ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
రక్తముతో లేక రక్తము లేకుండా!WITH OR WITHOUT BLOOD డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జనవరి 21, 2018 "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). |
స్పర్జన్ ద్వారా మారిన వారిలో ఎక్కువ మంది అమాంతముగా మారలేదు, కాని కొన్ని వారాల నెలల బాధతో విచారముతో కూడిన ఒప్పుకోలు పొంది అప్పుడు క్రీస్తు నందు విశ్వాసముంచి ఆనందాన్ని నిశ్చయతను పొందుకున్నారు. స్పర్జన్ బోధ ద్వారా మారిన ఇద్దరు యవ్వన స్త్రీల సాక్ష్యములు దిగువ ఇవ్వబడ్డాయి. మేరీ ఎడ్వర్డ్స్, స్పర్జన్ బోధ వినేవరకు ఆమె హృదయము కఠినముగా ఉంది. తన పాపపు తీర్పును బట్టి బహుగా భయపడింది. గుడికి వస్తున్నప్పటికినీ చాలా నెలలు నిరాశతో ఉంది. అప్పుడు యేసు ప్రేమను గూర్చిన స్పర్జన్ బోధ వినింది. ఆమె యేసును నమ్మి ఆయన రక్త ప్రోక్షణను విశ్వసించి, సంతోషించింది. ఆమె యేసునే నమ్మి, రక్షింపబడింది, ఆమె ఇంకా యేసు వైపే చూస్తుంది. మేరీ జోన్స్, ఆతృతతో ఆమె స్పర్జన్ బోధ వినడానికి వచ్చింది. భయముతో గుడిని విడిచి వెళ్లి పోయింది. ఆమె చెప్పింది, "ఆయన బోధ వినడానికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ వెళ్లకూడదని నిర్ణయించుకుంది. నేను దూరంగా ఉండిపోతే అది భయంకరమనిపించింది. నేను ప్రసంగం వినడానికి వచ్చి భాదపడ్డాను, మరియు నేను దూరంగా ఉంటే దుఃఖించాను. చివరకి నేను క్రీస్తును నమ్మి ఆయనలో శాంతిని ఆదరణను కనుగొన్నాను. నేను శాంతి కొరకు వెతికినంత కాలము నాకు దొరకలేదు క్రీస్తులో తప్ప. ముందు అన్ని ప్రయత్నించాను. కాని నాకు ఏదీ శాంతిని ఇవ్వలేదు చివరకు నేను క్రీస్తును రక్షించే ఆయన రక్తమును కనుగొన్నాను." నేను బోధించే ముందు గ్రిఫిత్ గారు వచ్చి పాట పాడతారు ఈపాట స్పర్జన్ సంఘములో పాడ బడినప్పుడు చాలామంది యవనస్తులు యేసును విశ్వసించారు. "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). గొప్ప స్పర్జన్ తరుచు "బోధకులకు రాజు" అని పిలువబడ్డాడు. నిజంగా, అతని మించిన గొప్ప సువార్త బోధకుడు ఇంకొకడు లేడు. ఆయన పరిచర్య అంతటిలో తన ప్రధానాంశము సిలువపై యేసు త్యాగము ద్వారా పాపులకు రక్షణ. ఆ అంశములోని అర్ధము సిలువపై పాప విమోచనము నిమిత్తము, రక్షకుడు రక్తము కార్చాడు. అలా స్పర్జన్ తరుచు బోధించి మన పాఠ్య భాగము ప్రస్తావించాడు. "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). కాని పదము "విమోచనము" చాలామంది ఆధునిక ప్రజలకు తెలియదు. "విమోచనము" నకు గ్రీకు పదము మనము చూడాలి దాని అర్ధము బాగా గ్రహించడానికి. స్ట్రాంగ్స్ నిఘంటువు చెప్తుంది గ్రీకు పదము "అఫేసిస్" అని. దాని అర్ధము "స్వతంత్రము," "క్షమాపణ," "విడుదల," "స్వేచ్చ," మరియు "క్షమాపణ." ఆ పదాలు కలపడం ద్వారా మన పాఠ్య భాగమును తేటగా చూడవచ్చు, "రక్తము