Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




కనుమరుగవుతున్న దేవుని ఆత్మ కార్యము

THE WITHERING WORK OF GOD’S SPIRIT
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 12, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 12, 2017


స్వతంత్ర వేదాంత పాఠశాలలో ఇద్దరు యెషయాలున్నారని వారు మాకు బోధించారు. కానీ వారు చెప్పినది తప్పు. మొదటి 39 అధ్యాయాలు పాపములను గూర్చి రాబోవు ప్రజలు బందీలవడాన్ని గూర్చి మాట్లాడుతున్నాయి. కానీ 40 వ అధ్యాయము నుండి చివరి వరకు, ప్రవక్త వారి విమోచనమును గూర్చి మాట్లాడుతున్నాడు. రెండవ సగభాగము క్రీస్తు శ్రమల ద్వారా వచ్చే రక్షణను గూర్చి మాట్లాడుతుంది.

"ఆలకించుడి, మొరపెట్టుము. ప్రకటించుమని, యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు? నేనేమి ప్రకటింతునని, మరియొకడు అడుగుచున్నాడు [ప్రేమ, NASV; వారి గౌరవము, NIV] అక్కడ పూవులా తోట గలదు: సర్వ శరీరులు గడ్డియై యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలే ఉన్నది: యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి యొండును పువ్వు వాడును: నిశ్చయంగా జనులు గడ్డి వంటివారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును: మన దేవుని వాక్యము నిత్యమూ నిలుచును" (యెషయా 40:6-8).

"స్వరము చెప్పింది, మోర పెట్టమని." ప్రవక్తతో మాట్లాడిన స్వరము ఏమిటి? అది "దేవుని నోరు," ఐదవ వచనంలో చెప్పబడింది. "మోర"కు హెబ్రీ పదము ఖారా. దాని అర్ధము "పిలిచుట – [చేధించుట] కలిసిన వ్యక్తిని" (బలమైన #7121). అదే హెబ్రీ పదము యెషయా 58:1 లో వాడబడింది,

"తాళక బూర ఊడినట్లు, ఎలుగెత్తి, బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ చేయుము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయుము" (యెషయా 58:1).

