ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఒక యవ్వన సువార్తికుని మార్పులో
|
బహుశా నేనెప్పుడూ బోధింపని అతి ప్రాముఖ్యమైన ప్రసంగాలు 2009 జూన్ లో, బోధించాను. ఈ ఉదయము బోధించిన యవ్వనస్థుని మార్పునకు దేవుడు ఈ ఐదు ప్రసంగాలు ఉపయోగించుకున్నాడు. ఆయన మార్పు నొందేముందు జాన్ సామ్యూల్ కాగన్ ఈ ఐదు ప్రసంగాలు విన్నాడు. జాన్ తప్పకుండా చాలా గొప్ప బోధకుడవుతాడు, ఇతని మార్పులో వాడబడిన ఈ ఐదు ప్రసంగాలు లాంటివి నేను ఇక బోధించలేనేమో. మార్పుల కొరకు బోధించుట ఈనాడు అరుదు. కానీ పాపులను మార్చడానికి బోధించే పద్ధతిని దేవుడు ముఖ్య సాధనంగా ఇచ్చాడు. బైబిలు చెప్తుంది, "ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు?" (రోమా 10:14). రక్షింపబడక మునుపు జాన్ కాగన్ ఈ ఐదు ప్రసంగాలు విన్నాడు. ఈ ప్రసంగము చివరిలో అతని పూర్తి సాక్ష్యము చదువుతాను. తన మార్పు ముందు జాన్ విన్న ఐదు ప్రసంగాల సారాంశము మీకు ముందు ఇస్తాను. ఈ సాయంకాలము నేనిచ్చే విషయాలు ఆ ఐదు ప్రసంగాల శీర్షికలు. I. మొదటిది, “రక్షణ నుండి దూరంగా ఉందని వారి కొరకు ప్రోత్సాహము” (జూన్ 7, 2009 ఆదివారము ఉదయము, బోధింపబడినది). ప్రసంగ భాగము "నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు" (మార్కు 12:34). ఈ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ తప్పకుండా పనిచేసింది, ఎందుకంటే దేవుని ఆత్మా మాత్రమే ఒక వ్యక్తి దేవుని పట్ల వ్యతిరేకత క్రీస్తును తిరస్కరించుటను విరుగ గొడుతుంది. మారని వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడు మరియు క్రీస్తు విరోధి. ఇంకొక యవ్వనస్తుడు నన్నడిగాడు, "యేసు సిలువపై ఎందుకు మరణించాలి?" ఈ అబ్బాయి నేను చెప్పడం విన్నాడు "మన పాపానికి పరిహారము చెల్లించడానికి క్రీస్తు సిలువపై మరణించాడు." చాలా సంవత్సరాలు అలా చెప్పడం అతడు వినినప్పటికినీ, తన అంధత్వపు మనసు దానిని గ్రహించుకోలేదు. ఈ మాటలను గూర్చి మీరు లోతుగా ఆలోచించాలి, "మన పాపానికి పరిహారము చెల్లించడానికి క్రీస్తు సిలువపై మరణించాడు." క్రీస్తు నొద్దకు రాకుండా ఏది మిమ్ములను ఆపేస్తుంది? ఇతరులు ఏమంటారని మీరు భయపడుతున్నారా? వారనేది మర్చిపోండి. మీరు నరకంలో ఉన్నప్పుడు వారి మాటలు ఉపయోగపడవు. మీ పాపమూ నుండి వైదొలగి క్రీస్తు నొద్దకు రండి. నరకాన్ని నుండి తప్పించుకునే వేరే మార్గము లేదు. II. రెండవది, “ఆధునిక కాల్విన్ సిద్ధాంతము మరియు నిజమైన మార్పు” (జూన్ 7, 2009 ఆదివారము సాయంకాలము, బోధించబడింది). ప్రసంగపు పాఠ్యభాగము, "కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల, వాడు