Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పాపపు ప్రదేశాల నుండి వారిని లోపలి తీసుకొని రండి!

BRING THEM IN FROM THE FIELDS OF SIN!
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్
నందు ప్రభువు దినము సాయంకాలము, ఆగష్టు 7, 2016
A sermon given to the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 7, 2016

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము" (లూకా 14:23).


చాలా సంవత్సరాలు ఆత్మలను ఎలా సంపాదించాలో నాకు తెలియదు. నశించు ప్రజలు రక్షింపబడిన తరువాత వారిని గుడిలోనికి ఎలా తీసుకొని రావాలో నాకు తెలియదు. నేను ప్రతి అవకాశమున్న పద్ధతిని ప్రయత్నించాను. కరపత్రాలు ఇవ్వ ప్రయత్నించాను. కాని కరపత్రాలు పంచడం నశించు ప్రజలను గుడిలోనికి తీసుకొని రాలేదు. వీధిలో బోధించాను. కాని అది నశించు ప్రజలను గుడిలోనికి తీసుకొని రాలేదు. వారి ఇంటి తలుపు ముందర ప్రజలకు సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించాను. కాని అది కూడ పని చెయ్యలేదు. వారు రక్షణ కొరకు ప్రార్ధన చెప్పేవారు. కాని వారు గుడికి వచ్చేవారు కాదు. వారు ప్రార్ధించిన తరువాత వారిని "వెంబడింప" ప్రయత్నించాను. కాని "వెంబడించే" పని వారిని గుడికి తీసుకొని రాలేకపోయింది. నేను చాలా మనస్థాపము నొంది ఓడిపోయాను.

అయినను వదిలిపెట్టడానికి నిరాకరించాను. నాకు తెలుసు ఏదో ఒక మార్గము ఉంటుందని నశించు వారిని మార్చి గుడిలోనికి తీసుకొని రావడానికి. అప్పుడు మన పాఠ్యభాగము చదివాను. నేను దానిని మునుపు కూడ చదివాను, కాని అకస్మాత్తుగా అది నాపైకి వచ్చినట్టు అనిపించింది. ఆ సమయంలో మన సువర్తీకరణ పధ్ధతి జన్మించింది. ఆత్మల సంపాదనలో యేసు పలికిన మాటలు మనకు మార్గ దర్శకాలు.

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము"
       (లూకా 14:23).

ప్రజల దగ్గరకు వెళ్లి వారితో "పాపి ప్రార్ధన" చెప్పించే బదులు –మరియు తరువాత వారిని గుడికి రప్పించే బదులు, కొత్త పని చేసాము. వారిని రక్షింప ప్రయత్నించే ముందు వారు గుడికి వచ్చేలా చేసే వారము. అది పనిచేసింది! యేసు చెప్పినది ఇప్పుడు మనం చేస్తున్నాము. వారు "లోపలి వచ్చునట్లు" బలవంత పెడుతున్నాము తరువాత వారు నా ప్రసంగాలలోని సువార్త ద్వారా కదిలింపబడుచున్నారు.

చాలామంది గుడిలోపలికి రాలేడు. కొంతమంది మాత్రము వచ్చారు. కొంతమంది నా బోధ విని రక్షింపబడ్డారు. కాని వారు లోపలి రావడానికి బలవంత పెట్టబడ్డారు, గుడిలో వారితో స్నేహితులయ్యారు. వారు అప్పటికే క్రమంగా గుడి ముందు హాజరయ్యే వారే కాని తరువాత వారు సువర్తతో సంధింపబడ్డారు.

నేను చెప్పినట్టు, మేము ఆహ్వానించిన ప్రతి ఒక్కరు గుడిలోనికి రాలేదు. చాలామంది రారు అని యేసు ఉపమానము మనకు చెప్తుంది. 18 వ వచనము చెప్తుంది, "వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి" రాకపోవడానికి. చాలామంది రానేరారు. మేము గుడిలోనికి రావాలని వారిని "బలవంత పెట్టాము," కాని కొద్దిమంది మాత్రమే వాస్తవానికి వచ్చారు. "లోపలి రమ్మని" వారిని అడిగాము. ఎక్కడికి రావడం? బహుశా, గుడిలోనికి రావడానికి! ఉపమానములో ఇంకెక్కడికి వారు "లోనికి" వస్తారు? కొద్దిమంది వాస్తవానికి గుడిలోనికి వస్తారు. వారు కదిలించే సువార్త ప్రసంగాలు వింటారు. వాస్తవానికి వారు "గొప్ప విందు" మాతో చేస్తారు – 16 వ వచనము చెప్పినట్లు. మంచి భోజనము మాతో చేస్తారు – ఒక సభ్యుని పుట్టిన రోజు సందడిలో వారు ఉంటారు. ఈ పార్టీలో మీకు చాలా గొప్ప సమయం ఉంటుంది! వచ్చే ఆదివారము తిరిగి రమ్మని వారిని ఆహ్వానించే వారము.

