Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అమెరికా మరియు పాశ్చాత్య దేశాల సంఘాలు ఉజ్జీవము అనుభవించకపోవడానికి గల రెండు కారణాలు

THE TWO REASONS WHY THE CHURCHES IN AMERICA
AND THE WEST DON’T EXPERIENCE REVIVAL
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
గురువారము సాయంకాలము, సెప్టెంబర్ 25, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, September 25, 2016


ఈ సాయంకాలము అమెరికా మరియు పాశ్చాత్య దేశాల సంఘాలు ఉజ్జీవము అనుభవించకపోవడానికి గల రెండు కారణాలు మీతో చెప్తాను. "ఉజ్జీవము" అంటే నా అర్ధము 18 వ 19 వ శతాబ్దపు ఆరంభములో సంభవించిన శాస్త్రీయ ఉజ్జీవము. 20 వ శతాబ్దపు నూతన సువార్తికులు పెంతేకోస్తులు మరియు మనము జీవిస్తున్న 21 వ శతాబ్దపు మొదటి భాగములోని "ఉజ్జీవము"ను గూర్చి, నేను మాట్లాడడం లేదు.

దయచేసి మీ బైబిలులో II తిమోతి 3:1 చూడండి (అది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1280 వ పేజీలో ఉంది). ఆ అధ్యాయము మొదటి 7 వచనములు నాతో పాటు చదవండి.

"అంత్య దినములలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు; పైకి భక్తి గలవారి వాలే ఉండియు, రాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు: ఇట్టి వారికి విముఖడవై యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశలు వలన నడిపించబడి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైనా అనుభజ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.” (II తిమోతి 3:1-7).

ఇప్పుడు 13వ వచనము చదవండి.

"అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచు, తమ్మును మోసపోవుచు, అంతకంతకు చెడిపోవుదురు"
        (II తిమోతి 3:13).

"ఆఖరి దినాలలో" ఉన్న సంఘములోని స్వధర్మతనూ గూర్చి ఈ వచనాలు చెప్తున్నాయి (3:1). వచనాలు 2 నుండి 4 మన దినాలలో "క్రైస్తవుల" స్థితిని గూర్చి వివరిస్తున్నాయి. ఈ అబద్ధపు "క్రైస్తవులు" క్రూరంగా తిరుగుబాటుతనంతో ఉండడానికి కారణము 5 వ వచనము చెప్తుంది,

"పైకి భక్తి గల వారి వలే ఉండియు, దాని శక్తిని ఆశ్రయింపని వారు"
         (II తిమోతి 3:5).

ఈ వచనాన్ని వివరించే ముందు, ఈ పాఠ్యభాగాన్ని గూర్చి డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ గారు చెప్పిన విషయాలు చెప్తాను. 1 వ వచనములోని "అంత్యదినములు" ను గూర్చి డాక్టర్ మెక్ గీ అన్నారు, "'అంత్యదినములు' అనేది ఒక సాంకేతిక పదము... సంఘము [కు] యొక్క అంత్య దినాలను గూర్చి." 1 నుండి 4 వచనము వరకు మెక్ గీ అన్నారు, "పంతొమ్మిది వేరు వేరు వివరణలు ఇవ్వబడ్డాయి... ఇది అందములేని [గుంపు]...సంఘపు అంత్య దినముల [లో] జరుగబోయేవి శ్రేష్ఠమైన చిత్రముగా చూపబడ్డాయి" (J. Vernon McGee, Th.D., Thru the Bible, notes on II Timothy, chapter 3). తరువాత డాక్టర్ మెక్ గీ 5 వచనము వివరించారు, "పైకి భక్తి గలవారై ఉండియు, దాని శక్తిని ఆశ్రయింపని వారు..." డాక్టర్ మెక్ గీ అన్నారు, "పైకి భక్తిగలవారై ఉండియు, దాని శక్తిని ఆశ్రయింపని వారు! వారు మత ఆచారాల ద్వారా వెళ్తారు కానీ జీవము వాస్తవ్యం లేవు" (ఐబిఐడి.). ఈ "క్రైస్తవులు" అని పిలువబడేవారు "పైకి భక్తిగలవారు" గా ఉన్నారు – అంటే, బాహ్యంగా ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయింపరు. దీని అర్ధము వారు ఎన్నడూ నిజంగా దేవుని శక్తితో క్రీస్తు రక్తము ద్వారా మార్చబడలేదు. ఈనాటి అనేక సువార్తికులు విషయంలో 7 వ వచనము వాస్తవమే చెప్తుంది. వారు "ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, సత్య జ్ఞానము పొందుకోరు." అలాంటి వారు కొందరు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు!