చిందింపకుండా స్వతంత్రము లేదు, క్షమాపణ లేదు, విడుదల లేదు, స్వేచ్చ లేదు, క్షమాపణ లేదు." స్పర్జన్ చాలా తరుచుగా రక్తమును గూర్చిన వచనాలు వాడాడు. ఒక ప్రసిద్ధి గాంచిన ప్రసంగములో స్పర్జన్ ఇలా అన్నాడు, "కొంతమంది బోధకులు యేసు క్రీస్తు రక్తమును గూర్చి బోధించరు, వారిని గూర్చి మీతో ఒక విషయము చెప్తాను: వారి బోధ వినడానికి వెళ్ళవద్దు! వారు చెప్పేది వినవద్దు! రక్తము లేని పరిచర్య నిర్జీవము, మృత పరిచర్య ఎవరికీ మంచిది కాదు." రక్తము యొక్క ప్రాముఖ్యత మన పాఠ్య భాగము తేట పరుస్తుంది, "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). I. మొదటిది, క్రీస్తు రక్తము చిందింపకపోతే మీకు ఏమి సంభవిస్తుందో ఆలోచించండి. క్రీస్తు రక్తము చిందింపకపోతే పాపము నుండి మీకు స్వాతంత్ర్యము లేదు. క్రీస్తు రక్తము చిందింపబడకపోతే మీకు పాప క్షమాపణ లేదు. క్రీస్తు రక్తము చిందింపకుండా మీకు పాపము నుండి విడుదల లేదు. క్రీస్తు రక్తము చిందింప కుండా మీకు పాప క్షమాపణ లేదు. క్రీస్తు రక్తము చిందింప కుండా మీకు నిరీక్షణ లేదు. మరణము తరువాత నరకాన్ని మీ కొరకు వేచి ఉంటుంది. స్కాట్లాండ్ లో గొప్ప కాంబాస్ లాంగ్ ఉజ్జీవములో నరకమును గూర్చి బోధింపబడింది. "కాంబాస్ లాంగ్ నందలి బోధకులు చిత్ర హింసలతో కూడిన వాస్తవమైన నరకాన్ని, నమ్మారు. వినే వారిని నరకమును గూర్చి హెచ్చరింప దలచలేదు. చాలామంది వారిని అర్ధము చేసుకున్నారు. ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తి ‘తాను దూరము నుండి నరకమును చూచినట్టు, నశించు ఆత్మలు ఒక గోతిలో కాలిపోతున్నట్టు, దయ్యాలు వారి మధ్య సంచరిస్తున్నట్టు.’ పదిహేను సంవత్సరాల అబ్బాయి, సృహ కోల్పోవడానికి ముందు, అన్నాడు, "నరకపు అగ్ని జ్వాలలు నా దగ్గరకు వస్తున్నట్టు చూచాను.’ ఒక యవనస్థుడు గంధకపు వాసన వలన ఊపిరి పీల్చుకోలేక పోయాడు, ‘అగ్ని గంధకములతో కూడిన వాసన పాతాళములో.’" (The Cambuslang Revival, The Banner of Truth, 1971, p. 154). ఈ మానవ అనుభవాలను, ఆధారము చేసుకొని, నేను నరకమును గూర్చి నమ్మను. నేను నరకాన్ని నమ్ముతాను ఎందుకంటే అది బైబిలులో దేవునిచే బోధింప బడింది. లేఖనాలలో అందరి కంటే నరకమును గూర్చి యేసు ఎక్కువగా చెప్పాడు. ఆయన కాలములో అవిశ్వాసులతో ఆయనన్నాడు, "నరక శిక్షను మీరేలాగు తప్పించు కొందురు?" (మత్తయి 23:33). అవిశ్వాసులను క్రీస్తు హెచ్చరించాడు వారు "ఎన్నడు, ఆరని నరకాగ్నిలోనికి వెళ్లిపోతారని" (మార్కు 9:43). నరకములో ఉన్న ధనవంతుని గూర్చి క్రీస్తు అన్నాడు, "నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను" (లూకా 16:24). స్పర్జన్ చెప్పాడు, నరకములో ఒక గంట గడపడం ఎంత భయంకరము! ఓ, రక్షకుని వెదకితే బాగుండేది అనుకుంటావు! కాని, నరకములో ఒక గంట అనేది లేదు. ఒక సారి నశిస్తే, నిత్యత్వములో నశించినట్టే! మళ్ళీ స్పర్జన్ చెప్పాడు, ఒక