చాలామంది తిరిగి వచ్చేవారు కాదు. కాని కొందరు వచ్చేవారు. వారికి మేము ప్రతీ ఆరాధనలో, మళ్ళీ మళ్ళీ, సువార్త బోధించే వారము. కొంతకాలానికి సువార్తను అర్ధం చేసుకోవడం ఆరంభించే వారు. ఇంకా చాలా కాలము తరువాత పాపపు ఒప్పుకోలు పొంది, కొంతమంది అప్పడు యేసును నమ్మి రక్షింపబడేవారు. ఈ సాయంకాలము మీలో ఎంతమంది అలా ఈ గుడిలోనికి వచ్చారు? మీరింకా మారనప్పటికినీ, మీలో ఎంతమంది అలా మా గుడిలోనికి వచ్చారు? దయచేసి నిలబడండి. (వారు నిలబడ్డారు.) చూసారా? మన గుడిలో చాలామంది అలా వచ్చినవారే! మేము క్రీస్తుకు లోబడ్డాము కాబట్టి మీరు మా గుడిలోనికి వచ్చారు. ఆయనన్నాడు,

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము"
        (లూకా 14:23).

"వారిని లోపలి రప్పించండి" – నాతో కలిపి పాడండి!

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరిగే వారిని యేసు నొద్దకు తీసికొని రండి.
("వారిని లోనికి రప్పించండి" అలెక్సేనా థామస్ చే, 19 వ శతాభ్దము).
     (“Bring Them In,” Alexcenah Thomas, 19th century).

క్రీస్తు సువర్తీకరణ పద్ధతిని అవలంబిస్తూ, మేము క్రమేణా మిగిలిన విషయాలు నేర్చుకున్నాము. మేము తీసుకొచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఎన్నుకోవడం నేర్చుకున్నాము. మొదట్లో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చాం. కాని మా సంఘము పట్టణము లోపల ఉంది. మేము లాస్ ఎంజలాస్ డౌన్ టౌన్ మధ్యలో ఉన్నాము. ఇక్కడ చాలామందికి మంచి భవిష్యత్తు లేదు. కొందరు మారక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్నారు. వారికి ఎక్కువ సహాయ పడలేక పోయాము. కొంతమంది వృద్ధులు వారి మార్గములో వారుండే వారు. వారికి కూడ ఎక్కువ సహాయ పడలేదు. యేసు దినాలలో ఆయన చెప్పాడు "బీదలను, అంగ హీనులను, కుంటి వారిని గ్రుడ్డి వారిని తీసుకొని రమ్మని" (వచనము 21). కాని యేసు దినాలలో ప్రజలు నేటి ప్రజల కంటే ఎక్కువ నాగరికత కలిగిన వారు తీవ్రంగా ఉండేవారు. అలాంటి వారిని గుడిలోనికి మీరు తేవచ్చు వారు పిచ్చి పనులు చేయరు. కాని ఈనాడు చాలామంది చాల క్రూరంగా అక్రమంగా ఉంటున్నారు వారిని గుడిలోనికి తేలేము. అందుకు ఎన్నిక చేసుకోవాలని యేసే చెప్పాడు. యేసు తన శిష్యులతో అన్నాడు,

"మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో నైనను ప్రవేశింపకుడి: గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి" (మత్తయి 10:5, 6).

తరువాత, ఎన్నికలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడు. యేసు వారికి చెప్పాడు కొంతమందిని సువర్తీకరణ చెయ్యకూడదని, కొన్ని పట్టణాలను కూడ. ఆయన చెప్పాడు,

"ఎవడైనను మిమ్మును చేర్చుకొనక, మీ మాటలు వినకుండిన యెడల, మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచి పోవునప్పుడు, మీ పాదధూళి దులిపి వేయుడి. విమర్శ దినమందు, ఆ పట్టణపు గతికంటే సోదొమ గోమోర్రా ప్రదేశము గతి ఓర్వ తగినదై యుండునని, మీతో చెప్పుచున్నాను" (మత్తయి 10:14, 15).

