ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
"నూతన" నూతన బాప్టిస్టు మందిరము!THE “NEW” NEW BAPTIST TABERNACLE! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). |
దేవుడు దిగి వచ్చునప్పుడు "[ఆయన] సన్నిధిని పర్వతములు తత్తరిల్లును." ఆయన సన్నిధిలో అపనమ్మకపు పర్వతాలు తత్తరిల్లుతాయి. ఆయన సన్నిధిలో సందేహపు పర్వతాలు తత్తరిల్లుతాయి. ఆయన సన్నిధిలో పర్వతాలు భయంతో తత్తరిల్లును. ఆయన సన్నిధిలో గర్వపు పర్వతాలు తత్తరిల్లును. ఆయన సన్నిధిలో నిరుత్సాహపు పర్వతాలు తత్తరిల్లును. ఆయన సన్నిధిలో స్వార్ధపు పర్వతాలు తత్తరిల్లును. ఆయన సన్నిధిలో సాతాను అణచివేత పర్వతాలు తత్తరిల్లును. దేవుడు ఉజ్జీవంలో క్రిందికి దిగి వచ్చునప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచే పర్వతాలన్ని తత్తరిల్లుతాయి! "దేవుని సన్నిధిలో [కొండ నుండి పుట్టువారి] వలే పర్వతాలు తత్తరిల్లుతాయి!" నిజ ఉజ్జీవపు ప్రార్ధన అర్ధము దేవుని విడువకుండా గట్టిగా పట్టుకోవడం – రాత్రంతా ప్రార్ధనలో క్రీస్తుతో పోరాడిన యాకోబు వలే – ఆయనన్నాడు, "నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని, నిన్ను పోనియ్యను" (ఆదికాండము 32:26). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు ఉజ్జీవ ప్రార్ధన అంటే "దేవుని పట్టుకోవడం, ఆయనతో పోరాడడం, సహోతుకంగా మాట్లాడడం, బ్రతిమాలడం, నేనంటాను ఒక క్రైస్తవుడు ఈ స్థితికి వచ్చునప్పుడు మాత్రమే అతడు నిజంగా ప్రార్ధింప ప్రారంభిస్తాడు" ఉజ్జీవ ప్రార్ధనలు! (Lloyd-Jones, Revival, p. 305). కాని ఉజ్జీవపు ప్రార్ధన యెషయా లాంటి మనష్యుల నుండి రావాలి, ఆ ప్రవక్త అన్నాడు, "నేను ఉన్నాను; నన్ను పంపుము" (యెషయా 6:8) – అలాంటి మనష్యులు మన తండ్రి ఆయన క్రీస్తు సేవ విషయంలో త్యాగము చేయడానికి ఇష్ట పడతారు! డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "క్రైస్తవ్యము సజీవంగా ఉండాలంటే దానిలో వ్యక్తులు ఉండాలి; సరైన వ్యక్తులు. బయటికి మాట్లాడలేని వారిని అది తొలగించ గలిగాలి..అది సత్తా ఉన్న ప్రవక్తలను హత సాక్ష్యులను వెతకాలి.. వారు దైవ జనులుగా ధైర్యవంతులుగా ఉంటారు.. వారు ప్రార్ధనలు శ్రమల ద్వారా [దేవుడు] ఆలస్యమైన ఉజ్జీవాన్ని పంపుతాడు" (డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్, మళ్ళీ మనకు దైవ జనులు కావాలి). ఈ ఘడియలో మన సంఘానికి అది అవసరము – "దైవ జనులు, ధైర్య వంతులు." ఈ లోక శూన్యతను చూచిన వారు, భద్రత కంటే త్యాగము ఇష్టపడే వారు మనకు కావాలి. భయము నుండి విడుదలైన స్త్రీ పురుషులు, ప్రవక్తతో పాటు, "నేనున్నాను; నన్ను పంపుము" (యెషయా 6:8) అని చెప్పగలిగే వారు, ఆత్మల లోతులలో నుండి ప్రార్ధింప గల యవ్వన స్త్రీలు పురుషులు మనకు కావాలి, "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతి గాను, అగ్ని నీళ్ళను పొంగ చేయురీతి గాను, నీవు దిగి వచ్చెదవు గాక!" (యెషయా 64:1-2). యవనస్తులారా, లేచి మీ పెదవులతో పట్టుదలతో శక్తితో ఆ ప్రార్ధన చెయ్యండి. యవనస్తులారా, లేచి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నిమిత్తము, మీ శాంతిని ఐశ్వర్యమును, మీ జీవితాలను ఆయన కొరకు త్యాగము చెయ్యండి! యవనస్తులారా, లేచి సాతాను వాని అనుచరులతో ప్రార్ధనలో మీ శక్తి అంతటితో పోరాడండి, గొప్ప ఉజ్జీవపు క్రుమ్మరింపు కొరకు దేవుని మహిమతో దిగి వచ్చి నట్టు ప్రార్ధించండి! "కదలండి, క్రైస్తవ సైనికులారా." పాటల కాగితంలో మొదటి పాట. పాడండి! నిలబడి పాడండి! కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి వెళ్తున్నట్టు, కూర్చోండి. యవ్వనస్థులారా, నేను కూడ యువకుడనే, కానీ ఇప్పుడు ముసలివాడను. మన నాయకులు కూడ. మేము ఈ సంఘాన్ని, దీర్ఘ చీలిక సంవత్సరముల ద్వారా నడిపించాము. ఈ సంఘము బాగుండాలని మేము మా సమయము, ధనము, యవ్వన కాలపు సంవత్సరాలు త్యాగం చేసాము. ఇప్పుడు ఇది చాలా బాగుంది. మేము వెల చెల్లించాము. అంతర్జాలములో ఈ సంఘ ప్రపంచ వ్యాప్త పరిచర్య నిమ్మిత్తము మేము వెల చెల్లించాము. కానీ మాకు నొసటి మీద యవ్వనము ఉండదు. ఈ సంఘాన్ని తరువాత మెట్టుకు తీసుకెళ్లడానికి మాకు శక్తి బలము ఉండవు. తరువాత స్థితికి ఈ సంఘాన్ని తీసుకెళ్లే ఆ పటుత్వము, శారీరక మెరుగుదనము మాకు లేవు. మా యవ్వన కాలపు శక్తిని ఈ సంఘాన్ని రక్షింపడానికి వెచ్చించాం, కానీ మాకు "నూతన" నూతన బాప్టిస్టు మందిరము నిర్మించే శక్తి లేదు. యవనులైన మీరు అది చెయ్యాలి, లేనిచో అది జరగదు. అది చెయ్యండి! అది చెయ్యండి! అది చెయ్యండి! ఒకప్పుడు నేను పౌరుష యవ్వన కాపరిని. ఆదివారము గొప్ప సామర్ధ్యముతో మూడుసార్లు ప్రసంగించగలిగే వాడిని. నేను 1,000 మంది, అందులో మూడవ వంతు మొదటిసారి వచ్చిన సందర్శకులు వారందరి ఏకాగ్రతను నాపై తిప్పుకునే వాడిని. కానీ ఇప్పుడు నేను డబ్బై ఆరు సంవత్సరాల కేన్సర్ రోగిని. నేను చాలా ముసలివాడను. దీర్ఘ ధ్యానము ప్రార్ధన తరువాత, ఇక కనిపెట్టకూడదని నాకు తెలిసింది. నేనంటాను ఇప్పుడున్న యవ్వనస్థులకు నాయకత్వమును బదిలీ చేసే పని చేను ఆరంభించాలి – ఇంకా కొంతసమయము ఉంది మీకు సహాయం చేసి నడిపించడానికి. వచ్చే శీతాకాలానికి నా అరవై సంవత్సరాల పరిచర్యలో అడుగుపెడతాను. అరవై సంవత్సరాల పరిచర్య తరువాత కొంతమంది బోధకులు కాపరులుగా ఉన్నారు. నాకనిపిస్తుంది నేను దిగి నడిపించడం మంచిదని, నాయకునిగా ఉండేకంటే. కాబట్టి, మన సంఘము జాన్ సామ్యూల్ కాగన్ ను పరిచర్యకు అభిషేకించాలి, అతడు మన సంఘానికి కాపరి అవాలి! అప్పుడు నేను దిగిపోయి అతనిని నడిపిస్తాను, గౌరవ సూచిక సంఘ కాపరిగా. నేను ప్రతిపాదిస్తున్నాను నోవాసాంగ్ కు పరిచర్య నిమిత్తము