Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




యేసు వైపు చూచుట

LOOKING UNTO JESUS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం సాయంకాలము, జూన్ 11, 2017 బోధింపబడిన ప్రసంగము
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 11, 2017

"విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు; మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై యున్నాడు" (హెబ్రీయులకు 12:2).


ఈ వచనము క్రీస్తును గూర్చిన శుభవార్తను వివరిస్తుంది. బైబిలు అంతటిలో దీనిని మించిన తెలివితో కూడిన వచనము లేదు నిజ క్రైస్తవులు విస్వాసముచే వివరణ విషయంలో.

ఇప్పుడు, ఈ ప్రసంగాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ వచనాన్ని తీసుకొని జాగ్రత్తగా మీకు వివరిస్తాను. ఈ వాక్యభాగము మీ హృదయాలను తెరనివ్వండి తద్వారా క్రీస్తు వెలుగు మీపై ప్రకాశిస్తుంది, ఇప్పుడు చీకటి తికమక ఉన్నాయి.

ఒక వ్యక్తి గుడికి వెళ్తూ కూడ గొప్ప అంధకారంలో ఉండవచ్చు. ఒక వ్యక్తి బైబిలు చాలా నేర్చుకోవచ్చు, అయినను తికమకలో అంధకారంలో ఉండవచ్చు చదివింది అర్ధం చేసుకోలేక. నా ప్రార్ధన దేవుడే మీ "అవగాహన నేత్రాలను" తెరవాలి (ఎఫెస్సీయులకు 1:18) నేను బోధిస్తుండగా. దేవుడు అలా చేసినప్పుడే ఈ వచనములోని కొన్ని సత్యాలు మీరు జీర్ణించుకోగలరు.

ఈ పాఠ్య భాగము మూడు ప్రాధమిక సత్యాలు తెలియచేస్తుంది:


1. యేసు నీ కొరకు ఏమి చేసాడు.

2. యేసు అది ఎందుకు నీ కొరకు చేసాడు.

3. అందులోని లాభాలను ఎలా పొందుకోగలము.

I. మొదటిది, యేసు నీ కొరకు ఏమి చేసాడు.

"యేసు వైపు చూచుచు [ఎవరు] ... సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి" (హెబ్రీయులకు 12:2).

గ్రీకు పదము "సహించుట" అంటే "బాధను ఓర్పుతో భరించడం" (స్ట్రాంగ్స్). యేసు ఓపికతో గొప్ప శ్రమ హింసల ద్వారా వెళ్ళాడు నీ ఆత్మను పాపపు శిక్ష నుండి రక్షించడానికి. పూలే ఇలా అన్నాడు:

(క్రీస్తు) సిలువను సహించాడు, (విచారము లన్నింటితో కూడ) అన్నింటితో, ఆయన ఆత్మతో విచారము, శరీరములో చిత్రహింసతో కూడిన బాధ, (దెబ్బలు), ఉమ్మివేయడం, ముల్లును గుచ్చడం, కొరడాలతో శరీరమును చీల్చడం, చేతులకు మరియు కాళ్లకు మేకులతో (గాయాలు) గుచ్చుట, మానవ దెయ్యపు దుష్ట ప్రభావము; ఆయన తన భారము వలన అలసిపోలేదు, కృశించి పోలేదు సొలసిపోలేదు. దీన మనస్సుతో తానూ ఎదుర్కొనిన దంతటిని గూర్చి ముందుగా చెప్పబడింది (యెషయా 53లో)! (Matthew Poole, comment on Hebrews 12:2).

తరువాత, కూడ, క్రీస్తు సిలువ వేయబడ్డాడు "అవమానమును భరించి" (హెబ్రీయులకు 12:2). "తృణీకరింపబడడం" అంటే "తక్కువగా ఆలోచించుట" లేక "తక్కువ చేసి ఆలోచించుట" (వైన్స్). యేసు తానూ భరించిన గొప్ప శ్రమను గూర్చి తక్కువగా ఆలోచించాడు ఎందుకంటే మిమ్ములను రక్షించాలని దేవుని మహిమ పర్చాలని ఆలోచించాడు కాబట్టి. "అవమానమును భరించుట." అవమానంగా "నిర్దయ" (స్ట్రాంగ్స్). యేసు మీ పాప శిక్ష నుండి రక్షించడానికి నిర్దయను ఎదుర్కొన్నాడు. నీ స్థానములో నిర్దయ పొందాడు, ఆఖరి తీర్పులో నీవు నిర్దయ ఎదుర్కోకుండా.

