Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




గేత్సమనేలో క్రీస్తు యొక్క ఆవేదన

CHRIST’S AGONY IN GETHSEMANE
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 19, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 19, 2017

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).


కొంతకాలము క్రిందట "యేసుకన్నీళ్ళు" పై బోధించాను. అది చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆ ప్రసంగంలో ఆఖరి అంశము, "గెత్సమనే వనంలో యేసు కన్నీళ్లు కార్చాడు." నేనన్నాను, "గెత్సమనే వనంలో, సిలువవేయబడక ముందురాత్రి, యేసు శ్రమపడి ఒంటరిగా ప్రార్ధించాడు. గెత్సమనే అంధకారములో రక్షకుడు ప్రార్ధనలో దేవునికి తన ఆత్మను అర్పించాడు. హెబ్రీయులకు 5:7 ప్రకారము ఆయన ప్రార్ధించాడు 'మహా రోదనముతోను కన్నీళ్ల తోనూ తన్ను మరణము నుండి రక్షింప గలవానికి, ప్రార్ధనలు యాచనలు సమర్పించెను' (హెబ్రీయులకు 5:7). దేనికి ఆయన భయపడ్డాడు? ఆయన భయపడ్డాడు ఆ వనంలోనే చనిపోతాడని, సిలువకు వెళ్ళి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయకుండా."

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "యేసు ప్రార్ధించాడు మరణపు గిన్నెను తన నుండి తొలగించమని దాని ద్వారా ఆ రాత్రి మరునాడు సిలువపై మరణించే ముందు జీవించాలని." వేదాంతి డాక్టర్ జె. ఆలివర్ బస్ వెల్ కూడ చెప్పాడు యేసు "వనములో మరణము నుండి విడుదల కొరకు ప్రార్ధించాడు, తద్వారా ఆయన సిలువపై తన ఉద్దేశమును నెరవేర్చవచ్చని." డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ కూడ అదే విషయము చెప్పాడు: "నా స్నేహితుడా, ఆయన విన్నాడు; ఆయన గెత్సమనే వనములో చనిపోలేదు." యేసు గొప్ప ఆవేదనలో ఉన్నాడు దేవునిచే మన పాపాలు ఆయనపై మోప బడినందుకు.

ఆ ప్రసంగము చదివిన ఒకరు నన్ను అడిగారు ఎందుకు యేసు సిలువకు వెళ్ళవలసి వచ్చిందని. ఆయన ఆ వనములో మన పాపాల నిమిత్తం ఎందుకు చనిపోయాడు? నేను అతనికి చెప్పాను అది సాధ్యం కాదని. బైబిలు చెప్తుంది,

"క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు మరణించాడు" (I కొరింధీయులకు 15: 3).

క్రీస్తు "లేఖనముల ప్రకారము" చనిపోవలసి వచ్చింది – కటా టాస్ గ్రఫాస్. ఆయన గెత్సమనే వనములలో చనిపోయి ఉండుంటే పాత నిబంధన లేఖనములో ప్రవచింపబడిన రక్షకుడు కానేరదు. ఆయన జరిగించేవాడు, ప్రవచింపబడిన రక్షకుడు కాదు! ఆయన చనిపోవలసి వచ్చింది కటా టాస్ గ్రఫాస్, "లేఖనముల ప్రకారము." "లేఖనములు" పాత నిబంధనకు చెందినది, కొత్త నిబంధన వ్రాయబడలేదు. గెత్సమనేలో ప్రవేశించే ముందు యేసు పలికాడు, "ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని, వ్రాయబడిన మాట నా యందు నెరవేర వలసి యున్నది" (లూకా 22:37). ఆయన యెషయా 53:12 చూపించాడు, ఆయన చెప్పాడు ఆయన ఇద్దరు దొంగల మధ్య సిలువవేయబడ వలెను అను వచనము నెరవేరాలి. ఆయన గెత్సమనేలో చనిపోతే ఆయన యెషయా 53:12 నెరవేర్చక పోయేవాడు; ఆయన చనిపోయే వాడు కాదు కటా టాస్ గ్రఫాస్, "లేఖనముల ప్రకారము," యెషయా ప్రవచించిన రక్షకుడు కాకపోయేవాడు!

