Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఇప్పుడు మిమ్ములను మీరు పరీక్షించుకోండి!

EXAMINE YOURSELVES NOW!
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
శనివారం ఉదయము, ఫిబ్రవరి 5, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, February 5, 2017

"మీరు విశ్వాసము గలవారై యున్నారో, లేదో పరీక్షించుకోండి; మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని యెడల, యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగురా?" (II కొరింధీయులకు 13:5).


కొరిందు సంఘములో ఒక గుంపు వారు అపోస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. పౌలు ముందుగా మాట్లాడిన మారని వారు వీరే. పౌలు బలహీనుడు నిజ అపోస్తలుడు కాడని మీరు చెప్పారు. వారు మన సంఘము వారి వలే ఉన్నారు – గుడి చీలిక సమయంలో నాపై దాడి చేసారు. లాస్ ఏంజిలాస్ మధ్యలో ఈ గొప్ప గుడి ఉండడానికి దెయ్యానికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. కొందరు దుష్టులున్నారు పౌలు నిజ అపోస్తలుడు కాడని. కనుక పౌలు వారితో చెప్పాడు "వారు పరీక్షించుకోవాలి, వారు విశ్వసములో ఉన్నారో లేదో." ఈ వచనము ఇలా అనువదింప బడవచ్చు, "విశ్వాసులలో ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి." వారు నిజంగా రక్షించబడ్డారో లేదో వారి హృదయాలు వారి జీవితాలు చూసుకోవాలని పౌలు చెప్పాడు. "విశ్వాసములో ఉండడం" అంటే నిజ క్రైస్తవుడు అని అర్ధము. గుడి విడిచి వెళ్ళిన వారు, నాపై దాడి చేసినట్టు వారు పౌలుపై తిరగబడ్డారు. వారిలో చాలామంది గుడికి వెళ్ళనే వెళ్ళరు. మిగిలిన వారు బలహీన కొత్త సువార్తిక సంఘాలకు వెళ్ళిపోయారు. చాలాకొద్ది మంది నిజ క్రైస్తవులని నేను వ్యక్తిగతంగా అనుకొంటున్నాను.

"మీరు విశ్వాసములో ఉన్నారో, లేదో పరీక్షించుకోండి; మిమ్మును మీరు [పరీక్షించి] తెలుసుకోండి."

అపోస్తలుడైన పౌలు మిమ్ములను మీరు పరీక్షించుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తు నందు రక్షించే విశ్వాసము ఉందో లేదో మిమ్ములను మీరు పరీక్షించుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు పరీక్షించుకోకపోతే దేవుడు చివరి తీర్పులో మిమ్మును పరీక్షిస్తాడు. మీరు చేసే ప్రతి పాపము దేవుడు చూస్తాడు. మీరు చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీ హృదయంలో వ్రాసి ఉంచాడు. ఆయన గ్రంథాల నుండి ఆయన మీ పాపాలు చదువుతాడు. మీరు చనిపోయాక మీ ఆత్మ దేవుని యందు నిలబడి తీర్పు తీర్చబడుతుంది. మీరు మీ పాపాలు ఇప్పుడు పరీక్షించుకోవాలి, లేనిచో దేవుడు వాటిని పరీక్షించి వాటిని బట్టి తీర్పు తీర్చు, "అగ్ని గుండములో" పడవేయ బడతారు" (ప్రకటన 20:15). మీరు మీ తలంపులను, మీ మాటలను మీ బహ్యపు పాపాలకు, చనిపోక ముందు పరీక్షించుకోవాలి. చనిపోయాక నరకాగ్ని నుండి రక్షింపబడడం చాలా ఆలస్యమవుతుంది. "మీరు విశ్వసములో ఉన్నారో లేదో, పరీక్షించుకోండి" ఇప్పుడే. చనిపోయాక రక్షింపబడడం చాలా ఆలస్యం. మీరు ఇప్పుడు పశ్చాత్తాపపడి క్రీస్తును విశ్వసించకపోతే మీరు "మండుచున్న అగ్ని కందకములలో హింసింప బడతారు... వారి హింస పొగ పైకి నిరంతరము ఎగబాకుతుంది: రాత్రింబవళ్ళు వారికి విశ్రాంతి ఉండదు" (ప్రకటన 14:10, 11). అందుకే ఇప్పుడు మీరు పరీక్షించుకోవాలి – చనిపోయాక రక్షింప బడడానికి చాలా ఆలస్యమవుతుంది.

