Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




యూదా యొక్క తప్పుడు పశ్చాత్తాపము

THE FALSE REPENTANCE OF JUDAS
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 2, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 2, 2017

"అప్పుడాయనను, అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, పశ్చాత్తాప పడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను, నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు, దానితో మాకేమి? అనెను. నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, పోయి ఉరి పెట్టుకొనెను" (మత్తయి 27:3-5).


మత్తయి 27 తెల్లవారు జామున ఆరంభమయింది, గెత్సమనే వనంలో యేసు బంధింప బడినప్పుడు, ప్రధాన యాజకుని ప్రవేశ పెట్టబడిన తరువాత, అబద్ద సాక్ష్యము ఆయనకు వ్యతిరేకంగా ఇవ్వబడినప్పుడు, ముఖము మీద కొట్టండి అపహాస్యము చేయబడినప్పుడు, పేతురు ఆయనను కాదనినప్పుడు.

"ఉదయమైనప్పుడు, ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి: ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతు పిలాతునకు అప్పగించిరి" (మత్తయి 27:1-2).

వారు యేసును ప్రధాన యాజకుని మందిరము ద్వారా నడిపించారు. యూదా వచ్చి యేసుకు దగ్గరగా నిలుచున్నాడు. కాని యూదా యేసు వైపు తిరిగి క్షమాపణ అడగలేదు. అతడు యేసు వైపు తిరిగి ఉంటే, ఆ ఆఖరి ఘడియలో, అతడు రక్షింపబడి ఉండేవాడు. సిలువపై యేసు ప్రక్కన ఉన్న దొంగ చనిపోక ముందు రక్షింపబడ్డాడు. ఎందుకు యూదా క్షమాపణ కొరకు యేసు వైపు తిరగకుండా ప్రధాన యాజకుని వైపు ఎందుకు తిరిగాడు? రెండు కారణాలు ఉన్నాయని నేను నమ్ముతాను.

I. మొదటిది, యూదా అప్పటికే క్షమింపబడరాని పాపము చేసాడు.

యేసు చెప్పాడు,

"మనష్యులు చేయు ప్రతి పాపమును దూషణము వారికి క్షమింప బడును: కాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనష్యు కుమారునికి విరోధంగా మాటలాడు వానికి, పాప క్షమాపణ కలదు: గాని పరిశుద్దాత్మకు విరోధంగా మాటలాడు వానికి, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు" (మత్తయి 12:31-32).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు యూదా "క్షమింపబడరాని పాపము" చేసాడు, అప్పటికే, శిక్షకు అప్పగింప బడ్డాడు. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

క్షమింప రాని పాపము పూర్తిగా క్రీస్తును తిరస్కరించుట...తప్పకుండా అది పరిశుద్ధాత్మను నిత్యత్వంలో అవమాన పరుస్తంది. అప్పుడు [పరిశుద్ధాత్మ] హృదయాన్ని కదిలించుట, ఒప్పుకోలు తీసుకు రాదు రక్షణకై ఆశ పుట్టించదు...[క్షమింప బడరాని పాపము చేయువాడు] పరిశుద్ధాత్మ తనను విడిచి పెడుతుంది కనుక పరిగణలోనికి రాదు. దేవుని వైపు నిజంగా తిరుగుట హృదయము పై పనిచేసే పరిశుద్ధాత్మ కార్యము. ఒకవేళ [పరిశుద్ధాత్మ] ఒకని విడిచిపోతే, దేవునికి వేరే మార్గము లేదు ఒక పాపిని ఒప్పించి రక్షించడానికి (John R. Rice, D.D., A Verse-by-Verse Commentary on the Gospel According to Matthew, Sword of the Lord Publishers, 1980 edition, p. 183; comments on Matthew 12:31-32).

డాక్టర్ రైస్ పాట, "నీవు ఎక్కువగా తిరుగులాడుతూ ఉంటే," యూదాను అభివర్ణిస్తుంది!

