ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కొత్తగా మారిన వారి కొరకు ఏడు విషయాలుSEVEN POINTS FOR NEW CONVERTS డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారము సాయంకాలము, అక్టోబర్ 7, 2017 "శిష్యుల మనస్సులను [దృఢపరచి] విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి, మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెననియు వారిని హెచ్చరించిరి" (అపోస్తలుల కార్యములు 14:22). |
ఈ వచనము గూర్చి అన్వయింపు నూతన నిబంధన వ్యాఖ్యానము ఇలా చెప్తుంది, ఒక్కసారి ఒక్క స్థలములో సువార్త ప్రకటిస్తే సరిపోదు. నూతన విశ్వాసులకు బోధించడం విశ్వాసములో వారిని స్థిర పరచడం కూడ అవసరము. ఇదే పౌలు మరియు బర్నాబాలు చేసారు. నూతన విశ్వాసులను హెచ్చరించారు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి చాలా శ్రమలను భరించాలని [ఒత్తిడులు, శ్రమలు]. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "మన శ్రమ [సహించిన యెడల], ఆయనతో కూడ ఏలుదుము" (II తిమోతి 2:12). దీని అర్ధము నిజంగా సమర్పించుకున్న క్రైస్తవుడు ఆయన రాజ్యములో క్రీస్తుతో కూడ పరిపాలించడానికి క్రైస్తవ జీవితంలోని ఒత్తిడులను సహించాలి. "మంచి సైనికుని వలే, నాతో కూడ శ్రమను అనుభవించుము" (II తిమోతి 2:3). I. మొదటిది, మీరు కొంత శ్రమను అనుభవించాలి. అది మీరు తెలుసుకోవలసిన మొదటి విషయము. పరలోకానికి వెళ్ళడానికి రక్షింప బడితే సరిపోదు. రక్షింపబడిన తరువాత, "క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలే, కష్టములను భరించాలి...మనము శ్రమపడిన యెడల, ఆయనతో పాటు ఏలుదుము" (II తిమోతి 2:3, 12). చైనీయ గుడికి వెళ్లకముందు ఇది నాకు బోధింప లేదు. నేననుకున్నాను నీవు క్రీస్తును నమ్మావు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతావు. డాక్టర్ తిమోతి లిన్ నాకు బోధించాడు ఆయన రాజ్యములో క్రీస్తుతో పాటు ఏలడానికి నేను ఒక జయించే క్రైస్తవునిగా ఉండాలి, "నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు, అంతము వరకు, నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి జనుల మీద అధికారము ఇచ్చెదను" (ప్రకటన 2:26). ముస్లీము ప్రపంచములో చైనాలో ఉన్న క్రైస్తవులకు తెలుసు వారు ఆయన రాజ్యములో క్రీస్తుతో కూడ ఏలడానికి వారు కష్టాల ద్వారా వెళ్ళాలి. మన ప్రారంభపు పాఠ్యభాగము చెప్పుతున్నట్టు, "మన శ్రమలను సహించడం ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశము పొందుదుము" (అపోస్తలుల కార్యములు 14:22). అపోస్తలుడైన పౌలు నూతన క్రైస్తవులకు బోధించాడు వారు చాలా శ్రమల గుండా వెళ్ళాలని (కష్టము – ఒత్తిడులు) ఆయన రాబోవు రాజ్యములో క్రీస్తుతో కూడ పరిపాలించడానికి. ఈ ఉజ్జీవములో మీరు మార్పు నొందితే మీరు కూడ అదే చెయ్యాలి. డాక్టర్ వాట్స్ ప్రసిద్ధ గానములో మూడు వందల సంవత్సరాలుగా మన పాటలలో అదే నేర్పుచున్నాడు! పూలపాన్పు మీద ఆకాశములలో నేను