మేము పాత మార్గాలను అనుసరిస్తామని భావన లేకుండా మీరు మా సంఘములోనికి రాలేరు. మీరు మొదట చూసేది చిత్ర పటాలు. వారు పాతకాలపు బోధకులు – జోనాతాన్ ఎడ్వర్డ్స్, జాన్ బన్యన్, జార్జి వైట్ ఫీల్డ్, జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్, స్పర్జన్, జేమ్స్ హడ్ సన్ టేలర్, డాక్టర్ జాన్ సంగ్, ఇంకా ఇతరులు. ఇంకొకటి మీరు చూసేది ప్రతి పురుషుడు సూటు టై వేసుకుంటారు. అది అవసరము. తెల్ల చొక్కా టై లేకపోతే అవి వారికి కల్పిస్తాం. తిరస్కరిస్తే, లోపలికి రాలేరు. కఠినము? బహుశా, కాని ఇది పాత పద్దతి మార్పు ఉండదు.

స్త్రీలు చక్కని వస్త్రధారణ కలిగి ఉండాలి. ఇది పాతపద్దతి, ఇది సరియైనది. డాక్టర్ టోజర్ చెప్పినట్టు, "పాతమర్గము సత్యమార్గము." మీరు ఆవరనలోనికి రాగానే పియానో ఆర్గాన్ లు పాతకాలపు పాటలు పాడుతుంటాయి. గిటారులు డ్రమ్ములు ఆరాధన అంతా కనబడవు. మేము పాడేవన్ని పాతపాటలు. ఆధునిక గీతాలు ఉండవు. "ప్రత్యేక సంగీతము" ఒక పాట, మా పాత పరిచారకుడు, అరవై ఏళ్ళ వాడు పాడతాడు – బోధించే ముందు పాతకాలపు గీతము ఆలపిస్తాడు. మేమెప్పుడు పాత కింగ్ జేమ్స్ బైబిలు నుండి బోధిస్తాము.

ఎవరైనా అనవచ్చు, "మీగుడి నిండా ముసలి వారు ఉన్నారు!" కాదు, లేదు! చాలామంది ముప్పై లోపువారే! ఇరవై ఐదు శాతము కళాశాల ఉన్నత పాఠశాల వయస్కులు. చాలా తక్కువ మంది ఏగుడికి చెందిన వారు కాదు. వారిలో చాలామంది దగ్గరున్న కళాశాల నుండి ఉన్నత పాఠశాలల నుండి సువర్తీకరణ ద్వారా తెబడ్డారు.

మేము చేసేదంతా, మేము నమ్ముతాం ఆధునిక
   సంఘాలకు సవాలు విసరడంలో. వేరుగా ఆలోచించడం నందు మేము నమ్ముతాం.
ఆ సంఘాలకు ఎలా సవాలిస్తామంటే వారికంటే
   మంచి క్రైస్తవులుగా ఉండు.
మేము నిజంగా వారికంటే మంచి క్రైస్తవులుగా ఉంటాం!
   మీరు వారిలో ఒకరిగా ఉంటారా?
(ఎందుకుతో ప్రారంభము నుండి తీసుకొనబడింది, సైమన్ సైనిక్ చే, పేజి 41).
(Paraphrased from Start With Why, by Simon Sinek, p. 41).

కొన్ని నెలలు ఇక్కడకు రండి, నిజ మార్పును అనుభవించండి, మీరు "ఆధునిక" సంఘస్తుల కంటే మంచి క్రైస్తవులుగా ఉంటారు! మీరు శ్రేష్టమైన క్రైస్తవులుగా ఉంటారు!

చాలా తక్కువ సంఘాలు పాతమార్గములో నడుస్తున్నాయి. అవి క్రీస్తు అపోస్తలులు బోధించినవి పాటించరు. పాత సంస్కరణలు, లేక పురిటాన్లు, లేదా 18 వ మరియు 19 వ శతాబ్దంలో బోధింపబడినవి బోధించరు. వారు నూతన మార్గాలలో, చార్లెస్ ఫిన్నీ బోధించిన అబద్దపు మార్గాలు గైకొంటారు – వాటి ద్వారా కొత్త నిర్ణయత్వులు, కొత్త సువర్తికులు, ప్రసిద్ధులు, వ్యతిరేక బైబిలు విద్యార్ధులు కొత్త కేల్వినిష్టులు (వారు కెల్విన్ సిద్ధాంతాలు మాట్లాడతారు, కాని వినే వారి హృదయాలు పరిశోధించరు జోనాతాన్ ఎడ్వర్డ్స్, జార్జి వైట్ ఫీల్డ్, స్పర్జన్ మరియు డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ల వలే). ఫిన్నీ ఫలాలను గూర్చి వివరించి మీ సమయాన్ని వ్యర్ధము చెయ్యను. వీరినందరిని కొత్త సువార్తిక గుంపుగా పిలుస్తాము. వారిని వారు "కొత్త సువర్తికులుగా పిలుచుకుంటారు"! వారు సరియే, ఎందుకంటే వారు బోధించేది కొత్తది కనుక. ఆ సంఘస్తులలో అందరు నశించారని నేను నమ్మను. కాని రక్షింపబడిన వారు పాతకాలపు వారు. "పాత సువర్తికులు" ను గూర్చి చదవాలనుకుంటే అయాన్ హెచ్. ముర్రే వ్రాసిన "పాత సువార్తీకరణ" చదవండి. మా పుస్తకాలలో దొరుకుతుంది లేక అమెజాన్.కం ద్వారా పొందవచ్చు. డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ చెప్పింది ఇలా ఉంది, "పాతమార్గము సత్యమార్గము కొత్త మార్గము లేదు" – మీరు నిజ క్రైస్తవులవడానికి కొత్త మార్గము లేదు. ప్రవక్త యిర్మియా చెప్పినట్టు,