నీవు కనిపెట్టి ఇటు అటు తిరుగుతూ ఇంకను రక్షకుని తిరస్కరిస్తున్నావు,
   ఆయన హెచ్చరికలు ఓర్పుతో కూడుకున్నది, ఆయన ప్రాదేయ పాడడం దయతో నిండినది,
అలా నీవు పరిత్యజింపబడిన ఫలము తిన్నావు, నీవు సాతాను వాగ్ధానము నమ్మావు,
   అలా నీ హృదయము కఠినపర్చబడింది; పాపము నీ మనసును చీకటి మయము చేసింది.
అప్పుడు తీర్పును ఎదుర్కొనుట ఎంత విచారము, కృప లేకుండా పిలువబడతావు
   నీవు ఆత్మ విడిచిపోయే వరకు ఇటు అటు తిరుగులాడావు;
ఎంతటి వేదన నిట్టూర్పు, మరణము నిన్ను నిరీక్షణ లేనివానిగా చేసినప్పుడు,
   నీవు ఇటు అటు తిరుగులాడావు చాలా సుదీర్ఘంగా కనిపెట్టావు!
("నీవు ఎక్కువగా తిరుగులాడుతూ ఉంటే," డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
       (“If You Linger Too Long,” by Dr. John R. Rice, 1895-1980).

యూదా "ఆత్మ విడిచిపోయే వరకు తిరుగులాడుట." అతని క్షమింప బడరాని పాపము చేసాడు. ఆ ఉదయాన అతడు యేసు వైపు చూడలేదు. రక్షింప బడడం చాలా ఆలస్య మైంది. చాలా ఆలస్యము! చాలా ఆలస్యము! నిత్యత్వంలో చాలా ఆలస్యము!

ప్రభువుని తిరస్కరించడం ద్వారా ఒక గీత గీయబడింది,
   పరిశుద్ధాత్మ పిలుపు లేకుండా పోయింది;
మరియు వీవు సుఖానుభవములో తొందర పడుతున్నావు –
   నీవు లెక్క చూసావా, ఖరీదు లెక్క చూసావా?
నీవు లెక్క చూసావా, నీ ఆత్మ నశించి పోవడంలో,
   నీవు సర్వ లోకమంతటిని సంపాదించుకున్నప్పటికీ?
ఇప్పటికైనా నీవు ఆ గీత దాటిపోతావేమో,
   నీవు లెక్క చూసావా, ఖరీదు లెక్క చూసావా?
("నీవు లెక్క చూదావా?" ఏ. జే. హడ్జ్ చే, 1923).
(“Have You Counted the Cost?” by A. J. Hodge, 1923).

నేను నిన్ను బతిమాలుచున్నాను, పరిశుద్ధాత్మ ఎన్నటికి మిమ్ములను విడిచి పెట్టె వరకు వేచియుండవద్దు! ఆయన నీకు పాపము ఒప్పుకోలు కలిగించినప్పుడు – క్రీస్తు నొద్దకు రమ్ము. నీకు ఇంకొక అవకాశము ఉండకపోవచ్చు! నేను నిన్ను బ్రతిమాలుచున్నాను, బాగా నిత్యత్వములో ఆలస్యము అవకముందే క్రీస్తు నొద్దకు రమ్ము!

II. రెండవది, యూదా "పశ్చాత్తాపము" కేవలము "ఈలోక పర విచారము."

పాఠ్య భాగము చెప్తుంది,

"అప్పుడాయన అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింప బడగా, చూచి, పశ్చాత్తాప పడెను..."(మత్తయి 27:3).

పదము "పశ్చాత్తాప పడుట" గ్రీకు పదము "మెటమెలోమాయ్" పదము నుండి అనువదింప బడినది దాని అర్ధము "చింతించుట" (బలంగా), "బాధపడుట" (జార్జి రికర్ బెర్రీ). కాని "మెటమెలోమాయ్" రక్షణకు నడిపించదు. అది "చింతపడుట" మాత్రమే, పరిశుద్ధాత్మచే పాపపు ఒప్పుకోలు కాదు. అది కేవలము పాపము చేయుచుండగా పట్టు బడడం మాత్రమే. ఈలాంటి విచారము బాధ మనస్తాపానికి, స్వదయకు, నిరీక్షణ లేని స్థితికి తీసుకెళ్తుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్ధమైన మారు మనస్సును కలుగ చేయును: అయితే లోక సంబందమైన దుఃఖము మరణమును కలుగ చేయును" (II కొరింధీయులకు 7:10).

దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజ పశ్చాత్తాపము కలుగ చేస్తుంది, అది క్రీస్తు నందు రక్షణలోనికి నడిపిస్తుంది. పదము "పశ్చాత్తాపము" II కొరింధీయులకు 7:10 లోనిది మత్తయిలోని 27:3 లోని పదానికి వేరుగా ఉంటుంది, అక్కడ యూదా "పశ్చాత్తాప పడ్డాడు." II కొరింధీయులకు 7:10 లోని గ్రీకు పదము ఒకలాంటి "మేటానోయ్" – అంటే "మనసు మారడం" (వైన్). నా చైనీయ సంఘ కాపరి డాక్టర్ తిమోతి లిన్ (1911-2009) హెబ్రీయ గ్రీకులలో పండితుడు. డాక్టర్ లిన్ అన్నాడు, "అది ఒక కొత్త ‘నౌస్,’ నూతన మనసు." ఒకని హృదయము మనసులో నిజమైన మార్పు దేవుడు మాత్రమే తేగలడు. డాక్టర్ జార్జి రికర్ బెర్రీ (1865-1945) అన్నాడు "మెటనోయ్" ఒక "గొప్ప పదము [మెటా మెలోమాయ్] కంటే, పూర్తి పశ్చాత్తాపానికి అది ఒక వ్యక్తీకరణ" (గ్రీక్-ఇంగ్లీష్ నూతన నిబంధన లేక్సికన్). పురితాన్ రచయిత రిచర్డ్ బాక్స్ టర్ (1615-1691) దానిని "అనురాగాములో మార్పు" – దేవుడు పాపమును గూర్చిన మనసులో మార్పు, నీ ప్రేమించడం ద్వేషించడంలో మార్పు.

"దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్ధమైన మాయ మనస్సును కలుగ చేయును: అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును" (II కొరింధీయులకు 7:10).

దైవ చిత్తానుసారమైన దుఃఖము పరిశుద్ధాత్మ కలిగిస్తుంది. ఆత్మ పశ్చాత్తాపము కలిగిస్తుంది, నూతన మనస్సును, అది క్రీస్తు నందు రక్షణకు నడిపిస్తుంది.

యూదా కేవలము దొరికిపోయినందుకు తప్పుడు పశ్చాత్తాపపు భావనను అనుభవించాడు. "అతడు ఖండింపబడడం చూచినప్పుడు, [అతడు] పశ్చాత్తాప పడ్డాడు." కింగ్ జేమ్స్ బైబిలు దాని అర్ధమును చెప్తుంది. అతడు "స్వతహాగా పశ్చాత్తాప బడ్డాడు." దేవుడు దానిని కలిగించలేదు. అది పూర్తిగా మానవ విచారము. అది "దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము [కాదు]." అది "దైవానుసార విచారము" కాదు నిజంగా మనసులో మార్పు తెచ్చేది. అది కేవలము స్వఅనుభూతి! కేవలము "లోకానుసారమైన దుఃఖము మరణమును [కలిగించేది]." కనుక యూదా "వెళ్ళి, ఉరి వేసుకొనెను" (మత్తయి 27:5).

కయీను యూదా (చిత్రపటము) లాంటివాడు. క్రీస్తు యూదాను "నాశన పుత్రుడు" అని పిలిచాడు (యోహాను 17:12). యూదా క్రీస్తు మరణమునకు బౌతికంగా బాధ్యుడు. "కయీను తన సహోదరుడైన హేబెలుకు, వ్యతిరేకంగా లేచి సంహరించెను" (ఆదికాండము 4:8). స్కోఫీల్ద్ గమనిక కయీనును గూర్చి ఇలా చెప్తుంది, "కయీను... కేవలము లోక సంబంధమైన వ్యక్తి... పాప భూ ఇష్టుడు, నెరవేర్పు కావాలి" (ద స్కోఫీల్ద్ పఠన బైబిలు; గమనిక ఆదికాండము 4:1). కయీనుకు "దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదు." కయీనుకు "రక్షణ కొరకైన పశ్చాత్తాపము" లేదు. తన కొరకు బాధ పడ్డాడు. కయీను అన్నాడు, " నా శిక్ష నేను భరించలేనంతది" (ఆదికాండము 4:13). స్వానుభూతి! అదే తనకని పించింది. అతడు "లోకాను సారమైన దుఃఖము" పొందాడు. దొరికి పోయినందుకు బాధపడడం అంతే. అది స్వానుభూతికి నడిపించింది, మరి ఏమి లేదు. అది కయీనును నిస్సహాయ స్థితిలో ఉంచింది. మీలో కొందరనుకుంటారు పాపపు ఒప్పుకోలు ఉందని, కాని లేదు. కయీను వలే, నీ కొరకు బాధ పడుతున్నావంతే. స్వానుభూతి పాపపు ఒప్పుకోలు కాదు! అది "లోకాను సారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుంది."