ఆ ప్రకారము బాప్తిస్మమిచ్చు యోహాను బోధించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యెషయా 40:3 ను సూచించాడు. ఆయనన్నాడు, "అందుకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని, అరణ్యంలో ఎలుగెత్తి మొరపెట్టెను చెప్ప ఒకని శబ్దము అని చెప్పెను" (యోహాను 1:23; యెషయా 40:3). యోహాను 1:23 లోని గ్రీకు పదము "శబ్దము" బోవాగా అనువదించబడింది. దాని అర్ధము "అరచుట...మోర పెట్టుట" (బలంగా). హెబ్రీ మరియు గ్రీకు పదము చెప్తుంది "గట్టిగా అరచుట" (యెషయా 58:1). దాని అర్ధము బోధకుడు దేవుని నేరుగా బొగ్గరగా మాట్లాడాలి... "నశించిన తికమకలో ఉన్న" వారి కొరకు కనిపిస్తుంది! బోధకులు దేవుని పదాలను వినేవరకు మోర పెడతారు. భాదగా, ఇది ఈరోజులలో బోధించే విధానం కాదు. ఇది ఈరోజులలో బోధించే బోధనలలో బైబిల్ పైన కొంత అవిధేయత కలదు. ఆధునిక పరిచారకులు "నెమ్మదిగా ప్రభోధిస్తున్నారు," పాతవారు చెప్పినట్టు. ఈ ఆధునిక బోధకులు దేవునికి విధేయులవరు. దేవుడు యెషయాకు చెప్పాడు, "గట్టిగా మోర పెట్టండి, వదలకండి." ఆధునిక బోధన యేసు మాదిరిని గైకొనడం లేదు. యేసు "దేవాలయంలో...అరిచాడు" (యోహాను 7:28), యోహాను 7:37 లో యేసు "నిలబడి అరిచాడు." పెంతే కోస్తు దినాన పేతురు చేసినట్టు కూడలేదు. అతడు "ఎలుగెత్తి స్వరాన్ని పెంచి" దేవుడు తనకిచ్చిన మాటలను చెప్పాడు (అపోస్తలుల కార్యములు 2:14). డాక్టర్ జాన్ గిల్ చెప్పాడు, " తన స్వరాన్ని పెంచి, జన సమూహమంతా వినేటట్టు...అతని ఉత్సాహాన్ని ఆసక్తిని కనుపరచాడు, ఆత్మ మనష్యును కనుపరిచేది; అధిక ఆత్మ నింపుదలతో, అతడు మనష్యులకు భయపడలేదు" (కొత్త నిబంధన వివరణ; గమనిక అపోస్తలుల కార్యములు 2:14). కనుక, నేను మళ్ళీ చెప్పాలి, ఈనాటి వేదికలపై దేవుని పట్ల ప్రాధమిక వ్యతిరేకత ఉంది, బోధనా విధానంలో భయంకరమైన అవిధేయత. అపోస్తలుడైన పౌలు దీనిని ఆఖరి దినాలలో ఒక సూచనగా చెప్పాడు. అతనన్నాడు, "వాక్యము బోధించుడి...ఎందుకనగా ఒక సమయము వచ్చును; జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశాలకు అనుకూలమైన బోధకులను, తమ కొరకు పోగుచేసుకుందురు (దురద చెవులు గలవారై, NASV)" (II తిమోతి 4:2, 3). మన సమయంలో "బోధ" కొనసాగుతూనే ఉంది, కాని బోధించుట మరచిపోయారు. మనం వినేదంతా చెప్పడం – అవసరత అగ్ని లేని "బోధ"! అదే ఈనాటి వేదాంత కళాశాలలో నేర్చుకుంటున్నారు! మట్టిలా ఎండినది, వచనము వెంబడి వచనము! ఏ ఒక్కడు సువార్తతో చేధింపబడలేదు ఏ ఒక్కరు "బోధ" ద్వారా వారి ఆత్మీయ నిద్ర నుండి మేల్కొనుట లేదు. మీరు మేకలకు గొర్రెలవమని "బోధించలేరు"! వారి పాప భూఇష్టతను గూర్చి బోధింపబడాలి! "స్వరము చెప్పింది, మోర పెట్టండి" (యెషయా 40:6). అది నిజమైన సువార్త బోధన! దేవుడు బోధను మాత్రమే మృత హృదయాలను నిద్రలో ఉన్న మనసులను కదిలించడానికి ఉపయోగిస్తాడు! ఆత్మను రేకెత్తించే బోధ మాత్రమే దానిని చేయగలదు! బ్రెయిన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు, "ఉజ్జీవ బోధకు శక్తి అధికారము ఉంది. అది దేవుని వాక్యాన్ని హృదయానికి మనస్సాక్షికి సుత్తిలా ఉపయోగ పడేందుకు ఇది ఈనాటి బాధలో కనబడుట లేదు. ఉజ్జీవంలో బోధించే వారిలో భయము ఉండదు" (Revival! A People Saturated With God, Evangelical Press, 1997 edition, p. 103). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ఇరవైవ శతాబ్దపు గొప్ప బోధకులలో ఒకడు. అతనన్నాడు, "బోధించుట అంటే ఏమిటి? అగ్నిపై తర్కము!...అది అగ్నిపై వేదాంతము. అగ్నిని తీసుకొని వేదాంతము లోప భూ ఇష్టత వేదాంతము...అగ్ని ఉన్న వ్యక్తీ నుండి వచ్చేది వేదాంత బోధ...నేనంటాను తపన లేకుండా ఈ విషయాలపై మాట్లాడే వానికి వేదికపైకి హక్కు లేదు; వానిని అనుమతింప కూడదు" (బోధ బోధకులు, పేజి 97).

