Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




చూచుట లేక నమ్ముటయా?

SEEING OR BELIEVING?
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఫిబ్రవరి 4, 2018
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, February 4, 2018

"మీరాయనను చూడక పోయినను, ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు, ఆయనను కన్నులారా చూడకయే, విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందును: చెప్పన శక్యమును మహిమా యుక్తమైన సంతోషము, గలవారై ఆనందించుచున్నారు" (I పేతురు 1:8, 9).


యేసును ఎన్నడు చూడని ప్రజలతో పేతురు మాట్లాడాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారు ఎన్నడు ఆయనను చూడలేదు. అయినను ఆయనచే వారు రక్షింపబడ్డారు. చాలా మంది ఆయన భూమిపై ఉన్నప్పుడు యేసును చూసారు. అయినను వారు రక్షింపబడలేదు. గొప్ప స్పర్జన్ చెప్పినది మీరు తప్పక చెప్తారు – "చూడడం నమ్మడం కాదు, కాని నమ్మడం చూడడం." స్పర్జన్ ప్రసంగానికి అది శీర్షిక. అది మన పాఠ్యభాగముపై ఆధారపడి ఉంది. నేను స్పర్జన్ ప్రసంగాన్ని విడమర్చి చెప్తాను.

I. మొదటిది, చూడడం నమ్మడం కాదు.

ఇది తెలుసుకోవడానికి మీకు బైబిలు ఎక్కువ తెలియనవసరం లేదు. యేసును చూచిన వారు నాలుగు సువార్తలలో ఉన్నారు. వారు ఆయనను చూసారు, కాని ఆయన యందు నమ్మిక ఉంచలేదు. యూదా ఇస్కరి మోతు యేసు శిష్యులలో ఒకడు. కాని యూదా యేసునందు నమ్మిక ఉంచలేదు. యూదా యేసును మూడు సంవత్సరాలు వెంబడించాడు. ఆయన యేసుతో పాటు నివసించాడు. యేసుతో భోజనము చేసాడు. యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టాడు. యేసును గూర్చి బోధించాడు. ఆయన యేసును సన్నిహితంగా ఎరుగును. యేసు యూదాను తన స్నేహితుడని పిలిచాడు. కాని యూదా యేసు నందు నమ్మిక ఉంచలేదు. అందుకే ముప్ఫై వెండి నాణెములకు యేసును అప్పగించాడు. అందుకే ఉరి వేసుకొని, నరకానికి వెళ్ళిపోయాడు. మిగిలిన శిష్యులు కూడ అంత మంచి వారేమి కాదు. వారు కూడ యేసు నందు నమ్మిక ఉంచలేదు. శ్రమపడుటకు చనిపోవుటకు యోరూషలేము వెళ్తున్నట్టు యేసు వారితో చెప్పాడు. "వారు ఈ మాటలో ఒకటైనను గ్రహింప లేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను... కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడ లేదు" (లూకా 18:34). ఆయన వారి మీద ఊదు వరకు వారు యేసును నమ్మలేదు (యోహాను 20:22). శిష్యుడైన తోమా తరువాత కూడ యేసును నమ్మలేదు! మూడు సంవత్సరాలు వారు యేసుతో నివసించారు. కాని వారు ఆయనను నమ్మలేదు. రాజైన హేరోదు ఆయనను చూసాడు, కాని ఆయన యందు నమ్మిక ఉంచలేదు. పిలాతు ఆయనను చూసాడు కాని ఆయనను నమ్మలేదు. ఆయన అద్భుతాలు చేయడం పరిశయ్యలు చూసారు, కాని ఆయనను నమ్మలేదు. సద్దూకయ్యులు హేరోదీయులు ఆయనతో మాట్లాడారు కాని, ఆయనను నమ్మలేదు. గొప్ప జన సమూహమునకు ఆయన భోజనము పెట్టాడు, వారు ఆయన అద్భుతాలు చేయడం చూసారు. కాని చాలా మంది ఆయన యందు నమ్మిక ఉంచలేదు. ఆయన భూమిమీద ఉన్నప్పుడు ఆయనను చూసిన చాలామంది ఆయనను నమ్మలేదు! ఒక్కరు కూడ! అది ఆశ్చర్య పరిచే సత్యము! చాలా ఆశ్చర్యము అపోస్తలుడైన యోహాను దానిని గూర్చి వ్రాసాడు. యోహాను అన్నాడు, "ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు" (యోహాను 1:11). బహు కొద్దిమంది భూమి మీద యేసు ఉన్నప్పుడు ఆయనను చూసి నమ్మారు.

