Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఆఖరి దినాలలో ఉపవాసము మరియు ప్రార్ధన

FASTING AND PRAYER IN THE LAST DAYS
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంత్రము, ఏప్రిల్ 24, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 24, 2016


దయచేసి నాతోపాటు మత్తయి 24:12 చూడండి. ఈ వచనము యాభై సంవత్సరాలుగా నాకు ఆదరణను ఇస్తూ వస్తుంది. దయచేసి గట్టిగా చదవండి.

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12).

ఆ భయంకర వచనము నన్ను ఎలా ఆదరిస్తుంది? ఎందుకంటే అది ఆఖరి దినాలలో సంఘాల పరిస్థితిని చూపిస్తుంది. మంచి క్రైస్తవులకు విచారపడేది ఏమి ఉండదు. ఆఖరి దినాలలో ఇలా ఉంటుందని యేసు ఈ విధంగా చెప్పాడు. పదము "అక్రమము" అనగా "చట్టము లేనిది." దాని అర్ధము "అనోమియా" – అంటే "ఉల్లంఘించుట" లేక క్రొత్త నిబంధనలోని నియమాలను "అత్రిక్రమించుట." దాని అర్ధము ఆఖరి దినాలలో సంఘాలు బైబిలు బోధలను గైకొనవు. ఈ చట్టము లేని కారణంగా "అనేకుల ప్రేమ [చల్లారును]." ఒక ఆధునిక తర్జుమా దానిని ఇంకా బలంగా చెప్తుంది, "చాలా మంది ప్రేమ చల్లారిపోతుంది" (ఎన్ఐవి)(NIV). అనువదింపబడిన "ప్రేమ" చాలా ప్రాముఖ్యము. అది గ్రీకు పదము "విశిష్ట" నుండి వచ్చినది – ఆ పదము కేవలము క్రైస్తవ ప్రేమను గూర్చి వాడబడుతుంది. వైన్ దానిని "క్రైస్తవ్యము యొక్క గునశీలత పదము" అని అన్నాడు. డాక్టర్ హెన్రీ యం. మోరిస్ ఆఖరి దినాలలోని లవోదికయ సంఘాల విషయంలో గమనికగా చెప్పాడు, "ఈనాడు విస్తారమైన గొప్ప సంఘాలున్నాయి అవి సువార్త పదము నామకార్ధంగా బైబిలు పదమైనది... ఆత్మీయంగా పేదరికములో ఉన్నవి" (The Defender’s Study Bible; note on Revelation 3:17). ఈ సువార్తీకర ప్రాథమిక సంఘాలను గూర్చి ప్రకటన 3:17 లో వివరించబడింది, "నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవైయున్నవని ఎరుగక."

సంఘాలకు అన్వయింపదగ్గ సామాన్య పరీక్ష – వాటికి "అత్యంత" ప్రేమ ఉందా? సంఘములో ఉంటూ వారు ప్రేమిస్తున్నారా? క్రీస్తు నందు వారి సహోదరీ సహోదరులతో సహవాసము కలిగియుంటూ వారు ప్రేమను చూపిస్తున్నారా? చాలామంది చెయ్యడం లేదు. మన బాప్టిస్టు సంఘాలలో గొప్ప విషాద విషయము అవి ఆదివారము రాత్రి ఆరాధనలు ఆపేస్తున్నారు. ఇది సామాన్యము డాక్టర్ కాగన్ టెక్సాస్ లోని డాలస్ లో, ఆదివారము రాత్రి ఆరాధన కలిగిన ఒక్క బాప్టిస్టు సంఘాన్ని కూడా కనుగొన లేకపోయారు! ఒకటి ఉండ వచ్చేమో, కాని ఆయన కనుగొనలేక పోయారు! డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ గొప్ప మొదటి బాప్టిస్టు సంఘము దానికి ఇప్పుడు ఆదివారము రాత్రి ఆరాధన లేదు. డాక్టర్ జామ్మీ డ్రాపర్ గొప్ప సంఘము డాలస్ ఊరి ఆవలది దానికి ఆదివారము రాత్రి ఆరాధన లేదు. డాక్టర్ జె. ఫ్రెంక్ నోరిస్ గొప్ప బాప్టిస్టు సంఘము పోర్ట్ వర్త్ లోనిది దానిలో ఆదివారము రాత్రి ఆరాధనలు లేవు. డాలస్ సమీపంలో ఉన్న, డాక్టర్ జాన్ ఆర్. రైస్ గొప్ప గలిలియ బాప్టిస్టు సంఘము కూడ, వారి ఆదివారము రాత్రి ఆరాధనలు రద్దు చేసారు. డాక్టర్ కాగన్ అన్నాడు, "టెక్సాస్, డాలస్ లాంటి – బైబిలు పరముగా లోతైన దానిలో కూడ పాతకాలపు నిజమైన క్రైస్తవ్యము లేకపోవడం ఆశ్చర్య కరము."

