ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవము తిరస్కారమును బాగు చేస్తుందిREVIVAL CURES REJECTION డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు బుధవారము సాయంకాలము, ఆగష్టు 9, 2017 "ప్రేమలో భయముండదు; అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును: భయము దండనతో కూడినది. భయపడు వాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు" (I యోహాను 4:18). |
ఒక ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త ఒక పుస్తకము వ్రాసాడు 288 భయములు అందులో పేర్కొనబడ్డాయి, జీవితంలో ప్రజలు అనుభవించే భయములు – 288 అనుభవిస్తారు! అందులో ఆరు సాధారణ భయములు తిరస్కార భయములు, చావును గూర్చిన భయములు, వృద్ధాప్యమును గూర్చిన భయములు, పేదరికమును గూర్చిన భయములు, అస్వస్థతను గూర్చిన భయములు, విమర్శను గూర్చిన భయములు. ఆ మనస్తత్వ శాస్త్రవేత్త అన్నాడు, "తిరస్కారమును గూర్చిన భయము అన్నింటిలో గొప్పది. మరణమును గూర్చిన భయము కన్నా తిరస్కారము గూర్చిన భయము బలమైనది!" దానిని గూర్చి ఆలోచించండి! తిరస్కరింపబడడం కంటే ప్రజలు చనిపోవడం మేలు అనుకుంటారు! డాక్టర్ క్రిష్టాపర్ కాగన్ కు బహుశా అందరి కంటే నన్ను బాగుగా ఎరుగుదురు. అతనన్నాడు, "డాక్టర్ హైమర్స్ సామాన్య కుటుంబములో పెరగలేదు. అలా జరిగితే అతడు బయటికి వచ్చి కలివిడిగా ఉండేవారు. కాని తిరస్కారము అతనిని ఎవ్వరికి చెప్పుకోని వ్యక్తిగా మార్చేసింది – అతడు తనలోనే చూసుకుంటాడు. ఆయన బాగా బోధిస్తాడు కనుక ఆయనను ఎవ్వరికి చెప్పుకోని వ్యక్తిగా మీరు తలంచరు. కాని అంతరంగములో అతడు సున్నితమైన వ్యక్తి, తన బలహీనత ఆయనకు తెలుసు." డాక్టర్ కాగన్ సరిగానే చెప్పాడు. ఆనందించే గుంపులో ఉన్నవారితో నేను ఉండగలను, కాని అకస్మాత్తుగా నా మనసు మారినప్పుడు, నేను ఒంటరి తనములో ఉన్న నొప్పిని తిరస్కారము మనస్తాపము పొందుతాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు లేక దేవుని సన్నిధిని గమనిస్తున్నప్పుడు మాత్రము నేను తిరస్కారమును అనుభవించను. ఉజ్జీవము సమయములలో సంఘములో నిజంగా ఇంటిలో ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది – అలాంటప్పుడు దేవుడు నిజంగా ఉండి తిరస్కారము ఒంటరి తనములను తొలగిస్తాడు. అందుకే యవనస్తులు గుడికి వచ్చినప్పుడు ఎలా భావిస్తారో నేను చాలా బాగా అర్ధము చేసుకోగలను. మేము వారికి అంగీకారము ప్రేమను అందిస్తాము. కాని కొన్నిసార్లు వారు వచ్చిన తరువాత మేము అనుకుంటాము వారు "లోపల" ఉన్నారని. వారు ఇప్పుడు బాగున్నారు అనుకుంటాము. త్వరలో వారు మునపటి వలే తిరస్కార భావాన్ని పొందుకుంటారు. అంగీకార భావము లేనివారు మాత్రము కొనసాగుతారు. నేనున్నట్టుగా వారు నిలుస్తారు. నేను తిరస్కరింపబడినను, నేను గుడిలోనే