ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు కుమారత్వమును గూర్చిన ఋజువు!THE PROOF OF CHRIST’S SONSHIP! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారము సాయంకాలము, ఏప్రిల్ 15, 2017 "యేసు క్రీస్తు శరీరమును బట్టి, దావీదు సంతానముగాను; మృతులలో నుండి పునరుత్థాను డైనందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను, ప్రభావముతో నిరూపించబడెను" (రోమా 1:3-4). |
నేను డాక్టర్ విల్బర్ యం. స్మిత్ ను తన క్రైస్తవ సాహిత్య జ్ఞానమును బట్టి గొప్పగా అభినందిస్తాను, ఆయన 1963 లో పుల్లర్ సెమినరీని యదార్ధతతో విడిచి పెట్టాడు, అది బైబిలు నుండి వైదొలగి స్వతంత్రను చేపట్టింది (see Harold Lindsell, Ph.D., The Battle for the Bible, 1978 edition, pp. 110-112). డాక్టర్ స్మిత్ రోమా 1:4 ను గూర్చి ఒక దూసుకు పోయే ప్రశ్న వేసాడు, "నేను ఆశ్చర్య పోతున్నాను ఎందుకు మన గొప్ప బోధకులు దీనిపై బోధించరు, లేక ప్రసంగము ముద్రించరు, ఈ విశ్వాసాన్ని పెంపొందించే ఈ పాఠ్యభాగముపై?" (Wilbur M. Smith, D.D., Therefore, Stand, Keats Publishing, 1981 edition, p. 583). నేననుకుంటాను దానికి కారణము గత 125 సంవత్సరాలలో క్రీస్తు పునరుత్థాన మును గూర్చి చాలా తక్కువ బోధింప బడుట, ముఖ్యంగా "నిర్నయత్వత." ఎదుగుదల నుండి సి. జి. ఫిన్నీ కాలము నుండి, ప్రసంగాలు మానవుడు తానూ చేసే దానిపై, దృష్టి పెడుతున్నాయి. ఈ రోజులలో, బోధకులు దేవుని విషయాలు వెనుకకు నెట్టేస్తున్నాయి. బదులుగా, మానవుని పనిపై దృష్టి సారిస్తున్నారు. అందువలన సువార్తిక క్రైస్తవ్యము ఈనాడు వేదాంతము బదులు మానవీయము, క్రీస్తు పరము బదులు మానసికము, క్రీస్తు బిందువుగా బదులు మనవ కేంద్రముగా తయారయి పోయింది. ప్రతి ప్రసంగము, అపోస్తలుల కార్యములలో వ్రాయబడింది, పునరుత్థానమును కేంద్రముగా చేసింది. ఆ అపోస్తలులు క్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పకుండా బోధింప లేకపోయారు! సువార్తలో అది ప్రధాన భాగముగా మీరు బోధించారు. ఈనాడు, అది, క్రీస్తు పునరుత్థానము గూర్చి చెప్పబడితే, అది ఈస్టరు ఆదివారము ఉదయముగా సూచిస్తుంది. అయినను, ప్రసంగీకులు అరుదుగా దాని సిద్ధాంత విషయాలపై బోధిస్తారు. క్రీస్తు లేని క్రైస్తవ్యము, పుస్తకము, డాక్టర్ మైకెల్ హోర్టాన్ చెప్పాడు చాలా సంఘాలలో ఈస్టరు ప్రసంగాలు తరచూ చూపిస్తాయి "యేసు ఎలా ఆయన లోపాలు అధిగమించాడు తద్వారా [చూపించవచ్చు] సువర్తకులు [స్వతంత్రులుగా] ఉండి వారు సంగీత మనస్తత్వ శాస్త్రము, రాజకీయాలు, నీతిశాస్త్రము ను గూర్చి మాట్లాడుతున్నారు సువార్తకు బదులు" (Michael Horton, Ph.D., Christless Christianity: The Alternative Gospel of the American Church, Baker Books, 2008, p. 30). విచిత్రంగా, డాక్టర్ ఆర్. ఏ. టోరీ, నేను ఆయనను మెచ్చుకుంటాను, క్రీస్తు పునరుత్థానము గూర్చి ఒక్క ప్రసంగము కూడ చెప్పలేదు తన ప్రసిద్ధ పుస్తకములో, క్రీస్తు కొరకు ఎలా పని చెయ్యాలి (ఫ్లెమింగ్ హెచ్. రేవల్, ఎన్.