Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవము కొరకు ప్రార్ధించుట

PRAYING FOR REVIVAL
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్
నందు ప్రభువు దినము సాయంకాలము, ఆగష్టు 19, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Friday Evening, August 19, 2016


దయచేసి అపోస్తలుల కార్యములు 1:8 తెరవండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1148 వ పేజిలో ఉంటుంది. నేను చదువుచుండగా దయచేసి నిలబడండి. మొదటి క్రైస్తవులకు క్రీస్తుచే ఇవ్వబడిన మాటలివి,

"అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, మీరు శక్తి నొందు దురు: కనుక మీరు యేరూష లేము లోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూది గంతముల వరకును, నాకు సాక్ష్యులై యుందురని వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 1:8).

కూర్చోండి.

కొందరు బోధకులంటారు ఇది పెంతేకోస్తూ దినాన పరిశుద్ధాత్మ క్రుమ్మరింపును గూర్చిన విషయమని. వారంటారు అప్పటిలో ఆయన చేసినట్టుగా పరిశుద్ధాత్మ మన కొరకు దిగిరావడం మనం ఎదురు చూడకూడదని. వారిలో చాలామంది భయపడతారు ఈనాడు కూడ పరిశుద్ధాత్మ క్రుమ్మరింపు ఉందని చెప్తే వారి వాళ్ళు పెంతేకోస్తులు అయిపోతారని భయము. కాబట్టి వారు ఒప్పుకోలు మార్పిడి పనులను అణగ ద్రోక్కుతున్నారు ఎందుకంటే వారు పెంతే కోస్తులత్వమును గూర్చి భయపడి. కాని వారిది తప్పు మన కాలములో పరిశుద్ధాత్మ దిగి రావడానికి మనం ఆశించకూడదని వారు చెప్తే. మన పాఠ్యభాగములోని ఆఖరి ఎనిమిది పదాలు వారు తప్పని చెప్తున్నాయి, "భూదిగంతముల వరకు." ఒక ఆధునిక తర్జుమా ఇలా చెప్తుంది, "ప్రపంచంలోని మారుమూలలు ప్రాంతాలకు కూడ." ఆది క్రైస్తవులు "భూది గంతములు" లేక "మారుమూలలు" ప్రాంతాలకు వెళ్ళలేరు కాబట్టి, యేసు అందరి క్రైస్తవులతోను, అన్ని సమయముల వారితోనూ మాట్లాడుచున్నాడు. ఆయన వారితో, మనతో చెప్తున్నాడు, "పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చునప్పుడు, మీరు శక్తి నొందెదరు." తరువాత అపోస్తలుల కార్యములు 2:39 లో, పేతురు చెప్పినది దీనిని రుజువు చేసింది. అది తెరవండి.

"ఈ వాగ్ధానము [పరిశుద్ధాత్మను గూర్చినది] మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికినీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి కందరికినీ చెందునని వారితో చెప్పెను" (అపోస్తలుల కార్యములు 2:39).

కనుక శిష్యులు యేరూషలేమునకు తిరిగి వచ్చి, ప్రార్ధించడానికి మేడ గదిలో ప్రవేశించారు. వారేమి ప్రార్దించారు? వారు పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి ప్రార్ధించారు అది యేసు వారికి వాగ్ధానము చేసాడు ఇలా చెప్తూ, "ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, మీరు శక్తి పొందెదరు" (అపోస్తలుల కార్యములు 1:8). నేను అయాన్ హెచ్. ముర్రేతో పూర్తిగా ఏకీభవిస్తాను. అతనన్నాడు,

