ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలాHOW TO KNOW THE WILL OF GOD డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, మే 15, 2016 "మీరు వినువారు మాత్రమై యుండి, మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి" (యాకోబు 1:22). |
ఎ. డబ్ల్యూ. పింక్ (1886-1952) అన్నాడు, "చాలామంది దేవుని వాక్యము ‘వినేవారు’ ఉన్నారు, క్రమంగా వినేవారు, భయభక్తులతో వినేవారు, ఆసక్తితో వినేవారు; కాని అయ్యో, వారు వినేది వారి జీవితాన్ని [ప్రభావితం చేయదు]: అది వారి [జీవిత విధానాన్ని] క్రమ పరచాడు. దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యము ప్రకారము చేయని వారు తమమును తామే మోస పుచ్చుకుంటారు!... దేవుని వాక్యానికి పెరుగుచున్న హృదయ [అప్పగింత] లేకపోతే, అప్పుడు పెరుగుచున్న జ్ఞానము పెరిగే శిక్షను తెస్తుంది... దేవుడు ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు...మనలను నడిపించడానికి: ఆయన మనలను ఏమి చేయ్యమంటున్నాడో తెలుసుకోవడానికి" (Arthur W. Pink, “The Scriptures and Obedience,” in Profiting From the Word, Free Grace Broadcaster, Summer 2015, pages 1, 2). "దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు...మనలను నడిపించడానికి." నేను పింక్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. నేను మారక మునుపు, అదే నాకు బోధించబడింది. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు నేను హాజరు అయ్యే హంటింగ్ టన్ పార్కులోని బాప్టిస్టు సంఘము చాలా విషయాలలో తప్పు, కాని ఈ విషయంలో మట్టుకు కాదు. దేవుడు మనతో మాట్లాడుతాడని తన చిత్తాన్ని కేవలము లేఖనాల ద్వారా చూపిస్తాడని నేను బోధింపపడ్డాను. భావాల ద్వారా అభిప్రాయాల ద్వారా దేవుని చిత్తాన్ని వెదక కూడదని నేను నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఇది తరువాత నా సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్ నుండి, డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ నుండి నేర్చుకున్నాను. దేవుని కృపను బట్టి, నేను కీర్తన కారునితో పాటు చెప్పగలను, "నీ వాక్యము నా పాదములకు, దీపములను నా త్రోవకు వెలుగునైయున్నది" (కీర్తనలు 119:105). దేవుని వాక్యము గూర్చి సామెతలు 6:22 ఇలా చెప్తుంది, "నీవు త్రోవను వెళ్ళునప్పుడు, అది నిన్ను నడిపించును; నీవు పండ్లు కొనునప్పుడు, అది నిన్ను కాపాడును; నీవు మేలు కొనునప్పుడు, అది నీతో ముచ్చటించును." అందుకే మన పాఠ్యభాగము చెప్తుంది, "మీరు వినువారు మాత్రమై యుండి, మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి" (యాకోబు 1:22). దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలో ఈ వచనము మనకు తెలియ చేస్తుంది. I. మొదటిది, దేవుని చిత్తము విషయంలో తమమును తాము మోసపరుచు కొనువారిని గూర్చి ఈ పాఠ్యభాగము మాట్లాడుతుంది. పాఠ్యభాగములోని రెండవ భాగముపై నేను మొదట వ్యాఖ్యానిస్తాను, "మిమ్మును