అనుమతిని ఇవ్వాలి, మరియు యారన్ యాన్సీ, జాక్ జ్ఞావ్, ఎబెల్ ప్రుదోమ్ మరియు క్యూ డాంగ్ లీ సంఘ పరిచారకులుగా ఉండాలి, మరియు యూరన్ యాన్సీ శాశ్వతంగా "పరిచారకులు అధ్యక్షుడు" గా ఉండాలి. ఒక కొత్త పద్దతి ప్రవేశ పెడదాం, చాలామంది ఈ మంచి యవ్వనస్థులను "చురుకైన పరిచారకులు" గా ఏర్పాటు చెయ్యాలి భ్రమణ పద్దతిలో. ఇప్పుడు మన సంఘము జ్వాలను ఇప్పుడు యవ్వనస్థులకు అందచెయ్యాలి. వారు మనలను వాస్తవానికి "నూతన" నూతన బాప్టిస్టు మందిరానికి నడిపించాలి. కదలండి, క్రైస్తవ సైనికులారా! నిలబడి రెండవ చరణము పల్లవి పాడండి. విజయోత్సాహానికి గురుతుగా సాతాను పారిపోవును; అయినను నాకు తెలుసు అరవై సంవత్సరాల అనుభవంలో యవనులు మాత్రమే దీనిని నెరవేర్చలేరు. మనకు నూతన దేవుని ఆత్మ క్రుమ్మరింపు కావాలి లేనిచో అది చేయలేము. డాక్టర్ తిమోతి లిన్ చైనీయ బాప్టిస్టు సంఘములో 24 సంవత్సరాలు నాకు కాపరి. డాక్టర్ లిన్ ప్రార్ధనా యోధుడు. డాక్టర్ లిన్ అన్నాడు, "ప్రార్ధన గురి దేవుని సన్నిధిని పొందుట." అతనన్నాడు, "అంత్య దినాల సంఘమునకు దేవుని సన్నిధి అవసరము ఎదగాలంటే. దేవుని సన్నిధి లేకుండా ప్రయత్నాలన్నీ వ్యర్ధము" మరియు నిరుపయోగము. సాతానుకు తెలుసు దేవుని సన్నిధి శక్తి లేకుండా మనము ఎదగలేమని. డాక్టర్ లిన్ అన్నాడు క్రీస్తు రెండవ రాకడకు సమీపమయ్యే కొద్దీ, "ప్రార్థనకు వ్యతిరేకంగా సాతాను గొప్ప ఒత్తిడి తెస్తుంది" (all quotations are from Dr. Lin’s book, The Secret of Church Growth). అపొస్తలుడైన పౌలు అన్నాడు, "మనము పోరాడునది శరీరులతో కాదు" ...గాని సాతాను దురాత్మల సమూహము తోనూ పోరాడుచున్నాము (ఎఫెస్సీయులకు 6:12). అంధకార శక్తులతో మనం ఎలా పోరాడగలము? పౌలు దానికీ జవాబిచ్చాడు. "ప్రార్ధించుట ప్రతివిధమైన ప్రార్ధన విజ్ఞాపన కలిగియుండాలి" (ఎఫెస్సీయులకు 6:18). వేరొకరు ప్రార్ధిస్తున్నప్పుడు, నాయకుడు ప్రార్ధిస్తుండగా మీరు ప్రతి ప్రార్ధన విన్నపమును వినాలి. ప్రతి విన్నపము తరువాత, "ఆమెన్" అనండి. అది నాయకుని ప్రార్థనలను మీ సవంత ప్రార్ధనలుగా చేస్తుంది! అది సాతానుకు వ్యతిరేకంగా మన ప్రార్థనలను గొప్ప శక్తిగా మారుస్తుంది! నిలబడి రెండవ చరణము మరల పాడండి! విజయోత్సాహానికి గురుతుగా సాతాను పారిపోవును; మరియు మన ముఖ్య ప్రార్ధనలు దేవుడు మన పనిలో దిగివచ్చేటట్టుగా చేయడం – దేవుని సన్నిధి గొప్ప ఉజ్జీవము రూపంలో దిగిరావడం! "గగనము చీల్చుకొని, నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). దేవుడు మన మధ్యకు దిగి వచ్చినప్పుడు "పర్వతములు [ఆయన] సన్నిధిలో తత్తరిల్లును." ఆయన సన్నిధిలో అపనమ్మకపు పర్వతాలు తత్తరిల్లును! ఆయన సన్నిధిలో అనుమానపు పర్వతాలు తత్తరిల్లును! ఆయన సన్నిధిలో అసూయ పర్వతాలు తత్తరిల్లును! ఆయన సన్నిధిలో మనలను విడదీసే పర్వతాలు