డి). డాక్టర్ టోరీ 156 పేజీల ప్రసంగ సమీక్షలు బోధకులకు ఇచ్చాడు కాని, ఒకటి కూడ యేసు పునరుత్థానము గూర్చి పూర్తిగా చెప్పలేదు! తప్పకుండా, పరిస్థితి ఈనాడు ఇంకా దారుణంగా ఉంది! ఆధునిక పాటలు చూస్తే కేవలము పది పాటలు మాత్రమే క్రీస్తు పునరుత్థానము గూర్చి వ్రాయబడ్డాయి. వాటిలో ఒకటి ఇరవై శతాబ్దము ముందు వ్రాయబడింది. రెండు 18 వ శతాబ్దంలో, మూడు 19 వ శతాబ్దంలో, ఒకటి 16 వ శతాబ్దంలో, ఒకటి 17 వ శతాబ్దంలో, ఒకటి 15 వ శతాబ్దంలో, మరియు రెండు 8 వ శతాబ్దంలో వ్రాయబడ్డాయి! 20 వ శతాబ్దంలో వ్రాయబడిన ఒకేఒక మంచిపాట "జీవించాడు మరలా" పాల్ రాడర్ చే వ్రాయబడింది, కాని అది పాటల పుస్తకంలో లేదు. నిలబడి ఆ పాట నాతో కలసి పాడండి! మృతుడైన వాడు మరల జీవించాడు, కూర్చోండి. మీరు పి.ఓ. బాక్సు 15308, లాస్ ఏంజిలాస్ సిఏ 90015కు వ్రాసి పాల్ రాడెర్ పాట పదాలు సంగీతము కొరకు అడగవచ్చు. మళ్ళీ, నేననుకుంటాను పునరుత్థానముపై ఆధునిక గీతాలు లేకపోవడం చూపిస్తుంది ఈ ప్రధాన అంశము చాలా కాలముగా నిర్లక్షము చేయబడింది, ఫిన్నీ కాలము నుండి. క్రీస్తు, "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). కాని ఎవరు దానిపై బోధించుట లేదు, మనము పాడము కూడ! అందుకే పాశ్చాత్య లోకములో సంఘాలు అంతరించి పోతున్నాయి! లేచిన క్రీస్తులో విశ్వాసము లేకుండా ఉజ్జీవ నిరీక్షణ ఉండదు, సజీవ సందేశము ఉండదు – సగము సువార్త మర్చిపోబడింది కాబట్టి – బోధ నుండి తొలగింపబడింది! దేవుడే సహాయము చెయ్యాలి! నేను కనుగొన్నాను మూడవ ప్రపంచము ఎక్కువగా పునరుత్థాన క్రీస్తుపై నొక్కి చెప్తున్నాయి యూరపు అమెరికాల కంటే. అందుకే క్రైస్తవ్యము అక్కడ ఎదుగుతుంది, ఇక్కడ ఎదుగుదల ఆగిపోయింది! మూడవ ప్రపంచము నుండి ఇరవై సంవత్సరాల యువకునితో ఈమెయిల్ ద్వారా సంప్రదించాను. అతనన్నాడు "క్రైస్తవ విశ్వాసము [విడిచిపెట్టమని] చిన్నప్పుడు చిత్ర హింసలు అనుభవించాను. సహాయము కొరకు అరిచాను, ఎవరు రాలేదు, చాలామంది [క్రైస్తవులు] నశించుట చూసాను... పిల్లలు ఇండియాలో, మయన్మార్ లో బాధింపబడు [తున్నారు], యేసును వదిలెయ్యాలని తరుచు విద్యుత్ తో హింసింప బడుతున్నారు...అలాంటి వారిలో నేను ఒకడను." అది చదివినప్పుడు ఏడ్చాను. అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో అలాంటి పిల్లలను యవనస్తులను ఎప్పుడు చూడగలము? ఈ యవనస్థుడు చెప్పాడు ఇతడు ఇతర పిల్లలు పునరుత్థాన క్రీస్తును ఎదుర్కొన్నారని. వారు పునరుత్థాన యేసును అనుభవించి ఆయన దేవుని కుమారుడని తెలుసుకున్నారు. ఎలాంటి విధ్యుత్ హింస చిత్ర హింస యేసును వదిలేటట్టు చేయనేరదు. ఆయన జీవిస్తున్నాడని వారికి తెలుసు – మృతులలో నుండి లేచాడని! అది వారిని నిజ క్రైస్తవులుగా మార్చింది! అదే అపోస్తలుడైన పౌలు మన పాఠ్య భాగములో చెప్తున్నాడు. క్రీస్తు, "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). మళ్ళీ ఆ పాట పాడండి! మృతుడైన వాడు మరల జీవించాడు, గ్రీకు పదము "ప్రకటింపబడుట" అనగా "ప్రత్యేకంగా చెప్పుట," "గమనింపబడుటగా" అనువదింపబడింది (స్ట్రాంగ్ #3724). యేసు మృతులలో నుండి, సజీవుడై, దేవుని కుమారునిగా ప్రత్యేకింప బడి గుర్తింప బడ్డాడు. సాధారణ బైబిలు 1599 చెప్తుంది "చూపింపబడి ప్రత్యక్ష పరచ బడ్డాడు" (గమనిక #1 రోమా 1:4 పై). క్రీస్తు "చూపింప బడి ప్రత్యక్ష పరచ బడ్డాడు" దేవుని కుమారునిగా మృతులలో నుండి సజీవుడవడం ద్వారా, "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). I. మొదటిది, ఎలా యేసు దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు. అది ఆయన బోధల వలన కాదు. చాలా అద్భుత విషయాలు బోధించారు, కొండ మీద ప్రసంగముతో పాటు. ఆయన బోధలు మాత్రమే ఆయనను దేవుని కుమారునిగా నిరూపించలేదు. ఆయన అద్భుతాలు, ముగ్గురు మృతులలో నుండి లేపడం కూడ కాదు. ఎలియా ప్రవక్త ఒక బాలుని బ్రతికించాడు పాత నిబంధనలో కాని ఆయన దేవుని కుమారుడు కాదు (I రాజులు 17:17-24). ఎలీషా కూడా ఒక అబ్బాయిని బ్రతికించాడు (II రాజులు 4:32-37) కాని ఎలీషా దేవుని కుమారుడు కాదు. మోషే కూడ చాలా సూచక క్రియలు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం చేసాడు, కాని అతడు దేవుని కుమారుడు కాదు. యేసు తన శరీరము పునరుత్థానము ద్వారా దేవుని కుమారునిగా ప్రకటింపబడ్డాడు. యేసే చెప్పాడు దుష్ట తరానికి ఆయన ఇచ్చే సూచన ఆయన పునరుత్థానము, "వ్యభిచారులైన చెడ్డ తరము వారు, సూచక క్రియలు అడుగుతున్నారు; ప్రవక్తయైన మొనాను గూర్చిన సూచక క్రియయే గాని, మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహించబడదు: యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో; ఆలాగు మనష్యు కుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును" (మత్తయి 12:39-40). ఆయన దేవుని కుమారుడు అని చెప్పినందుకు యేసు మరణ శిక్షకు అప్పగింప బడ్డాడు (మత్తయి 26:63-66). ఆయన సిలువపై వ్రేలాడు చుండగా ప్రధాన యాజకులు, ఇలా అపహాస్యము చేసారు, "వాడు దేవుని యందు విశ్వాసము ఉంచెను; నేను దేవుని కుమారుడనని చెప్పెను, గనుక ఆయన కిష్టమైతే: ఆయన ఇప్పుడు, వానిని తప్పించునని చెప్పిరి" (మత్తయి 27:43). కాని దేవుడు తన కుమారుని మృతులలో నుండి లేపడం ద్వారా తన కుమారునిగా అనుమతి ఇచ్చాడు. క్రీస్తు, "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). దేవుడు మూడవ దినమున తన కుమారుని మృతులలో నుండి లేపడం ద్వారా తన కుమారునిగా ప్రకటించాడు! పాడండి! మృతుడైన వాడు మరల జీవించాడు, II. రెండవది, ఎందుకు యేసు దేవుని కుమారునిగా ప్రకటింపబడ్డాడు. డాక్టర్ చార్లెస్ హాడ్జ్ (1797-1878), ప్రిన్సిటన్ వేదాంత కళాశాలలో నూతన నిబంధన అధ్యాపకుడు, ఇలా అన్నాడు, క్రీస్తు లేవడం ద్వారా కుమారత్వము పూర్తి కాలేదు, లేక అది అపోస్తలులకు తెలియ పరచబడలేదు... కానీ పునరుత్థానము ద్వారా ఆయన దేవుని కుమారునిగా రుజువు చేయబడ్డాడు...