"పురాతన మార్గములను గూర్చి, దేవుడు విధానాన్ని గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును" (యిర్మియా 6:16).

ఇప్పుడు నేను రక్షణకు నడిపించే పాతమార్గమునకు – నిత్య శిక్షకు నడిపించే కొత్త మార్గానికి తారతమ్యము చెప్తాను.

1.  మొదటిది, పాతమార్గము దేవునితో ఆయన మహిమతో ప్రారంభమవుతుంది; కొత్తమార్గము మానవుడు అతని అవసరాలు భావాలతో ప్రారంభమవుతుంది.

ఓ, "కొత్త మార్గములో" దేవుని గూర్చి ప్రస్తావిస్తారు. గాని ఆయన లేఖన దేవుడు కాదు. ఆయన బైబిలు సర్వ శక్తి మంతుడు కాదు. ఆయన రక్షించడానికి ఎన్నుకునే పాపములో విడిచిపెట్టే ఆ దేవుడు కాదు. "కొత్తమార్గము" దేవుడు బైబిలు దేవుడు కాదు, తనను గూర్చి అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు,

"కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును, ఎవని కఠిన పరచ గోరునో వాని కఠిన పరచును" (రోమా 9:18).

కొత్త మార్గము దేవుడు రక్షించాలనుకున్న వారిని ఎన్నుకుంటాడని, మిగిలిన వారిని నరకానికి విడిచి పెడతాడని బోధించదు. దేవుని గూర్చి అలా బోధించిన వాని నుండి ఎప్పుడు గతంలో విన్నారు? బైబిలు నిజ దేవుని గూర్చి మీరు విని ఉండకపోవచ్చు. బైబిలు చెప్తుంది "ఆయన గొప్ప దేవుడని భయంకరుడని" (ద్వితీయోప దేశకాండము 7:21). బైబిలు ఆయనను "గొప్ప భయంకర దేవుడని" పిలుస్తుంది (నెహేమ్యా 1:5) మరియు మళ్ళీ దేవుడు "గొప్ప అద్వితీయ భయంకర దేవుడుగా" పిలువబడ్డాడు (నెహేమ్యా 9:32) మరియు మనం హెచ్చరించబడ్డాం, "సజీవుడైన దేవుని హస్తాలలో పడుట అతి భయంకరము" (హెబ్రీయులకు 10:31). "మన దేవుడు దహించు అగ్ని" (హెబ్రీయులకు 12:29).

ఆ దేవుని గూర్చి బోధించే కాపరి లేక యాజకుని గూర్చి మీరు విన్నారా – ఆయనను గూర్చి బైబిలు "సజీవుడైన దేవుడు" అని చెప్తుంది? (హెబ్రీయులకు 10:31). ఒక బోధకుడు ఇలా బోధించడం విన్నారా దేవుడు రక్షింపబడడానికి కొద్ది మందిని ఎన్నుకొని మిగిలిన వారిని నరకానికి వదిలి పెడతాడని? క్రీస్తు అన్నాడు, "చాలామంది పిలవబడ్డారు, కాని కొద్ది మంది ఏర్పరచబడ్డారు" (మత్తయి 22:14). లేక ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు అనే చిన్న దేవుని గూర్చి మీరు విన్నారా – దేవుడు మిమ్మును మీ అవసరాలు తీరుస్తాడు – భయంకరుడు కాదు, "సజీవుడైన దేవుడు" కాదు అనే వారిని గూర్చి విన్నారా? మీరంటారు, "మీ భయంకర దేవుని గూర్చి వినడం నాకు నచ్చదు! నేను తిరిగి ఈ గుడికి రాను!" సరే, తిరిగి రాకండి! "మీ దేవునినే" నమ్ముతూ ఉండండి. కాని గుర్తుంచుకోండి, మీ దేవుడు నిజదేవుడు కాదు. బైబిలులోని "సజీవుడైన దేవుని" నీవు విశ్వసించకపోతే నీవు రక్షింపబడలేవు నిజ క్రైస్తవుడవు కానేరవు.

2.  రెండవది, పాతమార్గము మీ పాపాన్ని గూర్చి ఆలోచింప చేస్తుంది, దానిని నిజ దేవుడు నరకములో శిక్షిస్తాడు; కొత్త మార్గము మీ అవసరాలు భావాలను గూర్చి ఆలోచింప చేస్తుంది.

