Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దేమా నన్ను విడిచిపెట్టెను!

DEMAS HAS FORSAKEN ME!
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 17, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 17, 2016

"దేమా ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టెను"
(II తిమోతి 4:10).


ఈ వ్యక్తి దేమాను గూర్చి పౌలు క్రొత్త నిబంధన గ్రంధములో మూడుసార్లు మాట్లాడాడు. ఫిలోమోను 24 లో తనను పౌలు జత పనివానిగా పిలిచాడు. కాని కొలస్సీయులకు 4:14 లో అతడు ప్రస్తావించబడ్డాడు అంతే. డాక్టర్ మెక్ గీ అన్నాడు,

పౌలు మొట్టమొదటి దేమాను గూర్చి చెప్పినప్పుడు, జత పనివాడుగా పిలువబడ్డాడు. ఇక్కడ [కొలస్సయులకు 4:14 లో], "మరియు దేమా" అని మాత్రమే పిలువబడ్డాడు; నేననుకుంటాను అప్పుడు పౌలు అతని విషయంలో కచ్చితంగా [లేడు]. తరువాత దేమా పౌలును విడిచి [పెడతాడు]. అది ఎంత విషాదము (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume V, p. 365; note on Colossians 4:14).

కనుక, మన పాఠ్యభాగానికి వచ్చినప్పుడు, అపోస్తలుడు అన్నాడు,

"దేమా ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టెను" (II తిమోతి 4:10).

"విడిచిపెట్టుట" అనుపదానికి గ్రీకు అనువాదము "పూర్తిగా వదిలివేయడం, కష్టతర పరిస్థితిలో ఒక వ్యక్తిని విడిచిపెట్టాలనే ఉద్దేశము" (మెక్ ఆర్డర్ పఠన బైబిలు).

మీరు నిజ క్రైస్తవులుగా ఉండేటప్పుడు ఇలా ప్రజలు చాలా సార్లు చెయ్యడం చూస్తుంటారు. నా భార్య తన పుట్టిన రోజు నాటి పాత ఫోటోలను చాలాకాలము క్రిందటిది నేను చూస్తున్నాను. వాస్తవానికి ఆ ఫోటోలు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట తీయబడినది. ఈ రోజు కూడ నా భార్య అలాగే ఉంది. కాని నేను బాగా ముసలివానిగా కనిపిస్తున్నాను ఎందుకంటే కేన్సర్ చికిత్స వలన లావు పెరిగాను కాబట్టి. ఒక ఫోటోలో నా భార్య పన్నెండు మంది గుంపుతో కూర్చుంది. ఆ పన్నెండు మందిలో, కేవలము ముగ్గురు మాత్రమే ఇంకా మన సంఘములో ఉన్నారు – ఇలియానా, లెస్ లీ మరియు ప్రుదోమ్ గారు. మిగిలిన తోమ్మింది మంది మమ్ములను విడిచిపెట్టారు. ప్రతి వ్యక్తిని ఎరిగిన వాడను కాబట్టి పౌలు చెప్పిందే నేను కూడ చెప్పగలను,

"[వారు] ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టారు" (II తిమోతి 4:10).

ఆ ఫోటోలోని మిగిలిన తొమ్మిది మంది సంఘ సభ్యులదీ వాస్తవమైనది. వారు మమ్ములను విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయారు. అది మళ్ళీ జరుగుతుంది? అవును, బహుశా జరగవచ్చు. నిజంగా ప్రస్తుతపు ప్రపంచాన్ని ప్రేమిస్తున్న ప్రతీ వ్యక్తి తొందరగానో ఆలస్యముగానో మన సంఘమును వదిలేస్తారు. ఉండేవారు నిస్సందేహంగా ఇప్పుడు తియ్యబోయే ఫోటో చూస్తారు – అందులో ఉన్నవారిని మీరు చూడగలుగుతారు మరియు తెలుసుకుంటారు వారు కూడ "ఇహా లోకమును ప్రేమించి" మమ్ములను విడిచిపెడతారని. అద్భుతమైన ఉజ్జీవాన్ని దేవుడు పంపించినప్పటికినీ, చాలామంది కూడుకున్నప్పటికినీ, ఇంకా అది వాస్తవంగానే ఉంటుంది అది ఏమిటంటే, "ఇతరులను మమ్ములను విడిచిపెట్టేస్తారు ఇహలోకములను ప్రేమించి."

