ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవము ఎంపిక కాదు!REVIVAL IS NO OPTION! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 1, 2017 "అయినను మొదట నీకుండిన ప్రేమను, నీవు వదిలితివని. నేను నీ మీద తప్ప ఒకటి మొప వలసియున్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము; లేని యెడల, నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్థంభమును, దాని చోట నుండి తీసివేతును" (ప్రకటన 2:4, 5). |
ఎఫెస్సులోని సంఘము గొప్ప సంఘము. అది మంచి సంఘము. అబద్ధపు సిద్ధాంతాలను అసహ్యించుకొనే ప్రాధమిక సంఘమది. కాని వానిలో ఒక లోపముంది. ఈ సంఘమునకు ఆత్మ సంతృప్తి ఉంది. భవనము కొనబడింది. ప్రజలు డబ్బున్న వారు. వారికి విస్తారంగా డబ్బు ఉంది. వారికి కొదువ ఏమి లేదు. కాని క్రీస్తు అన్నాడు వారిపై ఒక నేరము మోపవలసియున్నది అని. వారి మొదటి ప్రేమను విడిచి పెట్టారు. వారిని పశ్చాత్తాప పడమని చెప్పాడు. వారిని పిలిచి వెళ్లి సంవత్సరాల తరబడి వారు కోల్పోయిన ప్రేమను ఉత్సాహమును కనుగొనమని చెప్పాడు. వారు తిరస్కరిస్తే, రాబోవు తీర్పును గూర్చి వారిని హెచ్చరించాడు. సంఘము ఒక దీప స్తంభము వలే ఉంది. అది చీకటి ప్రపంచములో వెలుగు కలిగిస్తుంది. అయినను, ఆ సంఘము పశ్చాత్తాప పడకపోతే, క్రీస్తు చెప్పాడు, "నేను నీ యొద్దకు త్వరగా వచ్చి, నీ దీప స్థంభమును దాని చోట నుండి తీసివేతును, పశ్చాత్తాప పడకపోతే." తరువాత క్రీస్తు చెప్పాడు, "సంఘములతో ఆత్మ చెప్పుచున్నది, చెవి గలవాడు వినును గాక" (ప్రకటన 2:7). కాని సంఘము పశ్చాత్తాప పడలేదు రక్షింపబడడానికి తగినంత ఉజ్జీవమును అనుభవించలేదు. ఈ గొప్ప సంఘము రోమా సైన్యముచే నాశనము చేయబడినది, మొదటి శతాభ్దపు ఆరంభములో చక్రవర్తి డొమిషియన్ క్రింద. ఇంకొక సంఘము నిర్మింపబడింది కాని చివరకు పట్టణమంతా ముస్లీముల చేత నాశనము చేయబడినది. అది మన సంఘమునకు అన్వయించనా? ప్రారంభపు దినములలో, ఎఫెస్సులోని సంఘము జీవముతో క్రైస్తవ ప్రేమతో నింపబడింది. అది ప్రేమించే ఉజ్జీవింపబడిన సంఘము. అది మన సంఘము వలే ఉండేది. మనకు సంఘ చీలిక ఏర్పడింది. కాని అంకితము సమర్పణల విషయంలో ఎప్పుడు చీలికలు ఉండేవి. విడిచి వెళ్ళిపోయిన వారు తీవ్రమైన క్రైస్తవులుగా ఉండ ఇష్టపడలేదు గనుక విడిచి వెళ్ళిపోయారు. క్రీస్తును ప్రేమించమని చెప్పిన ప్రతిసారి, ఈ గుంపులు వెళ్ళిపోయే వారు. నేను తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నానని వారు ఎప్పుడు వెళ్ళిపోలేదు. ఉజ్జీవము కావాలని ఆశ లేదు కాబట్టి వారు ఎప్పుడు విడిచి వెళ్ళిపోయేవారు. వారికి యేసు శిష్యులుగా ఉండడం ఇష్టం లేదు. రిచార్డ్ ఒలివాస్ భయంకర చీలికకు