ఈ సత్యము నుండి మనకు తెలుస్తుంది "చూడడం నమ్మడం కాదు." అయినను ఇక్కడున్న మీలో కొందరు ఈరాత్రి అనుకుంటున్నారు మీరు ఆయనను చూసి ఉంటే నమ్మి ఉండేవారిని. మీరు ఒప్పుకోరు, కానీ అది నిజము. అందుకే యేసు నిజమని నిరూపించడానికి ఒక "అనుభూతి" మీరు కోరుకుంటారు. మీరు ఒక "భావన" కొరకు చూస్తారు లేక వాగ్ధానముతో కూడిన బైబిలు వచనము కొరకు చూస్తారు. ఒక భావనను మీరు అర్ధం చేసుకుంటారు. ఒక బైబిలు వాగ్ధానము మీరు చూడవచ్చు. కాని మీరు యేసును చూడలేరు. మీరు నమ్మకపోవడానికి అది ఒక సాకు. ఆయనను విశ్వసించక పోవడానికి అది ఒక సాకు. మీరు నమ్మిక ఉంచకపోవడానికి అది ఒక సాకు. రక్షింపబడక పోవడానికి అది ఒక సాకు. కాని నేను మీతో చెప్తున్నాను, "చూడడం నమ్మడం కాదు." అనుభూతి పొందడం నమ్మడం కాదు. ఒక బైబిలు వచనాన్ని వల్లించడం నమ్మడం కాదు. ఒక అద్భుతాన్ని చూడడం నమ్మడం కాదు. నేను చెప్పిన అవిశ్వాసులందరికి బైబిలు వచనాలు తెలుసు. వారందరూ ఆయనను చూసారు. ఆయన అద్భుతాలు చేయడం అందరు చూసారు. అయినను వారు ఆయన యందు నమ్మిక ఉంచలేదు. చాలామంది చనిపోయి నరకానికి వెళ్ళారు ఎందుకంటే వారు ఎన్నడు ఆయనను నమ్మలేదు, వారు ఆయనను చాలా సార్లు చూసినప్పటికీ!

ప్రవక్తయైన యేసును గూర్చి మాట్లాడాడు. యెషయా అన్నాడు, "ఆయన మనష్యులచే తృణీకరింపబడెను" (యెషయా 53:3). బార్నేస్ నోట్స్ అన్నాడు,

ఆయన తృణీకరింప బడ్డాడు...పరిశయ్యలు, సద్దుకయ్యాలు, రోమీయులచే విమోచకుడు తృణీకరింపబడ్డాడు. భూమిపై ఆయన జీవితంలో అలా జరిగింది, ఆయన మరణములో కూడ; అప్పటి నుండి, ఆయన దాడికి లోనయ్యాడు.

మనష్యులచే తిరస్కరింప బడ్డాడు...ఈ పదములో గొప్ప అర్ధము ఉంది, ఈ మూడు మాటలలో విమోచాకుని పట్ల మానవుడు చూపించిన తీరు యొక్క చరిత్ర కనిపిస్తుంది. పదము "మనష్యుల[చే]తిరస్కరించబడుట" చరిత్రలోని విషాదాన్ని వ్యక్త పరుస్తుంది; ఆయన యూదులచే తిరస్కరించ బడ్డాడు; ధనవంతులచే, గొప్పవారు జ్ఞానులచే; అన్ని రకాల వయస్సుల వారిచే, ప్రజలచే, తిరస్కరించ బడ్డాడు.