మీరు బాధపడాలని నేను చెప్పడం లేదు. అది సంభవించినప్పుడు మీరు ఆశ్చర్యపోకూడదని మాత్రమే చెప్తున్నాను. మనలను హెచ్చరించడానికి బైబిలులో ఈ మాటలు ఇవ్వబడ్డాయి. అపోస్తలుడైన పౌలుకే అలా జరగదు. అది మీకు నాకు కూడ జరుగుతుంది.

"దేమా ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టెను."

దేమాలో తప్పు ఏమిటి? మేత్యూ హెన్రీ వ్యాఖ్యానము చెప్తుంది దేమా "లౌకిక వ్యవహారాలలో పూర్తిగా మునిగిపోవడం వలన, పరిచర్యను విడిచిపెట్టాడు...క్రీస్తు ఆయన సువార్త విడిచిపెట్టబడ్డాయి మరచిపోబడ్డాయి, అతడు లోకాన్ని ప్రేమించాడు. గమనిక: ఇహలోకాన్ని ప్రేమించడం తరుచు స్వధర్మానికి కారణమవుతుంది యేసు క్రీస్తు సత్యాలకు మార్గాలకు దూరంగా ఉంటాయి" (note on II Timothy 4:10).

డాక్టర్ మెక్ ఆర్డర్ క్రీస్తు రక్తము విషయంలో తప్పు చెప్పాడు. కాని మిగిలిన విషయాలు వాస్తవంగా చెప్పాడు. డాక్టర్ మెక్ ఆర్డర్ అన్నాడు, "దేమా గాలికి కొట్టుకుపోయే శిష్యుడు అతడు క్రీస్తు పట్ల ఉండవలసిన యదార్ధ కట్టుబాటులో ఉన్న విలువ లెక్కకట్టలేదు" (MacArthur Study Bible, ibid.). విత్తు వాని ఉపమానంలో ఎలాంటి వ్యక్తిని గూర్చే వివరింపబడింది,

"వారు...రాతినేల నుండు వారు, వినునప్పుడు, వాక్యమును సంతోషంగా, అంగీకరించు వారు; గాని వారికి వేరు లేనందున, కొంచెము కాలము నమ్మి, శోధన కాలమున తొలగి పోవుదురు" (లూకా 8:13).

వారికి నిజమైన మార్పులేదు. వారు క్రీస్తులో వేరు కట్టబడలేదు. కనుక, శోధన వచ్చినప్పుడు, సంఘము నుండి తప్పుకొని, లోక మార్గములోనికి వెళ్ళిపోతారు. మార్పు జరిగేటప్పుడు ఇలా తరుచు జరుగుతుంది. పౌలు జైలులో పెట్టబడినప్పుడు దేమాకు మార్పు సమయము వచ్చింది. అతని కొరకు అంతా మారిపోయింది. ఆ మార్పు సమయంలో, అతడు క్రీస్తులో వేరు పారలేదని బయలు పర్చబడింది – అతడు లోకములోనికి వెళ్ళిపోయి పౌలును విడిచిపెట్టాడు.

