ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
సజీవ క్రైస్తవత్వానికి పోరాటము!డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్ ను, గూర్చిన ఉపోద్ఘాతము. జాన్ సామ్యూల్ కాగన్ గారిచే |
క్లిష్ట సమయాలలో, వారికంటే గొప్ప వాటిని నమ్మే వారిచే చరిత్ర సృష్టించబడింది. సగటు మానవునిచే చరిత్ర సృష్టించబడలేదు. కొందరు సామాన్య స్థితి యొక్క స్థిరత్వము రక్షణలను కోరుకుంటారు. కొందరు వైఫల్యమును గూర్చి భయపడి ఎన్నడు ప్రయత్నించరు. కొందరు సహించడంలో వెల చెల్లించలేరు ఎందుకంటే గొప్పది వారు సాధించలేరు కాబట్టి. కొందరు దేనిని మార్చలేరు, ప్రపంచాన్ని ప్రభావితం చేయలేరు, ఎన్నడు జీవించ లేదన్నట్టు చనిపోతారు. ఇలాంటి మనష్యులు ఉన్న కాలములో, దేవుడు డాక్టర్ హైమర్స్ ను పైకెత్తాడు. పరిచర్యలో ఇచ్చే చాలామంది అన్ని రకాలుగా ప్రోత్సాహించ బడతారు. అయినను, డాక్టర్ హైమర్స్, పగలు పనిచేసి రాత్రులు పాఠశాలకు వెళ్ళేవారు. కుటుంబ సభ్యులు స్నేహితులు తరుచు నిరుత్సాహ పరిచినప్పటికినీ, ఆయన ఒక గురిని పెట్టుకొని దేవుని సేవకునిగా ఉండాలని, దాని నుండి ఎప్పుడు తొలగిపోలేదు ఎంత కష్టం వచ్చినప్పటికినీ. ఆయన దైవ సేవకుడవడానికి పోరాటము సలిపి సాతాను దాడులను భావోద్రేక బాధను తట్టుకొని నిలబడ్డారు. డాక్టర్ హైమర్స్ ప్రతి కష్టాన్ని శ్రమను సహించాడు దేవుని సత్యాన్ని చెప్పడానికి. జీవితంలో అగ్నిని సహించారు కాబట్టి, డాక్టర్ హైమర్స్ సత్యాన్ని కొరకు కాల్చబడ్డాడు. డాక్టర్ హైమర్స్ దేవుని వాక్యపు సత్యాన్ని ఎంతో గట్టిగా నమ్మి దాని కొరకు పోరాడడానికి ఇష్టపడ్డారు. అబద్దాన్ని అంగీకరించే మనిషి కాదు ఆయన. ఆయన జీవితమంతా అలాగే ఉన్నారు. బైబిలును తిరస్కరించే సెమినరీలో ఏమి చెయ్యకుండా వెనుక కూర్చోండి పోలేరు. ఆయన పట్ట భద్రతా విషయంలో ప్రమాదమున్నప్పటికినీ, డాక్టర్ హైమర్స్ బైబిలుపై వ్యతిరేక దాడులను ఖండించారు. తరగతి గదులను మూసి, పాఠశాల వార్తా పత్రికలో కొన్ని సంచికలు వ్రాసి, తన గదిలో ప్రార్ధనా కూటాలు ఏర్పాటు చేసి పోరాడడానికి ప్రతి వనరులను ఉపయోగించారు; బైబిలు సత్యానికి వ్యతిరేకంగా చెప్పబడిన అబద్దాలను ప్రతి ఘటించడానికి. ఆయన సెమినరీ అధ్యక్షుని కార్యాలయానికి పిలువబడి తన ప్రతి ఘటనలను ఆపమని చెప్పబడినప్పుడు, డాక్టర్ హైమర్స్ లోబడలేదు. దానికి బదులు, ఆయన సెమినరీలలో ఉన్న స్వతంత్ర తానై ఒక పుస్తకము వ్రాసారు. బైబిలు కొరకైన పోరాటములో ఆయన గట్టిగా నిలబడ్డాడు. కొందరు విమర్శించారు, కొందరు ఫిర్యాదు చేసారు, కొందరు లొంగిపోయారు, కాని డాక్టర్ హైమర్స్ క్రియాశీలి. దేవుని సత్యము విషయంలో ఆయన బలమైన ఒప్పుకోలు కలిగిన వారు ఆయన తన కత్తి తీసుకొని మరణ భయమునప్పటికి దుష్ట శక్తులను ఎదిరించారు. డాక్టర్ హైమర్స్ తన జీవితాన్ని బంధకాల కంటే ఎక్కువగా ప్రేమించలేదు. ఆయన యుద్ధ వీరుడు ఇతరులు శాంతిని బానిసత్వముతో కొనలానుకున్నప్పుడు. హాలివుడ్ క్రీస్తు ముఖముపై ఉమ్మివేసినప్పుడు, డాక్టర్ హైమర్స్ తన రక్షకుని ముఖాన్ని తుడిచాడు. అందుకు, అతడు దాడి చేయబడ్డాడు. ఆయనకు వ్యతిరేకంగా సంచికలు వ్రాయబడినప్పటికినీ, ఆయన క్రీస్తును సమర్ధించాడు! దానికి స్నేహితులను కోల్పోయాడు. అయినను, సరియైనది చేయడానికి డాక్టర్ హైమర్స్ ప్రతిఘటించడానికి, పోరాడడానికి, సిద్ధపడ్డాడు. "గర్భస్రావ హక్కును" సమాజమంతా అంగీకరించినప్పుడు, డాక్టర్ హైమర్స్ శిశువును చంపడమును తిరస్కరించారు. సగటు మనిషి జాలిపడి దాతృత్వము చూపించవచ్చు, కాని డాక్టర్ హైమర్స్ సగటు మనిషి కాదు. ఆయన నా తండ్రి గర్భస్రావ ఆసుపత్రి ముందు కూర్చున్నారు. ఇతరులు పోలీసుల భయానికి పారిపోయినప్పుడు, డాక్టర్ హైమర్స్ తన నమ్మకాలకు కట్టుబడ్డారు. శిశువు జీవితమూ స్త్రీ హక్కుల మధ్య ఉన్న మీమాలసను ఆయన తొలగించాడు. రెండు గర్భ స్రావ ఆసుపత్రులను మూయించడానికి తన సంఘాన్ని అన్ని విధాలుగా