Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవము కొరకు హృదయము మోర!

HEARTCRY FOR REVIVAL!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, జూలై 16, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, July 16, 2017

"నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింప లేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియ చేతును" (యిర్మియా 33:3).


యిర్మియా చెరసాలలో ఉన్నాడు. యూదా ప్రజలు బంధీలవుతారని బోధించినందుకు ఆయన చెరసాలలో ఉన్నాడు. యిర్మియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన ప్రజలు దేవునిచే విడిచి పెట్టబడ్డారని అనుకున్నాడు. నిరీక్షణ అంతా కోల్పోయి చెరసాలలో మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు తన హృదయంతో మాట్లాడాడు. దేవుడు అతనితో అన్నాడు,

"నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింప లేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియ చేతును" (యిర్మియా 33:3).

గత రాత్రి నేను "ఉజ్జీవంలో ప్రార్ధనా పోరాటముపై" ప్రసంగము చేసారు! భౌతికవాదం అనే గొప్ప దెయ్యము క్రింద మనము జీవిస్తున్నాము అని చెప్పాను. నేనన్నాను, "పోయిందేదో పోయింది! ఆయన మన సంఘాలు విడిచి పెట్టాడు. ఆయన మన సంఘాన్ని విడిచిపెట్టాడు...కాని దేవుడు దిగి రావడం మనకు ఇష్టము లేదు. మన బద్దకముతో కూడిన నిద్ర పరిశుద్ధాత్మ లేని సంఘాన్ని కావాలనుకుంటుంది. ఆనవాయితీగా వెళ్ళడమే. ప్రకంపన ఎందుకు? ఎందుకు బాధపడాలి? మత్తులో మనము పడుకుందాం. దేవుని సన్నిధి మరియు శక్తి కొరకు కష్టపడి ప్రార్ధించడం ఉపవసించడం మనకు ఇష్టము లేదు." కొన్ని వారాలలో పదిహేడు మంది రక్షింపబడ్డారు. డాక్టర్ చాన్ పునరుద్దరింపబడి ఉజ్జీవింపబడ్డాడు. సువార్త బోధించడానికి జాన్ సామ్యుల్ కాగన్ సమర్పించుకున్నాడు. యారన్ యాన్సీ జాక్ జ్ఞాన్ పరిచారక సభ్యులు అయ్యారు. క్రిస్టిన్ గుయన్ మరియు శ్రీమతి లీ ప్రార్ధనా యోధులు అయ్యారు.

ఉజ్జీవపు ‘తాకిడి’ మనం పొందుకున్నాము. ఆ దినాలలో డాక్టర్ కాగన్ మరియు నేను నేర్చుకున్నది దేవుడు ప్రత్యక్షమయినప్పుడు ప్రజలు మార్పు నొందారు, కాని దేవుడు ప్రత్యక్షముకానప్పుడు ఏమి సంభవింపలేదు. యారన్ మరియు జాక్ జ్ఞాన్ ఇంకొకటి నేర్చుకున్నారు. ప్రార్ధనలో సాతాను శక్తులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో వారు నేర్చుకున్నారు. జాక్ అన్నాడు,

‘దేవుని సన్నిధి కొరకు మేము ప్రార్ధించ ప్రారంభించాము. నేను నా రెండవ ప్రార్ధన ప్రారంభించిన తరువాత, తల తెలికయై మూర్చపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రార్ధనలు చెయ్యడం కష్టమయింది. గొప్ప దెయ్యపు ఆటంకము ఉన్నట్టు అనిపించి నేను కొనసాగించలేక పోయాను. మేము మోకాళ్ళని క్రీస్తు రక్తము కొరకు మోర పెట్టుచు దెయ్యపు శక్తులను ఎత్తివేయాలని దేవునికి ప్రార్ధించాము. నేను తలవంచి నేలపై సాష్టాంగ పడ్డాను. మూడవసారి మేము ప్రార్ధించాము ఈ భంగిమలలో దేవుడు మబ్బులో నుండి వచ్చి దెయ్యపు సన్నిధిని పారవేసినట్టుగా మాకు అనిపించింది. [సాయంకాలపు ఆరాధన] క్లిష్టముగా ఉంటుందని మాకు తెలుసు. ఇది సుమారు సాయంకాలము 4:00 గంటలకు సంభవించింది.’