తత్తరిల్లును! ఆయన సన్నిధిలో ఒకరిపై ఒకరికి లోతైన ప్రేమ ప్రవహించును! మన దేవునికి ఆయన క్రీస్తుకు మధ్య ఉన్న పర్వతాలు కొండలోని జ్వాల వలే, అగ్నివలే దిగివచ్చి, ఉజ్జీవములో క్రిందికి దిగి వస్తుంది! నేను మిమ్మును ఉత్తేజపరుస్తున్నాను గొప్ప ఉజ్జీవ రూపములో దేవుని సన్నిధి దిగి వచ్చునట్టు ప్రతిరోజూ గట్టిగా ప్రార్ధించండి! నిజ ఉజ్జీవము అర్ధము దేవుని గట్టిగా పట్టుకొని యాకోబు వలే ప్రార్ధించుట, "నీవు నన్ను దీవిస్తేనేగాని నేను నిన్ను పోనివ్వను." డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పినట్టు, "దేవుని గట్టిగా పట్టుకోవడం, ఆయనతో పోరాడుట, సహేతుకంగా అడుగుట, బ్రతిమాలుట...అప్పుడే క్రైస్తవులు [అలా ప్రార్ధిస్తారు, ఉజ్జీవ ప్రార్ధనలు చేస్తారు]," ఉజ్జీవము, పేజీ 305. మీలోకొందరికి ఉజ్జీవము కొరకు మేము మళ్ళీ ప్రార్ధించడం ఇష్టంలేదు! మీరనుకోవచ్చు గత సంవత్సరపు "ఉజ్జీవము తాకిడి" మంచి ఏమి చెయ్యలేదని! కానీ మీది తప్పు! గత సంవత్సరము ఉజ్జీవపు "తాకిడి" పొందుము, కానీ ఫలితము చూడండి – జాన్ కాగన్ తిరస్కరించడం ఆపి సువార్త ప్రకటించడానికి సమర్పించుకున్నాడు! మనకు కొత్త కాపరి ఉన్నాడు – అతడు ఉజ్జీవపు "తాకిడి" నుండి ఉద్భవించాడు! మనకు యరన్ యాన్సీ, నోవాసాంగ్, జాక్ జ్ఞాన్ ఉన్నారు గత సంవత్సరపు ఉజ్జీవపు "తాకిడి" నుండి వచ్చారు! వచ్చే శీతాకాలానికి మనకు ఎప్పుడు లేనంతగా మూడురెట్లు ఎక్కువమంది బాప్తిస్మము పొందుతారు! కొత్తగా మారిన వారు ఎక్కడ నుండి వచ్చారు? వారు గత వేసవిలో, దేవుని ఉజ్జీవపు చిన్న "తాకిడి" ద్వారా వచ్చారు! రెండవ చరణము మళ్ళీ పాడండి! నిలబడి పాడండి! విజయోత్సాహానికి గురుతుగా సాతాను పారిపోవును; కూర్చోండి. గత సంవత్సరము ఉజ్జీవపు ఆరాధనలు ముగించేటప్పుడు నేను మీతో చెప్పాను మనము ఉజ్జీవపు "తాకిడి"ని మాత్రమే పొందాము, ఈ సంవత్సరము గొప్ప దేవుని సన్నిధి క్రుమ్మరింపు వస్తుంది. అరవై సంవత్సరాల అనుభవంలో అలా జరుగుతుందని నాకు తెలుసు. కడుగబడక మునుపు ఉజ్జీవపు "తాకిడి" మీరు పొందుకోవచ్చు! వాస్తవానికి చైనీయ సంఘములో అదే జరిగింది. అలా అది వచ్చింది. మొదట – తాకిడి! రెండవది – కడగబడడం! నా జీవితంలో మూడు అద్భుత ఉజ్జీవాలు చూసాను! నాకు తెలుసు మన సంఘములో దేవుడు తిరిగి చెయ్యగలడు! నాకు తెలుసు ఈ యవ్వనస్థులను నాయకత్వములో ఉంచినంత మాత్రాన మన సంఘము బలపడదు, మరియు "నూతన" నూతన బాప్టిస్టు మందిరమును చూడలేము గొప్ప దేవుని పరిశుద్ధ సన్నిధి శక్తి దిగి రావాలని మనము తప్పక ప్రార్ధించాలి! "గగనము చీల్చుకొని, నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). దయచేసి నిలబడి 3 వ పాట పాడండి, "పాతకాలపు శక్తి" పాల్ రాడార్ చే, 1879 - 1938. మీ ఆశీర్వాదము కొరకు మేము కూడుకొని యున్నాము, మా దేవుని కొరకు కనిపెడతాం; నా ప్రియ స్నేహితుడా, యేసు క్రీస్తు మీ పాప ప్రాయాశ్చిత్తము నిమిత్తము సిలువపై మరణించాడు. మీ పాపమూ కడిగివేయడానికి యేసు క్రీస్తు తన ప్రశస్త రక్తాన్ని సిలువపై కార్చాడు. యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఆయన పరలోకములో, నీ కొరకు ప్రార్ధిస్తున్నాడు. కేవలము ఆయనను నమ్ము. కేవలము ఆయనను నమ్ము. కేవలము ఇప్పుడే ఆయనను నమ్ము. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇప్పుడు నిన్ను రక్షిస్తాడు! పరిశయ్యుడైన సీయోను ఇంటికి యేసు నొద్దకు పాపాత్ములైన స్త్రీ వచ్చింది. బైబిలు చెప్తుంది, "మరియు, ఆ ఊరిలో, ఉన్న పాపాత్మురాలైన, ఒక స్త్రీ, యేసు పరిశయ్యని ఇంటి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, ఒక బుద్ధిలో అత్తరు తీసికొనివచ్చి, వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను" (లూకా 7:37-38). ఈ స్త్రీ పట్టణం పేరుగాంచిన పాపి. ఆమె చాలా పాపాత్మురాలని ప్రజలకు తెలుసు. తనకు చెడ్డపేరు ఉంది. ఆమె యేసు వెనుకకు వచ్చి ఆయన పాదములకు అత్తరు పూసి, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఆమె యేసు నొద్దకు వచ్చింది. "నీ పాపములు క్షమించబడి ఉన్నవి, అని ఆమెతో అనెను. అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని, తమలోతాము అనుకొనసాగిరి? అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్లు; అని ఆ స్త్రీతో చెప్పెను" (లూకా 7:48-50). ఆమె చాలా పాపాత్మురాలు. కానీ ఆమె యేసు నొద్దకు వచ్చింది. ఆయన యొద్దకు వచ్చి ఆయన పదాలను ముద్దు పెట్టుకుంది. ఆయన ఆమెతో అన్నాడు, "నీ పాపములు క్షమించబడి యున్నవి." ఆమె చేసిందల్లా యేసు నొద్దకు వచ్చింది. కానీ అది చాలు! ఆమె పాపాలు క్షమించబడ్డాయి ఆమె రక్షింప బడింది! రక్షింపబడడానికి మీరు చేయవలసిందల్లా ఆమె చేసినట్టు చెయ్యాలి. యేసు నొద్దకు రావడం ద్వారా ఆమె రక్షింపబడింది. యేసు నీతో చెప్తున్నాడు, "నా యొద్దకు రమ్ము...నేను నీకు విశ్రాంతి నిచ్చెదను" (మత్తయి 11:28). నీవు ఇప్పుడే యేసు నొద్దకు వస్తే, ఈ ఉదయన్న, ఆయన నీ పాపములను క్షమించి, నీ ఆత్మను రక్షిస్తాడు యేసు బైబిలు దినాలలో ప్రజలను రక్షించినట్టు. ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. సిలువపై ఆయన కార్చిన రక్తముతో నీ పాపాలన్నీ కడిగేస్తాడు. నీతివస్త్రముతో నిన్ను కప్పుతాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. నీవు చేయవలసిందల్లా ఆయన యొద్దకు రావడం. ఆయన ఇప్పుడు సజీవుడై యుండి, పరలోకములో, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడై యున్నాడు. ఆయన యొద్దకు నీవు వస్తావా? పాతపాట ఇలా చెప్తుంది, నా బంధకాలలో నుండి, విషాదము రాత్రి నుండి, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: యెషయా 64:1-4. |