యవనస్తులు కళాశాల నుండి పట్ట భద్రులవుతున్నప్పుడు ఇలా జరగడం చూసాము. అది మార్పు సమయము. ఇలాంటి దాని ద్వారా మునుపెన్నడూ వెళ్లలేదని వారనుకుంటారు! "నాకు, నాకు! నా ముందు భవిష్యత్తు ఉంది! నేను క్రీస్తు కొరకు శ్రమపడి నమ్మకస్తునిగా ఉండాలని మీరు ఆశించకూడదు! నేను బాలుడిగా ఉన్నప్పుడు అది! నేను యువకుని కాబట్టి నా భవిష్యత్తు నాకు శక్తిని ఇవ్వాలి. మీరు అర్ధము చేసుకోరా? నా భవిష్యత్తు!" అవును, నేను పూర్తిగా అర్ధము చేసుకున్నాను! చూసారా, నేను దీని ద్వారా వెళ్లాను. మన మధ్యలో ఉన్న తేడా నేను పౌలు ఉదాహరణను వెంబడించాను, మీరు ఇహలోకములో మునిగి పోయారు. తేడా ఏమిటంటే నేను మూర్చబడ్డాను – మీరు అబద్ధపు బ్రాంతితో కూడిన "నిర్ణయము" తీసుకున్నారు. మీరు పరీక్షింపబడినప్పుడు, మీకు వేరు లేదు! నాకు క్రీస్తులో వేరు ఉంది, మీకు లేనేలేదు! ఇది అంత సామాన్య విషయము!

లేక ఇంకొక మార్పు సమయంలో శోధన తరుచు వస్తుంది. యవనస్తులు ప్రేమలో పడతారు, తేదీలిచ్చుకుంటారు, ఆ సమయంలో వారు గుడిని వదిలేసి లోకములోనికి వెళ్ళిపోతారు.

లేక మీరు పిల్లలున్నప్పుడు అది రావచ్చు. ఆలోచించండి, "మొత్తానికి, నాకు ఒక శిశువు ఉన్నాడు! ఇప్పుడు నేను ప్రభువుకు నమ్మకస్తునిగా ఉండాలని ఆశింపకూడదు!" మిగిలిన వాళ్ళము మన పిల్లలను నమ్మకంగా ప్రతి ఆరాధనకు తీసుకోస్తున్నాము. మీరనుకుంటారు ఎవరు మునుపెన్నడూ దీని ద్వారా వెళ్లలేదని! కాని నిజ కారణము మీకు క్రీస్తులో వేరులేదు – మీకు అబద్ధపు మార్పు ఉంది, నిజమైనది కాదు! మీరు కళాశాల నుండి పట్టభద్రులై తప్పుడు మార్గము తీసుకుంటే, మీరు తిరిగి సరియైన దారికి రాలేరు. మీరు గుడిలో కొన్ని పనులు చెయ్యవచ్చు, కాని మీరు ఉండ గలిగినట్టు క్రీస్తు యొక్క యోధుడైన సైనికునిగా ఉండలేరు! అలా మీరు ఉండి ఉండాలి! కవి రాబర్ట్ ప్రాస్ట్ ప్రముఖంగా చెప్పాడు,

ఆశక్తి తో నేను చెప్తున్నాను
తరతరాల నుండి:
చెక్కలో రెండు మార్గాలున్నాయి, మరియు నేను –
తక్కువ ప్రయాణించిన మార్గాన్ని తీసుకున్నాను,
అది మొత్తము తేడాను కనపరిచింది.
("తీసుకొనబడిన మార్గము" రోబర్ట్ ప్రాస్ట్ చే, 1874-1963).

మీరు తప్పుడు మార్గము తీసుకుంటే, మళ్ళీ వెనక్కు రాలేరు. నా యాభై ఎనిమిదేళ్ళ పరిచర్యలో ఏ వ్యక్తి అలా చేయడం నేను చూడలేదు! ఒక్కరు కూడ! గుర్తించుకోండి, దేమా ఎన్నడూ తిరిగి పౌలు దగ్గరకు రాలేదు – మీరు కూడ అంతే! దాని అర్ధము, జీవిత మార్పులో ఏ మార్గము తీసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లోకము మీకు చెప్తుంది పన్నెండు సార్లు మీ జీవితాన్ని తిరిగి కనుగొనవచ్చని. అలా చెప్తున్నప్పుడు లోకము అబద్ధము చెప్తుంది. పూర్తిగా తిరిగి కనుగొనబడిన జీవితాన్ని నేనెన్నడు చూడలేదు. తన జీవితాన్ని తిరిగి కనుగొనాలని విఫల ప్రయత్నమూ చేసిన ఒక స్త్రీ నాకు జ్ఞాపకము ఉంది. నేను ఆమె ఇంటిలో అద్దెకు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ విషయము మాట్లాడుతుండేది. తన జీవితాన్ని తిరిగి కనుక్కొనే ప్రయత్నములో, చివరకు పిచ్చిదయిపోయింది. నిజమైన కథ! స్నేహితుడా ఏ మార్గము తీసుకుంటున్నారో, చాలా జాగ్రత్తగా చూసుకో! "నేను క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తే, ఏదో పోగొట్టుకుంటాను! చాలా ప్రశస్తమయినదేదో పోగొట్టుకుంటాను," ఆమె చెప్పింది. అందుకే ఆమె పిచ్చిదయిపోయింది – దేమా తన ఆత్మను పోగొట్టుకొన్నట్టు!