పెంతేకోస్తూ నూతన శకములో పొందు పర్చబడినప్పుడు, ఆత్మను క్రుమ్మరించడంలో క్రీస్తు పని ఇంకా పూర్తికాలేదు. ఆత్మను గూర్చిన పూర్తి ఉచ్చారణ మొత్తము [క్రైస్తవ] తరాన్ని సూచించేది, పెంతేకోస్తూ నాడు ప్రారంభ మయింది, అది నిశ్చలంగా మారనిదిగా ఉండలేదు; కారణము, ఎక్కువ దేవుని ఆత్మ కొరకు పార్ధించడం ఏ ఉద్దేశాన్ని సఫల పరుస్తుంది శిష్యులు తేటగా ఆ విషయంలో నడిపింపబడ్డారు కదా? అది మనవికి జవాబు ‘ప్రార్ధించుట మాకు నేర్పుము’ యేసు చెప్పాడు: "కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య ఎరిగి యుండగా: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను" (లూకా 11:13). ఈ వాగ్ధానమునకు కొనసాగే అన్వయింపు లేదు క్రైస్తవులకు ఎక్కువ పొందుకునే అవసరము ఉంటే తప్ప (Iain H. Murray, Pentecost Today? The Biblical Understanding of Revival, The Banner of Truth Trust, 1998, p. 21).

అలెగ్జాండర్ మూడి స్టువర్ట్ అన్నాడు, "అతని సంఘములో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటూ ఉండగా, కొన్నిసార్లు ఆయన సమీపించి శక్తి యొక్క అధిక సమర్ధతను అనుగ్రహిస్తాడు" (ముర్రే, ఐబిఐడి., పేజి 22).

1859 లోని గొప్ప ఉజ్జీవము దగ్గర నుండి చాలా కొంచెము మాత్రమే చూసాము, నిజంగా చాలా తక్కువ. నేను ఒప్పింపబడ్డాను ముఖ్య కారణము చాలామంది సువర్తికులు మార్పిడిలు అద్బుతాలు అని నమ్మరు. ఈనాడు చాలామంది సువర్తికులు అనుకుంటారు మార్పులు మనవ నిర్ణయాలు మాత్రమేనని. వారనుకుంటారు మీరు చేయవలసినదంతా ఒక నశించు వ్యక్తిని వెదకి "పాపి ప్రార్ధన" అతనితో చెప్పించడమే. ఆ మాటలు పలికితే మీరు రక్షింపబడతారు! జోయిల్ ఓస్టీన్ ప్రతి ప్రసంగము తరువాత ఆ విషయాన్ని చెబుతాడు. ప్రార్ధన పలుకులు చెప్పేవారు అతని దగ్గర ఉన్నారు. అతనంటాడు, "మేము నమ్ముతాము మీరు ఈ మాటలు చెప్పితే మీరు తిరిగి జన్మించినట్టే." చూసారా, ఒక అద్భుతాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ అవసరత లేదు! మీరా మాటలు పలికితే "మీరు తిరిగి జన్మించినట్టే."

ప్రాచీన సిద్ధాంతము తిరిగి వస్తుంది – ఆ సిద్ధాంతము బోధిస్తుంది మానవుడు తన స్వంత రక్షణను తెచ్చుకోగలడని – ఈ విషయంలో, కొన్ని మాటలు చెప్పడం ద్వారా! లేక ఒక క్రైస్తవ కూటములో "ముందుకు" రావడం – లేదా చెయ్యి ఎత్తడం ద్వారా! "మీలో రక్షింపబడాలనుకున్న వారు, చెయ్యి ఎత్తండి." ఇది ముడి సిద్ధాంతము! ఈ పాత సిద్ధాంతము తిరిగి రావడం, అది నేర్పిస్తుంది ఒక నశించు వ్యక్తి ఒక క్రియ ద్వారా, లేక ప్రార్ధన పలుకులు చెప్పడం ద్వారా తనను రక్షించు కోవచ్చు అనేది. నేను దానిని "మాయ ప్రార్ధాన" అంటాను. నిజానికి క్రైస్తవుని కంటే "మాయ" ఎక్కువ మాయలో మీరు కొన్ని మాటలు చెప్తారు. కొన్ని క్రియలు చేస్తారు, ఆ మాటలు క్రియలు, అసాధారణ ఫలితాన్ని చూపిస్తాయి. "మాయ" తలంపులు మన ఆధునిక సువర్తికుల తలంపులు మార్పిడి విషయంలో కూడ అంతే! లోతైన పరిశోధన కొరకు డేవిడ్ మేల్ కొమ్ బెన్నేడ్ పుస్తకము చదవండి, పాపి ప్రార్ధన: దాని మూలములు ప్రమాదాలు, ఎవాన్ పబ్లిషింగ్ ఎన్.డి., అమెజాన్.కామ్ లో దొరుగుతాయి.