యెషయా 53 అధ్యాయము పాత నిబంధనలో క్రీస్తు సిలువ మరణమును గూర్చి పూర్తి ప్రవచనము ఇస్తుంది. నిజానికి ఆ పాఠ్యభాగము యెషయా 52:13 తో ప్రారంభమై ఆంగ్ల బైబిలులో 15 వచనాల వరకు వెళ్తుంది. అది క్రీస్తు సిలువ మరణము గూర్చి ఒకదాని తరువాత మరియొక ప్రవచనము ఇస్తూ ఉంటుంది. యేసు గెత్సమనేలో చనిపోతే ఆయన సిలువ మరణమును గూర్చి చాలా కొన్ని వచనాలు నెరవేరి ఉండేవి. యెషయా 50:6, కొట్టబడుట, ఉమ్మివేయబడుట, అవమాన పరచబడుట ఉండేవి కావు. కీర్తనలు 22:16, కళ్ళకు చేతులకు మేకులు కొట్టబడుట, నెరవేరేది కాదు, జెకర్యా 12:10, "తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుదురు" నెరవేరేది కాదు. కీర్తన 22 కూడ ఒకదాని వెంబడి మరియొక వాగ్ధానము నెరవేరేది కాదు యేసు గెత్సమనేలో మరణించి ఉంటే. పాత నిబంధనలోని చాలా లేఖనాలు నెరవేరకుండా ఉండేవి యేసు వనములో చనిపోయి ఉండి ఉంటే. యేసు గెత్సమనేలో ప్రార్ధించడంలో ఆశ్చర్యము లేదు "మహారోదనము తోనూ కన్నీళ్ళ తోనూ, తన్ను మరణము నుండి రక్షింప గలవానికి ప్రార్ధించెను" (హెబ్రీయులకు 5:7). ఆయన వనములో చనిపోతానేమో, మరునాడు సిలువకు వెళ్ళనేమో అని భయపడ్డాడు! ఆయన చనిపోయాడు కాటా టాస్ గ్రాఫాస్, "లేఖనముల ప్రకారము." క్రీస్తు సిలువ వేయబడినప్పుడు పాత నిబంధన ప్రవచనాలన్ని నెరవేర్చాడు. ఆయన గెత్సమనేలో చనిపోతే ఈ ప్రవచనాలేమి నేరవేరేవి కావు – క్రీస్తు చేయు వానిగానే గాని, లేఖనములలో ముందుగా చెప్పబడినట్టు మానవాళికి రక్షకుడుగా ఉండేవాడు కాదు. క్రీస్తు "లేఖనముల ప్రకారము మన పాపము నిమిత్తము చనిపోయే వాడు కాదు" (I కొరింధీయులకు 15:3). గెత్సమనేలో ఆయన ప్రార్ధించడంలో ఆశ్చర్యము లేదు, "తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా యెద్ద నుండి తొలగింపుము" (లూకా 22:42).

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

"ఆవేదన"కు గ్రీకు పదము "ఆగోనియా." చాలా "భావపూరిత బాధ వేదన" ను గూర్చి మాట్లాడుతుంది (వైన్). యేసు మితిమీరిన శ్రమ, చిత్రహింస భయంకరమైన బాధ ఆ చీకటిలో అనుభవించాడు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు గెత్సమనే వనములో ఆయన ఆవేదన గూర్చి ఆలోచించాలి.

I. మొదటిది, అతని వేదన వివరించారు.

యేసు అతని శిష్యులతో కలిసి భోజనం చేసాడు. అక్కడ దేవునితో కలిసి వారు భోజనం చేశారు. యూదా గుంపును విడిచి ఆయనను అప్పగించడానికి ప్రధాన యజకుని దగ్గరకు వెళ్ళాడు. మిగిలిన వారు ఒక కీర్తన పాడి కేద్రోను వాగు దాటి, ఒలీవ కొండ ప్రక్కగుండా, గెత్సమనే వనము చీకటిలోనికి వెళ్ళారు. వనము అంచున యేసు ఎనిమిది మంది శిష్యులను విడిచిపెట్టి, వారితో ఇలా అన్నాడు, "నేను ప్రార్ధన చేసి వచ్చు వరకు, కూర్చొని యుండురి" (మార్కు 14:32). ఆయన పేతురు, యాకోబు యోహానులను వెంటపెట్టుకొని పోయి "మిగుల విభ్రాంతి నొందుటకును, చింతాక్రాంతుడగుటకు ఆరంభించిరి; నా ప్రాణము మరణ మగునంతగా, దుఃఖములో మునిగియున్నది: మీరిక్కడ, మెలకువగా ఉండుమని చెప్పెను" (మార్కు 14:33-34). జోసెఫ్ హార్ట్ అన్నాడు,

