ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మనుగడ కోసము ఉజ్జీవముREVIVAL FOR SURVIVAL డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు గురువారము సాయంకాలము, ఆగష్టు 31, 2017 |
దయచేసి నిలబడి పాటల కాగితంలో 19 వ సంఖ్య పాట పాడండి, "ఇక్కడ ప్రేమ ఉంది, మహా సముద్రమంతా విశాలమైనది." ఇక్కడ ప్రేమ ఉంది, మహా సముద్రమంతా విశాలమైనది, ప్రేమించే కరుణ ప్రవాహము వలే, ప్రతి ఒక్కరు ప్రార్ధించండి ఈ రాత్రి దేవుడు మనతో ఉండునట్లు (వారు ప్రార్ధిస్తారు). ఇప్పుడు 22 వ పాట పాడండి, "విభేదము అయిపొయింది." హల్లెలూయ! హల్లెలూయ! హల్లెలూయ! ఇక్కడ ఈ రాత్రి యేసు క్రీస్తు మహిమ పర్చబడునట్లు ప్రతి ఒక్కరు ప్రార్ధించండి (వారు ప్రార్ధించారు). ఇప్పుడు 23 వ సంఖ్య పాట పాడండి, "మరియు జరగవచ్చు?" మరియు జరగవచ్చు రక్షకుని రక్తములో నేను ఆ శక్తి పొందుకోవాలి? కూర్చోండి. మన పెద్ద పరిచారకుడు, బెన్ గ్రిఫిత్ వచ్చి, మన కొరకు పాడతారు. ప్రభువైన యేసు క్రీస్తును ఆయనను మాత్రమే స్తుతించడానికి మనము ఈ రాత్రి ఇక్కడ ఉన్నాము – ఆయనను మాత్రమే! ఇప్పుడు బైబిలులో సామెతలు, 14 వ అధ్యాయము, 14 వ వచనము చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో ఇది 681వ పుటలో ఉంది. నేను చదువుచుండగా దయచేసి నిలబడండి. "భక్తీ విడిచిన దాని మార్గములు వానికే వెక్కసమగును"( సామెతలు 14:4). మిమ్ములను మీరు ప్రశించుకోండి – "నా స్వంత మార్గములతో నేను నింపబడ్డానా? నా హృదయము చల్లారిపోయిందా? ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్ధింప ప్రయత్నిస్తున్నాను, కాని దేవుని సన్నిధిని అనుభవించడం లేదు." అది మీరా? మీరు సువార్త కొరకు వెళ్తున్నప్పుడు మీ ఎముకలలో మంట ఉందా నశించు వారిని వెదుకుతుందా? లేక సువార్త కొరకు మునుపు ఉన్నంత ఉత్సాహము ఇప్పుడు లేదా? ఎవరైనా గట్టిగా ప్రార్దిస్తున్నప్పుడు, మీ హృదయము పెదవులు చెప్పగలుగుతున్నాయా, "ఆమెన్" ప్రతి విన్నపము తరువాత? లేక ప్రారంభములో ప్రార్ధించినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండడం లేదా? లేక మీరనుకుంటున్నారా, "అవి త్వరలో పతనమవుతాయని"? క్రొత్త క్రైస్తవునిలో పొరపాట్లు చూస్తున్నారా? మీరు రక్షింపబడిన కొత్తలో ఉన్నట్టు వారు లేరు అనిపిస్తుందా? మీ పొరపాట్లను గూర్చి బోధ మిమ్ములను ఆలోచింప చేస్తున్నప్పుడు, మీరనుకుంటున్నారా, "నేను వాటిని ఎన్నడు ఒప్పుకోను. నాకు ఒప్పుకోలు కలిగించలేరు అని"? కొత్త వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీరు సంతోషిస్తున్నారా? లేక వారు రక్షింపబడిన కొత్తలో ఉన్నట్టు మంచి క్రైస్తవునిగా