ప్రసంగ వేదిక వ్యాఖ్యానము ఇలా చెప్తుంది,

ఆయన తృణీకరింపబడ్డాడు. ఆయన సిలువ వేయబడక మునుపు ఆయన బోధపట్ల రాత్రింబవళ్ళు, ఆయనపై వారికున్న తిరస్కార భావము చూపించబడింది. ఆయన మనష్యులచే తిరస్కరింపబడ్డాడు, విడిచి పెట్టబడ్డాడు… ప్రభువు "చిన్న మంద" కూడ కలిగియుండలేదు. వారిలో కూడ, "చాలా మంది వెనుదిరిగి ఆయనతో నడువలేదు." కొంతమంది ఆయన దగ్గరకు రాత్రి మాత్రమే వచ్చేవారు. "పరిపాలకులు" గొప్పవారు ఆయన ఒంటరి వాని చేసారు. చివరకు ఆయన అపోస్తలులు కూడ "విడిచి పెట్టి పారిపోయారు."

ఆయన భూమిపై ఉన్నప్పుడు యేసును చూచినా వారిలో చాలామంది ఆయనను తృణీకరించి తిరస్కరించారు. మీరు వారికి వేరుగా ఉన్నారా? మీరు మార్పు చెందకపోతే, మీరు కూడ సరిగ్గా వారిలానే ఉన్నారు! మీరు ఆయనను తిరస్కరించి తృణీకరించినట్లే. ఆయన నుండి మీ ముఖము చాటేసుకున్న వారే. భూమిపై యేసును చూసినవారు యేసును తిరస్కరించిన వారులానే మీరు ఉన్నారు! వారు ఆయనను చూసారు. ఆయన స్వరము విన్నారు. అయినను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. చూడడం నమ్మడం కాదు!

II. రెండవది, నమ్మడం చూడడం!

"మీరాయనను చూడక పోయినను, ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు, ఆయనను కన్నులారా చూడకయే, విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందును: చెప్పన శక్యమును మహిమా యుక్తమైన సంతోషము, గలవారై ఆనందించుచున్నారు" (I పేతురు 1:8, 9).

ఈ పాఠ్యభాగము పేతురు చెప్తున్నా వీరు భూమిపై యేసును చూడలేదు. అయినను వారు ఆయనను విశ్వసించి ఆయనచే రక్షింప బడ్డారు! ఆయనను చూడనప్పటికినీ, ఆయన స్వరము విననప్పటికిని, ఆయన తాకనప్పటికినీ? గొప్ప సంస్కర్త కాల్విన్ జవాబు ఇచ్చాడు. కాల్విన్ అన్నాడు, "ఏ వ్యక్తి కూడ తన అవగాహనతో ఏమి చెయ్యలేడు...ప్రభువు [అతనిని] సరిదిద్ది తన ఆత్మతో తీర్చి దిద్దితే తప్ప."

అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు యేసు నందు మీకు విశ్వాసము ఇవ్వగలదు. ఇప్పుడు – మీ కళ్ళతో యేసును చూడనప్పటికిని. అదే పరిశుద్ధాత్మ యేసుతో మీకు సంబంధము కలిగించగలదు – మీరు ఆయన శరీరమును తాకలేనప్పటికి.

యేసును కలవడానికి మొదటి విషయము ప్రేమ. మన పాఠ్యభాగము చెప్తుంది, "మీరు చూడనప్పటికినీ, ప్రేమిస్తున్నారు." "మీరు ఆయనను చూడనప్పటికి, మీరు ఆయనను ప్రేమిస్తున్నారు." చాలా విధాలుగా యేసు ప్రేమ మనకు వస్తుంది. నేను గుడికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు నా బంధువులు అపహాస్యము చేసారు. వారు యేసును కూడ హేళన చేసారు. వారన్నారు, "ఆయనను నీవు ఎలా నమ్మగలవు? ఆయన నీకు ఏమి చేసాడు?" వారు యేసుపై ఎంత ఎక్కువగా నవ్వితే, నేను ఆయనను అంత ఎక్కువగా ప్రేమించాను. నా సంఘములో చెడు పిల్లలు కూడ ఉన్నారు. వారు ఆయన తల్లి శీలముపై పరిహాసము చేసారు. ఆయన వ్యభిచారి కుమారుడన్నారు. ఆయనపై నవ్వారు. వారు ఆయనపై ఎంత ఎక్కువగా నవ్వారో, నేను అంత ఎక్కువగా ఆయనను ప్రేమించాను.

