19). నా పరలోకపు తండ్రి ఒక అద్భుత వాగ్ధానము ఇచ్చి ఉన్నాడు, "నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13). నన్ను బలపరచిన, నా జీవితమంతా నా అవసరాలన్నీ తీర్చిన నా తండ్రికి, నా రాజుకు సమస్త మహిమ స్తుతి ఘనత. నా స్వీయ చరిత్రలో, డాక్టర్ కాగన్ ఇలా చెప్పాడు,

     ఇది తొట్రిల్లిన నలుగగొట్టబడిన నలిగిన వ్యక్తి యొక్క కథ, అతడు నిలదొక్కుకొని, భయంకరమైన అడ్డంకులు అధిగమించాడు ప్రజలకు చూపడానికి యేసు క్రీస్తు వారికి కూడ సహాయము చేయగలడని!
     త్రాగుబోతుల నలిగిపోయిన కుటుంబంలో అతడు పెరిగాడు – కాని అతడు ధైర్యపరిచేవాడుగా మారి వేలమంది జీవితాలను మార్చాడు. కళాశాలలో విఫలుడయ్యాడు – కాని మూడు డాక్టర్ పట్టాలు పొందుకొని 17 పుస్తకాలు వ్రాసాడు. ఆయన విదేశీ మిసేనరీ అవాలనుకున్నాడు కాని విఫలుడయ్యాడు – కాని తిరిగివచ్చి ప్రపంచములో అనేక మందికి బలానికి కారకుడయ్యాడు!
     అందరు విడిచి వెళ్ళినా, డాక్టర్ హైమర్స్ అద్భుత గుడిని స్థాపించారు, అందులో ఇరవై వైవిధ్య గుంపులు ఉన్నాయి, డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ నడిబొడ్డున, ఆయన ద్వారా ప్రపంచమంతటా లోక నలుమూలలకు సువార్త ప్రకటింపబడుతుంది...
     ఇది డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ జీవిత కథ, ఆయన అసాధ్యాన్ని సాధించారు – భయాలన్నింటికి వ్యతిరేకంగా. నాకు తెలుసు, ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా పనిచేసాను.
           – డాక్టర్ క్రిష్టాఫర్ ఎల్. కాగన్.

నేను ఒక రాజు బిడ్డను!

యవనస్తులారా, మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని యేసు క్రీస్తు నందు ఉంచండి. క్రీస్తును చేర్చుకోండి ఆయన దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవడానికి మీకు శక్తినిస్తాడు. దేవుడు నన్ను ఒక పెద్ద ఇళ్ళు, అద్భుత సంఘము, అద్భుత భార్య, ఇద్దరు గొప్ప కుమారులు, ఇద్దరు అందమైన మనవరాళ్ళతో, ఆశీర్వాదించాడు. అలానే ఆయన మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు!

మీరు క్రీస్తును స్వీకరించి ఆయన కొరకు జీవిస్తే, ప్రపంచము ఆశ్చర్య పోయే విధంగా మీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తారు – ఎందుకంటే మీరు కూడ రాజు బిడ్డను కాబట్టి. మీరు ఇలా పాడగలరు కూడ,

నేను రాజు బిడ్డను,
   రాజు యొక్క బిడ్డను:
నా రక్షకుడైన యేసుతో,
   నేను రాజు యొక్క బిడ్డను.

"ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తనను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను: వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలననైనను, శరీరేచ్చ వలననైనను, మానేషేచ్చ వలననైనను, పుట్టిన వారు కారు" (యోహాను 1:11-13).

III. మూడవది, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు మనకు ఇచ్చు కొత్త జన్మను గూర్చి నేర్చుకుంటాము.

"వారు దేవుని వలన పుట్టిన వారే కాని, రక్తము వలననైనను, శరీరేచ్చ వలననైనను, మానుషేచ్చవలన నైనను, పుట్టిన వారు కారు" (యోహాను 1:13).

