ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మరియు తలుపు మూయబడెనుAND THE DOOR WAS SHUT డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన, "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). |
మీలో చాలా మంది మీ భవిష్యత్తును గూర్చి భయపడరు. మీరు భయపడరు, ఎందుకంటే మీరు మేల్కొనలేదు. మీ జీవితమూ వెళ్తుండగా, మీరు నిద్రపోతున్నారు. ప్రసంగాలలో మీరు పడుకుంటున్నారు. ఉపదేశములో మీరు నిద్రపోతున్నారు. జీవితమంతా నిద్రపోతూనే ఉన్నారు. కోపపడే దేవుని చేతులలో పడే వరకు, మీరు నిద్రపోతూ ఉంటారు. మీరు మేల్కొని, మీ ఆత్మీయ స్థితిని గ్రహించాలి. మీరు భయపడాలి. మీ ఆత్మ వాస్తవికతను మీరు ఎదుర్కోవాలి. మీరు వణకాలి. ప్రభువు నందలి భయము మీరు అనుభవించాలి. నిద్రపోయేలా, మీరు చాలా భయపడాలి. బైబిలు చెప్తుంది, "యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము " (సామెతలు 1:7). క్రీస్తు జీవించు వారి కొరకు వస్తున్నాడు మరణించు వారి కొరకు కూడ అని క్రైస్తవ్య చరిత్ర అంతటిలో చెప్పబడింది. అది మర్మముగా ఉంది, కాని ఇప్పుడు భయలు పరచబడింది, అయినను మీరు భయపడడం లేదు. 1. మర్మము ("మస్టేరియన్"), మునుపు దాచబడిన సత్యము కొత్త నిబంధనలో బయలు పరచబడింది. కొత్త నిబంధనలో 11 మర్మములు బయలు పరచబడ్డాయి. ఎత్తబడుట అందులో ఒకటి. 2. అందరు మరణించకున్నను, అందరు మర్చబడతారు (I కొరింధీయులకు 15:51). 3. ఈ మార్పు కనురెప్ప పాటలో చోటు చేసుకుంటుంది (I కొరింధీయులకు 15:52). 4. మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము (I కొరింధీయులకు 15:52). "మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు: గాని ఆయన ప్రత్యక్ష మయినప్పుడు, ఆయన యున్నట్లు గానే, ఆయనను చూతుము; గనుక ఆయనను పోలియుందు మని ఎరుగుదుము" (I యోహాను 3:2). బైబిలు చెప్తుంది, "ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండల మునకు మేఘముల మీద కొనిపోబడుదుము; కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (I దెస్సలోనీకయులకు 4:16-17). 1. పరలోకము నుండి క్రీస్తు దిగి వచ్చును (I దెస్సలోనీకయులకు 4:16) 2. ఆయన నేరుగా భూమి మీదికి రాడు, "ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమునకు కొనిపోబడుదుము" (I దెస్సలోనీకయులకు 4:17). 3. క్రీస్తు మేఘములపైకి వచ్చునప్పుడు "కేక" ఉంటుంది బూర ధ్వని ఉంటుంది. (4:16) 4. ఇప్పటికే చనిపోయిన క్రైస్తవులు మొదట సజీవులై ఎత్తబాడతారు – పట్టబడతారు (4:17ఎ). 5. తరువాత జీవించు వారు నిజ మార్పు నొందిన వారు మధ్యాకాశములో యేసును కలుసుకోవడానికి ఎత్తబడతారు (4:17బి). బైబిలు బుద్ధి గల బుద్ధిలేని కన్యకలను గూర్చి మాట్లాడుతుంది. ఈ ఉపమానములో అర్ధము ఉద్దేశము ఉన్నాయి. ఈ ఉపమానము ఎత్తబడుటను గూర్చి మాట్లాడుతుంది. బైబిలు చెప్తుంది, "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). ఈ ఉదయాన్న మూడు విషయాలు ఆలోచించండి. 