ఈస్టరు సమయంలో నేను ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమించాను. సిలువపై శ్రమపడి నందుకు ప్రేమించాను. ఆయన కళ్ళకు చేతులకు మేకులు కొట్టబడడం అనే తలంపు నాకు అసహ్యము. వారు ఆయనకు ఎందుకు ఎలా చేసారో నాకు తెలియదు. కాని ఆయనపై నాకు సానుభూతి విచారము కలిగింది.

నేను ఒంటరి అబ్బాయిని. నన్ను క్షేమంగా సంతోషముగా ఉంచడానికి నాకు తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా ఉన్న యేసును గూర్చి ఆలోచించాను – ఆయనకు ఆదరణ ఇవ్వడానికి స్నేహితుడు లేడు – నేను ఆయనను ప్రేమించాను. నేననుకున్నాను, "ఎవరు నిన్ను ప్రేమించక పోయినను, యేసు, నేను నిన్ను ప్రేమిస్తాను!" నా పట్ల ఆయన ప్రేమ నా ఆత్మను సంపాదించుకుంది. నేను రక్షింపబడిన రోజు చార్లెస్ వెస్లీ పాట పాడారు. ప్రతి చరణములోని ఆఖరి మాటలు నా హృదయాన్ని పగలగొట్టారు. "అద్భుత ప్రేమ, ఎలా సాధ్యము, నీవు, నా దేవుడవు, నా కొరకు మరణించడం." "అద్భుత ప్రేమ, ఎలా సాధ్యము, నీవు, నా దేవుడవు, నా కొరకు మరణించడం."

యేసు మనవ శరీరంలో ఉన్న దేవుడు. వారు నా దేవుని చెక్క సిలువకు మేకులతో కొట్టారు. "అద్భుత ప్రేమ." అది నా హృదయాన్ని పగులగొట్టింది. నేను ఆయనను విశ్వసించాను. నా పట్ల ఆయనకున్న ప్రేమ నన్ను ఆయన పట్ల నడిపించింది – ఆయనపై నాకున్న ప్రేమ.

జాన్ కాగన్ కి ఆడ లక్షణాలు ఉన్నాయని ఎవ్వరు చెప్పలేదు. తన గుణశీలత శక్తిని బట్టి జాన్ ను మీరు మెచ్చుకుంటారు. జాన్ పూర్తిగా క్రీస్తును కాదన్నాడు. నేను చెప్పినది ఏది అతనిని కదిలించలేదు. అతనన్నాడు, "యేసును విడిచిపెట్టుట అనే తలంపు నన్ను బాదించింది నేను ఎన్నటికి అది చేయలేను. యేసు తన జీవితాన్ని నాకిచ్చాడు. నేను ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడు యేసు సిలువ వేయబడ్డాడు, నేను ఆయనకు సమర్పించుకోలేదు. ఆ తలంపు పగులగొట్టింది. నేను అలా ఉండలేకపోయాను. నేను యేసును కలిగి ఉండాలి. ఆ క్షణంలో నేను ఆయనకు అర్పించుకొని విశ్వాసము ద్వారా యేసు నొద్దకు వచ్చాను...నాకు ఎలాంటి భావన లేదు. నాకు క్రీస్తు ఉన్నాడు!...పాపినైన ఎన్నికలేని నన్ను క్షమించడానికి యేసు నన్ను ఎంతగా ప్రేమించాడో. క్రీస్తు తన జీవితాన్ని నాకిచ్చాడు అందుకు నా సమస్తము ఆయనకు ఇస్తాను...యేసు నా అసహ్యత కోపము తీసివేసి బదులుగా ప్రేమ ఇచ్చాడు."

