ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మన యుద్ధోపకరణములుTHE WEAPONS OF OUR WARFARE డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కొరింధీయులకు 10:4). |
నా స్నేహితులారా, మనము యుద్ధములో ఉన్నాము. లోకము మాట్లాడే యుద్ధములాంటిది కాదు. ముస్లీము తీవ్రవాదులతో యుద్దము కాదు. దేశాల మధ్య యుద్దము కాదు. ఇది వేరే రకమైన యుద్ధము. వేరే వాటన్నిటి కన్నా గొప్పది. తుపాకులతోను బాంబులతోను ఈ యుద్ధాన్ని జయించలేము. ఈ ఆయుధాలతో మన ముత్తాతలు హిట్లర్ పై యుద్ధము చేసారు. వారు IIవ ప్రపంచ యుద్ధము జయించారు, చర్చిల్ ఇలా అన్నాడు, "రక్తము, శ్రమ, చెమట మరియు కన్నీరు." ప్రతి కూల పరిస్థితులలో వారు గెలిచారు. హిట్లర్ సైన్యము ఇంగ్లాండ్ అమెరికా శక్తుల కలయికతో పోలిస్తే చాలా గొప్పది. హిట్లర్ గెలిచి ఉంటే, మన జీవిత విధానాన్ని విచ్చిన్నము చేసి ఉండేవాడు. పాశ్చాత్య ప్రపంచ చరిత్రను అంతమొందించే వాడు. మనం ఇప్పుడు పతన నాశనకర జీవితాన్ని జీవించే వారము – చెత్త కుండీ వలే. దేవునికి వందనాలు చర్చిల్, రూస్ వెల్ట్, సైనిక సమూహాలు వారిని వెంబడించి, వారి ఆధిపత్యాన్ని పతనము చేసి, అడోల్ఫ్ హిట్లర్ యుద్ధ యంత్రాన్ని నాశన మొందించారు. నాకు ఆ యుద్ధాన్ని గూర్చి కొంత గుర్తు ఉంది. నా పసి మనసుపై, భయపు ముద్ర వేసింది. మన పాఠ్యభాగము ఇంకొక రకమైన యుద్ధాన్ని గూర్చి చెప్తుంది. అది శరీరమాంసాలకు వ్యతిరేకంగా ఉండదు. కాని చాలామంది ఊహించే దాని కన్నా గొప్ప శక్తి, అది సాతాను వాని దయ్యపు శక్తులకు, వ్యతిరేకంగా యుద్ధము. ఇది సాతాను దెయ్యాల శక్తికి వ్యతిరేకంగా ఒక యుద్ధం ఉంది. అపోస్తలుడైన పౌలు దానిని తేట తెల్లము చేస్తున్నాడు. అతనన్నాడు, "మనము శరీరములో నడుచుచున్నప్పటికినీ, శరీరముతో యుద్ధము చేయము" – "శరీరానుసారముగా ఈ యుద్ధము జరిగించుము" (II కోరిందీయులకు 10:3). మనము మనష్యులము. మానవ వనరులతో ఈ శత్రువును జయించము. రాజకీయ నాయకుడు, ప్రధాన అధికారి – డోనాల్డ్ ట్రంపు, రక్త మాంసాలు గల వ్యక్తి ఈ దుష్ట యుద్ధాన్ని జయించలేడు. "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కొరింధీయులకు 10:4). I. మొదటిది, మనము యుద్ధములో ఉన్నామని మనము గుర్తించాలి. సగటు వ్యక్తి యుద్ధము జరుగుతుందని కూడ గ్రహించడు. సెల్ ఫోన్ తో చిన్న పిల్లవానిలా ఆడుతుంటాడు. మత్తు పదార్ధము సేవిస్తూ అది చేస్తే చెడును గూర్చి ఆలోచించడు. అతడు వ్యభిచారినులతో, విపరీతపు పురుషులతో లైంగిక క్రియలు జరిగిస్తాడు. అతనికి, డాక్టర్ టోజర్ చెప్పినట్టు, "లోకము యుద్ధ భూమిగా కాకుండా ఆట స్థలముగా ఉంటుంది." మన సంఘాలు కూడ చాలా రకాల ఆటలు ఆడుతున్నాము. మన గుడ్డి భోధకులు ఆదివారపు సాయంకాలపు ఆరాధనలు మాసేస్తున్నారు. యవనస్తులను గూర్చి ఆలోచించరు, వారు ఆదివారము రాత్రులు పాపపు అందకారములోనికి వెళ్ళిపోతున్నారు. ఈ తల చచ్చిన బోధకులకు తేడా ఉండదు. ఆదివారము ఉదయము డబ్బు దండుకుంటారు – కనుక సాయంకాలము టెలివిజన్ చూడడానికి, తలుపులు మూసుకొని వారు, బానిసలైన అశ్లీల చిత్రాలు చూడడానికి సమయం ఉంటుంది. ఒకప్పుడు గొప్పదైన మూడీ బైబిలు సంస్థ ఇప్పుడు వారి సిబ్బంది తాగుడు మత్తు పదార్దాలు తీసుకోవడానికి అనుమతి ఇస్తుంది. బయోలా విశ్వ విద్యాలయము గత సంవత్సరం అలాంటి నిర్ణయమే తీసుకుంది (Don Boys, Ph.D., December 26, 2016). నేను స్థాపించిన సంఘములో ఒక సంఘ కాపరి కుమారుని వివాహము సంఘములో బీరు వైన్ తాగుతూ జనాలు నాట్యమాడడం చూసి నేను నా భార్య నివ్వెరపోయాము. "బీరు, బైబిలు మరియు సహోదరత్వము" వారు ఆక్స్ ఫర్డ్, కనేక్టివ్ గుడిలో రిక్ వారెన్ పుస్తకము చదవడానికి కూడుకుంటారు. అలాంటి సంఘటనలు అమెరికా అంతటిలో సంఘాలలో జరుగుతున్నాయి (బాయ్స్, ఐబిఐడి.). భయంకర సంగీతము ఆదివారపు ఉదయము గంటపాటు చాలా సంఘాలలో వినిపిస్తారు – తరువాత పదిహేను నిమిషాల నిస్సార వచనము వెంబడి వచనము "పఠనము" ఉంటుంది దానిలో సువార్త ఉండదు క్రీస్తును సంభోదించరు, సువార్త ద్వారా నశించు వారు తేబడరు, నశించు పాపి ఎలా రక్షింపబడాలో చెప్పరు! అవును, గొప్ప యుద్ధము జరుగుతుంది ఈ ప్రజలు పూర్తిగా గుడ్డివారై పోతున్నారు, వారు ఆటలాడుకుంటూ నిజ క్రైస్తవులను కుంటూ ఉన్నారు. వారు ప్రార్ధనా కూటాలకు వెళ్ళరు. సువార్త వినడానికి నశించు ఆత్మలను తీసుకొని రారు. "వారి నుండి బయటకు రండి." అలాంటి సంఘములో చేరవద్దు. అలా చేరి ఉంటే పారిపోండి, తీర్పుదినాన, సోదోము నుండి లోతు పారిపోయినట్టు. నేను ముసలివాడను. ఒకరోజు నేనిక్కడ ఉండను. అలాంటి పిచ్చిలో పడకూడదని మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాను. ఈ లోకపు మూర్ఖత్వములోనికి వెళ్ళవద్దు. ఎన్నడు వద్దు! వద్దు! వద్దు! ఎన్నడు వద్దు. పాత ఉజ్జీవపు పాటలు విడువవద్దు. గ్రిఫిత్ గారు పాడిన పాత గొప్ప పాటను విడిచిపెట్టవద్దు! మీ పాటల కాగితంలో 10 వ సంఖ్య. అది "సాగండి, క్రైస్తవ సైనికులారా." నిలబడి గట్టిగా – తేటగా పాడండి! సాగండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి సాగండి, కూర్చోండి. "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కొరింధీయులకు 10:4). మన యుద్దోపకరణములు శరీర సంబంధమైనవి కావు, మానవ అస్త్రాలు కావు. అవి అసాధారణ అస్త్రాలు. అవి అసాధారణమైనవిగా ఉండాలి ఎందుకంటే మనం అసాధారణ శక్తులతో పోరాడుతున్నాము. సాతాను అతని శక్తులతో పోరాడుతున్నాము. మనము "దెయ్యపు కుతంత్రాలతో పోరాడుతున్నాము" (ఎఫెస్సీయులకు 6:11). క్రైస్తవులమైన మనము దెయ్యపు పన్నాగాలతో పోరాడుతున్నాము. అబద్దపు తలంపులకు వక్ర ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము. మారని వారి మనసులో దెయ్యము పెట్టిన తలంపులు. బైబిలు చెప్తుంది, "మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ఆకాశ మండల మందున్న...దురాత్మల సమూహముతో..." (ఎఫెస్సీయులకు 6:12 ఎన్ఐవి). దయ్యము, వాని అనుచరులతో మనం పోరాడాలి. నశించు ఆత్మను గుడికి తేవడం ద్వారా దయ్యలతో పోరాడాలి. యుద్ధము జరగకుండా వాడు ఎవరినీ వదలడు. మీరు రక్షింపబడకపోతే ఇప్పుడు మీ మనసులో దెయ్యాలు పని చేస్తున్నాయన్న మాట! ఈ కూటములో ఇప్పుడే, సాతాను పని చేస్తుంది. ఇప్పుడే దయ్యాలు తన కుతంత్రాలను నీ మనసులో పెడుతుంది, నేను మాట్లాడుతుండగా. సాతాను "అవిధేయులైన వారి మనసులో పనిచేస్తుంది" (ఎఫెస్సీయులకు 2:2 ఎన్ఐవి). బైబిలు చెప్తుంది దయ్యములు "ఇప్పుడే పనిచేస్తుంది" నీ మనసులో హృదయంలో. రక్షింపబడక మునుపు జూలీ అనే అమ్మాయి ఏమి చెప్పిందో వినండి. "డాక్టర్ హైమర్స్ నాతో చెప్పారు నేను నశించానని విచారణ గదికి వెళ్లాలని. ఆ సమయంలో గుడికి రావడం భయము." సాతాను తన మనసుతో హృదయముతో మాట్లాడుతుంది. మీలో కొందరు ఇప్పుడే సాతాను ద్వారా మోస పరచబడుతున్నారు. మీరు నశించారు అని నేనంటాను, మీరు వినరు. మీరు నశించారు అంటే మీకు వినబుద్ధి కాదు, ఎందుకంటే మీరు సాతాను దెయ్యము, తలంపులు వింటున్నారు కాబట్టి. జూలీ చెప్పంది, "నేను మంచి దాననకునున్నాడు, నా జీవితంలో అదే కావాలి." జీవితమంతా గుడిలోనే ఉంది, అది మంచిదికాదా? డాక్టర్ హైమర్స్ ఎందుకు చెప్తున్నారు? నేను నశించానని. "నేను మంచి వ్యక్తిని ఇతర పిల్లలు చేసే పనులు నేను చెయ్యడం లేదు అనే గర్వము నాలో ఉంది...నేను గర్వమును కలిగి యున్నాను అది తప్ప కాదనుకున్నాను." దెయ్యము అలా తన హృదయములో పని చేసింది. నీవు కూడ అలానే అనుకుంటున్నావా? నీవు మంచివాడను కుంటున్నావా? బైబిలు చెప్తుంది సాతాను "అవిధేయులైన పిల్లలలో ఇప్పుడు పని చేస్తుంది." సాతాను నీలో ఇప్పుడు పనిచేస్తుంది! నీ మనసులో నీ హృదయంలో! జూలీ చెప్పింది, "నేను చాలా మంచిదానను. ఇంకేమి కావాలి?... ప్రతి ప్రసంగము ముందు ఆతృతగా ఉంటాను. వారములో ప్రతిరోజు అసౌకర్యముగా ఉంటాను." సాతాను తనలో పనిచేస్తుంది, తను మంచిదని చెప్తుంది. రక్షింపబడనవసరము లేదని చెప్తుంది. తను మంచి వ్యక్తి అని. ఇతరులు తనకంటే పాపులని. వారికి రక్షణ అవసరమని. కాని తనకు కాదు! తను ఇప్పటికే మంచి వ్యక్తి. అది సాతాను నుండి వచ్చినది. సాతాను గుప్పెటలో ఉంది. సాతానుకు బానిస. సాతానుకు బందీ అయింది, ఎందుకంటే వాని అబద్దము నమ్మింది తను మంచిదని అనుకుంది, ఇతరులు క్రీస్తు రక్తములో కడగబడాలనుకుంది. కాని తను కాదు. తరువాత, ప్రతి ఆదివారము గుడికి వచ్చేది. తరువాత, బైబిలు చదివి ప్రార్ధించేది. "వారికి ఇంకేమి కావాలి?" తను నశించిపోతుందని నేను చెప్పడం తనకు ఇష్టం లేదు. యేసు రక్తములో కడగబడకుండా నశించిపోవడం. కాని కాదనలేని దేవుని కృప చేత మళ్ళీ మళ్ళీ మన సంఘానికి రప్పింప బడింది. సువార్త వినడానికి రప్పింప బడింది దేవుని కాదనలేని కృప చేత రక్షింప బడడానికి ఆయనచే ఎన్నుకొన బడిన వారు. ఎందుకు ఆమె మరల వచ్చింది? తను తీసుకొచ్చిన స్నేహితురాలు కలవరపడింది విచారణ గదికి వెళ్ళమని చెప్పినందుకు తన మళ్ళీ రాలేరు. అమ్మాయి సాతాను మాటవిని తన పాత గుడికి వెళ్ళిపోయింది, అక్కడ తను నశించినదని ఎవ్వరు చెప్పలేదు. ఇంకొక అమ్మాయి సాతాను మాటవిని ఈ గుడి నుండి పారిపోయింది ఎందుకంటే పాపమును గూర్చి నేను బోధించడం తనకు ఇష్టము లేదు. జూలీ తండ్రి నాతో చెప్పారు ఆ అమ్మాయి పాపము ఏంటో. అది చెడ్డ పాపము అది వదిలి పెట్టడం తనకు ఇష్టము లేదు. సత్యము నుండి పారిపోయి ఎన్నడు రక్షింపబడలేదు – ఎందుకంటే ఆమె తన బానిస యజమాని దెయ్యము మాట వినింది, కాబట్టి. అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. సాతాను బంధకాల్లో ఉన్నారు. మీ పాపాన్ని ప్రేమిస్తారు. అశ్లీల చిత్రాలు ప్రేమిస్తారు. చెడును ప్రేమిస్తారు. లోపల ఎలా ఉంటారో దాన్ని ప్రేమిస్తారు. గ్రహించకుండానే, సాతానుకు బానిసలు అయిపోతారు! కాని అతి చెడ్డ పాపము యేసును తిరస్కరించుట. ఆయన నిన్ను రక్షించాలనుకుంటున్నారు ఆయన రక్తములో నీ పాపములు కడగ బడాలనుకుంటున్నారు. కాని యేసు తలంపులన్ని ప్రక్కకు నెట్టి పాపములో నీవు కొనసాగుతున్నావు. II. రెండవది, నీ యుద్ధోప కరణము. మన పాఠ్యభాగము చెప్తుంది, "మన యుద్ధోప కరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని బలమైన స్థావరాలను పడగొట్టి దానికి దేవునిచే ఇవ్వబడిన శక్తి వంతమైనవి." సాతానుకు వ్యతిరేకంగా మనము వాడే సాధనాలు ముఖ్యంగా ప్రార్ధన మరియు దేవుని ధర్మశాస్త్రము, ఆ ధర్మ శాస్త్రము చెప్తుంది నీవు నశించిన పాపివని. నీవు పాప భరితుడవని ధర్మశాస్త్రము చెప్తుంది. మన ప్రార్ధనలు మీ పాప ఒప్పుకోలు నిమిత్తము పరిశుద్ధాత్మను క్రిందికి దింపుతుంది. అందుకే నశించు వారి పాపపు ఒప్పుకోలు నిమిత్తము హృదయ పూర్వకంగా ప్రార్ధించాలి. మనం ప్రార్ధించకుంటే రక్షింపబడని వారు ఈ రాత్రి మన గుడిలో ఉన్నారు. ధైర్యముతో కన్నీటితో వారి కొరకు ప్రార్ధించాలి. కన్నీటితో ప్రార్ధించినప్పుడు మాత్రమే నశించు పాపులు పాపపు ఒప్పుకోలు పొందుకోవడం చూస్తాం. కన్నీటి లేని ప్రార్ధనకు జవాబు అరుదు. యెషయా చెప్పినట్టు మనం ప్రార్ధించాలి, "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు [పాపపు] తత్తరిల్లును గాక" (యెషయా 64:1). మనం మునుపెన్నడూ, ప్రార్ధించనంతగా, దేవుని ఆత్మ దిగివచ్చి నశించు వారికి పాపపు ఒప్పుకోలు కలిగేటట్టు ప్రార్ధించాలి. అశ్లీల చిత్రాలు చూసే పాపము నుండి ఒప్పుకోలు. తల్లిదండ్రులు ద్వేషించే పాపము నుండి ఒప్పుకోలు. మంచితనములో నుండి వచ్చు గర్వమును గూర్చిన ఒప్పుకోలు. యేసును తిరస్కరించుట అనే పాపమును గూర్చిన ఒప్పుకోలు. వారికి ధర్మ శాస్త్రము బోధించాలి. ప్రార్ధన ధర్మశాస్త్ర బోధ సాతానుకు వ్యతిరేకంగా వాడే ప్రాముఖ్యమైన ఆయుధాలు. ఆదివారము తరువాత ఆదివారము జులీకి ధర్మ శాస్త్రము భోధించాను. ఆమె చెప్పింది, "నా పాపానికి వ్యతిరేకంగా డాక్టర్ హైమర్స్ బోధించారు. తల్లిదండ్రులపై తిరుగబడే పిల్లలు [ఎంత] పాపులో ఆయన బోధించినప్పుడు, కన్నీరు మున్నీరు అయింది. ఆ [పాపము] విషయంలో దేవును నన్ను సంధించాడు. నేను [నిజంగా] భయంకరమైన బిడ్డను, నా తల్లిదండ్రులకు. తండ్రి పట్ల ద్వేషాన్ని కప్పిపుచ్చుకున్నాను. నేను మంచి వ్యక్తిని కానని పరిశుద్ధాత్మ చూపించింది. నేను నిజంగా మంచి వ్యక్తిని కాదు. ప్రజలు నన్ను చూచేటట్టు, నాకనిపించేటట్టు నేను మంచి వ్యక్తిని కాను. నేను భయంకర వ్యక్తిని, స్వార్ధము చాలా గర్వము ఉండేది, నన్ను గూర్చి, నేను సిగ్గుపడ్డాను. నాకు క్షమాపణ కావాలి, నాకు అర్హత లేదనిపించింది. పాపము తప్ప నాలో ఉన్నట్టు అనిపించింది. మోసపుచ్చే నాలాంటి పాపిని ఎవరు క్షమిస్తారు?" ప్రార్ధన ధర్మశాస్త్ర బోధనా ఆయుధాలు తనపై సాతాను శక్తిని చంపేసాయి. "మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కోరిందీయులకు 10:4). సాతాను స్థావరాలు చాలా శక్తివంతమైనవి. అవి నీ హృదయంలో కోటలా ఉంటాయి, సాతాను చెరలో నిన్ను బందిస్తాయి. దేవుని శక్తి సాతాను గోడలను పడగొట్టి చెరనుండి నిన్ను విముక్తుని చేస్తుంది. పాపపు శక్తిని ఆయన విరుగగొడతాడు, నీ స్థావరమేంటి? సాతాను చెరలో ఏది నిన్ను బంధిస్తుంది? అశ్లీల చిత్రాలా? మత్తు పదార్ధాలా? మంచివాడనే తలంపా, నాకు రక్షణ అవసరము లేదు గుడికి వస్తున్నాను కాబట్టి బైబిలు చదివి ప్రార్ధిస్తాను కాబట్టి అనా? ఆ విధంగా సాతాను తన చెరలో నిన్ను – బంధించిందా? దేవునికి వందనాలు మన ప్రజలు జూలీ విడుదల కొరకు ప్రార్ధించారు! దేవునికి వందనాలు నేను ధర్మ శాస్త్రము బోధించాను, తను నశించినదని ప్రతీ ప్రసంగములో బోధించాను. "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కొరింధీయులకు 10:4). ఒక ప్రసంగము తరువాత జూలీ నా దగ్గరకు వచ్చింది. తను చెప్పింది, "డాక్టర్ హైమర్స్ నాతో అన్నారు, యేసు నా స్థానంలో సిలువపై మరణించాడని [దేవుని] తీర్పు నాకు బదులు తనపై పడిందని. నాకిప్పుడు తెలుసు నాకు యేసు ఆయన రక్తము కావాలని...నాకు యేసు కావాలి [ఆయన రక్తము] ద్వారా నా పాపాలు పూర్తిగా కడిగి వేయబడడానికి. డాక్టర్ హైమర్స్ నాతో చెప్పారు యేసు నన్ను ప్రేమిస్తున్నాడని ఎలాంటి పాపమున్నా యేసు నన్ను రక్షిస్తాడని. యేసును నమ్మమని నాతో చెప్పారు. ఆగలేకపోయాను నా ముఖము కన్నీటిమయమయింది. క్రీస్తును నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను... మోకాళ్ళని వంచి, క్రీస్తును నమ్మాను. నా మంచి తనాన్ని కాదు, క్రీస్తును నమ్మాను. నా విశ్వాసము క్రీస్తు నందు ఆయన రక్తము నందు ఉంచాను... నా మంచితనము మీద ఆధారపడలేదు గర్వాన్ని విడిచాను. నేను యేసును నమ్మాను ఆయన నన్ను రక్షించాడు!" ఎంత అద్భుత సాక్ష్యము! జూలీ రక్షింపబడింది, తను నా స్నేహితురాలు! తను క్రైస్తవురాలని నన్ను నిజంగా నమ్ముచున్నాను. అలాగే డాక్టర్ కాగన్ కూడ. త్వరలో తనకు బాప్మిస్మమిస్తాను. ఆమె మాటలు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాయా? నీవు ఎంత పాపివో నీకు అనిపిస్తుందా? యేసును నమ్మాలనే అవసరత నీకు తెలుస్తుందా క్రీస్తు సిలువపై కరచిన రక్తము ద్వారా? యేసు నిన్ను అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. మీరు వచ్చి నాతో మాట్లాడుతారా, లేక జాన్ కాగన్ తో గాని, డాక్టర్ కాగన్ తో గాని యేసును నమ్మడం విషయం గూర్చి? ప్రతి ఒక్కరు భోజనానికి పైఅంతస్తుకు వెళ్తుండగా, మీరు ఇక్కడకు వస్తారా మీకు ఉపదేశించి మీతో ప్రార్ధించడానికి? మూత్రశాలకు వెళ్ళాలంటే, వెళ్లి తిరిగి ఇక్కడకు రండి – లేక ఇప్పుడే రండి మేము పాడుచుండగా. దేవుడు భోజనాన్ని యేసును ఈ రాత్రి నమ్మే ప్రతి వ్యక్తిని దీవించాను గాక! ఆమెన్! లేచి పాటల కాగితంలో పదకొండవ సంఖ్య పాట పాడండి. పాడండి "నా దృష్టి అంతటిని నింపు." పాటల కాగితంలో పదకొండవ సంఖ్య పాట. మేము పాడుచుండగా, మీరు ఇక్కడకు వస్తే నేను మీకు ఉపదేశించి మీ కొరకు ప్రార్ధిస్తాను. నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట జాన్ కాగన్ సామ్యూల్: II కొరింధీయులకు 10:3-5. |
ద అవుట్ లైన్ ఆఫ్ మన యుద్ధోపకరణములు THE WEAPONS OF OUR WARFARE డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కాని దేవుని యెదుట దుర్గములను పడ ద్రోయ జాలినంత బలము కలవైయున్నవి" (II కొరింధీయులకు 10:4). (II కొరింధీయులకు 10:3) I. మొదటిది, మనము యుద్ధములో ఉన్నామని మనము గుర్తించాలి, II. రెండవది, నీ యుద్ధోప కరణము, యెషయా 64:1. |