ఉంటున్నారా? లేక మీరు రక్షింపబడిన కొత్తలో ఉన్నట్టు మంచి క్రైస్తవునిగా ఉంటున్నారా? లేక మీ హృదయము చల్లారిపోయి కాళీ అయిపోయిందా? "భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును" (సామెతలు 14:14). మీరు రక్షింపబడిన కొత్తలో ప్రభువు కొరకు ఏమైనా చేసేవారు. అప్పుడు, మీరన్నారు, "యేసును సేవించడం నాకు ప్రియము అని. నేను ఎక్కువగా ఆయన కొరకు చెయ్యలేను." ఇప్పుడు మీరు అలా అర్ధవంతముగా చెప్పగలవా? లేక మీరు దిగజారిన క్రైస్తవునిగా ఉన్నారా? నేను కేవలము యవనస్తులతోనే మాట్లాడడం లేదు. నేను "39మందితో" మాట్లాడుతున్నాను – నేను పెద్దవారితో యనవనస్తులతో కూడ మాట్లాడుతున్నాను. నశించు యవనస్తులతో నేను మాట్లాడం లేదు. చాలాకాలము క్రిందట రక్షింపబడిన మీతో మాట్లాడుచున్నాను. మీ తొలి ప్రేమను కోల్పోయారా? మీరు రక్షింపబడిన కొత్తలో ఉన్న పూర్తి ప్రేమను మీరు ఇప్పుడు క్రీస్తు పట్ల కలిగియున్నారా? ఎఫెస్సులో ఉన్న క్రైస్తవులతో యేసు చెప్పాడు, "అయినను మొదట నీకుండిన ప్రేమను, నీవు వదిలితివని. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి యున్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము" (ప్రకటన 2:4, 5). గత 60 సంవత్సరాలుగా నేను బోధకునిగా ఉన్నాను. ఈ ఆరు దశాబ్దాలలో కొన్నిసార్లు నా హృదయము దిగజారింది. ఆ దుస్థితి నుండి నేను ఎలా బయటికి వస్తాను? అది ఇలా జరుగుతుంది. మొదటిగా నేను నా హృదయం నా సొంత విధానాలతో నిండి ఉన్నదని గ్రహిస్తాను. నేను విచారిస్తాను. బాధ పడతాను. కష్ట పరిస్థితులను బట్టి ఫిర్యాదు చేస్తాను. రెండవది, యేసు పట్ల నాకుండే తొలిప్రేమను నేను విడిచి పెట్టానని గ్రహిస్తాను. మూడవది, నేను ఎంత వరకు పడిపోయానో గుర్తుచేసుకుంటాను. నాకు యేసుకు మధ్య వచ్చిన పాపములను బట్టి పశ్చాత్తాప పడతాను. తరువాత నా పాపముల కొరకు, సిలువపై మరణించిన యేసును జ్ఞాపకము చేసుకుంటాను. నేను పశ్చాత్తపపడి నూతనంగా ఆయనను విశ్వసిస్తాను. ఇది రెండవ మార్పులాంటిదే. "నా దృష్టి అంతటిని నింపు." పాడండి. నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, నేను చెయ్యనిది మిమ్ములను చెయ్యమని అడగను. జాన్ కాగన్ కు ఉపదేశించాను బోధించడానికి సమర్పించుకోమని. చివరకు అతడు సరే అని చెప్పాడు. తరువాత నాకంటే అతడు మంచి బోధకుడని కనుగొన్నాను. అతనికి యవ్వన శక్తి ఉంది, నేను ముసలివాడనై నా శక్తి కోల్పోయాను. జాన్ అంటే నాకు చాలా అసూయ కలుగుతుంది. ఒక రాత్రి ఆ విషయము అతనితో ఒప్పుకునే వరకు అది నన్ను వేధించింది. తరువాత మీతో ఒప్పుకున్నాను. అప్పుడు నేను స్వస్థత నొంది నా సంతోషము పునరుద్ధరింపబడింది. నేను చేసినట్టే మీరు కూడ చెయ్యాలని ఈ రాత్రి మిమ్ములను అడుగుతున్నాను. నా హృదయము ఎంతగానో దిగజారింది వాస్తవానికి నేను ఎంతగానో భయపడ్డాను మీకు నేను బోధించడం ఇష్టపడరని. అప్పుడు దేవుడు మన సంఘమునకు ఉజ్జీవపు తాకిడి ఇచ్చాడు నేను పశ్చాత్తాపపడి మరియొక సారి ఆయన ప్రశస్త రక్తములో కడుగబడడానికి యేసు నొద్దకు వెళ్లాను. 