మోసికొని పోబడాలి, II. రెండవది, మీకు బైబిలు ఉండాలి మీరు దానిని చదవాలి. "దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైయున్నది: దైవజనుడు సన్నద్ధుడై, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధ పడినట్లు ఉండును" (II తిమోతి 3:16, 17). స్కోఫీల్డ్ పఠన బైబిలు కొనుక్కోవాలి మేము పేజీ సంఖ్య చెప్పినప్పుడు మీరు తీయవచ్చు. మీరు ఈ ప్రసంగ ప్రతులను ఇంటికి తీసుకొని వెళ్లి వారమంతా వాటిని పాటించాలి. రేడియో లేక టివి ప్రసంగీకుల బోధలు వినవద్దు. వారిలో చాలామంది అబద్ధపు బోధకులు. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ తప్ప ఎవ్వరివి వినవద్దు. అతని అనుదిన బైబిలు పఠనాలు కంప్యూటర్ లో పగలు గాని రాత్రి గాని ఎప్పుడైనా www.ttb.org or www.thrutheBible.org ద్వారా వినవచ్చు. డాక్టర్ మెక్ గీ డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్, 550 సౌత్ హాప్ వీధిలో, ఉన్న ఓపెన్ డోర్ సంఘమునకు చాలాకాలముగా సంఘ కాపరి. ప్రతిరోజు ఆయనను వినడం ద్వారా నేను బైబిలు నేర్చుకున్నాను. ఆయన ఈనాటి పొరపాట్లు వైవిధ్యాలను దూరము చేస్తాడు. రేడియో టెలివిజన్ లో నేను నమ్మే ఒకే ఒక బోధకుడు ఆయనే – ఒకే ఒక్కడు. రేడియోలలో డాక్టర్ మెక్ గీ ముందు తరువాత వచ్చే వారివి విని కొంతమంది చిందర వందర అయిపోయారు. అందుకే కంప్యూటర్ల ద్వారా ఆయనది వినడం శ్రేయస్కరము (all non-English language translations can be found at www.ttb.org/global-reach/regions-languages). బైబిలు ప్రతిరోజూ చదవండి. "నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని యున్నాను" (కీర్తనలు 119:11). III. మూడవది, సెలవులో ఉన్నప్పుడు తప్ప వేరే సంఘములకు వెళ్ళవద్దు. సంఘాలలో లోతైన స్వధర్మము ఉన్న దినాలలో మనము జీవిస్తున్నాము. వాటి నుండి దూరముగా ఉండండి. "అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి, పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:11, 12). వేరే సంఘాలు మేము సిఫారసు చెయ్యలేము. బాప్టిస్టు సంఘాలు కూడ తరుచు "నిర్ణయత్వము" మరియు ఇతర వైవిధ్యాలను ప్రోత్సాహిస్తాయి. IV. నాల్గవది, ప్రతి ఆదివారము ఉదయము సాయంకాలము ఈ గుడికి హాజరు అవండి. మరియు మీ గురువారము రాత్రి ప్రార్ధనా కూటము మరియు ప్రతివారము సువార్త పనికి హాజరు అవండి. V. ఐదవది, సంఘ కాపరి సహాయక సంఘ కాపరులను గూర్చి తెలుసుకోండి. మీరు డాక్టర్ హైమర్స్ కు ఫోను చేసి ఎప్పుడైనా ప్రశ్నలు అడగవచ్చు – లేక ఇక్కడ గుడిలో ఆయనను చూడవచ్చు. "మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచు కొనుము: వారి విశ్వాసమును, అనుసరించుడి" (హెబ్రీయులకు 13:7). "మీ పైన నాయకులుగా ఉన్నవారు, లెక్క ఒప్పచెప్ప వలసినఉన్నది: వారి వలే మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాటవినండి: వారికి లోబడి యుండిడి" (హెబ్రీయులకు 13:17). పదాలు "అధికారము చేయువారు" ని "మీ నాయకులు" గా అనువదింపవచ్చు. సంస్కరణ పఠన బైబిలు హెబ్రీయులకు 13:17 ను గూర్చి ఇలా చెప్తుంది, "నమ్మకస్తులైన సంఘ నాయకులు నమ్మకస్తులైన కాపరులు...