చాలా ప్రమాణాలు భరించాడు,
   చాలా శోధనలు ఎదుర్కొన్నాడు,
ఓర్పుతో, బాధను సహించాడు:
   కాని భయంకర శ్రమ ఇంకా ఉంది
మీరు భరించడానికి,
   తికమక, విచార గెత్సమనే!
మీరు భరించడానికి,
   తికమక, విచార గెత్సమనే!
("చాలా ప్రమాణాలు భరించాడు" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768;
   స్వరము "రండి, ఓ పాపులారా").
(“Many Woes He Had Endured” by Joseph Hart, 1712-1768;
      to the tune of “Come, Ye Sinners”).

మత్తయి చెప్పాడు "ఆయన దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుట మొదలు పెట్టెను" (మత్తయి 26:37). గ్రీకు పదమును గూర్చి "చాలా భారముగా," గుడ్ విన్ చెప్పాడు యేసు వేదనలో కలవరము తొందర ఉన్నాయి, అనగా "ప్రజల నుండి ఎడబాటు – పురుషులు కలవరం ఉన్నారు, మానవ జాతి నుండి వేరుగా ఉన్నారు." ఎలాంటి తలంపు! యేసు మరలించబడ్డాడు, పిచ్చివాడయ్యాడు, తన ఆవేదన తీవ్రత వలన. మత్తయి రక్షకుడు ఇలా చెప్పాడన్నాడు, "నా ప్రాణము మరణ మగునంతగా, దుఃఖములో మునిగియున్నది" (మత్తయి 26:38). గ్రీకు పదము "బహు విచారము" అర్దము "అన్ని వైపులా దుఃఖించుట, తీవ్ర పరితాపము" (స్ట్రాంగ్), దుఃఖములో మునుగుట. "ఆయన తల చెవులు విచారంలో మినిగాయి ఊపిరి సలపలేదు," అని గుడ్ విన్ చెప్పాడు. రినెక్కర్ చెప్పాడు ఆయన "విచారము చుట్టూ ముట్టింది, భరించనంత విషాదము." యేసు లోతైన దుఃఖము బాధలో మునిగాడు. మార్కు చెప్పాడు "ఆయన మిగుల విభ్రాంతి నొంది, చింతాక్రాంతుడయ్యాడు" (మార్కు 14:33). గ్రీకు పదము "విబ్రాంతి నొందుట" అనగా "మిగుల ఆశ్చర్యపడుట" (స్ట్రాంగ్), "భయంకర భయంలో నిండుకొని యుండుట" (రీనెక్కర్), "పూర్తిగా మనస్థాపించి, నెట్టబడి...భయపెట్టబడి, ఆందోళనలో చిక్కుకు, భయంలోనికి నెట్టబడి, పోయాడు" (వాస్ట్). జోసెఫ్ హార్ట్ అన్నాడు,

రండి, దేవునిచే ఎన్నుకొనబడిన పరిశుద్దులారా,
   కడిగే రక్తమును అనుభవించడానికి,
ఆలోచనతో నాతో కలవండి,
   విషాద గెత్సమనేను గూర్చి పాడడానికి.

'అక్కడ జీవిత ప్రభువు దర్శన మిచ్చాడు,
   మూలిగి, నిట్టూర్చి, ప్రార్ధించి భయము చెంది,
దైవ అవతారుడు భరించ గలిగినదంతా భరించాడు,
   తగిన శక్తితో, వదిలి పెట్టబడలేదు.
("గెత్సమనే, ఒలీల ఒత్తిడి!" జోసఫ్ హార్ట్ చే, 1712-1768;
   స్వరము "ఇది అర్ధరాత్రి, ఒలీవ నుదుట").
(“Gethsemane, The Olive-Press!” by Joseph Hart, 1712-1768;
      to the tune of “‘Tis Midnight, and on Olive’s Brow”).