ఏషావు యూదాకు మరియొక (చిత్రపటము) . ఏషావు చిక్కుడు కాయ కూరకు తన జేష్టత్వము అమ్మేశాడు, యూదా ముప్పై వెండి నాణెములకు క్రీస్తును అప్పగించినట్లు. స్కోఫీల్ద్ గమనికి చెప్తుంది, "ఏషావు ఈ లోకపు మానవుని చూపిస్తున్నాడు" (ఐబిఐడి., గమనిక ఆదికాండము 25:25 పై). ఏషావు తన ఆశీర్వాదము పోయిందని తెలుసుకున్నప్పుడు, "అతడు దుఃఖా క్రాంతుడై, పెద్ద కేక వేసి, ఓ నా తండ్రీ, నన్ను దీవించుమని, తన తండ్రితో చెప్పెను" (ఆదికాండము 27:34). ఏషావు, కయీను యూదాల వలే, "లోకాను సారమైన దుఃఖము కలిగి యున్నాడు." అతడు ఎన్నడు "దైవ చిత్తాను సారమైన దుఃఖము పొందుకో [లేదు] పశ్చాత్తాపము ద్వారా రక్షణ పొందుకోవడానికి." అతడు కేవలము స్వానుభూతి బాధ పొందాడు, యూదా వలే. మరియు, యూదా వలే, ఏషావు అన్నాడు, "నా సహోదరుడైన యాకోబు ను సంహరించేదను" (ఆదికాండము 27:41). హెబ్రీయులకు వ్రాసిన గ్రంథము ఏషావును "తిండి బోతు అని పిలిచింది... పూట కూటి కొరకు జేష్టత్వము హక్కును అమ్ముకున్నాడు. ఏషావు తరువాత, ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు, దాని కోసం శ్రద్ధతో వెదికినను: మాయ మనస్సు పొందనవకాశము లేక, విసర్జింపబడెను" (హెబ్రీయులకు 12:16-17). అతడు ఎన్నడు "నిజ పశ్చాత్తాపము పొందలేక పోయాడు, కన్నీటితో జాగ్రత్తగా వెదికినను." అవును, ఏషావు కన్నీరు కార్చాడు. కాని అది ఒప్పుకోలు కన్నీళ్లు కావు. అవి భాద భావన కలిగించే కన్నీరు మాత్రమే. నీ కొరకు నీకు బాధపడితే, నీవు పాపపు ఒప్పుకోలు క్రిందకు రావు. నీకు కేవలము "లోకాను సారమైన దుఃఖము ఉంటుంది మరణము నకు దారి తీస్తుంది." నీవు ఎన్నటికి రక్షింప బడలేవు!

నీవు కయీనులా, ఏషావులా మరియు యూదాలా లేవని నేను అనుకుంటున్నాను. నీవు లోతైన పాపపు ఒప్పుకోలు క్రిందకు వస్తారని ఆశిస్తున్నాను. కయీనులా ఉండవని అనుకుంటున్నాను, "ఈలోక మానవుడు... పాప భూ ఇష్టుడు, నెరవేర్పు అవసరము." తిండిబోతు ఏషావు లాంటి వాడవు, కాదని నేను ఆశిస్తున్నాను. ఈలోక వస్తువులు నిమిత్తము నీ ఆత్మను పారవేయవని ఆశిస్తున్నాను. క్రీస్తును కొన్ని వెండి నాణేములకు అమ్మేసిన యూదా లాంటి వాడవు, కావని నేను ఆశిస్తున్నాను!