నేను ఇక్కడ తప్పక చెప్పాలి ఈ ప్రసంగము ప్రాధమిక తలంపులు వివరణలు "బోధకులకు చక్రవర్తి," అయిన గొప్ప స్పర్జన్ నుండి తీసుకొనబడ్డాయి.

ప్రభువైన యేసును విశ్వసించిన వాడు తిరిగి జన్మించిన వాడు. కొంతమంది వేదాంత పండితులు – విశ్వాసము ముందా పునర్నిర్మాణము ముందా అనే దానిపై ఆశ్చర్యము కలిగి యున్నారు. నేను స్పర్జన్ తో ఏకీభవిస్తాను. అతనన్నాడు విశ్వాసము పునర్నిర్మాణము "ఒకేసారి సంభవించాలి." పునర్నిర్మాణము కొత్త జన్మకు వేదాంత పదము. స్పర్జన్ అన్నాడు, "నేను యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచితే, నేను పునర్నిమింప బడ్డానా అని అడగనవసరము లేదు, ఎందుకంటే పునర్నిర్మాణము పొందని వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తును నమ్మలేదు; పునర్నిర్మించబడితే నేను యేసును తప్పక నమ్మాలి, ఎందుకంటే అలా చేయకపోతే అతడు పాపములో చచ్చినవాడు...విశ్వాసపు ప్రక్రియ ఒక వ్యక్తి పునర్నిర్మింప బడ్డాడని తెలియచేస్తుంది."

మనం క్రైస్తవులుగా జన్మించలేదు. "మనుషేచ్చవలన" పుట్టలేదు. గొప్ప క్రైస్తవులు ప్రపంచంలో మనలను కొత్తగా సృష్టించలేదు. మనం తిరిగి జన్మించలేదు "శరీరేచ్చల వలన కాదు." మన చిత్తము వలన కాదు. మానవ చిత్తము పునర్నిర్మాణానికి ఉత్పత్తి చేయలేదు. మనం పైనుండి తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రవేశించి మనలను నూతన సృష్టిగా చేస్తుంది.

యేసు నందు విశ్వాసము ఎక్కడ ఉందో అక్కడ నూతన జీవితమూ ఉంది. విశ్వాసము లేకపోతే జీవము లేదు. మీరు యేసు క్రీస్తును విశ్వసిస్తే మీరు తిరిగి జన్మించిన వారు, "మానవ చిత్తము కాదు, దేవుని చిత్తము." నేను మిమ్మును ఈ ప్రశ్న అడగాలి – మీరు క్రీస్తును స్వీకరించారా? అవునా కాదా. యేసు క్రీస్తును అంగీకరించారా? ఆయనను మాత్రమే నమ్ముతున్నారా? మీరు చెప్పగలరా,

క్రీస్తు అనే బండ మీద నేను నిలబడతాను,
మిగిలిన భూమి అంతా మునిగే ఇసుక?

మీరు యేసు క్రీస్తును నమ్ముతారా? మీరు ఆయనను అంగీకరించారా? మీరు అంగీకరించకపొతే, ఎందుకు అంగీకరించకూడదు? ఆయనను అంగీకరించడంలో కష్టం ఏంటి? ఆయన యందు విశ్వాసముంచాలి. యేసు క్రీస్తును నమ్మడం ఇంకొక విషయము. ఆయనను నమ్మడం అంటే విశ్వసించడం. ఆయనను నమ్మడం అంటే ఆయనను స్వీకరించడం.

డాక్టర్ కాగన్ మిమ్ములను, "మీరు క్రీస్తును విశ్వసించారా?" అంటే మీ జవాబు ఏంటి? ఆయనను మీరు చూడనవసరము లేదు. ఆయనను భావించ అక్కరలేదు. మీరు ఆయనను విశ్వసించాలి. డాక్టర్ కాగన్ మిమ్ములను మోసగించడు. ఆయన మిమ్ములను గట్తెక్కిస్తాడు, నేను మీకు బాప్తిస్మము ఇచ్చాను. యేసును విశ్వసించే వారిని చూడడం మాకు ఇష్టము. యేసు మీ పాప ప్రాయశ్చిత్తము సిలువపై మరణించాడు. మీరు ఆయనను నమ్ముతారా? యేసు ఈ రాత్రి మిమ్మును చాలా లోతుగా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనను విశ్వసిస్తారా? ఈ రాత్రి, యేసును, ఎందుకు అంగీకరించకూడదు? మీరంటారు, "నేను ఆయనను విశ్వసించాలనుకుంటున్నాను." అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు చెయ్యకూడదు? అనుభూతి కొరకు చూడకండి. యేసు వైపు చూడండి. గొప్ప అనుభవము కొరకు చూడకండి. యేసు వైపు చూడండి. మిమ్మును మీరు చూసుకోండి. మిమ్ములను రక్షింప గల గేది మీలో ఏమిలేదు. మీ స్వంత తలంపులను నమ్మకండి. యేసునే విశ్వసించండి. యేసును చేర్చుకోండి, ఆయన మిమ్ములను చేర్చుకుంటాడు!

ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   రక్షకుని ఇప్పుడు ఎందుకు విశ్వసించకూడదు?
ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   రక్షకుని ఇప్పుడు ఎందుకు విశ్వసించకూడదు?

ఈ లోకములో కనుగొనడానికి విఫలుడయ్యారు
   కలవర మనసుకు కావలసిన శాంతిని;
క్రీస్తు నొద్దకు రండి, ఆయనను నమ్మండి,
   శాంతి ఆదరణ మీరు పొందుకుంటారు.

ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   రక్షకుని ఇప్పుడు ఎందుకు విశ్వసించకూడదు?
ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు ఇప్పుడు కాదు?
   రక్షకుని ఇప్పుడు ఎందుకు విశ్వసించకూడదు?
("ఎందుకు ఇప్పుడు కాదు?" డానియెల్ డబ్ల్యూ. విటిల్ చే, 1840-1901;
     కాపరిచే మార్చబడినది).
(“Why Not Now?” by Daniel W. Whittle, 1840-1901;
     altered by the Pastor).

యేసును విశ్వసించడం సామాన్యం. ఏమి జబలగ ఏమి చెప్పారో వినండి, "నేను ఒక అనుభూతి కొరకు ఒక అనుభవము కొరకు చూసాను నా విశ్వాసాన్ని పెంచుకోవాలి...యేసును నిరంతము తిరస్కరించడం. నేను వెళ్లి వేచియుండే రక్షకుని దగ్గర సొమ్మసిల్లాను." జాన్ కాగన్ అన్నాడు, "ఒక క్రియ కాని నా స్వచిత్తము కానిలేదు, కాని నా హృదయముతో, క్రీస్తుపై ఆనుకొనుట ద్వారా, ఆయన నన్ను రక్షించాడు." ఎమీ మరియు జాన్ యేసును విశ్వసించారు. వారు ఆయనను అంగీకరించారు. అంతే! ఈ రాత్రి మీరు యేసును విశ్వసించాలని నా ప్రార్ధన. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రాజు యొక్క బిడ్డ" (హేరియట్ ఇ. బ్యూల్ చే, 1834-1910).
“A Child of the King” (by Harriet E. Buell, 1834-1910).



ద అవుట్ లైన్ ఆఫ్

తన్ను ఎందరంగీకరించిరో!

AS MANY AS RECEIVED HIM!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"తనను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12).

(యోహాను 2:24, 25; యిర్మియా 17:9;
యోహాను 3:1, 2; 1:11-13; యెషయా 53:3)

I.   మొదటిది, క్రీస్తును అంగీకరించుట అంటే ఏంటో నేను వివరిస్తాను, కీర్తనలు 2:12.

II.  రెండవది, ఆయన కుమారుని అంగీకరించడానికి దేవుడిచ్చు శక్తిని గూర్చి మనము నేర్చుకుంటాము, ఫిలిప్పీయులకు 4:19, 13; యోహాను 1:11-13.

III. మూడవది, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు మనకు ఇచ్చు కొత్త జన్మను గూర్చి నేర్చుకుంటాము, యోహాను 1:13.