మీరు లోతుగా పాపాత్ములని చెప్పిన కాపరిని గూర్చి గాని యాజకుని గూర్చి గాని ఎప్పుడైనా విన్నారా? మీ హృదయము అపవిత్రమని? అది "మీ హృదయము...దుష్టమైనదని మోసకరమైనదని?" (యిర్మియా 17:9). మీరు నిజంగా రక్షింపబడకపోతే "నిత్య నాశనానికి వెళ్ళిపోతారు?" (మత్తయి 25:46). లేక పుల్లర్ సెమినరీ బోధకుడు రోబ్ వెల్ వలే చెప్పడం విన్నారా, ఆయనంటాడు ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు, హిట్లర్ కూడ. అవును, ఆయనలా అన్నాడు! (ప్రేమ జయిస్తుంది)? పుల్లర్ వేదాంత కళాశాల మంచిదైతే, అది అతని డిగ్రీలు తీసేసి, అతని డబ్బు తిరిగి పంపించేస్తారు.

మీరనవచ్చు, "తియ్యగా సుతిమెత్తగా మాట్లాడి, నా అవసరాలు తీర్చే బోధకుడు కావాలి. ఈ పాతకాలపు గుడికి నేను రాను ఇక్కడ నా పాపానికి వ్యతిరేకంగా బోధిస్తారు నేను నరకానికి పోతాను అని చెప్తారు!" సరే, కొనసాగండి మిమ్మును విడిచి పెట్టండి. వెళ్లి జోయిల్ ఆస్టీన్ తియ్యని "పాపి ప్రార్ధన" ను నమ్మండి – దాని తరువాత ఆయన చెప్తాడు టివి కార్యక్రమంలో, "మేము నమ్ముతాము మీరు ఆ ప్రార్ధన చేస్తే, మీరు తిరిగి జన్మిస్తారు." వెళ్లి ఆయనను నమ్మండి. కాని నేను వారిని అబద్ధపు ప్రవక్తలు అంటాను, అబద్ధపు బోధకులు వారే నరకానికి పోతారు! నేనలా అన్నానని వారితో చెప్పండి, ప్రసంగ ప్రతిలో విడియోలో ఉంచండి.

3.  మూడవది, పాతమార్గము మీ పాపమును గూర్చి ఆలోచింప చేస్తుంది, ప్రత్యేకించి మీ రహస్య పాపాలు మీ హృదయ పాపాలు; నూతన మార్గము మిమ్మును గూర్చి మంచిగా అనిపింప చేస్తుంది.

జోనాతాన్ ఎడ్వర్డ్స్ (1703-1758) అన్నాడు, "మానవుడు సహజంగా స్వప్రేమ [కలిగి యున్నాడు]" ("మానవుడు చాల దుష్టుడు హానిచేసే వాడు"). స్వప్రేమ, దేవుని పట్ల ప్రేమ ఉండదు. ఎవరి కొరకు కాదు నీ కొరకే – ఎందుకంటే నీవు, జోనతాన్ ఎడ్వర్డ్స్ చెప్పినట్టు, "చాలా చెడ్డ హాని చేసే వ్యక్తి." నీవెందుకలా ఉన్నావు? ఎందుకంటే పాపపు స్వభావము పొందుకున్నావు (ఆది పాపము) ఆదాము నుండి వచ్చినది, మానవాళికి ఆది తండ్రి! అందుకే నిన్నే ప్రేమించుకుంటావు. "కాదు, కాదు!" ఎవరో అన్నారు, "నా భర్తను ప్రేమిస్తాను." అవునా? అప్పుడు ఎందుకు నీవు తిరగబడి రాత్రింబవళ్ళు అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తావు? సత్యమేమిటంటే నిన్ను నీవు ప్రేమించుకుంటావు!