తరువాత యెషయా అన్నాడు, "నేనేమి మోర పెట్టాలి?" (యెషయా 40:6). సెమినరీ అధ్యాపకుడు చెప్పిన దానీ ఒక యవనస్థుడు నాతో అన్నాడు. అతనన్నాడు ఆరు నెలల ప్రసంగాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నేను అది వ్యతిరేకిస్తాను! అలాంటి వ్యక్తీ నిజమైన, దేవుడిచ్చిన ప్రసంగాలు కలిగి యుండలేదు! వీలుకాదు! స్పర్జన్ గొప్ప ప్రసంగీకుడు. అతడలా చెయ్యలేదు. నిజ బోధకుడు ప్రసంగాలు దేవుని నడగాలి, దేవుడిచ్చే వరకు కనిపెట్టాలి. "నేనేమి మోర పెట్టాలి?" బోధించడానికి దేవుడిచ్చిన దానిని గట్టిగా చెప్పాలి. నేను హిట్లర్ లా బోధిస్తానని ఒకతను చెప్పాడు. ఒక విధంగా అతడు సరియే. హిట్లర్ అబద్ధాలు గొప్ప తపనతో చెప్పాడు. మనం సత్యాన్ని గొప్పతపనతో చెప్పాలి! తపనతో కూడిన బోధ మాత్రమే మనుష్యులను క్రియా రూపులను చేస్తుంది బైబిలు వివరణ. బైబిల్ ప్రతిపాదనలు వారిని నిద్ర పుచ్చుతాయి! డాక్టర్ లాయిడ్-జోన్స్ అన్నాడు, "ప్రస్తుత రోజులలో బోధన పురుషులను రక్షించలేదు. అది పురుషులను బాధించు లేదు, కానీ వాటిని స్వల్పంగానైనా భంగం లేకుండా, వారు ఎక్కడ ఉన్నదో తెలియచేస్తుంది." అది తప్పు! వారికి భంగం కలిగించడం అవసరం!

"ఆలకించుడి, మొరపెట్టుము. ప్రకటించుమని, యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు? నేనేమి ప్రకటింతునని, మరియొకడు అడుగుచున్నాడు [ప్రేమ] అక్కడ పూవులా తోట గలదు...సర్వ శరీరులు గడ్డియై యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలే ఉన్నది" (యెషయా 40:6-8).

I. మొదటిగా, జీవిత పరిమితాన్ని గూర్చి నేను ప్రకటించాలి.

"ఆలకించుడి, మొరపెట్టుము. ప్రకటించుమని, యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు? అక్కడ పూవులా తోట గలదు, సర్వ శరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలే ఉన్నది...యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి యొండును. పువ్వు వాడును" (యెషయా 40:6, 8).

త్వరలో జీవితము గతించి పోతుంది. త్వరలో జరగబోతుంది. యవనులు నిరంతరము ఉంటుంది అనిపిస్తుంది – కానీ త్వరగా గతించిపోతుంది. నా స్వీయ చరిత్ర రాస్తున్నాను. నా కొడుకు రాబర్ట్ అలా చెయ్యమన్నాడు. కొన్ని వారాలలో డబ్బై ఆరు ఏళ్ళు వస్తాయి. కొన్ని నెలలు క్రితం యవ్వనస్థునిలా అనిపించింది! మీకు కూడ అంతే! సూర్యుడు ఉదయిస్తాడు. గడ్డి ఎండిపోతుంది. పూవులు వికసించి చనిపోతాయి. జీవితం పరిమితం, నమ్మరానిది, అశాశ్వితం, సంక్షిప్తం, మరియు చాలా చిన్నది. దీని గూర్చి అపొస్తలుడైన యాకోబు. ఇలా అన్నాడు,

"కానీ ధనవంతుడు... తక్కువ అవును: ఏలయనగా యితడు గడ్డి పూవు వలే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా, అది వాడిపోవును, దాని స్వరూప సౌందర్యము నశించును: అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలలో వాడిపోవును" (యాకోబు 1:10-11).

కొంత మందే అది చూస్తాము. కష్టపడి లోకంలో కొనసాగాలనుకుంటారు గ్రహించకుండా – వారు అనుకున్న దానికంటే ముందుగా ముగుస్తుంది! సి. టి. స్టడ్ (1860-1931) కొద్దిమంది ధనవంతులలో ఒకడు అది చూసాడు. గొప్ప ఐశ్వర్యము ఉంది, కానీ విడిచిపెట్టి చైనాకు మిసేనరీగా వెళ్ళాడు – తరువాత అపాయకాలములో ఆఫ్రికాకు వెళ్ళాడు. సి. టి. స్టడ్ ఇలా చెప్పాడు,

ఒకే జీవితం,
   త్వరలో ముగుస్తుంది;
క్రీస్తు కొరకు చేసిందే
   నిలుస్తుంది.