సన్నని దారముతో నీవు నరకపు నోటి నుండి వేలాడుతున్నావు: ఆ తాడు తెగిపోతుంది. ఒక కోన ఊపిరి, ఒక్క క్షణం నీ గుండె ఆగిపోవడం, నీవు నిత్యలోకములో ఉండిపోతావు, దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా. ఓ, నీవు దానిని ఎదుర్కొనగలవా? నీవు ఒకసారి నరకములో ఉంటే నీవు గ్రహిస్తావు, చాలా ఆలస్యమైందని, అది "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). యేసు కార్చిన రక్తములో నీ పాపము కడగబడకపోతే అదే నీకు సంభవిస్తుంది! అప్పుడు కూడ, మీ పాపములు మిమ్మును ఎదుర్కొంటాయి తీర్పులో మిమ్మును ఖండిస్తాయి. మీది రహస్య పాపమనుకున్నారు. మీరు మర్చిపోయారు "గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు, ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే కాని తీర్పులోనికి తెచ్చును..." (ప్రసంగి 12:14). ఈ రాత్రి ఎవరో ఇక్కడ ఉన్నారు వారి పాపమును దాచి పెట్టవచ్చు అనుకుంటున్నారు, ఎవరికీ తెలియదనుకుంటున్నారు. వారు మర్చిపోయారు "యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచు చుండును..." (సామెతలు 15:3). చాలామంచి పాపముచే విషపూరితులయ్యారు జ్ఞాపక ముంచుకుంటూ ఉంటారు. వారి రహస్య పాపాన్ని బట్టి శారీరక అస్వస్థతకు లోనై యున్నారు. దావీదు వలే వారికి అనిపిస్తుంది "నా పాపము ఎల్లప్పుడూ నా యెదుట నున్నది" (కీర్తనలు 51:3). నేననుకుంటాను గుండె జబ్బులు, ఇతర రోగాలు, ఒప్పుకొనని క్షమించబడని పాపము ద్వారా వస్తాయి. గొప్ప పురిటాను వేత్త జాన్ ఓవెన్ అన్నాడు, "విశ్వాసము ద్వారా మనము క్రీస్తు రక్తము యొక్క పవిత్ర పరచే గుణాన్ని ప్రభావాన్ని పొందుకుంటాము." కాని మీరు నిజ శాంతిని కనుగొనలేదు, ఎందుకంటే "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). మరియు హృదయ సంబందిత పాపాలు ఉన్నాయి. మీ హృదయ పాపములు ఎవరు చూడడం లేదని మీరనుకుంటారు. కాని మీది తప్పు. బైబిలు చెప్తుంది, "హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది... దాని గ్రహింప గలవాడెవడు... ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను" (యిర్మియా 17:9, 10). మీ హృదయ పాపములు ఎవరికీ తెలియక పోవచ్చు, కాని దేవుడు మీ హృదయాన్ని పరిశోదిస్తాడు, దేవుడు అక్కడ దానియున్న పాపములకు తీర్పు తీర్చుతాడు, ఎందుకంటే "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). నీ పాపము నుండి స్వతంత్రత లేదు. నీ పాపము నుండి విడుదల లేదు. నీ పాపము నుండి స్వేచ్చ లేదు. నీ పాపమునకు క్షమాపణ లేదు. దాని నుండి విడిపించబడలేదు. దాని నుండి విడుదల పొందలేదు. దాని నుండి బయట పడలేదు. దానిని బట్టి క్షమించబడలేదు. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నావు! "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). కాని దేవునికి వందనాలు బైబిలులో చాలా ఉంది. II. రెండవది, క్రీస్తు చిందించిన రక్తాన్ని నీవు కలిగియుంటే నీకేమి సంభవిస్తుందో ఆలోచించు. క్రీస్తు రక్తము మన పాఠ్యభాగాన్ని తిరగరాస్తుంది. యేసు రక్తముతో మీ పాపాలు ఎన్నటికి తుడిచి వేయబడతాయి! యేసు రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ ఉంది. యేసు రక్తము ద్వారా మీకు పాపము నుండి విడుదల ఉంది. యేసు రక్తము ద్వారా మీ పాపము నుండి స్వతంత్రత ఉంది. యేసు రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ ఉంది. యేసు రక్తము ద్వారా పరలోక మహిమ మీ కొరకు వేచి ఉంది! ప్రకటన గ్రంథములో పరలోకమును గూర్చి సూచాయిగా చెప్పబడింది అక్కడ క్రైస్తవులు యేసు కొరకు పాటలు పాడతారు, "నీవు, ఆ గ్రంథమును తీసుకొని, దాని ముద్రలను విప్పుటకు, యోగ్యుడవు: నీవు వధింప బడినవాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోనూ, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాని చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాదుడురు" (ప్రకటన 5:9). యేసు రక్తము ద్వారా విమోచింప బడిన మనము ఆయన రక్షించే రక్తమును గూర్చి నిత్యత్వములో పాడుతుంటాం! తన అద్భుత పాటలో ఫేనీ క్రాస్ బీ ఇలా అన్నారు, విమోచింపబడ్డాను, దానిని ప్రకటించడాన్ని ప్రేమిస్తున్నాను! పల్లవి నాతో పాడండి! విమోచింపబడ్డాను, విమోచింపబడ్డాను, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డాను; మనలను విమొచించిన రక్తము సామాన్య రక్తము కాదు. అపోస్తలుల కార్యములు 20:28 లో క్రీస్తు రక్తము ఎంత గొప్పదో మనము నేర్చుకున్నాము. నేను స్పష్టత కొరకు కొత్త అంతర్జాతీయ అనువాదము ఇస్తున్నాను: "దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన, తన సంఘమునకు కాపరులుగా ఉండుడి" (అపోస్తలుల కార్యములు 20:28). చాలా తేటగా ఇక్కడ మనం చూస్తున్నాం మనము "దేవుని రక్తము" ద్వారా కొనబడిన వారము. క్రీస్తు దేవుని సారూప్యము, "దేవుడే దేవుడే" – దేవుడు శరీరధారియై ఉన్నాడు. కనుక రక్తమును, "దేవుని రక్తము" అని పిలుచుట సరియే. అందుకే గొప్ప స్పర్జన్ అన్నాడు, "రక్తము లేని సువార్త... దెయ్యముల సువార్త." "కల్వరి రక్త త్యాగము మాత్రమే పాపులకు నిరీక్షణ ఇస్తుంది." ఆధునిక బోధకులు జాగ్రత్త పడాలి పదము "రక్తము" యేసు మరణమునకు’ ఇంకొక పదము – జాగ్రత్త! రక్తము లేని సువార్త దెయ్యముల సువార్త! మళ్ళీ, గొప్ప స్పర్జన్ ఇలా చెప్పాడు, "కొన్ని పాపాల గురించి మనము మాట్లాడలేము, కాని క్రీస్తు రక్తము కడగలేని పాపాలు లేనేలేవు." చార్లెస్ వెస్లీ బాగా చెప్పాడు, ఆయన పాపపు శక్తిని విరుగగొట్టాడు, పాడండి! ఆయన పాపపు శక్తిని విరుగగొట్టాడు, "విమోచింపబడ్డాను, అది ప్రకటించుట నాకు ప్రీతి పాత్రము!" పాడండి! విమోచింపబడ్డాను, దానిని ప్రకటించడాన్ని ప్రేమిస్తున్నాను! "రక్తములో శక్తి ఉంది"! పాడండి! శక్తి ఉంది, శక్తి, అద్భుతంగా పనిచేసే