వారు దశాబ్దాలుగా బైబిలు చదువుతారు, కానీ మారలేదు. డాక్టర్ చార్లెస్ సి. రైరీ అన్నాడు దాని అర్ధము, "వారు [అందరు] క్రీస్తు రక్షణ అనుభవములోనికి ఎన్నడూ రాలేకపోయారు" (రైరీ పఠన బైబిలు; 7 వచనముపై గమనిక). లక్షలాది మంది సువార్తికులు ఈ స్థితిలో ఉన్నారు. మారుమారని వారు, సహజ మనుష్యులు. I కొరింధీయులకు 2:14 వారిని ఇలా వివరిస్తుంది, "సహజ [మారని] వ్యక్తి దేవుని ఆత్మా విషయాలు పొందుకోలేదు...వాటిని గ్రహించలేదు, ఎందుకంటే అవి ఆత్మీయంగా మరుగుగా ఉన్నాయి." ఇప్పుడు నేను అమెరికా మరియు పాశ్చాత్య దేశాలలో గత 140 సంవత్సరాలుగా ఎందుకు గొప్ప ఉజ్జీవము లేదో రెండు కారణాలు ఇస్తాను.

I. మొదటిది, గత 140 సంవత్సరాలుగా గొప్ప ఉజ్జీవము ఎందుకు లేదంటే మనము నశించు ప్రజలకు మాత్రమే బాప్తిస్మము ఇస్తున్నాము!

లక్షలాది మంది సువార్తికులు మారలేదు ఎందుకంటే చార్లెస్ జి. ఫిన్నీచే సంఘాలలోనికి తేబడిన "నిర్ణయంత్వత" చే వారు మోసపోబడ్డారు. అతని బోధలు సంఘాలకు బలంగా వచ్చాయి లక్షలాది మంది అనుకున్నారు వారు రక్షింపబడ్డారని "నిర్ణయము తీసుకోవడం" ద్వారా, "పాపి ప్రార్ధన" చెప్పడం ద్వారా, లేక బైబిలులో ఒక వచనము నమ్మడం ద్వారా. వారు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మారలేదు. దేవుని ఆత్మ మొదటి పని పాపికి పాపపు ఒప్పుకోలు కలిగించడం. యోహాను 16:8, 9 చెప్తున్నాయి, "[పరిశుద్ధాత్మ] వచ్చినప్పుడు, లోకానికి పాపపు [ఒప్పుకోలు] కలిగిస్తుంది... పాపమును గూర్చి, ఎందుకంటే వారు నన్ను నమ్మలేదు." నశించు వ్యక్తి లోతైన పాపపు ఒప్పుకోలు పొందుకోకపోతే, క్రీస్తు నిజ అవసరత చూడడం, ఆయన సిలువ త్యాగము చూడడు, క్రీస్తు రక్తముచే కడగబడే అవసరత గమనించుడు. చాలా సార్లు మేము రక్షింపబడాలనుకుంటున్నాము అని అంటుంటారు, కానీ వారికి పాపపు ఒప్పుకోలు ఉండదు, క్రీస్తును విశ్వసించలేరు.

పరిశుద్ధాత్మ రెండవ పని క్రీస్తును మహిమ పరచుట. యేసు అన్నాడు, "ఆయన [నావాటిలోనివి తీసుకొని] మీకు తెలియ చేయును, గనుక నన్ను మహిమ పరచును:" (యోహాను 16:14), లేక యోహాను 15:26 లో యేసు చెప్పినట్టు, పరిశుద్ధాత్మ "నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును." పాపపు ఒప్పుకోలు పొందుకున్నాక, పరిశుద్ధాత్మ అప్పుడు, అప్పుడు మాత్రమే, పాపికి చూపిస్తుంది యేసు మాత్రమే తన పాపమును క్షమించగలడని. మార్పిడిలో చివరి పని దేవుడు పాపిని క్రీస్తు నొద్దకు చేర్చుతాడు. యేసు అన్నాడు, "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు..." (యోహాను 6:44). "నేను క్రీస్తు నొద్దకు ఎలా రాగలను?" అనే వ్యక్తికి అర్ధం కాదు, తనకు ముందు పాపపు ఒప్పుకోలు ఉండాలని, పాపమూ నుండి రక్షణకు క్రీస్తు మాత్రమే నిరీక్షణ అని, తరువాత క్రీస్తు దరికి చేరాలని. రక్షణ కార్యము అంతా దేవుని శక్తిలో ఉంది. శిష్యులు యేసుని అడిగారు, "ఎవరు రక్షింపబడగలరు?" యేసు జవాబిచ్చాడు, "అది మనుష్యులకు అసాధ్యమే కానీ, దేవునికి సమస్తము సాధ్యము" (మార్కు 10:26, 27).