చాలా ప్రాధమిక సంఘాలు కూడ ఇలాగే వెళ్తున్నాయి. ప్రాధమిక బాప్టిస్టు సహవాసములో ఉన్న ఒక ప్రసిద్ధ సంఘము ఆదివారము రాత్రి ఆరాధన ఆపేసిందని విని నేను ఈ మధ్య ఎంతో అదిరిపడ్డాను. ఉదయము ఆరాధనా తరువాత వాళ్ళకు అల్పాహారము ఇస్తున్నారు, మద్యాహ్నము 1:30 కి బైబిలు పఠనము జరుగుతుంది. ఒక బోధకుడు అన్నాడు, "ఎక్కువ బైబిలు వారు పొందుకుంటారు" – "బైబిలు పొందడం" గుడికి వెళ్ళడానికి ఒకటే కారణము ఉన్నట్టు! పాతకాలపు బాప్టిస్టులు ప్రతీ ఆదివారము రాత్రి సువార్తిక ఆరాధనలు కలిగి ఉంటున్నారా, సంఘస్తులు నశించు వారిని సువార్త వినడానికి తీసుకొని వస్తుంటారు. పాతకాలపు బాప్టిస్టులు ఆదివారము రాత్రి గొప్ప సహవాసము కలిగి ఉండేవారు. నాకు అంతగా గుర్తులేదు. ఇప్పుడు వారికి కావలసింది "బైబిలు పొందుకోవడం." వారు ఇంకా ఎక్కువ బైబిలు "పొందుకుంటారు" వారు ఇంటిలో ఉండిపోయి రేడియోలో డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ చెప్పేది వింటే! కాని మత్తయి 24:12 ఇలా చెప్పడం లేదు, "అక్రమము విస్తరించుట చేత, వారు తక్కువ బైబిలు పొందుకుంటారు." కాదు! కాదు! అది చెప్తుంది, "అక్రమము విస్తరించుట చేత, [అద్వితీయ] ప్రేమ చాలా మందిది చల్లారి [పోతుంది]." ఆదివారము రాత్రి ఆరాధనలు వదిలి పెట్టిన బాప్టిస్టు సంఘాలలో అద్వితీయ సహవాసము పూర్తిగా కనపడకుండా పోయింది. కొన్ని సంవత్సరాలలో ఈ బాప్టిస్టు సంఘాలు నిస్సారమైపోతాయి నిర్జీవమై పోతాయి యునైటెడ్ మేథడిష్టుల వలే యునైటెడ్ ప్రేస్బిటేరియనుల వలే, అవి 50 సంవత్సరాల క్రిందట ఆదివారపు రాత్రి ఆరాధనలు విడిచి పెట్టేసారు. అది వారికి మంచి పని అనిపించింది, కాని అదివారిని చంపేసింది! సంవత్సరాలుగా అవి లక్షలాది మంది సభ్యులను కోల్పోయాయి. దక్షిణ బాప్టిస్టులు గత సంవత్సరము 250,000 మందిని పోగొట్టు కోవడంలో ఆశ్చర్యము లేదు! సహవాసము లేదు, ప్రేమ లేదు, గుడులకు రావడానికి సరియైన కారణమూ వారికి లేదు. మరియు ప్రాధమిక బాప్టిస్టులు ఏమి మంచిగా చేయడం లేదు.