ప్రతి యవ్వనస్తుడు సి. టి. స్టడ్ ను గూర్చి చదవాలి, నాయకునిగా పెట్టుకోవాలి! ఈ పాటలో సత్యాన్ని చూడాలి!

ఒకే జీవితం,
   త్వరలో ముగుస్తుంది;
క్రీస్తు కొరకు చేసిందే
   నిలుస్తుంది.

యేసు చెప్పాడు,

"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, వాని ప్రాణమును గోపోట్టుకొనుట, వానికేమి ప్రయోజనము? మానవుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?" (మార్కు 8:36, 37).

"ఆలకించుడి, మొరపెట్టుము. ప్రకటించుమని, యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు? [ప్రేమ] అక్కడ నేలంతా పూవులా తోట గలదు, సర్వ శరీరులు గడ్డియై యున్నారు...వారి అందమంతయు, అడవి పువ్వు వలే ఉన్నది" (యెషయా 40:6-8).

కాబట్టి జీవిత పరిమాణాన్ని గూర్చి నేను తరుచు బోధించాలి! నీ జీవిత పరిమితాన్ని బట్టి నీవు ఆలోచించాలి. బైబిలు చెప్తుంది, "మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, "కనుక మాకు రోజుల గూర్చి బోధించుము, అవి మాకు మా హృదయాలకు జ్ఞానం కలిగించుము" (కీర్తనలు 90:12).

II. రెండవది, కనుమరుగవుతున్న పరిశుద్ధాత్మ కార్యాన్ని గూర్చి నేను ప్రకటించాలి.

పదము "కనుమరుగవుట" అనగా అంతరించిపోవుట, ఎండిపోవుట, తాజాతనాన్ని కోల్పోవుట. యెషయా 40:7 చెప్తుంది,

"యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా, గడ్డి ఎండును: ఎందుకనగా పువ్వు వాడను: నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే" (యెషయా 40:7).

స్పర్జన్ చెప్పాడు, "దేవుని ఆత్మ, గాలి వలే, మీ ఆత్మల పైకి రావాలి, [మీ] అంతరించే పుష్పముగా మార్చాలి. [మీ] పాపపు ఒప్పుకోలు పుట్టించాలి...[మీరు] [మీ] పతన స్థితిని చూచునట్లు, 'శరీరానుసారులు దేవుని సంతోష పెట్టలేరు.' [మనకు అనిపించాలి] శరీర జీవితంపై మరణ శాశనం ఉందని... రోగి వైద్యుడు కావాలి...మేల్కొన్న పాపి, కరుణించుమని దేవుని నడిగినప్పుడు, కనుగొని ఆశ్చర్యపోవాడు, దేవుడు ఉగ్రతను గూర్చిన, ద్యాస వస్తుంది...[క్రీస్తు రక్తాన్ని] విలువ కట్టవు అది మన పాపాలను కడిగివేస్తుంది ప్రలాపించేటట్టు చేస్తుంది" ("కనుమరుగవుతున్న ఆత్మకార్యము," పేజీలు 375, 376).

అది పరిశుద్ధాత్మ శక్తి కనుమరుగవడం. పరిశుద్ధాత కార్యము మీ తప్పుడు ఆశలను అంతరింపచేస్తుంది, నీ హృదయ మృత స్థితిని చూపిస్తుంది, నీ మనసు నుండి నిరీక్షణ అంతరింప చేస్తుంది, క్రీస్తులో నిజ నిరీక్షణ చూసేటట్టు చేస్తుంది, నీ పాపం నుండి రక్షించడానికి నీ స్థానంలో క్రీస్తు చనిపోయాడు. పరిశుద్ధాత్మ ఆత్మను "కనుమరుగు" చేస్తే, అప్పుడు నీవు చూస్తావు నీ "మంచితనము" అంతా మురికిగుడ్డలని, నీవు చేసినదంతా దేవునికి అంగీకారముగా చెయ్యలేదని; నీవు చేసినదంతా తీర్పు నుండి నరకము నుండి నిన్ను రక్షింప లేదని.