శాస్త్రీయ ప్రొటెస్టెంట్ మార్పులలో, మొదట జరిగేది లోతైన పాపపు ఒప్పుకోలు అది రక్షణకు దారి తీస్తుంది. అప్పుడు పాపి క్రీస్తే తన నిరీక్షణ అని చూస్తాడు, క్రీస్తు నొద్దకు వస్తాడు, దేవుడు అతనిని రక్షకుని దగ్గరకు చేరుస్తాడు. కానీ ఇదంతా ఆధునిక "నిర్ణయతత్వులు" తిరస్కరిస్తారు. ఈనాడు మాటల ప్రార్ధన చెయ్యడం, ముందుకు రావడం. మానవుని ఆత్మలో దేవుని పనిని పూర్తిగా త్రోసి పుచ్చుతున్నారు. ఉజ్జీవము లేకపోవడానికి ఇది మొదటి కారణము.

జాన్ కాగన్ మన సంఘములో యవ్వనస్తుడు పరిచర్యకు వెళ్లాలనుకుంటున్నాడు. 15 వ సంవత్సరంలో అతడు మారాడు. రెండు కారణాలను బట్టి అతని పూర్తి సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. మొదటిది, అతనిది పరిపూర్ణ "పాత పాఠశాల" మార్పిడి అది ఫిన్నీ మార్పిడిని ఒక నిర్ణయముగా మార్చకముందు చోటు చేసుకుంది, ఇది ఈనాడు ఎంతో అవసరము. మరియు, రెండవది, ఒక కళాశాల విద్యార్థి రెండు సంవత్సరాలుగా క్రీస్తును ఎదిరించుచున్నవాడు ఆ సాక్ష్యమునే చదివిన తరువాత విని గత శనివారం మార్పు నొందాడు. కొన్ని సాక్ష్యాలు మాత్రమే ఎవరినైనా మార్చగలుగుతాయి. ఇది జాన్ కాగన్ రక్షణ సాక్ష్యము.