ప్రతి నిజ మార్పిడి ఒక అద్భుతము. దయచేసి మార్కు 10:26 చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1059 వ పేజిలో ఉంది.

"అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని, ఆయన నడిగిరి? యేసు వారిని చూచి ఇది మనష్యులకు అసాధ్యమే, కాని దేవునికి సమస్తమును సాధ్యమే అనెను..." (మార్కు 10:26, 27).

వారడిగారు, "ఎవరు రక్షింప బడగలరు?" యేసు జవాబిచ్చాడు, "ఇది మనుష్యులకు అసాధ్యము." పాపపు స్థితిలో ఉండి మానవుడు రక్షింప బడడానికి తనకు సహాయము చేసుకోవడానికి ఏమి చెయ్యలేడు! తరువాత యేసు అన్నాడు, "కాని దేవునికి అసాధ్యము కాదు: దేవునికి సమస్తమును సాధ్యమే." ఒక వ్యక్తీ రక్షణ దేవుని నుండి వచ్చు అద్భుతము! ఈ సంవత్సరము చాలా మార్పిడులు చూసాను, ఒకటి గతరాత్రి జరిగింది. ప్రతి నిజ మార్పిడి ఒక అద్భుతము. పాల్ కుక్ సరిగ్గా చెప్పాడు, "ఉజ్జీవము లోని లక్షణాలు పరిశుద్ధాత్మ కార్యములోని లక్షణాలకు వేరుగా లేవు తీవ్రత పరిమాణము విషయంలో తప్ప" (Fire From Heaven, EP Books, 2009, p. 117).

ఒక వ్యక్తీ మార్పు నొందితే అది దేవుని నుండి వచ్చు అద్భుతము. తక్కువ సమయంలో చాలామంది మార్పు నొందితే అది దేవుని నుండి వచ్చు అద్భుతము. తేడా ఏమిటంటే "తీవ్రత పరిమాణంలో మాత్రమే." మనం ఉజ్జీవమును గూర్చి ప్రార్ధించేటప్పుడు, చాలామంది హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యము జరగాలని ప్రార్ధిస్తున్నాము.

మార్పిడిలో పరిశుద్ధాత్మ ఏమి చేస్తుంది? మొదటిది, "ఆయన వచ్చునప్పుడు, ఆయన...పాపపు (ఒప్పుకోలు) కలిగిస్తాడు" (యోహాను 16:8). పాల్ కుక్ అన్నాడు, "ప్రజలు సహజంగా పాపపు ఒప్పుకోలు పొందరు; సహజంగా వారు సమర్ధించుకుంటారు. ఒక ప్రత్యేకమైన ఆత్మకార్యము జరగాలి. ఆత్మ పనిచేసినప్పుడు, పాపము [భయంకరము, దారుణము] అవుతుంది, అది ఆ వ్యక్తిని దానిని అసహ్యించుకునేలా విడిచి పెట్టేలా చేస్తుంది." ఒక అమ్మాయి చెప్పినట్టు, "నాతో నేను విసిగి పోయాను." ఒప్పుకోలుకు అది ఒక మంచి నిర్వచనము. "నాతో నేను విసిగి పోయాను." అలాంటి పాపపు ఒప్పుకోలు లేకపోతే, నీకు నిజమైన మార్పిడి ఉండదు. కనుక రక్షింపబడని వారికి పాపపు ఒప్పుకోలు ఇవ్వాలని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధించాలి.