గొప్ప స్పర్జన్ జాన్ కాగన్ ఎప్పుడు కలుసుకోలేదు. జాన్ తెలుసు అన్నట్టుగా అతడు వ్రాసాడు. స్పర్జన్ అన్నాడు, "చూడడం కాదు – అది బాహ్యము – అది యేసును గూర్చి ఆలోచించడం, అర్ధం చేసుకోవడం, దాని ద్వారా ప్రభావితులవడం, తద్వారా పరిచయము. కనుక, క్రీస్తు పట్ల ప్రేమ నిజ కలయికకు నడిపిస్తుంది, తాకిడి కంటే...ప్రేమ రక్షకుని హృదయానికి నిజము చేస్తుంది...అలా ఏర్పడిన పరిచయము క్రీస్తును మీ ఆత్మను కలుపుతుంది ముట్టుట అనుభూతిని మించి." "మీరు ఆయనను చూడనప్పటికి, మీరు ఆయనను ప్రేమించారు."

కాని వాక్య భాగము యేసుతో పరిచయానికి ఇంకొక విషయము చెప్తుంది – "మీలో, మీరు చూడనప్పటికి, నమ్ముచున్నారు." "అయినను మీరు ఆయనను నమ్ముచున్నారు." ఇక్కడ మళ్ళీ ఒక సత్యము గుర్తు చేయబడుతుంది మీరు చూడకుండా యేసును నమ్మవచ్చు. "మీరు ఆయనను చూడనప్పటికి, అయినను నమ్ముచున్నారు, మీరు సంతోషించండి..." అయినను నమ్ముచున్నారు! అయినను నమ్ముచున్నారు! పేతురు ఎవరికైతే వ్రాస్తున్నాడో వారు యేసును ఎరుగరు. వారు ఎన్నడు యేసును అనుభవించలేదు. ఆయన స్వరమును ఎప్పుడు వినలేదు. కాని వారు ఆయనను ఎరుగుదురు! "మీరు ఆయనను చూడనప్పటికి, నమ్ముచున్నారు, మీరు సంతోషించుడి." "మీరు ఆయనను చూడనప్పటికి, మీరు ఆయనను నమ్ముచున్నారు."

హెలెన్ కెల్లెర్ గుడ్డిగా చెవిటిగా పుట్టింది. ఎన్నే సుల్లివాన్ హెలెన్ కెల్లర్ కు ఎలా మాట్లాడాలో నేర్పింది. అది అద్భుతమైన కథ. నేను చిన్న వానిగా ఉన్నప్పుడు హెలెన్ కెల్లెర్ రేడియోలో మాట్లాడడం విన్నాను. ఆమె పుట్టుక నుండి గుడ్డిదైనా చెవిటిదైన, హెలెన్ కెల్లెర్ యేసును నమ్మింది! మీరు కూడ యేసును నమ్మవచ్చు – మీరు ఆయనను చూడలేనప్పటికి ఆయన మాటలు వినలేనప్పటికి!

యేసును నమ్మడం ఆయనతో మీకు సంబంధము కలిగిస్తుంది. యేసు పరిచయములో ప్రేమ విశ్వాసము రెండు ఉంటాయి. ప్రేమ విశ్వాసము రక్షకునితో మనలను ఐక్య పరుస్తాయి. "మీరు చూడనప్పటికి, ప్రేమిస్తున్నారు; మీరు, ఆయనను చూడనప్పటికి, నమ్ముచున్నారు, మీరు సంతోశించుడి." "మీరు ఆయనను చూడనప్పటికి, ఆయనను నమ్ముచున్నారు సంతోషించుడి!"

ఏమి జబలగ, మన సంఘ పియానో వాయించే వారు ఏమి చెప్పారో వినండి. ఆమె చెప్పింది నమ్మవచ్చు. నేను క్రీస్తును నమ్మలేదు.