యేసు కొట్టబడడం ద్వారా నిర్దయ ఎదుర్కొన్నాడు. ఉమ్మి వేయబడడం ద్వారా గెడ్డము లాగబడడం ద్వారా నిర్దయ ఎదుర్కొన్నాడు. ఆగ్రహముతో ఉన్న గుంపు ద్వారా, "సిలువవేయుట! సిలువవేయుట!" అని అరవడం ద్వారా నిర్దయ ఎదుర్కొన్నాడు ఆయన వస్త్రములు చింపబడి, దిగంబరిగా సిలువపై వేలాడడం ద్వారా నిర్దయ పొందాడు.

ఆయన నిర్దయ పొందాడు, అవమానింప బడ్డాడు, నీ స్థానంలో.

"క్రీస్తు...అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, పాపముల విషయమై శ్రమపడెను" (I పేతురు 3:18).

"యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6).

యేసు నీ పాపముల నిమిత్తమై శిక్షను ఆయన తీసుకున్నాడు. యేసు నీ స్థానంలో శిక్షింప బడ్డాడు.

యేసు నీ స్థానంలో అవమానింపబడ్డాడు. చివరి తీర్పులో నీవు చేసిన పాపాలన్నీ దేవుడు చదువుతాడు. ఇది ప్రపంచమంతటి ముందు నిన్ను అవమాన పరుస్తుంది. కానీ నీవు క్రీస్తును నమ్మితే, నీ స్థానంలో ఆయన అవమానము పొందాడు. నీవు దిగంబరిగా నిలబడకుండా నీ పాపాలను బట్టి అవమానింపబడకుండా, యేసు నీ స్థానములో దిగంబరిగా నిలబడ్డాడు, సిలువపై – నీవు ఆయనను నమ్మితే!

బైబిలు సిలువపై యేసు క్రీస్తు యొక్క "శ్రేష్ఠమైన నెరవేర్పును" గూర్చి బోధిస్తుంది! డాక్టర్ పి. బి. ఫిడ్జ్ వాటర్ అన్నాడు:

ఆయన నెరవేర్పు శ్రేష్టమైనది, దాని అర్ధము ఒకరికి బదులుగా ఉండడం, వేరొకరిని, ప్రతినిధిగా చూపడం (Christian Theology, Eerdmans, 1948, p. 426).

ఆంగ్లపదము "శ్రేష్టమైనది" అనగా "ఒకరి స్థానము మరొకరు తీసుకోవడం" (Webster’s New Collegiate Dictionary, 1960).

అదే క్రీస్తు యేసు నీ కొరకు చేసాడు! "(నీ) స్థానము (క్రీస్తు) తీసుకున్నాడు." ఆయన నీ పాప శిక్షను ఆయన తీసుకున్నాడు.

బైబిలు చెప్తుంది:

"క్రీస్తు చాలామంది పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగింపబడెను" (హెబ్రీయులకు 9:28). "క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి చెందెను" (I కొరింధీయులకు 15:3).

క్రీస్తు పాపమూ చేసినందుకు పొందాల్సిన పరిహారము ఆయన చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు.

నా పెంపుడు తండ్రి కఠినాత్ముడు. ఒకసారి అతడు పోలీసును కొట్టాడు. చెరసాలలో వేశారు. అర్ధరాత్రి నా తల్లి ఎడ్ గాలిక్ కు విడిపించ మని చెప్పింది. ఎడ్ చెరసాలకు వెళ్లి చెల్లించి విడిపించాడు. వారు నా పెంపుడు తండ్రిని వదిలారు. జైలు నుండి బయటికి వస్తూ, ఎడ్ ను చూచి, అన్నాడు, "ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు?" అని అడిగాడు ఇది యేసు చేసింది నాకు గుర్తు చేసింది. నరకంలో నీ పాప శిక్ష అనుభవించకుండా ఆయన వెల చెల్లించి నిన్ను విడిపించాడు. మనము సిలువ వైపు చూచి, "ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు?" అంటాం. దానికి జవాబు – ఆయన చెల్లించి నిన్ను విడిపిస్తున్నాడు – నరకము నుండి తప్పించడానికి! ఇప్పుడే యేసు నందు విశ్వసము ఉంచు!

