Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఎలా ప్రార్ధించాలి ఒక ప్రార్ధనా కూటమును ఎలా జరిగించాలి

(డాక్టర్ తిమోతి లిన్ గారి బోధలు, 1911-2009)
HOW TO PRAY AND HOW TO CONDUCT A PRAYER MEETING
(THE TEACHINGS OF DR. TIMOTHY LIN, 1911-2009)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే వ్రాయబడిన
జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడిన ప్రసంగము
బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 15, 2017
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan
at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, October 15, 2017

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?" (లూకా 18:8).


డాక్టర్ హైమర్స్ గారి దీర్ఘకాలపు సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్ (1911-2009), గారికి బైబిలును గూర్చి గొప్ప అవగాహన ఉంది. అతనికి హెబ్రీయ భాషలో కాగ్నేట్ భాషలో వేదాంత డాక్టరేట్ ఉంది. 1950లో, పట్టభద్ర పాఠశాల బాబ్ జోన్స్ విశ్వ విద్యాలయములో, అతడు క్రమమైన వేదాంతము, బైబిలు వేదాంతము, పాత నిబంధన హెబ్రీ, బైబిలు పర అరమైక్, శాస్త్రీయ అరబిక్, పెసిట్ట సిరియాక్ బోధించారు. డాక్టర్ జేమ్స్ హడ్ సన్ టేలర్ III తరువాత, అతడు చైనా సువార్తిక వేదాంత కళాశాలకు అధ్యక్షునిగా ఉన్నాడు. కొత్త అమెరికన్ ప్రమాణిక బైబిలు (ఎన్ఏఎస్ బి) (NASB) కు పాత నిబంధనకు అనువాదకునిగా ఉన్నాడు. డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ కు డాక్టర్ లిన్, ఇరవై నాలుగు సంవత్సరాలు సంఘ కాపరిగా ఉన్నారు. డాక్టర్ లిన్ గొప్ప ప్రభావిత సంఘ కాపరి అని, డాక్టర్ హైమర్స్ నిస్సందేహంగా చెప్తారు. అతని సంఘములో సభ్యునిగా ఉన్నప్పుడు డాక్టర్ హైమర్స్ దేవుడు ఉజ్జీవము పంపడం వందల మంది రక్షింపబడి సంఘానికి రావడం చూసాడు.

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?" (లూకా 18:8).

చాలా మంది వ్యాఖ్యాతలు ఈ వచనమును గూర్చి సరిగ్గా చెప్పరు. ఉదాహరణకు, ఒక ప్రముఖ వ్యాఖ్యానము ఇలా చెప్తుంది, "భూమి యందంతట అవిశ్వాసము ఉంది." కాని ఈ భాగములో యేసు ఆ విషయము చెప్పడం లేదు. ఆయన చివరి దినాలలో ఉండే స్వధర్మమును గూర్చి మాట్లాడడం లేదు, లేక ఆయన తిరిగి వచ్చునప్పుడు నిజ క్రైస్తవులు ఉంటారా అని అడగడం లేదు. వాస్తవానికి, యేసు పేతురు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పాడు,

"ఈ బండ మీద నా సంఘమును కట్టుదును; పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువమని నేను నీతో చెప్పుచున్నాను" (మత్తయి 16:18).

మత్తయి 16:18 మనకు ఏమి చూపిస్తుందంటే, ఈ గొప్ప స్వధర్మము ఎంత లోతుగా ఎంత భయంకరముగా ఉన్నప్పటికినీ, క్రీస్తు వచ్చునప్పుడు ఇంకా చాలామంది క్రైస్తవులు రక్షించు విశ్వాసము నందు జీవిస్తూ ఉంటారు. చాలామంది నిజ క్రైస్తవులు పైకెత్త బడతారు, ముఖ్యముగా చైనా మూడవ ప్రపంచ దేశాల నుండి, ఇక్కడ ఈనాడు నిజమైన ఉజ్జీవము ఉంది.

"ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపో బడుదుము: కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (I దెస్సలోనీకయులకు 4:16-17).

గొప్ప శ్రమల కాలములో కూడ గొప్ప సమూహాలు రక్షింప బడుదురు.

"ఎవడును లెక్కింపజాలని, ఒక గొప్ప సమూహము, కనబడెను" (ప్రకటన 7:9).

"వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, వాటిని తెలుపు చేసుకొనిరి" (ప్రకటన 7:14).

అలా, ఆయన రాకడలో విశ్వాసము లేని స్థితిని గూర్చి యేసు మాట్లాడడం లేదు, ఆయన అలా చెప్పాడు,

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?" (లూకా 18:8).

I. మొదటిది, పట్టుదలతో కూడిన ప్రార్ధన యొక్క ప్రాముఖ్యత.

చాలా వ్యాఖ్యానాలు తప్పు, కాని డాక్టర్ లిన్ మన పాఠ్యభాగమును గూర్చిన సరియైన అనువాదము ఇచ్చాడు. డాక్టర్ లిన్ అన్నాడు,

"విశ్వాసము" అనే పదము బైబిలులో విరివిగా వాడబడింది. సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మాత్రమే దాని సరియైన అర్ధాన్ని నిర్వచింప వచ్చును. ఈ వచనానికి ముందు ఒక ఉపమానము ఉంది, అది మనము అన్ని వేళలలో విసుగక ప్రార్ధన చెయ్యాలని చెప్తుంది [లూకా 18:1-8ఎ], కాని తరువాత పాఠ్యభాగము [లూకా 18:9-14] ఇది ఒక పరిశయ్యడు సుంకము వసూలు చేయువాని ప్రార్ధనలను గూర్చిన ఉపమానము. ఇలా, ఈ వచనము సందర్భము [లూకా 18:8] తేటగా సూచిస్తుంది "విశ్వాసము" అనే పదము విశ్వాసముతో కూడిన ప్రార్ధనను చూచిస్తుంది. ప్రభువు యొక్క ప్రకటన ఏంటంటే ఆయన రెండవ రాకడ సమయంలో ఆయన సంఘము విశ్వాసపు ప్రార్ధన కోల్పోతుందనే విలాపముతో కూడినది (Timothy Lin, Ph.D., The Secret of Church Growth, First Chinese Baptist Church of Los Angeles, 1992, pp. 94-95).

లూకా 18:1-8 లో ఉన్న ఉపమానము క్రైస్తవులు విసుగక నిత్యము ప్రార్ధన చేస్తూ ఉండాలని చెప్తుందని డాక్టర్ లిన్ అన్నాడు. ఎనిమిదవ వచనము చూపిస్తుంది క్రైస్తవులు చివరి దినాలలో, మనం జీవిస్తున్న దినాలలో పట్టుదలతో కూడిన ప్రార్ధన కలిగి ఉండరని చెప్తుంది. కాబట్టి ఇలా చెప్పడం ద్వారా పాఠ్యభాగముపై ఇలా వ్యాఖ్యానించవచ్చు,

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి [ప్రార్ధనల వలన] మీద విశ్వాసము కనుగొనునా?"
     (లూకా 18:1, 8).