క్రీస్తు ఎన్నుకున్నాడు మనం కూడ అలాగే ఉండాలి. ఒకరన్నారు, "నీవు ప్రతి ఒక్కరినీ జయించాలనుకుంటే ఒక్కరిని కూడ జయించ లేవు." మేము కనుగొన్నాము కళాశాల యవనస్తులు 16 నుండి 24 మధ్య వయస్సు గలవారు శ్రేష్టులు మన పద్దతిలో వారిని సువర్తీకరించవచ్చు. ఆ వయస్సు వారిపై మన సంఘము కట్టబడింది. మేము ఇంకా కనుగొన్నాము కళాశాల విద్యార్ధులైన చైనీయ యవనస్తులు ఇతరుల కంటే వారిని సులువుగా జయింపవచ్చు. ఇతరులు కూడ వస్తారు. మన సంఘములో 20 జాతుల గుంపుల వారు ఉన్నారు. వారంతా (అప్పుడు) కళాశాల విద్యార్ధులు మన సంఘ ఐక్యత వారిపై ఆధారపడి ఉంది. వారు కేవలము కళాశాల విద్యార్ధులు కాదు. కాని మత్తు పదార్ధాలు తీసుకొని పవిత్ర యవనస్తులు. వారిని "గురి గుంపు" అని పిలుస్తాము. మా సువర్తీకరణ దృష్టి వారిపై ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలలో ఈ యవనస్తులలో 50 మందిని మన గుడిలో కలిపాము.

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము"
        (లూకా 14:23).

మళ్ళీ ఆ పాట పాడండి!

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

ఈనాడు ప్రజలను జయించడం చాలా కష్టమని సువర్తికులు అనడం నేను వింటున్నాను. ప్రతి సంవత్సరం ఇంకా కష్టమవుతుందని వారంటారు. మనం ఆఖరి దినాలలో జీవిస్తున్నామని వారంటారు. లోకము నుండి ఆత్మలు సంపాదించడం చాలా కష్టతరం చేస్తుంది. ఇతరులు అంటారు కళాశాల ఆవరణలో కాని దుకాణంలో కాని కొత్త వ్యక్తికి ఎవ్వరు ఫోను నంబరు ఇవ్వ ఇష్టపడరు. వారి సిద్ధాంతము వాస్తవాలపై ఆధార పడలేదు. మనం చేసినట్టు వారు పరీక్షించలేదు. మనకు తెలుసు, అనుభవ పూర్వకంగా, చాలామంది యవనస్తులు నిజానికి కళాశాల ఆవరణలో వారి పేరు పేరు ఫోను నంబరు స్నేహితులకు ఇస్తారు. వారు ప్రతివారం అలా చేస్తారు. ఇరవై సంవత్సరాల క్రితం వారు అల చేసి ఉండరు, అందుకే ఇది పని చేయదు అనే తలంపు అలా బోధకులకు వచ్చి ఉంటుంది. వారు గ్రహింపరు సంభాషించే దారులు ముఖ పుస్తకము ఇంకా ఇలాంటివి ఉన్న నూతన శకములో మనం ప్రవేశించాం అనే సంగతి. యవనస్తులు ఈనాటి "మిల్లేనియన్లు" నిజానికి స్నేహంగా ఉండే అపరిచితునికి వారి ఫోను నంబరు ఇస్తారు. ప్రతివారము మన గుడిలో వందల మంది అలా చేస్తారు. కాని కళాశాల యవనస్తుల మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే పెద్దవారు వారి నంబరు ఇవ్వరు. బోధకులు అనుకుంటారు ఏదీ పని చెయ్యడం లేదు, ప్రతి సువర్తీకరణ పధ్ధతి చాలా కష్ట తరమని. కాని వారిది తప్పు. యేసు అన్నాడు,

"ఇదిగో మీ కన్నులెత్తి, పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను"
        (యోహాను 4:35).