పరిశుద్ధాత్మ చేసే రెండవ పని మార్పిడిలో పాపపు ఒప్పుకోలులో ఉన్న వ్యక్తికి క్రీస్తు తెలుప పర్చబడడం. యేసు అన్నాడు, "ఆయన నా వాటిలోనివి తీసుకొని, మీకు తెలియ చేయునుకనుక నన్ను మహిమ పరచును" (యోహాను 16:14). ఆధునిక తర్జుమా ఇలా అంటుంది, "ఆయన నాది తీసుకొని...మీకు బయలు పరుస్తాడు." పరిశుద్ధాత్మ అతనికి తెలియ పరచకుండా ఒక నశించు వ్యక్తీ ఎన్నడు క్రీస్తును ఎరుగలేడు. మీరు పాపపు ఒప్పుకోలు పొందకపోతే, పరిశుద్ధాత్మ రక్షణలో క్రీస్తును వాస్తవంగా మీకు చెయ్యలేడు.

కాబట్టి, శక్తితో పరిశుద్ధాత్మ దిగి రావాలని మనం ప్రార్దిస్తున్నప్పుడు, మనం ముఖ్యంగా దేవుని అడుగుతున్నాం ఆత్మను పంపమని (1) తన భయంకర పాపపు స్వభావాన్ని నశించు వ్యక్తి ఒప్పుకునేటట్టు చేయడం, (2) మనం ప్రార్ధించాలి పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి క్రీస్తును బయలు పరచేటట్టు, తద్వారా వాస్తవానికి తన పాపాన్ని కడగడానికి క్రీస్తు రక్తములో ఉన్న శక్తిని తను ఎరుగుతాడు. పాపపు ఒప్పుకోలు క్రీస్తు రక్తము ద్వారా కడుగబడుట ఈ రెండు నిజ మార్పిడిలో పరిశుద్ధాత్మ చేయు పనులు, ఇది యోహాను 16 వ అధ్యాయములో బయలు పరచబడ్డాయి. బ్రెయిన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు, "ఉజ్జీవము కొరకు ఏవిధంగా ప్రార్ధించాలో చాలా మంది క్రైస్తవులకు తెలియదు" (Brian H. Edwards, Revival, Evangelical Press, 2004 edition, p. 80).

ఏమి ప్రార్దించాలో తెలియకపోవడానికి ఒక కారణము ఈనాటి చాలామంది క్రైస్తవులు నశించు వారు పాపపు ఒప్పుకోలు క్రిందకు రావలసిన అవసరత వారు చూడడం లేదు, వారు "క్లిష్ట మార్పిడి"ని నమ్మరు మన పూర్వికులు చేసినట్టు. కాని నేను మీకు చెప్పాను మనం పరిశుద్ధాత్మ దిగివచ్చునట్టు ప్రార్ధించాలి మన సంఘములో హాజరవుతున్న నశించు వారిని ఒప్పింప చెయ్యాలి. వారు పాపపు ఒప్పుకోలు క్రిందకు రాకుంటే వారు రక్షింప బడలేరు.

తరువాత, చాలామంది సువర్తికులకు ఏమి ప్రార్దించాలో తెలియక పోవడానికి ఇంకొక కారణము నేటి అనేక సువర్తికులు "క్లిష్ట" మార్పిడిని నమ్మరు, మన పూర్వికులు చేసినట్టు. మన పూర్వికులన్నారు ఒప్పుకోలు క్రింద ఉన్న వ్యక్తి "మేల్కొల్ప బడతాడు," కాని ఇంకా రక్షింపబడలేదు. మన పూర్వికులు చెప్పారు మేల్కొల్పబడిన వ్యక్తి ఆ పాపము నుండి బయటపడే వేదన ద్వారా వెళ్ళాలి, ఒక స్త్రీ శిశువును కనేటప్పుడు నొప్పులు భరించేవిధంగా. ఇలా మాత్రమే, మన పూర్వికులన్నారు, నిజంగా ఒక వ్యక్తి మార్పిడిని అనుభవించగలడు (cf. the conversion of “Christian” in Pilgrim’s Progress).

