Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఈనాడు దయ్యములు

DEMONS TODAY
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, అక్టోబర్ 23, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, October 23, 2016

"వారా సముద్రము వద్దనున్న, గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనే దిగగానే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడెను" (మార్కు 5:1-2).


గెరాసేనుల భూతగ్రస్థతపై బోధించిన సంఘ కాపరిని గూర్చి నేను ఎన్నడూ వినలేదు. బిల్లీ గ్రేహమ్ బోధించే వాడు – కానీ సంఘ కాపరి ఎన్నడూ బోధించలేదు. ఎందుకు అలా? ఎందుకంటే అది దెయ్యములను గూర్చిన కథ కాబట్టి. అది క్రీస్తుకు సాతానుకు మధ్య సంఘర్షణను గూర్చినది. అది సంఘములో కొంతమంది స్త్రీలను భయపెడుతుంది. డేవిడ్ ముర్రో దాని గూర్చి పూర్తి పుస్తకము రచించాడు. దానిని, ఎందుకు పురుషులు గుడికి వెళ్లడం ద్వేషిస్తారు అంటారు (నెల్సన్ బుక్, 2005). ప్రతి కాపరి ఆ పుస్తకం చదవాలని నా ఆశ! ముర్రో చెప్పాడు 18 నుండి 29 మధ్య ఉండే పురుషులు, యవ్వనస్థులు, గుడిలో ఉండడానికి ఇష్టపడరు (పేజీ 18). అతనన్నాడు పురుషులు యువకులు "సవాలు కావాలనుకునే వారు." వారి ముఖ్య విలువలు సాహసము, తెగింపు, ధైర్యము, సంఘర్షణ. "వారు ధైర్యంగా, సాహసంగా, భయంకరంగా ఉండాలని కోరుకుంటారు." ఇంకొక వైపు చాలామంది స్త్రీలు పెద్ద వారు "సంఘర్షణ కోరుకుంటారు" (పేజీ 19).

క్రీస్తు భయంకర పనులు చేసాడు. ఆయన ధైర్య వంతుడై తెగించడానికి గాని సంఘర్ణలో దిగడానికి గాని భయపడలేదు. డేవిడ్ ముర్రో సరిగ్గా చెప్పాడనుకుంటున్నాను. కొంతమంది స్త్రీలు, పెద్ద వయస్కులు అలా ఉండరు. తరుచూ వారు సంఘాలలో కంఠము ఉపయోగించడం విషాదకరము. ఆ కారణమును బట్టి, దెయ్యాల మీద సాతాను మీద ప్రసంగాలు చెప్పబడలేదు. వారికి సంఘర్షణ ఇష్టము లేదు.

చాలామంది యవ్వనస్థులు విప్లవ ముస్లీములుగా అవడంలో ఆశ్చయము లేదు. వారి మతము కొరకు ప్రపంచాన్ని జయింఛమని వారి నాయకులు వారికి చెప్తారు. నలుగురు నౌకా దళారులను చంపిన 24 సంవత్సరాల అమెరికా దేశస్థునిలా వారు ఉంటారు. ఈనాడు ఇది పదే పదే జరుగుతూ ఉంది. నమ్మడానికి ఎదో కావాలని ఈ యవ్వనస్థులు చూస్తున్నారు. వారి జీవితాలలో కారణమూ కొరకు ఉద్దేశము కొరకు వారు ఎదురు చూస్తున్నారు!

కానీ విప్లవ ముస్లీము జవాబు కాదు! మెత్తని, ఈనాటి సంఘాలలో ఉండే స్త్రీత్వ క్రైస్తవ్యము కూడా జవాబు కాదు. మీరు యేసును వెంబడించాలని నేను మిమ్మును అడుగుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు విప్లవాత్మక శిష్యుడు కావాలని నేను మిమ్మును అడుగుచున్నాను! సంఘర్షణ ఉంది. మనము యుద్ధములో ఉన్నాము. కానీ ఇది భౌతిక యుద్ధము కాదు. ఇది ఆత్మీయ యుద్ధము గొప్ప బ్రిటీష బోధకుడు డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ (1899-1981) యుద్ధ భూమిని గూర్చి మాట్లాడాడు. అతనన్నాడు, "మనము క్రైస్తవ జీవితంలోకి ప్రవేశించినప్పుడు దేవుని శక్తులకు నరక శక్తులకు మధ్య జరుగుచున్న సంఘర్షణలో మనం భాగస్థులము అవుతాము... ఈలోకంలో మన జీవితమూ ఆత్మీయ యుద్ధ భూమి...సాతాను కారణంగా" (Life in God, Crossway Books, pp. 105, 179). నేను అతనితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను!

