Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సువార్తిక ప్రసంగమును సిద్ధ పరచుట ఎలా –
నిజ మార్పిడులకు మరచిపోబడిన సత్యములు అవసరము

HOW TO PREPARE AN EVANGELISTIC SERMON –
FORGOTTEN TRUTHS NEEDED FOR REAL CONVERSIONS
(Telugu)

డాక్టర్ సి. ఎల్. కాగన్ మరియు డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. C. L. Cagan and Dr. R. L. Hymers, Jr.
బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారము సాయంకాలము, అక్టోబర్ 14, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Saturday Evening, October 14, 2017

"సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము"
(II తిమోతి 4:5).

నీరో చక్రవర్తి చిత్ర హింసల వలన పౌలు చంపబడక మునుపు అపోస్తలుడు ఈ మాటలు తిమోతికి చెప్పాడు. తిమోతి పౌలు శిష్యుడు. పరిచర్యలో పౌలు అతనికి తర్ఫీదు ఇచ్చాడు. ఎఫెస్సు పట్టణములోని సంఘమునకు తిమోతి సంఘ కాపరి అయ్యాడు. సంఘ కాపరిగా ఉండడం తిమోతి ముఖ్య పని.


"సువార్తికుడైన ఫిలిప్పు" పరిచర్య లాంటిది తిమోతి కలిగి ఉండలేదు (అపోస్తలుల కార్యములు 21:8). ఫిలిప్పు ఒక స్థలము నుండి మరియొక స్థలానికి వెళ్ళాడు. ఫిలిప్పు సమరయకు వెళ్లి అక్కడ క్రీస్తును గూర్చి ప్రకటించాడు (అపోస్తలుల కార్యములు 8:5). తరువాత ఫిలిప్పు అరణ్యములోనికి వెళ్లి ఇతీయోపీయుడైన నపుంసకుని క్రీస్తు నొద్దకు నడిపించాడు (అపోస్తలుల కార్యములు 8:26-39). తరువాత ఫిలిప్పు ఇతర పట్టణాలలో బోధించాడు (అపోస్తలుల కార్యములు 8:40). ఫిలిప్పు ప్రయాణించు సువార్తికుడు. తిమోతి ఒక స్థానిక సంఘమునకు సంఘ కాపరి.

ఎందుకు పౌలు తిమోతికి చెప్పాడు "సువార్తికుని పనిచేయుము అని"? ఎందుకంటే ప్రతి సంఘ కాపరి సువార్తికుని పని చెయ్యడానికి పిలువబడ్డాడు! పౌలు తిమోతికి చెప్పాడు "[నీ] పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని" (II తిమోతి 4:5). పరిచర్యను సంపూర్ణముగా జరిగించుట అంటే ఏమిటి? సువార్తికుని పనిచెయ్యడం! ప్రతి సంఘ కాపరి సువార్తికుని పని చెయ్యడానికి పిలువబడ్డాడు. మీరు అది చెయ్యకపోతే, దేవుడు మీకు ఆజ్ఞాపించినదంతా చెయ్యడం లేదు అని అర్ధము!

ప్రతి సంఘ కాపరి తన సంఘములో బోధిస్తాడు. అది అతని పిలుపు. ప్రతి సంఘ కాపరి తప్పకుండా తన సంఘములో సువార్తిక ప్రసంగాలు చెయ్యాలి – అవి తరుచుగా బోధించాలి! సువార్తను ఆదివారపు బడి తరగతులకు విడిచి పెడితే, మీరు నమ్మకమైన బోధకులు కాదు. ప్రజలకు చెప్పడమే పని అనుకుంటే, మీరు నమ్మకమైన బోధకులు కాదు. బైబిలును నేర్పించడం ఒక్కటే మీ పరిచర్య కాదు. మీరు తప్పక సువార్తికుని పని చెయ్యాలి. మీరు తప్పక సువార్తిక ప్రసంగాలు బోధించాలి, అవి క్రమముగా చెయ్యాలి.

సువార్తిక ప్రసంగము అంటే ఏమిటి? సువార్తిక ప్రసంగము నేరుగా సమూహములోని నశించు వారి మీద గురి పెడుతుంది, అలాంటి వారు ప్రతి ఆరాధనలో చాలామంది ఉంటారు, వారిలో కొంతమంది గుడికి ప్రతివారము వస్తారు. పూర్తి సువార్తిక ప్రసంగము పాపము మరియు క్రీస్తు నందలి రక్షణను గూర్చి ప్రకటిస్తుంది – తద్వారా దానిని విన్న నశించు ప్రజలు యేసును విశ్వసించి రక్షింపబడతారు. సువార్తిక ప్రసంగము వివరణాత్మక ప్రసంగము కాదు లేఖనములోని చాలా వచనాల మీద చెప్పడం. బోధించడానికి ఒకటి రెండు వచనాలు తీసుకోవాలి. సువార్తిక ప్రసంగాలు ఒకటి రెండు వచనములలోని సత్యముపై దృష్టి సారిస్తుంది. చాలా వచనాలను వివరించడం సువార్తిక ప్రసంగములు కాదు. స్పర్జన్ సువార్తిక ప్రసంగాలు అధ్యయనము చెయ్యండి. వాటిలో ఏవి కూడ ఈనాడు మనము పిలిచే "వివరణాత్మక" ప్రసంగాలు కావు. అపోస్తలుల కార్యములలో ప్రతి ప్రసంగము సువార్తిక ప్రసంగమే. మొత్తము అపోస్తలుల కార్యములలో ఒకే ఒక "వివరణాత్మక" ప్రసంగము ఉంది! మనము సువార్తిక ప్రసంగాలు బోధించేటప్పుడు అపోస్తలుల స్పర్జన్ ల ఉదాహరణకు గైకొనాలి!

చాలా కొద్దిమంది సంఘ కాపరులు ఈనాడు సువార్తిక ప్రసంగాలు బోధిస్తున్నారు. చాలామంది అసలు బోధించనే బోధించరు. అమెరికాలో ఈనాడు సువార్తిక ప్రసంగాలు చాలా అరుదుగా వింటాము. ఇతర దేశాలలో కూడ ఇదే పరిస్థితి. సంఘ కాపరులు బైబిలును వారి ప్రజలకు నేర్పిస్తారు – లేక స్వస్థతల మీద బోధిస్తారు, ఐశ్వర్యము, మంచి భావన కలిగి ఉండడం ఎలా – క్రీస్తు సువార్త తప్ప ఇలాంటి మిగిలినవన్నీ బోధిస్తారు! వారు బైబిలుకు లోబడడం లేదు, బైబిలు చెప్తుంది, "సువార్తికుని పని చేయుము."

మీరనవచ్చు, "కాని సువార్తిక ప్రసంగాన్ని ఎలా సిద్ధము చేసుకోవాలి? నేనేమి చెయ్యాలి?" ఈ ప్రసంగము దాని నిమిత్తమే. మీరు సువార్తిక ప్రసంగము ఎలా బోధించాలో నేను మీకు చెప్పబోతున్నాను.

సువార్తిక ప్రసంగము సువార్త కేంద్రీకృత ప్రసంగము. సువార్త ప్రసంగము అంటే ఏమిటి? సువార్త బోధించాలంటే సువార్త అంటే ఏమిటో మీకు తప్పక తెలియాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు,

"మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియ పరచుచున్నాను… నాకియ్యబడిన ఉపదేశామును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను; సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" (I కొరింధీయులకు 15:1, 3, 4).

మళ్ళీ, అపోస్తలుడైన పౌలు చెప్పాడు,

"పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను" (I తిమోతి 1:15).

సువార్తిక ప్రసంగములో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది, మానవుని పాపము సమస్య; మరియు రెండవది, వారి పాపము నుండి రక్షించడానికి ప్రజలకు క్రీస్తు ఏమి చేసాడు.