[చాలా] [లేఖన] భాగాలలో క్రీస్తు పునరుత్థానము క్రీస్తు బోధించిన అంతటిలో సత్యము చూపబడింది, ఆయన మాటలలోని వాస్తవికత కూడ...ఎందుకంటే క్రీస్తు తాను దేవుని కుమారుడనని బాహాటంగా ప్రకటించాడు, ఆయన మృతులలో నుండి లేవడం ఆయన ప్రకటనలోని సత్యానికి ముద్ర. మరణము శక్తి క్రింద ఉండి ఉంటే, దేవుడు తన కుమారునిగా [నిరాకరించి] ఉండేవాడు; కాని ఆయన మృతులలో నుండి లేపాడు కాబట్టి, ఆయన బాహాటంగా ఆయనను గుర్తెరిగాడు, ఇలా చెప్పి, నాకుమారుడా, ఈరోజు నిన్ను ప్రకటిస్తున్నాను (Charles Hodge, Ph.D., A Commentary on Romans, The Banner of Truth Trust, 1997 edition, pp. 20-21; notes on Romans 1:4). అలా, క్రీస్తు దేవుని కుమారుడు అనే నిజం ఆయన పునరుత్థానము ద్వారా చెప్పబడింది, ఆయన బోధించిన దానిని సరి చూసింది. డాక్టర్ విల్బర్ యం. స్మిత్ అన్నాడు క్రీస్తు పునరుత్థానము ఇలా హామీ ఇస్తుంది క్రీస్తు పలికిన మాటలలోని... నిజం, ఆధారము కలిగినది. [ఆయన లేచినప్పటి నుండి] ఆయన ఊహ నిజమైనది [ఆయన ఊహ] నాకనిపిస్తుంది మన ప్రభువు పలికినదంతా వాస్తవమని, ప్రభువు చెప్పాడు ఆయన యందు ఎవరు విశ్వాసము ఉంచుతారో వారికి నిత్య జీవము ఉంటుంది...ఎవరు నమ్మడానికి నిరాకరిస్తారో, నిత్యత్వములో ఖండింపబడతారు, ఆయన సత్యము మాట్లాడాడు....క్రీస్తు పునరుత్థానము మనము అంగీకరించలేము, మనకు సందేహము ఉంటే ఆయన నోట నుండి వచ్చిన మాటల విషయంలో (Smith, Therefore Stand, ibid., pp. 418-419). యేసు తన శిష్యులతో చెప్పాడు, "ఇదిగో, యేరూష లేమునకు వేళ్ళుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చ బడును. ఆయన అన్య జనుల కప్పగించ బడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరచి, ఆయన మీద ఉమ్మివేసి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను" (లూకా 18:31-33). యేసు లూకా 18:31-33 లో ఊహించినది వాస్తవంగా జరిగింది. ఆయన అపహసింపబడి, కొట్టబడి, ఉమ్మివేయబడి, నలుగ గొట్టబడి, సిలువపై మరణించాడు. కాని మూడవ రోజున సిలువ మరణము తరువాత మృతులలో నుండి లేచాడు. యేసు ఊహించిన నెరవేర్పు ఆయనను గూర్చి ఆయన చెప్పిన అన్ని విషయాలలో నిర్ధారణ అయింది, ఎందుకంటే ఆయన "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). "చనిపోయిన వాడు మరల లేచాడు." పాడండి! మృతుడైన వాడు మరల జీవించాడు, ఆయన మృతులలో నుండి లేచాడు కాబట్టి, ఆయన చెప్పినట్టే ఉంటాడు, ఆయన సత్యమే చెప్తున్నాడని మనము కచ్చితంగా నమ్మవచ్చు ఆయన