ఉంటాను ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్లిపోలేను. నేను ఒంటరి వాడను, కాని గుడిలో చాలామంది ప్రజలు ఉన్నారు. కనుక లోలోపల నాకు బాధ తిరస్కార భావము ఉన్నప్పటికిని నేను అంగీకరింపబడినట్టుగా నటిస్తాను. ఆదివారము రాత్రులు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు, తిరస్కార భావము నన్ను ఆవరిస్తుంది. ప్రముఖ పాటలోని మాటలు నా మనసులో మెదులుతూ ఉంటాయి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు, "మళ్ళీ ఒంటరిగా, సహజముగా." ఒక యువకుడు గుడిలో అంగీకారము ప్రేమల కొరకు ఎదురు చూస్తాడు, కాని వారు చల్లదనము తిరస్కారము మాత్రమే కనుగొంటారు. చాలామంది యవనస్తులు గుడిని విడిచి పెడతారు ఎందుకంటే సంఘము వాగ్ధానము చేసిన దానిని ఇవ్వలేకపోతుంది. మనము పాడతాము సంఘము ఇంటికి వచ్చి భోజనము చెయ్యండి, మనము అలా పాడేటప్పుడు విని విభిన్న భావన పొందుతారు. సంఘము పట్ల వారు వెక్కిరించే వైఖరి పెంపొందించుకుంటారు. వారి ముఖముపై నటన నవ్వు ఉంటుంది ఎందుకంటే వారికి తెలుసు "మధుర సహవాసమును" గూర్చి అబద్ధము చెప్తున్నామని. "మనము భుజించడానికి కూర్చున్నప్పుడు మధుర సహవాసము" వారికి అనిపించదు. వారనుకుంటారు, "వీరు ‘మధుర సహవాసమును’ గూర్చి మాట్లాడతారు కాని వారు దానిని అనుభవించరు. డాక్టర్ హైమర్స్ కూడ అలాగే అనుకుంటారు." కనుక, వారు లోకములోనికి వెళ్ళిపోతారు. గుడి కూడ అధ్వాన స్థితిలో ఉంది కాని వారు తిరిగి లోకములోనికి వెళ్ళిపోతారు. "మధుర సహవాసము" ను గూర్చి లోకము అబద్ధము చెప్పదు. లోకములో నిన్ను అంగీకరించే స్నేహితుని నీవు కనుగొంటావు. అది ఎన్నడు నీవు గుడిలో కనుగోనవు. ఇక్కడ మీరు కనుగొనేది వేషధారణ, తిరస్కారము మరియు చల్లదనము. గుడిలో క్రైస్తవులు ప్రేమించకుండా ఏది ఆపేస్తుంది? నిజ క్రైస్తవ ప్రేమను భయము దొంగిలిస్తుంది. వారు నా గురించి ఏమనుకుంటారు? వారు నా గురించి ఏమి మాట్లాడుతారు? వారికి నిజంగా నా గురించి తెలిసిపోతే ఎలా? నేను తలంచేది అనుకునేది వారికి నిజంగా తెలిసిపోతే ఎలా? వారు నన్ను తిరస్కరిస్తారు – అలా వారు చేస్తారు! తిరస్కార భయము అన్ని భయములలో గొప్పది – మరణ భయము కంటే కూడ గొప్పది! రోగ భయము కంటే కూడ గొప్పది. సర్వలోక మంతటిలో అన్ని భయముల కంటే కూడ చాలా గొప్పది! కవి రోబర్ట్ ప్రాస్ట్ దానిని పరిపూర్ణముగా వ్యక్త పరిచాడు. అతని గీతిక పేరు "ప్రత్యక్షత." మనము మనకు ఒక స్థలము కల్పించుకుంటాము అదంతా మన పాఠ్య భాగానికి తీసుకొని వస్తుంది. "ప్రేమలో భయముండదు; అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును: భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు" (I యోహాను 4:18). తిరస్కార భయమును మనము ఎలా అధిగమించగలము? పరిపూర్ణ ప్రేమతో! కాని "పరిపూర్ణ" ప్రేమను