I. మొదటిది, మీరు ధర్మ శాస్త్రము తప్పక బోధించాలి – అది ప్రజలకు వారి పాప భూఇష్టమైన హృదయములను గూర్చి వారికి తెలియచేస్తుంది.

సువార్తిక ప్రసంగములో మొదటి భాగములో, మీరు ధర్మ శాస్త్రమును తప్పక బోధించాలి. ఎందుకు ఎవరైనా యేసును విశ్వసించాలి? కారణమేమిటి? యేసు ఎందుకు సిలువపై మరణించాడు? చాలా ప్రసంగాలు ప్రజలకు చెప్తాయి వారు యేసును నమ్మాలని తద్వారా వారికి మంచి జీవితము ఉంటుందని, సంతోషంగా ఉంటారని, లేక ప్రేమను స్నేహమును కనుగుంటారని. కాని అందు నిమిత్తము యేసు సిలువపై మరణించలేదు! కొన్ని ప్రసంగాలు ప్రజలకు చెప్తాయి యేసును నమ్మితే వారు పరలోకానికి వెళ్తారని. కాని అది సువార్త ప్రసంగం కాదు పరలోకానికి వెళ్ళడానికి యేసును ఎందుకు నమ్మాలో చెప్పకపోతే. బైబిలు చెప్తుంది, "క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు." బైబిలు చెప్తుంది, "పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను."

వారు పాపులని ప్రజలు గ్రహించకపోతే, వారు ఎందుకు క్రీస్తు నొద్దకు రావాలి? వారు రారు! వారు ఒక ప్రార్ధన చెయ్యవచ్చు. వారు చెయ్యి ఎత్తవచ్చు. ప్రసంగము తరువాత వారు ముందుకు రావచ్చు. కాని వారు రక్షింపబడరు! ఎందుకు? ఎందుకంటే రక్షింపబడడానికి వచ్చిన వారికి ఏమిలేదు!

వారు పాపులను ఎలా ప్రజలకు మీరు కనపరచగలరు? దేవుని ధర్మ శాస్త్రమును వారికి బోధించడం ద్వారా. బైబిలు చెప్తుంది,

"క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మ శాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను" (గలతీయులకు 3:24).

వారు పాపులను ధర్మ శాస్త్రము ప్రజలకు చూపిస్తుంది. వారి హృదయ పాపమును బట్టి వారు ఒప్పింపబడినప్పుడు, వారు క్రీస్తు నొద్దకు రావచ్చును.

చాలామంది సంఘ కాపరులు ధర్మ శాస్త్రము బోధించడానికి భయపడతారు. ప్రజలకు కోపము రప్పించడానికి వారు భయపడతారు. అయాన్ హెచ్. ముర్రే చెప్పాడు ఇది "సువర్తీకరణలో ప్రాముఖ్యమైన సమస్య." అతని పుస్తకము, పాత సువర్తీకరణలో (Banner of Truth, 2005; read pages 3 through 37), ముర్రే సరిగ్గా చెప్పాడు నశించు వారిని అభ్యంతర పెట్టడానికి భయపడడం ముఖ్య కారణము ఈనాడు సువర్తీకరణ బోధ నిర్వీర్యముగా ఉండడానికి కారణము.

మీరు ఏమి చేసినను, వ్యక్తిగత పాపములను గూర్చి బోధింపవద్దు. "ఇది చెయ్యండి. అది చెయ్యవద్దు." ఇది ప్రజల నిజమైన, లేక నిర్దిష్ట పాపములను గూర్చి మాట్లాడడం. కాని పాపము ఇంకా లోతుగా వెళ్తుంది. వారు లోలోపల పాపులు. ఆదాము నుండి సంక్రమించిన పాపపు హృదయము, వారికుంది. అందుకే దావీదు అన్నాడు, "నేను పాపములో పుట్టినవాడను; పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను" (కీర్తనలు 51:5). అందుకే బైబిలు చెప్తుంది, "హృదయము అన్నింటి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది" (యిర్మియా 17:9). మరియు బైబిలు చెప్తుంది, "ఏలయనగా శరీరానుసారమైన [మారని] మనస్సు దేవునికి విరోధమైయున్నది" (రోమా 8:7) అందుకే ప్రజలు చెడ్డ పనులు చేస్తారు. వారు ఎవరో దాని నుండి వారు చేసేది వస్తుంది. క్రీస్తు చెప్పాడు, "లోపలి నుండి అనగా మనష్యుల హృదయములో నుండి, దురాలోచనలను జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులు వచ్చును... ఈ చెడ్డవన్నియు లోపలి నుండి వచ్చును" (మార్కు 7:21, 23). ప్రజలు చేసే వాని లోలోపల వారు ఏమిటో తెలుస్తుంది. మంచిగా ఉండాలని ఎవరైనా ప్రయత్నించినా, అతడు తన హృదయాన్ని మార్చలేదు, ఒక మేక గొర్రెగా మారలేనట్టు. క్రైస్తవులుగా ఉండాలని ప్రజలు వారికి నేర్పించలేరు. ఆ విధంగా బోధించాలి, నేను ఈ ప్రసంగములో వివరించినట్టు. దేవుడు మానవుని హృదయాన్ని మానవుని క్రియలను ఖండిస్తాడు. బైబిలు చెప్తుంది, "అందరు పాపమునకు లోనైయున్నారు" (రోమా 3:9). మారకముందు ప్రతిఒక్కరు పాపపు శక్తి శిక్ష క్రింద ఉంటారు.