కారకుడయ్యాడు. గొప్ప ఆజ్ఞ కేవలము అపోస్తలుకే అని అతడు చెప్పాడు, మిగిలిన వారెవ్వరూ ఆత్మలు సంపాదించవలసిన అవసరము లేదు అని చెప్పాడు. ఇది అతని మొదటి ఫిర్యాదు. అతడు వాస్తవానికి యేసు పలుకులను అసహ్యించుకున్నాడు, "దేవుని రాజ్యమును నీతిని, మొదట వెదకుడు" (మత్తయి 6:33). దేవుని రాజ్యమునకు బదులు విజయము డబ్బు వెదకమని అతడు ప్రజలకు చెప్పాడు. ఆత్మల సంపాదన కొరకు ప్రార్ధన నిమిత్తము వారి జీవితాలను వ్యయము చేయాలని నేను ప్రజలకు భోధించే వాడిని. మూడు వందల మంది అతనిని వెంబడించారు. 15 మంది మాత్రమూ ఉండిపోయారు. మన ప్రజలు క్రీస్తును కేంద్ర బిందువుగా పెట్టుకొని అతని వారి కంటే ఎక్కువ మంది అయిపోయారు! ఎక్కువ మంది! మన పిల్లలంతా కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. మన సంఘములో మొదటి నుండి ఉండేవారు గృహములను నివాసములను కలిగియున్నారు. అతని జనులు నాలుగు ప్రక్కలా చెదిరిపోయారు. మనకు చాలా తక్కువ విడాకులు ఉండేవి. అతని జనులు విడాకుల కొరకు కనిపెట్టేవారు! కాబట్టి ఎవరు మంచిగా మారారు? నిజమే, భవనానికి కట్టడానికి మనము కష్టపడ్డాము. కాని ఇది యేసు యొక్క బలమైన శిష్యులముగా మారడానికి సహాయ పడింది. అతని చిన్న గుంపు బలహీనమైన కొంత సువార్తికులుగా మారింది. మనము యేసు నిమిత్తము కొంత శ్రమ పడ్డాము కాని మనము ఆశీర్వదింపబడ్డాము. వారైతే లోకము వైపు డబ్బు వైపు పరుగెత్తి సాతానుచే నాశనము చేయబడ్డారు! యేసు చెప్పాడు, "మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు" (మత్తయి 6:24). ప్రభువు ఒప్పు వారిది తప్పు! "నేను యేసును వెంబడింప నిర్ణయించుకున్నాను." లేచి పాడండి! నేను యేసును వెంబడింప నిర్ణయించుకున్నాను; ఆమెన్! మీరు కూర్చోండి. కాని ఎఫెస్సులోని సంఘమునకు బహుచెడ్డది సంభవించింది. వారితో యేసు చెప్పాడు, "అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోప వలసియున్నది" (ప్రకటన 2:4). మొదటి ప్రేమ నుండి వారు "పడిపోయారు" అని ఆయన అనడం లేదు. మొదటి ప్రేమను వారు "విడిచి పెట్టారని" ఆయన వారికి చెప్పుచున్నాడు. "అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోప వలసియున్నది" (ప్రకటన 2:4). డాక్టర్ జాన్ ఎఫ్. వాల్ ఊర్డ్ కారణము చెప్పాడు. అతనన్నాడు, "ఎఫెస్సులోని సంఘము రెండవ తరము క్రైస్తవులతో నిండియున్నది." నేనింకా ఎక్కువ చెప్పాలా? "సంఘము ఇప్పుడు తన రెండవ తరములో ఉన్నది." అది అంతా తెలియచేస్తుంది! తరువాత డాక్టర్ వాల్ ఊర్డ్ అన్నాడు, "మొదటి తరములో ఇమిడి యున్న దేవుని ప్రేమ మాయమయి పోయింది" (John F. Walvoord, Th.D., The Revelation of Jesus Christ, Moody Press, 1973, p. 