పొరపాటు చెయ్యరు, మీరు దేవుని ప్రేమించరు. మీ స్నేహితులను చూడడానికి గుడికి వస్తారు. మీ స్నేహితులలో ఒకరు గుడి విడిచి పెడితే, మీరు కూడ వదిలేస్తారు. మీరు ఎలాంటి వేషదారులో ఇది రుజువు చేస్తుంది! ఇది నిరూపిస్తుంది క్రీస్తును ప్రేమించుట ఆయనను విశ్వసించుటను గూర్చి మీరేమి చెప్పినా, మిమ్ములను మీరు మోస పుచ్చుకుంటున్నారు. నీవు ఒక అబద్దపు క్రైస్తవుడవు. క్రైస్తవునిలా మారు వేషం వేసావు. నీవు అబద్దపు నవ్వు కలిగి స్నేహ పూరిత చూపు చూస్తావు, కాని నీవు క్రైస్తవుడవు కావు. క్రైస్తవునిలా వేషం వేస్తావు, చాలామందిలా! లేదు, సత్యమేమిటంటే నీవు క్రీస్తును ప్రేమించవు. నిన్ను నీవే ప్రేమించుకుంటావు. నిన్ను మాత్రమే! నిన్ను మాత్రమే! నిన్ను మాత్రమే! బైబిలు చెప్తుంది, "చివరి దినాలలో... మనష్యులు తమ్మును తామే ప్రేమించుకుంటారు" (II తిమోతి 3:1, 2). అందుకే బైబిలు చదవడానికి సమయముండదు. ప్రార్ధించడానికి సమయముండదు. సువార్త పనికి సమయముండదు – కాని నీకు చాలా సమయము ఉంటుంది, గంటల కొలదీ, విడియోలు ఆటలు ఆడడానికి టివి అశ్లీల చిత్రాలు చూడడానికి. ఆదివారము శనివారము రాత్రి గుడికి రావడానికి సమయము ఉండదు – కాని సినిమాలకు వెళ్ళడానికి చాలా సమయము ఉంటుంది! నీవెందుకలా ఉన్నావు? నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు కాబట్టి! దేవుని పట్ల ప్రేమ లేదు. యేసు పట్ల ప్రేమ లేదు. నీ పట్లే ప్రేమ. ఒప్పుకో! ఇప్పుడే ఒప్పుకో – లేనిచో నీవు పశ్చాత్తాప పడవు క్రీస్తును విశ్వసించడం ద్వారా నిజ క్రైస్తవుడవు కాలేవు.

"కొత్త" మార్గము పాత మార్గానికి వ్యతిరేకము – మనం నమ్ముతాం. "కొత్త" మార్గము గుడిలో ముందుకు వెళ్ళి పాపి ప్రార్ధన చేయిస్తుంది. తరువాత బాప్తిస్మమిస్తారు! చాలామంది బాప్టిస్టులు ఇది చెప్పినందుకు నన్ను ద్వేషిస్తారు, కాని నేను మీకు సత్యము చెప్పాలి. వారు ఎంతో త్వరగా బాప్తిస్మమిస్తారు, "నిర్ణయము" తీసుకున్న వెంటనే. ఎందుకు వారు వెంటనే బాప్తిస్మమిస్తారు, అదే కూటములో? యేసు ప్రేమిస్తున్నందుకు అలా చెయ్యరు! బైబిలును నమ్ముతున్నందుకు చెయ్యరు! వారిని వారే ప్రేమించుకుంటారు కాబట్టి వారలా చేస్తారు! వారు మిమ్మును ఏమాత్రము పట్టించుకోరు. ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చారో అదే పట్టించుకుంటారు. తెలిసే అలా చేస్తున్న కాపరులు వారే రక్షింపబడలేదు! నేనలా చెప్పానని వారితో చెప్పండి, ప్రసంగ ప్రతి విడియోలో పెట్టండి.

మీరంటారు, "నాకది ఇష్టము లేదు. నాకు దేవుని పట్ల ప్రేమలేదు అని చెప్పడం నాకిష్టము లేదు. నన్ను నేనే ప్రేమించుకుంటాను అని చెప్పడం ఇష్టం లేదు. మళ్ళీ ఈ గుడికి రాను!" సరే, తిరిగి రాకండి. కాని గుర్తుంచుకోండి, ఈ ముసలి బోధకుడు మీకు సత్యము చెప్పాడు, పూర్తి సత్యము, సత్యము మాత్రమే – నిన్ను గూర్చి! మీరేమి చెప్పినా చేసినా నేను అలా చెప్పడం ఆపను. కొందరు యవనస్తులంటారు, "నేను నా స్నేహితులను తేలేను ఎందుకంటే మీరు కఠినంగా బోధిస్తారు." కాదు, ప్రియతమా, అది కారణము కాదు – మీకు తెలుసు! మీరు మీ స్నేహితులను తేరు ఎందుకంటే వారి ఆత్మలు భారము మీకు లేదు! వారి ఆత్మలను గూర్చి అస్సలు పట్టించుకోరు – ఎందుకంటే నిన్ను నీవే ప్రేమించుకుంటారు! ఆ అసహ్యపు ముఖ బావము మార్చి నేను చెప్తున్నా దాని గూర్చి ఆలోచించు! నశించు వారిని సరిగ్గా ఇక్కడికే తీసుకురావాలి! ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మాత్రమే వారు రక్షింపబడగలరు! అందుకే! నిన్ను ప్రేమించుకుంటున్నట్టు వారిని ప్రేమిస్తే, వారితో చెప్తావు, "నాతో గుడికి రండి! అది కఠిన స్థలము! అది పాత పాఠశాల! కాని ఇది డౌన్ టౌన్ ఎల్. ఏ. లో శ్రేష్టమైన గుడి, నాలాంటి మీలాంటి యవనులతో నిండి ఉంది." నీవు నిజ క్రైస్తవుడవైతే అలా వారితో చెప్తావు. కాని నీవు కాదు. నీవు నకిలీ! నిన్ను నీవే ప్రేమించుకుంటావు. ఇంకొక నశించిన బిడ్డవు.