     నేను క్రీస్తును నమ్మలేను. "యేసు" ఒక పదము, ఒక సిద్ధాంతము, లేక నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు కాని చాలా దూరంగా. క్రీస్తు కొరకు ప్రయత్నించే బదులు, ఒక భావన కొరకు ఒక అనుభవము కొరకు చూసాను.
     ఒక రాత్రి యేసు నా కొరకు మరణించాడని నేను అకస్మాత్తుగా గ్రహించాను. ఆ రాత్రి ఆయనను గూర్చి [ఆలోచించాను] గెత్సమనేలో, మూలుగుచు నా పాప భారముతో చెమటోడ్చడం. నా [మనసులో] చూసాను సిలువ వేయబడిన క్రీస్తును. ఆయన కార్చే త్యాగాన్ని నా తిరస్కారాన్ని బట్టి ఆయన పొడవబడడం నేను [ఆలోచించాను]. అయినను నేను ఇంకా ఆయనను నమ్మలేదు. నేను ఇంకా ఒక అనుభూతి నిశ్చయత కొరకు ప్రాకులాడుతున్నాను.
     డాక్టర్ హైమర్స్ పరమ గీతము నుండి క్రీస్తు ప్రేమ మత్వమును గూర్చి బోధింపఆరంభించారు. నేను వినుచుండగా, క్రీస్తు నాకు చాల ప్రియమైన వాడయ్యాడు. ఆయన కొరకు బాధపడడం ప్రారంభించాను. వచనము విన్నాను, "నా ప్రియురాలా, నా ప్రేమ, సుందరవతీ, లేమ్మురమ్ము" (పరమగీతము 2:10). క్రీస్తు నన్ను పిలుచున్నట్టు, ఆయన దగ్గరకు రమ్మన్నట్టు నాకు అనిపించింది.
     అనుభవాల ద్వారా నేను వెళ్లాను, భయంకరత్వము, జీవితంలోని నిరీక్షణ లేని స్థితి, లోకపు చల్లారిన వెలితి, పాప భారము, ఇదంతా ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు యేసు అవసరత చూసేటట్టు చేసాడు.
      [ప్రసంగము తరువాత డాక్టర్ హైమర్స్ ను చూడడానికి] నేను వెళ్లాను. పాపపు గోడ నా ముందు ఉంది – నా హృదయ దుష్టత్వము, నా మనసులోని చెడు తలంపులు, యేసును తిరస్కరించడం. నేను భరించలేకపోయాను. క్రీస్తును కలిగి ఉండాలి అంతే. ఆయన రక్తము పొందుకోవాలి. మోకాళ్ళు నాను...యేసు నుండి దూరంగా వెళ్ళే బదులు, అబద్ధపు మార్పు భయము లేదా ఇంకొక పొరపాటు చేస్తానేమోనని, లేదా నాలో చూసుకోకుండా, అనుభూతికి తావివ్వకుండా అంధకారంలో ఉండకుండా, నేను విశ్వాసముతో యేసు వైపు చూసాను...ఆయన ప్రశస్త రక్తములో నా పాపాలు కడిగివేస్తాడు; ఆయన నా పాప భారాన్ని తీసివేసాడు! ఆయన నా పాపాన్ని అంతటిని క్షమించి వేసాడు.
     ఆయన ఇప్పుడు నా నాయకుడు, నా రక్షకుడు నా ప్రభువు! అప్పటి నుండి చాలాసార్లు సహాయము కొరకు యేసు నొద్దకు వెళ్లాను, శక్తి కొరకు సంరక్షణ కొరకు. పాట ఇలా చెప్తుంది, "కృప నా జీవితాన్ని తిరగ వ్రాసింది./కృప నా జీవితాన్ని తిరగ వ్రాసింది./ నేను పాపములో నశించి పోయాను/ కాని యేసు నా జీవితాన్ని తిరిగి రాసాడు." ఇంకొకరు యేసుచే రక్షింపబడితే నాకు ఎంతో సంతోషము. పాప క్షమాపణ నుండి నాకు కలిగిన సమాధానమును నేను వర్ణించలేను...నాలా కష్టపడిన వారంతా యేసు నుండి క్షమాపణ పొందాలని నా ఆశ! సువార్త, మునుపు నిర్జీవంగా నిస్సత్తువగా ఉండేది, ఇప్పుడు ఉత్సాహ భరితంగా ఉంది, మరియు యేసును గూర్చిన ప్రసంగాలు వినేటప్పుడు నా హృదయము ఆనందముతో కృతజ్ఞతతో ఉప్పొంగుతూ ఉంటుంది. తన కుమారుడైన యేసు, వైపు తిప్పిన దేవునికి వందనాలు. నేను అపోస్తలుడైన పౌలుతో పాటు చెప్పగలను, "చెప్పన శక్యము కాని ఆయన బహుమానము కొరకు దేవునికి వందనములు" (II కొరింధీయులకు 9:15)!