      నా మార్పు సమయాన్ని ఎంతో స్పష్టంగా సన్నిహితంగా జ్ఞాపక ముంచుకున్నాను పదాలతో వివరించలేను క్రీస్తు నాలో తెచ్చిన మార్పు గోరుతనాన్ని. మార్పు ముందు నాకు కోపము ద్వేషం ఉండేవి. నా పాపలతో గర్వించే వాడిని ఇతరులను బాధిస్తూ ఆనందించే వాడిని, దేవుని ద్వేషించే వారితో కలిసి ఉండేవాడిని; నాకు పాపమూ అంటే "తప్పు" కాదు బాధపడేది కాదు. బుద్ధి పూర్వకంగా ఈ మార్గము ఎంచుకున్నాను. చాలా విధాలుగా దేవుడు నాలో పనిచేయ ఆరంభించాడు నా చుట్టూ ఉన్న ప్రపంచము ప్రారంభించింది. మార్పుకు కొన్ని వారాల ముందు చనిపోవాలనిపించింది: నిద్రపోలేదు, నవ్వలేను, సమాధానము లేకుండా పోయింది. మా సంఘములో సువార్త కూటాలు జరుగుతున్నాయి వారిని వెక్కిరించే వాడిని నా కాపరిని తండ్రి పూర్తిగా అగౌరవపరిచే వాడిని.
      పరిశుద్ధాత్మ తప్పకుండా నాలో ఆ సమయంలో పాపపు ఒప్పుకోలు కలిగిస్తుంది, కానీ బుద్ధి పూర్వకంగా దేవుని గూర్చిన మార్పును గూర్చిన తలంపులను తిరస్కరించాను. దాని గూర్చి ఆలోచించడానికి నిరాకరించాను, చిత్ర హింసల అనిపించింది. 2009 జూన్ 21 వ తేదీ, ఆదివారము ఉదయము, నేను పూర్తిగా అలసిపోయాను. పూర్తిగా వ్యసనమయ్యాను. నన్ను నేను ద్వేషించుకోవడం ప్రారంభించాను, నా పాపాన్ని అది నన్ను ఎలా చేసిందో దానిని.
      డాక్టర్ హైమర్స్ బోధిస్తున్నప్పుడు, నా గర్వము దానిని తిరస్కరించేలా చేస్తుంది, వినకుండా చేస్తుంది, ఆయన బోధిస్తుండగా నేను నిజంగా నా ఆత్మపైనున్న పాపాన్ని అనుభవించాను. ప్రసంగము ఎప్పుడవుతుందా అని క్షణాలు లెక్కపెడతున్నాను, కానీ కాపరి బోధిస్తూనే ఉన్నాడు, నా పాపములు నిరంతరంగా భయంకరమవుతున్నాయి. వాటిని ఎదుర్కోలేను, నేను రక్షింపబడాల్సిందే! ఆహ్వానము ఇవ్వబడినప్పుడు నేను తిరస్కరిస్తున్నాను, కానీ తట్టుకోలేకపోయాను. నాకు తెలుసు నేను భయంకర పాపినని దేవుడు నీతిమంతుడుగా నాకు నరక శిక్ష ఇస్తాడని. పోరాటంతో అలసిపోయాను, అంతటిలో అలసిపోయాను. కాపరి నన్ను ధైర్య పరిచారు, క్రీస్తు నొద్దకు రమ్మని చెప్పారు, కానీ నేను రాలేదు. పాపమూ నన్ను ఒప్పించినప్పటికినీ యేసును పొందుకోలేదు. ఈ క్షణాలు భయంకరం రక్షింప బడలేను నరకానికి పోవలసిందే అనుకున్నాను. నేను రక్షింపబడడానికి "ప్రయత్నిస్తున్నాను," క్రీస్తును నమ్మడానికి "ప్రయత్నిస్తున్నాను" కానీ చేయలేకపోతున్నాను, క్రీస్తుకు అర్పించుకోలేక పోతున్నాను, క్రైస్తవునిగా అవడానికి నిర్ణయించుకోలేక పోతున్నాను, అది నన్ను నిరీక్షణ లేనివానిగా చేసింది. నా పాపమూ నన్ను నరకములోనికి నెట్టుతున్నట్టు అనిపించింది అయినను నా మొండితనం కన్నీరు రాకుండా చేస్తుంది. ఈ సంఘర్షణలో నేను ఇరుక్కు పోయాను.