నూతన సృష్టి: పాతవి గతించెను; ఇదిగో, కొత్తవాయెను" (II కొరింధీయులకు 5:17). కాల్విన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నేను బోధించలేదు. బదులుగా నేను అన్నాడు సిద్ధాంతములో నమ్మకము నిన్ను రక్షించదు. నిజ సిద్ధాంతములోని నమ్మకము కూడ నిన్ను రక్షింపనేరదు. నేనున్నాను నిజ సిద్ధాంతములో నిలిచియుండుట నిన్ను ఎన్నడూ రక్షింప నేరదు. నీవు పాపపు ఒప్పుకోలు కలిగియుండాలి. నీ పాపమూ ఒప్పుకోవాలి. యేసు నొద్దకు రావాలి లేనిచో నరకానికి పోతారు. నీ పాపములో విసిగి పోయినప్పుడు – అప్పుడు, అప్పుడే – నీవు నిన్ను రక్షించడానికి క్రీస్తు అవసరత చూస్తావు. నీ దుష్ట హృదయాన్ని క్రీస్తు మార్చాలన్న కోరిక లేకపోతే, నీవు ఎన్నడూ మారలేవు. నీ హృదయపు పాప భూఇష్టతను బట్టి నీకు సిగ్గుగా లేదా? అది నిన్ను తొందర చెయ్యడం లేదా? అలా అవ్వాలి నీవు మార్పు నొందాలంటే. నీ పాపపు హృదయాన్ని బట్టి విసిగి పోయినప్పుడు కడిగే యేసు రక్తము నీకు ప్రాముఖ్యమవుతుంది. స్పర్జన్ అన్నాడు, "హృదయములో నిజమైన మార్పు ఉండాలి అది జీవితాన్నంతటినీ మార్చేస్తుంది." నశించు పాపి పాపపు ఒప్పుకోలు కలిగి వాటిని ద్వేషించినప్పుడు నిజ మార్పిడిలు జరుగుతాయి. ఆ ప్రసంగంలో స్పర్జన్ ప్రసంగములోని ఒక పేరాను చెప్పను, "మార్పు అవసరమా?" స్పర్జన్ అన్నాడు, అన్ని నిజమైన మార్పులలో నాలుగు విషయాలలో అంగీకారము ఉంటుంది: తప్పకుండా తేటయైన పాపపు ఒప్పుకోలు ఉండాలి, దాని క్షమాపణ కొరకు యేసు వైపు చూడాలి, హృదయంలోని నిజమైన మార్పు ఉండాలి, అది తరువాత పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది, ఒకవేళ ఈ ముఖ్యమైన అంశాలు కనబడకపోతే అది కచ్చితమైన మార్పు కాదు (C. H. Spurgeon, “Is Conversion Necessary?”, Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1971, vol. xx, p. 398). III. మూడవది, “ప్రార్ధన ఉపవాసము ద్వారా మాత్రమే” (జూన్ 14, 2009 ఆదివారము ఉదయము, బోధింపబడినది). పాఠ్యభాగము, "ప్రార్ధన ఉపవాసము ద్వారా మాత్రమే, ఇలాంటిది సాధ్యము" (మార్కు 9:29). నేను చెప్పను "మరియు ఉపవాసము" పదాలు తొలగింపబడ్డాయి ఎందుకంటే రెండు పాత ప్రతులు, యోగా శాస్త్రపు తెగలచే వ్రాయబడ్డాయి, ఆ రెండు పదాలు విడిచి పెట్టాము, అలా ఆధునిక బైబిలు ఉపయోగించే సంఘాలను బలహీనము చేస్తున్నాయి. కానీ ఎక్కువ ప్రాచీన ప్రతులు "ప్రార్ధన ఉపవాసము" పదాలను కలిగి ఉన్నాయి. చైనాలో వారి బైబిలులో ఆ పదాలున్నాయి. అందుకే వారికి ఉజ్జీవపు కొనసాగింపు ఉంది, కానీ పడమట, ఆధునిక అనువాదముల వలన నిజమైన, శాస్త్రీయ ఉజ్జీవము అనుభవించలేకపోతున్నారు. కానీ మన