ఇదంతా సంఘాలకు జరుగుతుంది అదేవిధంగా అమెరికా నైతికంగా ఆత్మీయంగా పడిపోతుంది. సాతాను శక్తులు వాడి దెయ్యాలు మన దేశాన్ని పరిపాలిస్తున్నాయి, బాప్టిస్టులు ఆదివారము రాత్రి ఆరాధనలు మూసేశారు తద్వారా ప్రజలు టివిలో చెత్త చూసి పడకలకు త్వరగా వెళ్తున్నారు! దేవుడు మనకు సహాయము చేయుగాక! ప్రకటన గ్రంధములోని ఏడూ సంఘాలు ముస్లీములచే పూర్తిగా నాశనము చెయ్యబడ్డాయి. ముస్లీములు ఇక్కడకు వచ్చి మన బాప్టిస్టు సంఘాలను నాశనము చేసారంటే నేను ఆశ్చర్యపోను! వారిని ఏమి ఆపుతుంది? ఆదివారము రాత్రి గుడికి వెళ్ళడానికి చాలా బద్దకించే వారు తప్పకుండా వారిని ఆపలేదు! వారు ఎలా చేయగలరు?

దెయ్యపు శక్తులు గొంతును నొక్కడం ద్వారా అమెరికా యూరపులను పట్టుకున్నాయి! మన సంఘాలను వచ్చే వరకు నోక్కేస్తున్నాయి! ఆఖరి దినాలలో ఉండే ప్రజలను గూర్చిన వివరణ, II తిమోతి 3:1-5 లో ఇవ్వబడింది.

"అంత్య దినములలో, అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఎలాగనగా మనష్యులు స్వార్ధ ప్రియులు, ధనాపేక్షులు, బింకము లాడువారు, అహంకారము, దూషకులు, తల్లిదండ్రులకు అవిదేయులు, కృతజ్ఞతలేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు; పైకి భక్తీ గల వారి వలే ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు: ఇట్టి వారికి విముఖుడవై యుండుము" (II తిమోతి 3:1-5).

"క్రైస్తవులు" అని పిలువబడే వీరు, అమెరికా మరియు పాశ్చాత్య దేశాల నీతిమత్వాన్ని అణగ ద్రొక్కుచున్నాయి. వారు వారినే ప్రేమించుకుంటారు. వారు డబ్బును మాత్రమే ప్రేమిస్తారు. వారు తిరుగుబాటుదారులు, కృతజ్ఞులు, మరియు అపరిశుద్ధులు. పైకి భక్తీ గల వారివలే ఉండియు దేవుని శక్తి లేని వారైయున్నారు.

ఇప్పుడు II తిమోతి 3:12, 13 వినండి.

"క్రీస్తు, యేసు నందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వచకులును ఇతరులను మోసపరచుచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడి పోవుదురు" (II తిమోతి 3:12, 13).

వీరు మన సంఘములో క్రీస్తు కొరకు జయించాలనుకుంటున్నారు! అది మనం ఎలా చేయగలం! అది మానవ రిత్యా అసంభవం! వారిని గుడికి తేవాలని హృదయ పూర్వకంగా కష్ట పడతాం – కాని వారి మనసులు పూర్తిగా విడియో గేములు చెత్త సినిమాలతో నిండి పోయాయి వారు వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను బోధిస్తున్నప్పుడు నావైపు కూడ చూడరు. అర్ధ రహితంగా వారి చేతుల వైపు చూసుకుంటారు. ఆడుకోవడానికి సెల్ ఫోను ఉండదు కనుక వారి వేళ్ళకు దురదలు పుడతాయి! వారి మనసులు శూన్యంగా ఉంటాయి హెచ్. జి. వేల్స్ యొక్క "టైమ్స్ మెషిన్" వలే. అర్ధరాత్రి TV లో వారు చూసే జాంబీల వలే చచ్చిన స్థితిలో ఉంటారు!