76 ఏళ్ల వృద్ధుడు, 60 సంవత్సరాలుగా బోధిస్తున్నవాడు పశ్చాత్తాప పడడం, మీకు వింతగా లేదా? కాదు, అది వింతకాదు. పునరుద్దరింపబడడానికి హృదయములో ఉజ్జీవింప బడడానికి అది ఒకటే మార్గము. "పశ్చాత్తాపపడి, తొలి క్రియలను చేయుము" (ప్రకటన 2:5). మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాప పడండి. యేసు నొద్దకు తిరిగి వచ్చి మళ్ళీ మళ్ళీ ఆయన రక్తములో కడుగబడండి! గొప్ప సంస్కరణ కర్త లూథర్ అన్నాడు, "మన జీవితమంతా నిలకడయైన ఎడతెగని పశ్చాత్తాపముతో కూడినది." లూథర్ నిలకడగా పశ్చాత్తాపపడి శుద్ధి కొరకు యేసు నొద్దకు వచ్చేవాడు. మీరు నేను అలాగే చెయ్యాలి. యాకోబు 5:16 ఉజ్జీవమునకు అన్వయింపు అని నేను నమ్ముతాను. అది చెప్తుంది, "మీ తప్పిదములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించుడి, స్వస్థత పొందునట్లు..." "తప్పిదములు" పదము గమనించండి. గ్రీకు పదము "పరప్టొమా." డాక్టర్ స్ట్రాంగ్ అన్నాడు పదము యొక్క ముఖ్య అర్ధము "తప్పుట; [ఒక] తప్పిదము పొరపాటు, మిగిలిన పాపములు." మనము ఏమి ఒప్పుకోవాలంటే గొప్ప పాపములే కాదు, "తప్పుట," మన "తప్పిదములు పొరపాట్లు కూడ ఒప్పుకోవాలి." కొన్నిసార్లు మన కోపము, మన క్షమింపలేని స్థితి, మన అసూయలు, ప్రేమలేని తనము, మనకు దేవునికి మధ్య వచ్చే ఇతర పొరపాట్లు. తరుచు దేవునికే మన తప్పిదములు ఒప్పుకుంటే మన హృదయయాలు స్వస్థత నొందుతాయి. కాయ్ పెర్న్ ముఖము ప్రేమ పట్టింపులతో వెలుగుతూ ఉండడం నేను గమనించాను. మునుపు అతనికి చేదైనా, కోపపూరిత చూపు ఉండేది. ఏమయింది అని అడిగాను. అతనన్నాడు, "శ్రీమతి షర్ లీ లీపై పరిశుద్ధాత్మ పనిచేయడం చూసాను. ఆమెకున్న సమాధానము సంతోషము నాకు కావాలనుకున్నాను. పాదర్ గారు, మీపై కూడ నాకు కోపము ఉందని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. అప్పుడు నా కోపము పోయింది నాకు సమాధానము ఇతరుల పట్ల శ్రద్ద కలిగాయి." అద్భుతము! ఆయన అలా అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది! తనను ప్రేమిస్తున్నానని ఆయనతో చెప్పాను. అది పశ్చాత్తాపము అంటే. ఇతరులను క్షమించడం దేవుని నుండి నూతన సమాధానము ఆనందము పొందుకొనడం! ఉజ్జీవము అదే చేస్తుంది – మీరు దేవుని దగ్గర మీ తప్పిదములు ఒప్పుకొనినప్పుడు మీకు నూతన సమాధానము