యేసుకు దెయ్యము పట్టిన వ్యక్తికీ సంబంధించిన ఈ కథ ప్రాముఖ్యము. నూతన నిబంధనలో మూడు వేర్వేరు స్థలాలలో దేవుడు దానిని లిఖించాడు – మత్తయి, మార్కు, లూకాలో. ఉగ్రవాదం ఆత్మీయ పోరాటం ఉన్న కాలంలో జీవిస్తున్న యవ్వనస్థులకు దీనిలో అద్భుతమైన గుణపాఠము ఉంది!

కథ సామాన్యమైంది. యేసు చిన్న దోనెలో గలిలియా సముద్రమును దాటి వెళ్ళాడు. ఆ చిన్న సముద్రపు అద్దరికి, గెరాసేనుల దేశమునకు వచ్చాడు. నా భార్య నేను కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళాము. ఇది జరిగిన ఆ స్థలాన్ని మేము కళ్లారా చూసాం.

"ఆయన దోనే దిగగానే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను" (మార్కు 5:2).

ఇప్పుడు, యేసు క్రీస్తును ఎదుర్కొన్న ఈ యవ్వనస్థుని గూర్చి, చాలా విషయాలు మీ ముందుంచుతాను.

I. మొదటిది, ఈ యవ్వనస్తుడు దయ్యము పెట్టినవాడు.

దెయ్యముచే పట్టబడడం నేను నమ్ముతానా? అవును, నేను నమ్ముతాను – తప్పకుండా నమ్ముతాను! చాలా దెయ్యాలున్నాయని బైబిలు బోధిస్తుంది. అపొస్తలుడైన పౌలు వాటిని గూర్చి అన్నాడు,

"ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని... ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతో" (ఎఫెస్సీయులకు 6:12).

ఆ వచనంలో అతడు వివిధ రకాలైన దయ్యాలను అపవిత్రాత్మలను గూర్చి మాట్లాడాడు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "బహుముఖ అపవిత్రాత్మలు ఉన్నాయి. వేలకొలది, బహుశా లక్షల కొలది, అపవిత్రాత్మలున్నాయి" (Christian Unity, The Banner of Truth Trust, 1980, p. 58).

మీరు సాతానును అతని దయ్యాలను నమ్ముకుంటే, మీరు ఉగ్రవాదమును భౌతిక వాదమును, అమెరికా యొక్క పాపములను ఎలా వివరించగలరు?

ఈ యవ్వనస్తుడు దయ్యము పెట్టినవాడు. అతడు దురాత్మలచే అదుపు చేయబడుతున్నాడు. అలంటి స్థితిలో ఉన్నవారిని నేను వ్యక్తిగతంగా విచారించాను. ఒక యవ్వనస్తుడు మత్తు పదార్ధాలు తీసుకున్నప్పుడు, చేతబడి చేస్తున్నప్పుడు గూఢమైన వారిలో ఉన్నప్పుడు అతనికి అది సంభవింపవచ్చును.

కానీ మార్పు నొందని ప్రతి వ్యక్తి ఆలోచనను కొంత వరకు దయ్యాలు నియంత్రిస్తూ ఉంటాయి. అపొస్తలుడైన పౌలు ఆ దెయ్యపు స్థితిని గూర్చి ఇలా చెప్పాడు "అవిధేయులైన పిల్లల మధ్య ఇప్పడు పనిచేయుచున్న ఆత్మ" (ఎఫెస్సీయులకు 2:2). ఒకప్పుడు నా మనస్సుకు దయ్యములు ఆంధ్యత్వము కలుగ చేశాయి. మారని ప్రభువైన యేసు క్రీస్తుచే విడుదల పొందని ప్రతి ఒక్కరి విషయంలో అది వాస్తవమే. మనమందరము అదే పరిస్థితిలో ఉన్నాము క్రీస్తు మనలను రక్షింపక మునుపు మనం తిరిగి జన్మించకమునుపు. నిజమైన మార్పిడులు ఎప్పుడు సాతాను శక్తి నుండి విడుదల!