మనము ఎలా పొందుకొనగళము? "నేను నిన్ను ప్రేమిస్తున్నాను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను!" అని చెప్పడం ద్వారా కాదు. I యోహాను 3:18 చూడండి, "చిన్న పిల్లలారా, మాటతోను, నాలుక తోనూ కాక; క్రియతోను సత్యముతోను ప్రేమింతురు." అది మనము ఎలా చేయగలం? అది అంత సులువు కాదు. మనం అలా చేయడానికి భయపడటం. తిరస్కరింప బడతామేమోనని!!! మనకు నిజంగా ఉజ్జీవము కావాలంటే మనం అలా చెయ్యాలి. అది చెయ్యడానికి మనలను మనం బలవంతము చేసుకోవాలి. "మనము మాట్లాడతాం ఒక స్నేహితుని అవగాహనను స్పూర్తించడానికి." "కనుక [వారిని వారు] దాచుకునే వారు మాట్లాడాలి వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలి." ఆ ప్రత్యక్షత మనకు కావాలి మనకు నిజంగా ఉజ్జీవము కావాలంటే! దయచేసి I యోహాను 1:9 మరియు 10 చదవండి. నేను చదువుచుండగా నిలబడండి. "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనకు అబద్ధికునిగా చేయువారము అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు" (I యోహాను 1:9, 10). కూర్చోండి. మన పాపములను ఒప్పుకోవడం ఉజ్జీవమునకు తాళము. మనము దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే కన్నీళ్ళతో మాన పాపములను ఆయనకు ఒప్పుకోవాలి. మాటలతో కాదు, కన్నీటితో, చైనాలో చేసినట్టు, అందరు నిజ ఉజ్జీవములలో చేసినట్టు. బ్రెయిన్ ఎడ్వర్డు సరిగ్గా చెప్పాడు, "కన్నీటి ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము అనేది ఉండదు" (ఉజ్జీవము, పేజి 115). మళ్ళీ, అతడు అన్నాడు, "లోతైన, అసౌకర్య తగ్గింపుతో కూడిన, పాపపు ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము లేదు" (పేజి 116). "లోతైన ఒప్పుకోలుకు కారణము ప్రజలు వారి పాపాన్ని గ్రహించి దానిని అసహ్యించు కోవడం" (పేజి 122). పాపపు ఒప్పుకోలు ఉజ్జీవమునకు తాళము! దేవునికి వ్యతిరేకంగా మనము పాపము చేస్తే, మనము కన్నీటితో, దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు ఆయన "సమస్త దుర్ణీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును." లేచి నిలబడండి, "నన్ను పరిశోధించు, ఓ దేవా." "నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము: కూర్చోండి. మనకు పూర్తి ఉజ్జీవము ఎందుకు రాలేదు అంటే మనము ఎప్పుడు "తేలికపాటి మాటల వెనుక మనము ఉండిపోయాము (పరిహాసము, వెక్కిరించడం, ఎగతాళి చేయడం, అపహసించడం)." కాని, రెండవది, మనం లోతుగా వెళ్ళాలి. యాకోబు 5:16 తిప్పండి. నేను చదువుచుండగా దయచేసి నిలబడండి. "మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు, ప్రార్ధన చేయుడి" (యాకోబు 5:16). కూర్చోండి. మేత్యూ హెన్రీ అన్నాడు, ఇక్కడ ఒప్పుకోలు క్రైస్తవులు ఒకరితోనొకరు కలిగి యుండాలి... ఒప్పుకోలు సమాధాన