"దేమా ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టెను."

నేను శతాబ్దములో మూడు వంతులు జీవించాను. అంత దీర్ఘకాలము జీవించినప్పుడు నీ జీవితంలో అనేక ముఖాలు చూస్తావు. ముఖము తరువాత ముఖము! పదులు, వందలు, వేలు! ఒకదాని తరువాత ఒకటి అలా అనేక ముఖాలు. ఆ ముఖాలు ఏమి చెప్పుతాయి? అవి చీకటిలో, నా ముందు వెళ్తున్నప్పుడు అవి ఉంటాయి, "నీ ఆత్మను పోగొట్టుకున్న దానికి అర్హమైనదేది ఈ లోకములో లేదు! దాని కొరకు నీ ఆత్మను పోగొట్టుకో! మీరు పిచ్చివారా?" అలా ఆ ఆత్మలు నాతో గుసగుసలాడతాయి అంధకారంలో నా ముందు వెళ్తున్నప్పుడు.

"నా జీవితమంతా నా ముందు ఉంది," మీరనవచ్చు. కొన్ని నెలలే అని నేను చెప్తే మీరు వినరు. అవి చాలా త్వరగా వెళ్ళిపోతాయి అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో మీకు తెలియదు, నిత్యత్వ రాత్రి అంచున మీరు నిలబడినప్పుడు, అది చాలా ఆలస్యము అయిపోతుంది నిత్యత్వంలో నీ జీవితాన్ని తిరిగి కనుగొనే విషయంలో! అది ఎవ్వరు అలా చెయ్యరు, వారు మార్గమును తిరస్కరించినప్పుడు. గుర్తుంచుకోండి, దేమా ఎన్నడూ తిరిగి రాలేడు! అలాంటి ప్రజలను గూర్చి రెండు కథలు మీకు చెప్తాను.

ఆమె తండ్రి బోధకుడు. ఆయన సంఘములో ఆమె పియానో వాయించేది. ఆమె, మంచి అమ్మాయి. ఒక చెడ్డ అబ్బాయి ఆమెను చూచినప్పుడు ఆమె అతనితో వెళ్ళింది, విశ్వాసాన్ని మర్చిపోయింది, అతనితో వెళ్ళింది, తర్వాత ఆమె హృదయము పగిలింది, వారిద్దరి జీవనానికి చాలా కష్టపడింది. ఇప్పుడు ఆమెకు సహాయము చెయ్యలేను. ఆమె చాలా ముసలిది మాటలు విని విచార పడుతుంది. నేను ఆమెను వర్షములో నా భుజము మీద ఆసుపత్రికి తీసుకెళ్ళాను అక్కడ ఆమె చనిపోయింది. చాలా సంవత్సరాల క్రిందటే ఆమె హృదయము చనిపోయింది. నా గదిలో ఆమె పియానో పెట్టాను ఆమె తీసుకొనని మార్గాన్ని నాకు జ్ఞాపకము చేయడానికి.