అందుకే నీకు తప్పుడు మార్పు కలిగిస్తాడు. శాంతిని ఇచ్చే నీకు చాలా తప్పుడు మార్పిడులనిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. కానేకాదు! దేవుడు ఈ తప్పుడు మార్పిడులను ఉపయోగించుకుంటున్నాడు. నీవు మోర పెట్టేటట్టు వాటిని ఉపయోగించుకుంటాడు, "శరీరుల గడ్డి వంటివారు, గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును." దేవుడు కనుమరుగు చేస్తున్నాడు, నిన్ను నీవు రక్షించుకోవడానికి నీవు చెప్పే చేసే నీ తప్పుడు నిరీక్షణాలను అంతరింప చేస్తుంది. జాన్ న్యూటన్ అన్నాడు,

నేను నిరీక్షించాను ఒక దయా ఘడియలో,
   ఒక్కసారిగా ఆయన నా మనవికి జవాబిస్తాడని,
ఆయన కాదనలేని ప్రేమశక్తితో
   నా పాపాలు అణిచి నాకు విశ్రాంతినిచ్చారు.

దీనికి బదులుగా, నా కనిపింప చేసాడు
   నా హృదయ అంతరంగ దుష్టత్వాన్ని;
నరక కోప శక్తులన్నీ
   నా ఆత్మ ప్రతి భాగాన్ని బాధ పెట్టనిమ్ము.

అయోకాను అడగండి! దానిని అడగండి! జాన్ కాగన్ ను అడగండి! నన్ను అడగండి! విశ్రాంతి నిమ్మని మేమంతా దేవునికి మోర పెట్టాము – కానీ ఆయన శీలాజ్ఞాన్ లా భావించేటట్టు చేసాడు. ఆమె చెప్పింది, "నాతో నేను విసిగిపోయాను." ఇంకొక అమ్మాయి చెప్పింది, "నాతో నేను చాలా విసిగిపోయాను." డాక్టర్ కాగన్ మరియు నేను ఆమెకు "సాధారణం" కాకుండా ఎక్కువగా భావన కలిగేలా ఆమెకు చెప్పాము. షీలా వలే, ఆమె "అసహ్యించుకోవాలి." మీకు మీరుగా "అసహ్యించుకాకపోతే", మీరు మీ అనుభవాలను కనుమరుగయ్యేలా చేస్తుంది, లోపలి కోల్పోయే స్థితి నిజంగా మారిన వారిలో సామాన్యము.

పదము "కనుమరుగవడం" చాలా ప్రాముఖ్యము. నీకు జరిగే వాన్ని అవగాహన చేసుకోవడం తెలుసుకోవాలి. పదము "కనుమరుగవడం" అర్ధము "సిగ్గు పాడడం...ఎండిపోవటం (నీటివలే) ... సిగ్గుపడడం, అయోమయంగా, మరియు కనుమరుగవడం" (బలంగా # 300).

"యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా, గడ్డి ఎండిపోవును: ఎందుకనగా పువ్వు వాడును: నిశ్చయంగా జనులు గడ్డి వంటివారే" (యెషయా 40:7).

అది నీ హృదయములో జరగాలి. నీ స్వనమ్మకాన్ని పరిశుద్ధాత్మ అంతరింప చేయాలి. నీ హృదయము పువ్వు వలే హరించే వరకు – నీ నీచ స్వభావాన్ని బట్టి నీవు సిగ్గుపడే వరకు. తన మార్పుయందు షీలా చెప్పినట్టు, "నేను నాతో విసిగిపోయాను." అది నిజ మార్పిడిలో జరుగుతుంది,

"యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా కనుమరుగవగా, గడ్డి ఎండిపోవును: ఎందుకనగా పువ్వు వాడును: నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే" (యెషయా 40:7).

నీతి నీవు విసిగిపోయినప్పుడు, యేసును నమ్మ వాని నీతో చెప్పుకోవాలి. ఆయన రక్తముతో నీ పాపాన్ని కడిగి, దేవుని తీర్పు నుండి రక్షిస్తాడు.