1. మీరు మార్పు నొందకపోతే, బయట ఉండిపోతారు – – ఎత్త బడకుండా విడిచి పెట్టబడతారు. 2. ఎత్తబడుట ఎప్పుడైనా రావచ్చని సూచనలు చెప్తున్నాయి. 3. ఎత్తబడుట తప్పిపోతే మీకు చచ్చిపోతే బాగుండేది అని అనిపిస్తుంది. I. మొదటిది, మీరు మార్పు నొందకపోతే, బయట ఉండిపోతారు – ఎత్తబడకుండా విడిచి పెట్టబడతారు. బైబిలు చెప్తుంది: "వారు కొనబోవుచుండగా, పెండ్లి కుమారుడు వచ్చెను (క్రీస్తు వచ్చెను); అప్పుడు సిద్ధ పడియున్న వారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి (స్వర్గంలోనికి); మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). నోవాహు దినములలో జరిగినది దీనికి గొప్ప దృష్టాంతము: "ప్రవేశించిన వన్నియు (ఓడలోనికి), దేవుడు అజ్ఞాపించినట్టుగా జరిగెను: అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను" (ఆదికాండము 7:16). మరియు దేవుడు చెప్పాడు: "ఇంకను ఏడూ దినములకు నేను నలబది పగలులు నలబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించెదను" (ఆదికాండము 7:4). దేవుడు జల ప్రళయమునకు వారము రోజుల ముందు ఓడ తలుపు మూసివేసెను. ఈ లాంటి దేవుడు ఎత్తబడే సమయంలో తలుపు మూసివేస్తాడు, తీర్పులకు ముందు. "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). మీరు మార్పునోందకపోతే, మీకు తలుపు మూసివేయ బడుతుంది – ఎత్తబడుటలో విడిచిపెట్ట బడతారు. అందుకే మీ ఆత్మను గూర్చి ఆలోచించాలి. ఈ బోధకు స్పందించాలి. మీరు ఇప్పుడే యేసును విశ్వసించాలి. యేసు అన్నాడు: "చాలా మంది నన్ను అడిగారు, ప్రభు, ప్రభు, మనకు లేదు...చాలా అద్భుతమైన పనులు చేసాము? అప్పుడు నేను మిమ్మును, ఎన్నడును ఎరుగును: అక్రమము చేయువారలారా, నా యెద్ద నుండి పొండని వారితో చెప్పుదును" (మత్తయి 7:23). "మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో, మిమ్మును మీరే శోధించు కొనుడి" (II కొరింధీయులకు 13:5). మీరు మార్పు నొందకపోతే, నిజంగా యేసును విశ్వసించక పొతే, భావాలు సిద్ధాంతాలతో నమ్మితే, మీరు ఎత్తబడుటకు సిద్ధంగా లేరు. మీరు విడిచి పెట్టబడతారు! "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). II. రెండవది, సూచనలన్నీ జరిగాయని మీరు గ్రహించాలి. ఈ ఉదయాన మీకు తలుపు వేయబడవచ్చు. 1. 1948లో ఇశ్రాయేలు దేశము పునరుద్దరింప బడుట, యూదులు వారి స్వస్థలానికి తిరిగి వచ్చుట (లూకా 21:24; మత్తయి 24:32-34; యేహెజ్కేలు 37:21; 38:8). 2. క్రైస్తవులు యూదులు ప్రపంచమంతటా హింసింప బడుట (మత్తయి 24:9-10; యిర్మియా 30:7; దానియేలు 12:1). 3. లోకమంతా కరువులు పెరుగుట, అసమతుల్య ఖగోళము, ఎయిడ్స్ లాంటి పీడ రోగాలు, భూకంపాలు పెరుగుట (మత్తయి 24:7) 4. క్రైస్తవ్యములో స్వధర్మము పెరిగిపోవుట (II దెస్సలోనీకయులకు 2:3; మత్తయి 24:11-12). 