      అకస్మాత్తుగా కొన్ని సంవత్సరాల క్రిందట బోధింపబడిన ప్రసంగములోని మాటలు నా మనసులోకి వచ్చాయి: "క్రీసుకు అర్పించుకో! క్రీస్తుకు అర్పించుకో!" యేసును వదిలి పెట్టాలి అనే తలంపు నన్ను బాధించింది కానీ అలా చెయ్యలేదు. యేసు తన ప్రాణాన్ని నా కొరకు ఇచ్చాడు. నిజమైన యేసు నేను ఆయన శత్రువుగా ఉన్నప్పుడు ఆయనకు లోబడనప్పుడు నా కొరకు సిలువ వేయబడ్డాడు. ఈ తలంపు నన్ను విరిచింది; అంతా వదిలించుకొన్నాను. నన్ను నేను పట్టుకొని ఉండతలచుకోలేదు, నాకు యేసు కావలసి వచ్చింది! ఆ క్షణంలో ఆయనకు అర్పించుకున్నాను విశ్వాసము ద్వారా యేసు నొద్దకు వచ్చాను. ఆ క్షణంలో చనిపోవాలేమో అనిపించింది, అప్పుడు క్రీస్తు నాకు జీవితాన్ని ఇచ్చాడు! నా మనసు తలంపు క్రియ కాదు నా హృదయము, క్రీస్తుపై అనుకొనుట ద్వారా, ఆయన నన్ను రక్షించాడు! ఆయన రక్తములో నా పాపమూ కడిగేసాడు! అదే క్షణంలో, క్రీస్తును ఎదిరించడం ఆపేసాను. నాకు తేటగా తెలిసింది నేను ఆయనను నమ్మాలి అంతే; నేను గుర్తించాను నేను కాదు క్రీస్తే నాలో ఉన్నాడని లోబడ్డాను. నేను పరిమితుడయ్యాను! ఆ సమయంలో భౌతిక భావన లేదు వెలుగు లేదు, భావన అవసరము రాలేదు, క్రీస్తు నాలో ఉన్నాడు! అయినను క్రీస్తును విశ్వసించినప్పుడు పాపము నా మనసు నుండి పోయినట్టు అనిపించింది. నా పాపము నుండి తిరిగాను, యేసు వైపే చూసాను! యేసు నన్ను రక్షించాడు.
      యేసు నన్నెంత గానో ప్రేమించాడు అర్హతలేని పాపినైనా నన్ను క్షమించాడు నేను మంచి సంఘములో ఎదిగాను అయినను ఆయనకు వ్యతిరేకంగా తిరిగాను! నా మార్పును వర్ణించడానికి పదాలు చాలవు క్రీస్తు పట్ల నాకున్న ప్రేమను చెప్పలేను. క్రీస్తు ఆయన జీవితాన్ని నాకు ఇచ్చాడు బదులుగా అంతా ఆయనకు ఇచ్చుకున్నాను. యేసు తన సింహాసనాన్ని సిలువ కొరకు త్యాగము చేసాడు నా కొరకు నేను గుడిపై ఉమ్మి వేసాను ఆయన రక్షణను ఎగతాళి చేసాను; నేనెలా ఆయన ప్రేమను కృపను పూర్తిగా ప్రకటించగలను? యేసు నా ద్వేషాన్ని కోపాలన్నీ తీసివేసాడు బదులుగా ప్రేమనిచ్చాడు. నూతన ప్రారంభము కంటే ఎక్కువే ఇచ్చాడు –నూతన జీవాన్ని ఇచ్చాడు. విశ్వసము ద్వారా నేను నమ్మాను యేసు నా పాపాలన్నీ కడిగేశాడని రుజువు లేకుండా ఎలా తెలుసుకోగలను, నేను నాతో చెప్పుకున్నాను, "విశ్వాసము అదృశ్యమైన వాటి నిజ స్వరూపము" నాతో శాంతి ఉంది జాగ్రత్తగా ఆలోచించక యేసుపై విశ్వాసము ఉంచాను. యేసు మాత్రమే నాకు జవాబు.
      నాకిచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనస్థుడను, నాకిచ్చిన అవకాశాలను బట్టి, ఆయన కుమారుని యొద్దకు చేర్చినందుకు ఎందుకంటే నాకు నేనుగా క్రీస్తు నొద్దకు వచ్చి ఉండేవాడిని కాదు. ఇవి మాటలు మాత్రమే, నావిశ్వసము యేసు నందుంది, ఆయన నన్ను మార్చాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడు, నా విమోచకుడు, నా విశ్రాంతి, నా రక్షకుడు. ఆయన నాపై చూపిన ప్రేమతో పోలిస్తే ఆయన పట్ల నా ప్రేమ చాలా తక్కువ. నేను ఆయన కొరకు బ్రతకలేను యదార్ధంగా, క్రీస్తు కొరకు ఎక్కువ చెయ్యలేను. యేసును సేవించుట నాకు సంతోషము! ఆయన నాకు జీవము సమాధానము ఇచ్చాడు నాకు ద్వేషమేక్కటే తెలిసినప్పుడు. యేసు నా ఆశ నా దిశా. నన్ను నేను నమ్ముకోను, ఆయనలోనే నా నిరీక్షణ ఉంచుతాను, ఎందుకంటే ఆయన నన్ను విఫలని చెయ్యడు. క్రీస్తు నా దగ్గరకు వచ్చాడు, కనుక నేను ఆయనను విడిచి పెట్టాను.

ఈ మాటలు జాన్ సామ్యూల్ కాగన్ తన 15 వ ఏటా పలికాడు. ఇప్పుడు పరిచర్యకు వెళ్లాలనుకుంటున్నాడు. జాన్ కాగన్ కు జరిగింది నిజ మార్పిడిలో జరుగుతుంది! దేవుడు జానుకు చేసింది మీకు కూడ చెయ్యాలి!

ఈనాటి బోధకులు అయితే అతనిని ఒక ప్రార్ధన చేపించి, బాప్తిస్మము ఇచ్చి – మన సంఘములో నశించే లక్షలాది మందిలో ఒకనిగా చేసి ఉండేవారు! మనకు ఉజ్జీవము లేకపోవడానికి కారణము బోధకులు దేవుని పాపి హృదయంలో పనిచేయనివ్వరు. వారు దేవుని కార్యము నుండి పాపిని లాక్కొని వెళ్లి నశించడానికి బాప్తిస్మమిస్తారు! నేను నమ్ముతాను ఈనాటి బాప్తీస్మాలన్ని నశించు ప్రజల బాప్తీస్మాలే. ఉజ్జీవము లేకపోవడానికి ఇది మొదటి కారణము! వాస్తవంగా నిజ మార్పు లేకుండా ప్రతి ఒక్కరు రక్షింప బడ్డారని ప్రకటించి బాప్తిస్మము ఇస్తున్నారు! ఆ పాపము నేను కూడ చేసేవాడినని ఒప్పుకుంటున్నాను. దేవా, నన్ను క్షమించు. ఇంకెందుకు దేవుడు గత 140 సంవత్సరాలుగా ఉజ్జీవము రాకుండా ఆపేస్తున్నాడు? ఇంకెందుకు? ఇంకొక కారణము ఉంది!

II. రెండవది, గత 140 సంవత్సరాలుగా ఉజ్జీవము లేదు ఎందుకంటే క్రైస్తవులు వారి పాపాలను ఒప్పుకొని యేసు రక్తములో కడుగబడుట కంటే పరిశుద్ధాత్మను ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నాం.

ఇది నాకు ముందే తెలుసు. ఈ మధ్యే తేటగా తెలిసింది. నేను మూడు ఉజ్జీవాలకు ప్రత్యక్ష సాక్షిని. మొదటిది చాలా శక్తి వంతమైనది – అది ఆత్మ "బాప్తిస్మము" భాషలు, నాలుకలు, స్వస్థతలు, లేక అద్భుతాల మీద ఆధార పడలేదు. అది పూర్తిగా క్రెస్తవులు వారి పాపాలు ఒప్పుకోవడం క్రీస్తు రక్తముచే కడగబడడంపై ఆధార పడింది.

ఈనాడు మన సంఘాలలో, నిజంగా మార్పు నొందిన వారు ఇంకను పాపాలను పట్టుకొని ఉన్నారు – హృదయ పాపములు, మనసు పాపములు, శారీరక పాపములు. మొదటి ఉజ్జీవములో సంఘమంతా బలిపీఠము దగ్గర, దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకోవడం, యేసు రక్తము ద్వారా వారికి దేవుడు సమాధానము ఇచ్చే వరకు కన్నీటితో ఏడవడం నేను చూసాను. అపొస్తలుడైన యోహాను అన్నాడు,

"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును, నీతి మంతుడును కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:9).

దేవుడు ఎలా క్రైస్తవుల పాపాలు కడుగుతాడు? "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము సమస్త పాపము నుండి మనలను శుద్ధి చేయును" (I యోహాను 1:7).

మొదటిది, అన్ని పాపాలు, లోపల బయట ఒప్పుకోవాలి. రెండవది, యేసు రక్తము ద్వారా మన పాపాలు కడుగబడడం. సులభమే కదా, అనిపిస్తుంది కదా? అయినను ఎన్ని సంఘాలు ఈనాడు దానిని ఒక్కనిస్తున్నాయి? అలా చేస్తాయి అనుకోను. ఇది రెండవ కారణము గత 140 సంవత్సరాలుగా ఉజ్జీవము లేకపోవడానికి!

బ్రయాన్ ఎడ్వార్డ్స్ మాటలు వినండి, అతడు నిజమైన ఉజ్జీవముపై గొప్ప పఠనచేసాడు. అతనన్నాడు,

ఉజ్జీవము... భయంకర పాపపు ఒప్పుకోలుతో మొదలవుతుంది. ఈ ఒప్పుకోలు తరుచు ఉజ్జీవమును గూర్చి చదివిన వారిని కలవర పరుస్తుంది. కొన్నిసార్లు ఆ అనుభవము అణిచి వేస్తుంది. ప్రజలు అదుపులేకుండా ఏడుస్తారు, భయంకరంగా! కానీ అలాంటి [నిజ] ఉజ్జీవము లేదు ఒప్పుకోలు విచారము కన్నీళ్లు లేకుండా (Edwards, Revival, Evangelical Press, 2004, p. 115).

లోతైన, అసౌకర్య తగ్గింపుతో కూడిన పాపపు ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము అనేది లేదు. (ఎడ్వార్డ్స్, ఐబిఐడి., పేజీ 116).