II. రెండవది, ఎందుకు యేసు ఇది నీ కొరకు చేసాడు.

"ఆయన ముందుంచబడిన దానిని సంతోషంతో అంగీకరించాడు" (హెబ్రీయులకు 12:2).

యేసు బాహాటంగా సిలువకు వెళ్ళాడు. ఎప్పుడైనా తప్పించుకోగల శక్తిమంతుడు. బదులుగా, "ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలే ఆయెను" (యెషయా 53:7). నీ పాపముల కొరకు వెల చెల్లించడానికి ఆయన ఎందుకు దీనంగా సిలువకు వెళ్ళాడు? ఆయన చేసాడు "ఆయన ముందుంచబడిన ఆనందము నిమిత్తం" (హెబ్రీయులకు 12:2).

మొదటిది, పరలోక ప్రవేశ ఆనందమవుతుంది. క్రీస్తుకు తెలుసు సిలువపై మరణించిన వెంటనే పరలోకములో ప్రవేశిస్తాడని. చనిపోతున్న దొంగతో చెప్తాడు, "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు" (లూకా 23:43).

తరువాత, నీవు పరలోక ప్రవేశము చేస్తావని ఆయన ఊహించాడు. మారిన దొంగను చూచి యేసు ఎంత సంతోషించాడు! నిన్ను చూచినప్పుడు ఎంత సంతోష పడతాడు.

నేను క్రీస్తు నొద్దకు నడిపించిన చాలా మందిని నిన్న చూసాను. వారిలో ఒకరు పరిచారకులు ప్రతినిధి. ఇంకొకరు సహాయ సంఘ కాపరి. వీరిని చూడడం నాకు గొప్ప ఆనందము, నలభై సంవత్సరాల క్రితం వారిని క్రీస్తు నొద్దకు నడిపించాడను. పరలోకములో ఈ ఆనందము పొందాలని క్రీస్తు ఆశిస్తున్నాడు. అందుకే ఆయన సిలువ వేయనిచ్చాడు – అందుకే "చాలామందిని క్రీస్తులో రక్షణ మహిమతో నడిపించడానికి" (హెబ్రీయులకు 2:10).

అందుకే క్రీస్తు "కర్త మరియు కొనసాగించువాడు." అతడు మనలో నమ్మకాన్ని నింపుతాడు మరియు అతడు మనలను కచ్చితంగా రక్షిస్తాడు. క్రీస్తు మనందరిని రక్షిస్తాడు!

III. మూడవది, దీనిలోని ప్రయోజనమును నీవు ఎలా పొందుకోగలవు.

"యేసు వైపు చూచుచు...దేవుని కుడి పార్శ్వము నందు ఆశీనుడై యున్నాడు" (హెబ్రీయులకు 12:2).

అపోస్తలుల కార్యములలో అపోస్తలుడు క్రీస్తు పరలోకమునకు ఆరోహనుడై, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యాడు అనే విషయము ప్రస్తావించకుండా ఏ ప్రసంగము చెయ్యలేదు. నేను ఒప్పింపబడ్డాను, మనము కూడ, అపోస్తలులు చేసినట్టు ఆరోహణమును గూర్చి బోధించాలి. దానికి ఇవి కారణాలు:

1. క్రీస్తు ఆరోహణమును తండ్రి కుడి పార్శ్వము మనకు తేట తెల్లము చేస్తాయి క్రీస్తు మరియు తండ్రి ఇద్దరు వేరని – వేరు – వ్యక్తులని. త్రిత్వమును గూర్చిన బైబిలు సిద్ధాంతము ఈనాడు మసకగా అయిపొయింది. చాలామంది ఈ ప్రాముఖ్య విషయములో వేర్వేరుగా ఉన్నారు.