56). యవనులారా, మీరు మన సంఘపు రెండవ తరము! ఈ సంఘ భవనమును రక్షించిన "39 మంది" నుండి మీరు రాలేదు. వారు మొదటి తరము, మీరు కాదు! డాక్టర్ చాన్ చెప్పాడు ఎలా మొదటి తరము వారు, "39మంది," క్రీస్తును ప్రేమించి సేవించారో. అతడు యువకునిగా మన సంఘములోనికి వచ్చాడు. అతనన్నాడు, నేను క్రీస్తును నమ్మినప్పుడు నా జీవితమూ నిత్యత్వములో మారిపోయింది, నా పాపము ఆయన రక్తము ద్వారా కడుగబడింది, సంఘము ఇప్పుడు నా రెండవ ఇళ్ళు! నేను వెంటనే క్రీస్తు కొరకు పని చేయుటకు నా జీవితాన్ని ఇచ్చాను. డాక్టర్ హైమర్స్ పదే పదే బోధించారు క్రీస్తు శిష్యునిగా ఉండడంను గూర్చి, [క్రీస్తును] సంఘమును మొదటిగా ఉంచి, తన్నుతాను ఉపేక్షించుకొని, ఆత్మలను సంపాదించాలి. ఆయన "అవధులు లేకపోవుట"కు వ్యతిరేకంగా బోధించారు – అనగా న్యాయము లేని "క్రైసవునిగా" ఉండడం. ఆయన బోధించినది నిజమని నాకు తెలుసు. అది నా కొరకు!... మేము కలిసి ప్రార్ధించి పాటలు పాడుకున్నాము. ఈ సందర్భాలు నాకు బాగా జ్ఞాపకము ఉన్నాయి. వారములో చాలాసార్లు సువార్త ప్రకటించే వారము. ఆవరణమంతా ప్రజలతో నింపేవారము. నేను జూడీ కాగన్, మెలిస్సా సాండర్స్, విన్నీ యాంగ్ ను తీసుకొచ్చాను, విన్నీ నా భార్య అయింది. యుసిఎల్ఏ (ULCA) కాంపస్ లో సువార్త ద్వారా వారిని తీసుకొని రావడానికి దేవుడు నాకు సహాయము చేసాడు... హైమర్స్ భార్య [ఒక యువతిగా] తన జీవితాన్ని సంఘ పరిచర్యలో పెట్టి ఏమి వెనుకకు ఆశించలేదు. మేమిద్దరము యువకులుగా ఉన్నప్పుడు ఆమె మొదటిసారిగా మా గుడిలోనికి వచ్చింది. ఆమె క్రీస్తు పట్ల గొప్ప ప్రేమ కలిగి, నశించు ఆత్మలను సంపాదించడంలో తపన కలిగి యుండేవారు... మా సంఘములో ఆమె ఇద్దరు మగవారి పని చేసేవారు, ఉన్నత పాఠశాలలో పట్ట భద్రురాలు కాకమునుపే... ఇప్పుడు ఆమె యవన చైనీయులతోను ఆసియా అమ్మాయిలతోను పూర్తిగా పనిచేస్తున్నారు... ఆమెలాంటి చాలా ఉదృతమైన వివిధ ఆచారాలు కలిగిన వారి మధ్య పనిచేసే మిస్సేనరీని ఎవరుని చూడలేదు (ప్రతికూలాలకు విరుద్ధంగా). ఇలియానా తరువాత రోగి అయ్యారు, కాని ఆమె ఎప్పుడు ప్రార్ధనా కూటాలు మానలేదు లేక బుధవారము గురువారము రాత్రులు ఫోను చేయడం – సువార్త వినడానికి నశించు వారిని గుడిలోనికి రప్పించడానికి. ఇంకొక గొప్ప స్త్రీ శ్రీమతి సాలాజార్. ఆమె మధర్ టెరిస్సా లాంటిది! ఆమె బాప్టిస్టు శుద్దురాలు! యవనులరా, ఎఫెస్సు వారి వలే రెండవ తరము వారిలా మన సంఘము తలదించుకునేలా చెయ్యవద్దు! మీరు మన సంఘ భవిష్యత్తు! దయచేసి – యేసు పట్ల మీ మొదటి ప్రేమను విడిచి పెట్టవద్దు! ఇప్పుడు, తరువాత, ప్రకటన 2:3 చూడండి. ఇది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1332 వ పేజీలో ఉంది. "నీవు సహనము కలిగి, నా నామము నిమిత్తము, భారము భరించి, అలయ లేదని నేనెరుగుదును" (ప్రకటన 2:3). ఆధునిక తర్జుమా ఇలా చెప్తుంది, "మీరు పట్టుదల కలిగి నా నామము నిమిత్తము కష్టాలు భరించి, అలిసిపోలేదు" (ఎన్ఐవి) (NIV). గమనించండి గతంలో వారు ఎలా ఉన్నారో తెలుస్తుంది – మీరు ఎలా భరించారో. మీరు కష్టములను సహించారు, మీరు అలసిపోలేదు. గతములో వారు ఉన్న విధానానికి అది వివరణము. డాక్టర్ వాల్ ఊర్డ్ అన్నాడు, "రెండవ తరపు క్రైస్తవులతో గుడి నిండి ఉంది... మొదటి తరమునకున్న దేవుని ప్రేమ కనబడడం లేదు. ఈ నిమ్మలత్వము... ఆత్మీయ సానుభూతికి ముంగుర్తు [ఉత్సాహము లేకపోవుట] ఇది ఆ ప్రముఖ [సంఘములో] క్రైస్తవ సాక్ష్యమును తరువాత తుడిచి పెడుతుంది. అలా సంఘ చరిత్రలో ఇది ఎప్పుడు ఉంటుంది: ఆత్మీయ ప్రేమ చల్లారడం, తరువాత దేవుని ప్రేమ బదులు లోకములోని వస్తువులపట్ల ప్రేమ కలిగి యుండడం...ఇది విశ్వాసము నుండి దూరమై సమగ్ర సాక్ష్యము కోల్పోవడానికి దారి తీస్తుంది" (వాల్ ఊర్డ్, ఐబిఐడి.). ఇది మన సంఘములో జరుగుతుందని నేను ఒప్పింపబడ్డాను. మన సంఘపు రెండవ తరము మన మొదటి తరము వారికంటే చల్లబడిపోయి ఉత్సాహము లేకుండా ఉన్నారు. డాక్టర్ చాన్, గ్రిఫిత్ గారు, డాక్టర్ జూడీ కాగన్, శ్రీమతి హైమర్స్ – వీరు ఆదిలో 1970 లో మన సంఘములోనికి వచ్చారు – వారు జీవము కలిగి, ఉత్సాహముతో నింపబడి, పూర్తి ప్రేమ కలిగి లోతైన సహవాసము కలిగి – క్రీస్తు పట్ల దృఢమైన సమర్పణ కలిగి ఉండేవారు. ఇంకొక మాటలలో, ఎఫెస్సు సంఘములో చాలామంది మొదటి తరము క్రైస్తవులు ఉండేవారు. కాని ఈ వేడిమి ఉత్సాహము చాలామంది సంఘ పిల్లలకు బదిలీ చేయబడలేదు – వీరు రెండవ తరములో ఎదిగారు. రెండవ తరము వారు జీవితమంతా ఎక్కడ ఉన్నారు. కదలికల ద్వారా వెళ్ళారు. వారు ప్రార్ధనా కూటాలకు వచ్చారు, కాని వారు ప్రార్ధించలేదు లేక ఉత్సాహము లేని పొడి ప్రార్ధనలు చేసారు. "దేవుని ప్రేమ మొదటి తరము వారిలో ఉండినది వీరు జీవితాలలో కనిపించడం లేదు." కేవలము జాన్ కాగన్ మాత్రము నిలబడి మొదటితరము వానిలా ఉన్నాడు. ఎందుకంటే జీవితాన్ని మార్చేసిన మార్పిడి పొందుకున్నాడు పాతతరము వారికున్న ప్రేమ ఉత్సాహము కలిగియున్నాడు. అతడు ఒక ఆటగాడిగా సహజ నాయకునిగా లేకపోతే, అతడు కూడ మిగిలిన పిల్లల వలే చల్లారిపోయేవాడు. అతని వయసులో ఉన్న కొందరు గుడి విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన వారు చల్లారి పోయారు. కొంతమంది ఇంకా అలాగే ఉన్నారు. జాను కూడ కొన్నిసార్లు తికమక పడి, అతని తరము వారు ఎందుకు చల్లబడి లోకరిత్యా ఉన్నారని ఆశ్చర్య పోతాడు. ఈ సందర్భములో మనకు ఉజ్జీవము కావాలని నేను గ్రహించాను. రెండవ తరము వారు మన సంఘాన్ని