రెండు గంటల తరువాత, సాయంకాలపు ఆరాధనలో, విర్గెల్ నిక్కెల్ కన్నీటితో ముందుకు వచ్చాడు, డాక్టర్ కాగన్ అతనిని క్రీస్తు నొద్దకు నడిపించాడు. అప్పుడు మాకు తెలిసింది ఎందుకు యారన్ మరియు జాక్ రెండు గంటల మునుపు ఎందుకు ఎంత పోరాటము ప్రార్ధనలో సాతానుతో జరిపించారో!"

"ఏలయనగా మనము పోరాడునది శరీరములతో కాదు, గాని ప్రధానుల తోనూ, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదుల తోను, ఆకాశమండల మందున్న దురత్మల సమూహముల తోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12).

భయంకర యుద్ధాలు కేవలం ప్రార్ధనల ద్వారా మాత్రమే గెలిచారు!

"నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెను, నీవు గ్రహింప లేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను, నీకు తెలియచేతును" (యిర్మియా 33:3).

"ప్రార్ధనలో శక్తి," నిలబడి పాడండి!

ప్రార్ధనలో శక్తి, ప్రభూ, ప్రార్ధనలో శక్తి,
   ఇక్కడ ‘లోకములో’ పాపము విచారము మరియు చింత;
మాకు ఉజ్జీవము కావాలి, ఆత్మలు నిస్పృహలో ఉన్నాయి;
   ఓ నాకు శక్తి నిమ్ము, ప్రార్ధనలో శక్తి!
("నాకు ప్రార్ధింప నేర్పుము" ఆల్ బర్ట్ ఎస్. రిట్జ్ చే, 1879-1966).
(“Teach Me to Pray” by Albert S. Reitz, 1879-1966).
నేను మూడవ లైను మార్చాను "మాకు ఉజ్జీవము కావాలి, ఆత్మలు నిస్పృహలు ఉన్నాయి; ఓ నాకు శక్తినిమ్ము, ప్రార్ధనలో శక్తి!"

కూర్చోండి.

సాతాను ఉజ్జీవము కొరకు ప్రార్ధించకుండా మిమ్ములను ఆపేస్తుంది. గత గురువారము రాత్రి ఒక ఓటు తీసుకున్నాను. నేనన్నాను, "నేను మిమ్ములను ఉజ్జీవము కొరకు ప్రార్ధించమన్నప్పుడు ఎక్కువ మంది గుడిలో ఉండాలని నేను ఆశ పడతానా?" సుమారు సగము మంది వాళ్ళ చేతులు ఎత్తారు. తరువాత నేను అడిగాను, "మిమ్ములను ఉజ్జీవము కొరకు ప్రార్ధించ మనినప్పుడు మీరు ఎక్కువ కష్ట పడాలని నేను కోరతానా?" మీలో ఒక వంతు మంది చేతులెత్తారు. నేను దిగ్భ్రాంతి చెందాను. చాలా, చాలా సార్లు నేను మీతో చెప్పాను, "ఎక్కువ మంది కాదు!" చాలా, చాలా సార్లు చెప్పాను "ఎక్కువ పని కొరకు కాదు!" చాలా, చాలాసార్లు నేను మీకు చెప్పాను, "ఉజ్జీవము వచ్చునప్పుడు పని తక్కువ ఉంటుంది!"

మీరు ఒక సందర్శకుని కొరకు వందల పేర్లు సంపాదించాలి. ఆ ఒక్క సందర్శకుడు తిరిగి రాడు! ఉజ్జీవములో మీరు కొన్నిపేర్లు తెస్తారు కొంతమంది సందర్శకులు వస్తారు కాని చాలామంది సందర్శకులు తిరిగివస్తారు. మనము సువర్తీకరణ పూర్తిగా మూసివేసి చాలా ఎక్కువ మంది లోనికి వచ్చి రక్షింపబడతారు! చైనీయ సంఘములో వారికి సువర్తీకరణ లేదు. ఎలాంటి సాధనాలు ఉపయోగించలేదు. అయినను 2,000 మందిలోకి వచ్చి ఉండిపోయారు. ఎందుకు? ఎందుకంటే వారికి ఉజ్జీవము వచ్చింది! అందుకే! ఇది మునుపు కూడ చెప్పాను, కాని మీరు నమ్మలేదు. మీరు చూడలేదు కాబట్టి నేను చెప్పింది నమ్మలేదు. మన పాఠ్యభాగము మళ్ళీ వినండి.

"నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింప లేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను, నీకు తెలియ చేతును" (యిర్మియా 33:3).