యేసు మీ పాప పరిహారార్ధం సిలువపై మరణించాడు. సమస్త పాపమూ నుండి మీ మనస్సును హృదయాన్ని కడగడానికి ఆయన తన రక్తమును కార్చాడు. మీకు జీవితాన్ని ఇవ్వడానికి ఆయన శారీరంకంగా మృతులలో నుండి లేచాడు – దయ్యపు అంధత్వము నుండి మిమ్ములను విడిపించడానికి! గొప్ప బోధకుడు పాటల రచయిత చార్లెస్ వెస్లీ (1707-1788) ఇలా చక్కగా చెప్పాడు,

ఆయన రద్దు చేయబడిన పాపపు శక్తిని విరుగగొట్టాడు,
   ఆయన బందీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపవిత్రుని శుద్ధిగా చేస్తుంది;
   ఆయన రక్తము నా కొరకు అందుబాటులో ఉంది.
("ఓ వెయ్యి నాలుకల కోసం" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
       (“O For a Thousand Tongues” by Charles Wesley, 1707-1788).

క్రీస్తు పాపమూ "శక్తిని విరుగగొడతాడు"! క్రీస్తు "బందీని విడుదల చేస్తాడు." నా ఇరవై సంవత్సరాలప్పుడు ఆయన ఒక ఉదయాన నాకొరకు చేసాడు – ఆయన మీ కొరకు కూడ చేయగలడు! ఈ ఉదయాన ఇక్కడ కొంతమంది ఉన్నారు వారు మీకు చెప్పగలరు క్రీస్తు వారిని పాపము నుండి దయ్యముల నుండి వారిని విడుదల చేసాడని. మీరు యేసుచే రక్షింపబడితే, ఇప్పుడే నిలబడింది! – మీరు కూర్చోవచ్చు. వారందరి కొరకు చేసిన క్రీస్తు మీ కొరకు కూడ చేయగలడు!

II. రెండవది, ఈ యవ్వనస్తుడు ఒంటరిగా ఉన్నాడు.

బైబిలు చెప్తుంది అతడు "సమాధులలోనే గాని, ఇంటిలో ఉండువాడు కాదు" (లూకా 8:27). నా భార్య నేను అక్కడ ఉన్నాము. కొండ ప్రక్క ఉన్న ఆ సమాధులు చూసాము. అవి అక్కడ ఉన్నాయి – కొండ ప్రాంతములోని సొరంగాలు, అక్కడ మృత దేహాలు భూస్థాపితం చేయబడతాయి. బైబిలు చెప్తుంది,

"వాడు ఎల్లప్పుడును, రాత్రి పగలు, సమాధులలోను, కొండలలోను, కేకలు వేయుచు, తన్ను తానూ రాళ్లతో గాయ పరచుకొనుచు నుండెను" (మార్కు 5:5).

చాలామంది యవ్వన స్త్రీలు బ్లేడులతో కోసుకుంటారు. ఎందుకలా చేశారో వివరించలేదు. టెలివిజన్ లో ఒక యుక్త వయస్కురాలు చూసాను, అలా మళ్ళీ మళ్ళీ తన చేతులు కోసుకుంటుంది. తనలా ఎందుకు చేసిందని ప్రశ్నించు వాడు అడిగాడు. తాను చెప్పింది, "నాకు తెలియదు. అలా చెయ్యాలని బలవంత పెట్టబడుతున్నాను. నేను ఆపలేను." ఆ యవ్వన స్త్రీ యేసు క్రీస్తు అవసరము! క్రీస్తు ఆ సాతాను బంధకాన్ని విరిచేయగలడు!

మన పాఠ్యభాగములోని ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు! దయ్యాలు అతనిని తన కుటుంబము నుండి ఒంటరి స్థలానికి తీసుకెళ్లాయి, అక్కడ యేసు అతనిని కలిశాడు. ఈనాడు అమెరికా మరియు పశ్చిమ దేశాలలో ఉన్న యవ్వనస్థులకు ఒంటరి తనమును మించిన పెద్ద సమస్య మరొకటి లేదు. ఒంటరితనము! యవ్వనస్థుల అనుభవించే చాలా సమస్యలకు ఒంటరి తనము మూల కారణము. బీటిల్స్ ప్రసిద్ధ పాట కలిగియున్నారు, "ఒంటరి ప్రజలంతా, వారంతా ఎక్కడ నుండి వచ్చారు?" ("ఎలీనోర్ రిగ్ బీ").