వారు మోస పుచ్చుకొనుట." "దేవుని వాక్య ప్రకారము చేయడం" ను నిరాకరించే వారు మోసపోతారు. వారి జీవితాలకు దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోలేరు. ఈనాటి సంఘాలలో ప్రజలలో ఇది చాలా సర్వ సాధారణము. వారు తరుచు మోసపోయి, వారి జీవితాలకు దేవుని చిత్తము తెలుసుకోలేరు. సాతాను గొప్ప మోసగాడని వారు మర్చిపోతారు. బైబిలు చెప్తుంది ప్రపంచపు దేశాలను సాతాను మోసగిస్తాడు (ప్రకటన 20:3). వాడు "దెయ్యము, సాతాను, సర్వ ప్రపంచాన్ని మోసగించే వాడని పిలువ బడతాడు" (ప్రకటన 12:9). "సాతాను" అనగా "వ్యతిరేకి" లేక "శత్రువు" అని అర్ధము. వాడు దేవుడుని వ్యతిరేకిస్తాడు. వాడి పాత కుట్ర ప్రజలను మోసగించడం. వాడు "సర్వ ప్రపంచాన్ని మోసగిస్తాడు." "మోసపోవడం" అనే పదానికి గ్రీకు పదము "ప్లేనో" దాని అర్ధము. "చెడిపోయేటట్టు చేయడం," "బలత్కరించడం," "తప్పు దోవ పట్టించడం," "ఆకర్షించి చెరపడం." ఇదే ఆరంభంలో సాతాను చేసింది. వాడు మన ఆది తల్లిదండ్రులను మోసగించాడు, చెడిపోవడానికి నడిపించాడు, తోటలోని శపింపబడిన ఫలము తినడానికి బలవంతపెట్టింది. క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది వారి జీవితాలకు దేవుని చిత్తము వారికి తెలుసు అనుకుంటారు. కాని నిజానికి వారు సాతానుచే మళ్ళింపబడ్డారు. చాలామంది వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నారు అనుకుంటారు, కాని వాస్తవానికి దెయ్యముచే నడిపించబడతారు. మీరు అది ఎప్పుడు మర్చిపోకూడదు. అపోస్తలుడైన పేతురు క్రైస్తవులను గద్దిస్తూ ఇలా అన్నాడు, "నిబ్బరమైన బుద్ధి కలవారై [మెలకువగా ఉండండి], తెలివిగా ఉండండి [జాగ్రత్తగా]; మీ [విరోధి] యైన అపవాది... గర్జించు సింహము వలే, ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు" (I పేతురు 5:8). డాక్టర్ మెక్ గీ అన్నాడు, "మీకు మీరుగా సాతానును ఎదిరిస్తారని నేను అనుకోను... ఇతర విశ్వాసులు మీతోపాటు నిలబడాలి" (Thru the Bible; note on I Peter 5:9). అతడు సరిగ్గా చెప్పాడని నేననుకుంటున్నాను. మీరు ఒంటరిగా ఉంటే దెయ్యము మిమ్మును బలవంత పెట్టి దారి మల్లిస్తాడు, లేక రక్షింపబడని వ్యక్తితో సన్నిహిత సహవాసము కలిగి ఉన్న, శారీరకంగా ఆ వ్యక్తీ సహోదరుడు అయినా సహోదరి అయినా. బైబిలు చెప్తుంది, "జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును: మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును" (సామెతలు 13:20). "మూర్ఖుడు" ని స్కోఫీల్డ్ గమనిక బాగా నిర్వచించింది. అది చెప్తుంది (పేజీ 678) "మూర్ఖుడు" లేఖనాలలో మానసిక లోపము గలవాడు కాదు, కాని పొగరుగా ఉండి స్వార్ధము కలిగి; దేవుడు లేనట్టుగా తన జీవితాన్ని తానే శాషించుకుంటాడు." గుడిలో కూడ, పొగరు బోతు మూర్ఖుడే. మీ సహవాసము జ్ఞానులతో ఉండేటట్టు చూసుకోండి, మూర్ఖులతో కాదు! దేవుని చిత్తము నుండి మీరు తొలగి పోయేటట్టు దెయ్యము మూర్ఖులను వాడుకుంటుంది. తరువాత, ఇంకా, అబద్ధపు క్రైస్తవుల ద్వారా కూడ మీరు మోసపోవచ్చు. ఈ ఆఖరి