అతడు తన పొలమును వదిలేసాడు, ఎందుకంటే అతడు పెద్ద కొడుకు కాబట్టి. ఆయనకు ఏమి కావాలో అతనికి తెలుసు, అది పొందుకున్నాడు, ఒక గొప్ప అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చాలా డబ్బు సంపాదించాడు. అతని గొడ్రాలు భార్య చిన్న పాప కావాలంది ఒక పాపను కొన్నాడు. ఇప్పుడు అతనికి చాలా డబ్బు ఉంది. ఏదైనా కొనవచ్చు అనుకున్నాడు! అతని భార్య చనిపోయింది. ఆ అమ్మాయి పాడయిపోయింది. అతని పెద్ద ఇంటిలో ఒక్కడయిపోయాడు. పడక గదిలో తాళము వేయబడి, చేతిలో తుపాకి కలిగి, పక్షవాతములో కనుగొనబడ్డాడు. ఆసుపత్రిలో అతని చూడడానికి వెళ్ళాను. అతడు మాట్లాడలేక పోయాడు. ప్రార్ధించడానికి అతని చెయ్యి తీసుకున్నాను. చాలా గట్టిగా, అడవి జంతువులా అరిచాడు. తరువాత అతనీ ఖరీదైన సమాధి పెట్టెలో చూసాను ముఖముపై వెలుగు ఉంచబడింది. ఈగ వాలింది. అతడు చాలా గొప్పవాడు, కాని ఆ ఈగను తోలడానికి అతనికి జీవము లేదు. నా గదిలో అతని చిత్ర పటము ఉంచాను అతని తీసుకొనని మార్గమును నాకు జ్ఞాపకము చెయ్యడానికి.

"నా జీవితమంతా నా ముందుంది," మీరంటారు. కొన్ని నెలలే అని నేను చెప్తే మీరు వినరు. అవి చాలా త్వరగా వెళ్ళిపోతాయి అవి ఎక్కడికి వెళ్లిపోతాయో మీరు తెలియదు నిత్యత్వ రాత్రి అంచున మీరు నిలబడినప్పుడు, అది చాలా ఆలస్యము అయింది! ఎవ్వరు అలా చెయ్యరు వారు మార్గాన్ని తిరస్కరించినప్పుడు. దేమా ఎన్నడూ తిరిగి పౌలు దగ్గరకు రాలేడు.

గత ఆదివారము రాత్రి డాక్టర్ కాగన్ నా జీవితాన్ని గూర్చి మీతో చెప్పారు. ఆయనన్నారు అది "యుద్ధాలు, అప్పగింతలు వెనుకంజలతో కూడిన సంవత్సరాలు." మీకు, బహుశా అనిపించవచ్చు, ఒక కాపరి జీవితము కష్ట తరము, సుదీర్ఘము, ప్రతికూలతలతో కూడినది అని. మీరనుకోవచ్చు నేను జీవిత మార్గములో తప్పుదారి తీసుకున్నానని. బహుశా దేమా కూడ అలాగే అనుకున్నాడు, అతడు పౌలును సంకెళ్ళతో చెరసాలలో శ్రమ పడడం చూచినప్పుడు. నా భార్య నేను రోమాలోని చీకటి చెరసాలకు వెళ్ళాము. మేము నిజానికి పౌలు II తిమోతికి వ్రాసిన చెరసాల గదిలోనికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి దేమా భయపడ్డాడు. అందుకు అతడు అపోస్తలుని విడిచి పెట్టాడు. పౌలు ఈ భాధాకర మాటలు వ్రాసాడు,

"దేమా ఇహలోకమును ప్రేమించి, నన్ను విడిచిపెట్టెను."

కాని దేమా తప్పు చేసాడు. మీరు కూడ తప్పు చేసారు. ఈ మార్గము, కష్టతరమైనను, నాకు సంతోషాన్ని ఇచ్చింది, మాటలలో వర్ణింపలేని అద్భుతమైన భార్యను ఇచ్చింది, స్నేహాలను అందించింది జీవిత మార్గములో తప్పు తోవ తీసుకుంటే ఇవన్నీ ఉండేవి కావు – యుక్త వయస్సులో ఉన్నప్పుడే దాని ఎన్నుకున్నాను.