శక్తి మళ్ళీ పాడండి! శక్తి ఉంది, శక్తి, అద్భుతంగా పనిచేసే శక్తి నేను వేదాంత కళాశాలలో ఉన్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో హిప్పీలతో పాటు చాలా బైబిలు పఠనములు హాజరయ్యాను. అది 1970 లో యేసు ఉద్యమము. వారిలోని చాలా మంది యవనస్తులు ఎల్ఎస్ డి లాంటి మనసును చెరిపే మత్తు పదార్ధాలు తీసుకున్నారు. ఆ పాపము ద్వారా కొంతమంది దెయ్యములతో పట్టబడ్డారు. గెదరేనులో దెయ్యము పట్టిన వారి వలే – వారు ఉగ్రులయ్యారు. నాకు గుర్తింది కొంతమంది సహోదరులు ఒక హిప్పీ అమ్మాయి నుండి దెయ్యాలను వెళ్ళగొట్ట ప్రయత్నించారు. వారు దెయ్యాలు బయటకు రావాలని ఆజ్ఞాపించారు, కాని ఏమి జరగలేదు. అప్పుడు ఒక సహోదరుడు ఇలా పాడాడు, శక్తి ఉంది, శక్తి, అద్భుతంగా పనిచేసే శక్తి ఆ అమ్మాయి చాలా గట్టిగా అరిచింది. అతడు మళ్ళీ పాడాడు, శక్తి ఉంది, శక్తి, అద్భుతంగా పనిచేసే శక్తి ఆ అమ్మాయి మళ్ళీ అరిచింది దెయ్యాలు నోటిలో నుండి బయటకు వచ్చాయి, యేసు భూమి మీద ఉన్నప్పుడు జరిగినట్టే. కొంత సమయము తరువాత ఆ అమ్మాయి విడుదల పొందింది! నేలపై కూర్చొని గ్లాసుడు నీరు తాగింది. ఆమె నాకు చాలాకాలముగా తెలుసు. ఆమె మంచి, పటిష్ట క్రైస్తవురాలయింది. చైనీయ బాప్టిస్టు సంఘములో నా కాపరి డాక్టర్ లిన్ తో ఈ విషయము చెప్పాను. అతనన్నాడు, "అవును, బాబు. చైనాలో బాప్టిస్టు సంఘ కాపరి క్రీస్తు రక్తము శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్ట లేకపోతే ఎవరు ఆయన బోధ వినడానికి రారు!" నాకు తెలుసు క్రీస్తు రక్తపు శక్తి ప్రదర్శనను నేను చూసాను! స్పర్జన్ తప్పక సంతోషించి ఉంటాడు! యేసు రక్తము ఎల్ఎస్ డి, హెరాయిన్, ఇంకా యవనస్తులను పాడు చేయడానికి సాతాను వాడే మత్తు పదార్దాలన్నింటికంటే శక్తివంతమయినది! నీ హృదయపు లేక నీ జీవితపు ఏ పాపాన్నైనా యేసు రక్తము శుద్ధి చేయగలదు! "ఉచిత కృప బ్రాడ్ కేష్టర్" కాపీని నేను చూస్తున్నాను. అది ఒక సంస్కరింపబడిన పత్రిక గతములో బోధకులు బోధించిన గొప్ప ప్రసంగాలు అందులో ఉంటాయి – జాన్ గిల్, జే. సి. రైల్, ఒక్టావియాస్ విన్ స్లో, మరియు స్పర్జన్ లాంటి వారు. ఆ కాపీలో వారు క్రీస్తు రక్తము శక్తి, నెరవేర్పు, ప్రాయశ్చిత్తము విమోచనలపై చేసిన ప్రసంగాలు ఉన్నాయి. ఒక గొప్ప కెల్విన్ సిద్ధాంత బోధకుడు ఇలా చెప్పాడు, క్రీస్తు రక్తములో ప్రశస్తత అనే అంశము దాగి ఉంది. అది తాకిడి లేని ధమనుల నుండి ప్రవహిస్తుంది, పాపపు అంటూ దాని తాకదు...