జాన్ శామ్యూల్ కాగన్ తేటమైన క్లిష్ట మార్పిడిని అనుభవించారు. అతని మార్పిడి జాన్ బన్యన్ మార్పిడి లాంటిది, అంతేకాని ఆధునిక సువర్తికులు చెప్పే రక్షణ లాంటిది కాదు.

      నా మార్పిడి ముందు చనిపోతున్నట్టు అనిపించింది...నాలో ఎలాంటి సమాధానము లేదు... పరిశుద్ధాత్మ ఆ సమయంలో ప్రత్యేకంగా పాపపు ఒప్పుకోలు కలిగిస్తుంది, కాని నా స్వచిత్తముతో నేను దేవుని మరియు మార్పిడిని గూర్చిన తలంపును తిరస్కరించాను. నేను దానిని గూర్చి ఆలోచించడానికి నిరాకరించాను, అయినను హింసింప బడుతున్న భావన నాలో ఆగలేదు. 2009, జూన్ 21, ఆదివారము ఉదయము నేను పూర్తిగా బలహీనుడనయ్యాను. పూర్తిగా అలసిపోయాను. నన్ను నేను అసహ్యించుకోవడం ప్రారంభించాను, నా పాపాన్ని అది నన్ను ఇలా చేసిందో దానిని.
      నేను డాక్టర్ హైమర్స్ గారి ప్రసంగించేటప్పుడు, వినకుండా, ఎప్పుడు ముగింపు అవుతుందని చూస్తున్నాను, కానీ పాస్టర్ గారు ఆత్మపై నా పాపాల గూర్చి బోధించడం జరుగుతుంది. నేను ఎప్పుడు ఆ ప్రసంగము అయిపోతుందని సెకండ్లు లెక్కపెడుతున్నాను, కానీ పాస్టర్ గారు బోధిస్తూనే ఉన్నారు, మరియు నా పాపాలు ముగింపు లేకుండా చాలా భయంకరంగా మారాయి. నేను వ్యతిరేకంగా ఉండలేక పోయాను, నేను రక్షింపబడవలసి వచ్చింది! ఆహ్వానము ఇవ్వబడినప్పుడు కూడ నేను ఆపుతున్నాను, కాని ఉండలేక పోయాను, నా తెలిసింది నేను అతి భయంకర పాపినని దేవుడు నీతిమంతుడై నన్ను నరక పాత్రుని చేస్తాడని. నేను పోరాటంలో అలసిపోయాను, అంతటిలో అలసిపోయాను. కాపరి నన్ను ఆదరించారు, క్రీస్తు నొద్దకు రమ్మని చెప్పారు, కాని రాలేకపోయాను. నా పాపమంతా ఒప్పుకున్నా యేసును పొందుకోలేక పోయాను. ఈ క్షణాలు అతి భయంకరము నాకనిపించింది రక్షింప బడలేనని నరకానికి వెళ్ళక తప్పదని. రక్షింపబడడానికి "ప్రయత్నిస్తున్నాను," క్రీస్తును నమ్మ "ప్రయత్నించాను" కాని చెయ్యలేక పోయాను, క్రీస్తుకు అర్పించుకోలేక పోయాను, అది నన్ను నిస్సహాయుడిని చేసింది. నా పాపము నన్ను నరకంలో తోస్తున్నట్టు అనిపించింది అయినను మొండితనము పెరిగి కన్నీరు లేకుండా చేసింది. ఈ సంఘర్షణలో కూరుకు పోయాను.