ఆనందము కలుగుతున్నది. కాని దేవుడు మన మధ్య సంచరించుచున్నప్పుడు, మీరు నేరుగా ఒక సహోదరునితో గాని సహోదరితో గాని మీ తప్పిదములు ఒప్పుకోవాలి. మీరు ఒకరితో ఒకరు మీ తప్పిదములు ఒప్పుకోవాలి. యాకోబు 5:16 అనువదింపబడవచ్చు "మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం సాధన చెయ్యండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించడం సాధన చెయ్యండి." దీని అర్ధము రోగము వచ్చే వరకు కనిపెట్టకూడదు ఒప్పుకోకుండా" (ఆర్. సి. హెచ్. లెన్సీకి). చైనాలో వారు వారి తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించడం సాధన చేస్తారు. అందుకే చైనాలో ఎప్పుడు ఉజ్జీవము ఉంటుంది. ఒక సోదరునితో చెప్పాను నేను మునుపు రెండుసార్లు చేసినట్టు, మీరు ముందుకు వచ్చి ప్రార్ధన చేయించుకోవచ్చని. నేను తనను అడిగాను, "ఎవరైనా వస్తారని అనుకుంటున్నావా?" కొంతసేపు ఆలోచించి, అతనన్నాడు, "లేదు, ఒక్కరు రారు." నీవెందుకు రావని అడిగాను. అతనన్నాడు నాకు ఉజ్జీవము వస్తే ఎక్కువ మంది గుడికి వస్తారని. కానీ అది కారణము కాదు. మీరే ప్రశ్నించుకోండి, ఎక్కువ మంది వస్తే లాభము ఏమిటి? వారు వస్తే మనము వారికెలా సహాయ పడగలము? మనము వారికి స్నేహము, ఆనందము, లోతైన సహవాసము ఇస్తాము. కాని అది మీకు ఉన్నాయా? మీకున్నాయా? లేక ప్రేమ లేకుండా విధితో కూడిన మతము కలిగియున్నారా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు కదా? మీకు లోతైన స్నేహము లేదు, కదా? మీకు ఆనందము లేదు, కదా? మీకు లోతైన సహవాసము లేదు, కదా? కొత్తవారితో మీ హృదయములో లోతైన ప్రేమ లేదు, కదా? యదార్ధంగా ఉండండి, యేసు పట్ల కూడ మీకు లోతైన ప్రేమ లేదు, కదా? మనము కలిగి యుండకుండా మనము వేరే వారికి ఎలా ఇవ్వగలము? మీ తప్పిదములు పాపములు ఒప్పుకోమని చెప్తే మీరనుకుంటారు, "అలా చెయ్యమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు." మీరు ఇప్పటికే పని చేస్తున్నారు – చాలా పని! మీరు అవసరమైన పనికాదు. అది ఎక్కువ ప్రేమ! క్రీస్తు కొరకు ఎక్కువ ప్రేమ! మనకు ఆయన పట్ల ఎక్కువ ప్రేమ ఉంటే మనము ఒకరి పట్ల ఒకరము ఎక్కువ ప్రేమ కలిగి యుంటాము ! నా దృష్టి అంతటిని నింపు, ప్రతి కోరక మొన్నటి రాత్రి సంఫోను గూర్చి ఆలోచిస్తున్నాను. బైబిలులో నాలుగు పూర్తి అధ్యాయాలు సంఫోనుకు కేటాయింపబడ్డాయి. హెబ్రీయులకు 11:32 లో రక్షింపబడిన వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. అతడు ఎప్పుడు రక్షింపబడ్డాడు? చావుకు కొన్ని నిమిషముల ముందు వరకు అతడు రక్షింపబడలేదని నేను నమ్ముతాను చివరకు సహాయము కొరకు దేవునికి మోర పెడతాడు. కాని యేసు అతనిని పరిశుద్దునిగా