సంఘాలలో యవ్వనస్థులు మార్చబడాలంటే ప్రార్ధన ఉపవాస సమయాలు కావాలి. మనము ఉపవసించి ప్రార్ధించాలి వారు పాపాన్ని గ్రహించి, పశ్చాత్తాపపడి, సిలువ వేయబడి తిరిగి లేచిన రక్షకునితో నిజమైన ఎదుర్కోలు కలిగి, ఆయన ప్రశస్త రక్తము ద్వారా కడబడేటట్టు ప్రార్ధించాలి. ప్రసంగము ఒక పాటలోనికి చరణంలో ముగిసింది, "హిమము కంటే తెల్లగా." ఇలా అంటుంది, "యేసు ప్రభు, ఓపికతో ఎదురు చూస్తున్నాను, రమ్ము, నూతన హృదయము కలుగచేయుము." మన సంఘములో క్రైస్తవులు ఉపవసించి ప్రార్ధిస్తుండగా, జాన్ కాగన్ గట్టిగా వ్యతిరేకించాడు. తనకు కోపము వచ్చింది – త్వరలో మార్చబడబోతున్నప్పటికినీ ఆయన తల్లిదండ్రులు తన రక్షణ కొరకు ప్రార్ధించి ఉపవసించారు! IV. నాల్గవది, “మనస్సాక్షి మరియు మార్పు” (జూన్ 14, 2009 ఆదివారము సాయంకాలము, బోధింప బడినది). పాఠ్య భాగము, "అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చు చుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను" (రోమా 2:15). మనస్సాక్షి అంతర్గత శక్తి మనపై నైతిక తీర్పులు ఇవ్వడానికి, మన కార్యములు అంగీకరించడానికి అనంగీకరించడానికి, మనము చేసిన తప్పు చెప్పడానికి, దానికి శ్రమ పరచుటకు, తగిన వారమని చెప్పడానికి. ఆదాము పాపమూ చేసాడు అతని మనస్సాక్షి అపవిత్ర పర్చబడింది, కనుక తన పాపానికి కుంటి సాకులు చెప్పాడు. వారి మనస్సాక్షులు నాశనము చేసుకోవడం మానవ జాతి అంతటికి సంక్రమించింది వారి మొదటి కుమారుడు కయీను తన సహోదరుని చంపి ఒప్పుకోలు లేకుండా తన పాపానికి సాకు చెప్పాడు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ పాపమూ చేసి అపవిత్ర పరచుకుంటే తన మనస్సాక్షి అంత నాశనము అవుతుంది. ప్రజలు ఎక్కువగా పాపమూ చేసి వారి మనసాక్షులను ఎండా బెట్టుకుంటారు, "వేషధారణతో వేషధారణనతో అసత్యాలు మాట్లాడుతూ; వారి మనస్సాక్షి వేడి ఇనుముతో మమేకమయ్యారు" (I తిమోతి 4:2). నేను చెప్పాను వారు తల్లితో అబద్ధం చెప్పడం, పాఠశాలలో మోసం చేయడం, దొంగిలించడం ద్వారా, వారి మనస్సాక్షియులను ఎండబెట్టు కొనుచున్నారు ఇంకా పెద్ద పెద్ద పాపలు చేస్తున్నారు – అవి గుడిలో చెప్పను. అవేంటో మీకు తెలుసు. మీకు తెలుసు వాటిని గూర్చి మీరు నేరారోపణగా భావించడం అసంభవం – ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ పాపం చేశారు, మళ్ళీ మళ్ళీ పాపం చేసి దేవుని అపహసించారు మీ సమస్సాక్షిని నాశనం చేసుకున్నారు. మీకు సహాయము చేయడానికి నేనేమి చెయ్యాలి? గుర్తు పట్టలేకుండా మీ మనస్సాక్షిని మీరు కాల్చివేశారు. మీ మీద జాలి పడగలనంతే – నశించిన వ్యక్తిగా భవిష్యత్తు ఉండదు నిరీక్షణ ఉండదు. జాలి పడగలనంతే. మీకు సహాయం చెయ్యలేను, ఎందుకంటే మీరు ఇప్పటికే నశించి ఖండింపబడ్డారు. యేసు అన్నాడు, "విశ్వసముంచని వాడు ఇంతకూ మునుపే తీర్పు తీర్చబడెను" (యోహాను 3:18). మీరు తప్పక నరకానికి వెళ్తారు అక్కడే ఉన్నారు. కనుక నేను చెప్పింది చేసేది మీకు సహాయపడదు. దేవుడు మాత్రమే మీకు పాపపు ఒప్పుకోలు కలిగిస్తాడు. ఇంతకూ మునుపు ఆయన పాపపు ఒప్పుకోలు ఇచ్చి ఉంటే, మళ్ళీ ఒప్పుకోలు ఇస్తాడని హామీ లేదు. చాలా తరుచుగా ఒకసారి పాపపు ఒప్పుకోలు అనుభవించాక వారు తిరిగి దేవుని ఆత్మచే దర్శింపబడలేరు. మీ అపహాస్యము అవివేకము తరువాత, ఇంకొక ఒప్పుకోలుకు మీకు అర్హత లేదు. పాపపు ఒప్పుకోలు వదులుకుంటే, దేవుడు మళ్ళీ తిరిగి ఎన్నటికీ ఇవ్వదు. బిక్షగానీ వలే దేవుని ముందుకురా! తగ్గింపుతో వంగు, సర్వ శక్తి గల దేవుడు నీకు ఏమి అచ్చి లేడని తెలుసుకో. ఇన్ని సంవత్సరాలు నీ హృదయంలో ఆయన ముఖంపై ఉమ్మి వేశావు. దాని గూర్చి ఆలోచించు! నీ వైఖరితో క్రీస్తు ముఖంపై ఉమ్మివేసావు. క్రీస్తు నీకు ఏమి అచ్చిలేదు. ఆయన నీకు ఉగ్రత, శిక్ష నరకాగ్ని ఇవ్వగలదు. ఇప్పుడనుకోవచ్చు, " అవును నిజమే – దేవుడు నాకు ఏమి అచ్చి లేడు నరకాగ్ని తప్ప. నాకు దేనికి అర్హత లేదు." తరువాత, అలా అనుకుంటే నీవు యేసు నొద్దకు రావాలని బతిమాలుచున్నాను యేసు నొద్దకు వచ్చి ఆయన పాదములను ముద్దు పెట్టిన స్త్రీ వలే. భయంకరమైన పురుగువలేరా. ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకురా, జాన్ బన్యన్ చేసినట్టు; వైట్ ఫీల్డ్ చేసినట్టు – కృప కొరకు ఏడుస్తూ అరుస్తూ. బహుశా ఆయన నీమీద దయ చూపించవచ్చు. నేను చెప్తున్నాను "బహుశా" – ఎందుకంటే రక్షణ కొరకైనా నీ సమయము ఇప్పటికే అయిపోయింది. కృపా దినానికి మించి ఇప్పటికే ఎక్కువ పాపమూ చేసి ఉంటావు. ఏడ్చుకుంటూ క్రీస్తు నొద్దకురా – బహుశా ఆయన ఇంకొక అవకాశము ఇవ్వవవచ్చేమో – కానీ నీ విషయములు ఆయన ఇస్తాడని నమ్మకం లేదు. ప్రసంగ వేదిక ముందుకు రండి. మోకాళ్లని కృప కొరకు ఏడవండి. క్రీస్తు విని ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడే ఇంకొక అవకాశము ఇవ్వవచ్చేమో. ఆయన రక్తము మాత్రమే "జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును" (హెబ్రీయులకు 9:14). V. ఐదవది, “ఎండిన ఎముకల లోయ” (జాన్ కాగన్ మారిన ఉదయ కల సమయాన్న నేను దీనిని బోధించాను, జూన్ 21, 2009). పాఠ్యభాగము, "ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చున; దేమనగా, మీరు బ్రతుకునట్లు, నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను" (యెహెఙ్కేలు 37:5). ఈ ప్రసంగము ద్వారా జాన్ మారాడని అనుకోను. అతడు నిజంగా వింటున్నాడు అనుకోను. నేననుకుంటాను మొదటి నాలుగు ప్రసంగాలు ఆయనను మార్చడానికి ఉపయోగపడ్డాయి. మీరు జాన్ సాక్ష్యము విటున్నారు నేను చదివేటప్పుడు – అతడు నన్ను అగౌర పరిచాడు. వాస్తవానికి, జాన్ నన్ను ద్వేషించాడు. ఈ ప్రసంగము చెప్తున్నప్పుడు జాన్ అన్నాడు, అతడు "తిరస్కరించడానికి ప్రయత్నించాడు, వినదలుచు కోలేదు... ప్రసంగము అవ్వాలని సెకండ్లు లెక్క పెడుతున్నాను, కానీ సంఘ కాపరి బోధిస్తూనే ఉన్నాడు." అందుకే తన సాక్ష్యములో ఆ రోజు నేను చెప్పిన దానిని గూర్చి ప్రస్తావించలేదు. ఒక్క మాట కూడ. జాన్ అన్నాడు, "ఆహ్వానము ఇవ్వబడినప్పటికినీ నేను తిరస్కరించాను." అతనన్నాడు, "సంఘ కాపరి నచ్చ చెప్పారు, క్రీస్తు నొద్దకు రమ్మన్నారు, కానీ నేను రాలేదు." అది ప్రాముఖ్యము. ఎందుకంటే మీలో కొందరు అలానే అనుకుంటారు. మీరు నన్ను అగౌరవ పరుస్తారు. నన్ను ఇష్ట పడరు. నా మాటా వినాలనిపించదు. కానీ ఆరోజు ఉదయము జాన్ కు ఏదో జరిగింది. అతని టెలిఫోన్ పుస్తకం నుండి కొన్ని పేజీలు చదివి ఉండాల్సింది ఎలా మారాడా తెలియడానికి. ఎందుకలా అన్నాను? ఎందుకంటే మునుపటి నాలుగు ప్రసంగాలు ఆయన కఠిన హృదయములోనికి చొచ్చుకొని పోయాయి, ప్రత్యేకంగా మనస్సాక్షిపై నా ప్రసంగము చూసారు. దేవుడే దానిని, ఆ మూడు ప్రసంగాలను ఉపయోగించి అతనిని తన పాపమును గూర్చి ఆలోచింప చేశాయి. అతడు గ్రహించాడు నాకు వ్యతిరేకంగా అతని పోరాటం కాదు. దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు గ్రహించాడు. ఇప్పుడు అతని సాక్ష్యము వినండి మీరు చూస్తారు జాను మార్పు విషయంలో నేను చేసింది చాలా తక్కువని. దేవుడే మొదటి నాలుగు ప్రసంగాలు అతనిని పాపపు ఒప్పుకోలు క్రిందికి తేవడానికి చేసాడు. దేవుడే నా బలహీన పదాలను ఉపయోగించి ఈ పదిహేనేళ్ల అబ్భాయిని పాపపు ఒప్పుకోలు క్రిందకు తెచ్చాడు. దేవుడే అతనిని "బలవంతముగా క్రీస్తు నొద్దకు [అతనిని నడిపించాడు]." నేను కానీ కాను. "ప్రకటించు వాడు లేకుండా వారు ఎట్లా విందురు?" అనేది నిజము. కానీ దేవుడే బోధకుని ప్రసంగాలను పాపాలను మార్చడానికి ఉపయోగించుకుంటారు. ప్రవక్తయైన యోనా అన్నట్టు, "యెహోవా [యొద్దనే] రక్షణ దొరుకును" (యోనా 2:9). ఇప్పుడు దాని గూర్చి ఆలోచించండి జాన్ సామ్యూల్ కాగన్ మార్పును గూర్చిన పూర్తి సాక్ష్యము నేను చదివి వినిపిస్తాను. నా సాక్ష్యము నా మార్పును గూర్చిన క్షణాలను చాలా తేటగా సన్నిహితంగా నేను జ్ఞాపక ముంచుకోగలను క్రీస్తు నాలో తెచ్చిన గొప్ప మార్పును వివరించుటకు మాటలు చాలవు. నా మార్పుకు ముందు నాకు కోపము ద్వేషము ఉండేవి. నా పాపాలలో గర్వించేవాడిని ఇతరులను బాధించడంలో ఆనందించే వాడిని, దేవుని ద్వేషించే వారితో కలిసి ఉండేవాడిని; నా మట్టుకు పాపమూ ఒప్పుకొనే "పొరపాటు" కాదు. ఇలా నేను బుద్ధి పూర్వకంగా ఈ దారిలో ఉండేవాడిని. దేవుడు నాలో పనిచేయడం ప్రారంభించాడు నేను ఊహించని విధంగా నా ప్రపంచం నా చుట్టూ క్రుంగిపోవడం ఆరంభమయింది. మార్పుకు కొన్ని వారాల ముందు చనిపోవాలనిపించింది: నిద్రపోలేదు, నవ్వలేకపోయాను, ఎలాంటి శాంతి లేదు. మన సంఘములో సువార్త కూటములు జరుగుతున్నాయి వాటిని పరిహసించాను నేను పూర్తిగా నా సంఘ కాపరిని నా తండ్రిని అగౌరవ పరచేవాడిని. జాన్ కాగన్ వలే నీవు ఒక నశించు పాపివి. జాన్ కు చెప్పింది నీకు కూడ చెప్పగలను ప్రసంగము ముగిసిన తరువాత ఆయన రక్షింపబడ్డాడు, "నీవు పాపిని. నీవు నశించి పోయావు. యేసు తప్ప ఎవరు నిన్ను రక్షింప లేదు. అందుకే ఆయన నీ పాప పరిహారార్ధం సిలువపై మరణించాడు – ఆయన రక్తముతో దానినంతటికి కడిగేస్తాడు. మనం పాడుచుండగా, మీ స్థలాలలో నుండి లేచి ఇక్కడకు రండి! 'నేను నశించిపోయాను! ఓ, యేసు, మీరు సిలువపై చిందించిన రక్తముతో నా పాపములు కడిగివేయండి!' మేము 'సిలువ చెంత పాటలోని మొదటి చరణము పాడుచుండగా ఇక్కడకు రండి'". జాన్ కాగన్ రక్షింప బడినప్పుడు ఈ ఆహ్వానము పాటనే పాడాము. మీలో చాలామంది ఇది తెలుసు. పాడండి. వారు పాడుచుండగా, ఇక్కడ బలిపీఠము దగ్గరకు వచ్చి యేసును విశ్వసించండి. యేసు, సిలువకు దగ్గరగా ఉంచు, ఒక ప్రశస్త ప్రవాహము ఉంది ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము యారోన్ యాన్సీ: రోమా 10:9-14. |
ద అవుట్ లైన్ ఆఫ్ ఒక యవ్వన సువార్తికుని మార్పులో FIVE SERMONS USED IN THE CONVERSION డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే "ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు?" (రోమా 10:14). I. మొదటిది, "రక్షణ నుండి దూరంగా ఉందని వారి కొరకు ప్రోత్సాహము" (జూన్ 7, 2009 ఆదివారము ఉదయము, బోధింపబడినది). మార్కు 12:34. II. రెండవది, "ఆధునిక కాల్విన్ సిద్ధాంతము మరియు నిజమైన మార్పు" (జూన్ 7, 2009 ఆదివారము సాయంకాలము, బోధించబడింది). II కొరింధీయులకు 5:17. III. మూడవది, "ప్రార్ధన ఉపవాసము ద్వారా మాత్రమే" (జూన్ 14, 2009 ఆదివారము ఉదయము, బోధింప బడినది). మార్కు 9:29. IV. నాల్గవది, "మనస్సాక్షి మరియు మార్పు" (జూన్ 14, 2009 ఆదివారము సాయంకాలము, బోధింపబడినది). రోమా 2:15; I తిమోతి 4:2; యోహాను 3:18; హెబ్రీయులకు 9:14. V. ఐదవది, "ఎండిన ఎముకల లోయ" (జాన్ కాగన్ మారిన ఉదయ సమయాన్న నేను దీనిని బోధించాను, జూన్ 21, 2009), యెహెఙ్కేలు 37:5; యోనా 2:9. |