ఫిలిప్ స్లెటర్ ఒక పుస్తకాన్ని రాసాడు ఒంటరి తనపు అన్వేషణ: నిర్ణయం సమయంలో, అమెరికా సంస్కరణ, బీకన్ ప్రెస్, 2006 ముద్రణ). ఒంటరి తనపు అన్వేషణలో, గ్రంథ రచయితా ఒంటరితనాన్ని "సాంకేతిక విజ్ఞానమునకు జాతీయ వ్యసనము"తో ముడి పెట్టాడు. స్లెటర్ గారు అన్నాడు, "మోటారు, ఉదాహరణకు, అమెరికా సామాజిక జీవిత పతనానికి దోహద పడింది. అది... వారిని చెదర గొట్టింది ఒకరితో ఒకరు సంబంధము లేకుండా అయిపోయారు" (పేజీలు 126, 127).

యవ్వనస్థులు వారి కారులో కళాశాలకు వెళ్ళడానికి శాంటా బార్బారాకు గాని బెర్కిలీకి గాని వెళ్తారు. అది చాలా సులువు, కానీ వారి అందరి స్నేహితులను కోల్పోతారు, బహుశా ఎన్నటికీ. కళాశాల వయసు యవ్వనస్థులు చాల ఒంటరి తనంలో ఉన్నారు అందులో ఆశ్చర్యము లేదు. మీరంటారు, "ఒకరితో ఒకరం పరిచయంలో ఉందాం." అంటే ఒకరితో ఒకరు సమాచారం పంచుకోవడం. అది "పరిచయంలో" ఉంచుతుందా? లేదు – వాస్తవానికి సెల్ ఫోన్ ద్వారా "ముట్టుకోవడం" ఉండనే ఉండదు.

నా భార్య అమ్మమ్మ గౌతమేలలో ఉంటారు ఆమె తెలివైన అవగాహన ఉన్న సామాజిక వేత్త. ఆమె కుమారులు తన ఇంటిలో టెలిఫోను పెట్ట ప్రయత్నించారు. ఆమె చెప్పారు, "వద్దు. నా దగ్గర ఫోను ఉంటె, మీరు నన్ను చూడడానికి రారు." సెల్ ఫోన్ కు అతుక్కుపోయిన యవ్వనస్థులను చూస్తే నాకు చాలా విచారము అనిపిస్తూ ఉంటుంది. ఒక యంత్రము తరుచు నిజ స్నేహితుల స్థానాన్ని తీసుకుంటూ ఉంటుంది.

సినిమా "ఆమెను" గూర్చి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను దానిని సిఫారసు చెయ్యను – ఆ సినిమా ఒంటరి యవ్వనస్థుని గూర్చినది అతడు తన కంప్యూటర్ తో ప్రేమలో పడతాడు, దానిని "సమంత" అని పిలిచాడు. నేను అది చూడలేదు. దానిలో స్పష్టమైన సంభోగ దృశ్యాలున్నాయి. కానీ చాలామంది తెలివైన యువకులు చూసారు – ఒక అబ్బాయి యంత్రముతో ప్రేమలో పడడం! మీరు ఈ సినిమాను గూర్చి చదవచ్చు. ఇక్కడ క్లిక్ చెయ్యడం ద్వారా దానిని గూర్చిన వికీపీడియా వ్యాసం. మీరు అది చూడాలని సిఫారసు చెయ్యను.

అమెరికా యూరపు సంస్కృతీ ఒంటరి తనమును సాతాను యవ్వనస్థులను బానిసలుగా చెయ్యడానికి వారిని నాశనము చెయ్యడానికి ఉపయోగించుకుంటుందని నేను నమ్ముతాను. నౌక దళారులను చంపిన యవ్వనస్తుడు "కంప్యూటర్" అనే యంత్రము ద్వారా ఐసిస్ తో కలపబడ్డాడు. అతడు నిజంగా ఒంటరిగా ఉన్నాడు! యేసు ఎదుర్కొన్న వ్యక్తి సమాధులలో ఒంటరిగా ఉన్నాడు. అతడు దయ్యలా అదుపులో ఉన్నాడు! దేవుడు మనకు సహాయము చెయ్యాలి!