ప్రజలు వారి హృదయాలు పాప భూఇష్టమైనవని చూచునట్లు మీరు ధర్మ శాస్త్రము వారికి బోధించాలి. ఇప్పుడు, ప్రతి ఒక్కరు ఏదోలా పాపులని ఒప్పుకుంటారు. పరిపూర్ణుడనని చెప్పుకున్న వారిని నేను ఇప్పటి వరకు కలుసుకోలేదు. ఒకడు ఒక బోధకునితో అన్నాడు, "నేను [పాపిని] అని అనుకున్నాను, కాని నేను చెడ్డ పాపిని కాదు. నేను, మంచివాడను, అనుకున్నాను. నేను శ్రేష్టమైనది చెయ్యడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాను." అతడు రక్షింపబడుటకు సిద్ధముగా లేడు! అతడు రక్షింపబడేముందు, అతడు "చెడ్డ" పాపి అని చూడగలగాలి. అందుకే మీరు వారి పాప పూరిత హృదయాలను గూర్చి బోధించాలి.

దేవుని ధర్మ శాస్త్రము లేకుండా, వారు క్రీస్తు సువార్త వారికి ఎందుకు అవసరమో చూడరు. అందుకే మీరు సువార్త బోధించే ముందు ధర్మ శాస్త్రము బోధించాలి. బైబిలు చెప్తుంది, "క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మ శాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను" (గలతీయులకు 3:24). ఒక పాఠశాల ఉపాధ్యాయుని వలే, వారికి క్రీస్తు అవసరమని ధర్మ శాస్త్రము ప్రజలకు చూపిస్తుంది. మొదట ధర్మ శాస్త్రము. తరువాత సువార్త. లూథర్ సరిగ్గా చెప్పాడు. సువార్తిక ప్రసంగాలు ఎలా బోధించాలో నేర్చుకోవాలంటే అతడు చెప్పింది జాగ్రత్తగా పాటించాలి. లూథర్ అన్నాడు,

అవసరంఐతే, మీరు మారాలనుకుంటే, మీరు [కలవరపడాలి], అది, మీకు హెచ్చరింపబడిన వణకే మనస్సాక్షి ఉండాలి. ఈ పరిస్థితి సృష్టింపబడిన, తరువాత, మీరు మీ స్వంత క్రియలు కాక దేవుని కార్యమును చూడాలి. ఆయన భయంకర పాపుల పట్ల దేవుని కృపను ప్రకటించడానికి తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపాడు. ఇదీ మార్పిడి మార్గము. మిగిలిన మార్గాలన్నీ తప్పుడు మార్గాలు (Martin Luther, Th.D., What Luther Says, Concordia Publishing House, 1994 reprint, Number 1014, page 343).

నేనన్నాను, "మీరు తప్పక ధర్మశాస్త్రము బోధించాలి తద్వారా ప్రజలు వారి అంతరంగ పాపాన్ని చూచి గ్రహిస్తారు." నేను ఇలా చెప్పలేదు, "మీరు నరకమును గూర్చి బోధించాలని." అవును, క్రీస్తు నరకమును గూర్చి మాట్లాడాడు. నరకము వాస్తవము. కాని నరకమును గూర్చి బోధిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. నరకమునకు భయపడి ఎవ్వరు రక్షింప బడలేరు. వారు మంచివారుగా ఉండ ప్రయత్నిస్తారు. వారు చాలా మతపరమైన వారు కాగలరు. కాని నరకమునకు భయపడి ఎవరు రక్షింప బడలేదు. క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. నరకము పాపమునకు ప్రతిఫలము. నిజమైన సమస్య పాపము, నరకము కాదు. పూర్తి ప్రసంగాలు నరకమునకు సంబంధించినవి ప్రజలు మార్చజాలదు. సువార్తిక ప్రసంగములోని మొదటి భాగము వారి పాపాన్ని బహిర్గతము చెయ్యాలి – వ్యక్తిగత పాపాలు కాదు, గాని వారి హృదయ పాపములు.