పడుటకు అవసరము వారి ప్రార్ధనల ద్వారా ఒకని కొరకు సహాయ పడుటకు పాపములకు క్షమాపణ పొందుకోడానికి వాటికి వ్యతిరేకంగా శక్తి కలిగియుండడానికి. ఒకనితో నొకడు పాపములు ఒప్పుకొనునాడు ఒకరి కొరకు మరియొకరు ప్రార్ధన చేయగలిగి ఉండాలి. అన్వయపు నూతన నిబంధన వ్యాఖ్యానము ఈ తలంపు యాకోబు 5:16 పై ఇస్తుంది, నిజమైన సహవాసము కలిగి యుండడం అంటే మన పాపములు ఒకరితో నొకరు ఒప్పుకోవడం. మనం అలా చేస్తే మనకు ఆత్మీయ స్వస్థత లభిస్తుంది. మనము వేరొకరి నుండి మన విషయాలు దాచకూడదు. ప్రతి క్రైస్తవుడు ఇతరుల పట్ల తప్పులు చేస్తారు. మన వారసత్వపు స్వార్ధము వలన మనమందరము ఒకటి పట్ల మరొకరు కలిగి యుండవలసిన ప్రేమ విషయంలో వెనుకబడి పోతున్నాము. గుడిలో ఎవరో ఒకరు నిర్దయతో కూడిన మాట, మీకు చెప్పవచ్చు. ఒకరు మిమ్ములను పట్టించుకోకపోవచ్చు. మీరు ప్రభువు కొరకు చేసే పనిని ఒకరు మెచ్చుకోకపోవచ్చు. మిమ్ములను కృంగ దీయడానికి ఎవరో ఏదో చేసి ఉండవచ్చు. మీ మనోభావాలను ఒకరు గాయపరచవచ్చు. ఒకరి పట్ల మరొకరము మన పాపములను దాచి పెట్టకూడదు. దేవుని సన్నిధి కలిగి యుండడం చాలా ప్రశస్తమైన విషయము. మన గాయములు ఉపద్రవములు పట్టుకొని ఉండడం ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని ఆపేస్తుంది. "తరుచు ఈ లోతైన ఒప్పుకోలు బాహాట బహిరంగ ఒప్పుకోలుకు నడిపిస్తుంది...తప్పుడు సంబంధాలు [సరి] అయిపోతాయి...మహిమ ఆనందముల ముందు, ఒప్పుకోలు ఉంది, అది దేవుని ప్రజలతో ప్రారంభమవుతుంది. దైవిక కన్నీళ్లు విచారము ఉన్నాయి. తప్పులు ఒప్పులవ్వాలి, రహస్య విషయాలు, మనష్యుల దృష్టి నుండి బహుదూరముగా ఉండేవి, పార వేయబడాలి, చెడు సంబంధాలు బాహాటముగా బాగు చేయబడాలి. ఇలా [చేయడానికి] మీరు సిద్ధముగా లేకపోతే, మనము ఉజ్జీవము కొరకు ప్రార్ధించకుండా ఉండడము మంచిది. ఉజ్జీవము గుడి ఆనందము కొరకు ఉద్దేశింపబడలేదు, కాని అది కడుగబడుటకు మాత్రమే. ఈనాడు మనము అపవిత్ర సంఘము కలిగి యున్నాము ఎందుకంటే క్రైస్తవులు పాపపు భావన కలిగి యుండరు [కన్నీటితో ఒకరినొకరు ఒప్పుకోరు]" (ఎడ్వర్డ్స్, ఉజ్జీవము, పేజీలు 119, 120). మనము ఒకరితో నొకరము కన్నీళ్ళతో పాపాలు ఒప్పుకోకపోతే మన హృదయాలలో ఆనందించలేము. ఇదీ పదే పదే చైనాలో సంభవించింది. మన గుడిలో ఎందుకు జరగదు? మన పాపములు మనం ఒప్పుకోవడానికి మనం చాలా గర్విష్టులము. ఇతరులు ఏమి అనుకుంటారో అని మనం భయపడటం. మన పాపాలు ఒప్పుకోకుండా సాతాను ఈ భయాన్ని ఉపయోగిస్తుంది. ఇతరులు మనలను గూర్చి ఏమనుకుంటారో అనే భయముతో ఉజ్జీవము ఆనందము పొందకుండా సాతాను మనలను ఆపేస్తుంది. మనము భయపడడం మన సంఘాన్ని బలహీనంగా చేస్తుందని సాతనుకు తెలుసు. ఇతరులు ఏమి అనుకుంటారో అనే భయము ఒప్పుకోలు నుండి మనలను ఆపేస్తుంది మన ఆత్మలకు స్వస్థత లేకుండా చేస్తుంది. యెషయా అన్నాడు, "చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు... నీ సృష్టి కర్తయైన యెహోవాను మరచుదువా" (యెషయా 51:12, 13). బైబిలు చెప్తుంది, "భయపడుట వలన మనష్యులకు ఉరి వచ్చును" (సామెతలు 29:25). దయచేసి నిలబడి మరియు సామెతలు 28:13 చదవండి. అది స్కోఫీల్ద్ పఠన బైబిలులో 692 వ పేజిలో ఉంది. ప్రతి ఒక్కరు గట్టిగా చదవండి! "అతి క్రమములను దాచి పెట్టువాడు వర్దిల్లడు: వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13). "నన్ను పరిశోధించు, ఓనా దేవా " – పాడండి. "నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము: "సజీవుడైన దేవుని ఆత్మ"! పాడండి! సజీవుడైన దేవుని ఆత్మ, దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము. కూర్చోండి. క్రీస్తు అన్నాడు "దుఃఖ పడువాడు ధన్యులు." అది పాపములు ఒప్పుకొని ఏడ్చు వాని గూర్చి చెప్పబడింది. ఉజ్జీవము కొరకు ఎదురు చూచు వారికి పాపము ఒక పెద్ద సమస్య. ఉజ్జీవము ఎల్లప్పుడూ లోకము చూడలేని అంతరంగ పాపములను గూర్చి ఆలోచింప చేస్తుంది. మన హృదయంత రంగములోని పాపములపై ఉజ్జీవము వెలుగు విరజిమ్ముతుంది. ఉజ్జీవము కొరకు సిద్ధ పడమని సంఘస్తులను ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇవాన్ రోబర్ట్స్ వారితో అన్నాడు ప్రజలు సిద్ధ పడకుండా పరిశుద్ధాత్మ దిగి రాదు. అతనన్నాడు "చెడు భావాలన్నింటిని విడిచి పెట్టాలి" – మత్సరము, అనంగీకారము, కోపము. ఒకరిని క్షమించలేదని నీకనిపిస్తే, మోకాళ్ళుని క్షమించే ఆత్మ కొరకు ప్రార్ధించాలి – వేరొకని దగ్గరకు వెళ్లి క్షమాపణ అడగాలి – అప్పుడు మాత్రమే దేవుని మధుర సన్నిధిని నీవు అనుభవించగలవు. శుద్ధున క్రైస్తవుడు మాత్రమే దేవుని పరిశుద్ధ సన్నిధిని ప్రేమను గమనించగలడు. మనలాంటి అపవిత్ర సంఘముపై ఉజ్జీవపు ఆనందము రాదు మన పాపములను అంగీకరించి కన్నీటితో ఒప్పుకుంటే తప్ప. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధి ఆనందాన్ని పొందగలుగుతాము. మన సహోదరి వాయిస్తుంది "నా దృష్టి అంతటిని నింపు" మేము మీకు ఒక అవకాశము ఇస్తాము ఆదివారము రాత్రి ఒప్పుకోలు కొరకు ప్రార్ధించడానికి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధించండి ఆదివారము రాత్రి మీరు ఇతరులు ఏయే పాపాలు ఒప్పుకోవాలో చూపించడానికి. ఒకరినొకరు కలుసుకోండి, ఇద్దరిద్దరు లేక ముగ్గురు ఆదివారము రాత్రి ఒప్పుకోలు కొరకు గట్టిగా ప్రార్ధించండి. ఇప్పుడు లేచి పాడండి "నా దృష్టి అంతటిని నింపు." అది 17 వ పాట. నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నా ప్రార్ధన, ఇప్పుడు పాడండి "నేను దానిని అందించాలనికుంటున్నాను." మీ పాటల కాగితములో 18 వ సంఖ్య. అగ్ని రావడానికి ఒక మెరుపు సరిపోతుంది, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |