ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పాపుల కొరకు రొట్టెను అడుగుట – నూతన తలంపు!ASKING BREAD FOR SINNERS – A NEW THOUGHT! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం సాయంకాలము, ఏప్రిల్ 22, 2017 |
జాన్ సామ్యూల్ కాగన్ కొద్ది నిమిషాల క్రితము లూకా 11:5-13 చదివారు. కాని మీరు మళ్ళీ చూడాలని కోరుతున్నాను. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1090 పేజీలో ఉంది. తొందర పెట్టె స్నేహితుని గూర్చిన ఉపమానము ఇది. ఈ రాత్రి ఈ ఉపమానము నుండి కొన్ని ప్రాముఖ్య విషయాలు పంచుకుంటాను. మొదటిగా, ఈ ఉపమానములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. "మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైన ఒక స్నేహితుడు ఉండగా, అర్ధరాత్రి వేళ, స్నేహితుని వద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా దగ్గర ఏమియు లేడని అతనితో చెప్పెను?" (లూకా 11:5-6). మొదటి "స్నేహితుడు" చాలా రొట్టెలు కలిగియున్నాడు. ఆయన తండ్రి దేవుడు. రెండవ వ్యక్తి రొట్టెను అడిగేవాడు. అతడు క్రైస్తవుడు, రొట్టె అవసరము. మూడవ స్నేహితుడు క్రైస్తవుని దగ్గరకు వచ్చాడు. అతడు నశించువాడు, రక్షింపబడనివాడు. అతనికి రొట్టె కావాలి. మీరు నేను నిజ క్రైస్తవులము దేవునికి నశించు వారికి మధ్య నిలబడతాం. ఈ ఉపమానంలో "రొట్టె" ఏమిటి? మునుపు మనలో కొందరు అనుకున్నాం పరిశుద్ధాత్మ అని. కాని అది తప్పు అని అనుకుంటున్నాను. నిజము, ప్రార్ధనకు జవాబుగా, పరిశుద్ధాత్మ ఇవ్వబడింది, 13 వచనంలో, "కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి యుండగా: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను?" (లూకా 11:13). ఇప్పుడు నేను ఒప్పింపబడ్డాను "రొట్టె" పరిశుద్ధాత్మ కాదు అని. డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఈ ఉపమానముపై వివరంగా వ్రాసాడు (Prayer: Asking and Receiving, Sword of the Lord, 1970, p. 70). "రొట్టె"ను గూర్చి, డాక్టర్ రైస్ అన్నాడు క్రీస్తు అని. "ఆయనే ఆహారము." (యోహాను 6:35). మునుపు నేననుకున్నాను "రొట్టె" పరిశుద్ధాత్మ అని. కాని నేను తప్పు. రొట్టె యేసు క్రీస్తే. ఇది నూతన నిబంధనలో తేటగా ఉంది. దగ్గరగా ఒక అధ్యాయమంతా యేసు "జీవాహారము" అని చెప్తుంది. యోహాను ఆరవ అధ్యాయములో యేసు ఏమి చెప్పాడో వినండి: "పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చునది దేవుడు అని గ్రహించు, ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అనెను" (యోహాను 6:33). "జీవాహారము నేను" (యోహాను 6:35). "జీవాహారము నేను" (యోహాను 6:48). "నేను జీవించు ఆహారము" (యోహాను 6:51) "నేనిచ్చు ఆహారము నా శరీరము" (యోహాను 6:51). చాలా సార్లు యేసే "జీవాహారము" అని చెప్పబడింది. అప్పుడు క్రైస్తవుడు లూకా 11:6 లో, "ఒక స్నేహితుడు... నా యొద్దకు వచ్చాడు, అతనికి ఇచ్చుటకు నా యెద్ద ఏమియు లేదు" అని ఎందుకు చెప్పాలి? వారు "జీవాహారము" తినకుండా మనము శక్తి హీనులుగా ఉన్నాము! మన ఆత్మ సంపాదనలో మన బోధలో, వారికి జీవాహారము ఇవ్వడానికి మనకు శక్తిలేదు! మనకు సువార్త తెలుసు, కాని మనకు శక్తి లేదనుకుంటాము, అందుకే, "నా స్నేహితుడు...వచ్చాడు, ఆయన కిచ్చుటకు నా దగ్గర ఏమి లేదు" (లూకా 11:6). అది నా ఒప్పుకోలు – "అతనికివ్వడానికి నా దగ్గర ఏమిలేదు." అలాగే చాలామంది యవ్వనస్తులు బాప్టిస్టు సంఘాలు వచ్చినప్పుడు అనుకుంటారు. వారనుకుంటారు వారి అవసరత సంఘము తీర్చదని. చాలా బాప్టిస్టు సంఘాలలో, "కొన్ని పాటలు తప్ప ఏమి ఇవ్వలేరు." వారంటే నాకు అసహ్యము! అందరు అలాగే ఉన్నారు! వారు "పాటల ఆరాధికులు" – పాపికి యేసు అవసరముందని తెలియ పరచలేదు! అతనికివ్వడానికి నా దగ్గర ఏమిలేదు! ఏమి లేదు! ఏమి లేదు! పాత "ఆరాధన" పాట. ఏమిలేదు! ఏమిలేదు! అతనికివ్వడానికి ఏమిలేదు! ఏమిలేదు! ఏమిలేదు! ఎండబారిన మట్టితో కూడిన, నిర్జీవమైన, వచనము వెంబడి వచనము వివరణ. మృత "ఆరాధన" పాటలు సాగదీసే బైబిలు పఠనము మొన్న రాత్రి విన్నారు. మీకు మరొక రాత్రి కూడ విన్నారు. ఆనారోగ్యకర, మామూలు యవనస్తులు సహాయము పొందలేరు. జీవముతో కూడినవి ఒకటే పాల్ రాడెర్ ఈస్టరు పాట, "తిరిగి జీవించాడు" పాడడం. మనము మృత ఆరాధనతో మాయలో పడ్డాం నేను అరచి అందరిని లేపి సరిగ్గా పాడించాను! మన సంఘాలు లోకము నుండి నశించు యవనస్తులను సంపాదింపక పోవడంలో ఆశ్చర్యం లేదు! ఇప్పటికే సంఘములో మనము 90% యవనులను కోల్పోయాము. నేను యువకునిగా ఉన్నప్పుడు అదే జరిగింది. నన్ను ఆకట్టుకున్నదేది గుడిలో లేదు. అది మృతమై ఎండినదిగా ఉంది. నా మొదటి సంఘములో నాకు సవాలుగా ఏమిలేదు. ప్రతి ఆరాధనలో నా మనసు వెలితి అయ్యేది. యేసు అక్కడ లేడు కాబట్టి నా బుర్ర కాలిగా అయిపోయేది. నాకనిపించింది స్త్రీలను సంతోష పరచడానికి అన్ని ఆరాధనలు రూపొందింప బడ్డాయని. అవి నాకు ఏమి ఇవ్వలేకపోయాయి! టివిలో చార్లెస్ స్టేన్లీని గాని, పాల్ చాపెల్ ను గాని అంతర్జాలములో చూడండి. అవి నాకు మృతమైన, ఎండిన, అనాసక్తి కరమైనవి యేసు క్రీస్తును జవాబుగా చూపించలేదు, వారి పాపానికి, ఒంటరితనానికి, నిత్యత్వానికి. "నా స్నేహితుడు మార్గ ప్రయాణంలో నా దగ్గరకు వచ్చాడు, ఆయన కిచ్చుటకు నా దగ్గర ఏమిలేదు!" నేను రిక్ వారిన్ గుడికి వెళ్లాను. డాలస్ లోని మొదటి బాప్టిస్టు సంఘములో ఉన్నాను. మన బిబిఎఫ్ఐ గుంపులలో కూడ ఉన్నాను! వారంతా కూరుకుపోయారు "వారికి ఇచ్చుటకు ఏమియులేదు" అని కూడ గ్రహింప లేకపోయారు. జవాబు 9 మరియు 10 వచనాలలో ఉంది. "అటు వలే మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వాని కియ్యబడును; మరియు వెదుకు ప్రతివానికి దొరకును; తట్టిన ప్రతివానికి తీయబడును. మీలో తండ్రియైన వాడు మీ కుమారుడు రొట్టెను అడిగిన, రాయినిస్తారా? తన కుమారుడు చేపనడిగితే, ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే, తేలునిచ్చునా? కాబట్టి, చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగి యుండగా: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను" (లూకా 11:9-13). యేసు ఉపమానాన్ని ఇలా చెప్పి ముగించాడు వెదకుడి, తట్టుడి పరలోకపు తండ్రి "తన్ను అడుగువారిని పరిశుద్ధాత్మ" ఇచ్చే వరకు అడగాలి (లూకా 11:13). అడుగుతూ ఉండాలి (గ్రీకులో అది అర్ధము). వెదకుతూ ఉండాలి! తడుతూ ఉండాలి! అడుగుతూ ఉండాలి! చూడండి, ఆరాధనలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి యుండాలి యేసు ముఖ్యము అనిపించక పోవచ్చు – యేసు అసలు హాజరు అవడు! ఎవరు రక్షింపబడరు! 8 వ వచనములో రక్షకుడు చెప్తున్నాడు, "అతడు తన స్నేహితుడైనందుకు లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను, లేచి అతనికి కావలసిన వన్నియు ఇచ్చునని మీతో చెప్పుచున్నాను" (లూకా 11:8). గ్రీకు పదము "తొందరపెట్టే" అంటే కేజేవిలో "సిగ్గుమాలిన ప్రాదేయత." ప్రాదేయత అంటే – మన ప్రతి ఆరాధనకు కూడ అంతే. "మన్నా" లో రాత్రికి రాత్రే అదేవిధంగా ఉండేలా ఇశ్రాయేలీయులు ప్రయత్నించడం జరిగింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ప్రార్ధన కూటములు ఆరాధనలు "జంగుపడుతాయి" మనం "సిగ్గుమాలి మాటిమాటికి" అడగకపోతే ప్రతి ప్రార్ధన కూటము ఆరాధన ముందు! మనము యేసు ఆరాధనలో ఆపేస్తున్నాము – ప్రకటన గ్రంధములో లవోదికయ సంఘములో ఆయన వెల్లగొట్టినట్టు. అది నులి వెచ్చగా ఉంది. అగ్నిలేదు! ఉరుములేదు! క్రియాశీలక పాడడం లేదు! బోధ లేదు – కేవలము మృత వచనము వెంబడి వచనము వివరణ! మృత వివరణ ప్రసంగము చెప్పడానికి పరిశుద్ధాత్మ అవసరము లేదు! వివరణ ప్రసంగాలు బుర్రతో మాట్లాడతాయి! సువార్తిక ప్రసంగాలు హృదయంతో మాట్లాడతాయి! హృదయంతో! హృదయంతో! "నీతి కలుగునట్లు మనష్యుడు హృదయములో విశ్వసించును" (రోమా 10:10). హృదయముతో – బుర్రతో కాదు! మనసుతో మాత్రమే కాదు! క్రీస్తు హృదయముతో మాట్లాడాలి లేకపోతే ఎవరు రక్షింప బడలేరు – ఎవరు ఉజ్జీవింప బడలేరు – జీవాహారము ఎవరు రుచి చూడలేదు! యేసు మన నిలివెచ్చని సువార్తిక బాప్టిస్టు ఆరాధనల నుండి వెళ్ళిపోయాడు! వెళ్ళిపోయాడు! వెళ్ళిపోయాడు! వెళ్ళిపోయాడు! యేసు చెప్పాడు, "నేను తలుపు నొడ్డ నిలుచుండి, తట్టుచున్నాను" (ప్రకటన 3:20). ఎందుకు ఆయన సంఘము బయట ఉండి తలుపు తడుతున్నాడు? ఎందుకంటే మనము ఆయనకు బయటకు పంపేసాం, అందుకే. పరిశుద్దాత్మ కొరకు ప్రతి ఆరాధనలో ప్రార్ధించకపోతే, ఆరాధనలలో యేసు ఉండడు! పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే యేసు వస్తాడు – పరిశుద్దాత్మ మనం ప్రార్ధించినప్పుడు మాత్రమే ఉంటుంది! మనము ప్రార్ధించినప్పుడే ఉంటుంది! మనము ప్రార్ధించినప్పుడు మాత్రమే ఉంటుంది! మన చాలా ఆరాధనలు కేథలిక్ ఆరాదనల కంటే సృజనాత్మకంగా లేవు. మీరు అది చూసారు. మీరు అది చూసారు. నిజానికి, కేథలిక్ ఆరాధన కంటే ఎక్కువ మృతంగా ఉంది! మీకు తెలుసు నేను నిజం చెప్పానని! "నా స్నేహితుడు ప్రయాణము చేయుచు... నా దగ్గరకు వచ్చాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6). ఆ అర్ధరాత్రి అతడు ఏ "రొట్టె" అడుగుతున్నాడు? పొరుగు వాని తలుపు కొట్టినప్పుడు అతనికి ఏమి కావాలి? అతనికి కావలసిన రొట్టె, తట్టిన రొట్టె, అతడు అడిగిన రొట్టె యేసే. ఇంకేమి కావాలి పాపులకు? 13 వచనములో చివరిలో, యేసు అన్నాడు, "తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుము?" (లూకా 11:13). స్కోఫీల్ద్ గమనిక ఈ విషయాన్ని వదిలివేసింది. ప్రార్ధన యోధుడు తన కొరకే పరిశుద్ధాత్మను అడగడు. అతడు నశించిన తన స్నేహితుని కొరకు పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు అతడు యేసును నమ్మునట్లు పరిశుద్ధాత్మ తన హృదయాన్ని తెరచునట్లు యేసు నొద్దకు వచ్చునట్లు! "నా స్నేహితుడు మార్గ మధ్య ప్రయాణంలో నా దగ్గరకు వచ్చాడు, అతనికి ఇచ్చుటకు నా వద్ద ఏమిలేదు." నిజంగా, దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించకపోతే, మీ ప్రార్ధనలకు జవాబుగా, నశించు పాపులకు ఇవ్వడానికి మీ దగ్గర ఏమి ఉండదు! డాక్టర్ జాన్ ఆర్. రైస్ సరిగ్గా చెప్పాడు. యేసు ఈ పాఠము ముగిసే వరకు అసలైన పదాలు ఉపయోగించలేదు... ప్రార్ధనను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి ప్రార్ధించాలని ఆయన తన శిష్యులకు బోధిస్తున్నాడు... తానూ నిజంగా ఉజ్జీవము తీసుకువస్తాడు, పాపులను ఒప్పించి వారిని మారుస్తాడు, అతడు దైవ జనునికి జ్ఞానము శక్తి నాయకత్వము అనుగ్రహిస్తాడు! మనము పాపుల కొరకు రొట్టెను అడిగినప్పుడు, అది అవసరమని నిజంగా మన అభిమతం...పరిశుద్ధాత్మ దేవుడు (రైస్, ఐబిఐడి., పేజి 96). ఇంకా నశించుచున్న మీతో నేను మాట్లాడుతున్నాను. ఉపమానములో యేసు క్రీస్తు రొట్టె. అన్నింటి కన్నా ప్రభువైన యేసు క్రీస్తు మీకు అవసరము! మన ఆరాధనలో పరిశుద్ధాత్మ దిగిరాకపోతే మీ పాపాలకు ఒప్పుకోలు పొందుకోరు. యేసు చెప్పాడు, "ఆయన వచ్చినప్పుడు, పాపమును గూర్చి ఒప్పుకొనచేయును" (యోహాను 16:8). మా ప్రార్ధన పరిశుద్ధాత్మ దిగి వచ్చి నశించు పాపిని హృదయంలోని భయంకర పాపాన్ని గూర్చి ఒప్పింప చేయాలని, మీ కఠిన హృదయంలోని లోతైన పాప భూఇష్టతను అనుగ్రహించేటట్టు చేయాలి. పరిశుద్ధాత్మ దానిని గూర్చి మీరు భాద పడేలా చేయకపోతే క్రీస్తును గూర్చిన నిజ అవసరత మీకు అనిపించదు. తరువాత, కూడ, సంపూర్ణ రక్షణ కొరకు మీరు క్రీస్తు చేరువకు వచ్చునట్లుగా దేవుని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధించాలి. రక్షకుడు చెప్పాడు, "నన్ను పంపిన తండ్రి దానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు" (యోహాను 6:44). కనుక, యేసు నొద్దకు మీరు వచ్చునట్లుగా మనం ప్రార్ధించాలి, ఎందుకంటే యేసు మాత్రమే పాపము నుండి నరకము నుండి మిమ్ములను రక్షింప గలడు. ఇప్పటి వరకు మీరు సువార్త మాత్రమే విన్నారు. మీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము యేసు సిలువపై మరణించాడని మాత్రమే విన్నారు. యేసు రక్తము మీ పాపాలు కడిగి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చుతుందని మాత్రము విన్నారు. మృతులలో నుండి యేసు లేచాడని మాత్రమే విన్నారు. ఆయనపరలోకంలో సజీవుడై, మీ కొరకు ప్రార్దిస్తున్నాడని మాత్రమే విన్నారు. కేవలము మీరు ఈ సత్యాలు మాత్రమే విన్నారు, కాని మీ స్వంత జీవితాలలో మీరు ఎన్నడు వాటిని అనుభవించలేదు. మరియు ఆ అద్భుత సత్యాలు మీరు ఎన్నడు అనుభవించలేదు మీరు కేవలము ప్రతి ఆదివారము గుడిలో కూర్చుంటే, మళ్ళీ మళ్ళీ వాటిని వింటూ ఉంటే. ఆ సత్యాలను వినడం కంటే ఎక్కువ మీకు జరగాలి లేనిచో మీరు ఎన్నడు రక్షింప బడలేరు! పరిశుద్ధాత్మ దిగి వచ్చి మీ పాపాలను ఒప్పించాలి. పరిశుద్ధాత్మ దిగి వచ్చి యేసు వైపు మిమ్ములను ఆకర్షించాలి. పరిశుద్ధాత్మ దిగి వచ్చి సజీవుడైన క్రీస్తుతో దైవిక మనవ సంధి జరిగించాలి. యేసు నొద్దకు చేరడానికి ఒక అద్భుతము మీకు జరుగుతుంది. మీరు తిరిగి జన్మించడానికి ఒక అద్భుతము జరుగుతుంది. కేవలము దేవుని ఆత్మ మాత్రమే మీ జీవితంలో ఆ అద్భుతము జరిగేటట్టు చేస్తుంది. మీ ఆత్మీయ అవసరతల నిమిత్తము పరిశుద్ధాత్మ రాకపోతే, పరిశుద్ధాత్మ మన ఆరాధనలో లేకపోతే, ఆయన లేకపోతే మనము చెప్పగలం, "నా స్నేహితుడు ప్రయాణము చేయుచు...నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6). అందుకే మీ రక్షణ కొరకు మేము ప్రార్ధించాము. అందుకే మేము అడుగుతూనే ఉన్నాము. అందుకే మేము వెదుకుతూ ఉన్నాము. అందుకే మేము తడుతూ ఉన్నాము – అలా చేస్తూనే ఉంటాము దేవుడు ఆకాశము తెరచి పరిశుద్ధాత్మ దింపి మిమ్మును మార్చే వరకు, నిత్యజీవము మీకు ఇచ్చే వరకు! యేసు చెప్పాడు "తండ్రి తన్ను అడుగువారిని పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా [అనుగ్రహించాలి]" (లూకా 11:13). మీ కొరకు ప్రార్ధిస్తున్నాము. మేము దేవుని అడుగుతున్నాము తన ఆత్మను పంపి మీ పాపము ఒప్పించాలని, అద్భుత మార్పు అనుభవంతో క్రీస్తు మిమ్మును ఆకర్షించాలని! క్రీస్తు ఆయన రక్తంలో మీ పాపాలు కడిగేస్తాడు. ఆయన నీతి వస్త్రముతో మిమ్ములను కప్పి దేవుని ప్రేమించి పాపాన్ని ద్వేషించే హృదయము మీకు ఇస్తాడు. మీ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను మీకిస్తాడు! "మీ కొరకు నేను ప్రార్ధిస్తున్నాను." ఈ పాట పాడండి! మీకోరకు నేను ప్రార్ధిస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్ధిస్తున్నాను, గత ఆదివారము రాత్రి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధించాము. అందరు వెళ్ళిపోయారు నేను డాక్టర్ కాగన్ తో కూర్చున్నాను. అప్పుడు టామ్ జియా వచ్చి రక్షింపబడ్డాడు – ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధన చేయడం అయింది! ఆమెన్ మరియు ఆమెన్! ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము జాన్ సామ్యూల్ కాగన్ చే: లూకా 11:5-13. |