కళాశాలలు, దుకాణాలు, వీధులు యవనస్తులతో నిండి ఉన్నాయి. కాని మనం వారి వెంట వెళ్ళాలి. ఉత్సాహంతో కృత నిశ్చయతతో వారి వెనుక మనం వెళ్ళాలి. పట్టణము వారితో నిండి ఉంది. కోత ఎప్పుడు విస్తారమే. ప్రతి సెమిస్టరుకు కొత్త కళాశాల విద్యార్ధులు వస్తుంటారు కాబట్టి అది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. యేసు చెప్పాడు,

"కోత విస్తారమే, కాని పనివారు కొద్దిగా ఉన్నారు; కనుక తన కోతకు పనివారిని పంపుమని, కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను" (మత్తయి 9:37, 38).

మళ్ళీ పాడండి!

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

ఇది సులభమైన పనికాదు. సువార్త నిమిత్తము మన ప్రజలు వెళ్లి చాలా తక్కువ పేర్లు ఫోను నంబర్లు తేవడం చూచి నేను దిగ్బ్రాంతి చెందాను. కొందరైతే సువార్త కొరకు పేర్లు ఫోను నంబర్లు ఎప్పుడు తీసుకురారు. మొన్న రాత్రి ఇది నన్ను కలవర పరిచింది. సత్యమేమిటంటే కోత పొలాలు యవనస్తులతో నిండి ఉన్నాయి. యేసు అన్నాడు "కోతకు పనివారిని పంపుమని" దేవుని వేడుకోవాలని. మీలో కొందరు సువార్త నిమిత్తము బయటకి వెళ్తున్నారు, కాని మీరు ఎక్కువ పేర్లు తీసుకురారు. ఎక్కువ పేర్లు తీసుకురారు ఎందుకంటే పేర్ల కొరకు మీరు "కష్టపడరు." వందలలో నశించు యవనస్తులున్నారు. వారి పేర్లు తేవడానికి మీరు "కష్టపడడం" లేదు! "పనివారు" పదము "కష్టపడు వారు" అని తర్జుమా చేయబడవచ్చు.

మీరు సువార్త పని మీద వెళ్ళినప్పుడు మీరు దాని మీద పనిచెయ్యాలి! మీరు కష్ట పడాలి లేనిచో పేర్లు తేలేరు. ఎక్కువ పేర్లు ఫోను నంబరు తేడానికి ఆత్మలను సంపాదించడానికి మీరు కష్టపడి పని చెయ్యాలి. వచ్చేవారము దీనిపై మీరు పని చేస్తారని నా ప్రార్ధన! సోమరితనంగా ఉండకండి! దృష్టి మళ్ళించకండి! నిలబడి సమయము వ్యర్ధ పరచకండి! వారి పేర్లు తేవడానికి మీరు కష్ట పడాలి!

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము"
        (లూకా 14:23).

పాడండి!

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

గత ఆదివారము ఉదయము నోవసాంగ్ గొప్ప ప్రసంగము చేసాడు. అది అతని రెండవ ప్రసంగము. అయినను అది శక్తివంతంగా ఉంది! నోవసాంగ్ అన్నాడు,

యవనస్తులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వంటరితనము. అది నిజమని నాకు తెలుసు! మీరు గుంపులో ఉండవచ్చు. కాని నిజానికి మీకు ప్రజలు వ్యక్తిగతంగా తెలియదు. తేదిపై వెళతారు, అది ఎక్కువ కాలముండదని మీకు తెలుసు. మీరు ప్రేమలో పడవచ్చు. కాని అది త్వరలో ముగిసిపోతుంది. మీరు దుకాణంలో నడుస్తుండొచ్చు, ఎవరికీ మీరు తెలియదు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. మీరు ముఖ పుస్తకానికి వెళ్ళవచ్చు, సంభాషించవచ్చు – కాని మీరు మాట్లాడేవారు మిమ్ముల్ని పట్టించుకోరని మీకు తెలుసు. వారు కేవలము సైబర్ స్నేహితులునిజ స్నేహితులు కాదు. సమాధానము ఏమిటి? జవాబు ఇక్కడే ఉంది "కొత్త" బాప్టిస్టు గుడారములో! (Noah Song, “God Hates Loneliness!”).