ప్రియ స్నేహితులారా, క్రీస్తును ఎరిగే వరకు "ఆనందము" అనే మాటకు అర్ధము నాకు కూడ నిజంగా తెలియదు. చాలా పరీక్షలు కష్టాలు ఎదుర్కొన్నాను. నేను నమ్మిన వారితో నిరుత్సాహ పడ్డాను. నేను ఒంటరిగా ఉండి గొప్ప విచారాన్ని అనుభవించాను. ప్రతి రాత్రి గంటల తరబడి, నడిచేవాడిని. స్నేహితుడు లేకుండా ఒంటరిగా ఉండడంలో ఉన్న "భయంకర విచారాన్ని" నేను పొందాను. రాత్రి అనుభవముతో పెనవేసుకుపోయాను. కాని చాలాసార్లు విచార సమయాల్లో యేసు నన్ను లేవనెత్తాడు. నన్ను ఎవ్వరు అంగీకరించనప్పటికి, యేసు ఎప్పుడు నన్ను అంగీకరించాడు. "అప్పటి నుండి విశాసము ద్వారా నేను ప్రవాహము చూసాను/ గాయము నుండి ప్రవాహము,/ విమోచించే ప్రేమ నా గీతము/ చనిపోయే వరకు అదే./ చనిపోయే వరకు అదే,/ నేను చనిపోయే వరకు అదే,/ విమోచించే ప్రేమ నా గీతము,/ నేను చనిపోయే వరకు అదే." మీరింకా నశించి ఉంటే ఈ అందమైన పాట జాగ్రత్తగా వినండి.

నేను వెయ్యి మార్గాలు ప్రయత్నించి విఫలుడనయ్యాను
నా భయాలు పోవడానికి, నా నిరీక్షణలు లేపబడడానికి;
నాకు కావలసినది, బైబిలు చెప్తుంది,
ఎప్పటికిని, కేవలము యేసు.

నా ఆత్మ రాత్రి, నా హృదయము ఇనుము –
నేను చూడలేను, నేను అనుభూతి పొందలేను;
వెలుగు కొరకు, జీవితమూ కొరకు, నేను ప్రయత్నించాలి
సామాన్య విశ్వాసముతో యేసు కొరకు.

ఆయన చనిపోయాడు, జీవిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, మోర పెడుతున్నాడు;
ప్రేమ ఉంది ఆయన మాటలలో క్రియల్లో;
నేరారోపణ ఉన్న పాపికి కావలసినది
ఎన్నటికి యేసు నందు ఉంది.
("యేసు నందు" జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
(“In Jesus” by James Procter, 1913).

మీరనవచ్చు, "నేను ఒప్పింపబడలేదు. మీరు ప్రేమ మరియు నమ్మకమును గూర్చి మాట్లాడవచ్చు." మీరనవచ్చు, "క్రీస్తు కొరకు నాకు ప్రేమ లేదు." "నేను ఆయనను నమ్మను. మీ వాదనలు నన్ను ఒప్పించడం లేదు."