ఎరిక్ బూత్ క్లిబ్బన్ విలియమ్ బూత్ మనవడు, ఆయన రక్షణ సైన్యము వ్యవస్థాపకుడు, సంఘ కాపరి కుమారుడు. ఎరిక్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ మిస్సెనరీగా ఆఫ్రికా వెళ్ళాడు. ఆయన తన గర్భవతియైన, లుసైల్ చిన్న కుమార్తె మిస్సను స్థలానికి వచ్చిన, రెండు వారాలకే అతడు చనిపోయాడు. చనిపోయేటప్పుడు అతని వయస్సు 29 సంవత్సరాలు. తరువాత ఆయన భార్య అతని విషాదకర మరణాన్ని గూర్చి "మరణ పర్యంతం విధేయత" అనే పుస్తకంలో వ్రాసారు. వారు ఆఫ్రికాకు వెళ్ళే ముందు హాజరైన ఆరాధన గూర్చి ఆమె చెప్పారు. వారు ప్రార్ధించి ఎరిక్ తల్లి వ్రాసిన పాటను పాడారు,

నీ పాదాలపై నేను పడతాను
నాదంతా సమర్పించుకుంటాను
శ్రమ పడడానికి, జీవించడానికి చనిపోవడానికి
సిలువ వేయబడిన నా ప్రభువు కొరకు.

తన పుస్తకంలో ఎరిక్ భార్య అతని భూస్థాపన గూర్చి చెప్పారు. మునుపు సువార్త ఎన్నడూ వినని ఆప్రికా వాసులు క్రైస్తవ భూస్థాపన చూడడానికి వందలలో వచ్చారు. ఆమె వ్రాసారు, "అప్పుడు, ప్రార్ధన తరువాత, సమాధి పెట్టె మూయబడింది మేకులు కొట్టబడ్డాయి. మేకులు కొట్టబడుచున్నప్పుడు నా హృదయములోని బాధను మీరు ఊహించుకోవచ్చు." తరువాత ఆమె అన్నారు, "నేను గ్రహించాను ప్రస్తుతపు మిస్సెనరీ విజయము హత సాక్షులు సైన్యము కారణంగా మాత్రమే వారు [మిస్సేన్] స్థలములో వారి జీవితాలు అర్పించారు వారు ఎంతగానో ప్రేమించిన నశించు ఆత్మల నిమిత్తము. చెప్పబడింది ఏకాంతపు సమాధి దూర ప్రాంతాలలోనిది స్థానికుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది; అది జీవితాంతపు శ్రమను మించినది ఒక చెక్క సిలువ అనేక పదాలను మించిన భావాన్ని వ్యక్త పరుస్తుంది."

ఎరిక్ బూత్ క్లిబ్బన్ 29 సంవత్సరాలప్పుడు, క్రైస్తవ్యము తెలియని స్థలములో మిస్సన్ పనిలో అడుగు పెట్టాడు. అక్కడకు వెళ్ళాక రెండు వారాలు మాత్రమే జీవించాడు. ఆయన జీవితమే ఆయన ఇచ్చిన ప్రసంగము, అని భూస్థాపన ప్రసంగంలో ఒకరు చెప్పినప్పుడు, వందల కొలదీ రక్షింపబడిన స్థానికులు అది విన్నారు.

కాని ఆ చిన్నా భూస్థాపన బర్కినా ఫాస్ లో క్రైస్తవ్యానికి ఆరంభము. ఈనాడు అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారు ఆప్రికా ఆ ప్రాంతములో విశ్వాస వీరునిగా ఎరిక్ బూత్ క్లిబ్బన్ ను జ్ఞాపకము చేసుకుంటారు, ఆయన దేవుని పిలుపుకు ఆయన జీవితాన్ని ఇచ్చేసాడు. ఈనాడు అక్కడ అసెంబ్లీ ఆఫ్ గాడ్ అతిపెద్ద ప్రోటేస్టెంట్ తెగ అక్కడ. 4,500 సంఘాలు బోధించే స్థలాలు 1.2 మిలియన్ ఆప్రికన్ క్రైస్తవులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. ఎరిక్ చిన్న జీవితము ఏ తెల్లవాడు వెళ్ళని ఆప్రికా ప్రాంతంలో వేలమందికి క్రీస్తును తెలిపేదిగా అయింది.