వారి పాపమును ప్రజలకు చూపించుటకు, మీరు వారి పాప పూరిత, తిరుగబడే హృదయములను గూర్చి బోధించాలి. అక్కడ ఆగిపోకూడదు. ధర్మ శాస్త్రము ఎవరిని రక్షింపలేదు. వారి హృదయ పాపములను మాత్రము చూపిస్తుంది. బైబిలు చెప్తుంది, "ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏమనష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు... ధర్మ శాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" (రోమా 3:20). బైబిలు చెప్తుంది ప్రజలను రక్షించడం "ధర్మశాస్త్రము చేయ నేరదు" (రోమా 8:3). క్రీస్తు మాత్రమే పాపి హృదయాన్ని మార్చగలడు. క్రీస్తు రక్తము మాత్రమే పాపమును కడిగి వేయగలదు. దీని తరువాత రెండవ విషయము.

II. రెండవది, మీరు సువార్త బోధించాలి – అది వారి పాపముల నుండి రక్షించడానికి క్రీస్తు ఏమి చేసాడో ప్రజలకు చెప్తుంది.

మీ సువార్తిక ప్రసంగములోని రెండవ భాగము, మీరు తప్పక సువార్త బోధించాలి. సువార్త అంటే మంచిగా ఉండడం ఎలా అని నేర్పించడం కాదు. సువార్త సంఘము, పరలోకము గూర్చిన సందేశము కాదు. సువార్త ఏమిటంటే "లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను" (I కొరింధీయులకు 15:3). సువార్త ఏమిటంటే "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను" (I తిమోతి 1:15).

సువార్త అంటే నియమావళులు కాదు. దేవుడు పాపిని ఎంతగానో ప్రేమించి క్రీస్తు తన నిమిత్తము మరణించాడు అనే విషయాన్ని సువార్త కనుపరుస్తుంది. ధర్మశాస్త్రము నుండి సువార్త రాలేదు. ఇది పవిత్ర ప్రేమ కృప. లూథర్ చెప్పినట్టు,

సువార్త...మనము ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయాలు సువార్త బోధించదు. అది కావలసినవి చెప్పదు కాని ధర్మశాస్త్రపు అన్వయింపును తిరగ రాస్తుంది, వ్యతిరేకమైనది చేస్తుంది, చెప్తుంది, "ఇది దేవుడు మీ కొరకు చేసాడు; ఆయన తన కుమారుని శరీరధారిగా చేసాడు, మీ నిమిత్తము మరణ పాత్రుని చేసాడు...సువార్త బోధిస్తుంది...దేవునిచే ఇవ్వబడినది ఏమిటి, మరియు...మనమేమి చేసి దేవునికి ఇవ్వాలి అది కాదు ("ఎలా క్రైస్తవులు మోషేను పరిగణించాలి," 1525).

సువార్త పాపికి నూతన హృదయాన్ని ఇస్తుంది, పాప క్షమాపణ ఇస్తుంది క్రీస్తు సిలువపైన కాలి సమాధిలో చేసిన దాని బట్టి! యేసును విశ్వసించు వ్యక్తి

"కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు: క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాదారముగా [పాపము కొరకు వెల చెల్లించుట] బయలు పరచెను" (రోమా 3:24, 25).

బైబిలు చెప్తుంది "అయితే దేవుడు మన యెడల తన ప్రేమను [వెల్లడి] పరచుచున్నాడు, ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను... కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడు [చున్నాము]" (రోమా 5:8, 9). తన పాపము నిమిత్తము క్రీస్తు పాపి స్థానములో మరణించాడు. యెషయా చెప్పినట్టు, "యెహోవా మన అందరి దోషమును [క్రీస్తు] అతని మీద మోపెను" (యెషయా 53:6). యేసు క్రీస్తు ద్వారా ఉచిత కృపచే పాప క్షమాపణయే సువార్త.