నడిపించారు. గర్భస్రావానికి వ్యతిరేకంగా ఆయన బలంగా నిలబడ్డారు. తరువాత మన సంఘ విషయంలో పోరాటము వచ్చింది. "మునపటి నాయకుడు" విడిచి వెళ్ళిపోయాడు. తనతో, 400 మంది గుడిని వదిలి వెళ్ళిపోయారు. ఈ భవనాన్ని సంఘము కోల్పోయింది. సంఘము దివాలా తీసింది. ప్రఖ్యాత బోధకుడు ఒక పెద్ద సంఘానికి కాపరిగా ఉండాలని, డాక్టర్ హైమర్స్ కు అవకాశం ఇచ్చాడు. మునిగిపోతున్న ఓడ నుండి బయటకి దూకే అవకాశాన్ని డాక్టర్ హైమర్స్ ఇచ్చాడు! అతనన్నాడు, "బయటికి రావడానికి ఇది ఆఖరి అవకాశము." చాలామంది కాపరులు వెళ్ళిపోయి ఉండేవారు. సభ్యులు విడిచి పెడుతున్నప్పుడు సంఘము ఆర్ధిక దుస్థితిలో ఉన్నప్పుడు – డాక్టర్ హైమర్స్ ఆగిపోయారు! డాక్టర్ హైమర్స్ ఈ స్థానిక సంఘము కొరకు పోరాడ ఇష్టపడ్డారు. ఆయన ఆత్మీయ ధైర్యాన్ని బట్టి నమ్మకస్తులను బట్టి వారి సమయము ద్రవ్యమును బట్టి, మనము లాస్ ఏంజిలాస్ నడిబొడ్డున సంఘాన్ని కలిగి యున్నాము! ఆయన అసాధ్య సవాలును ఎదుర్కొని ఉండిపోయారు ధైర్యముతో విన్ స్టన్ చర్చిల్ వలే ఆయన పాశ్చాత్య నాగరికత యుద్ధ సమయంలో హిట్లర్ ను ఎదుర్కొన్నాడు. డాక్టర్ హైమర్స్ స్థానిక సంఘము ప్రాధాన్యతను గమనించారు. డాక్టర్ హైమర్స్ తరుచు చెప్పేవారు ఆయన జీవితమే ఈ సంఘ విజయానికి కారణమని. ఆయనకు లోతైన ప్రేమ ఉంది, ఈ సంఘము పట్లే కాదు, లోకములో ఉన్న అన్ని సంఘాల విషయంలో. సంఘ శక్తి ఆయన తపన. సంఘ జీవితమూ ఆయన గుర్తింపు ముడిపెట్టబడి ఉంది. క్రీస్తు నిమిత్తము ఆయనకు ఒకే మనసు ఉంది క్రీడాకారుల వలే, రాజకీయ నాయకుల వలే, యోధుల వలే. ఆయనకు తెలుసు సంఘము క్రీస్తు కొరకు వధువు అని, కాబట్టి ఆయన ప్రార్ధించి, సంఘ శ్రేయస్సు నిమిత్తము పోరాడి, బోధించేవారు. కొంతమందిచే అనుమానింపబడినప్పటికినీ, చాలామంది ప్రోటేస్టెంట్ నాయకులు దేవుని పట్ల సత్యవంతులు డాక్టర్ హైమర్స్ ను పొగిడి మద్దతునిచ్చారు. వారిలో ఒకరు జాతీయ స్థాయి ప్రఖ్యాత సువార్తికుడు "ద బైబిలు సువార్తికుడు" సంచాలకుడు, డాక్టర్ రోబర్ట్ ఎల్. సమ్మర్. 20 వ శతాబ్దపు క్రైస్తవ ప్రముఖులలో ఒకరు, డాక్టర్ సమ్మర్ కు నిజ దైవ సేవకులు తెలుసు. డాక్టర్ హైమర్స్ ను గూర్చి డాక్టర్ సమ్మర్ ఇలా వ్రాసారు, "డాక్టర్ హైమర్స్ బాహాటంగా, ఉద్దేశపూర్వకంగా సువార్త బోధించే, సువార్తిక, బైబిలును బోధించే సంఘాన్ని దుష్ట డౌన్ టౌన్ లాస్ ఏంజిలాస్ నందు స్థాపించారు. దాని నిమిత్తము, నేను ఆయనను ప్రశంసిస్తున్నాను ఇతర సువార్తిక సేవలలో చేరకుండా ఉండినందుకు... నేను ప్రశంసించి పోగుడుతున్నాను ఎవరైతే సత్యము కొరకు నిలబడతారో ఆయన ఒప్పుకోలు ప్రకారము, ప్రతికూల పరిస్థితులలో కూడ. రోబర్ట్ లెస్లీ హైమర్స్ అలంటి క్రీస్తు క్రైస్తవ సేవకుడు! అమెరికాలో అతి దుష్ట పట్టణములో నడిబొడ్డున స్థానిక పరిచర్యతో పాటు, ఆయన అంతర్జాతీయ పరిచర్యను కూడ జరిగించారు స్థానికంగా కూడ, ఆయన ఆరాధనలు ‘నేరుగా’ స్పెనిస్ మరియు చైనీయ భాషలలో అనువదింప బడ్డాయి." చాలా దశాబ్దాలుగా సువర్తికునిగా మాత్రమే కాక, డాక్టర్ సమ్మర్ డాక్టర్ హైమర్స్ జీవితమూ పరిచర్యలోని గొప్ప శక్తి కారకాలను గుర్తించారు! డాక్టర్ హైమర్స్ దర్శనము గల వ్యక్తి. కష్ట సమయాల్లో కూడ నిరీక్షణ విఫలమయ్యాక కూడ, దేవుడు గొప్ప విషయాలు నేరవేర్చగలడు. ఆయన ఒక వెబ్ సైట్ ను ప్రారంభించి లోకమునలు మూలాలలో ఉన్న కాపరులకు సేవకులకు ప్రసంగ ప్రతులు ప్రసంగ సామాగ్రి సమకూర్చుతున్నారు. ఈ ప్రయత్నము మునుపు కనబడలేదు వినబడలేదు. అయినను, లోకములో ఉన్న అన్ని దేశాలలో ఒక మార్పు కొరకు, ఆయన ప్రసంగ సిద్ధపాటు తీరును మార్చేసాడు ఈ గొప్ప పని నిమిత్తము. ఆయన సుదీర్ఘ పరిచర్యలో, డాక్టర్ హైమర్స్ ఒక శీర్షికపై బోధించేవారు. అయినను, ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులకు ఆయన ప్రసంగాలు అందేలా చూసారు. కాబట్టి ఆయన తన ప్రసంగాలు పదము వెంబడి పదము వ్రాసుకొని ప్రతి నుండి బోధించాలని నిర్ణయించుకున్నారు. చాలామంది బోధకులు ఎక్కువ కాలపు పరిచర్యలో ఉండి వారి సిద్ధ పాటు మార్చరు, కాని డాక్టర్ హైమర్స్ దర్శనము గల వ్యక్తి. సంవత్సరాల తరువాత, డాక్టర్ హైమర్స్ ప్రసంగ ప్రతులు ప్రపంచంలోనికి ప్రతి దేశములో చదువబడుతున్నాయి ఆయన వెబ్ సైట్ ను 2016 లో పదిహేను లక్షల మంది చూసారు. ప్రతి వ్యక్తిని గూర్చిన కలిగి, డాక్టర్ హైమర్స్ ఆయన ప్రసంగాలు ఇతర భాషలలోనికి అనువదింపబడాలని ప్రత్యేక శ్రద్ధ కలిగిన వారు. మొదట, ప్రసంగ ప్రతులు కొన్ని భాషలలోనికి మాత్రమే అనువదింప బడ్డాయి. చివరకు, డాక్టర్ హైమర్స్ భాషా ప్రమేయము లేకుండా ప్రపంచమంతటా చేరుకోవాలని దర్శనము కలిగియున్నారు. ఈరోజు, డాక్టర్ హైమర్స్ ప్రసంగ ప్రతులు 35 భాషలలోనికి అనువదింపబడుతున్నాయి! ఈ ప్రసంగాలు మూడవ ప్రపంచంలో ఉన్న మిస్సెనరీలకు కాపరులకు ఆశీర్వాదము సహాయము. అవి యేసును గూర్చిన అవసరత, ఆత్మల ఒప్పుకోలకు కారకాలు అవుతున్నాయి. ప్రసంగాలు 35 భాషలలోనికి అనువదింప బడడం దర్శనాన్ని సమర్పణను చూపిస్తుంది, అది క్రైస్తవ ప్రపంచముపై శక్తివంతమైన ముద్ర వేయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. ఎంత పోరాటమున్నప్పటికినీ, డాక్టర్ హైమర్స్ దేవుని పందాలో ఉండడానికి కష్టపడ్డారు. చాలామంది కుర్చీ పోయినను ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించారు. అందరు తిరస్కరించాక ఆయన పాత పద్ధతిలో తపనతో తీవ్రతతో బోధించాడు. ఆయన దేవుని కృప శక్తిలతో ఉన్న నిజ మార్పిడిని నమ్ముతారు యేసు నందలి విశ్వాసము ఇవి విన్నవారిని నరక ప్రమాదము నుండి తప్పిస్తాయి. ప్రార్ధన నామకార్ధమైనప్పుడు, డాక్టర్ హైమర్స్ దేవుని శక్తి యందు ప్రార్ధన యందు నమ్మారు. ఇతర సంఘాల నుండి సభ్యులను దొంగిలించి ఎక్కువ కానుకలు పొందే ఈ రోజుల్లో, డాక్టర్ హైమర్స్ ప్రపంచములోని యవనస్తులను సువర్తీకరించడం నమ్మారు. ఇతరులు ఆరాధనలను మూసేస్తుండగా, డాక్టర్ హైమర్స్ సంఘము ప్రాముఖ్యతను శక్తిని నమ్ముతారు. చాలామంది శరీరాలను నింపు కోవడంలో తృప్తి పడుతుంటే, డాక్టర్ హైమర్స్ సజీవ క్రైస్తవ్యాన్ని నమ్మి దాని కొరకు పోరాడతారు. కొన్ని క్షణాల్లో డాక్టర్ హైమర్స్ బోధించడానికి వస్తారు. కాని ముందు గ్రిఫిత్ గారు వచ్చి డాక్టర్ హైమర్స్ కు ప్రీతి పాత్రమైన పాట పాడతారు, "కదలండి, క్రైస్తవ సైనికులారా." ఆదివారము రాత్రి కొరకు పోరాటము(పోరాట కేకల కొనసాగింపులో మొదటిది) డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం ఉదయము, జనవరి 15, 2017 "ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని, విశేష శక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింప బడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలేనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను" (యూదా 3). ఈ ఉదయ కాలము యుద్ధ కేకల కొనసాగింపు ప్రారంభిద్దము. వాటిలో "విశ్వాసము నిమిత్తము విశేష ఆసక్తి." మన సంఘులో ఉన్న అనేక అబద్ధపు సిద్ధాంతాలు ఆచరణలను గూర్చి మాట్లాడుకుందాం. 1963 లో అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ చర్చిల్ ను అమెరికాకు మొదటి పౌరునిగా చేసాడు. ఆ గొప్ప పాత యుద్ధ నాయకుని గూర్చి అధ్యక్షుడు ఇలా అన్నాడు, "అతడు ఆంగ్ల భాషను సేకరించి యుద్దములోనికి పంపాడు." IIవ ప్రపంచ యుద్ధ సమయంలో అతని గొప్ప ప్రసంగము చర్చిల్ అన్నాడు, "లోకములో గొప్ప కారణాలు కదులుచూ ఉండగా, మనష్యుల ఆత్మలు శోకింపచేయడం, ఇళ్ళల్లో నుండి వారిని బయటికి లాగడం, వారి సౌకర్యము ఆస్తి తీసేయడం, సంతోషాన్ని కనుగొనడం దారుణమయింది, మనం జంతువులం కాదని నేర్చుకున్నాం, కాల ప్రవాహంలో ఏదో జరుగుతుంది, కాలానికి అతీతంగా, నచ్చినా, నచ్చక పోయినా, బాధ్యత అనేది ఉంటుంది." మనం చాలా యుద్ధాల ద్వారా వెళ్ళాం. మనం అమెరికాలో, నిరీక్షణ, బాప్టిస్టు సంఘాలకు చెదరగొట్టబడ్డాం అబద్ధపు బోధలు జరుగుతున్నాయి. నా యవన భార్య ఆరు నెలల గర్భముతో ఉండి పెన్సిల్ వేనియా, పిట్ల్ బర్గ్ లోని దక్షిణ బాప్టిస్టు సదస్సులో సాహిత్యము ముగించింది. తను చిన్నగా ఉండి గర్భముతో ఉన్నప్పటికినీ, వ్యక్తులు సాహిత్యాన్ని తులనాడి ఆమె ముఖముపై ఉమ్మివేసాడు. మేము గదిలోనికి వెళ్ళాక నా భార్య నేను జవాబు చెప్పలేని ప్రశ్న అడిగింది. ఆమె చెప్పింది, "రోబర్ట్, వీరు ఎలా నిజ క్రైస్తవులు?" వారిలో చాలామంది దక్షిణ బాప్టిస్టులుగా కాక నరకాగ్ని నుండి వచ్చిన దెయ్యాలుగా ఉన్నారు. వారు తనపై ఉక్రోసులయ్యారు ఎందుకంటే ఆమె సెమినరీలో అధ్యాపకులపై వ్యాఖ్యలు చేసింది వారు అన్నారు యేసు శరీరము మృతులలో నుండి లేవలేదు – కాని అడవి కుక్కలచే తిని వేయబడింది, మోషే అనే వ్యక్తి లేరు, పౌలు పత్రికలు తప్పు, అపోస్తలునిచే వ్రాయబడలేదు. కాని మేము సాహిత్యము కొరకు చెల్లించి ప్రతి ఏటా ఉత్తీర్ణు లవుతూ వచ్చాము – చివరకు మేము గెలిచాము ఆ దయ్యము పట్టిన అబద్ధపు ఉపదేషకులను అమెరికాలోని దక్షిణ బాప్టిస్టు సెమినరీలన్ని బాగా తిట్టాయి. దేవుని సహాయంతో, మేము యుద్ధము గెలిచాము! ఇతర గుంపుల వారు డబ్బు సేకరిస్తుండగా (వాళ్ళ జేబుల్లో వేసుకుంటారు) గర్భ స్రావముతో పిల్లలను చంపడం ఆపడానికి – వారు వారి కొరకే డబ్బు వసూలు చేసేవారు, మన సంఘము కొంతమందిని పంపి వాస్తవానికి రెండు ఆసుపత్రులను మూయించింది! ఒక సందర్భంలో నేను డాక్టర్ కాగన్ ఒక ఆసుపత్రి ముందు కూర్చున్నాము – మేమక్కడ ఉండగా గుర్రాలపై వచ్చి మమ్ములను చుట్టుముట్టి బేడీలు చేతులకు తొడిగి చెరసాలకు తీసుకెళ్తామని బెదిరించారు. మేము కదలక పోవడం వారు చూచినప్పుడు, గుర్రాలు వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ, దేవుని సహాయంతో, యుద్ధాన్ని గెలిచాము! యునివర్శల్ పిక్చల్స్ అధిపతి, ల్యూవాసెల్ మేన్, ఒక చెడ్డ సినిమాను తీసినప్పుడు, అందులో క్రీస్తు మనలేని మరియతో లైంగిక క్రియలో పాల్గొన్నట్టు చూపించారు, మేము బెవేర్లీ హిల్స్ లో ఉన్న వాసెర్ మెన్స్ ఇంటికి వెళ్లి నిరసన తెలిపాము. మా నిరసన వార్తాపత్రికలో ప్రపంచమంతటా మొదటి పేజీలో వచ్చింది, ఇంగ్లాండ్, స్పెయిన్, ఇశ్రాయేల్, ప్రాన్స్, గ్రీసులో కూడ నిరసన వచ్చింది! ప్రతి రాత్రి రెండు వారాల పాటు మా నిరసనలు టివి వార్తా చానళ్లలో వచ్చాయి – ప్రతి రాత్రి. యూనివర్శల్ పిక్చర్స్ చాలా భయపడి మా నిరసనలకు మళ్ళీ వారు క్రీస్తును బలిచేస్తూ సినిమాలు తియ్యలేదు! మళ్ళీ, మేము దేవుని సహాయంతో, యుద్ధము గెలిచాము! పీటర్ ఎస్. రుక్మాన్ కింగ్ జేమ్స్ వర్షన్ లోని మాటలు తప్పని బోధించినప్పుడు, అతడు గ్రీకు హెబ్రీ భాషలను సవరించాడు, దాని ద్వారా వందల కొలదీ సంఘాలు చీలిపోయాయి. నేను వ్రాసిన పుస్తకము "రుక్ మేనిజం బహిర్గతము" – సంఘాలన్నిటికీ వెళ్ళింది. ఇప్పుడు అది మృత విషయము, ఆ పుస్తకమును బట్టి, మీరు "www.sermonsfortheworld.com వెబ్ సైట్ లో చదవవచ్చు. మరియు, అవును, రుక్ మేనిజం దయ్యపు సిద్ధాంత వ్యతిరేక పోరాటములో కూడ, దేవుని సహాయముతో, మేము మళ్ళీ గెలిచాము! రిచర్డ్ ఒలీవాస్ అనే వ్యక్తి మమ్ములను విడిచి 400 మందిని మా గుడి నుండి తీసుకెళ్ళిపోయాడు. నేను ప్రజల దశమ భాగమును మించి ప్రతి నెల $16,000 డాలర్లు ఇచ్చేలా ప్రేరేపించి, ఈ భవనాన్ని కాపాడాము, మన సంఘాన్ని నాశనము చేయాలన్న ఓలిమిస్ పథకము ఆగిపోయింది. మళ్ళీ, దేవుని సహాయముతో, మేము యుద్ధము గెలిచాము! కాని ఈరోజు మనం ఇంకా భయంకర యుద్ధములో ఉన్నాము – అంతర్గత యుద్ధము అది చివరకు అన్ని సంఘాలను నాశనము చేస్తుంది. దానికి వ్యతిరేకంగా హెచ్చరించడం క్రీస్తు సేవకునిగా నా భాద్యత. అది మన సంఘాలను నాశనము చేస్తుంది. లవదోసియనిజం యొక్క అబద్దపు సిద్ధాంతము. ఆ తలంపు కారణంగా మన సంఘాలు ఆదివారము సాయంత్రము ఆరాధనలు మూసేస్తున్నారు. అబద్దపు ప్రమాదకర సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం "ఇష్టపూర్వకంగా ఆశించాలి" (యూదా 3). మన శక్తి అంతటితో దాని శక్తి అంతటితో పోరాడాలి. మత్తయి 25:5 లో యేసు మన సంఘాల యొక్క స్థితిని గూర్చి పరిపూర్ణ వివరణ ఇచ్చాడు. లక్షలాది సువర్తికులు ప్రాధమికులు కునికి నిద్రించుచున్నారు. క్రీస్తు రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది, కాని మన సంఘాలు నిద్రిస్తున్నాయి! సంఘాలు సాయంత్రపు ఆరాధనలు మూసేయడం చూస్తున్నాము. అంత్య దినాలకు ఇది ఒక సూచన అని నేను ఒప్పింప బడ్డాను – కునుకుచున్న సంఘాలు వారి ద్వారాలు మూస్తున్నారు – యుగ సమాప్తి కాలములో – మనకు తెలుసు లోకంతము ముగింపునకు వచ్చింది. యేసు చెప్పాడు, "పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు, వారందరూ కునికి నిద్రించిరి" (మత్తయి 25:5). ప్రవచనము మనకు వ్యతిరేఖంగా ఉన్నట్టు అనిపించినా – మనం పోరాడదాం – కొందరు విని రక్షింపబడతారు. ఆదివారము సాయంకాలపు ఆరాధనలు మూసేయడం బాప్టిస్టులలో ఇతరులో నేడు బాగా కనిపిస్తుంది. దక్షిణ బాప్టిస్టులు స్వతంత్ర బాప్టిస్టులు, "ప్రోగ్రెసివ్" బిబిఎఫ్ఐ (BBFI) సంఘాలు, బాబ్ జోన్స్ ప్రాధమిక సంఘాలు, ఆదివారము ఉదయం ఆరాధన తరువాత తలుపులు మూసేస్తున్నాయి – అమెరికాలో అన్ని మూలలా. ఆదివారము సాయంకాలపు ఆరాధన గతానికి సంబందించిన దయిపోయింది. ఇది మన సంఘాల రోగ స్థితిని చూపిస్తుంది. ఇది తప్పక మంచి సూచన కాదు. దీర్ఘకాలపు రోగాల వలే, రోగము నిర్ధారణ కాకుండా వైద్యుడు మందు ఇవ్వలేదు. ఈ ప్రసంగంలో, వైద్యుని వలే, మనం రోగిని పరీక్షిద్దాం (సాయంత్రము ఆరాధనలు మూసే సంఘాలు) కారణం గుర్తెరగాలి – మార్గము చెప్పాలి – మందు మరియు నయం చేయడం. ఈ సంఘాల రోగము నాలుగు విధాలుగా గుర్తింపబడుతుంది. I.I. మొదటిది, ఆదివారం రాత్రి ఆరాధన మన సంఘాలలో మూసివేయబడడం ఈ మధ్యకాలం సాధారణ ప్రొటె స్టెంట్ పద్ధతిలో జరిగింది. మెథడిష్టులు 1910 ప్రాంతములో ఆదివారం సాయంకాలపు ఆరాధనలు మూసేయడం ప్రారంభించారు. 1925 ప్రాంతములో ప్రెస్బిటేరియన్లు ఆదివారము రాత్రి ఆరాధనలు మూసేయడం ప్రారంభించారు. అమెరికన్ బాప్టిస్టులు (మునుపు ఉత్తర బాప్టిస్టులు) 1945 ప్రాంతములో తమ సాయంకాలపు ఆరాధనలు మూయడం ప్రారంభించారు. 1985 నుండి దక్షిణ బాప్టిస్టులు ఇది చేశారు. మనం గుర్తుంచుకోవాలి మెథడిష్టులు, ప్రెస్బిటేరియన్లు మరియు అమెరికన్ బాప్టిస్టులు ప్రాథమిక బాప్టిస్టు సంఘము వలే బైబిలు నమ్మేవారు ఎప్పుడు ఈ ఒరవడి "ప్రోగ్రెసివ్" బోధకుల మధ్య ప్రారంభమయింది. మెథడిష్టులు, ప్రెస్బిటేరియన్లు మరియు అమెరికన్ బాప్టిస్టులను చూడండి! వారి సభ్యత్వ సంఖ్య ప్రతి సంవత్సరము పడిపోతుంది. ఈ మూడు తెగలు 1900 నుండి వేలమంది సభ్యులను కోల్పోయాయి. వేలకొలది సంఘాలు మూసివేయబడ్డాయి. ఆదివారము సాయంకాలం ఆరాధన ఆపడం వారికి సహాయ పడలేదు. అది పతనానికి అంచులో ఉంది. అయినను చాలామంది స్వతంత్ర బాప్టిస్టులు అనుకుంటున్నారు వారు నూతన ప్రగతి పదపు ఆలోచనలో ఉన్నారని "అనుకోని" ఆ మార్గమును వెంబడించిన మెథడిష్టులు, ప్రెస్బిటేరియన్లు మరియు అమెరికన్ బాప్టిస్టులు నాశనమయ్యారు. ఒక స్వతంత్ర బాప్టిస్టు బోధకుడు జిమ్ బెయిజ్, సాన్ డిగో, కాలిఫోర్నియా అన్నాడు, "నేను విప్లవాత్మక మెట్టు చేపట్టాను! నేను ఆదివారం సాయంకాలపు ఆరాధన మూసేశాను!" అది తన సంఘానికి సహాయ పడుతుందనుకున్నాడు, కానీ నేననుకుంటాను అది తన సంఘానికి హాని చేస్తుంది. అలాంటి బోధకుని అనెను – క్రీస్తును అప్పగించేవాడు అని అంటాను! "పెద్ద" సంఘాలలో జరిగేది వీరు చేస్తున్నారు. దక్షిణ బాప్టిస్టులు ప్రతి ఏటా 200,000 మందిని కోల్పోతున్నారు. దానికి ఒక కారణమూ వారి చాలా సంఘాలు ఆదివారము రాత్రి మూతపడుతున్నాయి. విన్ స్టన్ చర్చిల్ ఒకప్పుడు చెప్పాడు, "చరిత్ర చదవండి! చరిత్ర చదవండి!" అతనన్నాడు, "ఎంత వెనుకకు చూస్తే, అంత ముందుకు చూస్తావు." అందుకే తెలుసుకోవడం ప్రాముఖ్యం "పెద్ద" ప్రొటెస్టెంట్ బాప్టిస్టు సంఘాలు ఆదివారం రాత్రి ఆరాధనలు మూసేస్తే ఏమి జరిగిందో. తెలుసుకోవడం ప్రాముఖ్యం ఇది ఎలా వారి నిర్వీర్యానికి, అనైక్యతకు, వారి మరణానికి ఎలా దారి తీసిందో. ఈనాడు, సాంప్రదాయ "పెద్ద" సంఘాలు గతంతో పోలిస్తే చిన్నగా ఉన్నాయి. వారి ప్రార్ధనా కూటాలు ఆపేసారు. సాయంకాలపు ఆరాధనలు ఆపేసారు. పరిశుద్ధాత్మను విడిచి పెడుతున్నారు! అదే మార్గములో వెళ్తే బాప్టిస్టులకు ఇతరులకు కూడ ఇది తప్పదు. II. రెండవది, మన సంఘాలలో ఆదివారం రాత్రి ఆరాధనలు మూసేయడం "నిర్ణయత్వము" ఫలితము. మా పుస్తకంలో చెప్పినట్టు, నేటి అపొస్తలులతో, చార్లెస్ జి.ఫిన్నీ 19 వ శతాబ్దపు మధ్యలో "నిర్ణయత్వము" ను గొప్ప ప్రొటెస్టెంట్ మరియు బాప్టిస్టు సంఘాలలో ప్రచురము చేసాడు. ఫిన్నీ "నిర్ణయత్వము" బైబిలు మార్పిడిని మార్చేసింది అది మానవ ఆత్మలో దేవుని కార్యము మానవుడు ఒక "క్రీస్తు కొరకు నిర్ణయము" ద్వారా మారతాడు. చిన్న ప్రార్ధన లేక శారీరక స్పందన పాతకాలపు విప్లవాత్మక బైబిలు మార్పిడి స్థానాన్ని తీసుకొంది. ప్రతిఫలంగా, ప్రొటెస్టెంట్ మరియు బాప్టిస్టు సంఘాలు సభ్యత్వము ద్వారా గదులను లక్షలాది మందితో నింపేసాయి. మారని వారు ఆదివారము రెండుసార్లు గుడికి రావడ ఇష్ట పడరు – కనుక ఆదివారం రాత్రి ఆరాధన అదృశ్యమైనది ఫిన్నీ పద్దతి అవలంబించాక. మారని వారు ఆదివారం రాత్రి రారు! ఇదే ఇప్పుడు "ప్రత్యేకింప బడిన" సంఘాలలో అమెరికాలో పునరావృతమవుతుంది. యవ్వనస్థునిగా నేను హాజరయిన ఏ సంఘములో కూడ ప్రతిఒక్కరు ఆదివారం రాత్రి వచ్చేవారు కాదు. సమర్పణ లేనివారు, నిజమార్పు లేనివారు, అక్కడకు రారు. మేము కొనసాగాము. నా యవ్వన దశలో ఆదివారం సాయంకాలపు ఆరాధనలు శ్రేష్టమైనవి. పాటలు బాగుండేవి. ప్రసంగాలు బలంగా ఉండేవి. ఎందుకంటే నశించిన సభ్యులు ఆత్మను లాగడానికి ఉండేవారు కాదు. గత అరవై సంవత్సరాలు వెనుకకు చూస్తే, అది నేను గమనిస్తున్నాను. మన సంఘములో కూడ, ప్రతిఒక్కరు ఆదివారం రాత్రి వస్తారు. వారు అలా తర్ఫీదు పొందారు. నేను నమ్ముతాను ఇది ఒక వ్యక్తి సంఘ సభ్యుడు అవకముందు యదార్ధ మార్పు పొందినట్టు నిర్ధారించుకోవడమే కారణము. ఒక వ్యక్తి నిజంగా మారే వరకు ఉంటాను నశించువానికి బాప్తిస్మ మివ్వకుండా, ఆదివారము రాత్రి రాని వానికి! "నిర్ణయత్వము" నశించు వారిని గుడిలో నింపుతుంది – ఇప్పుడు వెల చెల్లిస్తున్నాం. వారు రక్షింపబడలేదు కనుక ఆదివారం రాత్రి రారు! అందుకే గత రెండేళ్లలో దక్షిణ బాప్టిస్టులు సుమారు ఐదు లక్షల మందిని కోల్పయారు! III. మూడవది, ఆదివారం రాత్రి ఆరాధనలు మూసివేయడం చాలా ఊహించని ఫలితాలు తీసుకొస్తున్నాయి. నేను చెప్పేవాటికంటే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఇది నా మదిలోకి వచ్చినవి. 1. ఆదివారము రాత్రి ఆరాధనలు మూసేవారు ప్రజలు ఇతర సంఘాలు దర్శించడానికి ద్వారాలు తెరుస్తున్నారు. ఒక బోధకుడు ఈ మధ్య ఆదివారం రాత్రి ఆరాధన మూసిన వ్యక్తి అన్నాడు, "నేను వేరే సంఘాలకు వెళ్ళడానికి వీలయింది." అతననుకున్నాడు వేరే బోధకుల ప్రసంగాలు ఆదివారం సాయంత్రము వినే అద్భుత అవకాశం వచ్చిందని. నేననుకున్నాను, "అతని ప్రజల సంగతేంటి? కొందరికి ఎలాంటి తలంపు ఉండదా?" వారికి ఏమి జరుగుతుంది? గుర్తుంచుకోండి, శ్రేష్ఠులు ఆదివారం రాత్రి వెళ్ళ ఇష్ట పడతారు. కాని ఎక్కడికి వెళ్తారు? వారు క్రింది వీధిలోని బోధకుని వద్దకు వెళతారా? వారు కొత్త సువార్త బోధకుని "తెలివైన" ప్రసంగము విని తప్పిపోతారా, అతని సంఘము ఎక్కడో మూల ఉంటుంది? కొంతమంది అలా చేస్తారు – శ్రేష్ఠులను కోల్పోతాం ఆదివారం రాత్రి ఆరాధన చేస్తే. 2. ఆదివారము రాత్రి ఆరాధనలు మూసే సంఘాలు బలహీనులు గొప్ప సువార్తిక అవకాశాలు కోల్పోయేటట్టు చేస్తాయి. ఒక బోధకుడు ఆదివారం రాత్రి ఆరాధన మూసేసిన వ్యక్తి అన్నాడు. ఆరాధన తరువాత, తినడానికి ఇచ్చి వెంటనే ఇంకొక ఆరాధనకు ఆవరణానికి తీసుకెళ్తారు. అందుకు ప్రజలు మధ్యాహ్నం 2:00 గంటలకు ఇళ్లకు వెళ్తారు. "ఎక్కువ బైబిలు పొందుకుంటారు," అని బోధకుడు చెప్పాడు. ఆదివారం రాత్రి ఆరాధన ఉద్దేశము "మరి ఎక్కువ బైబిలు ఇవ్వడం"? కాదు, అది కాదు! చాలా సంవత్సరాలు ఆదివారం రాత్రి ఆరాధనలు సువార్త కూటముగా ఉండేవి. నేను నమ్ముతాను గతములో బాప్టిస్టు సంఘాలలో ఇది ఒక గొప్ప బలమైన విషయము. ఆదివారం రాత్రి ప్రజలు నశించు బంధువులను, స్నేహితులను, సువార్త వినడానికి తీసుకు రావడానికి ప్రోత్సహింపబడతారు. మంచి ప్రజలకు ఆదివారము మధ్యాహ్నము "చుట్టుముట్టి" నశించు వారిని సాయంకాలపు ఆరాధనకు తీసుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదయ కాలపు ఆరాధన ముగిశాక భోజనము పెట్టవచ్చు, తరువాత ఎక్కువ బైబిలు పఠనము జరిగించవచ్చు, కానీ అది సువార్తీకారణను నాశనము చేసి బాప్టిస్టు సంఘాలు బలంగా కట్టబడడానికి వీలు లేకుండా చేస్తాయి! ఒక కాపరి స్నేహితుడు నాతో చెప్పాడు బలవంతులైన సంఘ సభ్యులు కూడ "రావడం మానేశారు" ఆదివారం రాత్రి ఆరాధనలు మూసి వేయడం వలన. అతని వలే ఎంతమంది ఇలాంటి గొప్ప సువార్తీకారణ అవకాశాన్ని కోల్పోతారు ఆదివారము రాత్రి ఆరాధనలు జరగకుండా మూసివేస్తే? 3. ఆదివారం సాయంకాలపు ఆరాధనలు మూసివేసే సంఘాలు అద్భుతమైన అవకాశం కోల్పోతాయి యవ్వనస్థులను చేరుకొని శిష్యత్వము జరిగించడం. యవ్వనస్థులు రాత్రులు బయటికి వెళ్లాలనుకుంటారు. గుర్తుంచుకోండి, ఆదివారం రాత్రి ఆరాధనలు మూసేయడం ముసలి వారికి మాత్రమే మంచిగా ఉంటుంది, వారు ఇంటిలో ఉండి, టివి చూచి, త్వరగా పడుకోవాలనుకుంటారు. వివాహితులు ముసలి వారు ఆదివారం రాత్రి ఆరాధనలు ఇష్ట పడరు. కానీ యవ్వనస్థులకు ఏమి చెయ్యాలో తోచదు. స్థానిక సంఘము "రెండవ ఇల్లులా" యుక్త వయస్కులకు యవ్వనస్థులకు ఉండాలని నేను నమ్ముతాను. మన సంఘ భవిష్యత్తు వారిలో ఉందని నేను నమ్ముతాను. ముసలి వారు త్వరగా ఇంటికి వెళ్లాలనుకుంటారు. కాని సంఘభవిష్యత్తు మొత్తం యువకుల చేతులలో ఉంటుంది. యవ్వనస్థులును మనసులో పెట్టుకొని తగినట్టుగా ఆదివారపు రాత్రి ఆరాధన నిర్మాణింపబడాలని నేను నమ్ముతాను. మనము వారి ఆసక్తిని చూరగొనవచ్చు, క్రీస్తు కొరకు సంపాదింపవచ్చు, స్థానిక సంఘములో ఆరాధన కొరకు తయారు చెయ్యవచ్చు, ఆదివారము రాత్రి యవ్వనస్థులకు ఉద్దేశించే ఆరాధనలు గుడిలో జరగడం ద్వారా. ఇంకొక వైపు, మనం ఆదివారం రాత్రి ఆరాధన మూసివేస్తే, మన సంఘాలలో కేవలం నీలం రంగు జుట్టు ఉన్న వృద్ధ స్త్రీలు మాత్రమే మిగులుతారు, సుమారుగా సంఘ ఛేదనమంతా ఖాళీగా ఉంటుంది ఆదివారం ఉదయం – మూలలో ఉన్న మెథడిష్టు సంఘము వలే – ఆ సంఘము యాభై లేక అరవై సంవత్సరాల క్రితమే ఆదివారపు రాత్రి ఆరాధనలు వదిలి పెట్టేసింది. నేను నమ్ముతాను సంఘాలు ఏదైతే సాయంకాలపు ఆరాధనలు విడిచిపెడతాయో కొన్ని సంవత్సరాల తరువాత ఇదో పరిస్థితి నెలకొని ఉంటుంది ఇక మీదట మనము ప్రతి ఆదివారం రాత్రి యవ్వనస్థులకు బోధించడంపై ద్రుష్టి సారించకపొతే! IV. నాల్గవది, ఆదివారం రాత్రి ఆరాధన మూసేయడం మనం నిజమైన ఉజ్జీవము పొందుకోకుండా ఆపేస్తుంది. నేను దీని మీద చెప్పగలను, నేను ఎంతగానో చదివాను ఉజ్జీవముల చరిత్రను గూర్చి నేను తెలుసుకున్నాను ఉజ్జీవాలు రాత్రులు వస్తుంటాయి. వాస్తవానికి దేవుడు సాధారణంగా ఆదివారం రాత్రి ఉజ్జీవాలు పంపిస్తూ ఉంటాడు! డాక్టర్ ఏ. డబ్ల్యు. టోజర్ ఒక ప్రసంగము వ్రాయసాడు దాని పేరు "అర్ధరాత్రి తరువాత జననము." దానిలో ఆయన అన్నాడు: ఉజ్జీవాలు అర్ధరాత్రి తరువాత పుడతానడంలో గొప్ప సత్యము ఉంది, ఉజ్జీవాలు... ఉజ్జీవాలు ఎంతో తృష్ణగా కావాలనుకునే వారికి వస్తాయి... ఒక ఆత్మ అరుదుగా ఒక అసాధారణమైన [ఉజ్జీవపు] అనుభవము పొందుకోవడం అర్ధరాత్రి తరువాత సంభవిస్తుంది (A. W. Tozer, “Born After Midnight,” in The Best of A. W. Tozer, compiled by Warren W. Wiersbe, Baker, 1978, pp. 37-39). దయచేసి పరిహాసము చేయకండి సాయంకాలము ఆరాధనలు అర్ధరాత్రి వరకు కొనసాగాలి అనినందుకు. అయినను, రెండు బాప్టిస్టు సంఘాలలో శాస్త్రీయ ఉజ్జీవాలు వాడడం, వందల మంది మారడం చూడడం అనే అరుదైన అనుభవము నేను పొందుకున్నాను. ఆ రెండు కూడ సాయంకాలపు ఆరాధనలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఒక సంఘము వేలమందిని మూడు సంవత్సరాలలో దేవుడు పంపిన ఉజ్జీవము ద్వారా జమ చేసాడు దేవుడు. చాలా కూటాలు రాత్రి చాలా ఆలస్యంగా జరిగాయి. ఇంకొక సంఘము మూడు నెలలలో ఐదు వందల మందిని జమ చేసింది. దేవుడు పంపిన ఈ రెండవ ఉజ్జీవము ఆదివారము సాయంకాలపు ఆరాధనలో ప్రారంభమయింది. మొదటి సంఘము ఆదివారపు సాయంకాలము ఆరాధనలు వారపు రాత్రి ఆరాధనలు కలిగి యున్నది. పరలోకము పంపిన ఉజ్జీవాన్ని అది అనుభవించింది! ఒకవేళ ఈ రెండు బాప్టిస్టు సంఘాలు సాయంకాలపు ఆరాధనలు మూసేసి ఉంటే అలాంటి ఉజ్జీవపు ఆశీర్వాదాలు పొందుకునేనా? కాదు, పొందుకోలేవు! డాక్టర్ టోజర్ అన్నాడు, ఉజ్జీవము "తప్పక కావాలి అనుకునే వారికి" మాత్రమే వస్తుంది. మనకు తప్పకుండా ఉజ్జీవము కావాలనుకుంటే, మనము దేవుడు నిజ ఉజ్జీవము పంపే ఆరాధన మూసివేయము. మన సంఘములో గత సంవత్సరము ప్రసిద్ధ ఉజ్జీవము పంపాడు. కొన్ని రాత్రులలో ఇరవై తొమ్మిది మంది యవ్వనస్థులు రక్షింపబడ్డారు – వారు నిజంగా రక్షింపబడ్డారు కాబట్టి మన సంఘములో ఉన్నారు. ఆ కూటాలన్నీ రాత్రే జరిగాయి. ఇంకా మారని ఇక్కడ ఉన్న వారితో సంక్షిప్తంగా మాట్లాడతాను. రక్షింపబడాలని మీరు ఆతృత కలిగియున్నారా? మీ పాపమును బట్టి ఒప్పుకోలు పొందుకున్నారా? పాపము నుండి నరకము నుండి యేసు మిమ్మును రక్షించారా? అలాగైతే ఈ రాత్రి మీరు తిరిగి రావాలని బతిమాలు చున్నాను. జాన్ కాగన్ బోధిస్తారు "నశించు ఆత్మల కొరకు పోరాటం." ఆ ప్రసంగము మీకు సవాలు విసురుతుంది – ఆ ప్రసంగము మీరు యేసును కనుగొని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా రక్షింపబడేలా చేస్తుంది! జాన్ యొక్క శక్తివంత ప్రసంగము ఈ రాత్రి వినడానికి తప్పకుండా రండి! కానీ ఇప్పుడు రక్షింపబడకుండా ఎందుకు ఇంటికి వెళ్లడం? మీ పాపము నుండి మరలి యేసును నమ్మండి! ఇప్పుడే యేసు మీ పాపమును కడిగి రక్షిస్తాడు మీరు ఆయనను నమ్మి ఆయననే నమ్మితే! దయచేసి లేచి నిలబడి 7 వ పాట పాడండి, "రక్తము మాత్రమే." మనం పాడుచుండగా, మీరు ముందుకు వచ్చి ప్రార్ధనలో మోకాళ్ళు నాలని కోరుచున్నాను. డాక్టర్ కాగన్, జాన్ కాగన్ మరియు నేను మీకు ఉపదేశిస్తాము మీతో పాటు ప్రార్దిస్తుంటాము దేవుడు మిమ్మును యేసు నొద్దకు చేర్చునట్లు. యేసు మాత్రమే మీ పాపము నుండి రక్షింపగలడు సిలువపై ఆయన కార్చిన రక్తము ద్వారా. మేము పాడుచుండగా మీరు రండి. దయచేసి నిలబడి 7 వ సంఖ్య పాట పాడండి. అది "రక్తము మాత్రమే" మీ పాటల కాగితంలో 7 వ పాట. నా పాపమును ఏది కడుగగలదు? యేసు రక్తము మాత్రమే; ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పఠనము ఏబెల్ ప్రుదొమ్ గారు: యూదా 1-4. |
ద అవుట్ లైన్ ఆఫ్ ఆదివారము రాత్రి కొరకు పోరాటము! (పోరాట కేకల కొనసాగింపులో మొదటిది) డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని, విశేష శక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలేనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను" (యూదా 3). (మత్తయి 25:5) I. మొదటిది, ఆదివారం రాత్రి ఆరాధన మన సంఘాలలో మూసివేయబడడం ఈ మధ్యకాలం సాధారణ ప్రొటె స్టెంట్ పద్ధతిలో జరిగింది. II. రెండవది, మన సంఘాలలో ఆదివారం రాత్రి ఆరాధనలు మూసేయడం "నిర్ణయత్వము" ఫలితము. III. మూడవది, ఆదివారం రాత్రి ఆరాధనలు మూసివేయడం చాలా ఊహించని ఫలితాలు తీసుకొస్తున్నాయి. IV. నాల్గవది, ఆదివారం రాత్రి ఆరాధన మూసేయడం మనం నిజమైన ఉజ్జీవము పొందుకోకుండా ఆపేస్తుంది. |