లోకములో నుండి బయటకు రండి. దాని పాపముల నుండి అబద్ధపు నిధుల నుండి బయటకు రండి! పాపము నుండి పారిపోయి, క్రీస్తు నొద్దకు రండి. దేవుని ఆత్మ నిన్ను పిలుస్తున్నప్పుడు, పాప భారముతో నీ హృదయము నిండియున్నప్పుడు, యేసు నొద్దకు రండి ఆయన రక్తము ద్వారా మిమ్ములను మీరు శుద్ధి చేసుకోండి! ఇప్పుడే యేసు నొద్దకు రండి, నిత్యత్వములో ఆలస్యము కాకముందే!

అప్పుడు తీర్పును ఎదుర్కొనుట ఎంత విచారము, కృప లేకుండా పిలువబడతావు
   నీవు ఆత్మ విడిచిపోయే వరకు ఇటు అటు తిరుగులాడావు;
ఎంతటి వేదన నిట్టూర్పు, మరణము నిన్ను నిరీక్షణ లేని వానిగా చేసినప్పుడు,
   నీవు ఇటు అటు తిరుగులాడావు చాలా సుదీర్ఘంగా కనిపెట్టావు!
("నీవు ఎక్కువగా తిరిగులాడుతూ ఉంటే," డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
(“If You Linger Too Long,” by Dr. John R. Rice, 1895-1980).

ఒక యవనస్థుడు ఒకసారి నా సహాయకుడు, డాక్టర్ కాగన్ తో ఇలా అన్నాడు, "ఈ లెక్కలో చూస్తే నేను ఎన్నటికి క్రైస్తవుడను కాలేను." అతడు సరియే! మీ నేర్చుకోవడం ప్రార్ధనలు మీకు సహాయము చెయ్యలేవు పాపపు ఒప్పుకోలు లేకుండా. అప్పుడు మాత్రమే యేసు వైపు నీవు తిరుగుతావు. ఒక స్త్రీ చెప్పినట్టు, "నేను పూర్తిగా నాతో విసిగిపోయాను." అది "[అది] దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపానికి రక్షణకు నడిపిస్తుంది." పాప హృదయముతో "విసిగిపోయినప్పుడు" ఆ స్త్రీ క్రీస్తు నొద్దకు చేర్చబడి, మార్పు నొందింది. దేవుని ఆత్మ మిమ్మును "పూర్తిగా విసిగిపోయేటట్టు" చెయ్యాలి" మీకు మీరుగా, మీరు "నోరు మూయబడునట్లు, [నీవు] దేవుని యెదుట నేరస్థుడవగునట్లు" (రోమా 3:19). దేవుని ఆత్మ మిమ్ములను యేసు దరికి చేర్చి రక్షణను అనుగ్రహించి ఆయన రక్తము ద్వారా మీ పాపాలను శుద్ధి చేసి నేరవేర్పును మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము నోవాసాంగ్ గారిచే: మత్తయి 27:3-5.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"నీవు సుధీర్ఘంగా తిరుగులాడుతూ ఉంటే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
“If You Linger Too Long” (by Dr. John R. Rice, 1895-1980).



ద అవుట్ లైన్ ఆఫ్

యూదా యొక్క తప్పుడు పశ్చాత్తాపము

THE FALSE REPENTANCE OF JUDAS

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అప్పుడాయనను, అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, పశ్చాత్తాప పడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను, నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు, దానితో మాకేమి? అనెను. నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, పోయి ఉరి పెట్టుకొనెను" (మత్తయి 27:3-5).

(మత్తయి 27:1-2)

I.    మొదటిది, యూదా అప్పటికే క్షమింపబడరాని పాపము చేసాడు,
మత్తయి 12:31-32.

II.   రెండవది, యూదా "పశ్చాత్తాపము" కేవలము "ఈలోక పర విచారము,"
II కొరింధీయులకు 7:10; మత్తయి 27:5; యోహాను 17:12;
ఆదికాండము 4:8, 13; ఆదికాండము 27:34, 41;
హెబ్రీయులకు 12:16-17; రోమా 3:19.