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

II. రెండవది, ఆయన ఆవేదనకు కారణము.

వనములో క్రీస్తు దుఃఖమునకు కారణమేమి? నేననుకునే వాడిని సాతాను దాడి వలన వచ్చిందని. కాని ఇప్పుడు అది నమ్మడంలేదు. గెత్సమనేలో ఆయన ఆవేదన విషయంలో సాతాను గూర్చి చెప్పబడలేదు. ఆయన పరిచర్య ఆరంభంలో సాతానుచే దారుణంగా శోధింపబడ్డాడు. అరణ్యంలో మూడుసార్లు "శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు" (మత్తయి 4:3). కాని యేసు "మిగుల విబ్రాంతి నొంది భారభరితుడయ్యాడని" శోధన సమయంలో వ్రాయబడలేదు. గెత్సమనేలో చెమట రక్తముగా కారుట చెప్పబడలేదు. అరణ్యంలో శోధన సమయంలో యేసు సాతానును దేవుని వాక్యము చెప్తూ సులభంగా జయించాడు. కాని గెత్సమనేలో మరణపు అంచుల వరకు వచ్చాడు ఆవేదన వలన. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "ఆయన వనములో ప్రార్ధించినప్పుడు, 'ఈ గిన్నెను తొలగించుట' (లూకా 22:42), 'గిన్నె' మరణము. గెత్సమనే వనములో చనిపోవ ఇష్టపడలేదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, volume V, p. 540; note on Hebrews 5:7).

తండ్రి దేవుని నుండి గెత్సమనేలో ఆవేదన వచ్చింది. నేను నమ్ముతాను, వనములో,

"యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను" (యెషయా 53:6).

స్పర్జన్ అన్నాడు, గెత్సమనేలో, తండ్రి దేవుడు "పాప మెరుగని ఆయనను, మన కొరకు పాపముగా చేసెను" (II కొరింధీయులకు 5:21). "ఆయన ఇప్పుడు...పాపుల కొరకైన శాపము ఆయన భరించాడు, ఆయన పాపుల స్థానంలో నిలబడ్డాడు కాబట్టి పాపులకు బదులు శ్రమపడాలి కాబట్టి...ఇప్పుడు ఆయన గ్రహించాడు, బహుశా తొలిసారి, పాపాన్ని మోయుట అంటే ఏమిటో...అంతా ఆయనపై మోపబడింది" (C. H. Spurgeon, “The Agony in Gethsemane,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1971, volume XX, p. 593).

అహరోను నెరవేర్పు సమయంలో రెండు మేకలు ఉపయోగించాడు. వనములో క్రీస్తు రెండవ మేకగా చూపించబడ్డాడు. రెండవ మేక పాపము నిమిత్తము అర్పించబడినప్పుడు గొప్ప వేదన అనుభవించింది. ఈ జంతువు భయము బాధ చాలా తక్కువ క్రీస్తు వేదనతో పోలిస్తే. వనములో యేసు ఆవేదన, నెరవేర్పు.

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

ప్రవక్త యెషయా అన్నాడు,

"అతని నలుగ గొట్టుటకు యెహోవా ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను [ఆయనను నలుగ గొట్టుట ప్రభువుకు ఇష్టమాయెను, వేదనకు గురిచేయుట, NASV]: మీరు ఆయన ఆత్మను పాపమునకు అర్పణగా చేయుదురు..." (యెషయా 53:10).

నిజంగా అది గెత్సమనేవనములో ప్రారంభమయింది!

'అది అర్ధరాత్రి; నేరస్థుల కొరకు,
   విషాద వ్యక్తి రక్తములో దుఃఖిస్తున్నాడు;
అయినను విషయంలో మోకరిల్లాడు
   ఆయన తన దేవునిచే విడువబడలేదు.
("అది అర్ధరాత్రి, ఒలీల నుదుట" విలియమ్ బి. టప్పన్ చే, 1794-1849).
(“‘Tis Midnight, and on Olive’s Brow” by William B. Tappan, 1794-1849).