"నీకు తెలియని గొప్ప అద్భుత సంగతులు, నీకు చూపిస్తాను." మీరు దానిని నమ్మగలరా? మీరు మునుపు ఎన్నడు చూడని విషయాలు దేవుడు చేయగలడని మిమ్మును మీరు తగ్గించుకొని నమ్ముతారా? "మీలో తెలియని" విషయాలకు దేవుడు జవాబు ఇస్తాడని మీరు నమ్మగలరా? లేచి ఈ పాట పాడండి!

ప్రార్ధనలో శక్తి, ప్రభూ, ప్రార్ధనలో శక్తి,
   ఇక్కడ లోకములో పాపము విచారము మరియు చింత;
మాకు ఉజ్జీవము కావాలి, ఆత్మలు నిస్పృహలో ఉన్నాయి;
   ఓ నాకు శక్తి నిమ్ము, ప్రార్ధనలో శక్తి!
("ప్రార్ధించుట నాకు నేర్పుము" ఆల్ బర్ట్ ఎస్. రిట్జ్ చే, 1879-1966).
(“Teach Me to Pray” by Albert S. Reitz, 1879-1966).

నశించు పిల్లలను సంఘానికి తేవడానికి మనము హృదయముతో పనిచేస్తాము. వారు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని కనుగొనరు. ఎందుకని? శక్తితో ఆయన ఇక్కడ లేరు కాబట్టి. దేవుడు పూర్తిగా పరిశుద్ధుడు. "మీకు తెలియని, గొప్ప అద్భుత కార్యములు" ఆయన చేస్తాడని మీరు నిజంగా నమ్మరని ఆయన తెలుసు. మీరు నమ్మరు అంతే. మీరు అదంతా కట్టుకథ అనుకుంటారు. నేను ముసలి వాడనుకుంటున్నారు, మీరు ఎప్పుడు అద్భుతము గురించి వినలేదు, మీరు ఎప్పుడు అద్భుతము చూడలేదు, కాబట్టి మీరు నమ్మరు.

మీరు చాలా అధ్బుతాలు చూసారు, అయినను మీరు నమ్మరు! ముప్ఫై తొమ్మిది మంది ఈ సంఘ భవనాన్ని కాపాడడానికి రెండు మిలియన్ల డాలర్లు చెల్లించారు. నేను మాట్లాడిన ఏ బోధకుడు అది నమ్మడు. కాని అది జరిగింది! అది గొప్ప అద్భుతము! కాని మీరు అది చూడలేదు! కనుక నమ్మరు! గత సంవత్సరము కొన్ని వారాలలో 17 మంది రక్షింపబడ్డారు! కాని మీరు అది చూడలేదు! అది అద్భుతమని నమ్మరు! జాన్ కాగన్ మన బోధకుడు అయ్యాడు, కొత్తకాపరి, అతడు చెప్పినప్పటికీ, "నేను ఎన్నడు చెయ్యను అని!" అది అద్భుతము. కాని మీరు అది చూడలేదు! కనుక నమ్మరు! 35 భాషలలో ప్రపంచమంతటా మనకు పరిచర్య ఉంది – ప్రపంచమంతటికి ఈ ప్రసంగాలు పంపిస్తున్నాము. కాని మీరు అది చూడలేదు! కనుక నమ్మరు!

ఓ, ఉజ్జీవపు అద్బుతము కొరకు మీరు మేల్కొని ప్రార్ధించాలని నా ప్రార్ధన! ఓ, మీరు పరిశుయ్యులులా ఉండకూడదు, వారన్నారు, "ఆయన వారి ముందు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ, వారు ఆయన యందు విశ్వాసముంచలేదు " (యోహాను 12:37).