నేను చూసిన మొదటి ఉజ్జీవము కొందరి క్రైస్తవుల ఏడ్పు పాపపు ఒప్పుకోలుతో ఆరంభమవుతుంది. వెంటనే సంఘమంతా గంటల తరబడి ఏడుస్తూ, పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, కొందరు మెల్లని నిట్టూర్పుతో. అంతే. భాషలు లేవు. ఆత్మ నింపుదల లేదు. స్వస్థతలు లేవు. ఆత్మలో కృంగుబాటు లేదు. కేవలము ఒప్పుకోలు, ఏడ్పు, ప్రార్ధనలు, మెల్లని గానము. గంటల తరబడి అలా జరిగింది.

ఒకటి రెండు రోజులు ఆగుతుంది – మళ్ళీ ఆత్మ వస్తుడ్ని – అలా విరామములతో మూడు సంవత్సరాలు పాటు. ఉజ్జీవము ముగిసేసరికి 3,000 మందికి పైగా సంఘములో చేర్చబడ్డారు, ఆసంఘము 150 మందితో ఆరంభమయింది. వారు నాలుగు ఆరాధనలు జరిపే వారు, ఒకదాని బదులు, ప్రతి ఆదివారము ఉదయము, మరి రెండు ఆరాధనలు ఆదివారము రాత్రి.

మనం ఉజ్జీవము కొరకు ఎక్కువ మంది గుడులలోనికి రావడానికి ప్రార్ధించాలి అనే దానిని నేను నమ్మను. శుద్ధమైన సంఘము ఉండడం నిజమైన ఉద్దేశము! మనము శుద్ధమైన సంఘము కలిగియుండాలి!

గొప్ప సభలు జరిగేవి. క్రైస్తవ టివి కార్యక్రమాలు జరిగేవి. స్వస్థత ఆరాధనలు జరిగేవి. భాషలు ఇతర అనుభవాలు గల సంఘాలు చూసాము. కానీ అమెరికాలో గత 140 సంవత్సరాలుగా శాస్త్రీయ, చారిత్రాత్మక ఉజ్జీవము చూడలేదు! వేరే విషయాలతో దారి మల్లింపబడ్డాం. క్రైస్తవులు పరిశుద్ధాత్మచే పాపపు ఒప్పుకోలు పొందుకోడానికి అనుమతించలేదు. ఆయన ప్రశస్త, పరిశుద్ధ రక్తముతో యేసు మన పాపాలు కడిగేటట్టు మనము మోర పెట్టలేదు!

మన సంఘములో ఉజ్జీవపు "తాకిడి" పొందాము. 4 రాత్రుల కూటాలలో 11 మంది మార్పు చెందారు, నిపుణుడైన డాక్టర్ కాగన్ తో, రెండుసార్లు సరి చూసుకున్నాను. ఆ 11 మంది మారారని ఆయన చెప్పాడు. 8 మంది క్రైస్తవులు వారి పాపాలు ఒప్పుకొని ప్రతి రాత్రి కన్నీతో ప్రార్ధించారు. 41 సంవత్సరాలలో అలాంటి కూటాలు ఎప్పుడు జరగలేదు, మన సంఘ ఆరంభమవుతుంది.