మీరు సువార్త ప్రకటించుచున్నప్పుడు, కేవలము క్రీస్తు మరణమును గూర్చి మాత్రమే బోధించకండి. క్రీస్తు పునరుత్థానము బోధించండి! ఇది సువర్తలోని భాగము "లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచెను" (I కొరింధీయులకు 15:4). క్రీస్తు పునరుత్థానము అవసరము. బైబిలు చెప్తుంది, "క్రీస్తు లేపబడని యెడల, మీ విశ్వాసము వ్యర్ధమే; మీరింకను మీ పాపములలోనేఉన్నారు" (I కొరింధీయులకు 15:17). క్రీస్తు సమాధిలో చనిపోయి ఉండలేదు. పాపులకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడు (చూడండి యేహెజ్కేలు 11:19; 36:26, 27).

కేవలము క్రీస్తు మరణమును గూర్చి మాత్రమే బోధించకండి. క్రీస్తు రక్తమును గూర్చి బోధించండి! గుర్తించుకోండి "ఆయన రక్తము నందలి విశ్వాసము మూలముగా" ప్రజలు రక్షింప బడ్డారు" (రోమా 3:25). "ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాము" (రోమా 5:9). బైబిలు చెప్తుంది, "రక్తము చిందింప బడకుండా [పాప క్షమాపణ కలగదు]" (హెబ్రీయులకు 9:22). క్రీస్తు రక్తము రక్షింపబడడానికి అవసరము లేదు అని చెప్పిన డాక్టర్ జాన్ మెక్ ఆర్డర్ ను చాలామంది బోధకులు వెంబడిస్తారు, ఈరోజులలో క్రీస్తు యొక్క రక్తము లేదు. కాని నమ్మకస్తులైన మంచి సంఘ కాపరులు క్రీస్తు రక్తమును గూర్చి బోధిస్తారు! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ సరిగ్గా చెప్పాడు, "ఉజ్జీవ సమయములలో...[సంఘము] రక్తమును బట్టి గొప్ప చెప్పుకుంటుంది...అతి పరిశుద్ధ [స్థలమునకు] ధైర్యముగా మనము ప్రవేశించడానికి ఒకటే మార్గము, అది యేసు రక్తము" (Revival, Crossway Books, 1992 edition, p. 48). రక్తమును గూర్చి బోధించండి! రక్తమును గూర్చి బోధించండి! "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7).

క్రీస్తులో దేవుని కృప ద్వారా ఉచిత బహుమానముగా ఇవ్వబడింది సువార్త. పాపి తనను తానే మంచివానిగా మార్చుకోలేడు. పాపి చెయ్యవలసింది ఒకటే ఉంది. అతడు యేసును విశ్వసించాలి. క్రీస్తును గూర్చిన ఒక సత్యాన్ని నమ్మడం అతనిని రక్షింప లేదు. అతడు యేసును మాత్రమే విశ్వసించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయ చెరసాల నాయకులతో అన్నాడు, "ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము [Greek epi = upon, into], అప్పుడు నీవును నీ ఇంటి వారను రక్షణ పొందుదురు" (అపోస్తలుల కార్యములు 16:31). ఒక పాపి యేసును విశ్వసిస్తే, అతడు రక్షింప బడతాడు. మరియు అందరు పాపులు చేయవలసిందంతా క్రీస్తును విశ్వసించడం. యేసు మిగిలినదంతా చేసేసాడు. ఆయన పాపికి నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన జన్మతో (ఎఫెస్సీయులకు 2:5; యోహాను 3:6, 7) మరియు ఆయన తన రక్తములో పాపి పాపమంతటిని కడిగేస్తాడు (హెబ్రీయులకు 9:14; ప్రకటన 1:5బి; 5:9బి). "ఆయనను మాత్రము విశ్వసించండి, ఆయనను మాత్రము విశ్వసించండి, ఇప్పుడు ఆయనను మాత్రమే విశ్వసించండి. ఆయన మిమ్ములను రక్షిస్తాడు, ఆయన మిమ్ములను రక్షిస్తాడు, ఇప్పుడు ఆయన మిమ్ములను రక్షిస్తాడు" ("ఆయనను మాత్రమే విశ్వసించండి" జాన్ హెచ్. స్టాక్ టన్ చే, 1813-1877).