5. గొప్ప జల ప్రళయమునకు ముందు నోవాహు దినములలో ఉన్న పరిస్థితులు, అవే ఇప్పుడు నెలకొనడం (మత్తయి 24:37-40). బైబిలు నోవాహు దినమును క్రీస్తు రాకడతో పోల్చుతుంది. 1. నోవాహు దినములలో, వారు రక్షణను పట్టించుకోలేదు. వారు మేల్కొనలేదు. వారు మీలానే ఉన్నారు – భయము లేదు నేరారోపణ లేదు. 2. నోవాహు దినములలోని సూచన ఇక్కడ ఉంది. మీరు విడిచి పెట్టబడతారు! ఆమె శబ్దము విని తల ఊపి - - ఆయన వెళ్లి పోయాడు అంటుంది. "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). కాని మీరు ఎత్తబడుటలో తలుపు మూయబడే వరకు వేచి యుండనవసరం లేదు. ఈ ఉదయాన్న దేవుడు నిత్యత్వములో తలుపు మూసివేయవచ్చు. దేవుడు మీతో విసిగి పోవచ్చు. దేవుడు రక్షణ ద్వారమును మీకు మూసేయవచ్చు. క్షమించరాని పాపమూ మీరు చెయ్యవచ్చు, గ్రహింపు లేకుండానే. రక్షింపబడే అవకాశాన్ని కోల్పోవచ్చు. దేవుడు మీ ద్వారాన్ని మూసివేస్తే, మీకు ఏ మాత్రమూ నిరీక్షణ ఉండదు. తలుపు మూయబడుతుంది, మీరు నిత్యత్వములో నశించి పోతారు. III. మూడవది, ఎత్తబడుట తప్పిపోతే మీకు చచ్చిపోతే బాగుండేది అనిపిస్తుంది – మరియు తలుపు మూయబడెను! ఇదంతా కథ అని మీరనుకోవచ్చు. మీ మనసు దేనిమీదికో మళ్ళించుకోవచ్చు. కాని ఎత్తబడుట తప్పిపోయినప్పుడు చనిపోతే బాగుండేది అనిపిస్తుంది. బైబిలు తేటగా చెప్తుంది: "ఆ దినములలో మనష్యులు మరణమును వెదకుదురు… గాని అది వారికి దొరకనే దొరకదు..." (ప్రకటన 9:6). ఎత్తబడుట తప్పిపోయినప్పుడు ఆత్మహత్యను గూర్చి ఆలోచిస్తారు. చనిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు?
1. పాతాళము నుండి వచ్చే దెయ్యాలు మిమ్ములు చిత్రహింసలు పెడతాయి, ప్రకటన 9:1-2 ప్రకారము. డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఈ దెయ్యాలను గూర్చి ఇచ్చిన వివరణ వినండి: "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). 2. ఆ దినాలలో క్రైస్తవుడవాలనుకుంటే నీవు శిరచ్చేదనము చేయబడతావు. బైబిలు చెప్తుంది "క్రూర మృగములకైనను దాని ప్రతిమ కైనను నమస్కారము చేయక, తమ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును, శిరచ్చేధనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచితిని" (ప్రకటన 20:4). మీరు శ్రమల దినాలలో ఉన్నారని గ్రహిస్తారు. వారు ఒక పరికరాన్ని అమరుస్తారు, చేతి చర్మము పైగాని, నొసట మీదగాని. అంత్య క్రీస్తు ఆరాధికుడవుతావని నీవు గుర్తు చేసుకుంటావు. మీరంటారు, "లేదు, నా శరీరంపై అది ఉంచుకోవడం నాకు ఇష్టము లేదు." కాని అది లేకుండా మీరు ఏమి కొనలేరు. ఏది కొనాలన్నా మీ చెయ్యి "పరీక్షింప" బడుతుంది. మీరు ఆకలితో అలమటిస్తారు. దుకాణంలో మీరు భోజనము కొనుక్కోలేరు! ఎవరో ఒకరు మిమ్మును పట్టుకుంటారు. క్రైస్తవుడవైనందుకు, మీ తల నరికివేస్తారు. మీరు సమస్తము కోల్పోతారు, ఎందుకంటే విడిచి పెట్టబడతారు కనుక! "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). 