ఇప్పుడు లూకా, 4:18-19 చూడండి. యవనులైన పాపుల కొరకు ఈనాడు ఇది చేయడానికి యేసు క్రీస్తు వచ్చాడు. నేను అది చదువుతాను. యేసు అన్నాడు,

"ప్రభువు ఆత్మా నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను; చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని, ప్రకటించుట గలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు, అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను" (లూకా 4:18-19).

యవనస్తులకు అలా చేయడానికి యేసు వచ్చాడు. కాని సాతాను శక్తులు ఎంత బలంగా ఉన్నాయంటే క్రీస్తు రక్షించు కృప చాలామందికి అందడం లేదు. దేవుని సన్నిధి శక్తి మనము కలిగి యుండాలి లేనిచో మనము వారికి సహాయము చెయ్యలేము! మనం చాలామందిని గుడికి తీసుకు రావచ్చు – కాని బహుకొద్ది మంది యేసు రక్షించు కృపను అనుభవిస్తారు! బహుకొద్ది మంది రక్షింపబడతారు – దేవుని శక్తిని పంపకపోతే, మన సంఘములోనికి, సాతాను శక్తి కంటే మించిన దానిని!

అక్కడ ఉపవాసము ప్రార్ధన వస్తాయి! శిష్యులు మార్కు తొమ్మిదవ అధ్యాయములో ఉన్న వ్యక్తికీ, సహాయము చెయ్యలేకపోయారు. వాడు దెయ్యలతో బందీ అయ్యాడు – సువార్త వినడానికి మన సంఘానికి మనం తీసుకొచ్చే చాలా మంది చిన్న పిల్లల వలే. ఆ బాలుడు దెయ్యాల అదుపులో ఉన్నాడు. బైబిలు చెప్తుంది మనం గుడికి తీసుకొని వచ్చే ప్రతీ నశించు యవనస్తుడు – వారిలో ప్రతి ఒక్కడు – కొంత వరకు సాతానుచే గుడ్డి వాడై అదుపు చేయబడుచున్నాడు – "వాయు మండల సంబంధమైన అధిపతి, అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి" (ఎఫెస్సీయులకు 2:2). మార్కు 9 లో ఉన్న యవనస్తుడు దెయ్యము పట్టినవాడే. శిష్యులు అతనికి సహాయము చెయ్యడానికి శక్తి హీనులయి పోయారు. మార్కు 9:28, 29 చూడండి. నిలబడి ఆ రెండు వచనాలు గట్టిగా చదవండి.

"ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళ గొట్టలేక పోతిమని, ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన, ఉపవాస ప్రార్ధన వలననే గాని, మరిదేని వలననైనను ఈ విధమైనది వదిలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28, 29).

కూర్చోండి. "ఎలాంటి [దెయ్యము] ప్రార్ధన వలన, ఉపవాసము వలన మాత్రమే వదిలిపోవును."

నేను ఒప్పింపబడ్డాను కేవలము ప్రార్ధన వలన మనము ఎక్కువమంది యవనస్తులు రక్షింపబడేటట్టు చేయలేం. "ఎలాంటిది కేవలము ప్రార్ధన మరియు ఉపవాసము వలన, మాత్రమే జరుగుతుంది." ఒక విషయము కచ్చితము "మరియు ఉపవాసము" మూల గ్రీకు ప్రతులలో ఉన్నాయి. దయ్యముచే పట్టబడిన యోగా మునులు ఆ రెండు మాటలు తొలగించారు. ఆధునిక సంఘాలు, ఆధునిక బైబిలులలో ఈ రెండు పదాలు తొలగించారు. ఎందుకు? ఎందుకంటే దెయ్యము సంఘాలను దొంగిలించాలనుకుంది ఆఖరి దినాలలో దేవుని శక్తిని దెయ్యపు శక్తితో తికమకలో ఉన్న యవనస్తులను రక్షింపకుండా – అందుకే!

"అందుకాయన ప్రార్ధన వలననే, మరియు ఉపవాసము వలననే ఇలాంటిది వదిలి పోవుట సాధ్యము" (మార్కు 9:29).

కూర్చోండి.