మీ ప్రసంగము ముగింపులో, యేసును నమ్మునట్లు పాపులకు పిలుపు ఇవ్వండి. మీరు ప్రత్యేకంగా మాట్లాడడానికి వీలుగా వారిని వేరే గదిలోనికి ఆహ్వానించండి. మీతో మాట్లాడడానికి వారు వచ్చినప్పుడు మీ పని ఇంకా పూర్తి కాలేదు. "ముందుకు రావడం" యేసును విశ్వసించడం కాదు. "చేతులెత్తడం" లేక "పాపిప్రార్ధన" చెప్పడం యేసును విశ్వసించడం కాదు. యేసును విశ్వసించడం అంటే యేసును విశ్వసించడమే – మరేమీ కాదు. అందుకే ప్రసంగము తరువాత మీ ఆహ్వానానికి స్పందించిన వారితో మీరు తప్పకుండా మాట్లాడాలి. అంతే కాదు చాలా జాగ్రత్తగా వారు చెప్పేది వినాలి. వినుట ద్వారా వారు నమ్మే తప్పుడు అభిప్రాయాలు మీకు తెలుస్తాయి, మీరు వారిని సరిదిద్దవచ్చు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడండి వారిని క్రీస్తు నొద్దకు నడిపించడానికి మీ శ్రేష్టమైనది చెయ్యండి. కాని అది ఇంకొక సందేశములోని అంశము. హృదయ పాపములను గూర్చి క్రీస్తు రక్తము ద్వారా క్షమాపణను గూర్చి మీరు బోధిస్తుండగా దేవుడు మిమ్ములను దీవించును గాక.

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, వ్రాసిన సువార్తిక ప్రసంగాలు చదవడానికి క్లిక్ చెయ్యండి. డాక్టర్ హైమర్స్ గత అరవై సంవత్సరాలుగా సువార్తిక ప్రసంగాలు బోధిస్తున్నారు. అతని సువార్తిక ప్రసంగము, "కడిగి శుద్ధి చేసుకోండి! – మార్పు నందలి విధానము చదవడం ద్వారా మీరు చాలా నేర్చుకుంటారు." శీర్షిక క్లిక్ చేసి దానిని చదవండి. ఒక సువార్తిక ప్రసంగములో ధర్మ శాస్త్రమును గూర్చి సువార్తను గూర్చి ఎలా బోధించాలో అది చూపిస్తుంది.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.



ద అవుట్ లైన్ ఆఫ్

సువార్తిక ప్రసంగమును సిద్ధ పరచుట ఎలా –
నిజ మార్పిడులకు మరచిపోబడిన సత్యములు అవసరము

HOW TO PREPARE AN EVANGELISTIC SERMON –
FORGOTTEN TRUTHS NEEDED FOR REAL CONVERSIONS

డాక్టర్ సి. ఎల్. కాగన్ మరియు డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. C. L. Cagan and Dr. R. L. Hymers, Jr.

"సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము"
(II తిమోతి 4:5).

(అపోస్తలుల కార్యములు 21:8; 8:5, 26-39, 40;
I కొరింధీయులకు 15:1, 3, 4; I తిమోతి 1:15)

I. మొదటిది, మీరు ధర్మ శాస్త్రము తప్పక బోధించాలి – అది ప్రజలకు వారి పాప భూఇష్టమైన హృదయములను గూర్చి వారికి తెలియచేస్తుంది,
గలతీయులకు 3:24; కీర్తనలు 51:5; యిర్మియా 17:9; రోమా 8:7;
మార్కు 7:21, 23; రోమా 3:9, 20; 8:3.

II. రెండవది, మీరు సువార్త బోధించాలి – అది వారి పాపముల నుండి రక్షించడానికి క్రీస్తు ఏమి చేసాడో ప్రజలకు చెప్తుంది, I కొరింధీయులకు 15:3; I తిమోతి 1:15;
 రోమా 3:24, 25; 5:8, 9; యెషయా 53:6; I కొరింధీయులకు 15:4, 17;
యేహెజ్కేలు 11:19; 36:26, 27; హెబ్రీయులకు 9:22; I యోహాను 1:7;
అపోస్తలుల కార్యములు 16:31; ఎఫెస్సీయులకు 2:5; యోహాను 3:6, 7;
హెబ్రీయులకు 9:14; ప్రకటన 1:5బి; 5:9బి.