గొప్ప సువార్తికుడు జార్జి వైట్ ఫీల్డ్ అన్నాడు, "యేసు నందు విశ్వాసం లేదని దేవుడు ఎప్పుడైనా నీకు చూపించాడు? నీవెప్పుడైనా ప్రార్ధించావా, 'ప్రభువా, క్రీస్తును పట్టుకునేటట్టు సహాయము చేయుము'? క్రీస్తు నొద్దకు రావడానికి నీ అసమర్ధత విషయము దేవుడు నిన్ను ఒప్పుకునేలా చేశాడా, క్రీస్తు నందు విశ్వసము కొరకు మోర పెట్టావా? లేనిచో, నీ హృదయములో సమాధానం ఉండదు. దేవుడు నీకు యేసు నందు శాంతి నిచ్చునుగాక, నీవు చనిపోకముందు అవకాశము పోవకముందు" ("కృపా పద్దతి"). నీవు పాప పోరాటం అనుభవించాలి నిజ మార్పు పొందేముందు. గెత్సమనే వనంలో నీ పాపమూ ఆయనపై పడినప్పుడు ఆయన భావన నీకు కలగాలి. మీరు మొరపెట్టినప్పుడు తప్పక కొంచెం భావన కలిగియుండాలి, "మరణ మగునంతగా, నా ఆత్మ వేదన చెందుతున్నది...తండ్రి, నీ చిత్తమైతే, ఈ గిన్నె నా యొద్దనుండి తొలగింపుము" (మత్తయి 26:38, 39).

దయచేసి నిలబడి 10 వ సంఖ్య పాట, "రండి, పాపులారా పాడండి."

రండి, పాపులారా, పేద దౌర్భాగ్యులారా, బలహీన గాయపడి, రోగ వేదనలో ఉన్నవారలారా;
   యేసు నిన్ను రక్షింప సిద్ధంగా ఉన్నాడు, పూర్తి దయ, ప్రేమ శక్తితో:
ఆయన సమర్ధుడు, ఆయన సమర్ధుడు, ఆయన ఇష్టపడుతున్నాడు, సందేహము వద్దు;
   ఆయన సమర్ధుడు, ఆయన సమర్ధుడు, ఆయన ఇష్టపడుతున్నాడు, సందేహము వద్దు.

రండి, భార, హృదయములారా, నలిగి విరిగిన వారలారా;
   మంచిగా అయ్యే వరకు వేచియుంటే, మీరు ఎన్నటికీ రానేరారు:
నీతిమంతులు కాదు, నీతిమంతులు కాదు, పాపులను యేసు పిలుచుచున్నాడు;
   నీతిమంతులు కాదు, నీతిమంతులు కాదు, పాపులను యేసు పిలుచుచున్నాడు.

రక్షకుని చూడండి, ఆరోహణమై, రక్తము ద్వారా మోర పెడుతున్నాడు;
   పూర్తిగా ఆయనపై భారముంచు, అపనమ్మకం రానివ్వవద్దు;
యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చెయ్యగలడు;
   యేసు మాత్రమే, యేసు మాత్రమే, నిస్సహాయ పాపులకు మంచి చెయ్యగలడు.
("రండి, పాపులారా" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; కాపరిచే సవరింపబడింది).
      (“Come, Ye Sinners” by Joseph Hart, 1712-1768; altered by the Pastor).

నిరీక్షణ గల మారిన వ్యక్తి మాటలు వినండి. ఒక యవ్వనస్థుని సాక్ష్యము ఇది.