బుధవారము రాత్రి ఒక రక్షింపబడని అమ్మాయి నాతో చెప్పింది నేను గట్టిగా అరుస్తాను కాబట్టి నామాట ఆమె వినదని. నేను తనతో అన్నాను, "చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు, కాని ఇంకను నీవు నశించి తిరుగబడుతున్నావు. ఇంకా నేను గట్టిగా అరవాలి!" అవును, గట్టిగా – గట్టిగా – గట్టిగా. ఒక గ్రుడ్డి వానిని చూస్తే, నీవు చెప్పవా? "తప్పుకో లేకపోతే చస్తావు!" అందుకే నేను అరుస్తాను – నేను నీ ఆత్మను ప్రేమిస్తున్నాను కనుక. అరవని ప్రసంగీకులు మిమ్ములను ప్రేమించరు. మీ డబ్బు వారిని కావాలి! నీవు నిజ మార్పిడి అనుభవించ లేవు నీవు దేవునితో నీతో ఒప్పుకుంటే తప్ప నీవెంత పాపిఒ స్వార్ధ పరుడవో తెలుసుకోవాలి. నీ రహస్య పాపాలు హృదయ పాపాలు ఒప్పుకోవాలి. దావీదులా నీకనిపించాలి, "నా పాపము నా యెదుట నున్నది" (కీర్తనలు 51:3). ఇది పాత మార్గపు మార్పిడి. నీకు పాపపు ఒప్పుకోలు కలగాలి, లేనిచో క్రీస్తు నీ కొరకు చనిపోవడం, సిలువపై రక్తం కార్చడం నీ పాపాలు కడగడానికి ఆ అవసరము నీకు తెలియదు.

4.  నాల్గవది, పాత మార్గము నిన్ను నీవు పరీక్షించుకొనడం; కొత్త మార్గము గుడిలో ఉన్నంత సేపు ఆడుకోవడం తరువాత పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవడం.

మన పాఠ్యభాగము చెప్తుంది, "మిమ్ములను మీరు పరీక్షించుకోండి, విశ్వాసములో ఉన్నారో లేదో; మిమ్మును మీరు నిరూపించుకోండి" (II కొరింధీయులకు 13:5). ఇది పాత మార్గము. నీవు నిజంగా రక్షింపబడ్డావా నిన్ను నీవు పరీక్షించుకో. జోనతాన్ ఎడ్వర్డ్స్ అన్నాడు, "[నీవు] పాపపు ఒప్పుకోలు నటన మాత్రమే కాదు; పాపపు విలాపము కలిగి యుండాలి. మరియు, ఆ పాపము [నీకు] భారము [నీ] హృదయము మెత్తగా మృదువుగా ఉండాలి."

అలా భావన పొందాలి లేనిచో నీకు అబద్దపు మార్పిడి వస్తుంది. మీలో కొందరు ఇతరుల మార్పులు వినో చదివో ఉంటారు. నీవు చదివిన సాక్ష్యాలు నీవు కంటత పెట్టి ఉంటావు. మీలో కొందరి మార్పిడి సాక్ష్యాలు చదవడం ద్వారా చెప్పగలను షీలాఘ్నన్ సాక్ష్యము కంటత పెట్టి ఉంటారు, లేక జాన్ యొక్క శక్తి వంత సాక్ష్యము విని ఉంటారు. చిన్న ఒప్పుకోలుకు వచ్చి వారి చెప్పినవి చేస్తారు! నిజ మార్పిడి మీకు రాలేదు, నిజ మార్పిడి ఉన్న సాక్ష్యము కంటత పెట్టావు అంతే. జాన్ కాగన్ సాక్ష్యము చదువుతాను. నేను చదువుతుండగా, నిన్ను నీవు పరీక్షించుకో. నేను జాన్ కాగన్ సాక్ష్యము చదువుతూ ఉండగా నిన్ను నీవు అడుగుకో, "అది నాకు నిజంగా సంభవించిందా? లేక అతడు చెప్పిందే చేసావా?" ప్రతిమాట జాగ్రత్తగా విని నిన్ను నీవు ప్రశ్నించుకో అది నీకు నిజంగా జరిగిందా అని. అలా జరగకపోతే నీది అబద్ధపు మార్పిడి. త్వరలో నీవు మాగుడి విడిచి పెడతావు, చాలామంది ఇతరులు చేసినట్టు. నీకు నిజ మార్పిడి ఉండాలి లేనిచో నీవు సాతాను నీ కొరకు వచ్చినప్పుడు గుడి విడిచి వెళ్ళిపోతావు.