నేను కొన్ని రోజుల క్రితం అది చదువుతున్నప్పుడు మీకు చెప్పాలనిపించింది. మీరు ఎంత కష్టము ద్వారా వెళ్తున్నా ఒక దినాన క్రీస్తు అది తిరిగి చేల్లిస్తాడు. దేమా ఎన్నుకున్న ఆ సులభ మార్గాన్ని నుండి మీరు వెనుతిరగాలి అతడు అపోస్తలుని చెరసాలలో విడిచిపెట్టాడు. మీరు ఆ సులభ మార్గము నుండి వైదొలగి, తక్కువ ప్రయానింప బడిన మార్గాన్ని తీసుకోవాలి. II తిమోతి 4:17 చూడండి. బంధకాలలో పౌలును దేమా విడిచిపెట్టినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమి చెప్పాడో వినండి,

"అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా, ప్రకటింపబడు నిమిత్తము; అన్య జనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు, నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను... " (II తిమోతి 4:17).

యవన స్త్రీ, యవనస్తుడా, పౌలు మాదిరి మీరు అనుసరిస్తారా! పౌలు దర్శనము మీ దానిగా తీసుకోండి! ఇక్కడ ఒక గొప్ప సంఘాన్ని నిర్మించడానికి మాకు సహాయము చెయ్యండి ప్రపంచమంతటికి అది కొండపై ప్రకాశించు పట్టణంగా ఉండునట్లుగా, సువార్తను "అన్యులందరూ వినేటట్లుగా"! యవనస్తుడు, ఆలోచించు మన సంఘాలు ఎలా ఉండగలదో, ఎలా ఉంటుందో, దేవుని కృపను బట్టి, ఎలా ఉండబోతుందో! యవన స్త్రీ, నీ శ్రేష్టమైనది క్రీస్తుకు అర్పించు!

మీ యవనమును మీ శక్తిని క్రీస్తుకు ఇవ్వండి! ఎరిక్ బూత్ క్లిబ్బర్ లా ఉండండి! రక్షకుని నిమిత్తము మీ జీవిత రక్తాన్ని ఇవ్వండి. ఏదీ ఉంచుకోకండి! మీకున్న దంతా క్రీస్తుకు అర్పించుడి! సేవలోనికి వెళ్ళండి! మీ మిస్సను స్థలానికి వెళ్ళండి! లోకము మిమ్మును బుద్దిహీనుడు అననివ్వండి! వెళ్లి యవనస్తులను సువార్త వినడానికి తీసుకురండి! మీకున్న శ్రేష్టమైనది క్రీస్తుకు అర్పించండి! పాటల కాగితంలో ఉన్న 7 వ పాటను దయచేసి లేచి నిలబడి పాడండి.

నా దృష్టిని నింపు, రక్షకా, నా ప్రార్ధన, ఈరోజు యేసును మత్రమే చూడనిమ్ము;
   లోయలో నుండి మీరు నన్ను నడిపించుచున్నాను, మీఅంతరించని మహిమ నన్ను చుట్టుకొని ఉంది.
నా దృష్టిని నింపు, దైవిక రక్షకా, నా ఆత్మ మీ మహిమతో ప్రకాశించే వరకు.
   నా దృష్టిని నింపు, మీ పరిశుద్ద ఆకారము నాలో ప్రతి బింబించడం అందరు చూసేటట్టు.