"'అది అర్ధరాత్రి; నేరస్థుల కొరకు, విషాద వ్యక్తి రక్తములో దుఃఖిస్తున్నాడు." డాక్టర్ జాన్ గిల్ అన్నాడు, "ఇప్పుడాయన మెత్తబడ్డాడు, తన తండ్రిచే దుఃఖమునకు ఇవ్వబడ్డాడు; ఇప్పుడాయన విచారము మొదలయినది, అది ఇక్కడ ముగింపు కాదు, కానీ సిలువపై...ఆయన ప్రజల పాపాలను మోస్తూ 'చాలా భారంగా' మారాడు, ఆయన దైవ ఉగ్రతలో ఉన్నాడు, ఆయన ఒత్తబడ్డాడు మరియు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాడు...ఆయన మూర్ఛపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరణించడానికి దగ్గరగా ఉన్నాడు...మరణపు అంచుకు తెబడ్డాడు; విషాదము ఆయనను వదలలేదు... సిలువపై ఆయన ప్రాణము శరీరము వేరు చేయబడే వరకు" (John Gill, D.D., An Exposition of the New Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume I, p. 334).

గెత్సమనేలో "ప్రభువు...మన అందరికి అతిక్రమములను ఆయనపై మోపెను" (యెషయా 53:6). జోసఫ్ హార్ట్ అన్నాడు,

అక్కడ [దైవకుమారుడు] నా నేర శిక్ష అంతటిని మోసాడు,
   ఇది కృప ద్వారా నమ్మవచ్చు;
కాని ఆయన అనుభవించిన భయాందోళనలు
   ఆగమ్య గోచరములు.
మీ ద్వారా ఎవరు దూసుకుపోలేరు,
   మసగ, అంధకార గెత్సమనే!
మీ ద్వారా ఎవరూ దూసుకుపోలేరు,
   మసగ, అంధకార గెత్సమనే!
("చాలా శ్రమలు భరించాడు" జోసఫ్ హార్ట్ చే, 1712-1768;
   స్వరము "రండి, ఓ పాపులారా").
(“Many Woes He Had Endured” by Joseph Hart, 1712-1768;
      to the tune of “Come, Ye Sinners”).

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

శ్రమపడుచున్న దైవకుమారుని చూడు,
   విలాపిస్తూ, మూలుగుచు, రక్తము చెమట వలే కార్చుచున్నాడు!
పరుచుట లేని లోతైన దైవిక [కృప],
   యేసు, మీది ఎంత గొప్ప ప్రేమ!
("మీ తెలియని శ్రమలు" జోసఫ్ హార్ట్ చే, 1712-1768;
   స్వరము "ఇది అర్ధరాత్రి, ఒలీవ నుదుట").
(“Thine Unknown Sufferings” by Joseph Hart, 1712-1768;
      to the tune of “‘Tis Midnight, and on Olive’s Brow”).

"యెహోవా మన అతిక్రమములను ఆయనపై మోపెను" (యెషయా 53:6).

క్రీస్తు మన పాపములను గెత్సమనే వనములో ఆయనపై వేసుకొనెను, ఆయన "తన స్వంత శరీరంలో" మన పాపాలు సిలువపై భరించి, మరునాడు చనిపోయాడు. మన పాపము ఆయన రక్తము కార్చునంతగా అణగ గొట్టింది!

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

అవును, ఆయన మన పాపములను తన శరీరములో సిలువపై భరించాడు.

"ఆయన తానే తన శరీర మందు మన పాపములను మ్రాను [సిలువపై] మీద మోసుకొనెను" (I పేతురు 2:24).

గెత్సమనే వనమునకు వెళ్లి యేసు నీ కొరకు నా కొరకు చేసింది చూడు. నీ పాపములను బట్టి నరకానికి వెళ్ళవలసిన వాడవు. కాని యేసు ఆ పాపమును ఆయనపై వేసుకొని, సజీవ నరకము ద్వారా వెళ్లి సిలువ ఎక్కి, నీ అతిక్రమములను పూర్తి పరిహారము చెల్లించాడు.