ఆమెన్! అందుకే మనం ఉపవసించి ప్రార్ధించాలి! క్రీస్తు శక్తిని పొందుకోవడానికి అదే మార్గము! నశించు ప్రజలను మార్చడానికి అదే మార్గము. దేవుని శక్తి మరియు కృప ద్వారాలను తెరవడానికి అదే మార్గము! సాతాను దాని దయ్యపు శక్తులను జయించడానికి అదే మార్గము!

"ఇలాంటిది కేవలము ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారా, మాత్రమే సాధ్యము"!!

హల్లెలూయా! శత్రువును జయించడానికి దేవుడు ఒక ఖడ్గాన్ని మనకు ఇచ్చాడు. ఆ ఖడ్గము "ప్రార్ధన మరియు ఉపవాసము." ఇప్పుడే యెషయా 58:6 చూడండి.

"నేను ఎన్నుకున్న ఉపవాసము కాదు కదా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడికి తిరుగ గొట్టుటయు నేర్పరచు కొనిన ఉపవాసము గదా?" (యెషయా 58:6).

కూర్చోండి. ఈ వచనము చూపిస్తుంది దేవునిచే ఎన్నుకొనబడిన ఉపవాసము క్రీస్తు శక్తిని నశించు పాపులకు తీసుకొని వస్తుంది. ఉపవాసము ప్రార్ధన దుర్మార్గుల కట్లను విప్పుతుంది, బరువులను తగ్గిస్తుంది – బాదింప బడిన వారిని విడిపిస్తుంది – ప్రతి దయ్యపు కాడిని విరుగగొట్టుతుంది! ఉపవాసము ప్రార్ధన క్రీస్తు విలువలను సాతానుచే అందులైన దుష్ట శక్తులచే అణచి వేయబడు ప్రజలకు తీసుకొని వస్తుంది! యేసు అన్నాడు,

"ప్రభువు ఆత్మా నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను; చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు" (లూకా 4:18-19).

ఉపవాసము ప్రార్ధన క్రీస్తు విలువలను సాతాను అదుపులో ఉన్న పాపులకు తెలియచేస్తాయి!

ఆర్డర్ వాలిస్ అన్నాడు, "దేవుడు యెషయా ద్వారా బయలు పరిచాడు ఆయన ఎన్నుకోబడిన ఉపవాసము స్వభావము విముక్తితో [అది] కూడినది... తప్పకుండా ఆత్మీయ పరిధిలో దాని అన్వయింపు ఉంది. మానవులు బంధింపబడియున్నారు, స్టీలు లేక ఇనుప సంకెళ్ళతో కాదు, కాని కనిపించని దుష్ట సంకెళ్ళతో. [ఉపవాసము చేసేవారు] సామాజిక కాదు కాని ఆత్మీయమైన, సాతాను అణచివేతతో పోరాడుచున్నారు... వివేచించే కన్ను గుర్తించగలదు జీవిత పయనంలో మనం కలిసే వారు దెయ్యముచే అణచి వేయబడుతున్నారు, సాతానుతో విసిగిపోతున్నారు, వారికి ఆర్ధము కాని శక్తులకు బందీలవుతున్నారు వాటి నుండి స్వతంత్రులవలేకపోతున్నారు" (దేవునిచే ఎన్నుకోబడిన ఉపవాసము, పేజీలు 63, 64). ఉపవాసము ప్రార్ధన స్త్రీ పురుషులను వారిని బంధించిన సంకెళ్ళ నుండి సాతాను బానిసత్వము నుండి బయటకు రావడానికి సహాయ పడుతాయి. ఉపవాసము శక్తివంతమైన ఆయుధము, దేవునిచే ఏర్పాటు చేయబడినది, ప్రజల హృదయాలపై సాతాను పట్టును విరుగగొట్టడానికి ఏర్పాటు చేయబడింది.