నన్ను నేను రక్షించుకోవడానికి మార్గము వెదుకుతున్నాను. పూర్తి గర్వము నాలో ఉంది, ఎంత గర్వమంటే గర్విష్ఠినని చెప్పడం కూడ నాకు ఇష్టము లేదు. నేను దేవునికి వ్యతిరేకంగా పోరాడినది ఇంకా గుర్తు ఉంది...బైబిలు చదవడం ప్రారంభించాను, రోజు ప్రార్ధించే "సాధన" కొరకు, సంఘ కార్యకలాపాలలో పాల్గొనడానికి. కానీ నా లోపల సమాధానము లేదు. అంతరంగములో, నేను నశించిన నాకు తెలుసు కానీ గర్వముతో పిరికి తనముతో దానిని ఎన్నుకోవాలి. నేను పాపిననే ఆలోచన నుండి తప్పుకోవాలని ప్రయత్నించాను. నాకు నేనుగా, అదేదారిలో ఉండేలా ప్రయత్నించాను. నేను నా పాపాత్మకమైన ప్రకృతి నుండి మంచి అనుభూతి చేయడానికి, నా విశ్వాసం సమర్థించేందుకు ఏ సాకులు వెతకడం లేదు. దేవుడు పరలోకము తెరచి ఉజ్జీవము పంపించాడు, మళ్ళీ, నా గర్వం చాలా ఉంది రక్షించడానికి యేసు నాకు కావాలని ఒప్పుకున్నాను...అప్పుడు, నేను మానసికంగా అంతరించి పోయాను. నేను ఏమి చేసిన నా పాపాల నుండి నేను రక్షించుకోలేను, స్వనీతితో పాపముతో యేసును నమ్మలేను అని గ్రహించాను, నేను నిస్సహాయుడనయ్యాను. నాలో పోరాటం ఉంది. నా గర్వము వలన యేసును విశ్వసించలేకపోతున్నాను... ఆశలన్నీ వదులుకున్నాను, చేతులెత్తేసాను. నా పాపమూ తలంపులపై, అంతరింద్రియాలపై ఒత్తిడి కలిగిస్తున్నట్లు గ్రహించాను. జీవితంతో విసిగి పోయాను. ఆ క్షణంలో, అద్భుతంగా, యేసు నా దగ్గరకు వచ్చాడు, నా జీవితంలో తొలిసారిగా, నేను ఆయనను నమ్మాను. నేను యేసు నొద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నాను, దానిని అలా చెయ్యలేకపోయాను నేను రక్షింపబడలేను అనుకున్నప్పుడు యేసు నా దగ్గరకు వచ్చాడు. యేసు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నన్ను నమ్మడం చాలా తేలిక అయింది... యేసు నన్ను అంగీకరించి ఆయన రక్తములో నన్ను కడిగాడు... యేసు నన్ను రక్షించాడు కాబట్టి నాలో మంచితనము ఉంది. యేసును గూర్చి ఆలోచించేటప్పుడు, కన్నీరు ఆగలేదు, ఆనంద భాష్పాలు కృతజ్ఞతా భాష్పాలు నాలో వచ్చాయి. ఆయన నా కొరకు చేసిన దానిని బట్టి, నా పట్ల యేసుకున్న ప్రేమ అంతటిని బట్టి, నేను ఆయనను అంతగా ప్రేమించలేను. ఆయనకు అంతగా కృతజ్ఞతా చెప్పలేను. నేను చేయగలిగినదంతా నా శ్రేష్ఠమయినది, నా జీవితము రక్షకుడైన యేసునకు అప్పగించుట మాత్రమే, నేను చేయగలను.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రండి, పరిశుద్ధ ఆత్మ, స్వర్గపు పావురం" (డాక్టర్ ఇసాక్ వాట్స్ చే, 1674-1748;
స్వరము "ఓ నా యొద్దకు రండి").
“Come, Holy Spirit, Heavenly Dove” (by Dr. Isaac Watts, 1674-1748;
to the tune of “O Set Ye Open Unto Me”).



ద అవుట్ లైన్ ఆఫ్

కనుమరుగవుతున్న దేవుని ఆత్మ కార్యము

THE WITHERING WORK OF GOD’S SPIRIT

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆలకించుడి, మొరపెట్టుము. ప్రకటించుమని, యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు? నేనేమి ప్రకటింతునని, మరియొకడు అడుగుచున్నాడు [ప్రేమ, ఎన్ఏయస్ వి; వారి గౌరవము, ఎన్ఐవి] అక్కడ పూవులా తోట గలదు: సర్వ శరీరులు గడ్డియై యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలే ఉన్నది: యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి యొండును పువ్వు వాడును: నిశ్చయంగా జనులు గడ్డి వంటివారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును: మన దేవుని వాక్యము నిత్యమూ నిలుచును" (యెషయా 40:6-8).

(యెషయా 40:5; 58:1; 40:3; యోహాను 1:23; యోహాను 7:28, 37;
అపోస్తలుల కార్యములు 2:14; II తిమోతి 4:2, 3)

I.    మొదటిగా, జీవిత పరిమితాన్ని గూర్చి నేను ప్రకటించాలి, యెషయా 40:6;
యాకోబు 1:10-11; మార్కు 8:36, 37; కీర్తనలు 90:12.

II.   రెండవది, కనుమరుగవుతున్న పరిశుద్ధాత్మ కార్యాన్ని గూర్చి నేను ప్రకటించాలి, యెషయా 40:7; మత్తయి 26:38, 39.