జీవము తోను ప్రేమ శక్తులతో నింపలేదు శక్తివంత మార్పులో క్రీస్తుతో నిజ అనుభవము ద్వారా మారితే తప్ప. రెండవ తరములో చాలామంది తిరుగబడి సంఘాన్ని విడిచిపెట్టారు, లేక చల్లారిపోయి ఉండిపోయారు. కొంతమంది క్రీస్తును తిరస్కరించారు. వారు ఉన్నప్పటికినీ మారడానికి నిరాకరించారు. కొంతమంది మార్పు వాస్తవము కాదు అని ఆలోచింప ప్రారంభించారు. మిగిలిన వారు క్రీస్తు నిజము అని నిరూపించడానికి అంతర్గత మార్పును కోరుతున్నారు. ఒకరి తరువాత ఒకరు మనము వారితో వారు నిజముగా మారే వరకు లేక గుడి విడిచి వెళ్ళిపోయే వరకు ఘర్షణ పడుతూనే ఉన్నాము. చివరకు, వారిలో చాలామంది మార్పు నొందారు – మొదటి తరము వారి వలే అవడానికి చాలా కష్టపడ్డారు. అది చెయ్యడానికి "వారు ఎక్కడ పడిపోయారో గుర్తించుకోవాలి." జాన్ కాగన్ వలే వారు "ముప్ఫై తొమ్మిది మంది" విశ్వాసముతో పోలిస్తే వారి విశ్వాసము మృతమని గ్రహించాలి – వారు వీరి తల్లిదండ్రులు పాతతరము వారు. రెండవది, వారు "పశ్చాత్తాప పడి మొదటి క్రియలు చెయ్యాలి." వారి మనస్సు మరియు హృదయము మార్పు నొందాలి. వారు తిరిగి వెళ్లి నిజ మార్పు పొందాలి (మొదటి క్రియలు). కొంతమంది అలా చేసారు దేవునికి వందనాలు – ఏమి అయాకో, ఫిలిప్ తిమోతి, వెస్లీ నోవా ఇంకా – కొంతమంది. తరువాత దేవుడు మన మధ్యలో ఉజ్జీవము పంపప్రారంభించాడు! దేవునికి వందనాలు, ఆయన ఆత్మను మన పైకి క్రుమ్మరింపడానికి మనలను నమ్మాడు. గతకొద్ది నెలలలో 20 కొత్త వ్యక్తులు వచ్చి రక్షింపబడ్డారు. ఈ కూటములు ఈ నూతన యవనస్తులను విశ్వాసములో స్థిర పరచడానికి కొనసాగుతాయి! ఇప్పుడు జాన్ కాగన్ చెప్పాడు "ఉజ్జీవము గజిబిజిలోని తరువాత భాగము." మన సంఘము మళ్ళీ మళ్ళీ ఉజ్జీవాన్ని నొక్కి వక్కానించాలి లేనిచో మన సంఘములో తొలి సభ్యుల వలే రోషము కలిగిన మారిన వారిని మనము చూడలేము. ఎఫెస్సు సంఘములో అది అవసరమైనది – ఈనాడు మన సంఘమునకు అది అవసరము. దానిని నేను "జీవించడానికి ఉజ్జీవము అని పిలుస్తాను!" సోదరీ సహోదరులారా, మన పాపాలను మనం పదేపదే ఒప్పుకోవాలి ఉజ్జీతరంగ రూపములో దేవుని సన్నిధి దిగి వచ్చేటట్టు ప్రార్ధించాలి. అలా చెయ్యండి! అలా చెయ్యండి! అలా చెయ్యండి! లేచి నిలబడి 15వ పాట పాడండి, "నేను ఆయన కొరకు జీవిస్తాను." నా జీవితమూ, నా ప్రేమ మీకు అర్పిస్తాను, ఓ గొర్రెపిల్ల దేవా నా కొరకు మరణించావు; నేను నమ్మకస్తునిగా ఉండనిమ్ము, నా రక్షకా నా దేవా! ఇప్పుడు 19 వ పాట పాడండి, "ఇది ప్రేమ." ఇది ప్రేమ, సముద్రమంతా విశాలమైనది, ప్రేమించే కరుణ ప్రవాహము లాంటిది, డాక్టర్ చాన్ గారు, దయచేసి మనలను ప్రార్ధనలోను కృపలోను నడిపించండి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే: |