మనము ఉపవసించేటప్పుడు లోతైన పాపపు ఒప్పుకోలు కొరకు దేవునికి ప్రార్ధించాలి. ప్రజలు సహజంగా పాపపు ఒప్పుకోలు పొందుకోరు. సహజంగా ప్రజలందరు సమర్ధించుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యము అవసరము. పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు, ప్రజలు వారి పాపాన్ని అసహ్యించుకొని, పాపపు క్రియలు విడిచి పెడతారు. వారి స్వంత పాపపూరిత హృదయాలను బట్టి ఒప్పింపబడతారు. మనం ఉపవసించేటప్పుడు లోతైన పాపపు ఒప్పుకోలు దేవుడు పంపించేటట్టు ప్రార్ధించాలి. ఎవరైతే "ఎలా రక్షింప బడాలోనేర్చుకొనేవారు" వారి పాప భూ ఇష్ట తిరుగుబాటు హృదయాలను గూర్చి లోతైన ఒప్పుకోలులోనికి రావాలి. అలాంటి ఒప్పుకోలు తేవడానికి దేవుడు ఉపవాసము ప్రార్ధన ఉపయోగించుకుంటాడు. పాపపు ఒప్పుకోలు లేకుండా క్రీస్తు సువార్త వారికి అర్ధ రహితంగా ఉంటుంది. చాలామంది "గుడి పిల్లలలో" అదే తప్పు జరుగుతుంది. మొన్నటి రాత్రి వారిని లేక్కించాను. వారిలో చాలా తక్కువ మంది క్రీస్తును వెంబడించిన వారయ్యారు. మిగిలిన వారు ఏ ఒక్కరు కూడ వారి లోకము పాపములను బట్టి ఒప్పుకోలు పొందుకోలేదు. మనం ఉపవసించి ప్రార్ధించాలి దేవుడు వారిని ఒప్పించేటట్టు, హృదయాలను విరుగగొట్టేటట్టు, వారిని తగ్గింపు కలిగిన యేసు శిష్యులుగా మార్చేటట్టు!

కేవలము దేవుని ఆత్మా మాత్రమే ప్రజలు పశ్చాత్తాపపడేటట్టు చేస్తుంది. ప్రార్ధన ఉపవాసము తరుచు అవివేకులను క్రీస్తు రక్తము యొక్క అవసరతను చూసేటట్టు చేస్తుంది పాపమును అసహ్యించుకొనే దేవుని దృష్టిలో శుద్దులయ్యేటట్టు చేస్తుంది. ఉపవాసము ప్రార్ధన దేవుడు మనకిచ్చిన సాధనాలు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును మన మధ్య ఉన్న తిరుగుబాటు చేసే పాపుల హృదయాలలో చేసేటట్టు సహాయ పడతాయి!

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "కొన్ని సమయాలలో మనము లోకములోని సమస్తమునకు మన వీపు చూపి దేవుని ముఖమును వెదకాలి. అలాంటి సమయాలు ఉపవాసము ప్రార్ధన సమయాలుగా ఉండాలి" (ప్రార్ధన: అడుగుట పొందుకొనుట, పేజి 216).

నేననుకుంటాను మీలో రక్షింపబడిన వారు గ్రహించాలి మన సంఘములో ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మ అవసరము. మనం ప్రార్ధించే టప్పుడు ఆయన సన్నిధి మనకు అవసరము. ఆయన మనకు చూపించడం అవసరం మన జీవితాలతో ఆయన ఏమి చెయ్యాలను కుంటున్నాడో. ఏమి బోధించాలో కాపరికి చూపించడానికి ఆయన మనకు అవసరము. మనలను ప్రార్ధన యోధులుగా చేయడానికి ఆయన మనకు అవసరము. నశించు వారిని ఇక్కడకు తెచ్చి వారు మారిన తరువాత ఇక్కడ ఉండేటట్టు చేయడానికి ఆయన మనకు అవసరము. ఎప్పటి నుండో లేని ఉజ్జీవము తేవడానికి ఆయన మనకు అవసరము. ఆయన మనకు కావాలి, మనలను వంచడానికి, విరుగగొట్టడానికి, మనలను మలచడానికి ఆయన చిత్తము జరిగించడానికి. మనం తరుచు పాడతాం,

సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
నన్ను కరిగించు, మలుచు, విరుగగొట్టు, వంచు.
సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
("సజీవుడైన దేవుని ఆత్మ" డానియెల్ ఐవర్ సన్ చే, 1899-1977;
డాక్టర్ హైమర్స్ చే మార్చబడింది).
   (“Spirit of the Living God” by Daniel Iverson, 1899-1977;
      altered by Dr. Hymers).