      అకస్మాత్తుగా సంవత్సరాల క్రిందట బోధింప బడిన ప్రసంగములోని మాటలు నా మనసులో ప్రవేశించాయి: "క్రీస్తుకు సమర్పించుకో! క్రీస్తుకు సమర్పించుకో!" యేసు కొరకు విడిచి పెట్టాలి అనే తలంపు నన్ను వేధించింది నేను ఎన్నటికి చెయ్యలేను అనిపించింది. యేసు నాకు జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా యేసు నా కొరకు సిలువ వేయబడ్డాడు నేను ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడు ఆయనకు లోబడనప్పుడు. ఈ తలంపు నన్ను కదిలించింది; అదంతా జరిగిపోయింది. ఇంకా ఏమాత్రము నన్ను నేను పట్టుకోదలచుకోలేదు, నాకు యేసు కావలసివచ్చింది! ఆ క్షణంలో ఆయనకు అర్పించు కున్నాను విశ్వాసము ద్వారా యేసు నొద్దకు వచ్చాను. ఆ క్షణంలో నాకనిపించింది చనిపోవాలని, కాని క్రీస్తు నాకు జీవితమూ ఇచ్చాడు! క్రియలేదు మనసు లేదు, హృదయంతో క్రీస్తుపై అనుకున్నాను, ఆయన నన్ను రక్షించాడు! ఆయన రక్తములో నా పాపము కడిగివేస్తాడు! అదే క్షణములో, క్రీస్తును కాదనడం ఆపేసాను. నాకు తేటగా తెలిసింది నేను చేయవలసినదంతా ఆయనను విశ్వసించడం; నేను గుర్తించాను ఇక మీదట నేను కాను క్రీస్తు మాత్రమే అని. నేను లోబడాల్సి వచ్చింది! ఆ క్షణంలో శారీరక భావన లేదు, ప్రకాశమైన వెలుగు లేదు, నాకు భావన అవసరపడ లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు! అయినను క్రీస్తును నమ్మడంలో నా ఆత్మ నుండి పాప భారమంతా పోయినట్టు అనిపించింది. నా పాపము నుండి వైదొలగాను, యేసు వైపే చూసాను! యేసు నన్ను రక్షించాడు.
      యేసు నన్ను ఎంతగానో ప్రేమించాడు పాపినైన నన్ను క్షమించాడు నేను మంచి సంఘములో ఎదిగినప్పటికినీ ఆయనకు వ్యతిరేకంగా తిరిగాను! నా మార్పిడి అనుభవమును వివరించడానికి మాటలు చాలవు క్రీస్తు కొరకు నాకున్న ప్రేమను వ్యక్త పరచడానికి. క్రీస్తు తన జీవితాన్ని నా కొరకు ఇచ్చాడు దానికి నా సమస్తము ఆయనకు అర్పించాను. యేసు సిలువ కొరకు తన సింహాసనాన్ని త్యాగము చేసాడు నా నిమిత్తము; నేను ఏవిధంగా అతని ప్రేమ మరియు దయను మరువగలను? నేను ఆయన సంఘముపై ఉమ్మివేసాను ఆయన రక్షణను అపహసించాను. నేను ఇలా సంపూర్ణముగా – ఆయన ప్రేమను కృపను ప్రకటించగలను.