నాయకులు (సంఘకాపరులు) యొక్క శ్రద్ధ లోతైనది యదార్ధమైనది ఎందుకంటే వారు దేవునిచే నియమింపబడిన వారు వారు దేవునికి లెక్క అప్పగిస్తారు. వారి పరిచర్య తిరస్కరింపబడితే ప్రతి ఒక్కరు కష్ట పడతారు." సంఘకాపరి డాక్టర్ హైమర్స్. మీరు ఆయనకు ఫోను నంబర్ (818) 352-0452 ద్వారా చెయ్యవచ్చు. సహాయక సంఘ కాపరి డాక్టర్ కాగన్. మీరు ఆయనకు ఫోను నంబర్ (323) 735-3320 ద్వారా చెయ్యవచ్చు. VI. ఆరవది, మీ జీవితంలో ఆత్మల సంపాదనను బలమైన ప్రాధాన్యతగా చేసుకోవాలి. సువార్త వినడానికి ఇతరులను తీసుకొని రావడం విషయంలో కష్టపడకుండా ఉంటే ఒక వ్యక్తి మంచి క్రైస్తవుడు కాలేడు. యేసు చెప్పాడు, "నా ఇళ్ళు నిండునట్లు లోపలికి వచ్చుటకు, అక్కడ వారిని బలవంతము చేయుము" (లూకా 14:23). VII. ఏడవది, చిన్న ప్రార్ధనా గుంపులలోనికి చేరండి. మీకు శ్రేష్టమైనది కనుగొనడానికి శ్రీమతి హైమర్స్ ను గాని డాక్టర్ కాగన్ కాని సహాయము కొరకు అడగండి. ప్రతివారము మీ ప్రార్ధనా గుంపుతో కలుసుకోండి. "ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో, అక్కడ నేను వారి మధ్యను ఉండేదను" (మత్తయి 18:20). మీరు ఇంకా రక్షింపబడకపోతే, మీరు పశ్చాత్తాప పడి యేసు క్రీస్తును నమ్మాలని బతిమాలుచున్నాము. మీరు పశ్చాత్తాప పడి ఆయన యందు విశ్వాసముంచితే, ఆయన రక్తము మీ ప్రతి పాపమును కడిగివేయును. "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). మీరు రక్షింపబడ్డారు అనుకుంటే మీరు డాక్టర్ కాగన్ ను కలిసి మీ సాక్ష్యము ఆయనకు వినిపించండి. ఆయన ఫోను నంబరు (323) 735-3320. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ కొత్తగా మారిన వారి కొరకు ఏడు విషయాలు SEVEN POINTS FOR NEW CONVERTS డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే "శిష్యుల మనస్సులను [దృఢపరచి] విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి, మనము దేవుని రాజ్యములో ప్రవేశింప వలెననియు వారిని హెచ్చరించిరి" (అపోస్తలుల కార్యములు 14:22). (II తిమోతి 2:12, 3) I. మొదటిది, మీరు కొంత శ్రమను అనుభవించాలి, II తిమోతి 2:3, 12; ప్రకటన 2:26. II. రెండవది, మీకు బైబిలు ఉండాలి మీరు దానిని చదవాలి, II తిమోతి 3:16, 17; కీర్తనలు 119:11.
III. మూడవది, సెలవులో ఉన్నప్పుడు తప్ప వేరే సంఘములకు వెళ్ళవద్దు,
IV. నాల్గవది, ప్రతి ఆదివారము ఉదయము సాయంకాలము ఈ గుడికి హాజరు అవండి. మరియు మీ గురువారము రాత్రి ప్రార్ధనా కూటము మరియు ప్రతివారము సువార్త పనికి హాజరు అవండి. V. ఐదవది, సంఘ కాపరి సహాయక సంఘ కాపరులను గూర్చి తెలుసుకోండి, హెబ్రీయులకు 13:7, 17. VI. ఆరవది, మీ జీవితంలో ఆత్మల సంపాదనను బలమైన ప్రాధాన్యతగా చేసుకోవాలి, లూకా 14:23. VII. ఏడవది, చిన్న ప్రార్ధనా గుంపులలోనికి చేరండి, మత్తయి 18:20; I యోహాను 1:7. |