ఈ చిన్నపాట నిజంగా ఒక ప్రార్ధన అవుతుంది దాని కొరకు మనం ఉపవసించి ప్రార్ధించినప్పుడు. ఆత్మీయ క్రైస్తవులకు తెలుసు మన మధ్యలో దేవుని ఆత్మ దిగి రావాలని – లోక రిత్యా ఉన్న మన యవనస్తుల హృదయాలను మార్చడానికి, లోక రిత్యా ఉన్న సంఘపు బయట పిల్లలను మార్చడానికి. కాబట్టి నేను మిమ్ములను అడుగుతున్నాను వచ్చే శనివారము ఉపవాస ప్రార్ధన దినంగా ఏర్పాటు చేసుకోండి – సాయంత్రము 5:30 వరకు మనము ప్రార్ధన కూటమున కలుసుకునే వరకు. ప్రార్ధన కూటము తరువాత మనకు భోజనము ఉంటుంది. వచ్చే శనివారము రాత్రి సువార్తీకరణ ఉండదు, కేవలము ప్రార్ధనా సమయము ఉపవాస దినము మాత్రమే ఉంటాయి. మనము గొప్ప సువర్తీకరణ చేసాము – కాని దాని నుండి మంచి ఫలము మనము పొందుకోలేదు. పాల్ జి. కుక్, ఆయన పుస్తకము పరలోకము నుండి అగ్నిలో, అన్నాడు, "సువర్తీకరణ మాత్రమే మంచి నిలిచి పోయే ఫలితాల నివ్వదు, పరిశుద్ధాత్మ కదలిక జోడు కాకుండా" (పేజి 108). ఆయన అన్నాడు ఆది మెథడిష్టులు "వారికి తెలుసు వారి సంఘాల అభివృద్ధి వారి ఆశీర్వాదము క్రిందకు దిగి వచ్చి దర్శించే దేవునిపై ఆధారపడి ఉంది." ఆయన అన్నాడు, "ఈ సామాన్య, నమ్మే స్త్రీ పురుషులు వారి మధ్య దేవుని అద్భుత కార్యాలను గూర్చి చూసారు. వారి నమ్మరు దేవుడు పనిచెయ్యకపోతే వారు ఆయన నామములో ఏదీ సాధించకుండా శక్తిహీనులు అయిపోతారు. ఇది వివరిస్తుంది ఎందుకు వారు అంత అతి ఆసక్తితో ఎక్కువగా ప్రార్ధించారో" (పేజి 105). "వారు నమ్మారు సువార్త ప్రచారము సంఘము ఆరోగ్యము పూర్తిగా దేవుని యొక్క దయ శక్తులపై ఆధారపడి ఉందని, అందుకే వారు అంత ఎక్కువగా ప్రార్ధించారని" (పేజి 28).

మనం ఉపవసించి ప్రార్ధిద్దాం దేవుడు శక్తితో మన సంఘములోనికి దిగి వచ్చి లోకరిత్యా యవనుల హృదయాలను, సంఘపు పిల్లలను కొత్త పిల్లలను మార్చునట్లుగా. మీరు ఆరోగ్యంగా ఉంటే, ఏమి తినకుండా వచ్చే శనివారము సాయంత్రము 5:30 ప్రార్ధన కూటము వరకు ఉండండి. ఉపవసించడానికి ఆరోగ్యంగా లేకపోతె, రోజంతా ప్రార్ధించండి దేవుని ఆత్మ మన సంఘములోనికి దిగి వచ్చునట్లు. మీరు ఉపవసించడానికి తగిన ఆరోగ్యము ఉందో లేదో తెలుసుకోవడానికి ముందు, మీకు డాక్టర్ చాన్ ను గాని డాక్టర్ జుడిత్ కాగన్ ను గాని సంప్రదించండి. ఉపవసించే ఆరోగ్యము మీకు ఉందో లేదో వారు చెప్తారు. మీకు కాఫీ టీలు తాగే అలవాటు ఉంటే, మీరు ఒకటి రెండు కప్పులు తలనొప్పి రాకుండా తీసుకోవచ్చు. మిగిలిన సమయంలో నీరు మాత్రమే తాగండి. రోజంతా ఎక్కువ నీరు త్రాగేటట్టు చూసుకోండి, ముఖ్యంగా మీరు పనిచేస్తుంటే. గంటకొకసారి ఒక గ్లాసు నీరు తాగండి. మనమందరమూ లేచి నిలబడి 6 వ పాట పాడుదాం.