నేను డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ తో ఏకీభవిస్తాను అపోస్తలుడైన పౌలు నిజమైన మార్పిడిని గూర్చి ఉదాహరణను రోమా 7వ అధ్యాయములో చివరి రెండు వచనాలలో ఇచ్చాడు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు ఈ వచనాలు పౌలు స్వంత మార్పిడిని వివరిస్తున్నాయి. నేను అంగీకరిస్తాను. పౌలు అన్నాడు,

"అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24).

ఇదీ ఒప్పుకోలు! – పాపి తనను తానూ విడిచి తనను బట్టి తానూ విసిగిపోవడం తనను బానిసగా చేసిన తన పాపపు హృదయాన్ని బట్టి. తరువాత పౌలు అన్నాడు,

"మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు చున్నాను" (రోమా 7:25).

ఇదీ మార్పిడి – ప్రభువైన యేసు క్రీస్తు హింసింపబడు పాపిని విడుదల చెయ్యడం! ఇది ఇక్కడ ఉంది, మొదటిసారిగా, పాపి, తనకు నిస్సహాయ స్థితిలో పాపికి బానిసయై, చివరకు యేసు వైపు తిరిగి ఆయన రక్తము ద్వారా తన పాపముల నుండి కడుగబడ్డాడు. ఈ కాలపు అతి పెద్ద విషాదము సువర్తికులు చాలామంది ఎవ్వరిని ఈరెండు ప్రాముఖ్యమైన అనుభవాల ద్వారా వెళ్ళనివ్వరు. మొదటిసారే ఇంకా ముందే, నిర్ణయత్వ వారితో, పాపి ప్రార్ధన చేయిస్తాడు. నేను నమ్ముతాను ఇది ఒకటే ప్రాముఖ్యమైన కారణము అమెరికాలో 1859 నుండి దేశాన్ని మార్చే ఉజ్జీవము లేకపోవడానికి.

కనుక, వీటిని గూర్చి మీరు ఎక్కువగా ప్రార్ధించాలి మన సంఘములో ఉజ్జీవము రావాలంటే. మొదటిది, పాపముతో నశించు ప్రజలను ఒప్పించడానికి పరిశుద్ధాత్మను పంపమని దేవుని ప్రార్ధించండి. రెండవది, దేవుని ఆత్మ కొరకు ప్రార్ధించండి యేసు వారికి బయలు పరచబడేటట్టు, సిలువపై ఆయన మరణము ద్వారా వారు క్షమాపణ పొందుకునేటట్టు, ఆయన ప్రశస్త రక్తము ద్వారా వారి పాపాలు కడుగ బడేటట్టు ప్రార్ధించండి!

పాస్టరు బ్రయన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నారు ఉజ్జీవ ప్రార్ధనలు "మార్పునొందిన వారిపై, ఆరాటపడే (మేల్కొల్పబడే వారిపై), మేల్కొల్ప బడని వారిపై దృష్టి సారించాలి" (Revival, Evangelical Press, 2004 edition, p. 127). ఎందుకు ఉజ్జీవ ప్రార్ధనలు "మారినవారు" మరియు "ఆరాటపడే వారు" మరియు "మేల్కొల్ప బడనివారు" పై దృష్టి పెట్టాలి? ఎందుకంటే మారిన వారు వెనుదిరగవచ్చు. మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో ఉజ్జీవము రక్షింపబడిన వారి మధ్య ప్రారంభము అయింది. వారి హృదయాలలో పాపముంది వారు బహిరంగంగా, కన్నీళ్ళతో, ఇతరుల ముందు పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. కొందరికి సంఘంలో వేరే వారిపై ద్వేషము ఉండేది. కొందరు రహస్య పాపాలు వారి జీవితాలలోనికి రానిచ్చారు. వారి పాపాలను, వారు పరవాలేదనుకున్నారు. కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, వారి హృదయాలు పగిలాయి. వారి ప్రార్ధనలలో చల్లగా చచ్చిన స్థితిలో ఉన్నట్లు వారు గ్రహించారు. సంఘములో ఇతరుల పట్ల ద్వేషముతో కోపముతో ఉన్నట్లు గ్రహించారు. ఇతరులు దేవుడు వద్దన్నా దానిని చేయడానికి నిరాకరించారు.

మన సంఘములో ఒక క్రైస్తవుడు ఉండవచ్చు దేవునికి లోబడడానికి నిరాకరించ వచ్చు. ఇది ఉజ్జీవాన్ని ఆపవచ్చు! కేంటక్కి విల్ మోర్ ఆస్ బర్రీ కాలేజిలో, ఉజ్జీవము వచ్చినప్పుడు 1970లో వందలాది మంది విద్యార్ధులకు అనిపించింది వారు...బాహాటంగా ఒప్పుకోవాలని. వారు లైనులో నిలబడ్డ్డారు, గంటల కొద్ది, మైకు కొరకు కనిపెడుతూ పాపాలు ఒప్పుకోవడానికి... వారి [అవిధేయతను] బట్టి ప్రార్ధన కొరకు.