2. గొప్ప బైబిలు సిద్ధాంతాలు సమాధాన పరచడం, ప్రత్యామ్నాయము, నీతిమంతులుగా తీర్చబడడం ఇవి పూర్తిగా కనిపించవు త్రిత్వములో తండ్రి దేవుడు కుమారుడైన యేసు వేరువేరుగా చూపించ బడకపోతే. ఆరోహణములో క్రీస్తు మధ్య వర్తిత్వము నాటకీయంగా వివరించ బడింది.

3. ఆరోహణమును బోధించుట ద్వారా నిర్నయత్వాన్ని నివారించ వచ్చును. అన్ని రకాల నిర్ణయత్వాలను నివారించవచ్చు ఆరోహనుడైన క్రీస్తు వైపు ప్రజలను నడిపించడం ద్వారా.


కొంతకాలం క్రితం పరిశయ్యలపై సుంకరులపై ఒక బోధకుడు అద్భుత ప్రసంగము చేయడం విన్నాను (లూకా 18:9-14). అతడు అన్ని రకాల నిర్ణయత్వాలను చూపించాడు, "పాపి ప్రార్ధన" చేయడం ద్వారా రక్షణ రాదని చెప్పాడు, లేక ముందుకు రావడం, గుడికి రావడం, మొదలగు వాటి ద్వారా. తరువాత అతనన్నాడు, "నీవు యేసు నందు విశ్వాసముంచాలి." నేననుకున్నాను, "పరిపూర్ణమని!" తరువాత అతనన్నాడు, "యేసును నమ్ముట అనగా అది నీ పాపపు వెల చెల్లించడానికి ఆయన చనిపోయాడు అని." నేననుకున్నాను, "ఓ, కాదు! అతడు సిద్ధాంతాన్ని యేసును నమ్మడాన్ని కలిపి, తికమక చేసాడు!"

ఈ బోధకుడు ఎలా తన అద్భుత ప్రసంగాన్ని ముగించాడు నశించు పాపులకు పైకి చూడమని – ఆరోహనుడైన క్రీస్తు వైపు – దేవుని కుడి పార్శ్వమున – పరలోకములో!

"యేసు వైపు చూచుచు (ఆయన)... దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు" (హేబ్రీయులకు 12:2).

అది అక్కడ చూడాలి! అది ఆయనను మనము నమ్మాలి! అది అలా రక్షింప బడాలి!

"ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింప బడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

చూచి జీవించు, నా సహోదరుడా, జీవించు!
ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు!
‘ఇది ఆయన వాక్యములో వ్రాయబడి ఉంది, హల్లెలూయా!
అది ఏంటంటే "చూచి జీవించు."
("చూచి జీవించు" విలియం ఏ. ఓగ్డేన్ చే, 1841-1897).
   (“Look and Live” by William A. Ogden, 1841-1897).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: యోహాను 12:28-32.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"చూచి జీవించు" (విలియం ఏ. ఓగ్డేన్ చే, 1841-1897) .
“Look and Live” (by William A. Ogden, 1841-1897).



ద అవుట్ లైన్ ఆఫ్

యేసు వైపు చూచుట

LOOKING UNTO JESUS

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు; మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై యున్నాడు" (హెబ్రీయులకు 12:2).

I.      మొదటిది, యేసు నీ కొరకు ఏమి చేసాడు – "సిలువను సహించుట, అవమానమును నిర్లక్ష్య పెట్టడం," I పేతురు 3:18; యెషయా 53:6; హెబ్రీయులకు 9:28; I కొరింధీయులకు 15:3.

II. రెండవది, ఎందుకు యేసు ఇది నీ కొరకు చేసాడు – "ఆయన ముందు ఉంచబడిన ఆనందము నిమిత్తము," యెషయా 53:7.
1. పరలోక ప్రవేశ ఆనందము, లూకా 23:42.
2. నీవు పరలోకములో ప్రవేశించుట చూచి సంతోషించుట, హెబ్రీయులకు 2:10.

III. మూడవది, దీనిలోని ప్రయోజనమును నీవు ఎలా పొందుకోగలవు – "యేసు వైపు చూచుచు... దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైయున్నాడు," అపోస్తలుల కార్యములు 16:31.