దినాలలో ఇది నిజంగా వాస్తవము. బైబిలు చెప్తుంది, "అయితే దుర్జనులను వంచకులను [పెరుగును] ఇతరులను మోసపరచుచు, తామును మోసపోవుచు, అంతకంతకు చెడి పోవుదురు" (II తిమోతి 3:13). అబద్ధపు క్రైస్తవులు తప్పకుండా మిమ్మును మోసము చేసి దారి మళ్ళిస్తారు. కాని II తిమోతి 3:13 కు వచనము 14 మరియు 15 జవాబు ఇస్తున్నాయి. ఈ చెడ్డ దినాలలో దేవుని వాక్యము మంచి దిక్చూచి. బైబిలుకు విదేయులగు వారితో సన్నిహితంగా ఉండండి. "మోసము చేస్తూ, మోసపోయే వారి" మాటలు వినవద్దు. తరువాత, పరిశుద్ధాత్మ "నడిపించుట" ద్వారా కూడ మీరు మోసపోవచ్చు. ఇది ఈనాటి కొత్త సువార్తికులకు పెద్ద ఉచ్చు. వారికి బోధింప బడింది వారి మనసులో వచ్చిన ప్రతీ తలంపు దేవుని ఆత్మ "నడిపింపు" అని. చాలామంది దాని గూర్చి చాలా ఎక్కువగా మాట్లాడతారు. వారంటారు, "దేవుడు నన్ను ఇది చెయ్యమని నడిపించాడు," లేక "దేవుడు నన్ను అది చెయ్యమని నడిపించాడు." ఎప్పుడు అదే వింటారు. అది ఆత్మీయము అని అనిపిస్తుంది. అతడు బలమైన క్రైస్తవుడని మీరనుకుంటారు. కాని బైబిలు వారిని "మూర్ఖులు" అని పిలుస్తుంది. బైబిలు చెప్తుంది, "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్దిహీనుడు" (సామెతలు 28:26). వారి వీధిలో కూడ, ఇలా చెప్పడం వింటారు, "ప్రభువు ఇది చెయ్యమని నన్ను నడిపించాడు." "ప్రభువు నన్ను ఇక్కడను నడిపించాడు." "ప్రభువు నన్ను వెళ్ళనిచ్చాడు." అలాంటి మాటలు మీరు వినినప్పుడల్లా, ఒక "మూర్ఖుని" నుండి మీరు వింటున్నారు. "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్దిహీనుడు" (సామెతలు 28:26). బైబిలు తేటగా చెప్తుంది, "[నీ] స్వ బుద్ధిని ఆధారము చేసుకొనక" (సామెతలు 3:5). అలా చెయ్యడానికి ప్రజలు నిరాకరిస్తే వారు మోసపోతారు, అది తిరిగి మన పాఠ్య భాగానికి తీసుకెళ్తుంది, "మీరు వినువారు మాత్రమై యుండి, మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి" (యాకోబు 1:22). II. రెండవది, నిజంగా దేవుని చిత్తాన్ని కనుగొనే వారిని గూర్చి ఈ పాఠ్య భాగము మాట్లాడుతుంది. "మీరు వినువారు మాత్రమై కాక, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి..." (యాకోబు 1:22). దేవుని వాక్యము విని దాని నుండి నడిపింపు పొందడానికి, నీవు వినే డానికి లోబడే ఇష్టత కలిగి యుండాలి. వినడానికి షరతు ముందు వచనములో ఇవ్వబడింది, యాకోబు 1:21. "అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోలోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును, సాత్వికముతో అంగీకరించుడి" (యాకోబు 1:21). స్పష్టత కొరకు ఆధునిక అనువాదము మీకు ఇస్తాను. "కాబట్టి, సమస్తమైన చెడుతనము దుష్టత్వమును విడిచిపెట్టి, మీలో నాటబడిన వాక్యమును విధేయతతో అంగీకరించండి, అది మిమ్మును రక్షిస్తుంది" (ఎన్ఐవి)(NIV). ఒక వ్యక్తి సమస్తమైన చెడుతనము, దుష్టత్వము విడిచిపెట్టారు. ఇందులో అశ్లీల చిత్రాలు మత్సరము వస్తాయి. కొంతమంది అపవిత్ర తలంపులకు బానిసలుగా ఉంటూ దేవుని చిత్తాన్ని తెలుసు కోవాలనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులతో మత్సరము కలిగి, సంఘ కాపరితో, గుడిలో ఇతర నాయకులతో ఈర్ష్య కలిగి దేవుని చిత్తము తెలుసు కోవాలని ఆశిస్తారు. వారికి ఈర్ష్య హృదయాలు ఉన్నాయి. ఇతరులైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారితోను, లోకస్తులతోను సన్నిహిత స్నేహము కలిగి ఉంటారు. ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్ట పడతారు ఈ వచనాన్ని మర్చిపోయి "ఈలోకముతో స్నేహము కలవాడు దేవునికి శత్రువు" (యాకోబు 4:4). మిగిలిన వారు ద్వేషము గర్వము కలిగి ఉంటారు. మీరు వీటిని గూర్చి దేవుని దగ్గర ఒప్పుకోవాలి మీ హృదయాలలో నుండి తొలగించమని దేవునినడగాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని నీ జీవిత దిక్చూచిగా ఉండడానికి వినయంగా అంగీకరిస్తావు. అప్పుడు మాత్రమే "మీరు వినువారు కాకుండా, చేయువారుగా ఉంటారు." ఈ వచనముపై వ్యాఖ్యానిస్తూ, గొప్ప స్పర్జన్ అన్నాడు, "ఇది వాస్తవము [వ్యక్తులు క్రైస్తవులని చెప్పుకుంటూ తప్పిపోయే వారు], ఇది అది పట్టుకొని, రహస్య దుష్టత్వము వారి జీవితాలలో ఉంచుకొని వారి మనస్సాక్షితో వాటిని కప్పి పుచ్చుకోవాలనుకుంటారు. సాతాను వారిని శోధిస్తుంది పరిచర్యలో ఎందుకంటే సువార్త వారి నేరారోపణ చేసే స్థితిపై ఒత్తిడి తెచ్చి, వారి పాపాల విషయంలో అసౌకర్యము కలిగిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని సంతోషంగా విని మీకు లాభము చేకూర్చాలనుకుంటే, మీరు ‘దుష్టత్వమును సమస్త కల్మషము విడిచి పెట్టాలి’; ఎందుకంటే ఇవి మిమ్మును దేవుని వాక్యానికి వ్యతిరేకము చేస్తాయి" (C. H. Spurgeon, “Before Sermon, At Sermon, and After Sermon,” MTP, No. 1,847). మీరు దేవుని వాక్యము నుండి లాభము పొందుకోవాలనుకుంటే సమస్త దుష్టత్వము విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే "వాక్యము ప్రకారము చేసే వారవుతారు." మీరు దేవుని వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే మీ జీవితాలకు ఆయన చిత్తాన్ని తెలుసు కుంటారు. ఇప్పుడు నేను బైబిలు నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఆరు మార్గాలు మీకు తెలియ చెస్తాను. 1. మళ్ళీ, ఇది చాలా ప్రాముఖ్యము, దేవుని చిత్తము తెలుసుకోవడానికి మీ హృదయాన్ని మీరు నమ్మవద్దు. నేను మీకు ముందు చెప్పినట్టుగా, బైబిలు చాలా తేటగా చెప్తుంది, "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్దిహీనుడు" (సామెతలు 28:26). అది ఎందుకు అంత ప్రాముఖ్యము? ఎందుకంటే, "హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది: దాని గ్రహింపు గలవాడెవాడు?" (యిర్మియా 17:9). తన స్వంత హృదయాన్ని నమ్ముకొనువాడు "మూర్ఖుడు" అనడంలో ఆశ్చర్యము లేదు. 