నా సాక్ష్యము
జూన్ 21, 2009
జాన్ సామ్యూల్ కాగన్ చే

నా మార్పు సమయాన్ని చాలా కచ్చితంగా సన్నిహితంగా జ్ఞాపకము చేసుకోగలను క్రీస్తు నాలో జరిగించిన మాటలలో వర్ణించలేను. మార్పుకు ముందు నాలో కోపము ద్వేషము ఉండేవి. నా పాపాలలో గర్విస్తూ దేవుని ద్వేషించే వారితో కలిసి ఉండేవాడిని. దేవుడు నాలో పనిచేయడం ప్రారంభించాడు. నా మార్పుకు ముందు కొన్ని వారాలు చనిపోవాలనుకున్నాను: నిద్ర పోలేదు, నవ్వలేక పోయాను, శాంతి నాలో లేదు. మన సంఘములో సువార్త కూటాలు జరుగుతున్నాయి నాకు తేటగా జ్ఞాపకముంది నేను వాటిని అపహసించాను నా కాపరిని నా తండ్రిని పూర్తిగా అగౌరవ పరిచాను. (జాన్ కు నా మీద పిచ్చి కోపము ఉండేది గట్టిగా బోధిస్తున్ననందుకు నేను చెప్పిన ఆ అమ్మాయి వలే).

ఆ సమయంలో పరిశుద్ధాత్మ నాలో కచ్చితంగా పాపపు ఒప్పుకోలు కలిగిస్తుంది, కాని నా మనసుతో దేవుడు మార్పును గూర్చిన తలంపులను తిరస్కరించాను. దాని గూర్చిన ఆలోచింప నిరాకరించాను, అయినా చిత్ర హింస అనుభవించాను. (నీ పాపపు చిత్రహింస నీవు అనుభవించకపోతే, నీవు రక్షించబడలేదు!).

డాక్టర్ హైమర్స్ బోధిస్తున్నప్పుడు, నా గర్వము దానిని తిరస్కరింప చేస్తుంది, వినకుండా చేస్తుంది, కాని యాన బోధిస్తుండగా నా పాపమంతా నా ఆత్మపై ఉన్నట్టు అనిపించింది. ప్రసంగము ఎప్పుడు అవుతుందా అని క్షణాలు లెక్కపెడుతున్నాను, కాని కాపరి బోధిస్తూనే ఉన్నారు, నా పాపాలు ఇంకా భయంకరమయ్యాయి. నేను రక్షింపబడాలి! ఆహ్వానాన్ని నిరాకరించాను, కాని భరించలేకపోయాను. నేను భయంకర పాపినని దేవుడు న్యాయవంతుడై నరక శిక్ష నాకు ఇస్తాడని తెలుసు. (ఆ భావన నీకు కావాలి. జోనాతాన్ ఎడ్వర్డు అన్నాడు నీకు అలా అనిపించాలి లేనిచో రక్షింప బడలేవు). ఘర్షణతో అలసిపోయాను, అంతటితో అలసిపోయాను. కాపరి నాకు ఉపదేశించాడు, క్రీస్తు నొద్దకు రమ్మన్నారు, కాని నేను రాలేదు. పాపపు ఒప్పుకోలు కలిగినా నేను ఇంకా యేసును విశ్వసించ లేదు. రక్షింపబడాలని "ప్రయత్నిస్తున్నాను" క్రీస్తును విశ్వసించాలని, నేను "ప్రయత్నిస్తున్నాను" కాని చెయ్యలేకపోతున్నాను, క్రీస్తు నొద్దకు (ఎలా రావాలో తెలియడం లేదు), క్రైస్తవునిగా మారడానికి నిర్ణయించుకోలేక పోతున్నాను, అది నిరీక్షణ లేనివానిగా చేసింది. నా పాపము నన్ను నరకంలోనికి నెడుతున్నట్టు అనిపిస్తుంది కాని కన్నీరు రాకుండా మొండిగా ఉన్నాను. ఈ సంఘర్షణలో ఇరుక్కు పోయాను. (పాత బోధకులు దానిని "సువార్త పరము" అంటారు). నా పాపము నరకంలోనికి తోస్తున్నట్టు నాకనిపించింది. అయినను నా మొండితనము కన్నీటిని ఆపేస్తుంది. (గట్టివారు ఏడవరు. అతడు మొండివాడు. కాని దేవుడు తనను తోసి సువార్త పరముతో నొక్కి ఎడ్చేటట్టు చేసాడు.)