కానీ నేను పాపము చేసాను. డాక్టర్ కాగన్ నాతో చెప్పాడు దానిని "పాపము" అనవద్దని. కానీ నేను పాపము చేసాను అనుకుంటున్నాను, మనకు ఉజ్జీవము వచ్చిందని నేను బాగా గర్విష్టుడనయ్యాను! ఉజ్జీవము ప్రారంభమయింది అంతే. నేను ఒప్పుకోలు యేసు రక్తముపై బోధించడం ఆపేసాను. ఎవరికో కూటము అప్పగించాను, ఒక్కాణింపు యేసుకు బదులు పరిశుద్ధాత్మకు వెళ్ళింది. యేసు పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడాడు అని నేను జ్ఞాపకముంచుకోవలసింది, "అతడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును" (యోహాను 15:26). వేరే వారు వచ్చి పరిశుద్ధాత్మను గూర్చి బోధించేటట్టు చేయకుండా ఉండాల్సింది. అవి నా పాపాలు. గర్వము అనే పాపము ఊహాగానపు పాపము. ఈ రాత్రి వాటిని మీముందు ఒప్పుకుంటున్నాను. గర్వము అనే పాపము ఊహాగానపు పాపము. దయచేసి, ప్రతి ఒక్కరు, దేవుడు నన్ను క్షమించేటట్టు ప్రార్ధించండి నేను యేసును నిర్లక్ష్యము చేసినందుకు (వారు ప్రార్ధించారు). ఇప్పుడు దయచేసి ప్రార్ధించండి దేవుడు తిరిగి మన దగ్గరకు వచ్చునట్లు, మొదటి ఉజ్జీవములో నేను చూచినట్టు. దేవుని సన్నిధి తిరిగి మన మధ్యకు వచ్చునట్లు ప్రార్ధించండి. కన్నీటితో ప్రార్ధించండి, చైనాలో చేసినట్టు (వారు ప్రార్ధించారు). దయచేసి నిలబడి పాడండి, "హల్లెలూయా, ఎలాంటి రక్షకుడు." ఇప్పుడు పాడండి "సజీవుడైన దేవుని ఆత్మ." ఇప్పుడు పాడండి "నన్ను పరిశోదించు, ఓ దేవా." ఇప్పుడు పాడండి "నా దృష్టి అంతటిని నింపు" పాటలోని మొదటి ఆఖరి వచనాలు. కుమారి గుయోన్, దేవుడు తిరిగి దిగివచ్చునట్లు ప్రార్ధించు. ఇక్కడ చాలా మంది నశించి పోయిన వారు వెనుతిరిగిన వారు ఉన్నారు. వారి కొరకు దేవుడు దిగివచ్చునట్లు ప్రార్ధించండి.

ఉజ్జీవము తిరిగి మీ దగ్గరకు రావాలని ప్రార్ధించాలనుకున్నవారు, లేచి నిలబడి దేవుడు తిరిగి దిగివచ్చునట్లు ప్రార్ధించండి. చైనాలో ప్రార్ధించినట్టు చేయండి. పాపాలు ఒప్పుకోవాలనుకులనుకునే వారు, బలిపీఠము దగ్గరకు రండి. యేసు రక్తములో కడుగబడాలనుకునేవారు, ఇక్కడకు వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి. యేసుచే రక్షింపబడాలనుకునే వారు, మీరు కూడా రండి. దక్షిణ బాప్టిస్టు సామాన్యుడు నశించు వ్యక్తిగా 25 సంవత్సరాలు మన గుడికి హాజరు అయినవాడు, అతడు వచ్చి నిజమైన మార్పు అనుభవంతో యేసును విశ్వసించాడు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము యారోన్ యాన్సీ: II తిమోతి 3:1-5.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే: "బాగా ముందుకు"
(డబ్ల్యు. బి. స్టీవెన్స్ చే, 1862-1940; బార్నీ ఇ. వారిన్ చే క్రమపరచబడి మార్చబడినది, 1867-1951).
      (by W. B. Stevens, 1862-1940; arranged and altered by Barney E. Warren, 1867-1951).



ద అవుట్ లైన్ ఆఫ్

అమెరికా మరియు పాశ్చాత్య దేశాల సంఘాలు ఉజ్జీవము
అనుభవించకపోవడానికి గల రెండు కారణాలు

THE TWO REASONS WHY THE CHURCHES IN AMERICA
AND THE WEST DON’T EXPERIENCE REVIVAL

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అంత్య దినములలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు; పైకి భక్తి గలవారి వాలే ఉండియు, రాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు: ఇట్టి వారికి విముఖడవై యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశలు వలన నడిపించబడి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైనా అనుభజ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని, అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.” (II తిమోతి 3:1-7).

(II తిమోతి 3:13, 5; I కొరిందీయులకు 2:14)

I.   మొదటిది, గత 140 సంవత్సరాలుగా గొప్ప ఉజ్జీవము ఎందుకు లేదంటే
మనము నశించు ప్రజలకు మాత్రమే బాప్తిస్మము ఇస్తున్నాము!
యోహాను 16:8, 9, 14; 15:26; 6:44; మార్కు 10:26, 27.

II.  రెండవది, గత 140 సంవత్సరాలుగా ఉజ్జీవము లేదు ఎందుకంటే
క్రైస్తవులు వారి పాపాలను ఒప్పుకొని యేసు రక్తములో కడుగబడుట
కంటే పరిశుద్ధాత్మను ఎక్కువగా నొక్కి వక్కాణిస్తున్నాం, I యోహాను 1:9, 7;
యోహాను 15:26.