2. దేవుని చిత్తము తెలుసుకోవడానికి నీవు దేవుని చిత్తము చేయు ఇష్టత కలిగి యుండాలి, నీ చిత్తము కాదు. "ఎవడైనను ఆయన చిత్తము చొప్పున, చేయు నిశ్చయించుకొనిన యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించు చున్నానో వాడు తెలుసుకొనును" (యోహాను 7:17). డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "దీని అర్ధము ఒక వ్యక్తి దేవుని చిత్తము చెయ్యాలని ఎన్నుకుంటే, దేవుడు అది అతనికి బయలు పరుస్తాడు" (The Son of God, commentary on the Gospel of John, Sword of the Lord Publishers, 1976, p. 162). డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "ఇది చదవబడవచ్చు: ‘ఎవరైనా యదార్ధంగా దేవుని చిత్తము చెయ్యాలనుకుంటే, అతనికి తెలుస్తుంది... అలా, ఒక విషయముపై దేవుని చిత్తము కనుగొనడానికి మొదటి అవసరత... దేవుని చిత్తాన్ని గైకొనడానికి యదార్ధమైన ఇష్టత కలిగి యుండాలి, అతని ప్రాధాన్యతకు వ్యతిరేకంగా జవాబు వచ్చినప్పటికినీ" (The Defender’s Study Bible; note on John 7:17). 3. దేవుని చిత్తము తెలుసుకోవడానికి నీవు నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. "అత్రిక్రమములను దాచి పెట్టువాడు వర్ధిల్లడు: వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందును. నిత్యమూ భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు: హృదయమును కఠిన పరచుకొనువాడు కీడులో పడును" (సామెతలు 28:13, 14). 4. దేవుని చిత్తమును తెలుసుకోడానికి నీవు నీ క్రైస్తవ తండ్రి ఉపదేశము త్రోసి వేయకూడదు. "మూర్ఖుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును: గద్దింపునకు లోబడువాడు బుద్ధి మంతుడగును" (సామెతలు 15:5). "తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును: అపహాసకుడు గద్దింపు నకు లోబడును" (సామెతలు 13:1). 5. దేవుని చిత్తమును తెలుసుకోవడానికి నీవు సంఘములో ఆత్మీయ నాయకుల ఉపదేశమునకు లోబడాలి. "మీపై నాయకులుగా ఉన్నవారు [స్కోఫీల్డ్, గైడ్ చేస్తుంది] లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయుచున్నారు: వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, మీకు నిస్పృహ యోజనము, కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, వారి మాట విని వారికి లోబడి యుండుడి..." (హెబ్రీయులకు 13:17). హెబ్రీయులకు 13:17 ను సంబంధించి సంస్కరణ పఠన బైబిలు చెప్తుంది, "నమ్మకస్తులైన సంఘ నాయకులు నమ్మకస్తులైన కాపరుల వలే లేక కాపలా దారుల వలే ఉండి పట్టణానికి ప్రమాద సూచనలు ఇస్తుంటారు. నాయకుల కాపుదల లోతైనది సరియైనది ఎందుకంటే వారు దేవునిచే ఏర్పరచబడిన వారు ఆయనకు లెక్క అప్పగిస్తారు. వారి పరిచర్యను నిరాకరిస్తే ప్రతి ఒక్కరు కష్ట పడతారు." 6. దేవుని చిత్తము తెలుసుకోడానికి నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మరియు లోకాను సారంగా ఉండకూడదు. "కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, మీ శరీరములను, ఆయనకు సమర్పించుకొనుడని, దేవుని వాత్సల్యమును బట్టి, మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును, అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి, తెలిసి కొనునట్టు, మీ మనస్సు మారి నూతనమగుట