ఆస్బరీ కూటము నడిపించు వ్యక్తి బోధించలేదు. నిజానికి, తన సాక్ష్యాన్ని చెప్పాడు, తరువాత విద్యార్ధులకు ఆహ్వానము ఇచ్చాడు వారి క్రైస్తవ అనుభవాలు పంచుకోవడానికి. దాన్ని గూర్చి అసాధారణత ఏమిలేదు. ఒక విద్యార్ధి దానికి స్పందించాడు. తరువాత ఇంకొకరు. తరువాత ఇంకొకరు. "తరువాత అందరు బలిపీఠం దగ్గరకు గుమ్మిగా వచ్చారు," ఆయనన్నాడు, "అది క్రుమ్మరింపబడింది." క్రమేణా, వివరించలేనంతగా, విద్యార్ధులు అధ్యాపకులు నెమ్మదిగా ప్రార్ధిస్తూ, ఏడుస్తూ, పాడుతున్నారు. వారు ఎవరి పట్ల తప్పు చేసారో వారిని క్షమించమని అడిగారు. ఆరాధన ఎనిమిది రోజులు జరిగింది [రోజుకు 24 గంటల చొప్పున].

మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో కూడ, ఎబ్సరీ ఉజ్జీవములో జరిగినట్టే జరిగింది. గంటల తరబడి జరిగింది, చైనీయ యవనులు ఒప్పుకున్నారు ప్రార్ధించారు. 1910 కొరియా ఉజ్జీవములో బాహాటపు ఒప్పుకోలు జరిగింది. ఈనాడు చైనాలో, క్రైస్తవులు బాహాటపు ఒప్పుకోలు కనిపిస్తుంది, కన్నీళ్ళతో, గొప్ప ఉజ్జీవాలలో. ఎవాన్ రోబర్ట్స్ మోర పెట్టాడు, "ప్రభువా, నన్ను వంచు," అతడు 1905 వేల్స్ ఉజ్జీవంలో దేవునికి లోబడి నాయకుడయ్యాడు. మీసంగతేంటి? మిమ్ములను వంచమని దేవునికి ప్రార్దిస్తారా? పాడండి "నన్ను పరిశోధించు, ఓ దేవా."

"నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయము తెలుసుకో:
నన్ను శోధించి నా తలంపులు తెలుసుకో:
నా హృదయము తెలుసుకో;
నన్ను శోధించి నా తలంపులు తెలుసుకో;
నీకాయాస కరమైన మార్గము నాయందున్న దేమో చూడుము,
నిత్య మార్గములో నన్ను నడిపించుము."
   (కీర్తనలు 139:23,24).

సజీవుడైన దేవుని ఆత్మా, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
సజీవుడైన దేవుని ఆత్మా, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
నన్ను కరిగించు, నన్ను మలచు, నన్ను విరగగొట్టు, నన్ను వంచు.
సజీవుడైన దేవుని ఆత్మా, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.

అది మన సంఘములో జరగవచ్చు దేవుడు ఉజ్జీవంలో తన ఆత్మను పంపిస్తే. "నన్ను పరిశోధించు, ఓ దేవా." నెమ్మదిగా పాడండి.

"నన్ను పరిశోధించు, ఓ దేవా, నా హృదయము తెలుసుకో:
నన్ను శోధించి నా తలంపులు తెలుసుకో:
నా హృదయము తెలుసుకో;
నన్ను శోధించి నా తలంపులు తెలుసుకో;
నీకాయాస కరమైన మార్గము నాయందున్న దేమో చూడుము,
నిత్య మార్గములో నన్ను నడిపించుము."
   (కీర్తనలు 139:23,24).

ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.