మీ సెల్ ఫోన్ కంప్యూటర్ వదిలి పెట్టాలని నేను చెప్పడం లేదు. కానీ నేను చెప్తున్నాను, "ఆయంత్రాలు మిమ్ములను అదుపు చేయకూడదు! నిజమైన స్నేహితులను చేసుకోవడానికి చాలాకాలము కంప్యూటర్ వదిలి పెట్టండి! నిజమైన స్నేహితులను చేసుకోవడానికి చాలాకాలము కంప్యూటర్ వదిలి పెట్టండి – సంఘములో!" సమాధులలో ఉన్న అతని గూర్చిన పాట వినండి,

ఇంటి నుండి స్నేహితుల నుండి దురాత్మలు అతని పారద్రోలాయి,
   సమాధులలో దుస్థితిలో అతడు జీవించాడు;
దయ్యపు శక్తులు ఆవరించినప్పుడు అతడు తనను కోసుకున్నాడు,
   అప్పుడు యేసు వచ్చి బందీని విడుదల చేసాడు.
యేసు వచ్చినప్పుడు సాధకుని శక్తి విరిగిపోయింది;
   యేసు వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచి వేయబడతాయి.ఆయన విచారము తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతాడు,
   అంతా మారిపోయింది నివసించడానికి యేసు వచ్చినప్పుడు.
("అప్పుడు యేసు వచ్చాడు" ఓస్ వాల్డ్ జె. స్మిత్ గారిచే, 1889-1986;
      సంగీతము హోమర్ రోడ్ హీవర్, 1880-1955).
    (“Then Jesus Came” by Oswald J. Smith, 1889-1986;
   music by Homer Rodeheaver, 1880-1955).

యవ్వనస్థులారా, మన సంఘములోనికి రావాలని నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. ఆదివారము ఉదయము ఆదివారము సాయంకాలము ఇక్కడ ఉండండి. శనివారం రాత్రి కూడ మాతో ఉండండి! నేను ప్రమాణము చేస్తున్నాను – మేము మీ స్నేహితులుగా ఉంటాం! నేను ప్రమాణము చేస్తున్నాను – మీరు మాతో వస్తే మీరు ఒంటరిగా ఉండరు! ఆమెన్!

III. మూడవది, ఈ యవ్వనస్తుడు యేసును బట్టి భయపడ్డాడు.

బైబిలు చెప్తుంది అతడు

"గట్టి స్వరంతో, అన్నాడు, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధ పరచుకుమని దేవుని పేరిట నీకు ఆన బెట్టుచున్నానని, బిగ్గరగా కేకలు వేసెను" (మార్కు 5:7).

అతడు యేసును గూర్చి భయపడ్డాడు. అది, ఈనాటి, యవ్వనస్థులలో కనిపిస్తుంది. యేసు ఈ సంఘము మీకు సహాయము చేస్తారు, కానీ మీరు భయపడతారు! కట్టుబడడానికి భయపడుతారు. ప్రతివారం చివరిలో కొన్ని గంటలు గుడిలో మాతో గడపడానికి భయపడతారు. ఇది నాకు చాలా విచారము కలిగిస్తుంది. మీ భయాలు సాతాను నుండి వచ్చినవాని నాకు తెలుసు. అతడెందుకలా చెయ్యాలి? ఎందుకంటే అతనికి తెలుసు మీరు అతని విడిచి మా దగ్గరకు వచ్చి యేసు నొద్దకు వస్తారని తెలుసు.

19 సంవత్సరాల వయసులో రాత్రి లాస్ ఏంజిలాస్ వీధులలో ఒంటరిగా తిరిగాను. నా పాఠశాల స్నేహితులు వెళ్లిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను, చాల ఒంటరిగా. ఒక శనివారం రాత్రి ఆల్ వేర వీధిలో నడుస్తున్నాను. చినటౌన్ దాటి వెళ్ళాను. ఎల్ వీధి తట్టు తిరిగాను. ఆ వీధి చివర ఒక గుడి చూసాను. అది చైనీయ బాప్టిస్టు సంఘము. తలుపు తట్టాను ఒక యవ్వన స్త్రీ లోర్నా లామ్ తలుపు తెరచి నాతో మాట్లాడింది. ఆమె మరునాడు, ఆదివారము గుడికి రమ్మని ఆహ్వానించింది. మరునాడు అక్కడికి వెళ్ళాను. తరువాత చాలా సంవత్సరాలు అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ ఉన్నప్పుడు యేసు నన్ను రక్షించాడు. నిజమైన నిలిచి ఉండే, స్నేహితులను పొందుకున్నాను; స్నేహితులు లోర్నా మరియు మర్ఫీ లామ్ లాంటివారు.

మమ్మును గూర్చి భయపడకండి! యేసును గూర్చి భయపడకండి! మాతో రండి మీకు మంచి చేస్తాము! మా దగ్గరకు తిరిగి రండి, నేను వాగ్దానము చేస్తున్నాను, అది మంచి నిమిత్తము మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు వచ్చే వారాంతములో మళ్ళీ మా దగ్గరకు వస్తే – యేసు నొద్దకు కూడ వస్తే – ఇప్పటి నుండి వెయ్యి సంవత్సరాలు చేసినంతగా మీరు ఆనందిస్తారు.!

గెరాసేను ప్రాంతపు వ్యక్తి నుండి యేసు దయ్యములను వెళ్ళగొట్టాడు. యేసు అతనిని రక్షించాడు! అవును, అతడు యేసు క్రీస్తుచే రక్షింపబడ్డాడు!

కనుక మానవులు ఈనాడు సమర్ధుడైన రక్షకుని కనుగొన్నారు,
   వారు తపనను, కామమును మరియు పాపమును జయించలేక పోయారు;
వారి పగిలిన హృదయాలు వారిని విచారములో ఒంటరి తనంలో విడిచి పెట్టాయి,
   అప్పుడు యేసు వచ్చి, ఆయనే, లోపల నివసించాడు.
యేసు వచ్చినప్పుడు శోధకుని శక్తి కూలిపోతుంది;
   యేసు వచ్చినప్పుడు కన్నీళ్లు తుడవబడతాయి.
ఆయన విచారాన్ని తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతాడు,
   అంతా మారిపోతుంది నివసించడానికి యేసు వచ్చినప్పుడు.

క్రీస్తు సాతాను నుండి నిన్ను విడుదల చెయ్యగలడు! క్రీస్తు మీకు జీవితాన్ని శక్తిని ఇవ్వగలడు! క్రీస్తు మీ జీవితాన్ని మార్చగలడు! యేసు క్రీస్తు నొద్దకు దారి చూపడానికి మాకొక అవకాశము ఇవ్వండి! తిరిగి రండి మీకు మార్గము చూపిస్తాం! ఒకరనవచ్చు, "నేను దెయ్యాలను లేక సాతాను నమ్మను." అది సరే. ఒకప్పుడు నేను కూడ వాటిని నమ్మలేదు. కానీ అది ప్రాముఖ్య విషయము కాదు. అతి ప్రాముఖ్యమైన విషయము యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం, మేము కూడ మిమ్ములను ప్రేమిస్తున్నట్టుగా భావించడం! ఇక్కడ నిలిచి ఉండే స్నేహితులను చేసుకుంటాం. ఈ స్థలములో మీరు ప్రేమించబడతారు అంగీకరింప బడతారు! దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తు నందు, మీ విశ్వసము ఉంచండి, ఆయన సిలువపై తన మరణము ద్వారా మిమ్ములను రక్షిస్తాడు ఎప్పటికీ నిత్యత్వమునకు ఆయన మీ కొరకు పాప పరిహారార్ధము పరిహారము చెల్లిస్తాడు. ఆమెన్!

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుదోమ్ గారు: మత్తయి 8:28-34.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారు:
"అప్పుడు యేసు వచ్చాడు" (ఓస్ వాల్డ్ జె. స్మిత్ గారిచే, 1889-1986;
సంగీతము హోమర్ రోడ్ హీవర్, 1880-1955).
“Then Jesus Came” (words by Dr. Oswald J. Smith, 1889-1986;
music by Homer Rodeheaver, 1880-1955).



ద అవుట్ లైన్ ఆఫ్

ఈనాడు దయ్యములు

DEMONS TODAY

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"వారా సముద్రము వద్దనున్న, గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనే దిగగానే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడెను" (మార్కు 5:1-2).

I.   మొదటిది, ఈ యవ్వనస్తుడు దయ్యము పెట్టినవాడు, ఎఫెస్సీయులకు 6:12; 2:2.

II.  రెండవది, ఈ యవ్వనస్తుడు ఒంటరిగా ఉన్నాడు, లూకా 8:27; మార్కు 5:5.

III. మూడవది, ఈ యవ్వనస్తుడు యేసును బట్టి భయపడ్డాడు, మార్కు 5:7.