అప్పుడు నేను మిమ్మును గడ్డించాలి. ఒకరోజు వస్తుంది అప్పుడు మీరు మధుర మాటలు ప్రేమ మరియు నమ్మకము అనేవి వినరు. మీ చెవులు చల్లగా మృతముగా ఉంటాయి. సమాధానము క్షమాపణ పదాలు ఇక ఉండవు. అవన్నీ నిత్య నరకపు చీకటిలో మింగి వేయబడతాయి.

నేను చెప్పేది ఇప్పుడు వినండి! దేవుడు మీతో ఉగ్రత తీర్పుతో మాట్లాడక మునుపు. దేవుడు మీతో అంటాడు, "నేను నిన్ను పిలిచాను నీవు తిరస్కరించావు."

నేను మీకు చెప్పేదంతా, నీవు క్రీస్తును నమ్ముతావా? ఇప్పుడు అది చేస్తావా? ఈరాత్రి? నేనింకా ఏమి చెయ్యలేను. నేను మీరు యేసును నమ్మేటట్టు చెయ్యలేను. నేను అది దేవునికే విడిచి పెట్టాలి. ఆయన శక్తితో, దేవుడు యేసును నమ్మునట్లు చాల హృదయాలు తెరిచాడు. యేసు నొద్దకు దేవుడు రప్పించిన అనేక మంది మధ్య మీరు కూర్చున్నారు. దేవుడు వారిని యేసు నొద్దకు రప్పించుటకు ఎన్నిక చేసుకున్నాడు. ఆయన నిన్ను చేర్చకపోతే, నేను చేయగలిగినది ఏమిలేదు. నీవు రక్షింపబడాలని దేవుడు ఎన్నుకోకపోతే, నేను అంతకుమించి ఏమి చెయ్యలేను. నీవు ఎన్నిక చేయబడిన వారిలో లేకపోతే నేనేమి చెయ్యలేను.

కాని దేవుడు ఈ రాత్రి నీ హృదయముతో మాట్లాడినట్లయితే, క్రీస్తును స్వీకరించు. ఇప్పుడే ఆయనను చేర్చుకో. మీలో చాలామందికి యేసు కావాలి, వచ్చి ఇప్పుడు ఆయనను విశ్వసించండి. నేను చెప్పినదంతా మీకు మంచి చేయదు దేవుని ఆత్మ దానిని మీ హృదయానికి అన్వయింపకపొతే. మా ప్రార్ధన మీకు ఇప్పుడు యేసును నమ్ముతారని పేతురు మన పాఠ్యభాగములో చెప్పిన ఇతరుల వలే. మేము దేవునికి ప్రార్ధించాం దేవుడు జాన్ కాగన్, ఏమి జబలగ ఇంకా ఇతరుల జీవితాలలో చేసింది మీ జీవితాలలో కూడ చెయ్యాలని. దేవుడు ఈ రాత్రి మనలో నుండి ఎన్నుకొనును గాక. మీరు యేసు నొద్దకు రావాలి, యేసును నమ్మాలి, ఆయన నెరవేర్పు రక్తము ద్వారా రక్షింప బడాలి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"యేసు నందు" (జేమ్స్ ప్రోక్టర్ చే, 1913).
“In Jesus” (by James Procter, 1913).



ద అవుట్ లైన్ ఆఫ్

చూచుట లేక నమ్ముటయా?

SEEING OR BELIEVING?

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"మీరాయనను చూడక పోయినను, ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు, ఆయనను కన్నులారా చూడకయే, విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందును: చెప్పన శక్యమును మహిమా యుక్తమైన సంతోషము, గలవారై ఆనందించుచున్నారు" (I పేతురు 1:8, 9).

I. మొదటిది, చూడడం నమ్మడం కాదు, లూకా 18:34; యోహాను 20:22; 1:11;
యెషయా 53:3.

II. రెండవది, నమ్మడం చూడడం! పరమగీతము 2:10; II కొరింధీయులకు 9:15.