డాక్టర్ లిన్ ఇంకా ఇలా చెప్పాడు,

ఈనాడు చాలా సంఘాలలోని ప్రార్ధనా కూటాలు నిర్మానుష్యమయిపోయాయి [లేక ఒకటి రెండు ప్రార్ధనలు కలిగిన వారపు మధ్య, బైబిలు ధ్యాన దినాలుగా మారిపోయాయి]. అలాంటి విచార పరిస్థితిని ఎదుర్కొంటూ, చాలా సంఘాలు ప్రాముఖ్యమైన హెచ్చరికను నిర్లక్ష్య పెట్టి స్వాను గ్రహములో మునిగిపోతు ఉన్నారు, [తరుచు] వారి ప్రార్ధనా కూటాలను రద్దు చేస్తున్నారు. ప్రభువు రెండవ రాకడ సమీపంగా ఉందనడానికి అది నిజంగా [ఒక] సూచన! ఈ రోజులలో, చాలామంది [సంఘ సభ్యులు] వారి ప్రభువు కంటే టెలివిజన్ లను ఎక్కువగా ఆరాధిస్తున్నారు...ఇది నిజంగా విచారము!...చివరి దినాలలో సంఘాలు సానుభూతిని ప్రదర్శిస్తాయి... [ఆసక్తి లేని స్థితి] ప్రార్ధనా కూటముల పట్ల (Timothy Lin, Ph.D., ibid., p. 95).

ఆ విధంగా లూకా 18:8 క్రీస్తు రెండవ రాకడ ముందు ప్రార్ధన లేని స్థితి అనే సూచనను చూపిస్తుంది, మనం జీవిస్తున్న ఈ దినాలు, ప్రార్ధన లేని స్థితి, రక్షించే విశ్వాసము లేని స్థితి. మనం చివరి దినాలలో జీవిస్తున్నామని, ప్రభువు రెండవ రాకడ ముందు అనే స్థితిని సంఘాలలో ప్రార్ధన లేని స్థితి తెలియ చేస్తుంది.

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద [ప్రార్ధన వలన] విశ్వాసము కనుగొనునా?" (లూకా 18:8).

II. రెండవది, ప్రార్ధనా కూటముల యొక్క ప్రాముఖ్యత.

ప్రార్ధనా కూటాలలో, సమైక్య ప్రార్ధనలో ఉన్న అధికారము శక్తి వ్యక్తిగత ప్రార్ధనలో ఉండదని డాక్టర్ లిన్ చెప్పాడు. అతనన్నాడు,

మీరు వ్యక్తిగతంగా ప్రార్ధించినా గుంపులో ప్రార్ధించినా, ఇంటిలో ఒంటరిగా ప్రార్ధించినా సంఘములో సహోదరీ సహోదరులతో కలిసి ప్రార్ధించినా తేడా ఏమి లేదని ప్రజలు తరచూ చెప్తుంటారు. ప్రార్ధనా శక్తిని నిర్లక్ష్యము చేసే, సోమరి చెప్పే ప్రకటన అది! ఈ ప్రార్ధనా అంశమును గూర్చి మన ప్రభువు ఏమి చెప్తున్నదో చూడండి:

"మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను, దేనిని గూర్చి యైనను [సంఘములో] భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోక మందున్న, నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నానామమున ఎక్కడ కూడుకుందురో, అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పెను" (మత్తయి 18:19-20).

     ఒక వ్యక్తి ప్రయత్నమూ వలన కాక, సంఘమంతటి [యొక్క] సమిష్టి ప్రయత్నమూ ద్వారా దైవిక అధికారము సాధించవచ్చని మన ప్రభువు గుర్తు చేసాడు. ఇంకొక మాటలలో, సంఘమంతా... ఒక స్వరముతో [ప్రార్ధిస్తే] ఆ దైవిక అధికారము... సంఘము తప్పక [పొందుకుంటుంది].
     చివరి దినాలలో, ఉన్న సంఘము, సత్యములోని వాస్తవికతను చూడలేదు, దేవుని శక్తిని [పొందుకునే] పద్ధతిని జ్ఞాపకముంచుకోదు. ఎంత గొప్ప నష్టము! [సంఘము] ఆకాశము నుండి దైవిక అధికారము పొందుకుంటుంది, పరిపాలనా దక్షత వలన కాదు, అయినను సాతాను శక్తిని బందించాలను కుంటుంది, నలిగిన వారిని విడిపించాలని, దేవుని సన్నిధి వాస్తవికతను అనుభావించాలనుకుంటుంది. అయ్యో, అది జరగదు! (Timothy Lin, Ph.D., ibid., pp. 92-93).