మనము ప్రభువుతో ఆయన వాక్యపు వెలుగులో నడిచేటప్పుడు,
   ఎంతో గొప్ప మహిమ ఆయన మన మార్గములో క్రుమ్మరిస్తాడు!
ఆయన మంచి చిత్తాన్ని మనము చేస్తే, ఆయన మనతో పాటే ఉంటాడు,
   ఎవరు విశ్వసించి వేదేయులవుతారో వారందరితో ఉంటాడు.
విశ్వసించి విధేయులవండి, వేరే మార్గము లేదు కాబట్టి
   యేసులో ఆనందంగా ఉండడానికి, విశ్వసించి విదేయులవడం తప్ప.

కాని మనము ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఎన్నటికి రుజువు చేయలేదు
   బలిపీఠముపై అంతా క్రుమ్మరించే వరకు;
ఆయన చూపే దయకు, ఆయన ఇచ్చే ఆనందానికి,
   అవి ఆయనను విశ్వసించి విదేయులగు వారికి మాత్రమే.
విశ్వసించి విధేయులవండి, వేరే మార్గము లేదు కాబట్టి
   యేసులో ఆనందంగా ఉండడానికి, విశ్వసించి విదేయులవడం తప్ప.

తరువాత మధుర సహవసములో ఆయన పాదాల దగ్గర కూర్చుంటాము.
   లేక మార్గములో ఆయన ప్రక్కన మనము నడుస్తాం;
ఆయన చెప్పేది మనం చేస్తాం, ఆయన పంపే చోటికి మనం వెళ్తాం;
   భయపడవద్దు, కేవలము విశ్వసించి విధేయులు కండి.
విశ్వసించి విధేయులవండి, వేరే మార్గము లేదు కాబట్టి
   యేసులో ఆనందంగా ఉండడానికి, విశ్వసించి విదేయులవడం తప్ప.
("విశ్వసించు విదేయుడవగు" జాన్ హెచ్. సామిస్ చే, 1846-1919).
(“Trust and Obey” by John H. Sammis, 1846-1919).

ఈ రాత్రి ఈ ప్రసంగం మీతో తీసుకెళ్ళండి. వచ్చేవారమంతా ప్రతీ రాత్రి పడుకునే ముందు చదవండి. పడుకునే ముందు పాట పల్లవి పాడండి. శనివారము మళ్ళీ చదవండి పాట పల్లవి పడండి పగటి పూట ప్రార్ధించేటప్పుడు. మళ్ళీ పల్లవి పాడండి,

సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
నన్ను కరిగించు, మలుచు, విరుగగొట్టు, వంచు.
సజీవుడైన దేవుని ఆత్మ, దిగిరమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.

మీరు ఇంకా రక్షింపబడకపోతే, మీరు పశ్చాత్తాపపడి యేసును విశ్వసించాలని ప్రార్ధిస్తున్నాము. ఆయన రక్తము అన్ని పాపముల నుండి మిమ్ములను కడిగివేస్తుంది. మృతులలో నుండి ఆయన పునరుత్థానము మీకు నిత్య జీవము ఇస్తుంది. ఆయనను నమ్మండి ఆయన మిమ్మును రక్షిస్తాడు పాపమూ నుండి రాబోవు తీర్పు నుండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మత్తయి 17:14-21.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"నా ఆత్మ, రమ్ము, నీ స్థలము సిద్ధమైనది" (జాన్ న్యూటన్ చే, 1725-1807).
“Come, My Soul, Thy Suit Prepare” (by John Newton, 1725-1807).