అవును, నోవ సరియే! పిల్లలు ఈనాడు ఒంటరిగా ఉన్నారు. కొంతమంది కాదు. అందరు ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళండి. నవ్వి వారికి "హలో" చెప్పండి. భయపడకండి! జాన్ కాగన్ నాతో చెప్పాడు, "మన సంఘములోని సందడికి వారిని ఆహ్వానించడం ద్వారా వారికి పెద్ద మేలు చేస్తున్నాము." అతడు సరియే! వారికి ఏమి అవసరమో అది మనము వారికి ఇస్తున్నాం కనుక వారికి గొప్ప మేలు చేస్తున్నాము. వారి ఒంటరి తనానికి మందు. మంచి జీవితానికి ఏమి కావాలో ఇస్తున్నాము. యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడడానికి వారికి సహాయము చేస్తున్నాము! ఒక వస్తువును అమ్మే వ్యక్తిగా వారితో మాట్లాడడం లేదు, వారి దగ్గర నుండి ఏదైనా పొందుకోడానికి అమ్మే వ్యక్తి ప్రయత్నిస్తాడు. కాదు! కాదు! మీరు అమ్మేవారు కానే కాదు! మీరు సువార్త పని మీద ఉన్నారు, వారి నుండి ఏదో తీసుకోవడానికి కాదు! మాయ చేయడానికి కాదు! వారికి అవసరము లేనిది అమ్మడానికి కాదు! వారికి ఏదో ఇవ్వడానికి మీరు అక్కడ ఉన్నారు. వారికి అత్యవసరంగా ఉన్నదానిని ఇవ్వడానికి మీరు అక్కడ ఉన్నారు! మన సంఘములోని సందడికి వారిని తేవడానికి మీరు అక్కడ ఉన్నారు. వారు మంచి స్నేహితులను కనుగొనేలా చేయడానికి మీరక్కడ ఉన్నారు. వారిని ఇంటికి తేవడానికి గుడికి తేవడానికి మీరు అక్కడ ఉన్నారు యేసు క్రీస్తును గూర్చి వినడానికి – ఉచిత బహుమానమైన రక్షణను ఆయన నిత్యత్వపు ప్రేమను వారు పొందుకునేటట్టు చేయడానికి!

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము" (లూకా 14:23).

పాడండి!

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

మీరు సువార్త పని మీద వెళ్తున్నప్పుడు, భయపడకండి! మనమిచ్చేది వారికి అవసరము. వారికి ఎట్లాగైనా కావాలి! మీరు వారికి మేలు చేస్తున్నారు. వారికి సహాయ పడడానికి అక్కడ ఉన్నారు. వారికి అవసరమైనది ఇవ్వడానికి. వారి పేర్లు తీసుకోవడానికి తద్వారా లోపలి తీసుకురావడానికి. ప్రేమను వారికి తెలియని స్నేహాన్ని మనం వారికి ఇవ్వవచ్చు – దేవుని ప్రేమ, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఆశ్చర్య ప్రేమ – స్నేహము, వెచ్చదనము, "కొత్త" బాప్టిస్టు గుడారము యొక్క సహవాసము ఆనందము!

కోత కొరకు పొలాలు తెల్లబారాయి! ఇప్పుడు వచ్చేవారము వెళ్లి వ్యక్తిగత సువార్త సేవ ద్వారా ఎక్కువ పేర్లు ఫోను నంబర్లు తీసుకొని రండి! బుధవారము రాత్రి సువార్త సేవకు మాతో పాటు రండి! గురువారము రాత్రి సువార్త సేవకు మాతోరండి! శనివారము రాత్రి కూడ రండి! అవును – మళ్ళీ ఆదివారము మధ్యాహ్నము వెళ్ళండి! ఎక్కువ పేర్లు తెండి, ఒకటి రెండు కాదు. ఎక్కువ పేర్లు తెండి! మీరు చేయగలరు! భయపడకండి. ఆ యవనస్తులకు అత్యవసరంగా కావలసింది మీ దగ్గర ఉంది! వెళ్లి ఆ పని చెయ్యండి! వెళ్లి ఆ పని చెయ్యండి! వెళ్లి ఆ పని చెయ్యండి!

"నా ఇల్లు నిండునట్లు నీవు రాజ మార్గములోనికి, కంచెలలోనికి వెళ్లి, లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము"
        (లూకా 14:23).

దయచేసి నిలబడి 8 వ పాట పాడండి. "లోనికి తీసుకొని రండి." పాడండి, పాటల కాగితములో 8 వ పాట. పాడండి, వచ్చేవారమంతా అలా చెయ్యండి!