కనుక, డాక్టర్ లిన్ విశ్వాసపు ప్రార్ధన ప్రాముఖ్యత, సంఘము యొక్క ప్రార్ధనా కూటముల ప్రాముఖ్యతను గూర్చి నేర్పించాడు.

III. మూడవది, "ఒక ఒప్పందము"తో ప్రార్ధించుట యొక్క ప్రాముఖ్యత.

దయచేసి అపోస్తలుల కార్యములు 1:14 తెరచి, గట్టిగా చదవండి.

"వీరందరును వీరితో కూడ, కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియము, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్ధన చేయుచుండిరి" (అపోస్తలుల కార్యములు 1:14).

"ఇవన్నియు ఏక మనస్సుతో కూడిన ప్రార్ధనా విజ్ఞాపనతో కొనసాగాయి…". డాక్టర్ లిన్ అన్నాడు,

"ఏక మనస్సు" అనే పదాన్ని చైనీయ బైబిలు "ఏక హృదయముతోను ఏక ఆత్మతోను" అని అనువదిస్తుంది. కాబట్టి, ఒక ప్రార్ధనా కూటములో దేవుని సన్నిధి ఉండాలనే, ప్రార్ధనా వాస్తవికత ప్రాముఖ్యతను పాల్గొను వారు అర్ధం చేసుకోవడం మాత్రమే కాకుండా, వారు [ప్రార్ధనా కూటాలకు] ఒక యదార్ధ కోరికతో రావాలి...ఏక మనస్సుతో విజ్ఞాపనలు, ప్రార్ధనలు, కృతజ్ఞతలు దేవునికి అర్పించడానికి. అప్పుడు ప్రార్ధనా కూటములు విజయవంత మవుతాయి మిగిలిన పరిచర్యలు విజయ వంతమవుతాయి (Timothy Lin, Ph.D., ibid., pp. 93-94).

ఒక సహోదరుడు ప్రార్ధనలో నడిపిస్తున్నప్పుడు, "ఏక మనస్సుతో ప్రార్ధించడానికి" మనమందరము "ఆమెన్" చెప్పాలి. మనము "ఆమెన్" చెప్తే మనము "ఏకమనస్సుతో" ప్రార్ధన చేస్తున్నట్టు.

విశ్వాసము ప్రార్ధించుటలోని ప్రాముఖ్యత, సంఘ ప్రార్ధనా కూటముల యొక్క ప్రాముఖ్యత, ఐకమత్యము యొక్క ప్రాముఖ్యత, "ఏక మనస్సుతో ప్రార్ధించుట" వీటిపై డాక్టర్ బోధించినవి మీరు విన్నారు. అయినను ఈ రాత్రి మీలో కొందరు మన ప్రార్ధనా కూటాలకు హాజరు కావడం లేదు. మీ ఆత్మీయ జీవితమూ నిస్సారంగా ఉండడంలో ఆశ్చర్యము లేదు! ఈ రాత్రి ఎవరైనా ఇలా చెప్తారా, "పాస్టరు గారు, ఇప్పటి నుండి కనీసం ఒక ప్రార్ధనా కూటానికైనా హాజరు అవుతాను అని అంటారా"? దయచేసి కళ్ళు మూసుకోండి. మీరలా చేస్తే, మీ చెయ్యి ఎత్తండి. వారు వారి వాగ్ధానము నిలబెట్టుకోనునట్లు ప్రతి ఒక్కరు వారి కొరకు ప్రార్ధించండి! (అందరు ప్రార్ధించండి).