అన్నాడు, "మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని... పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో కచ్చితంగా చెప్పుచున్నాను" (మత్తయి 18:3). మనం ఆ మాటలను తీవ్రంగా పరగణించాలి ఎందుకంటే అవి పునరుత్థా నుడైన దేవుని కుమారుని నోటి నుండి వచ్చాయి కాబట్టి. మీరు మార్పు నొందారా? మీరు మారినట్టు నిర్ధారణ ఉందా? దేవుని కుమారుడు చెప్పాడు మీరు మార్పు నొందక పోతే "పరలోక రాజ్యంలో ప్రవేశింపరు." ఓ, మీ మార్పును గూర్చి మీరు ఎంత తీవ్రంగా ఆలోచించాలి! మీరు మారినట్టు ఎంత జాగ్రత్తగా నిర్ధారించు కోవాలి! తిరిగి లేచిన దేవుని కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు, "నేను మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). ఆయన చెప్పిన దానిని ఎంత తీవ్రంగా వినాలి! ఆయన దగ్గరకు వచ్చి రక్షింపబడడానికి మీరు ఎంత ఆతృతగా ఉండాలి! ఎంత జాగ్రత్తగా మీరు మీ మూఢ నమ్మకాలు అబద్ధపు మతపర అభిప్రాయాలు మీ మనసులోనుండి తీసివేసి, యేసుపై మాత్రమే ఆనుకోవాలి – ఆయన చెప్పాడు, "తండ్రి ద్వారానే తప్ప, ఎవడును ఎవరును నా యొద్దకు రారు." మళ్ళీ, తిరిగి లేచిన దేవుని కుమారుడు చెప్పాడు, "నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసి వేయను" (యోహాను 6:37). ఓ, ఆయన దగ్గరకు రావడానికి "ఎంతగా కష్ట పడాలి"! (లూకా 13:24). యేసు నొద్దకు రావడానికి ఎంత జాగ్రత్తగా ఆలోచన పూర్వకంగా ఉండాలి. ఆయన చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి, "భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును" (మత్తయి 11:28). తిరిగి లేచిన దేవుని కుమారుని గూర్చి మీరు వినాలని ప్రార్ధిస్తున్నాము. మేము ప్రార్ధిస్తున్నాము మీరు ఆయన దగ్గరకు నేరుగా రావాలని, సిలువపై ఆయన కార్చిన రక్తములో మీ పాపములు కడగ బడాలని – ఆయన పునరుత్థాన జీవితమూ ద్వారా మీరు రక్షింపబడాలని. ఆయన చెప్పినది వినండి! ఆయన చెప్పినది నమ్మండి! నేరుగా ఆయన యొద్దకు రండి రక్షింపబడండి, ఆయన మీకు చెప్పిన ప్రకారము – ఆయన "మృతుల పునరుత్థానము నుండి శక్తితో... దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు" (రోమా 1:4). మృతుడైన వాడు మరల జీవించాడు, ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ గారిచే: లూకా 18:31-34. |
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తు కుమారత్వమును గూర్చిన ఋజువు! THE PROOF OF CHRIST’S SONSHIP! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "యేసు క్రీస్తు శరీరమును బట్టి, దావీదు సంతానముగాను; మృతులలో నుండి పునరుత్థాను డైనందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను, ప్రభావముతో నిరూపించబడెను" (రోమా 1:3-4).
I. మొదటిది, ఎలా యేసు దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు,
II. రెండవది, ఎందుకు యేసు దేవుని కుమారునిగా ప్రకటింప బడ్డాడు,
|