అకస్మాత్తుగా సంవత్సరాల క్రితం బోధించిన ప్రసంగము నా మనసులోనికి వచ్చింది: "క్రీస్తుకు లోబడు! క్రీస్తుకు లోబడు!" ఆ క్షణంలో నేను ఆయనకు లోబడ్డాను విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చాను. ఆ క్షణంలో చనిపోవాలనుకున్నప్పుడు, క్రీస్తు నాకు జీవితమిచ్చినట్లు అనిపించింది! క్రియలేదు మనసు లేదు కాని నా హృదయంతో, క్రీస్తుపై ఆధారపడడం వలన, ఆయన నన్ను రక్షించాడు! ఆయన రక్తములో నా పాపాలు కడిగాడు! ఆ క్షణంలో, క్రీస్తును నిరాకరించడం ఆపాను. చాలా తేటగా తెలిసింది నేను చేయవలసింది ఆయనను విశ్వసించడం; నేను కాదు క్రీస్తే అనే సంగతి నాకు అనిపించింది అది గుర్తుంది. నేను లోబడాలి! ఆ క్షణంలో శారీరక భావన లేదు గ్రుడ్డిగా చేసే వెలుగు లేదు, ఒక భారం నాకు అవసరమనిపించలేదు, క్రీస్తు నాలో ఉన్నాడు! క్రీస్తును విశ్వసించడంలో నా పాపము నా ఆత్మను విడిచినట్టు అనిపించింది. నా పాపము నుండి వైదొలిగాను, యేసు వైపే చూసాను! యేసు నన్ను రక్షించాడు.


జాన్ సాక్ష్యము విన్న తరువాత, అది నిజంగా నీకు జరిగిందా? అలా జరగక పోతే నీవు నిజంగా మార్పు నొందాలి. నకిలీ కాదు, నిజ మార్పు నీకు అవసరము. నిజ మార్పిడికి నీవేమి చెయ్యాలి? మొదటిది, నీ హృదయము ఎంత చెడ్డది ఆలోచించు, ఎంతో పాప భూ ఇష్టము నీవు నిజంగా పశ్చాత్తాప పడి యేసును విశ్వసించ లేక పోతున్నావు. పదాలు నేర్చుకొని మోసపరిచేలా పాప భరితుడవయ్యావు. నేను సరియే కాదా? నీకు నిజంగా నీ హృదయ జీవిత పాపము నుండి మరలాలి. నీవు నిజంగా యేసు నొద్దకు రావాలి సిలువపై ఆయనకార్చిన రక్తములో కడగబడాలి. బలిపీటం దగ్గరకు రండి, మీ కొరకు ప్రార్దిస్తాం ఉపదేశిస్తాం మిగిలిన వారు భోజనానికి మేడపైకి వెళ్తారు. ఇప్పుడే రండి. ఇప్పుడే ఇక్కడకు రండి! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పఠనము ఏబెల్ ప్రుదొమ్ గారు: కీర్తనలు 51:1-3.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
"పాతకాలపు మార్గము" (సివిల్లా డి. మార్టిన్ చే, 1866-1948).
“The Old-Fashioned Way” (by Civilla D. Martin, 1866-1948).



ద అవుట్ లైన్ ఆఫ్

ఇప్పుడు మిమ్ములను మీరు పరీక్షించుకోండి!

EXAMINE YOURSELVES NOW!

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"మీరు విశ్వాసము గలవారై యున్నారో, లేదో పరీక్షించుకోండి; మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని యెడల, యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగురా?" (II కొరింధీయులకు 13:5).

(ప్రకటన 20:15; 14:10, 11; యిర్మియా 6:16)

1.  మొదటిది, పాతమార్గము దేవునితో ఆయన మహిమతో ప్రారంభమవుతుంది; కొత్తమార్గము మానవుడు అతని అవసరాలు భావాలతో ప్రారంభమవుతుంది, రోమా 9:18; ద్వితీయోపదేశకాండము 7:21; నెహేమ్యా 1:5; 9:32; హెబ్రీయులకు 10:31; 12:29; మత్తయి 22:14.

2.  రెండవది, పాతమార్గము మీ పాపాన్ని గూర్చి ఆలోచింప చేస్తుంది, దానిని నిజ దేవుడు నరకములో శిక్షిస్తాడు; కొత్త మార్గము మీ అవసరాలు భావాలను గూర్చి ఆలోచింప చేస్తుంది, యిర్మియా 17:9; మత్తయి 25:46.

3.  మూడవది, పాతమార్గము మీ పాపమును గూర్చి ఆలోచింప చేస్తుంది, ప్రత్యేకించి మీ రహస్య పాపాలు మీ హృదయ పాపాలు; నూతన మార్గము మిమ్మును గూర్చి మంచిగా అనిపింప చేస్తుంది, II తిమోతి 3:1, 2; కీర్తనలు 51:3.

4.  నాల్గవది, పాత మార్గము నిన్ను నీవు పరీక్షించుకొనడం; కొత్త మార్గము గుడిలో ఉన్నంత సేపు ఆడుకోవడం తరువాత పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవడం,
II కొరింధీయులకు 13:5.