నాకు తెలుసు మీ మతము మీకు ఆనందము ఇవ్వదు, కొన్నిసార్లు మీ కొరకు నా హృదయము దుఃఖిస్తుంది. మీకు ఆనందము లేదు. మీకు నిరీక్షణ లేదు. సంఫోను వలే మీరు చెరసాలలో బానిసలా మరత్రిప్పుతూ ఉన్నారు. అవును! మీలో కొందరికి ఈ గుడి ఒక చెరసాల, ఇక్కడ మీరు ఆరాధనలు చేస్తూ, సువార్త పనికి బానిసలా ఉంటారు. మీకు అసహ్యించుకుంటారు! కాని ఎలా తప్పించుకోవాలో తెలియదు! ఆత్మీయ సంకెళ్ళులో ఉన్నారు, మర త్రిప్పుతూ, తిప్పుతూ, నిరీక్షణ లేకుండా. కొన్నిసార్లు విడిచి పెట్టాలనుకుంటారు. మీలో కొందరు అలా చేస్తారు నాకు తెలుసు. కాని విడిచి వెళ్ళలేదు. మీ హితులు ఇక్కడ ఉన్నారు. మీ బంధువులు ఇక్కడ ఉన్నారు! మీరు మర తిప్పడం, గుడి పనులు ఎలా తప్పించుకుంటారు ఈ చెరసాల నుండి? నేను మీకు సహాయము చేస్తాను! నేను అలా చేస్తానని దేవునికి తెలుసు! తప్పించుకోవడానికి ఒకటే మార్గము. బోధకుడా, నీకు ఎలా తెలుసు? ఎందుకంటే మీరున్న ఈ స్థలములో నేను చాలా కాలము నుండి ఉంటున్నాను! నేను గుడిలో గొలుసులు వేయబడి, మర తిప్పుతూ, తిప్పుతూ, అసహ్యించుకుంటూ ఉన్నాను – కాని తప్పించుకొనే మార్గము లేదు! తప్పించుకోవడానికి మార్గము యేసే! మీ పాపాలు ఒప్పుకోండి! ఎందుకని? మీ పాపాలు బంధిస్తాయి! విడిచి పెట్టండి! పశ్చాత్తాప పడి రక్తములో కడుగబడండి, యేసు మాత్రమే మీ బంధకాలు విడిపించి మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాడు.

"మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు, ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయండి..." (యాకోబు 5:16).

మీ భయాలు ఒప్పుకోండి, మీ సందేహాలు, మీ పాపములు, మీ కోపము, మీ మత్సరము, మీ అసూయ. "మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు, ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయండి..." (యాకోబు 5:16). ఒక స్త్రీ అలా చేసింది! యేసును ఆమెను స్వస్థపరిచాడు. ఒక వ్యక్తి అలా చేసాడు, యేసు తనను స్వస్త పరిచాడు. ఇప్పుడు నిరీక్షణ కిరణము ఉంది. మీరనవచ్చు, "అది నిజమా?" అవును! అది నిజము! పాపాలు ఒప్పుకొని యేసు చే స్వస్థత పొందునట్లు ప్రార్ధించండి.

"క్రీస్తు అన్నాడు, ‘దుఃఖ పడువారు ధన్యతలు’ (మత్తయి 5:4) పాపాలు ఒప్పుకొని ఎడ్చేవారి నిమిత్తము అది చెప్పబడింది. క్రైస్తవునికి పాపము ఎప్పుడు సమస్యే, ఉజ్జీవము కొరకు తృష్ణ గలవానికి లోకము చూడని విషయాలతో ఉజ్జీవము పనిచేస్తుంది. ఉజ్జీవము చీకటి ప్రాంతాలకు వెలుగు ఇస్తుంది... ఉజ్జీవము కొరకు సిద్ధ పరచడానికి, ఇవాన్ రోబర్ట్స్ మనకు గుర్తు చేస్తున్నాడు [పరి] శుద్ధాత్మ ప్రజలు సిద్ధంగా లేకుండా రాదు: ‘మనము [గుడిలో] అన్ని చెడు భావాలు విడిచి పెట్టాలి – కల్మషము, అసూయ, ప్రలోభము, మరియు అపోహలు. [ప్రార్ధించవద్దు] అపరాధములన్ని క్షమింపబడే వరకు: క్షమింప లేనని అనిపిస్తే, బూడిదలో తలపెట్టి, క్షమించే ఆత్మ కొరకు అడగండి. అప్పుడు అది మీకు వస్తుంది’" ...పవిత్ర క్రైస్తవుడు మాత్రమే దేవునికి సన్నిహితంగా జీవింపగలడు (Brian H. Edwards, Revival, Evangelical Press, 2004, p. 113)... "ప్రతి ఒక్కరు తనను తానూ మరచిపోతారు. దేవునితో ముఖాముఖిగా ఉంటాడు [వారు పాపాలు ఒప్పుకునేటప్పుడు]... [ఇది] ప్రతి నమోదయిన ఉజ్జీవములో కనిపిస్తుంది. అసౌకర్య, లోతైన తగ్గింపుతో పాపపు ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము ఉండదు" (ఐబిఐడి., పేజి 116)... "ఈనాడు మనకు అపరిశుద్ధ గుడి ఉంది ఎందుకంటే క్రైస్తవులు పాపభావము కలిగి ఉండరు దానికి భయపడదు...ఉజ్జీవము కొరకు ఎదురు చూచువారు వారి హృదయాలను జీవితాలను పరిశుద్ధ దేవుని ముందు పరీక్షించు కోవాలి. మీ పాపాలు కప్పిపెట్టి ఇప్పుడు వాటిని ఒప్పుకోకపోతే [మీకు ఉజ్జీవము ఉండదు]...పరిశుద్ధ దేవుడు చిన్న పాపాన్ని కూడ క్రైస్తవునికి తెలియ చేస్తాడు... పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉన్నామని గ్రహించు వారికి వ్యక్తిగత పాపము గ్రహిస్తారు...ఈ లోతైన ఒప్పుకోలు కార్యము క్షమించే అనుభవములోనికి నడిపిస్తుంది. ‘హృదయపు అంచుల నుండి’ రక్షణానందము పొంగి పొరలుతుంది" (ఐబిఐడి., పేజి 120).

"నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు: నీవు మరల మమ్మును బ్రతికింప నా?" (కీర్తనలు 85:6).

కన్నీటితో పాపాలు ఒప్పుకోకుండా మన హృదయాలలో మనము ఆనందించలేము! ఇది చైనాలో జరుగుతుంది. మన సంఘములో ఎందుకు జరగకూడదు? మన పాపాలు ఒకరితో ఒకరం ఒప్పుకోవడానికి భయపడతారు, స్వస్థత పొందునట్లు, ఒకరి కొకరము ప్రార్దించుకోం. ఇతరులు ఏమనుకుంటారో అనే భయము మనలను ఒప్పుకోకుండా చేస్తుంది. యెషయా అన్నాడు, "నేను నేనే, మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి...తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు..." (యెషయా 51:12, 13).

10 వ పాట పాడండి!

"నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయమును తెలుసుకొనుము:
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసుకొనుము:
నా హృదయము గూర్చి తెలుసుకొనుము;
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసుకొనుము;
నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము,
నిత్య మార్గమున నన్ను నడిపించుము."
(కీర్తనలు 139:23, 24).

17 వ పాట పాడండి!

నా దృష్టిని నింపు, పాప రహితమయినది
   లోపల ప్రకాశించే తేజస్సు నీడ.
కేవలము మీ ఆశీర్వదపు ముఖమును చూడనిమ్ము,
   మీ అనంత కృపలో నా ఆత్మ ఉల్లాసించునట్లు.
నా దృష్టి అంతటిని నింపు, దైవిక రక్షకా,
   మీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింబించే వరకు.
("నా దృష్టి అంతటిని నింపు" ఆవిస్ బర్జ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

మీరు మునుపు పశ్చాత్తాప పడలేదు. మీకు తెలుసు కాని, మీరు భయపడ్డారు. ఒక స్త్రీ ఫోనులో భయంకరంగా దిగజారి పోయిందని చెప్పింది. ఆదివారము ఉదయము నేను ఆమెను చూసాను ఆమె నన్ను చూసింది. ఆమెకు ముందుకు రావలనిపిస్తుంది. ఆమె చెయ్యి పట్టుకొని అన్నాను, "రమ్ము." ఆమె వచ్చింది. రావడానికి మునుపు భయపడింది. అన్నింటికీ మించి, ఆమె పరిచారకుని భార్య! ఆమె పొరపాట్లు ఒప్పుకుంటే ప్రజలు తన గురుంచి ఏమనుకుంటారు? ఇతరులు ఏమనుకుంటారు అని వదిలి పెట్టండి! మనము లేచి పాడుతున్నప్పుడు, వచ్చయి మోకాళ్ళుని మీ పాపాలు ఒప్పుకోండి. దేవుడు పాపపు ఒప్పుకోలు ఇస్తాడు, తరువాత క్రీస్తు సిలువపై కార్చిన రక్తము మిమ్ములను శుద్ధి చేస్తుంది.

17 వ పాట పాడండి!

నా దృష్టిని నింపు, పాప రహితమయినది
   లోపల ప్రకాశించే తేజస్సు నీడ.
కేవలము మీ ఆశీర్వదపు ముఖమును చూడనిమ్ము,
   మీ అనంత కృపలో నా ఆత్మ ఉల్లాసించునట్లు.
నా దృష్టి అంతటిని నింపు, దైవిక రక్షకా,
   మీ మహిమతో నా ఆత్మ ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింబించే వరకు.
("నా దృష్టి అంతటిని నింపు" ఆవిస్ బర్జ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ గారిచే: I యోహాను 1:5-10.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఓ ప్రాణపు ఊపిరి" (బెస్సీ పి. హెడ్ చే, 1850 -1936).
“O Breath of Life” (by Bessie P. Head, 1850-1936).