పిలిచాడు, "దేవుని కొరకు నా జీరు చేయబడినవాడు" (న్యాయాధిపతులు 13:5). "కొన్నిసార్లు ప్రభువు ఆత్మ అతనిని కదిలించింది" (న్యాయాధిపతులు 13:25). కాని సంఫోను హృదయ పూర్వకంగా దేవుని ప్రేమింప లేకపోయాడు. అతడు తన కొద్దిపాటి జీవితములో మీలాగే ఉన్నాడు. తన స్వశక్తితో, తన అధికారముతో క్రైస్తవ జీవితమూ జీవించగలనని అనుకున్నాడు. కానీ అలా చెయ్యలేక పోయాడు. మీలాగా నాలాగా మళ్ళీ, మళ్ళీ విఫలుడయ్యాడు. చివరిలో సాతాను శక్తులు ఆయనను తీసుకెళ్ళి కళ్ళు పెరికి వేసారు, "అతడు చెరసాలలో తిరగలి విసిరాడు" (న్యాయాధిపతులు 16:21). ఓ, సహోదరి సహోదరులారా, మీలో కొందరు సంఫోను వలే లేరా? మీరు యేసుచే పిలువబడ్డారు. గతములో దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మచే కదిలింపబడ్డారు. కాని క్రమేణ మీరు మత్సరము విచారముతో నిండిపోయారు. మీరు ఇప్పుడు సంతోషముగా లేరు. సంఘము పట్ల మీకు నిజమైన ప్రేమలేదు. గ్రుడ్డి కళ్ళతో మీరు గుడికి వస్తారు. మీ మతము నిరుపయోగము, సంతోషము లేకుండా కష్టపడడం. నిరుపయోగము, బానిసపు పని! అంతే! మీరు గుడికి బానిసగా వస్తారు. అది కేవలము నిరుపయోగము. ఇక్కడ ఉండి ప్రేమించలేరు. సంఫోను వలే మీరు "చెరసాలలో తిరగలి విసరుతారు." అతనిని గూర్చి ఇతరులు ఏమి ఆలోచిస్తారో నాకు తెలియదు, కాని నేను చాలా ఎక్కువగా ఏడ్చాను అతడు "చెరసాలలో తిరగలి విసరుతున్నాడు" అని చదివినప్పుడు – గొలుసుతో కట్టబడి, తిరగలి విసరుతూ, గంటల తరబడి, ధాన్యము విసిరాడు. నాకు తెలుసు అది మీ మతము కూడ, కొన్ని సార్లు నా హృదయము మీ కొరకు దుఃఖిస్తుంది. మీకు సంతోషము లేదు. మీకు ప్రేమ లేదు. మీకు నిరీక్షణ లేదు. చెరసాలలో బానిసగా తిరగలి విసురుతూ ఉన్నారు. అవును! మీలో కొందరికి ఈ గుడి ఒక చెరసాల, ఈ చెరసాలలో సేవల ద్వారా, సువార్త అనే బానిస పనితో తిరగలి విసురుతూ ఉన్నారు. మీరు దానిని అసహ్యించుకుంటారు! కాని ఎలా తప్పించుకోవాలో మీకు తెలియదు! మీరు ఆత్మీయ గొలుసులతో, నిరీక్షణ లేకుండా, తిరుగుతూ, తిరగలి విసురుతూనే ఉన్నారు. కొన్నిసార్లు వదిలి పెట్టాలనుకుంటారు. నాకు తెలుసు మీలో కొందరు అది చేస్తారు. కాని మీరు వదిలి పెట్టలేదు. మీ స్నేహితులు ఇక్కడే ఉన్నారు. మీ బంధువులు ఇక్కడే ఉన్నారు! మీరు ఎలా ఎడతెగని విసరడం తప్పించుకోగలరు, ద్వేషపూరితము సంఘము పని అది మీకు చేరసాలలా లేదా? నేను మీకు సహాయము చేయ ఇష్టపడుతున్నాను! నేను చేస్తానని దేవునికి తెలుసు! తప్పించుకోవడానికి ఒకటే మార్గము ఉంది. బోధకుడా, మీకు ఎలా తెలుసు? ఎందుకంటే మీరున్న ఈ చోట నేను ఎప్పటి నుండో ఉంటున్నాను! నేను గుడిలో గొలుసులతో బంధింపబడ్డాను, విసురుతూ, విసురుతూ, అసహ్యించు