3. మీరు తీర్పుల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఒకరంటారు, "సరే, నా చేతికి వారు పరికరాన్ని అమర్చనివ్వండి. నేను బాగుంటాను. నా తల వారు నరకరు." కాని, తల నరకడం తప్పించుకున్నా, తీర్పుల ద్వారా వెళ్ళాల్సి వస్తుంది! (1) భయంకరమైన నొప్పి మీ శరీరంలో వస్తుంది అది రాత్రింబవళ్ళు భయంకర బాధకు గురి చేస్తుంది (ప్రకటన 15:6). (2) సముద్రము నీరు మంచినీరు విష పూరితమవుతాయి. నీరంతా విషయమయమవుతుంది. తాగడానికి ఏమియు ఉండదు. (ప్రకటన 16:3-4). (3) భయంకరమైన వేడిమితో వేధింపబడతారు. ఒక ఉల్క వస్తాయి మరియు మీరు కొట్టుకుపోతాయి. మీ శరీరము భయంకరంగా కాల్చబడుతుంది. మందు ఏమి ఉండదు. మీకు కాలిన గాయాల నుండి పస కారుతూ ఉంటుంది (ప్రకటన 16-8-9). (4) విద్యుత్తు సరఫరా ఉండదు. మీరు కటిక చీకటిలో ఉంటారు, బాధతో నాలుక కరుచుకుంటారు (ప్రకటన 16:10-11). (5) ప్రపంచ సైన్యాలు కలుస్తాయి. ఇది ఇంకా మీకు అసౌకర్యము తికమక కలిగిస్తాయి – యుద్ధ సమయములో. మీలో చాలామంది – పురుషులు స్త్రీలు – మీ ఇష్టానికి వ్యతిరేకంగా సైన్యంలోనికి చేరబడతారు. (ప్రకటన 16:12-16). (6) గొప్ప భూకంపము, ఎన్నడు రానంత గొప్పది వస్తుంది. కొండ చరియలు భూమిపై పడతాయి. ఎక్కడ దాగుకుంటారు? భూకంపము వలన భవనాలు కూలిపోతాయి. ఎక్కడ దాగుకుంటారు? (ప్రకటన 16:17-21). ఇదంతా మీకు జరుగబోతుంది ఎందుకంటే మీరు మార్పును తిరస్కరించారు కాబట్టి. మీకు తెలుసు యేసు క్రీస్తు మీ పాపాల ప్రాయాశ్చిత్తానికి సిలువపై మరణించాడని. మీకు తెలుసు ఆయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోహనుడై, అద్వితీయ దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడని. మీకు తెలుసు దైవ కుమారుడు మీకు కావాలని మీ పాపాలు క్షమించడానికి ఆయన రక్తము ద్వారా వాటిని కడిగి వేయడానికి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు – కాని మీరు బుద్ధిహీనులుగా ఉన్నారు. మీరు ఆడారు నవ్వారు, కుంటి సాకులు చెప్పారు. మీరు విడిచి పెట్టబడ్డారు! "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). డాక్టర్ హైమర్స్, దయచేసి వచ్చి ఆరాధనను ముగించండి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్: మత్తయి 25:1-10. |
ద అవుట్ లైన్ ఆఫ్ మరియు తలుపు మూయబడెను AND THE DOOR WAS SHUT డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే వ్రాయబడిన, "మరియు తలుపు మూయబడెను" (మత్తయి 25:10). I. మొదటిది, మీరు బయట ఉండిపోతారు ఎత్తబడకుండా విడిచి పెట్టబడతారు, మత్తయి 25:10-13; మత్తయి 7:21-23; II కొరింధీయులకు 13:5. II. రెండవది, సూచనలన్నీ జరిగాయని మీరు గ్రహించాలి ఈ ఉదయాన మీకు తలుపు వేయబడవచ్చు, మత్తయి 24:37-41. III. మూడవది, ఎత్తబడుట తప్పిపోతే మీకు చచ్చిపోతే బాగుండేది అనిపిస్తుంది, ప్రకటన 9:6; 9:1-12; 20:4; 16:1-21. |