ఓ! నేను గొర్రెల కాపరి నేను వింటున్నాను,
   అంధకార భయంకర ఎడారిలో,
చెదిరిన గొర్రెలను పిలుస్తూ ఉన్నాడు
   గొర్రెల కాపరి కావలి నుండి దూరంగా వెళ్ళిపోయాయి.
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

ఎవరు వెళ్లి ఈ గొర్రెల కాపరికి సహాయము చేస్తారు,
   చెదిరిని వారిని కనుగొనేటట్టు ఆయనకు సహాయ పడతావా?
నశించిన వారిని దారిలోనికి ఎవరు తీసుకొని వస్తారు,
   చలి బారినుండి అవి కాపాడ బడేటట్టుగా?
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

ఎడారి ప్రాంతంలో వారి మోర విను,
   భయంకరమైన ఎతైన కొండల ప్రాంతములో;
ఓ! యజమానుడు మీతో మాట్లాడుచున్నాడు,
   "వెళ్లి ఎక్కడ ఉన్నప్పటికినీ నా గొర్రెలను కనుగొను."
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.
("వారిని లోనికి రప్పించండి" అలెక్సేనా థామస్ చే, 19 వ శతాబ్దము).
       (“Bring Them In,” Alexcenah Thomas, 19th century).

ఎక్కువ పేర్లు తెచ్చేటట్టు ఈ ప్రసంగము మిమ్ములను ప్రేరేపించిందా? అవసరత చూస్తున్నారా ఈ రాత్రి? మీరు చెప్పగలరా, "అవును, డాక్టర్ హైమర్స్ గారు, వచ్చేవారము, ఇంకా ఎక్కువ పనిచేస్తాను." అది మీ కోరక అయితే, మీ సీటు వదిలి ముందు భాగానికి రండి. నేరుగా వేదికపైకి రండి, వేదిక క్రిందకు కూడ! ఏమి "వారిని లోనికి రప్పించండి" అనే పాట వాయిస్తారు మీరు వస్తూ ఉండగా. (వారు వచ్చారు).

జాన్ శామ్యూల్ కాగన్, వచ్చేవారము ప్రతీ ఒక్కరు ఎక్కువ పేర్లు తెచ్చేటట్టు దయచేసి ప్రార్ధించండి. (జాన్ కాగన్ ప్రార్ధిస్తారు). ఇప్పుడు నోవాసాంగ్ ప్రార్ధన చేస్తారు (ఆయన ప్రార్ధిస్తారు). ఏమి పల్లవి వాయిస్తూ ఉండగా, మీరు మీ స్థలాలకు వెళ్లి ఆ పాట పాడండి.

వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   పాప ప్రదేశాల నుండి వారిని లోనికి రప్పించండి;
వారిని లోనికి రప్పించండి, వారిని లోనికి రప్పించండి,
   తిరగే వారిని యేసు వద్దకు తీసుకొని రండి.

కూర్చోండి. నశించు ఆత్మలను రక్షించడం యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన పని. యేసు చెప్పాడు "నశించిన దానిని వెదికి రక్షించుటకు మనష్యు కుమారుడు వచ్చెను" (లూకా 19:10).

మీరు ఇంకా రక్షింపబడకపోతే, యేసు మిమ్ములను రక్షిస్తాడు అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. మీ జీవితములోని పాపముల నుండి వైదొలిగి యేసు క్రీస్తు నొద్దకు "ముఖాముఖి" గా రండి – నోవాసాంగ్ పాడినట్టు. యేసు శ్రమ పడి సిలువపై మరణించాడు. ఆయన నీ స్థానములో చనిపోయాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. సమస్త పాపము నుండి నిన్ను కడగడానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. మీరు యేసును నమ్మాలని అనుకుంటే, దయచేసి ఈ రాత్రి డాక్టర్ కాగన్ గారిని కలవండి, లేక ఆయన ఇంటి ఆఫీసుకు ఫోను చెయ్యండి, డాక్టర్ కాగన్ ను కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోండి, తద్వారా ఆయన రక్షింపబడే విషయంలో మీకు నచ్చ చెప్పుతారు. దేవుడు మీ అందరిని దీవించును గాక! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: లూకా 14:16-23.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
("వారిని లోనికి రప్పించండి" అలెక్సేనా థామస్ చే, 19 వ శతాబ్దము).
“Bring Them In” (Alexcenah Thomas, 19th century).