నా దృష్టిని నింపు, మీ మహిమార్ధమై నా ప్రతి కోరికి ఉండునట్లు; నాఆత్మ ప్రేరేపించబడునట్లు,
   మీ పరిపూర్ణతో, మీ పరిశుద్ధ ప్రేమతో, పైనుండి వచ్చు వెలుగు నా మార్గాన్ని నింపనిమ్ము.
నా దృష్టిని నింపు, దైవిక రక్షకా, నా ఆత్మ మీ మహిమతో ప్రకాశించే వరకు.
   నా దృష్టిని నింపు, మీ పరిశుద్ద ఆకారము నాలో ప్రతి బింబించడం అందరు చూసేటట్టు.

నా దృష్టిని నింపు, అంతరంగంలో ప్రకాశించు వెలుగుపై పాపపు నీడ పడకుండునట్టు.
   మీ ఆశీర్వాదపు ముఖమును చూడనిమ్ము, మీ అనంత కృపలో నా ఆత్మ ఉల్లసించునట్లు.
నా దృష్టిని నింపు, దైవిక రక్షకా, నా ఆత్మ మీ మహిమతో ప్రకాశించే వరకు.
   నా దృష్టిని నింపు, మీ పరిశుద్ద ఆకారము నాలో ప్రతి బింబించడం అందరు చూసేటట్టు.
("నా దృష్టి ని నింపు" ఆవిస్ బర్ జెసన్ క్రిస్టియాన్ సెన్ చే, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

దయచేసి నిలబడి ఉండండి.

ఈ ఉదయాన్న చెప్పిన కథలన్నీ వాస్తవము. తండ్రి గుడి నుండి పారిపోయి చెడ్డ వ్యక్తిని పెళ్ళాడి జీవితాన్ని నాశనము చేసుకున్న స్త్రీ నన్ను పెంచిన తండ్రి యొక్క తల్లి. ధనికుడు పడక గదిలో ఉండి తలుపులు మూసికొని చేతిలో తుపాకీ పెట్టుకున్న వ్యక్తి నా పినతండ్రి, నా తండ్రి పెద్ద అన్నయ్య. మతిస్థిమితము కోల్పోయిన స్త్రీని గూర్చి నేను చెప్పను ఆమె ఇంకా జీవించే ఉంది.

ఒకప్పుడు వారందరూ యవనస్తులు, మీలాగే. కాని వారు యేసు చేత రక్షింపబడకుండా వారి జీవితాలు జీవించారు. వారు యేసుకు "వద్దు" అని చాలా సార్లు చెప్పారు అది వారికి అలవాటుగా మారిపోయింది, బలమైన అలవాటు అయిపోయి దేవుడే వారి నాశనానికి వారిని అప్పగించాడు.

యవనస్తుడా, యవన స్త్రీ, పశ్చాత్తాపపడు! దేవుడు లేని జీవితము నుండి వెనుకకు మరలు – దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు రమ్ము. ఆయనను విశ్వసించు. ఆయన రక్తముతో మిమ్ములను కడుగుతాడు. ఆయన పరలోకములో దేవుని కుడి పార్శ్వములో మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. వ్యర్ధమైన జీవితము నుండి నిరీక్షణ లేని నిత్యత్వం నుండి బయట పడి యేసును విశ్వసించి రక్షింపబడు!

ప్రతి ఒక్కరు దయచేసి కళ్ళు మూసుకోండి. యేసును విశ్వసించడం విషయంలో మీరు మాతో మాట్లాడాలనుకుంటే, మీరు దయచేసి ఇప్పుడే డాక్టర్ కాగన్ గారిని మరియు జాన్ కాగన్ గారిని వెంబడించి ఆవరనలోనికి వెళ్ళండి. వారు మిమ్ములను ఒక ప్రశాంత గదిలోనికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్ధన చేస్తారు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: II తిమోతి 4:10-17.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"యేసును కలిగి ఉండుట నాకు మేలు"
(పదములు రీ ఎఫ్. మిల్లర్ చే, 1922; సంగీతము సమకూర్చబడినది జార్జి బెవెర్లీ షీ చే, 1909-2013).
“I’d Rather Have Jesus” (words by Rhea F. Miller, 1922; music composed by George Beverly Shea, 1909-2013).