మీరు ఇంకను మారకపోతే, కనీసం శనివారం సాయంత్రము ప్రార్ధనా కూటానికైనా హాజరు కావాలని నేను బ్రతిమాలుచున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు చెప్తారు, "అవును, పాస్టరు గారు, నేను ప్రతి శనివారము సాయంకాలము ప్రార్ధనా కూటానికి రావడం ప్రారంభిస్తాను"? దయచేసి మీ చెయ్యి ఎత్తండి. వారి వాగ్ధానము నిలుపునట్లు ప్రతి ఒక్కరు వారి కొరకు ప్రార్ధించండి! (అందరు ప్రార్ధించండి).

క్రీస్తు మీ పాపముల నిమిత్తము సిలువపై మరణించాడు. మీ పాపాలు కడిగి వేయడానికి ఆయన తన ప్రశస్త రక్తము కార్చాడు. మీ పాపముల నిమిత్తము, ఆయన భయంకరమైన వేదన ద్వారా వెళ్లి, సిలువ వేయబడ్డాడు. మూడవ దినమున మృతులలో నుండి లేచాడు. దేవుని కుడి పార్శ్వాన ఆయన జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నొద్దకు వచ్చినట్లయితే మీ పాపముల నుండి రక్షింప బడతారు.

ఈ రాత్రి మీలో ఇంకా ఎవరు రక్షింప బడలేదు మీ మార్పు కొరకు మేము ప్రార్ధించాలను కుంటున్నారా? మళ్ళీ కళ్ళు మూసుకోండి. దయచేసి చెయ్యి ఎత్తండి మీ మార్పు కొరకు ప్రార్ధిస్తాం. వారి పాపాలు ఒప్పుకొని క్రీస్తు నొద్దకు వచ్చి, ఆయన రక్తములో కడుగ బడునట్లు అందరూ వారి నిమిత్తము ప్రార్ధించండి!

డాక్టర్ చాన్, ఈ రాత్రి కొందరు రక్షింపబడునట్లు ప్రార్ధనలో దయచేసి నడిపించండి. నిజ క్రైస్తవుడవాలని, ఆ విషయము మాతో మాట్లాడాలనుకుంటే దయచేసి డాక్టర్ కాగన్, జాన్ కాగన్ మరియు నోవాసాంగ్ లను వెంబడించి ఆవరణము వెనుకకు ఇప్పుడే వెళ్ళండి. ఒక ప్రశాంత స్థలానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడి మీ మార్పు నిమిత్తము ప్రార్దిస్తాము.

వికిపీడియాపై డాక్టర్ లిన్ స్వీయ చరిత్ర చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ప్రార్ధన యొక్క దీవించబడిన గంట" (ఫన్నీ జే. క్రాస్ బై, 1820-1915).
“Tis the Blessed Hour of Prayer” (by Fanny J. Crosby, 1820-1915).



ద అవుట్ లైన్ ఆఫ్

ఎలా ప్రార్ధించాలి ఒక ప్రార్ధనా కూటమును ఎలా జరిగించాలి

(డాక్టర్ తిమోతి లిన్ గారి బోధలు, 1911-2009)
HOW TO PRAY AND HOW TO CONDUCT A PRAYER MEETING
(THE TEACHINGS OF DR. TIMOTHY LIN, 1911-2009)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే వ్రాయబడిన
జాన్ సామ్యూల్ కాగన్ చే బోధింపబడిన ప్రసంగము
A sermon written by Dr. R. L. Hymers, Jr.
and preached by Mr. John Samuel Cagan

"అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?" (లూకా 18:8).

(మత్తయి 16:18; I దెస్సలోనీకయులకు 4:16-17; ప్రకటన 7:9, 14)

I.    మొదటిది, పట్టుదలతో కూడిన ప్రార్ధన యొక్క ప్రాముఖ్యత, లూకా 18:8.

II.   రెండవది, ప్రార్ధనా కూటముల యొక్క ప్రాముఖ్యత, మత్తయి 18:19-20.

III.  మూడవది, "ఒక ఒప్పందము"తో ప్రార్ధించుట యొక్క ప్రాముఖ్యత,
అపోస్తలుల కార్యములు 1:14.