పరిశుద్ధ రక్షకుడు అపరిశుద్ద, పాపియైన మనిషి కొరకు పాపము లేని ప్రాయశ్చిత్తము ఇస్తున్నాడు. అందుకే ఆయన రక్తములో ప్రశస్తత. ఇప్పుడు ఇంకా మార్పు నొందని వారు, పాప క్షమాపణను, విమోచనను అన్వయించుకోవాలి. ముస్లీము పాప క్షమాపణ పొందలేదు. ఎందుకంటే క్షమాపణ ఎలా పొందాలో, ఖురాను అతనికి చెప్పలేదు. మంచివానిగా ఉండి రక్షింపబడాలనుకునే వ్యక్తిని కలవండి. అతనంటాడు, "నా పాపాలు క్షమించ బడతాయని నిరీక్షిస్తున్నాను." నాస్తికుని కలవండి. వారి పాపాలు క్షమింప బడతాయని వారికి తెలియదు. నశించు పురుషుడు, స్త్రీ, లేక యవనస్థుడు ఈ సాయంకాలము ఇక్కడ ఉన్నారా? నశించు వ్యక్తి! మీరు నశించునట్టు అనిపిస్తుందా? అలా అనిపిస్తే నాకు సంతోషము. ఎందుకంటే విమోచన, పాప క్షమాపణ ఉన్నాయి – యేసు క్రీస్తు రక్తము ద్వారా. ఓ పాపి, చూడు! నీకొరకు గెత్సమనే వనములో చెమట రక్త బిందువులను కార్చు యేసును చూస్తున్నావా? సిలువవై వేలాడు యేసును చూసావా? నీ కొరకు సిలువ వేయబడ్డాడు. ఓ, ఒకవేళ ఈ సాయంకాలము నేను నీ కొరకు సిలువ వేయబడితే, నాకు తెలుసు నేవేమి చేస్తావో: నీవు నాకాళ్ళ పై బడి ముద్దుపెట్టుకుంటావు, నీ కొరకు చనిపోయినందుకు ఏడుస్తావు. కాని, నశించు పాపి, యేసు నీ కొరకు మరణించాడు – నీ కొరకు! ఆయన నీ కొరకు రక్తము కార్చాడు కాబట్టి, ఆయన దగ్గరకు వచ్చి ఆయనను విశ్వసిస్తే, నీవు నశించిపోవు. అప్పుడు, నీవు, పాపివేనా? నీవు క్రీస్తును పూర్తిగా నమ్మవు కాబట్టి పాపమును బట్టి ఒప్పింప బడ్డావా? మీకు బోధించడానికి నాకు అధికారము ఉంది. యేసును నమ్మితే నీవు నశించవు! యేసునే నమ్ము, అది నీ కొరకు మరణించినందుకు కాదు. యేసు క్రీస్తునే విశ్వసించు. నీవు పాపివి కాదని అంటున్నావా? క్షమింపబడడానికి పాపాలు లేవు అని అంటున్నావా? అప్పుడు నీకు బోధించడానికి క్రీస్తు లేడు. మంచి వారిని రక్షించడానికి ఆయన రాలేదు; పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. నీవు పాపివా? నీ పాపము నీకు తెలుస్తుందా? నీవు నశించి పోయావా? నీకు అది తెలుసా? నీవు పాపివా? దానిని ఒప్పుకుంటావా? పాపే! యేసు ఈ సాయంకాలము ఇక్కడ ఉంటే, ఆయన రక్తము కారుచున్న చేతులను నీ కొరకు చాచేవాడు, ఆయన చెప్పేవాడు, "పాపి, నీ కొరకు నేను మరణించాను. నీవు నన్ను నమ్ముతావా?" ఆయన వ్యక్తిగా ఇక్కడ లేడు, కాని ఇది చెప్పడానికి ఆయన నన్ను పంపించాడు. నీవు ఆయనను నమ్ముతావా? "ఓ!" నీవనవచ్చు, "నేను చెడ్డపాపిని!" "ఓ!" యేసు అంటున్నాడు, "అందుకే నీ కొరకు చనిపోయాను, నీవు పాపివి కాబట్టి." "కాని," నీవనవచ్చు, "నేను సిగ్గుపడే పనులు ఆలోచనలు కలిగియున్నాను." యేసు అంటాడు, "అన్ని క్షమింపబడ్డాయి, అన్ని నా చేతులు కాళ్లు పక్క నుండి కారే రక్తముచే కడుగబడ్డాయి. కేవలము నన్ను నమ్ము; అదే నేనడుగుచున్నాను." యేసు క్రీస్తునే నమ్మండి. కొందరనవచ్చు, "నాకు రక్షకుడు అవసరము లేదు." అప్పుడు నాకు చెప్పేదేమీ లేదు ఇది తప్ప – "ఉగ్రత వస్తుంది! ఉగ్రత వస్తుంది!" తీర్పు నీ కొరకు వస్తుంది! నేరారోపణ నీకు అనిపిస్తుందా? నీ పాపములు అసహ్యించుకొని, వాటి నుండి మరలి క్రీస్తు వైపు తిరుగుతావా? అప్పుడు నేను చెప్తాను క్రీస్తు నీ కొరకు చనిపోయాడని. క్రీస్తును నమ్ము! ఆయనను విశ్వసించు! యేసు క్రీస్తునే నమ్ము. స్పర్జన్ బోధించడానికి ఒక పట్టణానికి వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు ఆయనకు ఒక ఉత్తరము వ్రాసాడు. అతనన్నాడు, "అయ్యా, నీవు వచ్చునప్పుడు, దయచేసి నాకు సరిపడే ప్రసంగము చెయ్యి. నేను విన్నాను భూమిపై మనము అతి దుష్టలమని అనుకోవాలి, లేనిచో మనము రక్షింపబడలేదు. నేను దుష్టుడనని ఆనుకొన ప్రయత్నిస్తున్నాను, కాని చెయ్యలేక పోతున్నాను. రక్షింపబడాలనుకుంటున్నాను, కాని ఎలా ప్రశ్చాత్తప పడాలో నాకు తెలియదు." స్పర్జన్ అన్నాడు, "నేను బోధించడానికి అక్కడకి వెళ్లి అతనిని కలిస్తే, అతనికి చెప్తాను, దేవుడు నీవు భూమి మీద అతి దుర్మార్గుడవని అనుకోనవసరము లేదు, ఎందుకంటే నీకంటే ఇంకా దుష్టులు ఉన్నారు. నీ అంత పాపులు కాని వారు కూడ ఉన్నారు. దేవుడు కోరుకునేది ఇది: ఒక వ్యక్తి అంటాడు, ‘నా గురించి ఇతరుల కంటే నాకే బాగా తెలుసు. వారిని గూర్చి నాకు ఎక్కువ తెలియదు. కాని నా హృదయాన్ని చూడాలనుకుంటున్నాను, చాలామంది నా అంత చెడ్డవారు, ఉండకపోవచ్చు. నాకంటే భయంకర మైన పనులు వారు చేసి ఉండవచ్చు, కాని నేను చాలా ప్రసంగాలు విన్నాను, చాలా హెచ్చరికలు, కనుక వారికంటే నాకు నేరారోపణ ఎక్కువగా ఉంది.’ నీవు క్రీస్తు నొద్దకు రావాలని కోరుతున్నాను, వచ్చి ఇలా చెప్పాలి, ‘ప్రభువా, నేను పాపము చేసాను.’ నీ పని వచ్చి ఇలా చెప్పాలి, ‘యేసు ప్రభువా, పాపినైన, నన్ను కరుణించుము.’ అంతే. నీవు నశించినట్టు అనిపిస్తుందా? మళ్ళీ చెప్తున్నాను, ‘యేసు నొద్దకు రమ్ము. ఆయన ప్రశస్త రక్తములో నీ పాపాలు కడిగివేస్తాడు.’" "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). ఈ ప్రసంగము ముగించడానికి నేను చెప్తాను ఈ స్థలములో నశించు పాపిలేడు, నశించినట్టు తెలియదు, తన పాపాలన్నీ క్షమించబడలేదు మరియు "దేవుని మహిమ" యందు నిరీక్షణ యందు ఆనందించుడి." నీవు పాపములో నరకము వలే నల్లగా ఉన్నా, ఈ రాత్రి నీవు పరలోకమంతా తెల్లగా అవుతావు. ఒక పాపి యేసును విశ్వసించిన క్షణమే యేసు రక్తము ద్వారా అతడు రక్షింప బడతాడు. ఈ వచనము మీ హృదయములో మీ జీవితంలో నిజము కానివ్వండి: ఉన్నపాటున, ఏమి లేకుండా ముందు రెండు వరుసలకు రండి. దేవునితో మీ పాపాలు ఒప్పుకోండి. అప్పుడు యేసును విశ్వసించండి, యేసు నొద్దకు రండి, యేసు ప్రశస్త రక్తములో మీ పాపాలు కడుగుకోండి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ రక్తముతో లేక రక్తము లేకుండా! WITH OR WITHOUT BLOOD డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు" (హెబ్రీయులకు 9:22). I. మొదటిది, క్రీస్తు రక్తము చిందింపకపోతే మీకు ఏమి సంభవిస్తుందో ఆలోచించండి, మత్తయి 23:33; మార్కు 9:43; లూకా 16:24; ప్రసంగి 12:14; సామెతలు 15:3; కీర్తనలు 51:3; యిర్మియా 17:9, 10. II. రెండవది, క్రీస్తు చిందించిన రక్తాన్ని నీవు కలిగియుంటే నీకేమి సంభవిస్తుందో ఆలోచించు, ప్రకటన 5:9; అపోస్తలుల కార్యములు 20:28. |