ప్రతి క్రైస్తవుడు తరచూ గెత్సమనే సిలువపై ధ్యానించాలి. గెత్సమనే సిలువ విడదీయ నేరనివి. "[సిలువ] ను గూర్చిన వార్త నశించుచున్న దేవుడి మహిమ వలన రక్షించబడటం" (I కొరింధీయులకు 1:18). మనము క్రీస్తు పని ద్వారా సిలువపై దేవుని కోసం జీవిస్తున్నాము! మనం ఆయన వేదన గూర్చి ఆలోచిస్తూ స్ఫూర్తి పొందుతాము! జీవిత శ్రమలు మనలను నిరుత్సాహ పరచినప్పుడు, నిజ క్రైస్తవుడు శాంతిని కలిగి యేసును జ్ఞాపకము చేసుకుంటాడు ఆయన గెత్సమనే సిలువలో చెల్లించిన పాప పరిహారాన్ని బట్టి! యేసు మృతులలో నుండి లేచి మరణాన్ని జయించడం జ్ఞాపకం చేసుకుంటాం!

సిలువ చెంత, ఓ దేవుని గొర్రె పిల్ల,
   ఆ దృశ్యాలు నా ముందు ఉంచుము;
అనుదినము నడవడానికి సహాయము చేయుము,
   ఆ నీడ నాపై ఉండునట్లు.
సిలువలో, సిలువలో,
   నా మహిమగా నిత్యమూ ఉండు;
నా ఎత్తబడిన ఆత్మ నదిని దాటి
   విశ్రాంతిని కనుగొనే వరకు.
("సిలువ చెంత" ఫేన్నీ జే. క్రాస్ బీ చే, 1820-1915).
(“Near the Cross” by Fanny J. Crosby, 1820-1915).

ఇంకా రక్షింపబడని వారికి నేను చెప్తున్నాను, ఆయనను గూర్చి ఎలా ఆలోచిస్తున్నావు, శ్రమించి రక్తము కార్చి అంధకార గెత్సమనేలో, నీ కొరకు శ్రమపడుచు, అయినను ఆయన నుండి తిరిగి పోవుచున్నావా? ఆయన నీ పాపముల నిమిత్తము శ్రమపడ్డాడు! నీవు ఎలా ఆయనను కాదంటావు, అలాంటి ప్రేమను ఎలా తిరస్కరిస్తావు?

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

శ్రమపడుచున్న దైవ కుమారుని చూడు,
   విలపిస్తూ, మూలుగుచు, రక్తము చెమట వలే కార్చుచున్నాడు!
పరుదులు లేని లోతైన దైవిక [కృప],
   యేసు, మీది ఎంత గొప్ప ప్రేమ!

యేసు నీ పాపములను గెత్సమనేలో ఆయనపై వేసుకున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి! నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించాడు సిలువపై నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి! ఈరాత్రి నీవు ఆయనను నమ్ముతావా? నిత్యత్వ ప్రేమతో ప్రేమిస్తున్న ఆయన దగ్గరకు వాస్తవా? ప్రలాపించు రక్షకుని నమ్ము! ఇప్పుడే ఆయనను విశ్వసించు! నీ పాపములు ఆయన క్షమిస్తాడు, నీవు నిత్య జీవము పొందుకుంటావు! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రైట్ ఎల్. చాన్: మార్కు 14:32-41.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"'చాలా ప్రమాణాలు ఆయన భరించాడు" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768;
స్వరము "రండి, ఓ పాపులారా").
“‘Many Woes He Had Endured” by Joseph Hart, 1712-1768; tto the tune of “Come, Ye Sinners”).



ద అవుట్ లైన్ ఆఫ్

గేత్సమనేలో క్రీస్తు యొక్క ఆవేదన

CHRIST’S AGONY IN GETHSEMANE

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

(హెబ్రీయులకు 5:7; I కొరింధీయులకు 15:3; లూకా 22:37;
యెషయా 53:12; యెషయా 50:6; కీర్తనలు 22:16;
జెకర్యా 12:10; లూకా 22:42)

I.    మొదటిది, అతని వేదన వివరించారు, మార్కు 14:32, 33-34; మత్తయి 26:37-38.

II.   రెండవది, ఆయన ఆవేదనకు కారణము, మత్తయి 4:3; యెషయా 53:6, II కొరింధీయులకు 5:21; యెషయా 53:10; I పేతురు 2:24; I కొరింధీయులకు 1:18.