వలన, రూపాంతరము పొందుడి" (రోమా 12:1, 2). "మారిన మనస్సు దేవుని వాక్యముచే నియంత్రించ బడుతుంది" (MacArthur Study Bible; note on Romans 12:2). దయచేసి నిలబడి మీ పాటల కాగితంలో 4 వ పాట పాడండి. మనము ఆయన వాక్యపు వెలుగులో ప్రభువుతో నడిచేటప్పుడు, దయచేసి నిలబడే ఉండండి. రోమా 10:16 లో, అపోస్తలుడైన పౌలు అన్నాడు, "అయినను అందరు సువార్తకు లోబడ లేదు." డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "పౌలు ఎలా చెప్పాడో గమనించండి. ఆయన చెప్పలేదు వారందరూ సువార్తను నమ్మలేదని, కాని వారందరూ దానికి లోబడలేదు అని...సువార్త స్పందనను ఆశిస్తుంది. కార్యాచరణ కోరుతుంది...విధేయతను ఆశిస్తుంది. సువార్త ఒకని జీవితాన్ని అంతటిని తాకుతుంది. అది అదుపు చేయడానికి ఉంది, జీవితంలో కేంద్ర బిందువు, అది ఒకని మొత్తము దృక్పదాన్ని శాశిస్తుంది. విధేయత అంటే లోబడుట అని అర్ధము... విధేయత అవసరము ఎందుకంటే పాపములో ఉన్న సారంశము దేవునికి అవిధేయులగుట" ("దేవుని సువార్త విధేయత"). క్రీస్తు మీరు మీ పాపములను బట్టి పశ్చాత్తాప పడి ఆయన దగ్గరకు రావాలని పిలుస్తున్నాడు. ఆయన మీపాపాలు చెల్లించడానికి సిలువపై మరణించాడు. సువార్తకు విధేయులవాలని ఆయన మిమ్ములను పిలుస్తున్నాడు – ఆయన ఆజ్ఞకు లోబడి విధేయతతో ఆయన దగ్గరకు రావాలని ఆయన మిమ్ములను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు రావడానికి నిరాకరిస్తే ఆయన ఆజ్ఞకు మీరు అవిదేయులవుతున్నారు. మీరు మిమ్మును మీరు యేసు క్రీస్తుపై తప్పకుండా సంపూర్ణంగా వేసుకోవాలి. "అది సువార్తకు విధేయత అంటే అర్ధము. అది మిమ్మును క్రైస్తవునిగా చేస్తుంది" (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి.). మీరు నిజ రక్షణలో సువార్తకు విధేయులవుట విషయంలో మీరు మాతో మాట్లాడాలను కుంటే, దయచేసి డాక్టర్ కాగన్ మరియు నోవా సాంగ్ మరియు జాన్ కాగన్ ను ఆవరణము వెనుకకు వెంబడించండి. అందరు కళ్ళు మూసుకొని ఉండగా, దయచేసి వారిని వెంబడించి వెనుకకు వెంట ఇప్పుడే వెళ్ళండి. వారు మిమ్ములను విచారణ గదిలోనికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడి ప్రార్ధిస్తారు. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యాకోబు 1:21-25. |
ద అవుట్ లైన్ ఆఫ్ దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా HOW TO KNOW THE WILL OF GOD డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే "మీరు వినువారు మాత్రమై యుండి, మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి" (యాకోబు 1:22). (కీర్తనలు 119:105; సామెతలు 6:22) I. మొదటిది, దేవుని చిత్తము విషయంలో తమమును తాము మోసపరుచు కొనువారిని గూర్చి ఈ పాఠ్యభాగము మాట్లాడుతుంది, ప్రకటన 20:3; 12:9; I పేతురు 5:8; సామెతలు 13:20; II తిమోతి 3:13; సామెతలు 28:26; 3:5.
II. రెండవది, నిజంగా దేవుని చిత్తాన్ని కనుగొనే వారిని గూర్చి ఈ పాఠ్య భాగము మాట్లాడుతుంది, యాకోబు 1:21; 4:4; సామెతలు 28:26; యిర్మియా 17:9;
|