కుంటూ – కాని తప్పించుకునే మార్గము లేదు! తప్పించుకునే ఒకే మార్గము యేసు! మీ తప్పిదములు ఒప్పుకోండి! ఎందుకు కాదు? మీ తప్పిదములు మిమ్ములను బందిస్తున్న గొలుసులు! వాటిని వదిలించుకోండి! పశ్చాత్తాప పడి రక్తముచే కడగ బడండి, ఎందుకంటే యేసు మాత్రమే మీ గొలుసులను విప్పి మిమ్ములను విడుదల చేస్తాడు. "మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్దించుకోండి, మీరు స్వస్థత పొందుకొనునట్లు..." (యాకోబు 5:16). మీ భయములు, మీ సందేహములు, మీ పాపములు, మీ కోపము, మీ మత్సరము, మీ అసూయ ఒప్పుకోండి. "మీ తప్పిదములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించుడి, మీరు స్వస్థత పొందునట్లు..." (యాకోబు 5:16). శ్రీమతి లీ అలా చేసారు! యేసు ఆమెను స్వస్త పరిచాడు. కాయ్ పెర్న్ అలా చేసాడు, యేసు అతనిని స్వస్థ పరిచాడు. ఇప్పుడు నిరీక్షణా కిరణము ఉంది. మీరనుకోవచ్చు, "ఇది నిజమా?" అవును! ఇది నిజము! ప్రతి ఒక్కరు, దయచేసి వారి తప్పిదములు ఒప్పుకొని యేసుచే స్వస్థత పొందునట్లు ఇతరుల కొరకు ప్రార్ధించుడి (వారు ప్రార్ధిస్తారు). "క్రీస్తు చెప్పాడు, ‘దుఃఖ పడువారు ధన్యులు’ (మత్తయి 5:4) ఇది వెనుదిరిగి దుఃఖ వాడేవారిని సూచిస్తుంది. ఉజ్జీవము కొరకు తాపత్రయపడే క్రైస్తవులకు పాపము ఒక సమస్య, లోకము చూడని విషయాలు ఉజ్జీవము కలిగి ఉంటుంది. ఉజ్జీవము చీకటి ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది...ఉజ్జీవము కొరకు సిద్ధ పరచడానికి, ఇవాన్ రోబర్ట్స్ జ్ఞాపకము చేస్తాడు [పరిశుద్ధ] ఆత్మ ప్రజలు సిద్ధ పడకుండా రాదు: ‘మనము [సంఘములో] అన్ని చెడు భవములు విడిచి పెట్టాలి – మలినము, అసూయ, చెడుభావము, అపార్ధములు. [ప్రార్ధించవచ్చు] అన్ని తప్పిదములు క్షమింపబడే వరకు: కాని క్షమింపలేరు అని మీకు అనిపిస్తే, బూడిదలో వంగి, క్షమించే ఆత్మ కొరకు ప్రార్ధించుడి. అప్పడు అది పొందుకుంటారు’" ...శుద్ధ క్రైస్తవుడు మాత్రమే దేవునికి సమీపముగా జీవింపగలడు (Brian H. Edwards, Revival, Evangelical Press, 2004, p. 113)... "ప్రతి వ్యక్తి ఇతరులను మర్చిపోయాడు. దేవునితో ముఖాముఖిగా ఉంటారు [వారి పాపములు ఒప్పుకుంటే]... ప్రతి నమోదయిన ఉజ్జీవములో [ఇది] క్లిష్టమైనది. అసౌకర్య దీనపు ఒప్పుకోలు లేకుండా, ఉజ్జీవము లేదు" (ఐబిఐడి., పేజి 116)... "మనము అపరిశుద్ధ సంఘమును కలిగియున్నాము ఎందుకంటే క్రైస్తవులు పాపమునకు భయపడరు... పరిశుద్ధ దేవుని ముందు వారి హృదయాలను జీవితాలను పరీక్షించుకోవాలి ఉజ్జీవము కొరకు ఎదురు చూసేముందు. మన పాపములను కప్పి పుచ్చి వాటిని ఒప్పుకోకపోతే [మనకు ఉజ్జీవము ఉండదు]... పరిశుద్ధ దేవుడు చిన్న పాపాన్ని కూడ క్రైస్తవుడు గ్రహించేలా చేస్తాడు... పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉన్నామని ఎరుగు వారు వ్యక్తిగత పాపమును గుర్తేరుగుతారు... ఈ లోతైన ఒప్పుకోలు కార్యము స్వతంత్రము ఆనందములకు దారి తీస్తుంది. క్షమాపణ అనుభవములో ‘హృదయ అంతరంగము’ నుండి రక్షణ ఆనందము పుట్టుకు వస్తుంది" (ఐబిఐడి., పేజి 120). ఆ కూటములలో పదిహేడు మంది యవనస్తులు మార్పు నొందారు. ఆ కూటములలో ఉజ్జీవపు తాకిడి అనుభవించాము. వారు మేల్కొల్ప బడ్డారు. వారు మేల్కొని రక్షింపబడతారని ఏ ఒక్కరు ఊహించలేదు. అయినను వారి పేర్లు నేను ప్రకటించినప్పుడు, మన గుంపులో ఎవరు సంతోషించలేదు. మీరు ఎందుకు సంతోషించలేదు? చైనాలో వారు ఆనందముతో దుఃఖించారు! ఇక్కడ ఎందుకు లేదు? పదిహేడు మంది యవనస్తులు రక్షింపబడ్డారు కాని ఆనంద భాష్పాలు, సంతోషము మన మధ్య లేదు. ఎందుకు? ఎందుకంటే "వెను తిరుగువాడు తన స్వంత మార్గాలలో నింపబడిఉంటాడు" (సామెతలు 14:14). "నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు: నీవు మరల మమ్మును బ్రతికింపవా?" (కీర్తనలు 85:6). మన తప్పిదములు కన్నీటితో ఒప్పుకునే వరకు కన్నీటి భాష్పాలు మనము కార్చలేము! అది చైనాలో సంభవిస్తుంది. మన సంఘములో ఎందుకు కాకూడదు? మీరు స్వస్థత పొందునట్లు మీరు మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకోవడానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్ధించడానికి, భయపడతారు. ఇతరులు ఏమి అనుకుంటారో అనే భయము మీరు ఒప్పుకోకుండా చేస్తంది. యెషయా అన్నాడు, "చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు...నీ సృష్టికరయైన యెహోవాను మరచుదువా..." (యెషయా 51:12, 13). "నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము: నా దృష్టి అంతటిని నింపు, పాపమూ లేకుండా మీరు మునుపు రాలేదు. మీకు తెలుసు, కాని మీరు భయపడ్డారు. శ్రీమతి చాన్ ఫోనులో నాతో అన్నారు తానూ చాలా దిగజారిపోయిందని. తరువాత ఆదివారము ఉదయము ఆమెను చూసాను – శ్రీమతి చాన్ నన్ను చూసారు. ఆమె రావాలనుకుంటున్నారు. ఆమె చెయ్యి పట్టుకొని, "రండి" అన్నాను. ఆమె వచ్చారు. రావడానికి భయపడ్డారు. ఆమె, డాక్టర్ చాన్ భార్య! ఆమె తన తప్పిదములు ఒప్పుకుంటే ప్రజలు ఏమి అనుకుంటారు? ఇతరులు ఏమి అనుకుంటారు అనేది మర్చిపోండి! మనము లేచి పాడుచుండగా, వచ్చి మోకరించి మీ తప్పిదాలు ఒప్పుకొండి. దేవుడు మిమ్మును ఒప్పిస్తాడు, తరువాత సిలువపై క్రీస్తు కార్చిన రక్తము మిమ్ములను కడుగుతుంది. నా దృష్టి అంతటిని నింపు, పాపమూ లేకుండా ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |