ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నరక పూరిత సంవత్సరము – ఉజ్జీవ సంవత్సరము!A YEAR OF HELL – A YEAR OF REVIVAL! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). |
లేఖనాలలో ఈ గొప్ప వచనము వద్దకు తిరిగి వస్తున్నాము. గత సంవత్సరము మనలో చాలామంది ప్రార్ధనలకు జవాబిచ్చినందుకు నేను దేవుడికి చాలా వందనస్థుడను. అయినను జాన్ కాగన్ దానిని "నరక సంవత్సరము" అని పిలిచాడు. నేను అతనితో ఏకీభవిస్తున్నాను. కొంతవరకు అతడు సరియే. కొన్ని విధాలుగా అది నరక సంవత్సరము అన్నాడు. కానీ ఇది దీవెన సంవత్సరము. జాన్ కూడ చాలా రోజులుగా అలసిపోయిన తరువాత నరక సంవత్సరంగా పిలిచాడు. మనం అలసిపోయినప్పుడు చెడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. కాని విశ్రాంతిలో ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటాం. మనమందరం అలానే ఉంటాం. మనం మానవులము. మన భావాలు అటు ఇటు వెళ్తుంటాయి. ఈ అలసటలో, ఒక క్షణం అందమైన క్రైస్తవ అమ్మాయిని జూలీని మర్చిపోయాడు, ఆ అమ్మాయితో క్రైస్తవ తారీకులలో అతడు తనతో ఎంతో పరిహాసము పొందుకున్నాడు. డిస్నీలాండ్ లో వారి అద్భుత దినాన్ని మరచిపోయాడు. శాంతా మోనికా సాగర తీరాన తనతో పరిగెత్తడం మరచిపోయాడు. ప్రార్ధనలో ఆనంద సమయము మరచిపోయాడు. ఆరన్, జాక్ మరియు నోవాలతో నా ఇంట్లో రాత్రి చాలా ఆలస్యంగా, ప్రార్ధనలో గడపడం మరచిపోయాడు. మా ఇద్దరి మధ్య పోరాటాలు మర్చిపోయాడు, అదే మా మధ్య గౌరవము పెంచింది, తరువాత ఎల్లప్పుడూ నిలిచిపోయే మంచి స్నేహము పెంచింది ఇది నిత్యత్వము నిలిచిపోతుంది. అతడు నాతో ఇలా చెప్పడం మరచిపోయాడు, "నా తాతలు నాకు తెలియదు. డాక్టర్ హైమర్స్, నా తాతకు మీరు చాలా సన్నిహితులు. నా జీవితంలో మీ పెట్టుబడి బట్టి వందనాలు. నేను మిమ్మును మద్దతిస్తాను మిమ్మును నమ్ముతాను... దేవుడు మిమ్మును దీవించు గాక! మీరు చెయ్యగలరు, డాక్టర్ హైమర్స్! – జాన్ సామ్యుల్ కాగన్." జాన్ గొప్ప దైవ జనుడు. ప్రభువు సైన్యంలో గొప్ప వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కాని మన అందరి వలే, అతడు మానవుడు. మనం అలసిపోయినప్పుడు చెడు విషయాలే గుర్తుంచుకుంటాం. మనం విశ్రమించి ఉజ్జీవింపబడినప్పుడు, సంవత్సరం ఎంత బాగుందో గుర్తు వస్తుంది – ప్రార్ధనలో సహవాసంలో అద్భుత సమయాలు, 2016 లో దేవుడిచ్చిన అద్భుత శక్తి ప్రేమలు దేవుడిచ్చినవి – మనం ప్రార్ధించినప్పుడు ఆయన జవాబిచ్చినవి, "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). కొన్నిసార్లు నాకు కూడ "నరక సంవత్సరము" గా అనిపించింది. నా భావనలు క్రుంగినప్పుడు, జీవితముపై పట్టు సడలినట్టు అనిపించింది. కన్నీళ్లు పెట్టుకొని చనిపోతానేమో అనిపించేది – సంఘాన్ని గూర్చిన భయము నా హృదయానికి బాధ కలిగించేది. కేన్సర్ కు వారిచ్చిన చికిత్స "చెడు భావనల" ద్వారా తీసుకెళ్ళింది. కొన్నిసార్లు లోతైన మనస్థాపము కలిగేది. గత సంవత్సరం చాలాసార్లు దెయ్యపు శక్తులకు బలి అయ్యాను. ఆరోన్ యాన్సీ ఆ సమయంలో లేకపోతే చాలా కష్టము అయ్యేది. యారోన్ లాంటి సన్నిహితుడు దేవుని బహుమానము! క్రిస్టీన్ గుయాన్ మరియు శ్రీమతి లీలాంటి ప్రార్ధనా యోధులు దేవుని బహుమానాలు! అవును, 2016 లో మంచి విషయాలు కూడ ఉన్నాయి. చాలామంది యవనస్తులు నన్ను ద్వేశించేవారు. ఇప్పుడు ప్రేమిస్తున్నారు! వారు నవ్వుతూ అన్నాడు, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాపరి గారు!" అంటే నా హృదయము ఆనందముతో గానము చేస్తుంది. అప్పుడు నా అందమైన భార్య పంపిన కార్డు చూస్తాను. ఆమె అన్నారు, ప్రియ రోబర్ట్, దేవుని పట్ల నీ విధేయత విశ్వాసమును బట్టి నేను యేసును ఎరిగాను. నీవు లేకుండా మేమేవ్వరము ఇక్కడ ఉండేవారము కాదు... రోబర్ట్, నా హృదయమంతటితో ఆత్మ అంతటితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు ప్రేమిస్తాను, హేనా. ఆమె మధుర మాటలు చదివేటప్పుడు నా హృదయము ఆనందముతో పాడుతుంది! "ఓ దేవా, హేనా బట్టి మీకు వందనాలు! అంత నమ్మకమైన అందమైన అమ్మాయిని బట్టి, మీకు వందనాలు!" కష్ట కాలాల్లో ఆమె ప్రేమ, ఆమె మద్దతు ప్రార్ధనలు లేకుండా నేను ఉండలేకపోయే వాడినేమో. నా మొదటి మనవరాలు హన్నా బట్టి, దేవునికి వందనస్థుడను. మొదట్లో బట్టతలతో ఉన్న, ముసలి వాడనైన నన్ను గూర్చి భయపడేది! కాని క్రిస్మస్ సమయంలో పాక్కుంటూ చేతులలోనికి వచ్చింది – నా ముక్కుపై ముద్దు పెట్టింది. బ్రతికున్నంత కాలము ఆ ముద్దు మర్చిపోలేను! 2016 చూస్తూ దేవుడు మనకు చేసినవి మర్చిపోకూడదు! సంఘము చనిపోతున్నట్టు, నేను చనిపోతున్నట్టు, భవిష్యత్తుపై నిరీక్షణ లేనట్టు అనిపించింది. కాని, అంతాపోయింది అనిపించినప్పుడు, దేవుడు మన ప్రార్ధన వింటాడు, "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). దేవుడు మనకు జవాబిచ్చాడు! "కొత్త" బాప్టిస్టు టేబర్ నేకల్ కొరకు ప్రణాళిక వేసాను. "లే లెండి, యువకులారా." పై బోధించాను యువతీ యువకులు పట్టుదలతో ప్రార్ధించారు, పాడుతూ కన్నీటితో దేవుని దిగి రమ్మని మోర పెట్టాము. ఆయన దిగి వచ్చాడు. అది డాక్టర్ కాగన్ తన 90 సంవత్సరాల తల్లిని క్రీస్తు దగ్గరకు నడిపించడంతో ప్రారంభమయింది. క్రిస్టీనా గుయన్ కు ప్రార్ధనాత్మ ఇవ్వబడింది. శ్రీమతి శర్లీలీకు ప్రార్ధనాత్మ ఇవ్వబడింది. పరిశుద్దాత్మ అగ్ని మన మధ్యకు దిగి వచ్చింది. కొద్ది వారాలలో 28 మంది పాపపు ఒప్పుకోలు క్రిందకు వచ్చి మార్చబడి, మనకై సిలువలో క్రీస్తు కార్చిన రక్తముతో కడగబడ్డారు. అప్పుడు ఉజ్జీవము ఆగిపోయిందనుకున్నాము. మాది పొరపాటు. దేవుడు ఇంకా మనతో ఉన్నాడు! ప్రతీ ఆదివారము కనీసము ఒక్కరైనా మారుతున్నారు. అకస్మాత్తుగా డాక్టర్ చాన్ అభిషేకముతో బోధించాడు నలుగురు ఒప్పింపబడి ఒక్క ఆరాధనలో, డిసెంబర్ 25 – క్రిస్మస్ రోజున, సాయంకాలము ఆరాధనలో రక్షింపబడ్డారు! 2016 లో రక్షింపబడిన 28 మంది జాబితా క్రింద ఉంది. జూడిలీ నా స్నేహితులారా, దేవుడు మనలను విడిచి పెట్టలేరు! మన గుడిలోనికి మళ్ళీ మళ్ళీ వచ్చాడు, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ –డిసెంబర్ లో తొమ్మిది మంది మారారు. ఒక సంవత్సరంలో ఇరవై ఎనిమిది మంది! నిలబడి పాట పాడండి! ఆశీర్వాదాలు క్రుమ్మరించే, దేవుని స్తుతించండి; స్త్రీలు పాడండి! యువకులారా పాడండి! మనమందరము గట్టిగా పాడదాం! మన ఉజ్జీవపు పాట, "నా దృష్టి అంతటినీ నింపు" పాడదాం. కంటతతో పాడండి, లేక చూచి పాడండి. పాటల కాగితంలో 4 వ పాట. ఇప్పుడు పాడండి! నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, సహోదరీ సహోదరులారా, 2017 లో దేవుని నుండి గొప్ప ఉజ్జీవము రాబోతుంది. దాని నిమిత్తము రోజు ప్రార్ధించండి. కొన్నిసార్లు రాబోవు సంవత్సరంలో దేవుని సన్నిధి కొరకు ఉపవసించి ప్రార్ధించండి. ఇప్పుడు I కోరిందీయులకు 9:24 చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1219 వ పేజిలో ఉంది. మిగిలిన ప్రసంగము డాక్టర్ కాగన్ చే వ్రాయబడింది, "పందెపు రంగ మందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు, కాని ఒక్కడే బహుమానము పొందునని మీరెరుగారా? అటు వలే, మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి" (I కోరిందీయులకు 9:24). కూర్చోండి. బైబిలు మూసి జాగ్రత్తగా వినండి. పౌలు క్రైస్తవ జీవితాన్ని క్రీడాకారుని పందెముతో పోల్చాడు. అతనన్నాడు, "మీరు [బహుమానము] పొందునట్లుగా, పరుగెత్తుడి" (I కోరిందీయులకు 9:24). తరువాత పౌలు చెప్పాడు, "వారు క్షయమైన కిరీటము కొరకు, అక్షయలైనప్పటికినీ చేస్తారు" (I కోరిందీయులకు 9:25). క్రైస్తవుని బహుమానము మెడల్ కాదు. అది యింకా గొప్పది. ఆ బహుమానము ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు యేసు క్రీస్తు అనుగ్రహిస్తాడు! పౌలు అన్నాడు ఒక క్రీడాకారుడు "అన్ని విషయాల్లో [నిగ్రహంతో] ఉంటాడు" (వచనము 25). క్రీడాకారుడు లావుగా ఉండడు. బద్దకంగా ఉండడు. సమయము వ్యర్ధ పరచడు. అపోస్తలుడైన పౌలు అలానే ఉన్నాడు. అతనన్నాడు, "నేను... సాధారణంగా కాకుండా, పరుగెత్తుము; అందువలన నేను గాలిలో గుద్దులు కాకుండా, పోరాడుతాను" (వచనము 26). తర్పీదు లేని బాక్సారు వలే గాలిలో గుద్దులు గుద్దడు. పౌలు అతి నమ్మకస్థుడు కాదు. విఫలుడవుతాడని తనకు తెలుసు. అతనన్నాడు, "ఇతరులకు... ప్రకటించిన తరువాత, భ్రష్టుడనౌదునేమో" (వచనము 27). తనకేమి కావాలో పౌలుకు తెలుసు. తన ప్రయత్నాలన్నీ దానిలో పెట్టాడు. మనమేమి చెయ్యాలని చెప్పాడో తన జీవితంలో అలా జీవించాడు. "పొందుకొనునట్లు, పరుగెత్తుడి" (I కోరిందీయులకు 9:24). "పొందుకొనునట్లు, పరుగెత్తుడి [బహుమానము]." ఈ రాత్రి ఈ పాఠ్య భాగాన్ని నాలుగు విధాలుగా అన్వయిస్తాను. I. మొదటిది, ఈ పాఠ్యభాగము ఈ చలి శీతాకాలములకు వర్తిస్తుంది. మనము "సెలవులకు" అద్భుత సంబరాలు జరిపాం. క్రిస్మస్ జరుపుకున్నాం. క్రిస్మస్ సందర్భంగా మన రక్షకుని పుట్టినరోజు జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ రోజు మళ్ళీ అందరం కూడుకున్నాం. డాక్టర్ చాన్ సింహంలా బోధించాడు. నలుగురు రక్షింపబడ్డారు! ప్రభువు రాత్రి భోజనము జరిపాము. రాత్రి, నూతన సంవత్సర సందర్భము, సెర్గియో యజ్మిస్ వివాహము చేసుకున్నారు. ఈరోజు నూతన సంవత్సర దినము. కాని "సెలవులు" నిత్యమూ ఉండిపోవు. ఇది జనవరి. వచ్చే వారంతముండదు. శీతాకాలము వస్తుంది. చల్లగా ఉంటుంది. వాన వస్తుంది. ఉత్సాహవంతంగా ఉండదు. మీరు ఎదుర్కొంటారా? లేక పడిపోయి గుడిని వదిలేస్తారా? మన పాఠ్యభాగము చెప్తుంది, "పొందుకొనునట్లు, పరుగెత్తుము." బహుమనముపై మనసు పెట్టండి! ఏమి జరిగినా గుడిలోనే ఉండండి! మీ మనస్సు క్రీస్తుపై గుడిపై పెట్టండి! మీకు తెలుసు, శీతాకాలము ప్రతి ఏటా వస్తుంది. గొప్ప జల ప్రళయము తరువాత దేవుడు నోవాహుతో అన్నాడు, "భూమి నిలిచి యున్నంత వరకు, వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను వేసవి శీతాకాలములు, రాత్రింబవళ్ళు ఉండక మానవు" (ఆదికాండము 8:22). శీతాకాలము ప్రతీ యేటా వస్తుంది. ఎదుర్కొంటారా? "పొందుకొనునట్లుగా, పరుగెత్తుడి." చలికాలము తరువాత శీతాకాలము వస్తుంది. అప్పుడు శోధనలు ఉంటాయి. దానిని "అమెరికా సుఖ యంత్రము" అని పిలుస్తారు. మూడు రోజుల వారాంతము ఉంటుంది. ప్రజలు లాస్ వెగాస్, శాన్ ప్రాన్సిస్కో, ఇతర స్థలాలకు వెళ్తారు. బలహీన మనస్కులు గుడి వదిలేస్తారు. "శీతాకాల సెలవు" ఉంటుంది. ప్రజలు వెళ్లి పోవాలనుకుంటారు. సాంఘిక కార్యక్రమాలు ఉంటాయి. కుటుంబ కలయికలుంటాయి. అమెరికన్లు సుఖ యంత్రము లైంగిక మత్తు పదార్ధాల పాపము కంటే ఎక్కువ మందిని చంపి వేసింది. క్రీడాకారునిలా పోరాడతావా? లేక పడిపోతావా? క్రీడాకారునిలా పోరాడతావా? ప్రతిసారి గుడిలో ఉంటావా? సాతాను శోధనలు ఎదిరించి గుడిలో ఉంటావా? లేక బలహీనుడవై గుడి వదిలేస్తావా? దెయ్యముచే శోధింపబడి గుడిని విడిచి పాపము వైపు పోతావా? "కనుక పొందుకొనునట్లు, పరుగెత్తుడి." క్రీస్తు సంఘముపై దృష్టి పెడితే 2017 లో మనకు గొప్ప సంవత్సరంగా ఉంటుంది. దీనితో దానితో మీ సమయము వ్యర్ధ పరచుకోవద్దు. సమయము వ్యర్ధ మయ్యేలా ఇటు అటు తిప్పబడవద్దు! 2017 లో గొప్ప సంవత్సరం పొందుకుందాం! ప్రార్ధనలో దెయ్యముతో పోరాడుదాం. ప్రతీసారి గుడికి వస్తుండండి. క్రీస్తు కొరకు క్రీడాకారుని వలే బహుమానము గెలుచుకోండి! సమస్యలు క్లిష్ట పరిస్థితులు తేవద్దు. గుడిలో సమస్యగా ఉండకుండా నిర్ణయించుకోండి. అపోస్తలుల కార్యములోని క్రైస్తవుల వలే "ఏకమనస్సు" కలిగి ఉందాం! క్రీడాకారుని వలే దృష్టి పెడితే – ఏదీ మనలను పడనీయకుంటే – గొప్ప సంవత్సరం మనకు ఉంటుంది! శీతాకాలము చలికాలము క్రీస్తుపై సంఘంపై దృష్టి పెట్టండి. క్రీడాకారుని వలే ఉండండి. "పొందుకొనునట్లు, పరుగెత్తుము" – జయము పొందుకో! "క్రైస్తవ సైనికులారా, కదలండి." లేచి ఈ పాట పాడండి! క్రైస్తవ, సైనికులారా, యుద్దానికై కదలండి, II. రెండవది, పాఠ్య భాగము ఉజ్జీవానికి అన్వయింపబడింది. గత సంవత్సరము దేవుడు ఉజ్జీవముతో మన సంఘాన్ని దర్శించాడు – నలభై ఏళ్లలో మొదటిసారి. కూతాలలో దేవుడు దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ మాతో ఉంది. కొద్ది రాత్రులలో చాలామంది మారారు. అసాద్యమనుకున్న వారు మారారు. వారు చాలా ప్రసంగాలు విన్నారు. నేను వారిని చాలాసార్లు ఉపదేసించాను. వారు గట్టిగా చల్లగా ఉండిపోయారు. దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక అద్భుత మార్పు తరువాత ఇంకొకటి చోటు చేసుకుంది! అతి పెద్ద బహుమతి దేవుని సన్నిధి. జీవించు క్రైస్తవ్యాన్ని అనుభావించాము. దేవుడు మాతో ఉన్నాడు. ఇంకా గొప్ప ఉజ్జీవము పంపాలని వేచి యున్నాము – ఓ, ప్రభూ! మన సంఘము ప్రతి గురువారము శనివారం ప్రార్ధనకు కూడుకుంటుంది. మీలో చాలామంది చిన్న గుంపులుగా ఉజ్జీవము కొరకు ప్రార్ధిస్తారు. ఉజ్జీవముపై బోధించడానికి నడిపించినందుకు దేవునికి వందనాలు. ప్రార్ధించే సంఘముగా మనలను నడిపించినందుకు దేవునికి వందనాలు. ఇది అరుదైన సంపదలు, అమెరికాలో ఎక్కడా కనబడవు. చిన్న గుంపులలో ప్రార్దిస్తుంటే ఉజ్జీవము ఆత్మల సంపాదనపై దృష్టి పెట్టండి. ఆ రెండింటికే కట్టుబడండి. ఆ రెండు మనకు అవసరము – దేవుని సన్నిధి సువార్త ద్వారా కొత్త వారు రావడం. గొప్ప ఉజ్జీవము కొరకు మనం వేచి ఉండాలి! మనం దేవుని సన్నిధి అనుభవించాం ఉజ్జీవములో కార్యము చూసాం, మనకు ఇంకా కావాలి. నేను మిమ్మును గద్దించాలి. ఉజ్జీవము ఎలా రావాలో ఇప్పుడు మనకు తెలిసింది అనుకోకూడదు. అనుకోవద్దు, "మనకు వచ్చేసిందని. ఏమి చెయ్యాలో మనకు తెలుసు. ఇంకొక ఉజ్జీవము పొందుకుందాం." మీరలా అనుకుంటే, మనకు ఎక్కువ ఉజ్జీవము రాదు. దేవుడు యంత్రము కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయన సర్వశక్తి గల గొప్ప దేవుడు. ఆయనను మార్చలేదు – ప్రార్దన ద్వారా కూడ. ఉజ్జీవము మాత్రమూ కాదు. పని ద్వారా ప్రార్దన ద్వారా అది జరిగేటట్టు చెయ్యలేం. దెయ్యం పట్టిన అబద్ద ప్రవక్త చార్లెస్ ఫిన్నీ బోధించాడు గుడి ఉజ్జీవము జరిగేటట్టు చేయగలదని – కాని అతనిది తప్పు. దేవుడు ఉజ్జీవపు కర్త. ఆయన కోరుకున్నప్పుడు దేవుడు ఉజ్జీవము పంపగలడు. గత వేసవిలో ఎలా ఉజ్జీవము ప్రారంభమయిందో గుర్తు చేసుకోండి. అవును, ప్రజలు ప్రార్ధించారు. కానీ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రార్ధన కొనసాగలేదు. వాక్యములో బోధింపబడలేదు. దేవుడు అకస్మాత్తుగా, ఆశ్చర్యంగా దిగి వచ్చాడు, కాని ప్రజలు యెషయా 64:1-3 వల్లిస్తూ ఉన్నారు. ఆయన అకస్మాత్తుగా ఘనంగా వచ్చాడు. కొన్ని కూటాలలో దేవుడు దిగి రాలేదు. మళ్ళీ మళ్ళీ, ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఉజ్జీవము కొరకు, దేవుడు ప్రత్యక్షమవలేదు. కూటాలు మృతంగా ఉన్నాయి దేవుని ఆత్మలేదు. కొన్నిసార్లు దేవుడు లేడని కూటాన్ని ముందుగా కూడ ముగించాను. దేవుని సన్నిధి పోగొట్టుకోవడం సులువు. సాతాను ఎప్పుడు ఇక్కడ ఉంది. కాని దేవుడు ఉండకపోవచ్చు. కోరుకోకుండా దేవుడు రాడు. మనము "సెలవులతో" జీవిత విషయాలతో తృప్తి చెందితే, దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో ఉండాలి అనుకోకపోతే, ఆయన మనతో ఉండడు. కాని ఆయన ఇంకా మనతో ఉన్నాడు. గత రాత్రి అర్ధరాత్రి ఈ ప్రసంగము సిద్ధ పడుతున్నాను. ఫోను మోగింది. ఊడి పాపపు ఒప్పుకోలుతో, ఏడుస్తున్నాడు. నేను డాక్టర్ చాన్ ను లేపితే ఆయన ఊడి గదికి వెళ్ళాడు. ఊడీ తెల్లవారు జామున రెండు గంటలకు మారాడు – సంవత్సరం ఆఖరి దినము 2:00 గంటలకు 29 వ మార్పు! పాట కొరకు నిలబడండి! కాని ఊహించుకోవద్దు – ఊరికే తీసుకోవద్దు – దేవుడు మనతో ఉండాలని. దేవుడు ఉజ్జీవము పంపాలని తలంచ వద్దు. సంపోనులా ఉండవద్దు "మునపటిలా వెళ్ళాడు" తనకు తెలియదు "దేవుని సన్నిధి తనను విడిచి పెట్టిందని" (న్యాయాధిపతులు 16:20). ఇశ్రాయేలీయుల వలే ఉండవద్దు వారు దేవుని అద్భుతంతో యేరికోను జయించి యున్నారు, తరువాత చిన్న పట్టణము ఐను తీసుకుందాం అనుకున్నారు. వారనుకున్నారు, "అందరు వెళ్ళవద్దు...వారు కొద్ది మంది... వారు మనష్యుల ఐను నుండి పారిపోయారు" (యెహోవా 7:3, 4). మన పాఠ్యభాగము చెప్తుంది, "పొందుకొనునట్లు, పరుగెత్తుము." కీర్తన చెప్తుంది, "కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోస్తారు" (కీర్తనలు 126:5). అది ఇలా చెప్పడం లేదు, "తెలివితో విత్తువారు ఆనందముతో పంట కొస్తారని." అది ఇలా చెప్పలేదు, "స్వ-నమ్మకముతో విత్తు వారు ఆనందంతో పంట కోస్తారని." లేదు, కన్నీటితో విత్తువారు ఆనందముతో పంట కోస్తారు. ఉజ్జీవము కొరకు ఎక్కువగా ప్రార్ధిద్దాం, శక్తి దేవునికి మాత్రమే చెందినది. దేవుడు దిగి వచ్చే వరకు ప్రార్ధించండి – కాని ఓ దేవా, దెయ్యముతో పోరాడడానికి సహాయము చేయుము, నీవు ఎక్కువ శక్తి గల ఉజ్జీవముతో దిగి రమ్ము! మళ్ళీ మీరు దిగి రావాలని ప్రార్ధన! దిగిరమ్ము, మా ప్రార్ధన! ఉజ్జీవములో దిగిరమ్ము! "క్రైస్తవ సైనికులారా, కదలండి!" లేచి ఆ పాట పాడండి. క్రైస్తవ, సైనికులారా, యుద్ధము నకు వలే సాగండి, III. మూడవది, పాఠ్యభాగము ఆత్మల సంపాదనకు వర్తిస్తుంది. అంతరంగికంగా చూడడం సులువు – లోపల – ఇప్పటికే గుడిలో ఉన్నవారిని. కొన్నిసార్లు అలా చేయడం సరి. కాని ఇప్పుడు లేని నశించు వారి దగ్గరకు వెళ్ళే సమయము. ఆత్మల సంపాదనపై దృష్టి పెట్టాలి! ఎక్కువ పేర్లు ఫోన్ నంబర్లు వచ్చునట్లు క్రీడాకారుని వలే పోరాడాలి. నశించు వారిని తీసుకురావడానికి సై క్రీడాకారుని వలే పోరాడాలి. వారిని తేవడానికి పోరాడకపోతే, దేవుడు ఉజ్జీవాన్ని పంపడు. ఇంకా చెప్పేదుంది, కాని ఇక్కడ ఆపేస్తాను. డాక్టర్ చాన్ ఊడీ కొరకు పోరాడాడు. తన ఇంటికి తీసుకెళ్ళాడు. రాత్రి పగలు ఊడీ కొరకు ప్రార్ధించాడు. అప్పుడు ఊడీ ఏడుస్తూ ఫోను చేసాడు. నేను డాక్టర్ చాన్ ఫోన్ చేసి, నిద్ర లేపాను, ఆయన ఊడీని ఆఖరి రోజు ఉదయము రెండు గంటలకు, క్రీస్తు నోద్దకు నడిపించాడు! యేసు అన్నాడు, "నశించు వారిని వెదికి రక్షించుటకు మనష్య కుమారుడు వచ్చెను" (లూకా 19:10). మళ్ళీ, క్రీస్తు అన్నాడు, "నా ఇల్లు నిండునట్లు, వారిని బలవంత పెట్టండి" (లూకా 14:23). మృతులలో నుండి లేచిన తరువాత యేసు అన్నాడు, "మీరు లోకములోనికి వెళ్లి, [శిష్యులుగా చేయుడి]" (మత్తయి 28:19). డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ఆత్మల సంపాదన చాలా ప్రాముఖ్య విషయము అది క్రైస్తవుల మనసులో ఉండిపోవాలి" (The Golden Path to Successful Personal Soul Winning, Sword of the Lord Publishers, 1961, p. 55). ఆయన సరియే! మర్చిపోవద్దు సంఘము యొక్క ప్రాముఖ్య పని ఆత్మల సంపాదన! పట్టణ నశించు యవనస్తులను తేవడానికి పోరాడాలి! ఇక్కడ లేని ఎక్కువ మందిని తేవడానికి పోరాడాలి! ఊడీని రక్షించడంలో డాక్టర్ చాన్ వలే పోరాడాలి! కళాశాలలకు వ్యాపార ప్రాంతాలకు వెళ్లి ఎక్కువ పేర్లు ఫోన్ నంబర్లు తెండి. సువార్త వినడానికి గుడికి తీసుకొని రండి. కనీసం ఒక పేరైనా తెండి కలిసేటప్పుడు. డాక్టర్ చాన్ ఊడీకి చేసినట్లు వారిని ప్రేమించి శ్రద్ధ చూపించండి. వారు వచ్చినప్పుడు వారిని గూర్చి తెలుసుకోండి. వారు మారే వరకు మీరు చేయగలిగినదంతా చెయ్యండి – అప్పుడు వారు మనతో ఉంటారు, వారు మారారు కాబట్టి! మన పాఠ్యభాగము చెప్తుంది, "మీరు పొందుకొనునట్లు, పరుగెత్తుము." పౌలు చెప్పాడు, "నేను...అనిశ్చితతో, పరుగెత్తను; కనుక నేను గాలిలో గుద్దుల వలే కాకుండా, పోరాడుతాను" (I కోరిందీయులకు 9:25). పౌలు సగం మనసుతో పనిచెయ్యలేదు. సమయము వ్యర్ధం పరచలేదు. ఆత్మల సంపాదనపై మనసు పెట్టాడు, "గాలిని కొట్టువాని వాలే కాదు." ఆత్మల సంపాదన అలా చెయ్యాలి! అలా డాక్టర్ చాన్ ఊడీని క్రీస్తు నోద్దకు నడిపించాడు. లోనికి వారిని తెండి. డాక్టర్ చాన్ ఉదాహరణ గైకొనుడి! ఆత్మల సంపాదనపై మన సమయము ప్రయత్నాలు పెట్టాలి! ఈ ఏడాది ప్రజలనులోనికి తెద్దాం. మీ గురించి మీ స్నేహితుల గురించి మాత్రమే కాదు. తారీఖు గూర్చి కాదు. నశించు వారిని తేవడం ముఖ్యమైన పనిగా పెట్టుకోండి. ఓడిపోకుండా గెలవడంపైన దృష్టి పెట్టాలి. లేజర్ కాంతి వలే దృష్టి పెట్టండి. సగం హృదయముతో ఉండొద్దు, "గాలిని, కొట్టువారి వలే కాదు." ముఖ్య దృష్టి సారించాలి, అలా ప్రజలను తేలేము. మనం ప్రజలందరినీ ఒకే దారిలోకి తీసుకురావాలి. మన పాఠ్యభాగము చెప్తుంది, "పొందుకొనునట్లు, పరుగెత్తుము." ప్రార్ధన ద్వారా దెయ్యంతో పోరాడాలి చాలామంది యవనులను తేవాలి! "క్రైస్తవ, సైనికులారా కదలండి." మళ్ళీ లేచి ఆ పాట పాడండి. క్రైస్తవ, సైనికులారా, యుద్ధానికి కదలండి, IV. నాల్గవది, ఇంకా నశించు మీకు పాఠ్యభాగము వర్తిస్తుంది. ఇంకా మారని వారితో కొన్ని మాటలు చెప్పాలి. మన పాఠ్యభాగము చెప్తుంది, "పొందునట్లుగా, పరుగెత్తుము." మీకు ఒక అన్వయింపు ఉంది. మన పాఠ్యభాగము చెప్తుంది, "పొందునట్లు, పరుగెత్తుము." నేను బోధిస్తుండగా కూర్చోవద్దు! క్రీస్తు అన్నాడు, "ఇరుకు మార్గమున రక్షణ పొందాలి, క్రీస్తు ద్వారనే" (లూకా 13:24). కష్టపడుతున్నారా? అసలు కష్టపడుతున్నారా? "ప్రవేశించడానికి కష్టపడండి" అదే అర్ధం ఇస్తుంది "పొందుకొనునట్లు, పరుగెత్తుము." మీ ఆత్మను గూర్చి తీవ్రంగా ఉంటే, దేవుడు క్రీస్తు నొద్దకు నడిపిస్తాడు. రక్షణ కొరకు కష్టించకపోతే, రక్షింప బడలేరు. క్రీస్తులో ప్రవేశించడానికి కష్టపడకపోతే రక్షింపబడలేరు! మీరు రక్షణ "పొందుకోలేరు." మీరు పొందుకోలేరు. యాంత్రికంగా ఆహ్వానానికి ముందుకు వస్తే, పాపపు ఒప్పుకోలు లేకుండా, మీరు మారలేరు. కంప్యూటర్ లో అశ్లీల చిత్రాలు చూస్తుంటే, మీరు మారలేరు. గంటల కొద్ది విడియో గేములు ఆడితే, రక్షింపబడరు. దేవుడు మీకు తీవ్రత లేదని చూస్తారు. మీ కొరకు చింతిస్తే, మారలేదు. యూదా కయినులు వారి కొరకు విచారించారు. ఇద్దరు నరకానికి వెళ్ళారు. నీ స్వంత సమస్యల కొరకు ఆలోచిస్తూ ఉంటే, భావాలు ఉద్రేకాలు, నీ పాపము బట్టి కాకుండా, మీరు మారలేరు. యేసు క్రీస్తు వైద్యుడు కాదు. అతడు మీ సమస్యలను, భవనాలను మరియు ఉద్దేశాలను పూరించడానికి చనిపోలేదు. మీకు నిశ్చయత భావన ఇవ్వడానికి ఆయన మరణించాడు. దేవుడు మిమ్మలను శిక్షించడానికి కాదు మీ పాపాలకు వెల చెల్లించడానికి చనిపోయాడు. అందుకే "క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు" (I కోరిందీయులకు 15:3). మీరు నిజంగా పాపాలను గూర్చి చింతించక పోతే – కొన్ని మాటలు నోటితో చెప్పినా – క్రీస్తు మరణము మిమ్మును రక్షింపనేరదు. మీ పాపాల పరిహారార్ధం క్రీస్తు సిలువపై మరణించాడు. మీ పాపాలు కడగడానికి ఆయన రక్తము కార్చాడు. మీకు జీవము ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయనను నమ్మితే మీ పాపాలు క్షమిస్తాడు. జీవితమూ కొరకు పోరాడండి. పాపమును గూర్చి బలవంతంగా ఆలోచించండి. పాపము నుండి రక్షింపబడడానికి క్రీస్తు నోద్దకు రావడానికి కష్టపడండి! పాటల కాగితంలో నాలుగవ పాట లేచి పాడండి. మొదటి ఆఖరి వచనాలు పాడండి "నా దృష్టి అంతటిని నింపు." పాటల కాగితంలో నాలుగవ పాట. నా దృష్టి అంతటిని నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, ఇక్కడికి రండి నాతో మాట్లాడాలనుకుంటే, లేక జాన్ కాగన్ తో కాని, డాక్టర్ కాగన్ తో కాని ఎలా క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి రక్షింపబడాలో తెలుసుకోవడానికి, ఆయన సిలువపై కార్చాడు మీ పాపముల నుండి మిమ్మును రక్షించడానికి. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: |
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తు కొరకు క్రీడాకారునిగా – సైనికునిగా ఉండవలెను! A YEAR OF HELL – A YEAR OF REVIVAL! డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1). "పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు, కాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటు వలే మీరు బహుమానము పొందునట్లుగా, పరుగెత్తుడి" (I కోరిందీయులకు 9:24) (I కోరిందీయులకు 9:25, 26, 27) I. మొదటిది, ఈ పాఠ్యభాగము ఈ చలి శీతాకాలములకు వర్తిస్తుంది, ఆదికాండము 8:22. II. రెండవది, పాఠ్య భాగము ఉజ్జీవానికి అన్వయింపబడింది, న్యాయాధిపతులు 16:20; యెహోశవ7:3, 4; కీర్తనలు 126:5. III. మూడవది, పాఠ్యభాగము ఆత్మల సంపాదనకు వర్తిస్తుంది, లూకా 19:10; 14:23; మత్తయి 28:19; I కోరిందీయులకు 9:25. IV. నాల్గవది, ఇంకా నశించు మీకు పాఠ్యభాగము వర్తిస్తుంది, లూకా 13:24; I కోరిందీయులకు 15:3. |